11301.. శిశిరమంటిన క్షణాలవి..
వసంతానికి నోచుకోక ముందుగా రాలినవి..
వసంతానికి నోచుకోక ముందుగా రాలినవి..
11302. వేసవిగాలి ఎప్పుడాగేనో..
కొన్ని చినుకులైనా మదిని తడిపేందుకు..
కొన్ని చినుకులైనా మదిని తడిపేందుకు..
11303. చెలికెప్పుడూ చిరునవ్వులే..
నీ మాటలతో అతిశయిస్తోంది మరి..
నీ మాటలతో అతిశయిస్తోంది మరి..
11304. గుండెలో చలి పెరిగింది నిజమంట..
నీ చూపుల జల్లులో తడిచినందుకంట..
నీ చూపుల జల్లులో తడిచినందుకంట..
11305. క్షణాలకూ పరవశమంటింది..
నీ కౌగిలిలో వివశత్వాన్ని చవిచూసి..
నీ కౌగిలిలో వివశత్వాన్ని చవిచూసి..
11306. మనసు మధురీతలో మునిగిందిలే..
తొలివలపు ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ..
తొలివలపు ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ..
11307. ప్రతిస్పందించేదేముంది..
చూపులెన్నటికీ కలవ్వని తెలిసాక..
చూపులెన్నటికీ కలవ్వని తెలిసాక..
11308. నా పరుగులు నీవైపేగా..
తీరమై నువ్వెదుట నిలిచాక..
తీరమై నువ్వెదుట నిలిచాక..
11309. ఈ నిశ్శబ్దం చాలు నాకు..
నీ మౌనాన్ని మెత్తగా ఆలకించేందుకు..
నీ మౌనాన్ని మెత్తగా ఆలకించేందుకు..
11310. సంగీతం నీలో ఎందుకు మొదలయ్యిందో..
మోగినవి నా మువ్వలు కదా..
మోగినవి నా మువ్వలు కదా..
11311. జ్ఞాపకమందుకే కనుమరుగయ్యింది..
తానుగా వచ్చినా నువ్వు గుర్తించలేదని..
తానుగా వచ్చినా నువ్వు గుర్తించలేదని..
11312. మనసుపడ్డం మాత్రం తప్పలేదు..
ఆనందం విషాదంగా మారిపోయినా..
ఆనందం విషాదంగా మారిపోయినా..
11313. కల సగంలో ఆగిపోయింది..
నిన్ను వెతికి నేనలసినందుకే..
నిన్ను వెతికి నేనలసినందుకే..
11314. గమ్మత్తుగా అనిపిస్తోంది..
మునుపులేని ఈ మత్తు పరిచయమయ్యింది..
మునుపులేని ఈ మత్తు పరిచయమయ్యింది..
11315. వ్యసనమైంది జ్ఞాపకం..
నలుగురిలో నన్ను ఏకాకిగా మార్చేస్తూ..
నలుగురిలో నన్ను ఏకాకిగా మార్చేస్తూ..
11316. చలేసినప్పుడే అనుకున్నా..
నన్నెవరో చల్లని చూపుతో ఆరాధిస్తున్నారని..
నన్నెవరో చల్లని చూపుతో ఆరాధిస్తున్నారని..
11317. మనసు కలవదనుకున్నా..
చూపులు ముడిపడే సమయం మించిందని..
చూపులు ముడిపడే సమయం మించిందని..
11318. కాలమందుకే కరిగింది..
నువ్వూ నేనూ కలిసొచ్చేదాకా ఆగలేనని..
నువ్వూ నేనూ కలిసొచ్చేదాకా ఆగలేనని..
11319. అమాసరోజందుకే తిరగొద్దన్నా..
జనాలు వేరేగా మనల్ని అనుకుంటారని..
జనాలు వేరేగా మనల్ని అనుకుంటారని..
11320. వాన వెలిసిందనుకున్నా..
ముంగిలి ముస్తాబు చేసేందుకొచ్చిందని తెలీక..
ముంగిలి ముస్తాబు చేసేందుకొచ్చిందని తెలీక..
11321. మంచినలా నిలుపుకోవాలి..
నిరంతరం నలుగురు మనల్ని మెచ్చాలంటే..
నిరంతరం నలుగురు మనల్ని మెచ్చాలంటే..
