9301. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో..
లోకం తనంతట తానే దాసోహమయ్యేలా..
9302. ఊహలు చిదిమేసుకుంటూనే బ్రతుకుతున్నా..
ఊపిరాగే రోజొకటొస్తుందని ఆశపడుతూ..
9303. కోయిల కూసినప్పుడల్లా వసంతం రాదు..
నేనెదురు చూసినంతనే నువ్వు రానట్టు..
9304. ఎన్ని పదాల్ని సాయమడిగానో..
నా భావంలో నిన్నుంచేందుకు..
9305. అల్లిబిల్లిగా కొన్నక్షరాలు..
అనురాగాన్ని పాడేందుకు రమ్మనగానే ఆలాపనలైపోతూ..
9306. ఎన్ని మనసుల్ని మరలించానో..
నిన్నాహ్వానించేందుకు వసంతాన్ని రమ్మంటూ..
9307. వెన్నెలెంత విషాదమయ్యిందో..
నా ఏకాంతంలో ఆనందాన్ని హరిస్తూ..
9308. మధురభావాలెప్పుడూ అనంతమే..
నా మౌనాన్ని మాటల్లోకి అనువదించాలనుకుంటే..
9309. భావాల సుగంధాలు..
మన వలపును రాస్తున్నంతసేపూ పరిమళిస్తూ..
9310. నీ కాటుకల కబుర్లు..
నన్నాలకించమని సైగచేసే చిలిపిదనాలు..
9311. హృదయమెందుకు బరువెక్కుతుందో..
నీ ఎదురుచూపులను తానేదో మోసినట్టు..
9312. ఎన్ని జ్ఞాపకాలు పచ్చబొట్లుగా మిగిలాయో..
నా మనసు అక్షరముగా ఆవిష్కరించేందుకు..
9313. కొన్ని హృదయాలకి వేగమెక్కువన్నది నిజమే..
గుర్రాన్ని మించి దౌడు తీస్తుంటాయి..
9314. కాలమెటు పయనమయ్యిందో..
విరహంలో నన్నుంచి తాను విహరించేందుకు..
9315. కలలోకి రానంటూ మొరాయిస్తావే..
నిద్దురోవాలని నేనెదురు చూస్తుంటే..
9316. కన్నీటి చెలమలవుతూ కళ్ళు..
మాటలముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ..
9317. ప్రకృతి సమానమేనట పున్నమికి..
నాకే ఎందుకో.నువ్వుంటే వసంతమైనట్టు..లేకుంటే మోడువారినట్టు..
9318. ప్రేమ..
ఇప్పటికింకా నా వయసు ఇరవయ్యేనని చెప్తుంది..
9319. నటించడం కష్టమే..
మనసు మరణించినా శరీరాన్నలా మోసుకుంటూ..
9320. కల చాలా చిన్నదవుతుంది..
సగంరాత్రి ఊహల్లో కరిగిపోతుంటే..
9321. భావాన్ని ఏరి కూర్చాలనుకున్నా..
శిశిరపున్నమిలా కొమ్మల్నిలా చిగురింపజేసింది..
9322. మనసు మీటుతున్న రాతిరొకటి..
అలంకరించుకున్నా జీవితం సాక్షిగా..
9323. ప్రతిసారీ ఓడిపోతూనే ఉంది అస్తిత్వం..
జవాబు తెలీదంటూ ప్రశ్నలు దాటేస్తుంటే..
9324. కురుస్తున్న చినుకులు..
కన్నులు వర్షిస్తున్నాయో..మనసే రోదిస్తున్నదో..
9325. నువ్వో స్పర్శకందని సిరిమల్లెవి..
పరిమళంతోనే మనసుల్ని గెలిచేస్తూ..
9326. నిశ్శబ్దం రాలిపోయింది..
అనుభవాన్ని పాటగట్టి రాగాలాపన మొదలెట్టగానే..
9327. రాగోదయమంటే ఏమోననుకున్నా..
నీ తలపు వేకువని గుర్తించనప్పుడు..
9328. అడవి కాస్తున్న ఊహలు..
ఆమె భావాలకు విలువలేదనుకుంటా..
9329. మౌనంలో దాచుకున్న అనుభూతులెన్నో..
