9701. విషాదానికి మాటలు రావనుకుంటా..
అందుకే విలపిస్తూంటుంది ఏవేళనకా..
9702. జన్మలుంటాయంటే అబద్ధమనుకున్నా..
ఈ జన్మకు నన్ననుసరించి నువ్వొచ్చేవరకూ..
9703. తలచినకొద్దీ అమృతాలు తన స్మృతులు..
ప్రతిరేయీ కురిసేవైనా ఎప్పటికప్పుడు ఆనందాలు..
9704. మనసులు మమేకమైతే చాలనుకున్నా..
సొగసుల సిరికానుక సగమిద్దామని..
9705. ఈదక తప్పలేదు సంద్రాన్ని..
నడిమధ్యలో జీవితన్ని చాలించలేననుకొని..
9706. వియోగానికి భరోసా..
వసంతమై నువ్విచ్చేస్తావనే చిన్నిచిన్ని ఆశల్లో
9707. మందాకినిగా మారింది నాలో వలపు..
నీలో కలిసేందుకు అతిగా ఉరకలేస్తూ..
9708. పొద్దుపోవడంతో పనిలేదసలు..
పిల్లల పదనిసల్లో పదం కలుపుతుంటే..
9709. రాతలతో కుదురుకుంటున్న బంధాలు..
మౌనాన్ని పదాలుగా అనువదించుకుంటూ..
9710. అప్పుడప్పుడు అలిగిన మేనకనే నేను..
నన్ను పట్టించుకోక తపస్సులో మునిగినప్పుడల్లా..
9711. చక్కెర తీపి దానిమ్మనే నేను..
పెదవులు పండించుకోవాలనే కోరిక నీదవ్వాలంతే..
9712. అరమోడ్పులకే మత్తిల్లిపోతావెందుకో..
తేరిపార చూస్తే ఎన్ని గాయాలపాలవుతావో..
9713. ఊహలకెందుకో కలవరం..
నీ అక్షరాల్లో తాము ఒదగలేకపోతున్నామని..
9714. పంచదార చిలకనయ్యానందుకే..
పలుకు తేనెలన్నీ పాటగా ధారపోసేందుకే..
9715. నా కులుకును అనుసరిస్తూ కోయిల..
వసంతానికన్ని ఋతువులు దాటే అవసరమెందుకని..
9716. తీపి పల్లవులతో పడగోడతావెందుకో..
పరవశించేందుకో క్షణమన్నా ఇవ్వకుండానే..
9717. వలపుజల్లుకని వేచున్నా..
నీ తలపున తడవాలనే ఆరాటంలో..
9718. వానందుకే వచ్చినట్టుంది..
నా కన్నీళ్ళెవ్వరికీ కనబడకుండా దాచేందుకు..
9719. ఎన్ని చినుకుల్ని చేరదీసానో చేతిలో..
నీ జ్ఞాపకాలుగా దోసిలి నింపుకోవాలని..
9720. నీ పెదవంచు నవ్వునై పుట్టాలనుకున్నా..
కొన్ని అనుభూతులు నాపరం చేస్తావని..
9721. కొన్ని నిజాలు నమ్మబుద్ధి కావు..
కష్టాన్ని ఇష్టంతో జయించడం సులువుకానట్టు..
9722. మధుపం చుట్టుముట్టినట్టు నీ చూపులు..
మరందాన్ని దాచలేనంటూ నును సిగ్గులు..
9723. నీ చేతిలో రేఖనై నేనుండిపోనా..
ప్రతిక్షణం పెదవులతో నన్ను తాకుతావంటే..
9724. నా పెదవులు చదవగలిగిన మంత్రపుష్పం..
నీ రెప్పల్లో దాచుకున్న అనురాగం..
9725. గతమెప్పుడూ గాయమే..
నిదురలోనూ మరవనివ్వక వేధించు స్వప్నమే..
9726. నిదుర చెదిరినప్పుడే అనుకున్నా..
ఊహించని స్వప్నమొకటి ఛెళ్ళుమనిపించిందని..
9727. నిన్న మొన్నల సంగతి నీకెందుకిప్పుడు..
