9101. సరాసరి వెన్నెల్లోకే..
నీ మనసిప్పుడు పున్నమిగా పిలుస్తోందిగా..
9102. కలగానే మిగిలిపోతాలే..
వరమై వచ్చినా వరించేందుకు ఆలోచిస్తావంటే..
9103. పరిచితులమే ఒకప్పుడు..
అపరిచితులమైనట్టు నటించక తప్పదు అప్పుడప్పుడు..!
9104. పరవశించటం మానలేకుంది మనసు...!
కురుస్తున్నవి కవనాలు కల్లోనైనా..
9105. పరవశించటం మానలేకుంది మనసు...!
లాలిత్యమంతా ఊహకే పరిమితమవుతున్నా.
9106. పరవశించటం మానలేకుంది మనసు...!
చంద్రోదయమవుతుంటే గిలిగింతలు మొదలన్నట్టు..
9107. గుండెలోతుల్లోనూ పరిమళమిప్పుడు..
వెల్లువవుతున్న నీ తలపులు గంధాలవుతుంటే..
9108. నిండుజాబిలేనేమి..
పదహారుకళలు మాత్రం ఆమెలో కరువైనాయట..
9109. ఇన్నాళ్ళూ అమ్మ నాజూగ్గా ఉందనుకున్నా..
పస్తున్నప్పుడు తెలిసింది ఆకలి చంపుకునుందని..
9110. కథలు చదువుకున్న పుస్తకం చిరిగిపోయింది..
ఊహలకు రెక్కలుండవంటూ కాలం కదిలిపోయాక..
9111. ముసిరిన మేఘానికే తెలుసేమో..
కురుసేందుకనొచ్చి ఎందుకు వెనుదిరిగిందో..
9112. నిశ్చల సరస్సునే నిన్నటివరకూ..
నువ్వొచ్చి గిలిగింతలు విసిరేవరకూ..
9113. పండక్కని ఎదురుచూపుల్లేవిప్పుడు..
నీ కన్నుల్లో నక్షత్రం నేనయ్యాక..
9114. కలస్వనం నీదయ్యిందిగా..
స్వరం కలపమని కోయిలనై నేనడిగినందుకు.
9115. ఎటు ప్రవహిస్తుందో తెలియని రుధిరం..
మనసంతా నిండిన నిన్ను అభిషేకిస్తానంటూ..
9116. మనసయ్యింది నిజమే..
అరచేతిలో గోరింటాకుగా పండింది నువ్వేనని..
9117. తప్పని మందహాసం..
ఆకలినాపుకుంటూ జీవిత పోరాటాన్ని సాగించడం..
9118. మూడుముళ్ళతో ముడేసినప్పుడనుకోలా..
మూణ్ణళ్ళ ముచ్చట్లలో చివరికి ఒంటరవుతానని..
9119. జన్మలెన్నైనా వద్దనుకుంటున్నా..
ఈ ఒక్కజన్మ నీతో తరించి మట్టిలో కలిసిపోవాలనే..
9120. ఉప్పుతో దృష్టి తీస్తాడనుకున్నా చంద్రుడు..
తారలనే చుట్టూ తిప్పిస్తాడని తెలీక..
9121. ఎన్ని కలలని దాచుకోవాలో నేను..
కథగా రాస్తే చదివేవారుంటారో లేదోనని..
9122. ఎన్నిసార్లు మూగబోయిందో ఆ మది..
కన్నీరు గొంతులో అడ్డుపడ్డ విషాదంలో..
9123. నీ జ్ఞాపకాల నావలో నేను..
విహరించేందుకు మనసు నిన్నే కోరుతుంటే..
9124. నవ్వుకున్నాలే..
నన్నో పువ్వుగా వర్ణించి నీవైపు తిప్పుకున్నావని..
9125. నీ చూపులకలవాటు పడ్డందుకేమో నేను..
అక్షరాలు మరచి కళ్ళను వెతుక్కుంటూ..
9126. మౌనమో పరిమళం..
అగరుధూపమై నిన్నల్లుకోవాలనే నా కొంటెదనం..
9127. అశ్రువులంటే కన్నులవే..
ఆనందానికైనా..విషాదాన్నయినా ఇట్టే వర్షించేందుకు..
9128. కలమెందుకు కంపిస్తుందో..
మనసుని అక్షరంగా రాస్తున్న ప్రతిసారీ..
9129. కాలమాగి చూసే క్షణాలంటే ఏమోననుకున్నా..
తన మౌనాన్ని అనుభూతించడం నేర్వనప్పుడు..
9130. కాలానికెప్పుడూ కంగారే..
రోజులనుకున్నవి కాస్తా క్షణాలుగా మర్చేయగలదు..
9131. భావాన్ని బంధించాలనుకున్నావేమో..
అక్షరానికి స్వేచ్ఛివ్వలేదని వాపోతున్న జనం..
9132. శిధిలం కాని జ్ఞాపకాలే నీవన్నీ..
నాకు ప్రాణాధారమై నడిపిస్తున్నది నిజమైతే..