మనసు పెదవిప్పి చెప్పనప్పుడు..
9330. కన్నుల్లో వర్షమిప్పుడు..
మనసెప్పుడు ముసిరేసిందో గమనించనే లేదసలు..
9331. రంగస్థలమైతేనేమి మనసు..
నీ తలపులతో నిత్యసందడి మొదలయ్యిందిగా..
9332. నీ తలపుల అలలంటే నాకిష్టమే..
నా మనసుని ఉప్పేంగేలా చేస్తుంటే..
9333. కరిగిపోలేనా కర్పూరమై నేను..
నువ్వొక్కసారి హారతిగా నన్నవ్వమంటే..
9334. ఎప్పటికీ తెరవాలని లేదు కన్నులు..
నీ జ్ఞాపకాల ముద్రలు మరుగవుతాయని..
9335. నీ ఊసులతో ఊరేగుతూ మనసు..
నా మాట వినేదింక లేదంటూ..
9336. కన్నుల కళ్యాణిరాగం..
రాతిరవుతుంటే అరమోడ్పులతో రాగాలాపనకు సిద్ధమవుతూ..
9337. జ్ఞాపకాలకి దూరమవుతున్నా..
విషాదాన్ని మోస్తూ జీవితాన్ని అనుసరించలేకనే..
9338. ఉషస్సుగా నిన్నూహిస్తున్నా..
మేల్కొలుపు గీతమే నువ్వై మొదలవుతుంటే..
9339. కుంకుమై అలంకరిస్తున్నా..
నీ పెదవుల తీపిదనం అమృతప్రాయమని..
9340. ప్రణయరాధేయమిది..
ప్రేమ ఇద్దరిని ఒకటిగా చూపిస్తుంటే..
9341. నేనే ప్రేరణవుతున్నా..
నీలో సవ్వడించే మువ్వలు నావవ్వాలని..
9342. అలుపెరుగని ప్రవాహమేనది..
జలపాతమై మది తేనెలు జాలువారుతుంటే..
9343. హద్దేముంది భావావేశానికి..
అక్షరాలొకటై ఆనందాన్ని పంచేందుకు పరుగులెడుతుంటే..
9344. ముచ్చటపడుతుందేమో లోకం..
కొన్ని ఆత్మల మౌనాలు సేదతీరాయని..
9345. నీ వలపు నా ఊహాలోకం..
పరిమళానికి కొందవేముంటూ మనసు పారిజాతం..
9346. మనసు గల్లంతయినప్పుడనుకోలా..
ఏదోలా నీలో మకాం మార్చుకుందని..
9347. కన్నీరంటే భయమవుతోంది..
నీ రూపాన్ని తనలో కరిగించుకుంటాయని..
9348. రెక్కలు మొలిచిన తలపెంతో బాగుంది..
విహంగమై ఎగిరి నిన్ను చూడాలనిపిస్తుంటే..
9349. వేణుగానానికి విలువొచ్చిందిప్పుడు..
నీ పిలుపు వాయులీనమై వినబడ్డందుకు..
9350. వలసపోయిందెందుకో మనసు..
వర్తమానపు ఒంటరితనంలోకి తాను రాలేనంటూ..
9351. చిగురిస్తుందనే నమ్మకం లేదిప్పుడు..
ఋతువులు బాధ్యతలు మార్చుకుంటుంటే..
9352. మానసికంగా మనమెప్పుడూ దగ్గరే..
ఎదురయ్యేందుకు ముహూర్తం రాలేదంతే..
9353. మౌనమెక్కడ నేర్చిందో మనసు..
అనురాగాలెన్నో అందంగా వినిపిస్తున్నా..
9354. మౌనం ముడి విప్పాలనుకున్నా..
నీ మదినాకట్టుకుందని తెలీక..
9355. మనసుకి తగ్గ భావాలే మనమందరివీ..
మాలికలమై ఒక దండగా కలిసామందుకే..
9356. అక్షరాల సాయమడుగుతున్నా..
పొడారిపోతున్న గుండెకు కాస్త చెంపరింపునద్దమని..
9357. పూలెన్నో కావాలనుకున్నా మాలికల్లేందుకు..
