9801. చెదరని జ్ఞాపకమంటే నువ్వే..
ఎన్నో జన్మలుగా వెంటాడుతున్నందుకేమో..
9802. నాలో నేను నవ్వుకుంటూ నిత్యం..
నీపై మనసుపడ్డ క్షణాల సంధి..
9803. మంచుజల్లునై కురిసాను..
చినుకు ముత్యాలుగా నన్ను ఒడిసిపడతావనే..
9804. దేహమంటే నేననుకున్నా..
మనసెప్పుడో నీ పరమైందని తెలీక..
9805. అక్షరం గెలుస్తోంది..
నా కలంతో మనిషితనాన్ని రాసినప్పుడల్లా..
9806. నువ్వొస్తావని ఎదురుచూడ్డంతోనే సరిపోతుంది..
శిశిరమప్పుడే సగదూరం కదిలిపోయినా..
9807. అందనంత దూరంలో ఆకాశం..
అద్భుతంలా నీతో సమానమయ్యింది..
9808. భావమై మెదిలేది నువ్వే..
నేనక్షరం రాయాలనుకున్నది మొదలు..
9809. అక్షరం ఆప్తమవుతుంది..
మనసు మౌనాన్ని హత్తుకున్నప్పుడల్లా నేనున్నానంటూ..
9810. వెలివేసినంత సులువు కాదు..
ఖాళీ దోసిలిని నింపగలగడం..
9811. మనసు నింపడం తెలియాలి..
మనిషితం ప్రవహిస్తుందని ఋజువవ్వాలంటే..
9812. కాటుకలు చెప్తున్న కబురులు వినాలి..
మనసు మెచ్చిన భావాలు నీకందాలంటే..
9813. జ్ఞాపకాలనందుకే రానిచ్చా..
నిన్ను తలపులుగా నాతో కలుపుతున్నాయని..
9814. అంతం చూడాల్సిందే కోరికలుంటే..
అంతులేని విషాదాన్ని వదిలించుకోవాలంటే..
9815. రాతిరికంత గంధమేమిటో..
ప్రేయసి రేరాణిగా ఊహల్లో మెదిలినందుకేమో..
9816. అత్తరంటిన కలలే నావన్నీ..
పరిమళించు ప్రణయానివై నువ్వుంటుంటే..
9817. శృతిమించి నవ్వుతున్నా..
నీ మనసెంత దాసోహమో చూడాలని..
9818. మురిపాల ముద్దబంతినే..
ముచ్చట్లలో ముంచగలిగితే..
9819. నీ జ్ఞాపకాలు గులాబీలు..
పరిమళించినప్పుడల్లా నన్ను మైమరపిస్తూ..
9820. వాస్తవమే విషాదం..
రుచి కోల్పోయిన జీవితాన్ని ఆస్వాదించలేనప్పుడు..
9821. కలిసిన మనసులనడగాలి..
మధువొలికే పెదవుల రహస్యం ఏనాటిదోనని..
9822. దగ్గరయ్యానందుకే మరి..
హద్దులు గీసి తనకు దూరమవరాదనే..
9823. నా కన్నులకవే పండగలు..
నీలో నన్నుంచుకున్న క్షణాలు..
9824. ఏకాంతాన్నెప్పుడూ నేనిష్టపడతా..
వెన్నెల్లో వెచ్చగా నీ తలపులుంటాయనే..
9825. కలలన్నీ కన్నులవే..
రేయింబవళ్ళకు తేడా మనం గుర్తించాలంతే..
9826. అధరం విచ్చుకుందిక్కడ..
పువ్వులు చూడాలని నువ్వు కోరుకోగానే..
9827. అద్దమందుకే నవ్వుకుంది..
చూపులతో అప్పుడప్పుడూ తనను నిమురుతుంటావని..
9828. కదులుతుందలా కాలం..
ఆకాశానికి నిచ్చెనేసి నక్షత్రాలను అందుకోమంటూ..
9829. మనసు కోరింది ముద్దులనే..
