11001. గుండె తలుపు తట్టినందుకేమో..
నిదురిప్పుడు దూరం జరిగిందలా..
నిదురిప్పుడు దూరం జరిగిందలా..
11002. రెప్పపాటు పడనివ్వని జ్ఞాపకాలు..
మనసుకి రెక్కలిచ్చి ఎగరమంటూ..
మనసుకి రెక్కలిచ్చి ఎగరమంటూ..
11003. వెన్నెలతో సంధిచేసుకున్నానందుకే..
నా నవ్వుల్లోకొస్తే రోజూ పున్నమవ్వొచ్చని..
నా నవ్వుల్లోకొస్తే రోజూ పున్నమవ్వొచ్చని..
11004. ఎలా దువ్వుకున్నా అందమేగా..
నువ్విచ్చిన పూలు తలకెక్కాక..
నువ్విచ్చిన పూలు తలకెక్కాక..
11005. నేనంటే అనుభూతినే..
నీకనుభవమై మిగిలానంటే..
నీకనుభవమై మిగిలానంటే..
11006. మధువుని ఆపలేకున్నా..
అనుకోకుండా నువ్వు కురిపించిన వాత్సల్యంలో..
అనుకోకుండా నువ్వు కురిపించిన వాత్సల్యంలో..
11007. తీయగా కురిసిన ప్రేమచినుకులు..
మాఘమాసపు రుచి కలిసినందుకేమో..
మాఘమాసపు రుచి కలిసినందుకేమో..
11008. కన్నుల్లోకెప్పుడు చూసావో..
నా మనసుని అలవోకగా రాసేసావు..
నా మనసుని అలవోకగా రాసేసావు..
11009. రాతిరైతే చాలు మల్లెపూలు..
మంచానికి పరిమళాల పిచ్చేమిటో..
మంచానికి పరిమళాల పిచ్చేమిటో..
11010. నీ జ్ఞాపకాలేనవి..
ఇన్నాళ్ళైనా కన్నుల్లో ముత్యాలై మెరుస్తున్నవి..
ఇన్నాళ్ళైనా కన్నుల్లో ముత్యాలై మెరుస్తున్నవి..
11011. జాబిలందుకే దూరమయ్యింది..
అందితే అపురూపాలు మనసుకి పంచలేననే..
అందితే అపురూపాలు మనసుకి పంచలేననే..
11012. ఎన్ని మాటలు దాచుంచానో..
ఎదురైతే పాటలుగా పంచుకోవాలని..
ఎదురైతే పాటలుగా పంచుకోవాలని..
11013. సంతోషాన్నలా సాధించుకున్నా..
నీ జతలో లోకాన్ని మరచి..
నీ జతలో లోకాన్ని మరచి..
11014. పరిమళిస్తున్న రేయిన్నాళ్ళకి..
నా నవ్వుల్లో పువ్వులు గమనించావని..
నా నవ్వుల్లో పువ్వులు గమనించావని..
11015. కొన్ని భావాలంతే..
మనసులో చేరి బంధంగా మారిపోతుంటాయి..
మనసులో చేరి బంధంగా మారిపోతుంటాయి..
11016. కలలకెందుకో కంగారు..
రాత్రైతే నా కన్నుల్లోకి చేరిపోవాలని..
రాత్రైతే నా కన్నుల్లోకి చేరిపోవాలని..
11017. సొగసునెప్పుడు చూసావో..
మనసుకి మాటేసి మాటలు కలిపావు..
మనసుకి మాటేసి మాటలు కలిపావు..
11018. సంసార నౌకలా సాగుతుంది..
భవసాగరంలో గమ్యాన్ని వెతుక్కుంటూ..
భవసాగరంలో గమ్యాన్ని వెతుక్కుంటూ..
11019. దూరమెంత దగ్గర చేసిందో మనల్ని..
నీ ధ్యానాన్ని నేర్చుకుందిగా మది..
నీ ధ్యానాన్ని నేర్చుకుందిగా మది..
11020. మనసెంతగా తీపెక్కిందో..
నీ పలుకుల అమృతాన్ని సేవించినట్టుంది..
నీ పలుకుల అమృతాన్ని సేవించినట్టుంది..
11021. కనుమూస్తే చాలు..
కౌగిలికి రమ్మంటూ కలలో కబురెడతావు..
కౌగిలికి రమ్మంటూ కలలో కబురెడతావు..
