Thursday, 5 April 2018

9601 to 9700

9601. నీ ఆనందంలో విహరిస్తున్నా..
కాసిని నవ్వుల్లో చోటిచ్చినందుకే..
9602. ఊహల గాంధర్వమై వచ్చినందుకేగా..
ఎదలో గుడికట్టి ప్రతిష్ఠించుకున్నా..
9603. చిలికించనీ వెన్నెలంతా..
మంచుతెరలు అడ్డమైనా పున్నమి పులకరించేలా..
9604. కన్నుల్లో చేరాలంటే భయమవుతోందిప్పుడు..
కలలు దొంగిలించేవారు ఎక్కువయ్యారిప్పుడు..
9605. అనుభావాల విందులేగా నీ అక్షరాలు..
నీ కావ్యకన్యక ముస్తాబుని పరిచయిస్తూ..
9606. మేఘాల్లో విహరించాలనిపిస్తుంది..
కలలకు రెక్కలొస్తే బాగుండనుక్కున్న రేయంతా..
9607. ఆనందభాష్పాల రుచి తెలీదా కన్నులకి..
విషాదాన్నే వర్షిస్తుంటే ఎప్పుడూ మనసు..
9608. పట్టిందల్లా బంగారమైందిప్పుడు..
నీ అనుగ్రహం ఉంటుందని నమ్మినందుకు..
9609. సముద్రుడే చెలికాడు..
భావాలు చిలికినప్పుడల్లా నురగలై నవ్వుతాడు..
9610. పరిచయమైనప్పుడే అనుకున్నా..
కొన్నిజన్మల క్రితమే చెలిమై ఉండుంటామని..
9611. పరిమళిస్తున్న క్షణాలనడిగా..
నీ నిరీక్షణలో సన్నజాజుల గాలేంటని..
9612. కన్నులతో గాలమేసింది నువ్వేగా..
నాలోని అద్భుతాలు అనుభవించాలనుందంటూ..
9613. కలలోంచీ నడిచిపోతావెందుకో..
నిద్రను వరించేందుకెన్ని కష్టాలుపడ్డానో తెలుసుకోకుండా..
9614. సోయిలోనే లేనిప్పుడు..
మన మధ్య దూరాన్ని లెక్కించమంటావెందుకు..
9615. విశేషమై నువ్విటు వచ్చినప్పుడే అనుకున్నా..
నా జ్ఞాపాకాలు తెమ్మెరలై పిలిచుంటాయని..
9616. గ్రహణం పట్టిన జాబిలినై నేనున్నా..
నువ్వొచ్చి విడిపిస్తావన్న ఆశలోనే నిన్నంతా..
9617. గులాబీలతో ఆరాలెందుకో..
జతగా పరిమళిద్దామని పిలిచింది నేనైతే..
9618. దరిదాపుల్లో వెతుకుతూనే ఉన్నా..
రేయెప్పుడు గడిచిందో గుర్తించకుండానే..
9619. కథగానైనా రాయాలనుకున్నా..
ఏ కలనూ పూర్తిచేయనివ్వక నువ్వేమిటో..
9620. కురవకుండా ఆపేసా నాలో ఆవేదనని..
నీ నవ్వుల్లోని అద్భుతాన్ని అనుభవిస్తూ..
9621. కాలాన్ని కావ్యంగా రాయాలనుంది..
ప్రతి మలుపులోనూ నువ్వెదురొస్తుంటే..
9622. శ్వాస బరువెక్కిస్తావెందుకో..
రాలుగాయి రాగాలతో రాతిరిని ఆపేద్దామంటూ..
9623. మానవత్వమెప్పుడో గెలిచింది..
మనిషి మరణించినా ఆశయం బ్రతికుందని..
9624. ప్రేమ సిం హాసనం ఎప్పుడో వేసుంచా..
నువ్వొస్తే ప్రణయసీమని కలిసి ఏలుకుందామని
9625. తలపుల హాయిని మోస్తూనే ఉండాలనుంది..
కొన్ని సంతోషాలెప్పటికీ తాజావే మరి..
9626. ఎన్ని మిఠాయిలో నీ మాటల్లో..
ఈ తీయదనం మరింత కావాలనిపిస్తూ..
9627. కవిత్వమే ప్రవాహమైంది..
కాలమలా కదులుతూ కలతల్ని కడుగుతుంటే..
9628. కావ్యం మధురమైంది..
మన ముచ్చటలన్నీ తనలో ఇముడ్చుకొని..
9629. కలవరించక తప్పలేదు వలపుని..
కలలన్నింటా నిన్ను పోల్చుకుంటుంటే..
9630. మధువనమంతా మనలోనే..
ఒకరికొకరం పరవశాలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడల్లా..
9631. గుండెకి నర్తించడం నేర్పాలిప్పుడు..
నువ్వాలపించే రాగాలకు స్పందించాలంటే..
9632. అనుబంధపు మధురిమే స్నేహం..
ఆప్యాయతతో మనసులు ముడివేస్తూ..