మువ్వలసవ్వడిలా ప్రేమ రవళించాలని..
9830. కళ్ళు మసకయ్యాయెప్పుడో..
మనసు తడి ఓదార్పుగా కురుస్తున్నందుకే..
9831. అనుక్షణమో విషాదం..
మనసు మోస్తున్న గాయాలు బరువెక్కుతుంటే..
9832. ప్రతిక్షణం నీ ధ్యాసలో నేను..
తలపుల తరంగమై నువ్వు చుట్టుముడుతుంటే..
9833. నిశ్శబ్దమో రాగమై వినబడుతుంది..
సంగీతం శబ్దం చేస్తోందక్కడ..
9834. వసంతమక్కడే ఉంది..
ఆస్వాదించేందుకు నేను వాయిదా వేస్తున్నానంతే..
9835. నువ్వో అద్వైతం..
అర్ధమైనట్టే అనిపించి అర్ధమవకుండా కవ్విస్తావు..
9836. నీతో పంచుకోవాలనుకున్న క్షణాలవి..
కాలమెందుకు ప్రవహిస్తుందో వేగంగా..
9837. ఆదమరపు అరక్షణమే..
నీ ప్రేమను మించలేవే సముద్రాలు..
9838. చెలిమి విలువను తీసేవారే కొందరు..
అవసరానికి అన్నీ తామైనట్టు నటిస్తూ..
9839. ప్రయాసేగా మిగిలింది..
నా నవ్వును నువ్వు గుర్తించలేదంటే..
9840. లిపి లేదంటావేం నీ కన్నులకు..
పెదవిప్పని ఊసులెన్నో చూపులతో వర్ణిస్తుంటే..
9841. గెలిచేదెప్పుడూ నిజమేలే..
అబద్దమెన్ని రంగులు పూసుకున్నా కరిగిపోతుంటే..
9842. కథలెన్నని రాసుకోను..
కలలో తప్ప వాస్తవంలో నువ్వెదురవనంటే..
9843. పరుగాపనంటూ కాలం..
నా ఆలోచనల మందగమనం నచ్చలేదంటూ..
9844. అందం ఆసాంతం అరుణరాగం..
అలుకను పాడుతున్నందుకు అంతరంగం..
9845. మౌనం వీడలేనంటూ మనసు..
అధరతాంబూలం నువ్వందించే వరకూ..
9846. మనసు మచ్చికవనంటోంది..
నీ అనురాగంలో అపశృతులు తలచుకుంటూ..
9847. సపాసాల సాధనలో నేనుండిపోయా..
వర్ణానికందనంత కఠినంగా నువ్వుంటే..
9848. రెప్పలమాటున దాచుకున్నా బాధను..
రాతిరైతే కలలుగా సాక్షాత్కరిస్తాయని..
9849. పరిమళం ప్రత్యక్షమే..
నన్ననుసరిస్తున్న నీ అడుగుల సాక్షిగా..
9850. గుండెతడి అంటలేదెక్కడా..
ఒక్క వాక్యమూ జీవితాన్ని ఓదార్చలేకుంటే..
9851. రెప్పపాటైతేనేమి జీవితం..
అనుభావాలు అక్షరాలుగా రాస్తున్నాముగా మనం..
9852. ఊసులెన్ని దాచాలో నిన్ను కలిసేదాక..
మోయలేని బరువును గుండెకు తగిలిస్తుంటే..
9853. విరహాన్ని దాచుకున్నా..
వసంతమొస్తుందన్న చిగురాశలోనే..
9854. ముగిసిన వలపొకటి..
నన్ను కాదనుకున్న నీ పంతంలో..
9855. చలికాలానికి దూరమయ్యాను..
చెలికాని చేరువలో చిరుచెమటలు చిమ్మినందుకే..
9856. అలమటిస్తున్న జీవితాలవి..
రెక్కాడినా దొక్కాడగలవనే నమ్మకం లేనివి..
9857. భావాల లాలిత్యం..
వెన్నెల్లో మనసు విహరించే విహంగమైనట్టు..
