10201. అస్పష్టమవుతూ నేను..
నీకు అనిర్వచనీయమైన భావమై ఉండలేక..
10202. క్షణాలు దిగులవుతున్నాయి..
కరిగేకొద్దీ మనం దూరమవుతామని తెలిసి..
10203. హారతిలా కరిగిపోతాను..
నువ్వో దేవతవై నాకోసం మిగులుతానంటే..
10204. సన్నాయిరాగాల సాయింత్రమిది..
కురిసిన వర్షానికి శాంతించిందిగా మది..
10205. ఇంకెంత కాలమో ఇలా..
అశాంతిని నిట్టూర్పుతో కప్పేస్తూ..
10206. మనోవేదన కరిగింది కన్నీరుగా..
మనసిప్పుడు తేలికయ్యింది ఓదార్పుగా..
మనసిప్పుడు తేలికయ్యింది ఓదార్పుగా..
10207. మనసు రంగులీనిందిప్పుడు..
నువ్వు ఎగరేసింది ఇంద్రధనస్సునేమో మరి..
నువ్వు ఎగరేసింది ఇంద్రధనస్సునేమో మరి..
10208. దాచేసా మనసు చిరునామా..
నీ ఇష్టాలు నన్నెతుకుతున్నాయని..
నీ ఇష్టాలు నన్నెతుకుతున్నాయని..
10209. మనసాకాశంలో మోహమేఘాలు..
సందేశమందాక సద్దు చేయొద్దు మరి..
సందేశమందాక సద్దు చేయొద్దు మరి..
10210. అదే రాగం..
నిన్ను చూసిన ప్రతిసారీ నాలో కదిలే అనురాగం..
నిన్ను చూసిన ప్రతిసారీ నాలో కదిలే అనురాగం..
10211. మన పరిచయం..
పువ్వై పరిమళాన్ని పంచుతుంది ఒకప్పుడు..
పువ్వై పరిమళాన్ని పంచుతుంది ఒకప్పుడు..
10212. శిశిరమెప్పుడూ మంచిదే..
వసంతానికి చోటిచ్చి నిశ్శబ్దంగా తొలగిపోతుంది..
వసంతానికి చోటిచ్చి నిశ్శబ్దంగా తొలగిపోతుంది..
10213. పుడమి దాహం తీరేదెన్నటికని..
పచ్చదనం లేదని వర్షమలిగి నేల జారనని మొండికేస్తుంటే..
పచ్చదనం లేదని వర్షమలిగి నేల జారనని మొండికేస్తుంటే..
10214. ఫలించేదెప్పుడో స్వప్నం..
ఏకాకితనమొక్కటే నా నేస్తమై చేరువయ్యాక..
ఏకాకితనమొక్కటే నా నేస్తమై చేరువయ్యాక..
10215. వెంటాడుతోంది కాలం..
కొన్ని జ్ఞాపకాలుగా అనుసరిస్తూ నేడు..
కొన్ని జ్ఞాపకాలుగా అనుసరిస్తూ నేడు..
10216. మనసయ్యింది నీపై..
ఆనందంలో కొట్టుకుపోతూ నీకు కనిపించలేదంతే..
ఆనందంలో కొట్టుకుపోతూ నీకు కనిపించలేదంతే..
10217. మనసు బరువెక్కినప్పుడే అనుకున్నా..
నాలుగక్షరాలు నాపై రాసుంటావని..
నాలుగక్షరాలు నాపై రాసుంటావని..
10218. నిశ్శబ్దమెంతో నచ్చింది..
మౌనరాగమేదో నువ్వు ఆలపించినట్టు అనిపిస్తుంటే..
మౌనరాగమేదో నువ్వు ఆలపించినట్టు అనిపిస్తుంటే..
10219. క్షణాల సాహచర్యం బాగుంది..
అక్షరాలుగా నేను అనువదిస్తుంటే..
అక్షరాలుగా నేను అనువదిస్తుంటే..
10220. వెనక్కిరానంటూ కన్నులు..
నీ పదాల వెంట పరుగెడుతూ..
నీ పదాల వెంట పరుగెడుతూ..
10221. రాగాలతో ప్రాణం పోసావుగా నాకు..
సంకీర్తనై నీ పెదవులపైనే నేనుంటా..
సంకీర్తనై నీ పెదవులపైనే నేనుంటా..
10222. మురుస్తున్న శ్రావణమేఘాన్నే..