రేపు కలిసుండాలనే ఆకాంక్ష మనదైనప్పుడు..
9728. కథలు చదివేసుకుంటా నీ కన్నుల్లో..
మన ప్రేమ రహస్యాలు కనపడతాయని..
9729. నీలో నేనై పల్లవిస్తున్నా..
ఒక్క పాటగానైనా పాడుకుంటావనే..
9730. గుట్టుగా ఉంటేనేం..
నీ గుండెల్లో దేవిరినైతే నేనేగా..
9731. మనసు కురిసిందంటే ఏమోననుకున్నా..
కన్నులు వెచ్చగా మారేంతలోనే..
9732. నిశ్శబ్దమై నువ్వుంటేనేం..
సంగీతాన్ని ఆలకించే నేర్పైతే నాకుందిగా..
9733. కథలోనే రాకుమారి..
నిజానికి తనో మనసు కాజేసిన సొగసరి దొంగ..
9734. సడలిందేమో నమ్మకం...
గుండెలోతుల్లోని విషం బైటకు చిమ్మగానే..
9735. సడలిందేమో నమ్మకం...
పురుషాహంకారాన్ని అలంకారమంటుంటే..
9736. సడలిందేమో నమ్మకం...
బలహీనమైన బంధాల్ని ముడేయాలనుకున్న క్షణాల్లో..
9737. వలపు దక్కించుకుంటా నీ ప్రేయసినై..
నా అనురాగానికి తల ఊపావంటే..
9738. నీ చూపులకే నా బుగ్గలెర్రన..
కొన్ని నవ్వులు పంచితే నేనేమవుతానో..
9739. తనువాపలేని వింత మోహాలు..
కలలు సవ్వడిస్తున్న రేయిలో..
9740. నీ చూపులకే తడబడుతున్నా..
ఎన్ని భావాలు చదివేస్తావోనని..
9741. మదిలో దాచుకున్న తలపులు..
ఎక్కిళ్ళు బయటపెట్టి అల్లరవుతుంటే..
9742. అడుగులకు మడుగులొత్తలేక ఛస్తున్నా..
నీ అల్లరి శృతిమించిపోరాదనే..
9743. మనసులో మోగుతున్న సరిగమలు..
నీ నవ్వులిచ్చిన చక్కిలిగిలిగింతలు..
9744. మనసు గుట్టెవరికి తెలుసు..
మహాసంద్రమై పరవళ్ళు తొక్కుతుంటే..
9745. వసంతమంటే ఎక్కడో వెతికేది కాదు..
మంచిమనసుల్లో పచ్చగా పరిమళిస్తుంది చూడు..
9746. చేరినవన్నీ చేజార్చుకోకు..
చెలిమి చేతులు విడిపోతే కలిసేవికావు..
9747. నువ్వంటే ప్రాణం..
మనసందుకే దాసోహం..
9748. జీవితం కానుకయ్యింది..
నీ మదిలో సుస్థిరస్థానం నాదవగానే..
9749. ప్రణయంతో ఏకమైన మనమిద్దరం..
అనుబంధానికిద్దాం అందమైన నిర్వచనం..
9750. చెలికాడైతేనేమి..
విలుకాడై పొడుస్తుంటే క్షమించేదే లేదు..
9751. వాడెప్పుడూ వ్యాధిగ్రస్తుడనక తప్పదు..
దుష్టాలోచనలు వెంటేసుకు తిరుగుతుంటే..
9752. కలసిన మనసులెన్నడో దూరమయ్యాయి..
ముచ్చటైన మాటలు ముగిసిపోగానే..
9753. కన్నులు కాదనుకున్న కలవేమో నీవు..
నిదురని దరిచేరనివ్వని నా రాతిరిలో..
9754. అనుబంధమందుకే గెలిచింది..
రెండు గుండెల ఏకస్పందన సాక్షిగా..
9755. ఎడారిలోనూ పూలు పూయించగల భావాలు..
నీ వలపు పుణ్యమేనంటే నమ్మవు..
9756. ముందుకొస్తావని ఆశిస్తున్నా..
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా..