9133. నా మనసు నీకిచ్చినప్పుడే అనుకున్నా..
గులాబీని చేసి భద్రంగా దాచుకుంటావని..
9134. విజయమెప్పుడూ తథ్యమే..
ఆలోచనలో అపనమ్మకానికి చోటనేదే లేకుంటే..
9135. వానాకాలమంటే నాకిష్టమవుతుంది..
చెలికాడు తొలిసారి కలిసిందప్పుడే మరి..
9136. వరదనై రాలేదందుకే..
నువ్వు మునిగితే నేనొంటరై మిగిలిపోతాననే..
9137. వసంతం విరహబూసినట్టుంది..
వేలవర్ణాల మైమరపు నీ తలపుదవుతుంటే..
9138. జారుతున్న వెన్నెలనే..
నిన్ను తడపాలనుకున్న ప్రతిసారీ జాబిల్లినై..
9140. వర్షించేందుకు సిద్ధమైపోయా..
నే కల్పించుకున్న కలలన్నీ కల్లలవుతుంటే..
9141. తలుపులు తెరిచే ఉంచుతా ఎన్నాళ్ళయినా..
తపనలు తీర్చుకొనేందుకు నువ్వొస్తావనే నమ్మకంతోనే..
9142. మాట విననంటూ మనసు..
ప్రేమలో పడ్డ సంబరాల్లోనున్నట్టుంది
9143. సంతోషం వానై తప్పక కురుస్తుంది..
ఋతువేదైనా అనుభూతుల మధువును ఆస్వాదించాలంతే..
9144. ఎన్ని భావాలని దాచుకోవాలో సగటు స్త్రీ..
నిశ్శబ్దానికి ప్రతినిధినంటూ లోకాన్ని సంతృప్తి పరిచేందుకు..
9145. తళుక్కుమంటూ తారలు..
ఋతురాగాపు పులకింతలతో రాత్రిని మైమరపిస్తూ..
9146. నవ్వులన్నీ నిండుకున్నాయిక్కడ..
మనవనుకున్న క్షణాలలో నేనొంటరిగా మిగిలాక..
9147. ఆ మనసాకాశంలో ఎప్పుడూ మబ్బులే..
ఆనందం ఎన్నడైనా కురుస్తుందో లేదోగానీ..
9148. మాటలు మరచింది నా మనసిక్కడ..
నీ మౌనాన్ని చదివే ధ్యాసలోపడి..
9149. అక్షరాలతోనే అనుబంధమిప్పుడు..
అపార్ధంతో అనుకున్నోళ్ళు దూరంగా జరిగినందుకు..
9150. చీకటిలో కదిలే బొమ్మల్లో నువ్వు..
పగలంతా పలకరింపులేక నన్ను అల్లాడిస్తూ..
9152. ఆరబెట్టుకోవడం అనవసరమనుకున్నా..
నీ తలపులవానలో తపనలు తీరుతున్నట్లనిపించాక..
9153. నీ మనసు గులాబీ అనుకున్నందుకేమో..
మాటలు ముళ్ళై గుచ్చుకుంటున్నా లెక్కచేయలేకున్నా..
9154. జ్ఞాపకాల జాడే లేకుంది..
మనసు మునకలైన చిందరవందరలో..
9155. నీ మౌనాన్ని ఆలకిస్తూ నా మది..
ఏ రాగంలో శృతి చేసావోనని అవలోకిస్తూ..
9156. మనువు కలిపిన మనసులేగా మనవి..
మూడుముళ్ళందుకే ముప్పయి జన్మలకు సమానం..
9157. ఆకాశమవుతోంది అందం..
నీ మౌనాన్ని చెదరగొట్టాలనే సంకల్పమదేమో..
9158. నా కన్నుల దీపాలు వెలిగించా..
నీ స్వప్నాల్లో వెలుగు నాదవ్వాలని..
9159. జాబిలివంటుంటే భయమవుతోంది..
నెలవంకగా మారి నేనెటు కనుమరుగవుతానోనని..
9160. చినుకులంటే నాకిష్టమందుకే..
నీ ఊహల తలంబ్రాలను తలపిస్తాయనే..
9161. మల్లెల పరిమళమెందుకో మారింది..
ఇరుశ్వాసలతో పోటీ పడలేకనేమో..
9162. మాటలకర్ధం తెలిసింది..
నీ మౌనం వలసెళ్ళిందని తెలిసాక..
9163. మౌనాన్ని వీడనంది మది..
అపహాస్యానికి నిశ్శబ్దమే సమాధానమనుకుంటూ..
9164. నా పెదవులందుకే నెలవంకలు..
అప్పుడప్పుడైనా నువ్వు తొంగిచూస్తున్నావని..
9165. వసంతం దూరమైందిప్పుడు..
కలలు కరువైన రాత్రులు బరువెక్కినందుకు..
9166. మాలికలతో మనసు చేరేస్తున్నా..
ఇష్టమైతే మాట కలుపుతావనే..
9167. మనసు పగిలినట్టుంది..
ఆ నిశ్శబ్దం సవ్వడంతే మరి..