నీకై సందేశాన్ని మోసుకొస్తున్న వేళ..
నీకై సందేశాన్ని మోసుకొస్తున్న వేళ..
10223. అలలదే అందం..
నీటిముత్యాలను కలగలిపి నవ్వులతో ఉరకడం..
నీటిముత్యాలను కలగలిపి నవ్వులతో ఉరకడం..
10224. చూపులతో ముసురేస్తావెందుకలా..
పెదవులు అరవిరిసి బుగ్గలు సొట్టపడేలా..
పెదవులు అరవిరిసి బుగ్గలు సొట్టపడేలా..
10225. నాకై పూసిన పారిజాతం నీవు..
పూజించేందుకు నీవొస్తే కాదని నేననలేను..
పూజించేందుకు నీవొస్తే కాదని నేననలేను..
10226. కన్నీటికి ఆనందమని పేరు..
సంతోషం కురిసిందని ఇన్నాళ్ళకు..
సంతోషం కురిసిందని ఇన్నాళ్ళకు..
10227. జ్ఞాపకమంటే నువ్వే..
అందుకే గతాన్ని గుండెకు కట్టేసుకున్నా..
అందుకే గతాన్ని గుండెకు కట్టేసుకున్నా..
10228. కవితవుదాం రా..
రంగు రంగుల భావాలతో మమేకమవుతూ..
రంగు రంగుల భావాలతో మమేకమవుతూ..
10229. నిన్ను ఆకాశంతో పోల్చలేకున్నా..
చినుకులా జార్చేస్తావని భయమేస్తుంటే..
చినుకులా జార్చేస్తావని భయమేస్తుంటే..
10230.మాలికలు తరచి చూసుకుంటున్నా..
భావాల వానేదో కురిపిస్తావని..
భావాల వానేదో కురిపిస్తావని..
10231. గుప్పెడంత గుండెల్లో పట్టనిదీ కన్నీరు..
ఏరులై ప్రవహిస్తున్న ఈ వేదనలు..
ఏరులై ప్రవహిస్తున్న ఈ వేదనలు..
10232. నిరీక్షిస్తున్న కాగితం..
కొన్ని భావాలొచ్చి తనను అలంకరిస్తాయని..
కొన్ని భావాలొచ్చి తనను అలంకరిస్తాయని..
10233. లోలోపలంతా ఏకాకులమే..
జ్ఞాపకాలతో మాత్రం సాహచర్యం చేస్తుంటామంతే..
జ్ఞాపకాలతో మాత్రం సాహచర్యం చేస్తుంటామంతే..
10234. కలలెందుకో వాడికి..
నిద్రంటే భయపడేవాడికి..
నిద్రంటే భయపడేవాడికి..
10235. నువ్వొంటరివనుకోకు..
మబ్బులువీడి మనసులొకటయ్యే రోజు ముందుండగా..
మబ్బులువీడి మనసులొకటయ్యే రోజు ముందుండగా..
10236. ఒంటరితనం తెలుస్తోందిప్పుడు..
నీ జ్ఞాపకంలోనైనా నేను లేనందుకు..
నీ జ్ఞాపకంలోనైనా నేను లేనందుకు..
10237. పొగుడుతూనే ఉంటావెందుకో నన్ను..
సడిలేని అక్షరములో చేర్చుకున్నట్టు..
సడిలేని అక్షరములో చేర్చుకున్నట్టు..
10238. ఏమాటకామాట ఒప్పుకోవాలి మరి..
జ్ఞాపకమే గాయమయ్యిందని తెలుసుకున్నాక..
జ్ఞాపకమే గాయమయ్యిందని తెలుసుకున్నాక..
10239. జీవితమదే దిద్దబడుతుంది..
కూసింత నమ్మకాన్ని మది చేరదీయాలంతే..
కూసింత నమ్మకాన్ని మది చేరదీయాలంతే..
10240. కొన్ని క్షణాలు తమకమవ్వాల్సిందే..
నిన్ను తలచేదందుకే ప్రతిసారీ..
నిన్ను తలచేదందుకే ప్రతిసారీ..
10241. ఆగనంటోంది కాలం..
మన కదలికలు తనకి అనవసరమంటూ..
మన కదలికలు తనకి అనవసరమంటూ..
10242. రాతిరయ్యిందని చెప్తుంది ఆకాశం..
జీవితంలో చీకటి సహజమేనంటూ..
జీవితంలో చీకటి సహజమేనంటూ..