9858. వసంతం వలసెళ్ళినట్లుంది
మరో ఉగాదికైనా వస్తుందో రాదో...!!
9859. మనసు పుచ్చుకునే అర్హత లేనందుకేమో..
అనుబంధం అర్ధరహితమై అల్లకల్లోలం మిగిలింది..
9860. నీతోనే తరలినట్టుంది వసంతం..
ఒంటరితనం అనుభవానికొచ్చింది నిజం..
9861.నీ కళ్ళతో ఊసులాడలేదందుకే..
నన్నే మంత్రంతో ముడేస్తాయోనని..
9862. అపార్ధాలే కొందరికి ఆనందాలు..
అనుబంధానికి లోకువైన నిరాశలేమో..
9863. వ్యాపకానికి కొదవేముంది..
సమయమే సరిపోవట్లేదంతే..
9864. వసంతమొచ్చినట్టు వయసు..
నీ తలపులు అల్లుకున్నది మొదలు..
9865. అలుపులేని కలలేగా మనవి..
అంతులేని కథలుగా అలరిస్తూ..
9866. వెన్నెల నలుచెరగులా పరిమళిస్తున్నట్టుంది..
సౌందర్యలహరి శ్రావ్యమై వెలుగుతున్నట్టు..
9867. నా పవిత్రతకు మలినమంటదు..
నేనెన్నిసార్లు నీలో మునకలేసినా..
9868. నీ పవిత్రతకు మలినమంటదు..
నువ్వెన్నిసార్లు నాలో మునకలేసినా..
9869. ఎక్కడెక్కడో విహరిస్తోంది నా కల..
జ్ఞాపకాల విస్తరణ కుదించలేక కాబోలు..
9870. అలరింపులో ముందుంటావెప్పుడూ..
అల్లరి దాచేందుకు నే ఆరాటపడేలోపునే..
9871. కథ మొదలైంది పొద్దుల్లో..
జ్ఞాపకం జరిగింది మౌనాల్లో..
9872. కలవరించావని కనికరించా..
నీ కథగా మిగలాలని ఎప్పటికైనా..
9873. జీవితం క్షణభంగురమే..
ఎంత నేర్చినా మిగిలుందని గుర్తుచేస్తూ..
9874. మితిమీరిన ఆనందమిలా..
కొన్ని అనుభూతులు తిరిగొచ్చినందుకేమో మరలా..
9875. జీవచ్ఛవమై మిగిలున్నా..
నువ్వు దూరమైనా ప్రాణం పోనందుకే..
9876. నా జ్ఞాపకమో జావళి..
పాటకట్టి పాడుకోవడం తెలియాలంతే..
9877.నన్నెలా మర్చిపోతావులే..
గుండెల్లో సువాసనై పరిమళిస్తూ నేనుంటే..
9878. లయమై నేనుండిపోతా..
మది మీటినట్టు నువ్వలా పలకరించగానే..
9879. నిశ్వాసగా జారిపోమాకందుకే..
నిద్దట్లో నిన్ను తలవడం మరిచిపోయినా..
9880. మాటలు దాయాల్సొచ్చింది..
నేనేదన్నా గారడీ చేస్తున్నానని నువ్వంటుంటే..
9881. ప్రేమ ప్రహసనం ముగిసిపోయింది..
ఇందరిలో నువ్వు బయటపెట్టాక..
9882. కల్లోనైనా కలవాలనుకున్నా..
నిదురంటూ ఒకటొస్తే..
9883. చూస్తూ చూస్తూ నిలబడిపోతున్నా..
నిన్నొదిలి మనసిప్పుడు రానంటుంటే..
9884. పగటికలలను ఆహ్వానించొకసారి..
నీ మదికి నిత్యమిక సందడేసందడి..
9885. కలగా మారిందిప్పుడు నిద్ర..
కన్నులు మూతబడి చాన్నాళ్ళయ్యిందిగా..
9886. జాబిలిగా మారిపోతాలే నేను..
నిన్నటిని తలచుకొని అలసిపోమాకు..
