Thursday, 10 March 2016

3351 to 3400

3351. నీ ఒక్క మనసు చాలుగా..
నా అభివ్యక్తిని అర్ధం చేసుకొనేందుకు..
3352. అలసిపోని భావాలు కొన్ని..
అక్షరాలుగా నీలో రూపుదిద్దుకొని..
3353. ఎన్ని అమాసల కలవరింతవో నువ్వు..
నా కంటికి పున్నమి పండుగవుతూ..
3354. మదిలో దాగలేని అల్లరే నీది..
నా కన్నుల్లో మెరుపై చిందులేస్తూ.

3301 to 3350

3301. . నాకెవరూ లేరనే అనుకున్నా..
నువ్వొచ్చి తలపును దోచేవరకూ..! 
3302. మెరుపువై నాలో మెరిసినప్పుడే అనుకున్నా..
ఉరుము లేకుండా విచ్చేసింది నువ్వేనని..
3303. భాగించలేదని సంతోషించాను..
హెచ్చువేతల్లోనూ కూడి మరీ నిలబెట్టావనే..
3304. రహస్యాన్ని బయటపెడుతున్న కన్నీళ్ళు..
ఒంటరితనాన్ని నలుగురికీ చాటేస్తూ..

3305. నేనేగా చైతన్యాన్ని..
చిరుగాలికే పెదవులు వెల్లువై విచ్చుకుంటుంటే..
3306. ఆమో మౌనమయ్యింది..
రహస్య మేఘమేదో మనసును మూసిందనే..
3307. ఒక్కమారు విరహమవ్వాలనుకున్నా..
నీలో రహస్యంగా మారక మునుపే..
3308. వెన్నెలనయ్యా నీకొరకే..
నీరవానికి నిన్నివ్వరాదని..
3309. పున్నమిని పంపేసావెందుకో..
సంతోషమంటూ అమాసకు నన్ను అంకితమివ్వాలనా..
3310. సరదా అన్నప్పుడే అనుకున్నా..
నా నవ్వులు దోచుకొని నిశీధిని నాకు విడిచేస్తావని..
3311. ఆకలి తీరింది చూపులకి..
కనువిందుగా నువ్వు దొరికిపోయినందుకే
3312. నువ్వో అసంపూర్ణమనే తోడయ్యా..
నిత్యదరహాసం నీలో మొలకెత్తించాలని..
3313. ఎత్తిపొడుపుల ఆరోహణలెందుకో..
సమర్ధింపుల సమాధానాలు సిద్ధంగా ఉండగా..
3314. నా ఆనందానికెంత అద్వైతమో..
నువ్వలా కీర్తిస్తూ ఉండగా..
3315. నా ఆనందానికెంత అద్వైతమో..
నీ కీర్తనకు నర్తిస్తుండగా
3316. తూకమెయ్యవసరమే లేదుగా..
నీ మాటలు మధురాలనే మించిపోతుంటే..
3317. రంగుల కోయిలను కలగంటున్నా..
ఊహలు నలుపును తిరస్కరించినందుకే..
3318. నీ ఊహలెంత రమ్యమో..
నన్ను అలౌకికంలోకి నెట్టేస్తూ..
3319. హృదయం చిందులేసింది..
మనసైన సవ్వడి నీ పెదవులదయ్యిందనే..
3320. నేనో అలనయ్యా..
నీ కలల కెరటాన్ని చేరుకోవాలనే
3321. కన్నుల్లో కలకలం..
పారవశ్యాన్ని కెలికినట్టు..
3322. హారతి పట్టమన్నావనుకున్నా..
నువ్విలా నాపై మండిపడతావని ఊహించక..
3323. మౌనంలో దోగాడుతూ నా నవ్వు..
రసమయ రాగాలను పెదవులలో దాచేస్తూ..