11022. ప్రేమెన్నడు గెలుస్తుందో..
ఇన్ని చిగురాశలు వసంతంలా మొలకెత్తుతుంటే..
ఇన్ని చిగురాశలు వసంతంలా మొలకెత్తుతుంటే..
11023. నేను తప్పిపోయి చానాళ్ళయింది..
నీ మనసులో చోటిచ్చినందుకేమో..
నీ మనసులో చోటిచ్చినందుకేమో..
11024. మాఘమాసమొచ్చిందిగా..
మల్లెలన్నీ నా పెదవుల్లోనే పరిమళించేట్టు..
మల్లెలన్నీ నా పెదవుల్లోనే పరిమళించేట్టు..
11025. చిగురిస్తుందిలే జీవితం..
నా నిరాశలపై నీళ్ళు చల్లావుగా..
నా నిరాశలపై నీళ్ళు చల్లావుగా..
11026. భావాలకెన్ని భంగిమలో..
నీ అక్షరాలతో సయ్యాటలాడేందుకు సిద్ధమవుతూ..
నీ అక్షరాలతో సయ్యాటలాడేందుకు సిద్ధమవుతూ..
11027. నవ్వుతూనే నేనుంటా..
నా పెదవుల విల్లు సంధించే వరకూ నువ్వు..
నా పెదవుల విల్లు సంధించే వరకూ నువ్వు..
11028. మౌనానికి అలుపుండదు..
అక్షరం చేసేందుకు నీ మనసుండగా..
అక్షరం చేసేందుకు నీ మనసుండగా..
11029. నేనే నువ్వయిన సంగతి..
రేపటికి ఏమవుతామో తెలియకున్నది..
రేపటికి ఏమవుతామో తెలియకున్నది..
11030. నా కన్నులకెన్ని నవ్వులో..
కల్లోకి నువ్వొచ్చిన కేరింతలు..
కల్లోకి నువ్వొచ్చిన కేరింతలు..
11031. మనసుని ఊయాలూపాలనుకున్నా..
ఊహనై నీ ఎదలో చేరిపోయానలా..
ఊహనై నీ ఎదలో చేరిపోయానలా..
11032. నిన్ననుసరిస్తున్న చిరునవ్వులేనవి..
గతజన్మ నుంచీ నువ్వు గుర్తించనివి..
గతజన్మ నుంచీ నువ్వు గుర్తించనివి..
11033. శాశ్వతమై నేనుంటా..
నవ్వుగానైనా నీలో నన్ను ఉండనిస్తానంటే..
నవ్వుగానైనా నీలో నన్ను ఉండనిస్తానంటే..
11034. పెదవెందుకో అలిగింది..
పిలిచేందుకు అందనంత దూరంలో నువ్వున్నావని..
పిలిచేందుకు అందనంత దూరంలో నువ్వున్నావని..
11035. అంతరంగానికి ఆయాసముండదు..
చేరే గమ్యం నీ ఆలోచనైనందుకు..
చేరే గమ్యం నీ ఆలోచనైనందుకు..
11036. వారమైంది నే కునుకేసి..
కుదిపిందెవరో తెలిసింది ఇన్నాళ్ళకి..
కుదిపిందెవరో తెలిసింది ఇన్నాళ్ళకి..
11037. పున్నమితో పనేముంది..
మన ప్రేమ వెలుగుతో వెన్నెలవుతుండగా..
మన ప్రేమ వెలుగుతో వెన్నెలవుతుండగా..
11038. పొరబడే పనేముంది..
మన అడుగులొక్కటై నడక మొదలైనప్పుడు..
మన అడుగులొక్కటై నడక మొదలైనప్పుడు..
11039. హృదయం తడిచినప్పుడే అనుకున్నా..
ప్రేమ కురిపించింది నువ్వేనని..
ప్రేమ కురిపించింది నువ్వేనని..
11040. ఏమైందో కన్నులకు..
మనసుని కడిగేసింది ముగ్గు పెట్టేందుకు..
మనసుని కడిగేసింది ముగ్గు పెట్టేందుకు..
11041. మోనాలిసా వారసురాలేమో నీ చెలి..
రోజుకో నవ్వుతో మాయచేస్తుంది మది..
రోజుకో నవ్వుతో మాయచేస్తుంది మది..
11042. మాట మౌనవిస్తుందలా..