9757. నిశ్శబ్దమే నేస్తమయ్యింది..
నాదనుకున్న నువ్వు నిర్దయగా దూరమయ్యాక..
9758. వేసవిగాలంటే మక్కువవుతోంది..
నీ తలపుల తోడుగా ప్రసరిస్తుంటే..
9759. తొలిముద్దు తీపి తెలుసుకున్నా..
తొలిచూపు చుంబనాలు చేరువైనప్పుడు..
9760. మౌనం ఓడిపోయేట్టుంది..
మనసు నీతో ఊసులు మొదలెట్టిందిగా..
9761. స్వప్నలోకం వీడి రానంటూ మనసు..
వాస్తవంలో రాబందులతో కలిసి బ్రతకలేక..
9762. ఈ జన్మలోనే మనమిలా..
గతజన్మలో నింగిలోనో..సంద్రంలోనో..
9763. అపరిచిత లోకమే ఇక్కడంతా..
అభిమానపు ఆచ్ఛాదన విడిచేసాక..
9764. రెప్పపాటు వానకే సోలిపోతూ కనులు..
అంతులేని ఆవేదన మోస్తున్న మనసేమవ్వాలో..
9765. రంగులద్దుకున్నా నాకు నేనే..
నాలో సగమంటూ ఆకాశమనగానే..
9766. ఏం వెతుకుతున్నావో అంతలా..
అరచేతిలోని గోరువెచ్చదనాన్ని ఆస్వాదించకుండా..
9767. గతజన్మ బంధమని గుర్తొస్తుందిప్పుడు..
నీ స్పర్శలోని మృదుత్వానికనుకుంటా..
9768. లేతవెన్నెలనద్దుకున్న కలలే నావి..
నిన్నందుకే తాజాగా పలకరించినవి..
9769. మెలకువలోనూ కలగంటున్నా..
పిచ్చంటున్నా పట్టించుకోకుండా...
9770. మెరుపు కలల సందేశం నాది..
మనసు పెడితేనే నీకు అవగతమయ్యేది..
9771. కన్నీటి రుచి మరిగింది మది..
ఏదో రకంగా ఏడుస్తూనో నవ్వుతూనో..
9772. ప్రతికధలో నిన్నే రాసుకుంటా..
నాకిష్టమైన నాయికవి నువ్వంతే..
9773. బ్రహ్మరాత చదవడం మానేసానెప్పుడో..
నుదుట ముడతలు ఎక్కువైనప్పట్నుంచీ..
9774. నీ మౌనమొచ్చి గిచ్చుతోంది..
నాలుగుమాటలు ఆడేందుకు రమ్మంటూ..
9775. ఏ పరవశాన్ని దాచుకోవాలనో..
నవ్వులను రట్టుచేస్తూ పెదవులు..
9776. ఎన్ని కోట్ల క్షణాలు కరిగిపోయాయో..
నీ నిరీక్షణలో నా పరితాపాలుగా..
9777. ముద్దులెన్ని మూటగట్టాలో ఇప్పుడిక..
ఇచ్చినవన్నీ వడ్డీలుగానే జమేస్తుంటే..
9778. క్షణకాలం చాలుగా నీ చూపులకి..
నా బుగ్గలకు అంటించేందుకు ముద్దరని..
9779. పులకింతలన్నీ సంగీతాలు..
నేను స్పందించానని చెప్పేందుకే సంకేతాలు..
9780. మట్టి మొలకేయకేమవుతుంది..
చెమటచుక్కను పీల్చుకుని బలం పుంజుకున్నందుకు..
9781. పగటికలల్లో నేను..
పట్టెడు మెతుకుల వేటలో తను..
9782. ఎక్కడికక్కడ దాచేసుకున్న స్మృతులు..
గుర్తొస్తే కన్నీరు కడిగేయగలదని..
9783. కలలతో పోటీపడకిప్పుడు..
కవనానికి మకుటం చేస్తా నిన్నొకప్పుడు..
9784. నీ కవితలందుకే చదువుతుంటా..
నన్నెంత తుంటరిగా రాస్తుంటావోనని..
9785. నీకోసమనే కవితను మొదలెట్టా..
