11801. బరువెక్కిందలా మనసు..
నీ ఊహలకు తడిచింది కాబోలు..
11802. మనసుందని అనుకుంటారు..
శూన్యాన్ని నింపుకుని అదో అనుభవమనుకుంటూ..
శూన్యాన్ని నింపుకుని అదో అనుభవమనుకుంటూ..
11803. దిగులు వీడని దూరంలో నేను..
నీ చిన్నమాట కోసమని ఎదురుచూస్తూ..
నీ చిన్నమాట కోసమని ఎదురుచూస్తూ..
11804. వానొస్తే పండుగే ప్రకృతికి..
కొన్ని శుభాలకి సాక్ష్యమవ్వాలని..
కొన్ని శుభాలకి సాక్ష్యమవ్వాలని..
11805. నీ నవ్వులన్నీ నేనొడిసిపడుతున్నా..
నక్షత్రాలు మిడిసిపడితే చూపిద్దామని..
నక్షత్రాలు మిడిసిపడితే చూపిద్దామని..
11806. ఏనాటి వసంతమోనిది..
నా కవనాలను నువ్వు నాటినప్పటిది..
నా కవనాలను నువ్వు నాటినప్పటిది..
11807. మనసు మురుస్తోంది గుట్టుగా..
కొన్ని జ్ఞాపకాలలో తడిచిపోవచ్చని..
కొన్ని జ్ఞాపకాలలో తడిచిపోవచ్చని..
11808. అక్షరమై అల్లుకుంటాను..
కొన్ని అనుభూతులు నాపరం చేసావంటే..
కొన్ని అనుభూతులు నాపరం చేసావంటే..
11809. స్నేహమే మనసందం..
దాన్ని ఇనుమడించాలంతే..
దాన్ని ఇనుమడించాలంతే..
11810. జ్ఞాపకాన్ని తడిమింది మానసం..
మౌనమై మిగిలింది సమస్తం..
మౌనమై మిగిలింది సమస్తం..
11811. ఏ భాషకూ అందదు..
మనోవేదన ఉప్పెనై ఎగిసినప్పుడు..
మనోవేదన ఉప్పెనై ఎగిసినప్పుడు..
11812. పులకరిస్తున్నా చినుకులొచ్చిన ప్రతిసారీ..
నవ్వులు నేర్పేలా కురుస్తున్నాయని..
నవ్వులు నేర్పేలా కురుస్తున్నాయని..
11813. ఆకాశమే హద్దనుకున్నా..
నీ హృదయమే నా గమ్యమని గుర్తించే వరకూ..
నీ హృదయమే నా గమ్యమని గుర్తించే వరకూ..
11814. కనులకెప్పుడూ వానాకాలమే..
కాసేపైనా నీ ధ్యాసను వీడనంటూ..
కాసేపైనా నీ ధ్యాసను వీడనంటూ..
11815. నీకు నిన్నిచ్చేసా..
నాకు దగ్గరై లోకం మరచిపోతున్నావని..
నాకు దగ్గరై లోకం మరచిపోతున్నావని..
11816. పరిమళాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించా..
గమ్యమలా దగ్గరైన భావనొచ్చింది..
గమ్యమలా దగ్గరైన భావనొచ్చింది..
11817. వెన్నెల్లో విరహాన్ని వివరించలేకున్నా..
మనసు మూగదవుతుంటే ప్రతిసారీ..
మనసు మూగదవుతుంటే ప్రతిసారీ..
11818. రాసినదంతా గుర్తుంది..
రాయబారమిది మొదటిసారి కాదు కనుకనే..
రాయబారమిది మొదటిసారి కాదు కనుకనే..
11819. మనసందుకే వగలు పోతుంది..
నువ్వొచ్చి దిగులు దూరమంపావనే..
నువ్వొచ్చి దిగులు దూరమంపావనే..
11820. చూపులతో రాయొక లేఖ..
నీ కన్నులను చదవాలనుంది..
నీ కన్నులను చదవాలనుంది..
11821. దూరం దగ్గరైనట్టనిపిస్తుంది..
తలపుల దారమెట్టి లాగేసావుగా మదిని..
తలపుల దారమెట్టి లాగేసావుగా మదిని..