నా అలుక నీకు చూపాలనుకున్నప్పుడల్లా..
నా అలుక నీకు చూపాలనుకున్నప్పుడల్లా..
11043. చూపిస్తుంది నన్నేగా అద్దం..
నువ్వో మాయలోపడ్డావని ఒప్పుకోవెందుకో..
నువ్వో మాయలోపడ్డావని ఒప్పుకోవెందుకో..
11044. మనసందుకే తేలికైంది..
నా భావాన్నిలా నలుగురికీ పంచినందుకు..
నా భావాన్నిలా నలుగురికీ పంచినందుకు..
11045. నీ మనసందుకే చదవాలనుకున్నా..
నన్నే కోణంలో రాసుంటావోనని..
నన్నే కోణంలో రాసుంటావోనని..
11046. కథలెన్ని రాసానో గుర్తే లేదు..
కాలం కదిలిపోతోందిలా కాసేపైనా ఆగక..
కాలం కదిలిపోతోందిలా కాసేపైనా ఆగక..
11047. ఒకటే తన్మయత్వం..
నీ తలపులను ఆక్రమించిన ప్రతిసారీ..
నీ తలపులను ఆక్రమించిన ప్రతిసారీ..
11048. విషాదం సాటి లేనిదయింది..
ఇప్పటి మన స్వేచ్ఛ వారిచ్చిన కానుకని తెలిసి..
ఇప్పటి మన స్వేచ్ఛ వారిచ్చిన కానుకని తెలిసి..
11049. కొన్ని దీపాలు కొండెక్కాయి..
మరిన్ని జీవితాలకు వెలుగవ్వాలని..
మరిన్ని జీవితాలకు వెలుగవ్వాలని..
11050. స్వప్నంలోనూ విచారమే..
మధురమైన జ్ఞాపకాలు నీడల్లో కలిసిపోయాక..
మధురమైన జ్ఞాపకాలు నీడల్లో కలిసిపోయాక..
11051. మిగిలిందొక్క సంతోషమే..
మన చేతులు కలిసిన క్షణాలవి..
మన చేతులు కలిసిన క్షణాలవి..
11052. మైమరపే నాకెప్పటికీ..
నీ ఊసుల్లోని మాధుర్యాన్ని పూసుకుంటూ..
నీ ఊసుల్లోని మాధుర్యాన్ని పూసుకుంటూ..
11053. అనుభూతిలోనే ఉంది ఆనందమంతా..
నువ్వు నా జీవితమైనంత..
నువ్వు నా జీవితమైనంత..
11054. నీతో నేనుండిపోతా..
కలలు రెట్టింపు చేసుకుంటూ ఉండేందుకు..
కలలు రెట్టింపు చేసుకుంటూ ఉండేందుకు..
11055. తనుగా కదిలిపోతుంది కాలం..
జ్ఞాపకాల్ని దాచుకోవాల్సింది మనమే..
జ్ఞాపకాల్ని దాచుకోవాల్సింది మనమే..
11056. అడుగులన్నీ నీతోనేగా..
గమ్యమేదో దిగులెందుకసలు..
గమ్యమేదో దిగులెందుకసలు..
11057. పున్నమెంత గింజుకుంటుందో..
కురుస్తున్న వెన్నెలంతా నీ కన్నులదేనని నేను అతిశయిస్తుంటే..
కురుస్తున్న వెన్నెలంతా నీ కన్నులదేనని నేను అతిశయిస్తుంటే..
11058. కదలనీయకింక కాలాన్ని..
నీ సమక్షాన్ని శ్వాసించాలనుంది కాసేపైనా..
నీ సమక్షాన్ని శ్వాసించాలనుంది కాసేపైనా..
11059. చేపట్టినప్పుడే అనుకున్నా..
విడిపోని జంటగా మనం కదులుతున్నామని..
విడిపోని జంటగా మనం కదులుతున్నామని..
11060. మాయమవుతా నీలో..
ప్రపంచానికి దూరంగా లయమయ్యే వేళయ్యింది..
ప్రపంచానికి దూరంగా లయమయ్యే వేళయ్యింది..
11061. ఇష్టమది చేరువైన ఆనందం..
అలసిపోయే అవసరమేముంది జీవితానికి..
అలసిపోయే అవసరమేముంది జీవితానికి..
11062. యుగాలెన్ని కరిగిపోవాలో..