11322. శిధిలమైన జ్ఞాపకాలే..
తవ్వేకొద్దీ ఆనందం విలువ పెరుగుతోందలా..
తవ్వేకొద్దీ ఆనందం విలువ పెరుగుతోందలా..
11323. తూరుపు కిరణాల సౌందర్యానికేమో..
చూపులు తడబడుతున్న భావనది..
చూపులు తడబడుతున్న భావనది..
11324. ఎప్పుడు కలుస్తానో నిన్ను..
ఇన్ని కావ్యాలు అంకితమిస్తావనంటే..
ఇన్ని కావ్యాలు అంకితమిస్తావనంటే..
11325. జారిపోతున్న ఇసుక లాంటిది జీవితం..
గుప్పిట మూసేలోగా రాలిపోక తప్పదు..
గుప్పిట మూసేలోగా రాలిపోక తప్పదు..
11326. రాలిపోతేనేమి ఆ పువ్వులు..
వాడిపోయినా నమ్మేంతగా పరిమళిస్తుంటాయి..
వాడిపోయినా నమ్మేంతగా పరిమళిస్తుంటాయి..
11327. సంగీతమలా వంటబట్టింది..
నీ రాగాలకి సమాధానాలు ఇచ్చిచ్చీ..
నీ రాగాలకి సమాధానాలు ఇచ్చిచ్చీ..
11328. ఆనందాన్ని రాస్తుండు పదే పదే..
అక్షరం అనుభూతి చెంది భావనొలికేలా..
అక్షరం అనుభూతి చెంది భావనొలికేలా..
11329. పున్నమితో పోల్చుంటావు చెలిని..
క్షణాలకు చెమరింత మొదలయ్యేలా..
క్షణాలకు చెమరింత మొదలయ్యేలా..
11330. నా ధ్యాసలే..
నీలో మధురిమలొలికే మాలికలు కూర్చినది..
నీలో మధురిమలొలికే మాలికలు కూర్చినది..
11331. గుండె నిండిందలా..
జ్ఞాపకాల నిథులు నిల్వ చేసినందువల్ల..
జ్ఞాపకాల నిథులు నిల్వ చేసినందువల్ల..
11332. కొన్ని బంధాలంతే..
స్మృతులైనా జీవితాంతం తోడుగా ఉంటుంటాయి..
స్మృతులైనా జీవితాంతం తోడుగా ఉంటుంటాయి..
11333. త్వరపడుతున్నా బంధానికి..
నిన్నొదిలి ఇక ముందు నేనుండలేనని..
నిన్నొదిలి ఇక ముందు నేనుండలేనని..
11334. అత్తరేం పూసుకుందో తను..
పువ్వులే మత్తెక్కి సొమ్మసిల్లాయంటే..
పువ్వులే మత్తెక్కి సొమ్మసిల్లాయంటే..
11335. ఒకేలా నవ్వుతున్నాయి..
నా కన్నులూ పెదవులూ నువ్వొచ్చావని..
నా కన్నులూ పెదవులూ నువ్వొచ్చావని..
11336. నాకంటింది నీలో సెగ..
గమ్యం చేరువవుతుందిలే త్వరలోనిక..
గమ్యం చేరువవుతుందిలే త్వరలోనిక..
11337. నిన్న నిద్రపోయిందెక్కడ..
కన్నులు తెరిచి కలగలన్నావేమో తొలిసారి..
కన్నులు తెరిచి కలగలన్నావేమో తొలిసారి..
11338. జాబిలెందుకు కరిగిందో..
చెలి ఊహలతో వెచ్చబడుతుంది నువ్వైతే..
చెలి ఊహలతో వెచ్చబడుతుంది నువ్వైతే..
11339. జ్ఞాపకాలలా పిలుస్తుంటాయి..
మౌనాన్ని ఆవహించి తమను హత్తుకోమంటూ..
మౌనాన్ని ఆవహించి తమను హత్తుకోమంటూ..
11340. ఎందుకిన్ని పులకింతలో..
నువ్వక్కడుంటే నా మనసుకి వన్నెలద్దినట్టు..
నువ్వక్కడుంటే నా మనసుకి వన్నెలద్దినట్టు..