10243. పండుగలన్నీ పుట్టింట్లోనే నాకిప్పుడు..
పదేపదే పాతబడ్డానని నువ్వంటుంటే..
పదేపదే పాతబడ్డానని నువ్వంటుంటే..
10244. కవితగా రాసుకున్నా నిన్నే..
నా జీవితమని నిర్ణయించుకున్నాకనే..
నా జీవితమని నిర్ణయించుకున్నాకనే..
10245. ముత్యాల మాదిరి చినుకులు..
మురిపాలు కలిపిన మాలైనట్టు..
మురిపాలు కలిపిన మాలైనట్టు..
10246. మనసు బరువు పెంచుకోకలా..
కన్నీళ్ళను దాచుకుంటూ ఓర్చుకొనేలా..
కన్నీళ్ళను దాచుకుంటూ ఓర్చుకొనేలా..
10247. కథనింక నడపలేను..
భావాలు సశేషమన్న తరుణం ఆసన్నమైనప్పుడు..
భావాలు సశేషమన్న తరుణం ఆసన్నమైనప్పుడు..
10248. మనసుకెప్పుడో గాయమయ్యింది..
బంధాలు ఎండిపోయి నెర్రలు బయటపడగానే..
బంధాలు ఎండిపోయి నెర్రలు బయటపడగానే..
10249. పెదవులందుకే విరిసింది..
నవ్వులోని సౌందర్యాన్ని వెలుగుగా విరజిమ్మాలని..
నవ్వులోని సౌందర్యాన్ని వెలుగుగా విరజిమ్మాలని..
10250. మనసొక్కటే నిజం..
మౌనాన్ని వరించక తప్పని జీవితానికి..
మౌనాన్ని వరించక తప్పని జీవితానికి..
10251. సగం రాసి ఆపేసావెందుకో పాటని..
చరణాల కోసమని నవ్వులు నేనభ్యసిస్తుంటే..
చరణాల కోసమని నవ్వులు నేనభ్యసిస్తుంటే..
10252. నిజమవ్వాలనే కలగంటున్నా..
నువ్వూ నేనూ కలిసే సమయమయ్యిందని..
నువ్వూ నేనూ కలిసే సమయమయ్యిందని..
10253. అమ్మ దూరమయ్యింది..
తానెప్పటికీ ప్రేమని పంచుతూనే ఉంటానంటూ..
తానెప్పటికీ ప్రేమని పంచుతూనే ఉంటానంటూ..
10254. కురిసినా నేనేగా..
నిలువెల్లా నువ్వు ప్రేమలో తడిచావంటే..
నిలువెల్లా నువ్వు ప్రేమలో తడిచావంటే..
10255. అమరమైనప్పుడే అనుకున్నా..
నన్నెవరో అక్షరంలో చేర్చి పూజిస్తున్నారని..
నన్నెవరో అక్షరంలో చేర్చి పూజిస్తున్నారని..
10256. తడుస్తూనే ఉండాలనుంది..
నిర్వేదాన్ని కడిగేసి కొత్తగా మొదలవ్వాలని..
నిర్వేదాన్ని కడిగేసి కొత్తగా మొదలవ్వాలని..
10257. అస్సలు నచ్చట్లేదు..
ఈ క్షణాన్ని అతిగా ఊహించినందుకేమో..
ఈ క్షణాన్ని అతిగా ఊహించినందుకేమో..
10258. నేనైతే మాలికనే..
నువ్వల్లే భావనలో అందంగా ఒదిగినప్పుడల్లా..
నువ్వల్లే భావనలో అందంగా ఒదిగినప్పుడల్లా..
10259. నవ్వడం నేర్పావుగా నాకు..
నీ మనసునందుకే కౌగిలించుకున్నా..
నీ మనసునందుకే కౌగిలించుకున్నా..
10260. గుండెలో కార్చిచ్చు..
ఇప్పుడీ నిశ్శబ్దం మంటపెడుతుంది నిజమే..
ఇప్పుడీ నిశ్శబ్దం మంటపెడుతుంది నిజమే..
10261. అభాసుపాలయ్యింది ఆత్మీయత..
నాకున్న భావాలు నీలో లేవనగానే..
నాకున్న భావాలు నీలో లేవనగానే..
10262. మనసు ఓడిపోయింది..
చివరికి నన్నో మహానటిగా చిత్రించినందుకు..
చివరికి నన్నో మహానటిగా చిత్రించినందుకు..