ఒక్క కౌగిలే కాలానికి శిక్షైతే..
ఒక్క కౌగిలే కాలానికి శిక్షైతే..
11063. పున్నమొచ్చి పిలుస్తోంది రా..
వెన్నెల మనకోసమే ఎదురుచూస్తున్నట్టుంది..
వెన్నెల మనకోసమే ఎదురుచూస్తున్నట్టుంది..
11064. కవనవనంలా మనం..
ఎన్నక్షరాలుగా పరిమళిద్దామో చెప్పు ముందు..
ఎన్నక్షరాలుగా పరిమళిద్దామో చెప్పు ముందు..
11065. నువ్వు మోహంలో పడ్డప్పుడే అనుకున్నా..
నా కన్నులు నవ్వినప్పుడు చూసుంటావని..
నా కన్నులు నవ్వినప్పుడు చూసుంటావని..
11066. ఆశ రేగిందెప్పుడని..
మనసులు చెరో దిక్కులో ప్రయాణిస్తుంటే..
మనసులు చెరో దిక్కులో ప్రయాణిస్తుంటే..
11067. మాలికై పరిమళించెద్దాం..
మల్లెల కొరత మాఘమాసానికేముంటుంది కదా..
మల్లెల కొరత మాఘమాసానికేముంటుంది కదా..
11068. మంచుబొమ్మనై కరిగిపోతాలే..
కలత ఎరిగి కౌగిలిగా ముందుకొస్తావంటే..
కలత ఎరిగి కౌగిలిగా ముందుకొస్తావంటే..
11069. ఎన్ని వసంతాలు సరిపోతాయో మనకి..
ఒకరికొకరమై ఇలా జీవనం సాగించాలంటే..
ఒకరికొకరమై ఇలా జీవనం సాగించాలంటే..
11070. ఈసారి నువ్వొస్తే కబురెట్టు..
కరిగిపోయేందుకు కర్పూరమై ఎదురుచూస్తుంటా..
కరిగిపోయేందుకు కర్పూరమై ఎదురుచూస్తుంటా..
11071. పూజకని పువ్వులెన్నో సిద్ధం చేసా..
యజ్ఞానికి సమిధగా రమ్మంటావని తెలీక..
యజ్ఞానికి సమిధగా రమ్మంటావని తెలీక..
11072. కొసరిచ్చినా సరిపోదంటావు..
నీ లెక్కలతో నా మతిపోగొడుతూ..
నీ లెక్కలతో నా మతిపోగొడుతూ..
11073. ఘనీభవిస్తాలే నీకోసం..
మేరుపర్వతమే విస్తుపోయేలా..
మేరుపర్వతమే విస్తుపోయేలా..
11074. ఈ ఊహెంత బాగుందో..
నీ సమస్తం నేనైనట్టు..
నీ సమస్తం నేనైనట్టు..
11075. కొన్ని నిజాలు గుప్పిట్లోనే..
ఆ పల్లవులు నీతోనేలే..
ఆ పల్లవులు నీతోనేలే..
11076. మనసుతో మంతనాలెందుకో..
చల్లకొచ్చి ముంత దాచినట్టు నువ్వు..
చల్లకొచ్చి ముంత దాచినట్టు నువ్వు..
11077. ఆకాశం అందినట్టే అనిపిస్తుంది..
అవకాశం తానుగా పలకరించినప్పుడల్లా..
అవకాశం తానుగా పలకరించినప్పుడల్లా..
11078. మనసు పులకరించింది..
మల్లెలూ..వెన్నెల్లూ ఒకేసారి జల్లుకున్నట్టు..
మల్లెలూ..వెన్నెల్లూ ఒకేసారి జల్లుకున్నట్టు..
11079. ఒకటే కలలు..
కన్నులు కలిసి చూపులొకటై మురిసినట్టు..
కన్నులు కలిసి చూపులొకటై మురిసినట్టు..
11080. నువ్వు సితారవే..
మీటినప్పుడల్లా హొయలొలుకుతూ..
మీటినప్పుడల్లా హొయలొలుకుతూ..
11081. మనసులోకి రానిచ్చావుగా..
భావాలు పంచితే సంతోషించక సతమతమవుతావెందుకో..
భావాలు పంచితే సంతోషించక సతమతమవుతావెందుకో..
11082. ప్రేమించడం నేర్పింది నువ్వేగా..