11822. గుర్తించా నా పేరుని..
నీ పెదవులు పలికాయనే..
నీ పెదవులు పలికాయనే..
11823. భూమందుకే బరువెక్కుతుంది..
నిజాన్ని నిథిలా తనలో దాచుకోబట్టి..
నిజాన్ని నిథిలా తనలో దాచుకోబట్టి..
11824. ఆశించేదేముంది మార్పుని..
కాలం కదులుతూనే దాచుకుంటుంది రహస్యాల్ని..
కాలం కదులుతూనే దాచుకుంటుంది రహస్యాల్ని..
11825. నీ చూపుల వెలుగు తెలుస్తోంది..
ఆమె కన్నుల కలలనే రాస్తున్నావని..
ఆమె కన్నుల కలలనే రాస్తున్నావని..
11826. కవనాలైపోతూ కలలు..
నీ కలానికి దొరికినప్పటి సంధి..
నీ కలానికి దొరికినప్పటి సంధి..
11827. కొన్ని భావాలంతే..
చెప్పకుండానే మనసుని అలవోకగా చేరుతుంటాయి..
చెప్పకుండానే మనసుని అలవోకగా చేరుతుంటాయి..
11828. నీ చూపులను పసిగట్టేసా..
ప్రేరణగా నేనందుకే మిగిలిపోయా..
ప్రేరణగా నేనందుకే మిగిలిపోయా..
11829. నీదీ నాదీ ఒకటే తాళం..
స్వరాలు కలిపి జతగా పాడుతున్నందుకు..
స్వరాలు కలిపి జతగా పాడుతున్నందుకు..
11830. ప్రతి కలలోనూ నువ్వే..
నిన్నొక్కసారి చూడాలని మనసనుకోగానే..
నిన్నొక్కసారి చూడాలని మనసనుకోగానే..
11831. సంతోషం సాగరమయ్యింది..
నీతో కలసి పయనం మొదలవ్వగానే..
నీతో కలసి పయనం మొదలవ్వగానే..
11832. ఘడికోసారి అలుగుతుంటా..
నువ్వు రోజుకోలా అనునయించి మురిపిస్తావని..
నువ్వు రోజుకోలా అనునయించి మురిపిస్తావని..
11833. అనురాగమదే మరి..
అనుభూతిగా మారి నిన్ను తాకుతోంది..
అనుభూతిగా మారి నిన్ను తాకుతోంది..
11834. కన్నులు కలిసినప్పుడే అనుకున్నా..
ఎన్ని జన్మలైనా నీకోసమెత్తొచ్చని..
ఎన్ని జన్మలైనా నీకోసమెత్తొచ్చని..
11835. పరిధులెప్పుడూ సుస్పష్టమే..
పరిచయాన్నలా కొనసాగించాలంటే..
పరిచయాన్నలా కొనసాగించాలంటే..
11836. మౌనమిప్పుడో ముత్యం..
మాటలన్నీ దాచుకుంటూ..
మాటలన్నీ దాచుకుంటూ..
11837. చూపులతో కొలిచినప్పుడే అనుకున్నా..
చిరునవ్వుల వరమింక ఇచ్చేద్దామని..
చిరునవ్వుల వరమింక ఇచ్చేద్దామని..
11838. నిక్షిప్తం చేసా అనుభూతిని..
దాని తాజాదనం మనసుకందాలని..
దాని తాజాదనం మనసుకందాలని..
11839. ఉషోదయాల్ని లెక్కిస్తున్నా..
ఏనాటికైనా నీ పిలుపు వినబడకపోతుందాని..
ఏనాటికైనా నీ పిలుపు వినబడకపోతుందాని..
11840. వలపు చిరునామా తెలీదనుకుంటావు..
మజిలీనై నిన్నే చేరుతున్నా..
మజిలీనై నిన్నే చేరుతున్నా..
11841. ఈనాటికీ వినిపిస్తుంది యవ్వన ఘోష..
సముద్రం పక్కగా నడుస్తున్నందుకేమో మరి..
సముద్రం పక్కగా నడుస్తున్నందుకేమో మరి..
11842. సహజత్వానికి దగ్గరగా ఉండాలందుకే..