3324. అల్లేస్తున్నా కవితలందుకే..
చిరుగాలి తరంగాలకే విరినై నేనూగినట్లు..
3325. 
ముట్టడిస్తున్న మధురోహలు..
కవనంగా కూర్చి తమను రాయమంటూ.
3326. తుంటరి జలపాతంలా నీ మౌనం..
నీరవంలో తొలకరులు సవ్వడించినట్లు నాలో..
3327. ఊహలతోనే ఊరిస్తావెందుకో..
మరుజన్మకు తోడవుతానని మాటిచ్చాక కూడా..
3328. చీకటిలో దివ్వెనే నేను..
నీలో వెన్నెలను ప్రసరిస్తూ..
3329. కాదేదీ నీ భావానికి అనర్హం..
తీరంలో పాదమైనా..చెలికంటి భాష్పమైనా..
3330.  మాటలకందని మౌనం ఆమెలో..
నవ్విన మల్లెలనూ విసుక్కుంటూ..
3331. నడవాలనుకున్న అడుగులు ఏడే..
నిన్ను కలగన్న రాతిరికి..
3332. మోహంతో వీస్తున్నా..
మనసైన మధురోహల సవ్వడి వినిపించాలని..
3333. పరిమళిస్తున్న కురులు..
విరులతో పోల్చి ఒక ఉదయాన్ని రేయిగా మార్చావని..
3334. పరివ్యాప్తమేగా నీ మనసు..
శిశిరంపు విరహంలోనూ నన్నోదారుస్తూ..
3335. ఏమి కోరికో మరి..
చెమటరాని రాజ్యానికి రాజవ్వాలట..
3336. ప్రతిక్షణమూ యుగమే..
అతను లేక నరకం పరిచయమయ్యాక..
3337. నేనే పాటైపోయా..
వినాలనుకున్నప్పుడల్లా నిన్నలరించేందుకు..
3338. ముగ్ధమైన మోమేననుకున్నా..
మౌనంతో మరణం అంచుకు చేర్చేవరకూ..
3339. ఆనందం మందారమయ్యింది..
మంకెన వర్ణాల మకరందాలు పూసుకొని..
3340. అనురాగపు వలలో చిక్కుకుపోయా..
నీతో చక్కెరవిందు ఫలించిందనే.
3341. మన్మధుడే మూర్ఛబోతాడు..
తను ప్రయోగించలేని ఆరోవిల్లు నీ చూపులో దాగుందని..
3342. చెమరింపు తెలియని అక్షరాలు కొన్ని..
పదాల్లో మాత్రం ఒయారాలను ఒలికిస్తూ..
3343. కనడం తెలియదన్నావెందుకో..
చీకటిరాజ్యానికి నన్ను రాణిని చేసేస్తూనే..
3344. వంశీరాగం ప్రియమయ్యింది..
ముద్దుస్వామి వగలన్నీ వేణువులోనే వినిపిస్తుంటే
3345. చక్కనయ్యెప్పుడూ రాధాలోలుడేగా..
బృందావనంలో ప్రణయ వినోదకేళిని ఆస్వాదిస్తూ..
3346. మరో ఏడుజన్మలకూ నేను సంసిద్ధమే..
నువ్వే నాకు తోడవుతానని మాటిస్తే..
3347. రాయలేని భావమొకటి..
గుండె గొంతుకులోనే భాషను కూర్చుకుంటూ..
3348. అలుకను నటిస్తూ నా అందం..
నీ అరవిందంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ..
3349. సాగుచేసుకుంటావనిచ్చా చెక్కిళ్ళను..
హేమంతానికి మంచుబిందువులొచ్చి చిగురింతల్లో చేరతాయనే..
3350. నేనెప్పుడూ నీ నీడనే..
నా ఉనికి నువ్వయ్యేదాకా..