10263. కదిలిపోతున్న క్షణాలనాపలేకపోయా..
అందుకే పదాలుగా కవితలో కూర్చుకున్నా..
అందుకే పదాలుగా కవితలో కూర్చుకున్నా..
10264. వలసపోయిందో జ్ఞాపకం..
మనసందుకే బరువెక్కింది శూన్యాన్ని మోయలేనంటూ..
మనసందుకే బరువెక్కింది శూన్యాన్ని మోయలేనంటూ..
10265. అనుకోలేదీ స్పర్శ..
వెన్నెలై కురిసి తడిపింది నువ్వేనేమో..
వెన్నెలై కురిసి తడిపింది నువ్వేనేమో..
10266. తెరలు తెరలుగా నీ జ్ఞాపకం..
నే నేర్చిన మొదటి మోహనవర్ణం..
నే నేర్చిన మొదటి మోహనవర్ణం..
10267. ఆలోచనలు ప్రవాహములే..
నిదురలో తప్ప విశ్రాంతి దొరకదన్నట్టు..
నిదురలో తప్ప విశ్రాంతి దొరకదన్నట్టు..
10268. వరస మార్చుకుంది వసంతం..
కవిత్వాన్ని చిగురించాలని చూస్తోందిప్పుడు..
కవిత్వాన్ని చిగురించాలని చూస్తోందిప్పుడు..
10269. ఉలికిపాటైనా బాగుంది..
నా తలపుల్లో నువ్వు కదిలినప్పుడల్లా..
నా తలపుల్లో నువ్వు కదిలినప్పుడల్లా..
10270. అందంగా మురిపిస్తోంది రాత్రి..
నిశ్శబ్దపు మేలిముసుగులోంచీ కవ్విస్తూ..
నిశ్శబ్దపు మేలిముసుగులోంచీ కవ్విస్తూ..
10271. మరణం సునాయాసమే..
నీలో నేనో జ్ఞాపకముగా జారిపోయానంటే..
నీలో నేనో జ్ఞాపకముగా జారిపోయానంటే..
10272. కొన్ని ప్రేమలెప్పటికీ చిగురించవు నిజమే..
వసంతాన్ని వాయిదావేస్తూ పోయే జీవితాలలో..
వసంతాన్ని వాయిదావేస్తూ పోయే జీవితాలలో..
10273. అనుసరిస్తూ నువ్వున్నందుకేమో..
నా పెదవులపై నవ్వులు పూస్తున్నవిన్నాళ్ళకి..
నా పెదవులపై నవ్వులు పూస్తున్నవిన్నాళ్ళకి..
10274. కొలవలేకున్నా ఆకాశాన్ని..
నా మీద ప్రేమ అనంతమన్నావని..
నా మీద ప్రేమ అనంతమన్నావని..
10275. గుచ్చుకుంటున్న జ్ఞాపకాలు..
వైరాగ్యం స్రవిస్తున్నంతసేపూ..
వైరాగ్యం స్రవిస్తున్నంతసేపూ..
10276. ఆనకెప్పుడో ఎగిరిపోకు మరి..
సీతాకోకలా మారిపోవాలనుందంటూ మభ్యపెట్టి..
సీతాకోకలా మారిపోవాలనుందంటూ మభ్యపెట్టి..
10277. మానిపోయిన గాయమే..
అక్షరాలుగా మార్చగానే తిరిగి రేగినట్టయింది..
అక్షరాలుగా మార్చగానే తిరిగి రేగినట్టయింది..
10278. అంతమవని ఒంటరితనం..
అన్వేషిస్తున్న చెలిమి ఆకాశానిదని తెలియగానే..
అన్వేషిస్తున్న చెలిమి ఆకాశానిదని తెలియగానే..
10279. కలతనిద్రలో నా కలలు..
కాస్తంత మనశ్శాంతినీ హరిస్తూ..
10280. మనసు నిండిందెప్పుడో..కాస్తంత మనశ్శాంతినీ హరిస్తూ..
నీ కన్నుల్లో కలలు చూసుకుంటున్నానందుకే..
10281. మైమరచింది నిజమే..
నాలోని అందాలు నువ్వు చూపించావని..
నాలోని అందాలు నువ్వు చూపించావని..
10281. మనసు ప్రయాణం..
జ్ఞాపకపు నీడల్లో గమ్యమెరుగని అన్వేషణం..
జ్ఞాపకపు నీడల్లో గమ్యమెరుగని అన్వేషణం..
