Thursday, 5 April 2018

9501 to 9600

9501. సాయంత్రమందుకే ప్రియమవుతుంది..
నీ శ్వాసలో నన్ను చేర్చుకుంటావని..
9502. మౌనమే ఆధారం..
మాటలిప్పుడు పగిలిపోయిన అద్దానికి సమానం..
9503. మనసు ద్రవించి అలసిపోయింది..
విషాదం అనంతమై ప్రవహించినందుకే..
9504. తప్పించుకు తిరుగుతున్న మనిషి..
అంతరాత్మకు ముసుగేసిన మరతనమనుకుంటా..
9505. బంగారు క్షణాలను ఆపలేకపోయా..
జీవితపు పరుగులో గెలవాలనుకుంటూ..
9506. కలల విందుకని తొందరపడుతున్నా..
రేయంతా ఆయాసమెందుకని మనసంటున్నా..
9507. నాలో నిశ్శబ్దమిప్పుడు..
నీ జ్ఞాపకాలు కదిలి నేనేకాకినైనట్టు..
9508. కన్నీటిలో మునగాలనే కోరికేమిటో..
వలపుజల్లుల్లో పులకలెత్తించాలని నేనొస్తే..
9509. పగిలిన అద్దముతో సమానమిప్పుడు..
గాజునదిలా మనసు ప్రవహించినందుకు..
9510. నీ మనసు ముత్యం దొరికింది..
నేనెతికిన నిన్నటి ఆలోచన శిధిలాల్లో..
9511. మోములో వెన్నెలిప్పుడు..
ఏ పున్నమి పెదవులను మీటిందో..
9512. చెలిమిని చిలకరించాలనుకున్నా..
నీ మది మయూరమై నర్తిస్తే చూడాలనే స్వార్ధముతో..
9513. తలచి విలపించడం మానేయాలందుకే..
అర్హతెరుగని మమత దూరమైనప్పుడే..
9514. మల్లెపువ్వులా నవ్వుకుంటున్నా..
మనసుపొరల్లో నా పరిమళాన్ని గుర్తించినందుకే..
9515. నువ్వంటే ముద్దే ఎప్పుడూ..
మురిపాలిందరిలో పంచలేదని అడుగకు..
9516. మయసభలా నా మనసు..
ప్రతికోణంలో నువ్వే అగుపిస్తుంటే..
9517. కరిగిన కలైంది కాలం..
నా ముభావంలో నిన్నొంపుకోమంటూ..
9518. మనసుకుంచెతో గీసిన చిత్రమే నీది..
ఏ ఎండవేడికీ మాగిపోని తడినద్దుకుంది..
9519. మౌనమెక్కడ మిగిలింది మదిలో..
కన్నుల్లో కడలిగా కుదురుకున్నాక..
9520. ఆకాశమెత్తు ఎగిరినట్టుంది..
నీ అనుభూతుల ఊహారూపం నాదైనందుకు..
9521. నీకై సమిధగా మారనూ..
ప్రేమకోసమని యఙ్ఞం మొదలెడతానంటే..
9522. ఆఘ్రాణించగలిగితే మనసు మరువం..
మరచిపోగలిగితే మాట ముత్యం..
9523. చూపులతో రాసుకున్న ప్రేమలేఖలవి..
పెదవులెటూ పల్లవిని పాడుతున్నాయని..
9524. కలలోనూ చెక్కిలిగింతలే..
మనసెప్పుడు మచ్చికైందో నీకు మరి..
9525. అహానికెప్పుడూ తొందరే..
ఆనందాన్ని సైతం ఓడించి గెలవాలనుకుంటుంది..
9526. అంతరంగమెప్పటికీ అదే..
వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోనేందుకు ఆరటమొద్దందుకే..
9527. నీ భావముతో ముడిపడిపోయా..
అక్షరాల అలికిడి మొదలవ్వగానే..
9528. రెప్పవిడనివ్వని కలలు..
నీలిమ కరిగి కౌగిలి చెదురుతుందనే..
9529. కవనమై పరిమళిస్తున్నా..
వేలమాలికలనొక్కటిగా ముడేసావని..
9530. సంక్రాంతొచ్చినట్టే అనిపిస్తుంది..
రైతు మోములో ఆనందం తొణికిందంటే..
9531. కనులందుకే మూసేసుకున్నా..
కొన్ని అనుభూతులు నిక్షిప్తం చేసుకుందామనే..
9532. కలలన్నింటినీ కవిత్వానికిచ్చేసా..
కంచికెళ్ళినా అమరత్వమొస్తుందనే నమ్మకం లేకనే..
9533. ఆరగించేందుకే పుట్టావనుకున్నా..
అదేమో నేనెదురుపడ్డప్పుడల్లా తినేసేలా చూస్తుంటే..