9887. కన్నుల్లోంచి జారుతున్నందుకేమో..
నీటి ఒరవడికి మడుగయ్యింది మనసు..
9888. నీరొలుకుతూనే నన్నుంచుతావేమో..
నీపై నా ప్రేమను పరీక్షించాలనుకున్నప్పుడల్లా..
9889. చుట్టుముడుతున్న నీ చూపులను తప్పించలేకున్నా..
అరనవ్వులను ఆపలేనని నా పెదవులంటుంటే..
9890. మనసెందుకో మధనపడుతోంది..
నీ పదాలకు తగినట్టున్నానో లేదోనని..
9891. కన్నీరవుతావనుకోలేదు..
కాటుకగా కన్నుల్లో నిన్ను దిద్దుకున్నందుకు..
9892. రాసేదేముంది కొత్తగా..
నీదీ నాదీ ఒకటే కథంటున్నావుగా..
9893. ఆనకట్ట సరిపోలేదు కన్నీళ్ళకు..
గట్లు తెగింది గుండెకైనందుకు..
9894. సప్తపదికని ఎదురుచూస్తున్నా..
మనిద్దరి అడుగులూ సమాంతరం చేద్దామని..
9895. సాగదీస్తున్నానందుకే ప్రేమను..
ఏదోనాటికి పెళ్ళనే ముగింపు పలుకుతావని..
9896. మనసు నిద్దురపోదసలు..
నీ ఊహలు తనలో మెదులుతున్నందుకు..
9897. చెప్పుకొనేదేముంది చెడ్డగా..
మన చెలిమి చేమంతిగా పరిమళించాక..
9898. కాదనేదేముంది ముందులా..
నీ మనసు నాకిప్పుడు దగ్గరయ్యాక..
9899. ఇష్టమంటే ఇదేనేమో..
నీ నుంచీ క్షణం దూరం జరగదు మనసు..
9900. నిశ్శబ్దం నీరయ్యింది..
ఓసారిటొచ్చి నా కళ్ళను తుడిచిపోవూ..
ఎన్నో జన్మలుగా వెంటాడుతున్నందుకేమో..
9802. నాలో నేను నవ్వుకుంటూ నిత్యం..
నీపై మనసుపడ్డ క్షణాల సంధి..
9803. మంచుజల్లునై కురిసాను..
చినుకు ముత్యాలుగా నన్ను ఒడిసిపడతావనే..
9804. దేహమంటే నేననుకున్నా..
మనసెప్పుడో నీ పరమైందని తెలీక..
9805. అక్షరం గెలుస్తోంది..
నా కలంతో మనిషితనాన్ని రాసినప్పుడల్లా..
9806. నువ్వొస్తావని ఎదురుచూడ్డంతోనే సరిపోతుంది..
శిశిరమప్పుడే సగదూరం కదిలిపోయినా..
9807. అందనంత దూరంలో ఆకాశం..
అద్భుతంలా నీతో సమానమయ్యింది..
9808. భావమై మెదిలేది నువ్వే..
నేనక్షరం రాయాలనుకున్నది మొదలు..
9809. అక్షరం ఆప్తమవుతుంది..
మనసు మౌనాన్ని హత్తుకున్నప్పుడల్లా నేనున్నానంటూ..
9810. వెలివేసినంత సులువు కాదు..
ఖాళీ దోసిలిని నింపగలగడం..
9811. మనసు నింపడం తెలియాలి..
మనిషితం ప్రవహిస్తుందని ఋజువవ్వాలంటే..
9812. కాటుకలు చెప్తున్న కబురులు వినాలి..
మనసు మెచ్చిన భావాలు నీకందాలంటే..
9813. జ్ఞాపకాలనందుకే రానిచ్చా..
నిన్ను తలపులుగా నాతో కలుపుతున్నాయని..
9814. అంతం చూడాల్సిందే కోరికలుంటే..
అంతులేని విషాదాన్ని వదిలించుకోవాలంటే..
9815. రాతిరికంత గంధమేమిటో..