పరిమళించేదొక్కటుంటే చాలని తెలీక..
9358. వసంతమంటే నవ్వుకుంటుంది మనసు..
విరక్తికి ఋతువులతో సంబంధమేముందని..
9359. నందనవనం నాదే..
నీ తలపులతోటలో నేనున్నది నిజమైతే..
9360. మసకమసకగా నా చూపు..
కొన్ని కలలలా గుర్తుకొస్తుంటే..
9361. ఆశకు పూసిన పువ్వులవి..
పరిమళమందుకే వాడదు ఎప్పటికీ..
9362. నిశ్శబ్దమూ మధురమవుతోంది..
కొన్ని మౌనాల దరహాసాన్ని ఆలకిస్తున్నందుకు..
9363. ఒక్కో రోజంతే..
స్మృతి శకలాలనే మనసు ఏరుకుంటుంది..
9364. స్పందిస్తూనే ఉండాలనుందిలా..
ప్రణయాన్ని ప్రహేళికలా నువ్వు ఆరాతీస్తుంటే..
9365. మనసులు కలవలేదనుకుంటా..
ప్రేమ నల్లపూసయ్యిందక్కడ..
9366. చలి జ్వరమొచ్చినట్టుంది..
నీ మాటలకు మనసుకి ఒణుకుతుంటే..
9367. నా నీడనూ ప్రేమించుకుంటున్నా..
నీలా అనుసరిస్తుందేమోనని..
9368. ప్రపంచానికి దూరం జరిగా..
నీకు దగ్గరవుతున్న కొద్దీ..
9369. ఎన్ని అడుగులు నడిచి రావాలో..
నీ కౌగిలిలో నేను కుదురుకోవాలంటే..
9370. ఏకమవ్వాలనుంది..
నువ్వొక్కసారి నా అనుభూతిని స్వీకరిస్తానంటే..
9371. ప్రపంచంతో పనేముంది..
ఒకరికొకరం తెలుసుకున్నాక..
9372. గుప్పెడైతేనేమి భావాలు..
కవిత్వంగా మారి పరిమళాన్ని పెంచుకున్నాయిగా..
9373. ఆశలందుకే దాచుకున్నా..
నువ్వొస్తే ప్రణయమనే వర్షాలు కురిపిస్తావనే..
9374. ఇన్నాళ్ళకు సీతాకోకైంది నా మనసు..
నిన్ను గెలుచుకున్న నాలో వలపురంగులు..
9375. అక్షరాల తీపినద్దుకోవడమో ఆనందం..
మనసునో వేడుక మొదలెట్టాలంటే..
9376. నే వెన్నెల తాగింది నిజమే..
పెదవి కందడం నువ్వు గమనించావంటే..
9377. వసంతం నవ్వుకుంది..
తనొచ్చినా శిశిరాన్ని కలగనడమెలా సాధ్యామాని..
9378. వర్షం కోసం ఎదురుచూడటం ఆపేసానిప్పుడు..
హరివిల్లుని కోరుకోగానే నువ్వు ప్రత్యక్షమవుతుంటే..
9379. వెన్నెల కురిసినట్లుంది..
మనసు చాటు చందమామవై నువ్వున్నందుకేమో..
9380. చల్లకొచ్చి ముంత దాచినట్టుంది..
కౌగిట్లోకొచ్చి కలొచ్చిందని చెప్తూ..
9381. ఆరోప్రాణముగా నిను దాచుకున్నా..
ఊపిరాగిపోతుందన్న భయం కనుమరుగయ్యిందిప్పుడు..
9382. ఇంద్రధనస్సు రంగులు విడివడ్డాయి..
ఎలాగైనా శూన్యాన్ని నింపితీరాలని..
9383. సిగ్గుపూల దొంతరలో నేనున్నది నిజమే..
కందిన పెదవికి కారణాలు నువ్వడుగుతుంటే..
9384. నీ శ్వాస అందుతూనే ఉందిలా..
ఈ రేయి తెల్లవారనివ్వనంటూ మనకిలా..
9385. అల్లుతూనే ఉండాలనుందీ మాలిక..
నీ తలపులిలా పరిమళిస్తుంటే..
9386. జీవితానికర్ధం తెలిసొచ్చిందిప్పుడు..