9534. అంతరాత్మను చంపుకోవాలేమో..
కలలోకీ నువ్వు రానని మొరాయిస్తుంటే..
9535. కంటిపాపలో నేనుండిపోతాను..
నీ మదిలో తొలిదీపమై వెలగమంటే..
9536. నిన్నూ నన్నూ కలిపిన వేకువది..
మదిలోని చీకట్లను గతానికి వదిలేస్తూ..
9537. మనసు చకోరమే నీ కొరకు..
కొన్ని ఊసులారగించి ప్రాణం నిలుపుకుందామని..
9538. తడిచినందుకు హర్షం..
నీ జ్ఞాపకాలతో మనస్తాపం తీరిందని..
9539. ప్రతి బొట్టులో నీ రూపమే..
జారనివ్వొద్దని వేడుకున్నా కన్నులు రాల్చేస్తుంటే..
9540. మధురమైన క్షణాలే..
మనకని దాచుకున్న కొన్ని అనుభూతులన్నీ..
9541. నీ చూపు తడిమినట్టుంది..
నువ్వెక్కడున్నా మనసు గిలిగింతలవుతుంటే..
9542. అందుకున్నా కావ్యాంజలి..
నన్నో తపస్సుగా రాస్తున్న వైనానికి..
9543. అనునిత్యం నీ ఊహలోనేగా..
కనుమరుగవుతావని కంగారెందుకీ జీవితానికి..
9544. విషాదమెన్నడో వెనుదిరిగింది..
సంతోషాన్ని పిలవడం తనకు నచ్చలేదంటూ..
9545. కలలతో సరిపుచ్చుకుంటావెందుకో..
కౌగిలిలోకి రమ్మని చెలిని పిలవకుండానే..
9546. ప్రతి పదంలో నిన్నే రాస్తా..
నా ప్రేమతో నిన్ను అభిషేకించాలని..
9547. నేనో వెన్నెలనై వెలుగుతుంటాను..
నువ్వో నిశీధిలో కొట్టిమిట్టాడావంటే..
9548. మనసంతా పండుగే..
నువ్వుంటే సంక్రాంతొచ్చినట్టేగా..
9549. అధరానికి సాటొచ్చే మధురమేది..
అమృతం తాగాలని మనసనుకున్నాక..
9550. ఆమె లోకంలో శాంతి నిండింది..
కొన్ని ఆరాటాలు అనవసరమని ఒదిలించుకున్నాక..
9551. వెలుగునీడలుగా నువ్వూనేనూ..
కొన్ని అబద్దాలను నిజం చేస్తూ..
9552. ఆనందం అంతరిక్షానికెళ్ళింది..
నువ్వు పరిచయించినందుకేమో..
9553. స్మృతికావ్యాన్ని మొదలెట్టాలనుకున్నా..
వేదన ప్రవహించడం మొదలవుతుందని తెలీక..
9554. నాడు నిజమనుకున్న అబద్దం..
నేడు వాస్తవమైన విషాదం..
9555. నీ కనులు వర్షించడం బాగుంది..
నన్ను ప్రేమతో నిలువెల్లా తడుపుతున్నందుకేమో..
9556. గమ్యమెంత దూరమైనా బాధలేదిప్పుడు..
నీ మనసు తోడయ్యిందనుకున్నాక..
9557. మనసెప్పుడూ చంద్రోదయంలా ప్రకాశిస్తుంది..
నువ్వుంటే రేయింబవళ్ళ గమనింపెందుకంటూ..
9558. నీ మనసు ముసరడం గుర్తించలేదు..
నా చిరునవ్వుల తన్మయత్వంలో తడపాలనుకున్నానంతే..
9559. ఆరాటమెక్కువే ప్రతీ మనసుకి..
అమరత్వమిచ్చే అధరామృతం దక్కించుకోవాలని..
9560. జ్ఞాపకాల ప్రవాహంలో కొట్టుకుపోవాలనుంది..
అడుగడుగునా కవితలు పొర్లుకొస్తుంటే..
9561. ఆహ్లాదమే మరి మనసుకెప్పుడూ..
వలపు జల్లై కురిసినప్పుడల్లా..
9562. గల్లంతైన గుండెనిప్పుడే కనుగొన్నా..
అనుసరిస్తున్నది నీ అడుగులనేనని..
9563. తెంపేసుకున్నా రెక్కలను..
తలపులుగా వాలినా నిర్లక్ష్యమవుతున్న పాపానికి..
9564. వెన్నెలతో వైరమొద్దెప్పుడూ..
చితికిపోయిన చందమామతో రేయి ప్రకాశించదప్పుడు..
9565. ముద్దులన్నిటా నిన్నుంచేసుకున్నా..
కొన్ని పరవశాలు మనకే సొంతమవ్వాలని..
9566. మరుపొక వరమే మనసుకు..
కాలమే గాయాలకు లేపనమవుతూ..
9567. అక్షరాలతో అనుబంధముండాలందుకే..