నువ్వెప్పుడో కవిత్వమయ్యావని తెలీక..
9786. మనసంతా మనమే..
కలలైనా కమనీయమే..
9787. పగలూరేయీ ఒకేలాగుంది..
కలలంటూ కనడం మొదలెడుతుంటే కనులు..
9788. వరాలిచ్చి నవ్వుకుంది రేయి..
మనలో సిగ్గులు దోచుకోవాలని..
9789. పెదవుల పలవరింతలే పలుమార్లు..
విరహవేదన తాళలేక తిట్టుకుంటూ..
9790. వందనాలంటూ వడ్డించుకున్నా వయస్సు..
తీయందనాలు కోరుతుంటే సొగసు..
9791. ఒక్క మంత్రమైనా మేలే..
నువ్వు వశమవుతావంటే చాలు..
9792. నిరీక్షణే ఋతువంతా..
ఒక్కసారన్నా కూయకపోతావాని..
9793. కొన్ని నిముషాలు కావాలనిపిస్తుంది..
కురుస్తున్న స్మృతుల్లో తడవాలని..
9794. కలయికంటే మనదేననుకున్నా..
ఎప్పటికీ కలవని నింగీనేలను చూస్తూ..
9795. కనులు కలబడ్డప్పుడనుకోలా..
మనసు మనసుపై అలలా పడిందని..
9796. విడదీయలేని బంధమే మనదెప్పుడూ..
జన్మలైనా కలిసున్నామందుకే కాబోలు..
9797. ఆశలు అపురూపమే..
తీర్చుకోవాలని ఆరాటమవుతున్నా నువ్వు తోడందిస్తావనే..
9798. మాట నోచుకోని పేదరాలట..
గంధపుచెక్కలందుకే లేపనాలు పూసాయట..
9799. కలిసుందాం కలకాలం..
ఏ కథకీ అందకుండా మన కలలలో సౌఖ్యంగా..
9800. సౌందర్యాన్నే కుంచెతో గీసావో మరి..
చివరికి నా బొమ్మగా మిగిలిపోయిందిలా..
అందుకే విలపిస్తూంటుంది ఏవేళనకా..
9702. జన్మలుంటాయంటే అబద్ధమనుకున్నా..
ఈ జన్మకు నన్ననుసరించి నువ్వొచ్చేవరకూ..
9703. తలచినకొద్దీ అమృతాలు తన స్మృతులు..
ప్రతిరేయీ కురిసేవైనా ఎప్పటికప్పుడు ఆనందాలు..
9704. మనసులు మమేకమైతే చాలనుకున్నా..
సొగసుల సిరికానుక సగమిద్దామని..
9705. ఈదక తప్పలేదు సంద్రాన్ని..
నడిమధ్యలో జీవితన్ని చాలించలేననుకొని..
9706. వియోగానికి భరోసా..
వసంతమై నువ్విచ్చేస్తావనే చిన్నిచిన్ని ఆశల్లో
9707. మందాకినిగా మారింది నాలో వలపు..
నీలో కలిసేందుకు అతిగా ఉరకలేస్తూ..
9708. పొద్దుపోవడంతో పనిలేదసలు..
పిల్లల పదనిసల్లో పదం కలుపుతుంటే..
9709. రాతలతో కుదురుకుంటున్న బంధాలు..
మౌనాన్ని పదాలుగా అనువదించుకుంటూ..
9710. అప్పుడప్పుడు అలిగిన మేనకనే నేను..
నన్ను పట్టించుకోక తపస్సులో మునిగినప్పుడల్లా..
9711. చక్కెర తీపి దానిమ్మనే నేను..
పెదవులు పండించుకోవాలనే కోరిక నీదవ్వాలంతే..
9712. అరమోడ్పులకే మత్తిల్లిపోతావెందుకో..
తేరిపార చూస్తే ఎన్ని గాయాలపాలవుతావో..
9713. ఊహలకెందుకో కలవరం..
నీ అక్షరాల్లో తాము ఒదగలేకపోతున్నామని..
9714. పంచదార చిలకనయ్యానందుకే..