వికసిస్తూనే రాలిన పువ్వుని గమనించినందుకు..
9387. చల్లని జాబిలిగా మారింది మనసు..
నీ భావాలతో ప్రేమలో పడ్డట్టుంది..
9388. చెట్టు చిన్నదయ్యింది..
మన చెలిమి ఎదుగుతున్న ఆకాశానికి.
9389. మదిలో మొదలైన భావన..
అక్షరమై అలంకరించాలనే కామన..
9390. నిముషమే నిశ్శబ్దం..
వేల భావనల పుట్టుక ఈలోపునే..
9391. కలలు కొరవడుతున్న భావనలే అన్నీ..
జ్ఞాపకాల జాగరణలో రేయి ముగిసిపోతుంటే..
9392. కలుపుమొక్కల చెలిమి పెరికేసానిప్పుడు..
అసలైన పరిచయం నువ్వయ్యాక..
9393. వేరే ఇతర దైవాల్ని గుర్తుపట్టలేకున్నా..
నా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాక..
9394. అంతర్లోకంలో నువ్వు..
ప్రపంచంతో సంబంధం తెగినప్పటి సంధి..
9395. ఎందుకో జీవితం ఆగినట్టుంది..
నాలో రక్తం చప్పబడినందుకేమో..
9396. శూన్యమెందుకు బెంగపడుతుందో..
అప్పుడప్పుడూ ఆనందాన్ని ఆహ్వానిస్తూ నేనుంటుంటే..
9397. బుజ్జగించలేకున్నా జీవితాన్ని..
చేజారిన వసంతాన్ని జ్ఞప్తికి తెస్తుంటే..
9398. నవ్వితే చాలనుకున్నా నా నేస్తాం..
అతిశయం ఆనందాన్ని పెంచింది నిజం..
9399. అనునయమే నాది..
అలుకల్లో మన అనుబంధం బిగుసుకుంటుంటే..
9400. పావురానికి పంజరం తప్పలేదు..
అశాంతిని తనలోనే దాచుకోవాలనుకున్నందుకు..
లోకం తనంతట తానే దాసోహమయ్యేలా..
9302. ఊహలు చిదిమేసుకుంటూనే బ్రతుకుతున్నా..
ఊపిరాగే రోజొకటొస్తుందని ఆశపడుతూ..
9303. కోయిల కూసినప్పుడల్లా వసంతం రాదు..
నేనెదురు చూసినంతనే నువ్వు రానట్టు..
9304. ఎన్ని పదాల్ని సాయమడిగానో..
నా భావంలో నిన్నుంచేందుకు..
9305. అల్లిబిల్లిగా కొన్నక్షరాలు..
అనురాగాన్ని పాడేందుకు రమ్మనగానే ఆలాపనలైపోతూ..
9306. ఎన్ని మనసుల్ని మరలించానో..
నిన్నాహ్వానించేందుకు వసంతాన్ని రమ్మంటూ..
9307. వెన్నెలెంత విషాదమయ్యిందో..
నా ఏకాంతంలో ఆనందాన్ని హరిస్తూ..
9308. మధురభావాలెప్పుడూ అనంతమే..
నా మౌనాన్ని మాటల్లోకి అనువదించాలనుకుంటే..
9309. భావాల సుగంధాలు..
మన వలపును రాస్తున్నంతసేపూ పరిమళిస్తూ..
9310. నీ కాటుకల కబుర్లు..
నన్నాలకించమని సైగచేసే చిలిపిదనాలు..
9311. హృదయమెందుకు బరువెక్కుతుందో..
నీ ఎదురుచూపులను తానేదో మోసినట్టు..
9312. ఎన్ని జ్ఞాపకాలు పచ్చబొట్లుగా మిగిలాయో..
నా మనసు అక్షరముగా ఆవిష్కరించేందుకు..
9313. కొన్ని హృదయాలకి వేగమెక్కువన్నది నిజమే..
గుర్రాన్ని మించి దౌడు తీస్తుంటాయి..
9314. కాలమెటు పయనమయ్యిందో..
విరహంలో నన్నుంచి తాను విహరించేందుకు..