9633. గుండెకెప్పుడూ పండగే..
పున్నమెప్పుడూ పక్కన నీలా నడుస్తుంటే..
9634. బానిసగానే మిగిలానిలా..
రాణిని నేనంటూ నువ్వూహల్లోనే బతుకుతుంటే..
9635. నా గుండె అదిరిపడుతుంటే ఏమోననుకున్నా..
నువ్ నర్తించేందుకో వేదికయ్యిందని తెలుసుకోలేక..
9636. గుబులెటో పోయినప్పుడనుకున్నా..
నీ జ్ఞాపకాలు గులాబీల్లో దాగున్నాయని..
9637. ఈ సాంత్వనొక్కటీ చాలనిపిస్తుంది..
ఒక్కజన్మకైనా  నువ్వు తోడవుతానంటే..
9638. పెంచుకున్న విరహమొక్కటి మిగిలింది..
నీలో ప్రేమంతా ఆవిరయ్యాక..
9639. పరమానందంలో వాళ్ళు..
పరవశానికి వెన్నెలెప్పుడూ తమ తోడవుతుందని..
9640. పారిజాతాలకెందుకో సిగ్గులు..
ఆమె నవ్వులతో వేకువ మురిసిందని..
9641. ముద్దుల పద్దులిప్పుడెందుకు..
వడ్డీతో తిరిగిస్తానని ఒట్టేసి చెప్పాక..
9642. కలలను వెలేస్తానంటావెందుకో..
ఒక్కరేయి విశ్రాంతిని నే వెతుకుతుంటే..
9643. నవ్వమన్నప్పుడే అనుకున్నా..
జన్మ తరించేందుకు జతగా చేరుంటావని..
9644. చూపుల మాలికలు చాలిక..
పెదవులు ప్రేమను ప్రకటించుకున్నాక..
9645. కాలం కదిలిపోతేనేమిలే..
నీ మధురజ్ఞాపకాల దండనైతే నాకిచ్చిందిగా..
9646. అపురూపమేగా నువ్వెప్పుడూ..
వేళకాని వేళల్లో తలపుల్లో చొరబడ్డావంటే..
9647. మనసుపొరలు గుప్పుమన్నప్పుడనుకున్నా..
జ్ఞపకాల జావళీలను  మోసుకొచ్చింది నువ్వేనని..
9648. మనసుకి నోరొచ్చింది..
పల్లవిగా కొన్నక్షరాలు పాడమని నన్నడుగుతుంటే..
9649. కెరటమందుకే అలిగింది..
ఎగిసిపడే ఆనందాలను మనం దొంగిలించామని..
9650. అనుబంధాలు తప్పనివి..
మిధ్యల్లో మిగలాలనుకున్నా జీవితానికి ముడేస్తుంటాయి..
9651. కలలో ఆకులు రాలుతున్న సవ్వళ్ళు..
మనసులో శిశిరం మొదలైన సూచనలేమో..
9652. వెన్నెలై పరుచుకుందో ఊహ మనసంతా..
కొత్తగ పరిమళిస్తున్న రాతిరికి సాక్షిగా.. 
9653. నీ మనసు నింపాలనేగా నేననుకున్నా..
అనుభూతులు మక్కువని అనుభవాలన్నీ ఆవిష్కరిస్తున్నా.. 
9654. వసంతాన్ని రమ్మని పిలవడం మానేసా..
ఋతువులన్నిటా నువ్వే కవితగా కదిలొస్తుంటే..
9655. తనో ఆకాశమే..
నాకు అర్ధభాగమిచ్చి లోకానికి పరిచయించినప్పుడు..
9656. అన్నమసలు తినాలనిపించదు..
నీ భావాలతోనే కడుపు నిండిపోతుంటే..
9657. మనసులోతు తెలుసుకోలేకున్నా..
నీ మాయలో పడినప్పటినుంచీ కొట్టుకుపోతున్నా..
9658. వాస్తవమవ్వాలని ఎదురొచ్చా..
కన్నుల్లో బంధిస్తావని ఊహించనే లేదస్సలా..
9659. అస్తమానూ అలగలేక నే ఛస్తున్నా..
నా అందాన్ని గుర్తించవనే అనుమానంతో..
9660. కడలిలో కొట్టుకుపోతున్నట్టుంది..
కన్నుల్లో ఆవేదన ఆగకుండా పొంగిపొర్లుతుంటే..
9661. చిరునవ్వును చదువుతున్నా..
నీ ఆనందం మోములో వెలిగిపోతుంటే..
9662. నిన్నటివే సంతోషాలు నావన్నీ..
నీ రాకతో బయటపడ్డాయంతే..
9663. కుదుటపడ్డ మనసు..
నీ ఊహలోని ప్రతిబింబం నాదయ్యిందని..
9664. మనసెప్పుడూ తరంగమే..
మన ప్రేమనో ఉత్సవంగా చేసుకోవాలనే..
9665. క్షణాలకు కోరికైందట..
అక్షరాల్లో ఒదిగిన మనమెలా పరిమళిస్తామోనని..
9666. మనసెప్పుడూ పువ్వులతోటే..