పలుకు తేనెలన్నీ పాటగా ధారపోసేందుకే..
9715. నా కులుకును అనుసరిస్తూ కోయిల..
వసంతానికన్ని ఋతువులు దాటే అవసరమెందుకని..
9716. తీపి పల్లవులతో పడగోడతావెందుకో..
పరవశించేందుకో క్షణమన్నా ఇవ్వకుండానే..
9717. వలపుజల్లుకని వేచున్నా..
నీ తలపున తడవాలనే ఆరాటంలో..
9718. వానందుకే వచ్చినట్టుంది..
నా కన్నీళ్ళెవ్వరికీ కనబడకుండా దాచేందుకు..
9719. ఎన్ని చినుకుల్ని చేరదీసానో చేతిలో..
నీ జ్ఞాపకాలుగా దోసిలి నింపుకోవాలని..
9720. నీ పెదవంచు నవ్వునై పుట్టాలనుకున్నా..
కొన్ని అనుభూతులు నాపరం చేస్తావని..
9721. కొన్ని నిజాలు నమ్మబుద్ధి కావు..
కష్టాన్ని ఇష్టంతో జయించడం సులువుకానట్టు..
9722. మధుపం చుట్టుముట్టినట్టు నీ చూపులు..
మరందాన్ని దాచలేనంటూ నును సిగ్గులు..
9723. నీ చేతిలో రేఖనై నేనుండిపోనా..
ప్రతిక్షణం పెదవులతో నన్ను తాకుతావంటే..
9724. నా పెదవులు చదవగలిగిన మంత్రపుష్పం..
నీ రెప్పల్లో దాచుకున్న అనురాగం..
9725. గతమెప్పుడూ గాయమే..
నిదురలోనూ మరవనివ్వక వేధించు స్వప్నమే..
9726. నిదుర చెదిరినప్పుడే అనుకున్నా..
ఊహించని స్వప్నమొకటి ఛెళ్ళుమనిపించిందని..
9727. నిన్న మొన్నల సంగతి నీకెందుకిప్పుడు..
రేపు కలిసుండాలనే ఆకాంక్ష మనదైనప్పుడు..
9728. కథలు చదివేసుకుంటా నీ కన్నుల్లో..
మన ప్రేమ రహస్యాలు కనపడతాయని..
9729. నీలో నేనై పల్లవిస్తున్నా..
ఒక్క పాటగానైనా పాడుకుంటావనే..
9730. గుట్టుగా ఉంటేనేం..
నీ గుండెల్లో దేవిరినైతే నేనేగా..
9731. మనసు కురిసిందంటే ఏమోననుకున్నా..
కన్నులు వెచ్చగా మారేంతలోనే..
9732. నిశ్శబ్దమై నువ్వుంటేనేం..
సంగీతాన్ని ఆలకించే నేర్పైతే నాకుందిగా..
9733. కథలోనే రాకుమారి..
నిజానికి తనో మనసు కాజేసిన సొగసరి దొంగ..
9734. సడలిందేమో నమ్మకం...
గుండెలోతుల్లోని విషం బైటకు చిమ్మగానే..
9735. సడలిందేమో నమ్మకం...
పురుషాహంకారాన్ని అలంకారమంటుంటే..
9736. సడలిందేమో నమ్మకం...
బలహీనమైన బంధాల్ని ముడేయాలనుకున్న క్షణాల్లో..
9737. వలపు దక్కించుకుంటా నీ ప్రేయసినై..
నా అనురాగానికి తల ఊపావంటే..
9738. నీ చూపులకే నా బుగ్గలెర్రన..
కొన్ని నవ్వులు పంచితే నేనేమవుతానో..
9739. తనువాపలేని వింత మోహాలు..
కలలు సవ్వడిస్తున్న రేయిలో..
9740. నీ చూపులకే తడబడుతున్నా..
ఎన్ని భావాలు చదివేస్తావోనని..
9741. మదిలో దాచుకున్న తలపులు..
ఎక్కిళ్ళు బయటపెట్టి అల్లరవుతుంటే..
9742. అడుగులకు మడుగులొత్తలేక ఛస్తున్నా..