9315. కలలోకి రానంటూ మొరాయిస్తావే..
నిద్దురోవాలని నేనెదురు చూస్తుంటే..
9316. కన్నీటి చెలమలవుతూ కళ్ళు..
మాటలముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ..
9317. ప్రకృతి సమానమేనట పున్నమికి..
నాకే ఎందుకో.నువ్వుంటే వసంతమైనట్టు..లేకుంటే మోడువారినట్టు..
9318. ప్రేమ..
ఇప్పటికింకా నా వయసు ఇరవయ్యేనని చెప్తుంది..
9319. నటించడం కష్టమే..
మనసు మరణించినా శరీరాన్నలా మోసుకుంటూ..
9320. కల చాలా చిన్నదవుతుంది..
సగంరాత్రి ఊహల్లో కరిగిపోతుంటే..
9321. భావాన్ని ఏరి కూర్చాలనుకున్నా..
శిశిరపున్నమిలా కొమ్మల్నిలా చిగురింపజేసింది..
9322. మనసు మీటుతున్న రాతిరొకటి..
అలంకరించుకున్నా జీవితం సాక్షిగా..
9323. ప్రతిసారీ ఓడిపోతూనే ఉంది అస్తిత్వం..
జవాబు తెలీదంటూ ప్రశ్నలు దాటేస్తుంటే..
9324. కురుస్తున్న చినుకులు..
కన్నులు వర్షిస్తున్నాయో..మనసే రోదిస్తున్నదో..
9325. నువ్వో స్పర్శకందని సిరిమల్లెవి..
పరిమళంతోనే మనసుల్ని గెలిచేస్తూ..
9326. నిశ్శబ్దం రాలిపోయింది..
అనుభవాన్ని పాటగట్టి రాగాలాపన మొదలెట్టగానే..
9327. రాగోదయమంటే ఏమోననుకున్నా..
నీ తలపు వేకువని గుర్తించనప్పుడు..
9328. అడవి కాస్తున్న ఊహలు..
ఆమె భావాలకు విలువలేదనుకుంటా..
9329. మౌనంలో దాచుకున్న అనుభూతులెన్నో..
మనసు పెదవిప్పి చెప్పనప్పుడు..
9330. కన్నుల్లో వర్షమిప్పుడు..
మనసెప్పుడు ముసిరేసిందో గమనించనే లేదసలు..
9331. రంగస్థలమైతేనేమి మనసు..
నీ తలపులతో నిత్యసందడి మొదలయ్యిందిగా..
9332. నీ తలపుల అలలంటే నాకిష్టమే..
నా మనసుని ఉప్పేంగేలా చేస్తుంటే..
9333. కరిగిపోలేనా కర్పూరమై నేను..
నువ్వొక్కసారి హారతిగా నన్నవ్వమంటే..
9334. ఎప్పటికీ తెరవాలని లేదు కన్నులు..
నీ జ్ఞాపకాల ముద్రలు మరుగవుతాయని..
9335. నీ ఊసులతో ఊరేగుతూ మనసు..
నా మాట వినేదింక లేదంటూ..
9336. కన్నుల కళ్యాణిరాగం..
రాతిరవుతుంటే అరమోడ్పులతో రాగాలాపనకు సిద్ధమవుతూ..
9337. జ్ఞాపకాలకి దూరమవుతున్నా..
విషాదాన్ని మోస్తూ జీవితాన్ని అనుసరించలేకనే..
9338. ఉషస్సుగా నిన్నూహిస్తున్నా..
మేల్కొలుపు గీతమే నువ్వై మొదలవుతుంటే..
9339. కుంకుమై అలంకరిస్తున్నా..
నీ పెదవుల తీపిదనం అమృతప్రాయమని..
9340. ప్రణయరాధేయమిది..
ప్రేమ ఇద్దరిని ఒకటిగా చూపిస్తుంటే..
9341. నేనే ప్రేరణవుతున్నా..
నీలో సవ్వడించే మువ్వలు నావవ్వాలని..
9342. అలుపెరుగని ప్రవాహమేనది..
జలపాతమై మది తేనెలు జాలువారుతుంటే..
9343. హద్దేముంది భావావేశానికి..