11341. ఊహలెప్పుడూ నిత్యమే..
హరివిల్లు కావాలంటే మనసు కురవాల్సిందే..
హరివిల్లు కావాలంటే మనసు కురవాల్సిందే..
11342. తిరిగి శిశిరంలోకి జారింది మది..
నీ విరహంతో వసంతాన్ని కాదనుకొని..
నీ విరహంతో వసంతాన్ని కాదనుకొని..
11343. దిక్కులు చూస్తున్న ఆశ..
నిరాశ ఎదురవకుండా ముందడుగేద్దామని..
నిరాశ ఎదురవకుండా ముందడుగేద్దామని..
11344. కనుమరుగయ్యింది వర్షం..
జ్ఞాపకాలు గుండెలో మొలకెత్తవని తెలిసి..
జ్ఞాపకాలు గుండెలో మొలకెత్తవని తెలిసి..
11345. పువ్వుల పరిమళమందుకే అతిశయం..
ముళ్ళని లెక్కచేయక ప్రేమనందుకుంటూ..
ముళ్ళని లెక్కచేయక ప్రేమనందుకుంటూ..
11346. నీడెప్పుడూ నీవెనుకే..
నిన్ననుసరిస్తూ ప్రతి అడుగులో తోడయేందుకు..
నిన్ననుసరిస్తూ ప్రతి అడుగులో తోడయేందుకు..
11347. వర్షంలో తడవడమే ఇష్టమంటావు..
ప్రేమలో మునగొచ్చని తెలిసినా..
ప్రేమలో మునగొచ్చని తెలిసినా..
11348. జీవితం నల్లగా మారింది..
చీకటి పుటలుగా లిఖించినందుకేమో..
చీకటి పుటలుగా లిఖించినందుకేమో..
11349. ఎన్ని సంగతులో నీ ఆరాథనలో..
హృదయ పరవశాన్ని పాట కట్టినందుకు..
హృదయ పరవశాన్ని పాట కట్టినందుకు..
11350. వసంతమంతా వానలమయం..
మన వలపుదాడి మేఘాన్ని తాకినట్టుంది..
మన వలపుదాడి మేఘాన్ని తాకినట్టుంది..
11351. విషాదాన్ని వెలిగించిందెవరో ఇప్పుడు..
జ్ఞాపకాల ఒత్తుని సరిచేస్తానంటూ..
జ్ఞాపకాల ఒత్తుని సరిచేస్తానంటూ..
11352. మౌనం తేలిపోయింది..
నీతో మాటలు మొదలెట్టి మనసూగినప్పుడే..
నీతో మాటలు మొదలెట్టి మనసూగినప్పుడే..
11353. గుండె ఆలపిస్తుంది..
నీ మౌనాన్ని తను పాడగలనంటూ..
నీ మౌనాన్ని తను పాడగలనంటూ..
11354. కలలోనూ మురిపెమే..
మనసుపెట్టి నాపై కవనాలిన్ని రాస్తుంటే..
మనసుపెట్టి నాపై కవనాలిన్ని రాస్తుంటే..
11355. అక్షయమైంది ఇష్టమేగా..
నీ తలపంతా నాకు ఒప్పజెప్పినందుకు..
నీ తలపంతా నాకు ఒప్పజెప్పినందుకు..
11356. బుజ్జగింపుల కొనసాగింపు..
కలలోకి రాలేదని నువ్విలా అలుగుతుంటే..
కలలోకి రాలేదని నువ్విలా అలుగుతుంటే..
11357. ఈ రోజు నువ్వు వాస్తవమేగా..
నిన్నటి జ్ఞాపకాలతో పనేముంది నాకు..
నిన్నటి జ్ఞాపకాలతో పనేముంది నాకు..
11358. మనసులు ఏకమైనప్పుడే అనుకున్నా..
మున్ముందు రాగలెన్ని రాసులవుతాయోనని..
మున్ముందు రాగలెన్ని రాసులవుతాయోనని..
11359. మాటలన్నీ మధురమే..
నీ తేనెల పాటలన్నీ నాకైనందుకు..
నీ తేనెల పాటలన్నీ నాకైనందుకు..
11360. మనసంతా వేడుకవుతుంది..
కనుచూపు మేరంతా పండుగ సరదాలవుతుంటే..