వాడిపోయినా పరిమళిస్తుందనే ఆశలు తోడైనందుకు..
9667. నీ తలపులోనే నేనెప్పుడూ..
మౌనమందుకే ముసురుకుంటోంది కాబోలు..
9668. నేనే తొలకరి..
వర్షోదయాన్ని కలగంటూ నువ్వు నిద్దరోతే..
9669. మనసు నింపిన నిన్నటి మధురిమే..
కొన్ని జ్ఞాపకాలుగా నేడు బ్రతికించుకున్నది...
9670. ఓదార్పు కోరడం అనవసరమని తెలిసింది..
నిస్సహాయతను వెక్కిరిస్తున్న వైనాన్ని తలచి..
9671. నిద్దురెటో పోయిందిలే..
జాబిలివై నవ్వుతూ ముందర నువ్వుంటే..
9672. అమృతమెక్కడో ఉందనుకున్నా..
ఈ రాతిరి తడవక మునుపు..
9673. కర్పూరపు పరిమళాలీనాడు..
నాలోని నవ్యానుభవమేమో..
9674. అంతులేని ప్రేమకు వారసురాలామె..
అధికమైన క్షమను వర్షిస్తోందందుకే..
9675. అనూహ్యమైంది జీవనం..
ఆశించకనే అందిన నీ వలపు..
9676. నిన్ను చదివినందుకేగా..
నాలో చైతన్యానికో నిర్వచనం దొరికింది..
9677. నీకెలా వినబడినవో..
నాలో కోరికలు కోయిలలై కూసిన చిలిపి సందళ్ళు..
9678. రాలుపూల తేనెల్లో తీయదనం..
శిశిరమైనా అమృతాన్నే కురిపిస్తూ..
9679. జీవితమంతా అనురాగమే..
ఒక్కసారి పాడినా నీకిష్టమైన పాటని..
9680. పరమపదం చేర్చుకుందామని జీవితం..
వృద్ధాప్యానికి చేరువ కాకమునుపే..
9681. బాధలన్నీ విచిత్రంగా తేలికయ్యాయి..
చెలిమంటూ నువ్వొచ్చి చేయూతనివ్వగానే..
9682. ఎన్ని భావుకలో నా మదిలో..
నిన్ను రాసేందుకని కలం పట్టగానే..
9683. మొదలయ్యిందిక్కడే ప్రోత్సాహం..
మదిలో ఉత్సాహం నీరుగారిందనుకున్న సమయంలో..
9684. ఎంత ప్రోత్సాహమందిస్తేనేమి..
విజయం సాధించాలనే పట్టుదల లోపిస్తే..
9685. జీవించేందుకో ప్రోత్సాహం కావాలనుకున్నా..
మన కలయికయ్యింది విచిత్రంగా..
9686. చినుకులుగా రాలుతున్న కన్నీరిక్కడ..
జ్ఞాపకమని సరిపెట్టుకున్నా నేనందుకే..
9687. హద్దులు దాటిన పులకరింతేనది..
మార్చిందిన్నళ్ళ నడుకను హొయలుగా..
9688. పలకరింపులోని తీయదనమది..
శిశిరమైందనుకున్న మనసుకొమ్మకి వసంతపు చిగురులిస్తుంది..
9689. నీ కవిత చదివినప్పుడే అనుకున్నా..
జాబిల్లితో పోల్చి రాసింది నన్నేనని..
9690. జీవితమెప్పటికైనా నీటిబుడగే..
ఇంద్రధనస్సుగా మెరిపించుకోవడం తెలియాలి మనకే..
9691. వాటేసుకోక తప్పలేదు వేదనను..
ఆనందం ఆమడదూరమై వెక్కిరించాక..
9692. కాటుకలు దాటిన కలలు..
రాతిరితో తమకి పనిలేదంటూ..
9693. మనసు దాచాననుకున్నా ఇన్నాళ్ళూగా..
నీ ఉనికితో బయటపెడతాననుకోలా.. 
9694. అనుభూతిని దాచాలనుకున్నా గుండెల్లో..
కళ్ళు కబురులాడతాయని తెలీక..
9695. మనసు మీటిన మాలికొకటి..
ఆకుచాటు మల్లెగా పరిమళిస్తుంది..
9696. జ్ఞాపకాల అలజడులేనవి..
నిన్నటి నా నిదురను కాజేసినవి..
9697. కాలానికెందుకో అలుసవుతున్నా..
వీక్షణలో నన్నుంచి కక్షగా కదిలిపోతుంది..
9698. సిగ్గుల సవ్వళ్ళలో మురిపాలిప్పుడు..
మనసురాగం హద్దులు మీరినందుకే..
9699. కవితలన్నింటా నన్నుంచావెందుకో..
హృదయం లయ తప్పలేదని శృతిమించుతూనే..
9700. నీ నిండుపున్నమినే నేను..
కలనైనా నిన్నందుకే వీడిపోను..

Virus-free. www.avast.com

No comments:

Post a Comment