నీ అల్లరి శృతిమించిపోరాదనే..
9743. మనసులో మోగుతున్న సరిగమలు..
నీ నవ్వులిచ్చిన చక్కిలిగిలిగింతలు..
9744. మనసు గుట్టెవరికి తెలుసు..
మహాసంద్రమై పరవళ్ళు తొక్కుతుంటే..
9745. వసంతమంటే ఎక్కడో వెతికేది కాదు..
మంచిమనసుల్లో పచ్చగా పరిమళిస్తుంది చూడు..
9746. చేరినవన్నీ చేజార్చుకోకు..
చెలిమి చేతులు విడిపోతే కలిసేవికావు..
9747. నువ్వంటే ప్రాణం..
మనసందుకే దాసోహం..
9748. జీవితం కానుకయ్యింది..
నీ మదిలో సుస్థిరస్థానం నాదవగానే..
9749. ప్రణయంతో ఏకమైన మనమిద్దరం..
అనుబంధానికిద్దాం అందమైన నిర్వచనం..
9750. చెలికాడైతేనేమి..
విలుకాడై పొడుస్తుంటే క్షమించేదే లేదు..
9751. వాడెప్పుడూ వ్యాధిగ్రస్తుడనక తప్పదు..
దుష్టాలోచనలు వెంటేసుకు తిరుగుతుంటే..
9752. కలసిన మనసులెన్నడో దూరమయ్యాయి..
ముచ్చటైన మాటలు ముగిసిపోగానే..
9753. కన్నులు కాదనుకున్న కలవేమో నీవు..
నిదురని దరిచేరనివ్వని నా రాతిరిలో..
9754. అనుబంధమందుకే గెలిచింది..
రెండు గుండెల ఏకస్పందన సాక్షిగా..
9755. ఎడారిలోనూ పూలు పూయించగల భావాలు..
నీ వలపు పుణ్యమేనంటే నమ్మవు..
9756. ముందుకొస్తావని ఆశిస్తున్నా..
అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా..
9757. నిశ్శబ్దమే నేస్తమయ్యింది..
నాదనుకున్న నువ్వు నిర్దయగా దూరమయ్యాక..
9758. వేసవిగాలంటే మక్కువవుతోంది..
నీ తలపుల తోడుగా ప్రసరిస్తుంటే..
9759. తొలిముద్దు తీపి తెలుసుకున్నా..
తొలిచూపు చుంబనాలు చేరువైనప్పుడు..
9760. మౌనం ఓడిపోయేట్టుంది..
మనసు నీతో ఊసులు మొదలెట్టిందిగా..
9761. స్వప్నలోకం వీడి రానంటూ మనసు..
వాస్తవంలో రాబందులతో కలిసి బ్రతకలేక..
9762. ఈ జన్మలోనే మనమిలా..
గతజన్మలో నింగిలోనో..సంద్రంలోనో..
9763. అపరిచిత లోకమే ఇక్కడంతా..
అభిమానపు ఆచ్ఛాదన విడిచేసాక..
9764. రెప్పపాటు వానకే సోలిపోతూ కనులు..
అంతులేని ఆవేదన మోస్తున్న మనసేమవ్వాలో..
9765. రంగులద్దుకున్నా నాకు నేనే..
నాలో సగమంటూ ఆకాశమనగానే..
9766. ఏం వెతుకుతున్నావో అంతలా..
అరచేతిలోని గోరువెచ్చదనాన్ని ఆస్వాదించకుండా..
9767. గతజన్మ బంధమని గుర్తొస్తుందిప్పుడు..
నీ స్పర్శలోని మృదుత్వానికనుకుంటా..
9768. లేతవెన్నెలనద్దుకున్న కలలే నావి..
నిన్నందుకే తాజాగా పలకరించినవి..
9769. మెలకువలోనూ కలగంటున్నా..
పిచ్చంటున్నా పట్టించుకోకుండా...
9770. మెరుపు కలల సందేశం నాది..
మనసు పెడితేనే నీకు అవగతమయ్యేది..
9771. కన్నీటి రుచి మరిగింది మది..
ఏదో రకంగా ఏడుస్తూనో నవ్వుతూనో..