కొత్తమార్పులకి సైతం చోటిస్తూ..
కొత్తమార్పులకి సైతం చోటిస్తూ..
11843. పండుగంటే అదేగా..
పారాణి అందెలు గుండెల్లో రవళించేలా..
పారాణి అందెలు గుండెల్లో రవళించేలా..
11844. చిలిపి తమకమివ్వాలనుకున్నా నీకు..
చిరుమువ్వలు కాలికందుకే అలంకరించుకున్నా..
చిరుమువ్వలు కాలికందుకే అలంకరించుకున్నా..
11845. అక్షరాలు అలిగాయి..
రెండు రోజులైనా నేను తడమలేదని..
రెండు రోజులైనా నేను తడమలేదని..
11846. మెత్తగా తడవాలనుకున్నా..
ప్రేమ జడివానకి మునిగిపోతానని తెలీక..
ప్రేమ జడివానకి మునిగిపోతానని తెలీక..
11847. రాసేకొద్దీ ఆనందాలు..
అక్షరాలొచ్చి మదిని ఆలింగనం చేస్తున్నట్టు..
అక్షరాలొచ్చి మదిని ఆలింగనం చేస్తున్నట్టు..
11848. శిధిలాలను చూసి మోసపోతారంతా..
జ్ఞాపకాల కోటలని తెలీక..
జ్ఞాపకాల కోటలని తెలీక..
11849. ఝరినై ఉరకాలనుంది..
నీ మదిలో నేనంతా అమృతమై..
నీ మదిలో నేనంతా అమృతమై..
11850. ఆవిరైతేనేమి..
నీ జ్ఞాపకాల్లో నేనో పరిమళించే విరినేగా..
నీ జ్ఞాపకాల్లో నేనో పరిమళించే విరినేగా..
11851. ప్రశ్నలన్నీ ముగిసిపోయాయి..
నువ్వే జవాబుగా నా ఎదురొచ్చాక..
నువ్వే జవాబుగా నా ఎదురొచ్చాక..
11852. వాన కురిసినందుకే..
ఎటుచూసినా జలకళతో లోకం ఉట్టిపడుతుంది..
ఎటుచూసినా జలకళతో లోకం ఉట్టిపడుతుంది..
11853. ఆ మనసందుకే మృదువయ్యింది..
మౌనాన్ని చెలిమి చేసినందుకే..
మౌనాన్ని చెలిమి చేసినందుకే..
11854. పరిమళిస్తున్న రాత్రికి తెలుసేమో..
కలలకంత మత్తొచ్చింది నీవల్లేనని..
కలలకంత మత్తొచ్చింది నీవల్లేనని..
11855. నేను నడిచిన సన్నదారి చెప్తుంది..
నీకోసమెంత ప్రయాసలో నే కదిలొచ్చానో..
నీకోసమెంత ప్రయాసలో నే కదిలొచ్చానో..
11856. అపురూపాలు దాచుకోవాలందుకే..
అద్భుతాలుగా గుర్తుచేసుకొనేందుకు..
అద్భుతాలుగా గుర్తుచేసుకొనేందుకు..
11857. మనసు విరిగిందని గుర్తించా..
ఉలిపట్టకుండానే నువ్వు బెదిరించినప్పుడు..
ఉలిపట్టకుండానే నువ్వు బెదిరించినప్పుడు..
11858. నీ హృదయంలోనేగా నివసిస్తున్నా..
చిరునామానడిగి దూరం చేస్తావెందుకలా..
చిరునామానడిగి దూరం చేస్తావెందుకలా..
11859. మనసు మృదువైతే చాలు..
అనుభూతించగలిగే ఆనందాలు పదివేలు..
అనుభూతించగలిగే ఆనందాలు పదివేలు..
11860. నివేదించడానికేముంది..
నా హృదయమెప్పుడో నీకు నైవేద్యమయ్యిందిగా..
నా హృదయమెప్పుడో నీకు నైవేద్యమయ్యిందిగా..
11861. పెదవుల్ని తాకిన రాగాలెన్నో..
మనసులు పరవశిస్తున్న మధుమాసంలో..
మనసులు పరవశిస్తున్న మధుమాసంలో..