అక్షరాలొకటై ఆనందాన్ని పంచేందుకు పరుగులెడుతుంటే..
9344. ముచ్చటపడుతుందేమో లోకం..
కొన్ని ఆత్మల మౌనాలు సేదతీరాయని..
9345. నీ వలపు నా ఊహాలోకం..
పరిమళానికి కొందవేముంటూ మనసు పారిజాతం..
9346. మనసు గల్లంతయినప్పుడనుకోలా..
ఏదోలా నీలో మకాం మార్చుకుందని..
9347. కన్నీరంటే భయమవుతోంది..
నీ రూపాన్ని తనలో కరిగించుకుంటాయని..
9348. రెక్కలు మొలిచిన తలపెంతో బాగుంది..
విహంగమై ఎగిరి నిన్ను చూడాలనిపిస్తుంటే..
9349. వేణుగానానికి విలువొచ్చిందిప్పుడు..
నీ పిలుపు వాయులీనమై వినబడ్డందుకు..
9350. వలసపోయిందెందుకో మనసు..
వర్తమానపు ఒంటరితనంలోకి తాను రాలేనంటూ..
9351. చిగురిస్తుందనే నమ్మకం లేదిప్పుడు..
ఋతువులు బాధ్యతలు మార్చుకుంటుంటే..
9352. మానసికంగా మనమెప్పుడూ దగ్గరే..
ఎదురయ్యేందుకు ముహూర్తం రాలేదంతే..
9353. మౌనమెక్కడ నేర్చిందో మనసు..
అనురాగాలెన్నో అందంగా వినిపిస్తున్నా..
9354. మౌనం ముడి విప్పాలనుకున్నా..
నీ మదినాకట్టుకుందని తెలీక..
9355. మనసుకి తగ్గ భావాలే మనమందరివీ..
మాలికలమై ఒక దండగా కలిసామందుకే..
9356. అక్షరాల సాయమడుగుతున్నా..
పొడారిపోతున్న గుండెకు కాస్త చెంపరింపునద్దమని..
9357. పూలెన్నో కావాలనుకున్నా మాలికల్లేందుకు..
పరిమళించేదొక్కటుంటే చాలని తెలీక..
9358. వసంతమంటే నవ్వుకుంటుంది మనసు..
విరక్తికి ఋతువులతో సంబంధమేముందని..
9359. నందనవనం నాదే..
నీ తలపులతోటలో నేనున్నది నిజమైతే..
9360. మసకమసకగా నా చూపు..
కొన్ని కలలలా గుర్తుకొస్తుంటే..
9361. ఆశకు పూసిన పువ్వులవి..
పరిమళమందుకే వాడదు ఎప్పటికీ..
9362. నిశ్శబ్దమూ మధురమవుతోంది..
కొన్ని మౌనాల దరహాసాన్ని ఆలకిస్తున్నందుకు..
9363. ఒక్కో రోజంతే..
స్మృతి శకలాలనే మనసు ఏరుకుంటుంది..
9364. స్పందిస్తూనే ఉండాలనుందిలా..
ప్రణయాన్ని ప్రహేళికలా నువ్వు ఆరాతీస్తుంటే..
9365. మనసులు కలవలేదనుకుంటా..
ప్రేమ నల్లపూసయ్యిందక్కడ..
9366. చలి జ్వరమొచ్చినట్టుంది..
నీ మాటలకు మనసుకి ఒణుకుతుంటే..
9367. నా నీడనూ ప్రేమించుకుంటున్నా..
నీలా అనుసరిస్తుందేమోనని..
9368. ప్రపంచానికి దూరం జరిగా..
నీకు దగ్గరవుతున్న కొద్దీ..
9369. ఎన్ని అడుగులు నడిచి రావాలో..
నీ కౌగిలిలో నేను కుదురుకోవాలంటే..
9370. ఏకమవ్వాలనుంది..
నువ్వొక్కసారి నా అనుభూతిని స్వీకరిస్తానంటే..
9371. ప్రపంచంతో పనేముంది..
ఒకరికొకరం తెలుసుకున్నాక..
9372. గుప్పెడైతేనేమి భావాలు..
కవిత్వంగా మారి పరిమళాన్ని పెంచుకున్నాయిగా..