కనుచూపు మేరంతా పండుగ సరదాలవుతుంటే..
11361. అందుకే అడుగులు కలిపేసా..
ఏకంగా ఏడడుగులైతే పరిపూర్ణమవుతాయని..
ఏకంగా ఏడడుగులైతే పరిపూర్ణమవుతాయని..
11362. సంతోషమింక నిత్యమే..
నీ మనసు భద్రంగా నేనందుకున్నాగా..
నీ మనసు భద్రంగా నేనందుకున్నాగా..
11363. అలుపెరుగని జ్ఞాపకాలు..
అలలై మనసుని పదేపదే తడుముతూ..
అలలై మనసుని పదేపదే తడుముతూ..
11364. కవనాలెన్ని రాసానో..
నీ తలపులన్నీ శాశ్వతంగా దాచుకుందామని..
నీ తలపులన్నీ శాశ్వతంగా దాచుకుందామని..
11365. కథలెన్నయినా చెప్తావు..
ప్రతిసారీ కలలోనే కలుద్దామని నన్నొప్పిస్తూ..
ప్రతిసారీ కలలోనే కలుద్దామని నన్నొప్పిస్తూ..
11366. కదలక తప్పదుగా జీవితం..
కష్టనష్టాలు ఎదురైనా దాటుకుంటూ..
కష్టనష్టాలు ఎదురైనా దాటుకుంటూ..
11367. అక్షరాలు నల్లనివైతేనేమి..
రాసిన హృదయ ఫలకం తెల్లనిదేగా..
రాసిన హృదయ ఫలకం తెల్లనిదేగా..
11368. పదహారేల్ల మెరుపు..
వయసు విలాసానికదే మరి ముందడుగు..
వయసు విలాసానికదే మరి ముందడుగు..
11369. కొన్ని క్షణాలంతే..
అరచేతిలో ఇసుకలా చూస్తూనే జారిపోతుంటాయి..
అరచేతిలో ఇసుకలా చూస్తూనే జారిపోతుంటాయి..
11370. కదలికల సాక్షి కదా కాలం..
నా నిరీక్షణ పూర్తయ్యేది నువ్వొస్తేనే..
నా నిరీక్షణ పూర్తయ్యేది నువ్వొస్తేనే..
11371. అనుభవాలన్నీ చెరిసగం..
ఒక్కటనుకున్నాం కనుకనే..
ఒక్కటనుకున్నాం కనుకనే..
11372. మధురభావాలన్నీ స్వరాల్లోనివే..
నీ నయనాలు చూసి నేనాలపించినవి..
నీ నయనాలు చూసి నేనాలపించినవి..
11373. అలా మొదలయ్యింది నిజమే..
ఆశకు ప్రతిరూపంలా నువ్వెదురవగానే..
11374. సొగసుకి ముందుచూపుంది..
అందుకే వయసు పిలిచినా రానంటుంది..
అందుకే వయసు పిలిచినా రానంటుంది..
11375. చీకటైతే చాలు చెమరింపులు..
వెన్నెల్లో రెట్టింపవుతున్న వలపుసెగలు..
వెన్నెల్లో రెట్టింపవుతున్న వలపుసెగలు..
11376. నీకు దూరమైన భావం..
చోటిచ్చానంటూనే ఆహ్వానం అందివ్వలేదని..
చోటిచ్చానంటూనే ఆహ్వానం అందివ్వలేదని..
11377. నిదురకందుకే దూరమయ్యాను..
ఒక్క కలలోనూ నువ్వు కనపడవని..
ఒక్క కలలోనూ నువ్వు కనపడవని..
11378. నా కల నిజమయ్యింది..
సంకల్పం నీ మనసుదైనా..
సంకల్పం నీ మనసుదైనా..
11379. అంతరంగంలో హరివిల్లు..
చినుకు కురిసిన జాడైనా లేకుండా..
చినుకు కురిసిన జాడైనా లేకుండా..
11380. శ్రామికసౌందర్యమే అదంతా..
ఎండనక వాననక రేయింబవళ్ళ కృషిలో..
ఎండనక వాననక రేయింబవళ్ళ కృషిలో..
11381. పరవశాన్ని ప్రోది చేస్తూ మువ్వలు..