11862. నడిచొస్తున్నా కవనాన్నై..
నీ భావానికి అందం చేకూర్చాలనే..
నీ భావానికి అందం చేకూర్చాలనే..
11863. పరిమళిస్తున్న రెండు మనసులు..
మూడుముళ్ళ సందడికి కాబోలు..
మూడుముళ్ళ సందడికి కాబోలు..
11864. ఆగేదేముంది కాలం..
చక్రాలతో అడుగులు నేర్చిందని తెలుసుగా..
చక్రాలతో అడుగులు నేర్చిందని తెలుసుగా..
11865. కవితలు వెల్లువెత్తాయి..
విషాదాన్ని రాయడం నే మొదలెట్టగానే..
విషాదాన్ని రాయడం నే మొదలెట్టగానే..
11866. నిశ్శబ్దం నిద్రిస్తుంది..
ఆనందమందుకే సడి మొదలెట్టిందీ రేయిలో..
ఆనందమందుకే సడి మొదలెట్టిందీ రేయిలో..
11867. మౌనంపై మక్కువ లేదెప్పుడూ..
మాటలు మనసులోనే మింగేస్తుందని..
మాటలు మనసులోనే మింగేస్తుందని..
11868. జారుకుంటున్న ఊసులు..
ఎలానూ నీకు చేరవేయలేనని తెలిసి..
ఎలానూ నీకు చేరవేయలేనని తెలిసి..
11869. వేకువ చుక్కలంటే నాకూ ఇష్టమే..
ఉదయాన్నే మెరుస్తూ కనువిందు చేస్తాయని..
ఉదయాన్నే మెరుస్తూ కనువిందు చేస్తాయని..
11870. భావుకగానే మిగలాలనుంది..
మౌనాన్ని అక్షరంగా రాసి నీకందిస్తూ..
మౌనాన్ని అక్షరంగా రాసి నీకందిస్తూ..
11871. మనసులో కొలువుండిపోయా..
మాటల వర్షానికి నిలువెల్లా తడిచినందుకే..
మాటల వర్షానికి నిలువెల్లా తడిచినందుకే..
11872. నీతో ఉండద్దంటుంది లోకం..
మనం కలిసుంటే సహించలేదనుకుంటా..
మనం కలిసుంటే సహించలేదనుకుంటా..
11873. ఎన్ని నవ్వులు రాసివ్వాలో నీకు..
ఒక్క రాత్రీ పూర్తిగా నిద్రపోనివ్వవు..
ఒక్క రాత్రీ పూర్తిగా నిద్రపోనివ్వవు..
11874. గుండె గుబులు అలా దూరమయ్యింది..
నీలో పదిలమయ్యానని మనసిప్పటికి తెలుసుకుంది..
నీలో పదిలమయ్యానని మనసిప్పటికి తెలుసుకుంది..
11875. తబ్బిబ్బవుతుంది మానసం..
నీ జ్ఞాపకాల ప్రవాహాన్నిటు మళ్ళిస్తుంటే..
నీ జ్ఞాపకాల ప్రవాహాన్నిటు మళ్ళిస్తుంటే..
11876. జీవితం ఒడ్డున పడినట్లయింది..
నువ్వొక్కసారి చేయి అందించగానే..
నువ్వొక్కసారి చేయి అందించగానే..
11877. పండగొస్తున్నట్టుంది..
ఉండుండీ మనసులో వెన్నెల కురుస్తోంది..
ఉండుండీ మనసులో వెన్నెల కురుస్తోంది..
11878. అశ్రుధారలెన్నో కన్నుల్లో..
వానాకాలంతో పోటీ ఎందుకో మనసుకిలా..
వానాకాలంతో పోటీ ఎందుకో మనసుకిలా..
11879. అలనై పుట్టాలనుందొకసారి..
తీరమై నువ్వు నిలబడతానని మాటిస్తే..
తీరమై నువ్వు నిలబడతానని మాటిస్తే..
11880. వెతికి వెతికి అలసిపోయా..
నా మనసు చెప్పాపెట్టకుండా నిన్ను చేరిందని తెలీక..
నా మనసు చెప్పాపెట్టకుండా నిన్ను చేరిందని తెలీక..