అనుభూతికి దాసోహమవ్వాలంటే..
9568. మౌనరాగాలు మొదలయ్యాయిక్కడ..
భావాలు పాటలై నిన్ను చేరాలనుకున్నాక..
9569. వలపు చెరిసగం..
ఒక్కటైన మనసు ఇద్దరమూ పంచుకుంటుంటే..
9570. భావమందుకే పులకించింది..
అక్షరాలతో వేసిన బంధం శాశ్వతమవుతుందని..
9571. ఉన్నాయిగా పాదముద్రలు..
జతగానే అడుగులేద్దామంటూ నా చరణాలు..
9572. కన్నీటిదే సందేశమో..
నీ జ్ఞాపకాలు మదిలో ఊరినప్పుడల్లా..
9573. పదేపదే చదువుతున్నానదే సందేశం..
రోజుకో కవితలా నన్నలరిస్తుంటే..
9574. ప్రవహించడం ఆగిందక్కడ జీవితం..
సుడిగుండాన్ని తప్పించాలనే ప్రయత్నంలో..
9575. మౌనం ముంచెత్తుతోంది..
నీ ఊహ నాలో కరుగుతున్నప్పుడల్లా..
9576. నా సన్నని నవ్వుల కలకలం..
నీ రాతిరికేం కావాలిక కలస్వనం..
9577. నా కలలో నువ్వే రాకుమారుడివి..
రాజ్యమంటూ ఏదీ వాస్తవంలో లేకపోయినా..
9578. ముక్కలు చేయక తప్పలేదు మౌనాన్ని..
ఒక్కటైన మనసుల్ని వేరు చేయలేక..
9579. చిగురేసింది చెలిమేననుకున్నా..
చిత్తాన్ని చిత్తడిచేసి చెంగల్వలిస్తాయని తెలీక..
9580. నీ కౌగిలే నా జీవితమనుకున్నా..
హేమంతం అధిమైనా ఆనందంగానే నేనున్నా..
9581. ఝాములెన్ని గడిచినా ఏముంది..
కలలోకెన్నడూ నువ్వు రాకుంటే..
9582. ఋతురాగాలనిప్పుడు ఆలపిస్తున్నా..
స్వరాల్లో కొత్తదనం మనసుని మీటిందని..
9583. సంకల్పించిన ఆశలో నీవు..
ఆశయాన్ని పండిస్తావన్న నమ్మకంలో..
9584. పరిమళిస్తున్న హృదయమిక్కడ..
నీ జ్ఞాపకాల గులాబీరేకుల మత్తుల్లో..
9585. నీ భావాలు వర్షించినప్పుడనుకోలా..
మనసు తడుస్తున్నది ఆనందంలోనని..
9586. జాజుల జాతరకు పిలుస్తావనుకున్నా..
స్మృతిగానైనా నీలో మిగిలున్నానంటే..
9587. నిలిచిపోతే బాగుండు కాలం..
నీ నవ్వులు సొంతమయ్యేంతవరకూ..
9588. చెలమగా నిండిపోతున్న మనసు..
అశ్రువులు ఆగకుండా కురిసినందుకే..
9589. నా సిగ్గుకి దాచుకోవడం తెలీనట్టుంది..
నీ చూపుల ఆరాలకి బయటపడుతూ..
9590. గుండెల్లో మెదిలిన భావనిది..
గుప్పెడంత ప్రేమనై నీతోడుండాలని..
9591. ఎప్పటికప్పుడు జీవితమంతే..
క్షణికమైన బంధాలనే చిక్కులే  కావాలంటుంది.. 
9592. ప్రకృతినై నవ్వుతున్నా..
నీ చూపులకు ఆనందమై నేనుంటుంటే..
9593. విషాదమైనా ఆనందమే..
నన్ను కోల్పోయి నీకు దగ్గరయ్యానని...
9594. మనసందుకే ఇవ్వాలనుకున్నా..
వికసించిన గులాబీలకు నువ్వు నాయికవని..
9595. నీ సమక్షాన్ని వద్దనుకున్నది నేనే..
ఎంతసేపూ శిశిరానివంటూ నన్ను నిందిస్తుంటే..
9596. ఋతువులతో సంబంధం లేదంది ప్రణయం..
నువ్వుంటే ఎప్పటికీ దరిచేరదుగా విరహం..
9597. మనసెప్పుడు అనుసంధానమైందో..
నీ కనుసైగల పాటలు ఆలకిస్తూ..
9598. రాతిరైనప్పుడే అనుకున్నా..
కలగా నువ్వొస్తే కన్నులకు సంతోషమని..
9599. నిన్ను శ్వాసితున్నందుకేమో..
నన్ను పోగొట్టుకున్నా బాధేమీ లేనట్టుంది..
9600. ఈ జన్మకింకేం కావాలి..
నా నవ్వుల కోసమని మరో జన్మెత్తాలని నీకనిపిస్తుంటే..

Virus-free. www.avast.com

No comments:

Post a Comment