ప్రేయసి రేరాణిగా ఊహల్లో మెదిలినందుకేమో..
9816. అత్తరంటిన కలలే నావన్నీ..
పరిమళించు ప్రణయానివై నువ్వుంటుంటే..
9817. శృతిమించి నవ్వుతున్నా..
నీ మనసెంత దాసోహమో చూడాలని..
9818. మురిపాల ముద్దబంతినే..
ముచ్చట్లలో ముంచగలిగితే..
9819. నీ జ్ఞాపకాలు గులాబీలు..
పరిమళించినప్పుడల్లా నన్ను మైమరపిస్తూ..
9820. వాస్తవమే విషాదం..
రుచి కోల్పోయిన జీవితాన్ని ఆస్వాదించలేనప్పుడు..
9821. కలిసిన మనసులనడగాలి..
మధువొలికే పెదవుల రహస్యం ఏనాటిదోనని..
9822. దగ్గరయ్యానందుకే మరి..
హద్దులు గీసి తనకు దూరమవరాదనే..
9823. నా కన్నులకవే పండగలు..
నీలో నన్నుంచుకున్న క్షణాలు..
9824. ఏకాంతాన్నెప్పుడూ నేనిష్టపడతా..
వెన్నెల్లో వెచ్చగా నీ తలపులుంటాయనే..
9825. కలలన్నీ కన్నులవే..
రేయింబవళ్ళకు తేడా మనం గుర్తించాలంతే..
9826. అధరం విచ్చుకుందిక్కడ..
పువ్వులు చూడాలని నువ్వు కోరుకోగానే..
9827. అద్దమందుకే నవ్వుకుంది..
చూపులతో అప్పుడప్పుడూ తనను నిమురుతుంటావని..
9828. కదులుతుందలా కాలం..
ఆకాశానికి నిచ్చెనేసి నక్షత్రాలను అందుకోమంటూ..
9829. మనసు కోరింది ముద్దులనే..
మువ్వలసవ్వడిలా ప్రేమ రవళించాలని..
9830. కళ్ళు మసకయ్యాయెప్పుడో..
మనసు తడి ఓదార్పుగా కురుస్తున్నందుకే..
9831. అనుక్షణమో విషాదం..
మనసు మోస్తున్న గాయాలు బరువెక్కుతుంటే..
9832. ప్రతిక్షణం నీ ధ్యాసలో నేను..
తలపుల తరంగమై నువ్వు చుట్టుముడుతుంటే..
9833. నిశ్శబ్దమో రాగమై వినబడుతుంది..
సంగీతం శబ్దం చేస్తోందక్కడ..
9834. వసంతమక్కడే ఉంది..
ఆస్వాదించేందుకు నేను వాయిదా వేస్తున్నానంతే..
9835. నువ్వో అద్వైతం..
అర్ధమైనట్టే అనిపించి అర్ధమవకుండా కవ్విస్తావు..
9836. నీతో పంచుకోవాలనుకున్న క్షణాలవి..
కాలమెందుకు ప్రవహిస్తుందో వేగంగా..
9837. ఆదమరపు అరక్షణమే..
నీ ప్రేమను మించలేవే సముద్రాలు..
9838. చెలిమి విలువను తీసేవారే కొందరు..
అవసరానికి అన్నీ తామైనట్టు నటిస్తూ..
9839. ప్రయాసేగా మిగిలింది..
నా నవ్వును నువ్వు గుర్తించలేదంటే..
9840. లిపి లేదంటావేం నీ కన్నులకు..
పెదవిప్పని ఊసులెన్నో చూపులతో వర్ణిస్తుంటే..
9841. గెలిచేదెప్పుడూ నిజమేలే..
అబద్దమెన్ని రంగులు పూసుకున్నా కరిగిపోతుంటే..
9842. కథలెన్నని రాసుకోను..
కలలో తప్ప వాస్తవంలో నువ్వెదురవనంటే..
9843. పరుగాపనంటూ కాలం..
నా ఆలోచనల మందగమనం నచ్చలేదంటూ..