9373. ఆశలందుకే దాచుకున్నా..
నువ్వొస్తే ప్రణయమనే వర్షాలు కురిపిస్తావనే..
9374. ఇన్నాళ్ళకు సీతాకోకైంది నా మనసు..
నిన్ను గెలుచుకున్న నాలో వలపురంగులు..
9375. అక్షరాల తీపినద్దుకోవడమో ఆనందం..
మనసునో వేడుక మొదలెట్టాలంటే..
9376. నే వెన్నెల తాగింది నిజమే..
పెదవి కందడం నువ్వు గమనించావంటే..
9377. వసంతం నవ్వుకుంది..
తనొచ్చినా శిశిరాన్ని కలగనడమెలా సాధ్యామాని..
9378. వర్షం కోసం ఎదురుచూడటం ఆపేసానిప్పుడు..
హరివిల్లుని కోరుకోగానే నువ్వు ప్రత్యక్షమవుతుంటే..
9379. వెన్నెల కురిసినట్లుంది..
మనసు చాటు చందమామవై నువ్వున్నందుకేమో..
9380. చల్లకొచ్చి ముంత దాచినట్టుంది..
కౌగిట్లోకొచ్చి కలొచ్చిందని చెప్తూ..
9381. ఆరోప్రాణముగా నిను దాచుకున్నా..
ఊపిరాగిపోతుందన్న భయం కనుమరుగయ్యిందిప్పుడు..
9382. ఇంద్రధనస్సు రంగులు విడివడ్డాయి..
ఎలాగైనా శూన్యాన్ని నింపితీరాలని..
9383. సిగ్గుపూల దొంతరలో నేనున్నది నిజమే..
కందిన పెదవికి కారణాలు నువ్వడుగుతుంటే..
9384. నీ శ్వాస అందుతూనే ఉందిలా..
ఈ రేయి తెల్లవారనివ్వనంటూ మనకిలా..
9385. అల్లుతూనే ఉండాలనుందీ మాలిక..
నీ తలపులిలా పరిమళిస్తుంటే..
9386. జీవితానికర్ధం తెలిసొచ్చిందిప్పుడు..
వికసిస్తూనే రాలిన పువ్వుని గమనించినందుకు..
9387. చల్లని జాబిలిగా మారింది మనసు..
నీ భావాలతో ప్రేమలో పడ్డట్టుంది..
9388. చెట్టు చిన్నదయ్యింది..
మన చెలిమి ఎదుగుతున్న ఆకాశానికి.
9389. మదిలో మొదలైన భావన..
అక్షరమై అలంకరించాలనే కామన..
9390. నిముషమే నిశ్శబ్దం..
వేల భావనల పుట్టుక ఈలోపునే..
9391. కలలు కొరవడుతున్న భావనలే అన్నీ..
జ్ఞాపకాల జాగరణలో రేయి ముగిసిపోతుంటే..
9392. కలుపుమొక్కల చెలిమి పెరికేసానిప్పుడు..
అసలైన పరిచయం నువ్వయ్యాక..
9393. వేరే ఇతర దైవాల్ని గుర్తుపట్టలేకున్నా..
నా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాక..
9394. అంతర్లోకంలో నువ్వు..
ప్రపంచంతో సంబంధం తెగినప్పటి సంధి..
9395. ఎందుకో జీవితం ఆగినట్టుంది..
నాలో రక్తం చప్పబడినందుకేమో..
9396. శూన్యమెందుకు బెంగపడుతుందో..
అప్పుడప్పుడూ ఆనందాన్ని ఆహ్వానిస్తూ నేనుంటుంటే..
9397. బుజ్జగించలేకున్నా జీవితాన్ని..
చేజారిన వసంతాన్ని జ్ఞప్తికి తెస్తుంటే..
9398. నవ్వితే చాలనుకున్నా నా నేస్తాం..
అతిశయం ఆనందాన్ని పెంచింది నిజం..
9399. అనునయమే నాది..
అలుకల్లో మన అనుబంధం బిగుసుకుంటుంటే..
9400. పావురానికి పంజరం తప్పలేదు..
అశాంతిని తనలోనే దాచుకోవాలనుకున్నందుకు..
No comments:
Post a Comment