రవళించడం మరిచినట్లున్నాయి ఆ తమకంలో..
రవళించడం మరిచినట్లున్నాయి ఆ తమకంలో..
11382. నీ పలుకులు పూదోటలే..
వినాలనిపిస్తుంది ఆ పరిమళాలనింకా..
వినాలనిపిస్తుంది ఆ పరిమళాలనింకా..
11383. తనువంతా పరిమళమే..
ఆత్మీయత నీ మదిలోంచీ నా వైపుగా ప్రవహించి
ఆత్మీయత నీ మదిలోంచీ నా వైపుగా ప్రవహించి
11384. పూలెన్ని నవ్వుకున్నాయో..
చినుకులు తమలా మారి జారుతున్నాయని..
చినుకులు తమలా మారి జారుతున్నాయని..
11385. రాలుగాయివే నీవు..
రాగాలన్నింటికీ నన్నే ముడిపెడుతూ ప్రతిసారీ..
రాగాలన్నింటికీ నన్నే ముడిపెడుతూ ప్రతిసారీ..
11386. నువ్వో సగం..నేనో సగం..
ఇద్దరం చెరిసగమనుకున్నాక ఎందుకిక అనుమానం..
ఇద్దరం చెరిసగమనుకున్నాక ఎందుకిక అనుమానం..
11387. మల్లెలు జానెడే..
జాగారం మాత్రం రేయంతా సరిపోదంటూ..
జాగారం మాత్రం రేయంతా సరిపోదంటూ..
11388. కనులెప్పుడూ అంతే..
ఎంత అలసినా కలలను కాదనలేవు..
ఎంత అలసినా కలలను కాదనలేవు..
11389. మధుమాసం నువ్వే నాకు..
వేరే ఋతువులొద్దనుకున్నా అందుకే..
వేరే ఋతువులొద్దనుకున్నా అందుకే..
11390. రేయిప్పుడో వెలిగింది..
నీ జ్ఞాపకాలు కలలై వచినందుకు..
నీ జ్ఞాపకాలు కలలై వచినందుకు..
11391. విరహమెలానో తట్టుకుంటున్నా..
రేపటికి మనం తప్పక కలుస్తామని..
రేపటికి మనం తప్పక కలుస్తామని..
11392. నిశ్శబ్దం కావాలనిపిస్తుంది..
కొన్ని అపస్వరాలు ఆలకించలేనని మనసంటుంటే..
కొన్ని అపస్వరాలు ఆలకించలేనని మనసంటుంటే..
11393. భావం ముకుళిస్తోంది..
పదాలెన్ని కలిసినా అపురూపం అవలేదని..
పదాలెన్ని కలిసినా అపురూపం అవలేదని..
11394. కలలు కోటికి పెరిగాయి..
నువ్వంతా నేనని అనిపిస్తుంటే..
నువ్వంతా నేనని అనిపిస్తుంటే..
11395. అలుగుతున్నాయందుకే మువ్వలు..
నీ మైమరపుల సందడి మించిపోతుందని..
నీ మైమరపుల సందడి మించిపోతుందని..
11396. మనసు బరువెక్కుతుంది..
నీ జ్ఞాపకాల తీపి పెరిగిపోతుంటే..
నీ జ్ఞాపకాల తీపి పెరిగిపోతుంటే..
11397. నిశ్శబ్దమూ పరిమళిస్తుంది..
నీతో అనుబంధం ఆనందాన్ని స్రవిస్తుందని..
నీతో అనుబంధం ఆనందాన్ని స్రవిస్తుందని..
11398. నువ్వయ్యా చూడు..
దారితప్పిన కాలాన్ని సరిచేసుకుంటూ అడుగేస్తున్నప్పుడు..
దారితప్పిన కాలాన్ని సరిచేసుకుంటూ అడుగేస్తున్నప్పుడు..
11399. ఏకాంతపు చెరలంటే నాకిష్టమే..
నీతో బంధీగా కలిసుండొచ్చని..
నీతో బంధీగా కలిసుండొచ్చని..
11400. చైత్రమంటే అంతే..
సంతోషాలు కుహూమని కూసే కాలాలవుతుంటాయి..
సంతోషాలు కుహూమని కూసే కాలాలవుతుంటాయి..
No comments:
Post a Comment