9168. రాతిరికోసమని ఎదురుచూస్తున్నా..
ఆ పాట నాకూ వినబడుతుందేమోనని..
9169. చెలి నవ్వులు చక్కెరతీపులు..
చెక్కిలిగింతలు ఆపినా ఆగవు..
9170. స్మృతులు బెంగపడ్డదెప్పుడు..
మనసంతా నువ్వు అల్లిబిల్లిగా కలిదిరుగుతుండగా..
9171. కనుపాపకి నేర్పుకున్నా..
ఏ వేళలో నువ్వేం చేస్తుంటావోనన్న ఊహను చిత్రించుకోమని..
9172. నిదురో కలగా మారింది..
రెప్పలు మూతపడనని మొండికేస్తుంటే..
9173. మల్లెలమాసానికి పరవశాలు కొత్త కాదుగా..
చెలికాడు అలిగినప్పుడల్లా చెలి అనునయమవుతుంటే..
9174. గ్రహపాటుని తిట్టుకోలేకున్నా..
అలుకను నటించలేక అలసినప్పుడల్లా నేను..
9175. ఒక్కోసారంతే..
తప్పించుకోవాలనుకున్న క్షణాలకు పట్టుబడిపోతుంటాము..
9176. కన్నీరు తీపవుతుంది..
కన్నులాపలేక నేలజారి వేదనను కడిగేస్తుంటే..
9177. హిమవన్నగానికో అందమబ్బింది..
హేమంతం రాలి చక్కెరపూతలు అద్దినట్టుంటే..
9178. ఉలికదలికలు మరువకున్నందుకేమో..
ప్రాణమున్న శిల్పాన్ని వీడి రాళ్ళను చెక్కాలని చూస్తుంటావు..
9179. ఒంట్లో పంచదార తగ్గినప్పుడే అనుకున్నా..
నా సోయగంలో సగం నీకిచ్చెద్దామని..
9180. నా మనసు గులాబీ అయింది..
పువ్వులపండక్కి నువ్వు రానున్నావని కబురందగానే..
9181. పునర్జన్మించాలనుంది..
నాపై నీ ప్రేమ పరిమళమై గమ్మత్తుగా తోస్తుంటే..
9182. ప్రకృతితో వాదిస్తున్నా..
శరత్తులో వెన్నెలకడ్డుగా ఈ వర్షమేంటని..
9183. ఈ కావ్యమెన్నడు పూర్తవుతుందో..
ఊహలు పొలిమేరల్లోనే ఆగిపోతుంటే..
9184. నెలరాజు ఒంటరవుతాడనుకోలేదు..
తారలన్నీ ఒకేసారి మబ్బులమాటుకి చేరిపోగానే..
9185. పరవశిస్తూనే ఉన్నా..
చిరునవ్వుల పరిమళంతో మాయ మొదలయ్యిందని..
9186. రసవాహినిగా జీవితం..
మది నిండుగా ప్రవహిస్తున్నవి నీ తలపులు కనుక..
9187. వెలుతురు ఉడుక్కుందట..
చీకటిలో నీ నిశ్చింత రెట్టింపయ్యిందని..
9188. అడుగులు నేర్పాలేమో ఋతువులకిప్పుడు..
గతితప్పి అపసవ్యంగా కదులుతున్నందుకు..
9189. మనసు రవళింతకింత మాధుర్యముందని తెలీదు..
కొన్ని జ్ఞాపకాలు మెత్తగా గుసగుసలాడుతుంటే..
9190. ప్రతికథలోనూ చెలికత్తెలేగా..
కలనైనా తనచోటు పదిలమనుకుందేమో చెలి..
9191. పరభాషలో పరవశముందిగా..
మాతృభాషందుకే పరిమితం..
9192. జతకట్టేందుకు జరిగానందుకే..
మోహనరాగాన్ని సందేశంగా తను వినిపించగానే..
9193. మేఘమందుకే తరలినట్లుంది..
వర్షంలో తడవాలని లేదని నువ్వన్నందుకు..
9194. ప్రబంధాలు నచ్చవన్నావుగా...
నా కన్నులను చదవడమెందుకు మొదలెట్టావెందుకో..
9195. కన్నులతో కురుస్తావనుకోలేదు..
నాకేదో తడిచేందుకు మనసయ్యిందని నేనంటే..
9196. ఈరోజెందుకో ఉస్సూరుమంటుంది..
నిన్నటిదాకా స్పందించిన హృదయమే మరి..
9197. ఎన్ని శిల్పాలని చెక్కమంటావో..
శిలలన్నీ నీ రూపాన్నే సంతరించుకున్నా..
9198. నాలోని దైవాన్ని ప్రశ్నిస్తున్నా..
మానవత్వాన్ని నువ్వు శంకించినప్పుడల్లా..
9199. ఊగిసలాడుతూనే ఉందింకా మనసు..
కలల కౌగిలింతలో మెలకువొద్దనుకొని..
9200. అక్షరాలకో అందమొచ్చింది..
నీ భావాలతో సరితూగి మురిసినందుకే..

No comments:
Post a Comment