11881. కలని కనిపెట్టలేకపోయా..
కమ్మని మకరందం మనసంతా ప్రవహిస్తుంటే..
కమ్మని మకరందం మనసంతా ప్రవహిస్తుంటే..
11882. తలకో రాత..
రాసేవాడికి ఉన్నంత తీరికుండాలి చదవాలంటే..
రాసేవాడికి ఉన్నంత తీరికుండాలి చదవాలంటే..
11883. కాలాన్ని కదలనివ్వకు..
కాసేపు భావాల్ని కలిసి పంచుకుందామిప్పుడు..
కాసేపు భావాల్ని కలిసి పంచుకుందామిప్పుడు..
11884. కలమాగాదు కవనాన్ని రాసేవరకు..
అక్షరాలు మనసుని అల్లుకోవాలంతే..
అక్షరాలు మనసుని అల్లుకోవాలంతే..
11885. రాసింది నేనొక్క అక్షరమే నిజానికి..
వేలభావాలుగా పరిమళిస్తుంది నీ మనసే..
వేలభావాలుగా పరిమళిస్తుంది నీ మనసే..
11886. నీరవంలోనూ రవళిస్తుంటాయి..
నీ మదిలో భావాలు నన్నల్లేందుకు..
నీ మదిలో భావాలు నన్నల్లేందుకు..
11887. వలపును రాస్తున్నప్పుడే అనుకున్నా..
నన్నో అక్షరంగా మార్చేస్తావని..
నన్నో అక్షరంగా మార్చేస్తావని..
11888. క్షణాలిప్పుడు సమ్మోహనం..
నీ మాటతో మది బృందావనం..
నీ మాటతో మది బృందావనం..
11889. వెన్నెల కురవట్లేదంటే మది నమ్మదు..
చెలి జాబిలి కనులెదుట కదులుతుంటే..
చెలి జాబిలి కనులెదుట కదులుతుంటే..
11890. నీ వయసే నన్ను పిలిచింది..
వలపు పండించుకుందాం రమ్మంటూ మరి..
వలపు పండించుకుందాం రమ్మంటూ మరి..
11891. కలతెలా కదిలిపోయిందో..
నువ్వో మరుదివ్వెలా వెలుతురు చిమ్మగానే..
నువ్వో మరుదివ్వెలా వెలుతురు చిమ్మగానే..
11892. పులకరిస్తూనే నేనున్నా..
రాత్రి పొలమారినప్పటి నుంచీ ఎందుకో..
రాత్రి పొలమారినప్పటి నుంచీ ఎందుకో..
11893. కొన్ని కలలు తీపవుతున్నాయి..
అప్పుడప్పుడూ నిన్ను చూపుతున్నందుకేమో..
అప్పుడప్పుడూ నిన్ను చూపుతున్నందుకేమో..
11894.విరుచుకుపడుతూ కలలు..
వాస్తవానికి విస్తుబోయి వెనుకకు మరలుతూ..
వాస్తవానికి విస్తుబోయి వెనుకకు మరలుతూ..
11895. సగంలో ఆగిందొక పాట..
చరణాలను మరచినట్టుంది మనసు..
చరణాలను మరచినట్టుంది మనసు..
11896. దాహాన్ని తీర్చలేని నీళ్ళవి..
కన్నీరై ఒలుకుతున్నా విలువైనవి..
కన్నీరై ఒలుకుతున్నా విలువైనవి..
11897. నేనో అక్షరాన్ని..
గుండెలోతుల భావాన్ని నిన్ను రాయమన్నానందుకే..
గుండెలోతుల భావాన్ని నిన్ను రాయమన్నానందుకే..
11898. గుభాళిస్తున్నవి గులాబీలనుకున్నా..
నీ నవ్వులని అనుకోక మునుపు..
నీ నవ్వులని అనుకోక మునుపు..
11899. మనసు గది మూసావెందుకో..
చొరబడతాననే భయం కాబోలు..
చొరబడతాననే భయం కాబోలు..
11900. అలసిపోతూ నేనున్నా..
నీ తలపుల ప్రవాహంలో ఈదలేకనే..
నీ తలపుల ప్రవాహంలో ఈదలేకనే..
No comments:
Post a Comment