9772. ప్రతికధలో నిన్నే రాసుకుంటా..
నాకిష్టమైన నాయికవి నువ్వంతే..
9773. బ్రహ్మరాత చదవడం మానేసానెప్పుడో..
నుదుట ముడతలు ఎక్కువైనప్పట్నుంచీ..
9774. నీ మౌనమొచ్చి గిచ్చుతోంది..
నాలుగుమాటలు ఆడేందుకు రమ్మంటూ..
9775. ఏ పరవశాన్ని దాచుకోవాలనో..
నవ్వులను రట్టుచేస్తూ పెదవులు..
9776. ఎన్ని కోట్ల క్షణాలు కరిగిపోయాయో..
నీ నిరీక్షణలో నా పరితాపాలుగా..
9777. ముద్దులెన్ని మూటగట్టాలో ఇప్పుడిక..
ఇచ్చినవన్నీ వడ్డీలుగానే జమేస్తుంటే..
9778. క్షణకాలం చాలుగా నీ చూపులకి..
నా బుగ్గలకు అంటించేందుకు ముద్దరని..
9779. పులకింతలన్నీ సంగీతాలు..
నేను స్పందించానని చెప్పేందుకే సంకేతాలు..
9780. మట్టి మొలకేయకేమవుతుంది..
చెమటచుక్కను పీల్చుకుని బలం పుంజుకున్నందుకు..
9781. పగటికలల్లో నేను..
పట్టెడు మెతుకుల వేటలో తను..
9782. ఎక్కడికక్కడ దాచేసుకున్న స్మృతులు..
గుర్తొస్తే కన్నీరు కడిగేయగలదని..
9783. కలలతో పోటీపడకిప్పుడు..
కవనానికి మకుటం చేస్తా నిన్నొకప్పుడు..
9784. నీ కవితలందుకే చదువుతుంటా..
నన్నెంత తుంటరిగా రాస్తుంటావోనని..
9785. నీకోసమనే కవితను మొదలెట్టా..
నువ్వెప్పుడో కవిత్వమయ్యావని తెలీక..
9786. మనసంతా మనమే..
కలలైనా కమనీయమే..
9787. పగలూరేయీ ఒకేలాగుంది..
కలలంటూ కనడం మొదలెడుతుంటే కనులు..
9788. వరాలిచ్చి నవ్వుకుంది రేయి..
మనలో సిగ్గులు దోచుకోవాలని..
9789. పెదవుల పలవరింతలే పలుమార్లు..
విరహవేదన తాళలేక తిట్టుకుంటూ..
9790. వందనాలంటూ వడ్డించుకున్నా వయస్సు..
తీయందనాలు కోరుతుంటే సొగసు..
9791. ఒక్క మంత్రమైనా మేలే..
నువ్వు వశమవుతావంటే చాలు..
9792. నిరీక్షణే ఋతువంతా..
ఒక్కసారన్నా కూయకపోతావాని..
9793. కొన్ని నిముషాలు కావాలనిపిస్తుంది..
కురుస్తున్న స్మృతుల్లో తడవాలని..
9794. కలయికంటే మనదేననుకున్నా..
ఎప్పటికీ కలవని నింగీనేలను చూస్తూ..
9795. కనులు కలబడ్డప్పుడనుకోలా..
మనసు మనసుపై అలలా పడిందని..
9796. విడదీయలేని బంధమే మనదెప్పుడూ..
జన్మలైనా కలిసున్నామందుకే కాబోలు..
9797. ఆశలు అపురూపమే..
తీర్చుకోవాలని ఆరాటమవుతున్నా నువ్వు తోడందిస్తావనే..
9798. మాట నోచుకోని పేదరాలట..
గంధపుచెక్కలందుకే లేపనాలు పూసాయట..
9799. కలిసుందాం కలకాలం..
ఏ కథకీ అందకుండా మన కలలలో సౌఖ్యంగా..
9800. సౌందర్యాన్నే కుంచెతో గీసావో మరి..
చివరికి నా బొమ్మగా మిగిలిపోయిందిలా..
No comments:
Post a Comment