10282. ఇంతకన్నా విషాదమేం కావాలి..
జీవితంలోని డొల్లతనం బయటపడ్డాక..
జీవితంలోని డొల్లతనం బయటపడ్డాక..
10283. అక్షరాలదెప్పటికీ ఒకటే ఎత్తు..
వాక్యంగా కలిసైనా బంధమవ్వాలని..
వాక్యంగా కలిసైనా బంధమవ్వాలని..
10284. కవిత్వం గుచ్చుతుందని అంటావెందుకో..
రేగుముల్లులా నీ జ్ఞాపకమున్నప్పుడు..
10285. కన్నీరు తుడిచేందుకైనా వస్తావనుకున్నా..రేగుముల్లులా నీ జ్ఞాపకమున్నప్పుడు..
కలలోనూ కనుమరుగై ఏడిపిస్తావనుకోలా..
10286. కాటుకనందుకే త్యజించాను..
కలనైనా తను భాధపడటం చూడలేకనే..
కలనైనా తను భాధపడటం చూడలేకనే..
10287. మనసు మరణించి చాలా కాలమైంది..
జ్ఞాపకాలెందుకో అప్పుడప్పుడూ బ్రతికున్నానని గుర్తుచేస్తాయిలా..
జ్ఞాపకాలెందుకో అప్పుడప్పుడూ బ్రతికున్నానని గుర్తుచేస్తాయిలా..
10288. కొట్టుమిట్టాడుతున్న జ్ఞాపకాలు..
గొంతు నొక్కిపెట్టి మాట పెగలనివ్వనంటూ..
గొంతు నొక్కిపెట్టి మాట పెగలనివ్వనంటూ..
10289. విషాదమందుకే విచ్చుకుందేమో..
నుదుటున కాస్త చోటివ్వగానే మురిసిపోతూ..
నుదుటున కాస్త చోటివ్వగానే మురిసిపోతూ..
10290. గుండెల్లో గుట్టుగా దాచుకోవాలి..
నువ్వింకా బ్రతికున్నావనే నిజం..
నువ్వింకా బ్రతికున్నావనే నిజం..
10291. భావాల అనిశ్చితి..
విషాదాన్ని రాసేందుకు మనసు సహకరించలేదని..
విషాదాన్ని రాసేందుకు మనసు సహకరించలేదని..
10292. నా మనసు నీదయ్యింది..
బరువెక్కిందని దించేయకు దయలేకుండగా..
బరువెక్కిందని దించేయకు దయలేకుండగా..
10293. తేనిచుక్కనై జారిపోవాలనుంది..
నీలో మనోల్లాసం నింపేందుకు రమ్మన్నావంటే..
నీలో మనోల్లాసం నింపేందుకు రమ్మన్నావంటే..
10294. సాయింత్రాన్నెందుకు మురిపిస్తావో..
గోధూళి పరిమళం నచ్చిందని మనసుకి పూసేస్తూ ఈవేళ..
గోధూళి పరిమళం నచ్చిందని మనసుకి పూసేస్తూ ఈవేళ..
10295. క్షణాలు పరుగందుకున్నవిప్పుడు..
దేహాన్ని కవిత్వం చేసి ఉరకలెత్తించాలందుకే..
దేహాన్ని కవిత్వం చేసి ఉరకలెత్తించాలందుకే..
10296. స్మృతుల కల్లోలాలంతే..
మనసునంతా కెలికి ఎటో మాయమైపోతాయి..
మనసునంతా కెలికి ఎటో మాయమైపోతాయి..
10297. గాల్లో తేలుతోంది మనసు..
రెక్కలు మొలిచిందస్సలు గమనించనేలేదు..
రెక్కలు మొలిచిందస్సలు గమనించనేలేదు..
10298. తీరందాటుతూ నా కలలు..
వాయుగుండంలా నువ్వు ముంచెత్తినప్పుడల్లా..
వాయుగుండంలా నువ్వు ముంచెత్తినప్పుడల్లా..
10299. కళకళలాడుతున్న అనుబంధాలు..
కాసుల గలగలలో అనురాగాలు మిళితమవుతూ..
కాసుల గలగలలో అనురాగాలు మిళితమవుతూ..
10300. కులుకునవుతున్నా నేను..
అలతిపదాలలో నువ్వలా నన్ను రాసేస్తుంటే..
అలతిపదాలలో నువ్వలా నన్ను రాసేస్తుంటే..
No comments:
Post a Comment