మధురోహలొస్తే మర్నాడు రమ్మంటావెందుకలా..
మధురోహలొస్తే మర్నాడు రమ్మంటావెందుకలా..
11083. అల్లాడిపోకలా..
అందనంత దూరంలో నేనున్నా నీ ధ్యాసలోనేగా..
అందనంత దూరంలో నేనున్నా నీ ధ్యాసలోనేగా..
11083. వర్తమానమందుకే వెలుగుతుంది..
జ్ఞాపకాల చంకీదండ కాంతులు వెదజల్లినందుకు..
జ్ఞాపకాల చంకీదండ కాంతులు వెదజల్లినందుకు..
11084. నా అలుకే గెలిచింది..
నువ్వు బుజ్జగించేందుకు కదిలొచ్చావుగా..
నువ్వు బుజ్జగించేందుకు కదిలొచ్చావుగా..
11085. నిత్యారాధనే నాదెప్పుడూ..
ఆలాపన నీవైనప్పుడు..
ఆలాపన నీవైనప్పుడు..
11086. క్షణాలకదేం వేడుకో..
గుండె కోసుకొని జ్ఞాపకాల్ని పిలుస్తున్నాయంటే..
గుండె కోసుకొని జ్ఞాపకాల్ని పిలుస్తున్నాయంటే..
11087. విడువని వసంతం నాకెప్పుడూ..
తనుంటే పచ్చదనాల పండుగే..
తనుంటే పచ్చదనాల పండుగే..
11088. నానార్ధాల వెల్లువలు..
పదివేల పదాలు కలిపి ఊహిస్తున్నందుకేమో..
పదివేల పదాలు కలిపి ఊహిస్తున్నందుకేమో..
11089. వెతుక్కోలేక ఛస్తున్నా..
నీలోని నన్ను బయటకు పంపేసావేమోనని..
నీలోని నన్ను బయటకు పంపేసావేమోనని..
11090. నిశ్శబ్ద పరిమళం..
శూన్యంలో నీ జ్ఞాపకాల సహవాసం.
శూన్యంలో నీ జ్ఞాపకాల సహవాసం.
11091. మనసు మూగబోయినట్టు గుర్తించలేదు..
నీ ఆరాధనలో నేనుంటూ..
నీ ఆరాధనలో నేనుంటూ..
11092. మరణమే విడదీయాలేమో మనల్ని..
బ్రతుకంతా అంకితమిచ్చింది నీకేగా..
బ్రతుకంతా అంకితమిచ్చింది నీకేగా..
11093. రెప్పలెంతకీ మూతబడవు..
ఊహలకు రెక్కలిచ్చి నేను బ్రతుమాలుకుంటున్నా..
ఊహలకు రెక్కలిచ్చి నేను బ్రతుమాలుకుంటున్నా..
11094. అంతరంగమంతా నీపరం చేసేసా..
నిత్యానందంలో నే మునిగుండాలనే..
నిత్యానందంలో నే మునిగుండాలనే..
11095. కల్లోలమే అంతరంగమెప్పుడూ..
కాలమాగి పలకరించదని తెలిసినందుకేమో మరి..
కాలమాగి పలకరించదని తెలిసినందుకేమో మరి..
11096. నా చూపుల చల్లదనమంటింది మల్లెలకి..
అందుకే రేయంతా వాడిపోక పరిమళిస్తుంది..
అందుకే రేయంతా వాడిపోక పరిమళిస్తుంది..
11097. అదో లోకం..
మనిద్దరం ఏకాంతంగా కలుసుకొనే అంతరంగం..
మనిద్దరం ఏకాంతంగా కలుసుకొనే అంతరంగం..
11098.తలుపులు మూసేసింది వలపు..
జ్ఞాపకాలను మోయలేనని కాబోలు..
జ్ఞాపకాలను మోయలేనని కాబోలు..
11099. కోటికాంతులెప్పుడో చూసా నీ కన్నుల్లో..
అందుకే ప్రతిసారీ కావాలనే ఎదురుపడుతుంటా..
అందుకే ప్రతిసారీ కావాలనే ఎదురుపడుతుంటా..
11100. కలవరమంతా కన్నులదే..
నాలోని ఎదురుచూపులు ఎడబాటుని పట్టిస్తాయని..
నాలోని ఎదురుచూపులు ఎడబాటుని పట్టిస్తాయని..
No comments:
Post a Comment