9844. అందం ఆసాంతం అరుణరాగం..
అలుకను పాడుతున్నందుకు అంతరంగం..
9845. మౌనం వీడలేనంటూ మనసు..
అధరతాంబూలం నువ్వందించే వరకూ..
9846. మనసు మచ్చికవనంటోంది..
నీ అనురాగంలో అపశృతులు తలచుకుంటూ..
9847. సపాసాల సాధనలో నేనుండిపోయా..
వర్ణానికందనంత కఠినంగా నువ్వుంటే..
9848. రెప్పలమాటున దాచుకున్నా బాధను..
రాతిరైతే కలలుగా సాక్షాత్కరిస్తాయని..
9849. పరిమళం ప్రత్యక్షమే..
నన్ననుసరిస్తున్న నీ అడుగుల సాక్షిగా..
9850. గుండెతడి అంటలేదెక్కడా..
ఒక్క వాక్యమూ జీవితాన్ని ఓదార్చలేకుంటే..
9851. రెప్పపాటైతేనేమి జీవితం..
అనుభావాలు అక్షరాలుగా రాస్తున్నాముగా మనం..
9852. ఊసులెన్ని దాచాలో నిన్ను కలిసేదాక..
మోయలేని బరువును గుండెకు తగిలిస్తుంటే..
9853. విరహాన్ని దాచుకున్నా..
వసంతమొస్తుందన్న చిగురాశలోనే..
9854. ముగిసిన వలపొకటి..
నన్ను కాదనుకున్న నీ పంతంలో..
9855. చలికాలానికి దూరమయ్యాను..
చెలికాని చేరువలో చిరుచెమటలు చిమ్మినందుకే..
9856. అలమటిస్తున్న జీవితాలవి..
రెక్కాడినా దొక్కాడగలవనే నమ్మకం లేనివి..
9857. భావాల లాలిత్యం..
వెన్నెల్లో మనసు విహరించే విహంగమైనట్టు..
9858. వసంతం వలసెళ్ళినట్లుంది
మరో ఉగాదికైనా వస్తుందో రాదో...!!
9859. మనసు పుచ్చుకునే అర్హత లేనందుకేమో..
అనుబంధం అర్ధరహితమై అల్లకల్లోలం మిగిలింది..
9860. నీతోనే తరలినట్టుంది వసంతం..
ఒంటరితనం అనుభవానికొచ్చింది నిజం..
9861.నీ కళ్ళతో ఊసులాడలేదందుకే..
నన్నే మంత్రంతో ముడేస్తాయోనని..
9862. అపార్ధాలే కొందరికి ఆనందాలు..
అనుబంధానికి లోకువైన నిరాశలేమో..
9863. వ్యాపకానికి కొదవేముంది..
సమయమే సరిపోవట్లేదంతే..
9864. వసంతమొచ్చినట్టు వయసు..
నీ తలపులు అల్లుకున్నది మొదలు..
9865. అలుపులేని కలలేగా మనవి..
అంతులేని కథలుగా అలరిస్తూ..
9866. వెన్నెల నలుచెరగులా పరిమళిస్తున్నట్టుంది..
సౌందర్యలహరి శ్రావ్యమై వెలుగుతున్నట్టు..
9867. నా పవిత్రతకు మలినమంటదు..
నేనెన్నిసార్లు నీలో మునకలేసినా..
9868. నీ పవిత్రతకు మలినమంటదు..
నువ్వెన్నిసార్లు నాలో మునకలేసినా..
9869. ఎక్కడెక్కడో విహరిస్తోంది నా కల..
జ్ఞాపకాల విస్తరణ కుదించలేక కాబోలు..
9870. అలరింపులో ముందుంటావెప్పుడూ..
అల్లరి దాచేందుకు నే ఆరాటపడేలోపునే..
9871. కథ మొదలైంది పొద్దుల్లో..
జ్ఞాపకం జరిగింది మౌనాల్లో..
9872. కలవరించావని కనికరించా..