3251 to 3300

3251. మానవత్వం మరుగున పడింది..
ఆకృతి పచ్చచీరను కట్టిందనే..
3252. వేటూరిని అనుసరించమన్నానందుకే..
సిరివెన్నెలైతే పట్టుబడిపోతావనే..
3253. చిలికిన మనసు మధువయ్యిందేమో..
వెన్ననవ్వులను పైకి తేలించి..
3253. వర్షమంటే నీకూ ఇష్టమేగా..
నీ జ్ఞాపకాలతో నన్నేడిపిస్తూ..
3254. నా మోమంతా వెన్నెలే..
రాకాచంద్రుడివై నువ్వు నవ్వినప్పుడల్లా..
3255. దరహాసలిపిలో నీతో సంభాషిస్తున్నా..
మాట్లాడితే నానార్ధాలు వెతుకుతున్నావనే..
3256. మనసు నిండినందుకేమో..
స్వార్ధం పొంగుతోంది..
3257. నీ చనువును గమనిస్తూనే ఉన్నా..
నా మోముకి చూపులను గుచ్చినప్పుడల్లా..
3258. మనసులో నువ్వెప్పుడూ దొంగవే..
నా ఊహను కాజేసినందుకు..
3259. ఒంటరితనం మాలిమయ్యింది..
కన్నులు నిద్దురను దూరం పెట్టాయనే..
3260. మల్లెలు నోటకరవద్దన్నా..
ఆకలేస్తే అన్నంలో కూరేసి పెడదామనే..
3261. గుండెను వేదిక చేయొద్దన్నానందుకే..
అడుగుల సవ్వళ్ళకు అదిరిపోతావనే..
3262. తిరిగొచ్చిన తరంగం చెప్పిందిలే..
నువ్వింకా ఆనందంగానే ఉన్నావని..
3263. త్రివేణిసంగమమైందని భ్రమపడ్డా..
మదిమడుగులో నువ్వు కాలు మోపగానే..
3264. సంబరమైన సంతోషం..
నీ హృదిలో ప్రవహిస్తే చెమరిస్తావని..
3265. ఎదుగుతున్నాడని గమనించలేదేమో..
సద్విమర్శనూ చిన్నతనంగా భావిస్తూ పాపం..
3266. అంతరంగానికెప్పుడూ అసంతృప్తే..
గుర్తింపుకు నోచుకోని తన అస్తిత్వంతో..
3267. నిన్ను నాకు దూరం చేసింది..
మౌనం ముసుగు లోకానికి నచ్చినందుకే..
3268. మిణుకుమన్న ఆశ చిగురించింది..
నువ్వన్న మాటలకి మురిసినందుకే 
3269. మొత్తానికొప్పుకున్నావు..
నేనెడ్డెమంటే నువ్వు తెడ్డెమనే రకమని..
3270. మనసును విశాలం చేసాలే..
నువ్వు నిత్యకొలువుండే దేవాలమదేనని..
3271. ఒకటినై చేరి విలువ పెంచాలనుకున్నా..
నువ్వో శూన్యంగా అలా మిగిలిపోరాదనే..
3272. ఆనంద వీచికలు..
అలుపెరుగని కెరటాల అనురాగపు సవ్వళ్ళు..
3273. కనుగప్పి తిరగాలేమో..
లోకుల కన్నులు కాకులతో సమానమనుకుంటే..
3274. మూసిన రెప్పలపైనా వెలుగులు..
కిలకిలమను స్వప్నాలలో నువ్వున్నందుకు..
3275. నిజమో ఆవేదనే..
ఒప్పించి మెప్పించలేనప్పుడు..దాచి లాభంలేనప్పుడు..
3276. తనడిగినప్పుడే అనుకున్నా..
రహస్యానికి మసాలాపూసి చెప్పింది నువ్వేనని..
3277. ఊహలకందని రహస్యమే..
నీ భావంలో అక్షరం నేనేనంటే..
3278. సహజమే..
నన్నూహించని రోజు నీది కాదంటే..
3279. నా తలపు రహస్యం..
నీ వలపులోగిలిలో తచ్చాటలేగా..
3280. ప్రణయవేదాన్ని నిజమని నమ్మలేకపోయా..
నీ చూపుల్లో చదివేంతవరకూ..
3281. నక్షత్రాలు నవ్వుకుంటున్నాయి..
వెన్నెలొచ్చి జాబిల్లిని రహస్యాలు ఆరాతీస్తుంటే..
3282. ఓడిపోయిన చూపు..
నీ మదిలో రహస్యం పూలజల్లయ్యాక..
3283. పురివిప్పుకున్న రహస్యమొకటి..
నీ మాటల ముసుర్లకు ఆగలేక..
3284. స్వీయసందేహాలు..
రహస్యం రాహువుతో కూడి ముసుగేసుకుందని..
3285. 
అనంతమైన ఆకాశంలో రహస్యంలా నేను..
నీ మదిలో ఎక్కడున్నానో తెలియక..
3286. గుప్పిట మూసేసా రహస్యాన్ని..
నిజాన్ని సమాధి చేసేద్దామని..
3287. రహస్యం రంగులద్దుకొంది..
ఆవేదన అక్షరాలుగా మార్చే క్రమంలోనే..
3288. నల్లబడ్డ రహస్యం..
కృష్ణపక్షానికే నీ జ్ఞాపకాలు తడుముతున్నాయని..
3289. నీ చూపులకెప్పుడూ చమత్కారాలే..
మది దాచుకున్న రహస్యాలను శోధించే చిలిపి నవ్వుతో..
3290. చంద్రుడ్ని చూడటం మానేసావందుకేనా..
కన్నులు నీకు అరువివ్వలేదని..
3291. రహస్యాలంతే..
మనసుల్ని మలుపు తిప్పి దూరం చేసేస్తూ..
3292. రహస్యం రాయంచయ్యింది..
నువ్వు ముద్దుచేస్తే గారాలు పోవాలని..
3293. .ఆగిపోయిందక్కడే..
ఏడో అడుగు ఖరీదైనదనేమో.
3294. 
. కవిత్వం అంటే ఒళ్ళుమంటాయనకి..
తనని కాదని హత్తుకున్నందుకేమో
3295. కోతలను నమ్మనంటున్న మనసు..
నీకు తప్ప మరెవరికీ తెలియని రహస్యాలు వెల్లడవుతుంటే..
3296. గగనమెగిసిన కల..
నిన్నంతా నిద్దురలోనే గడిచిందని గుర్తొచ్చి..
3297. 
నవ్వుతూనే ఉన్నానందుకే..
కార్తీక వెన్నెల్లు మదిలో కురిపించాలని
3298. 
గుసగుసలాడుతుంటే తూనీగనుకుంది చెలి..
నువ్వెప్పుడో ఏడింటికే నిద్దురపోయావని.
3299. నీరుగారిపోతున్నా నేనే..
నీ నీరవంలో రవళించేది నువ్వేనంటుంటే..
3300. నిన్నూ నన్ను కలిపిన ఏకాంతం..
అపర్ధాల మబ్బులను ముచ్చటగా కరిగించమంటూ..