నీ కథగా మిగలాలని ఎప్పటికైనా..
9873. జీవితం క్షణభంగురమే..
ఎంత నేర్చినా మిగిలుందని గుర్తుచేస్తూ..
9874. మితిమీరిన ఆనందమిలా..
కొన్ని అనుభూతులు తిరిగొచ్చినందుకేమో మరలా..
9875. జీవచ్ఛవమై మిగిలున్నా..
నువ్వు దూరమైనా ప్రాణం పోనందుకే..
9876. నా జ్ఞాపకమో జావళి..
పాటకట్టి పాడుకోవడం తెలియాలంతే..
9877.నన్నెలా మర్చిపోతావులే..
గుండెల్లో సువాసనై పరిమళిస్తూ నేనుంటే..
9878. లయమై నేనుండిపోతా..
మది మీటినట్టు నువ్వలా పలకరించగానే..
9879. నిశ్వాసగా జారిపోమాకందుకే..
నిద్దట్లో నిన్ను తలవడం మరిచిపోయినా..
9880. మాటలు దాయాల్సొచ్చింది..
నేనేదన్నా గారడీ చేస్తున్నానని నువ్వంటుంటే..
9881. ప్రేమ ప్రహసనం ముగిసిపోయింది..
ఇందరిలో నువ్వు బయటపెట్టాక..
9882. కల్లోనైనా కలవాలనుకున్నా..
నిదురంటూ ఒకటొస్తే..
9883. చూస్తూ చూస్తూ నిలబడిపోతున్నా..
నిన్నొదిలి మనసిప్పుడు రానంటుంటే..
9884. పగటికలలను ఆహ్వానించొకసారి..
నీ మదికి నిత్యమిక సందడేసందడి..
9885. కలగా మారిందిప్పుడు నిద్ర..
కన్నులు మూతబడి చాన్నాళ్ళయ్యిందిగా..
9886. జాబిలిగా మారిపోతాలే నేను..
నిన్నటిని తలచుకొని అలసిపోమాకు..
9887. కన్నుల్లోంచి జారుతున్నందుకేమో..
నీటి ఒరవడికి మడుగయ్యింది మనసు..
9888. నీరొలుకుతూనే నన్నుంచుతావేమో..
నీపై నా ప్రేమను పరీక్షించాలనుకున్నప్పుడల్లా..
9889. చుట్టుముడుతున్న నీ చూపులను తప్పించలేకున్నా..
అరనవ్వులను ఆపలేనని నా పెదవులంటుంటే..
9890. మనసెందుకో మధనపడుతోంది..
నీ పదాలకు తగినట్టున్నానో లేదోనని..
9891. కన్నీరవుతావనుకోలేదు..
కాటుకగా కన్నుల్లో నిన్ను దిద్దుకున్నందుకు..
9892. రాసేదేముంది కొత్తగా..
నీదీ నాదీ ఒకటే కథంటున్నావుగా..
9893. ఆనకట్ట సరిపోలేదు కన్నీళ్ళకు..
గట్లు తెగింది గుండెకైనందుకు..
9894. సప్తపదికని ఎదురుచూస్తున్నా..
మనిద్దరి అడుగులూ సమాంతరం చేద్దామని..
9895. సాగదీస్తున్నానందుకే ప్రేమను..
ఏదోనాటికి పెళ్ళనే ముగింపు పలుకుతావని..
9896. మనసు నిద్దురపోదసలు..
నీ ఊహలు తనలో మెదులుతున్నందుకు..
9897. చెప్పుకొనేదేముంది చెడ్డగా..
మన చెలిమి చేమంతిగా పరిమళించాక..
9898. కాదనేదేముంది ముందులా..
నీ మనసు నాకిప్పుడు దగ్గరయ్యాక..
9899. ఇష్టమంటే ఇదేనేమో..
నీ నుంచీ క్షణం దూరం జరగదు మనసు..
9900. నిశ్శబ్దం నీరయ్యింది..
ఓసారిటొచ్చి నా కళ్ళను తుడిచిపోవూ..