Monday, 2 September 2019

11201 -11300

11201. ఏమ్మత్తు చల్లావో మనసుకి..
నిన్నొదిలి రానంటుంది నావైపుకి..
11202. జ్ఞాపకాల జాడే లేకుంది..
ఎటు వలసపోయాయో విషాదాన్నొదిలి..
11203. నీకెప్పుడూ విస్మయమే..
చెలి నవ్వితే చందమామ పూసిందంటూ..
11204. ఎవరేమనుకుంటే నాకేం..
పండుగై నీ మనసులోకి వచ్చేస్తానంతే..
11205. నీ ఆరాటమేంటో మరి..
వేసవిగాలులకే మనసిక్కడ నిట్టూర్చుతుంటే..
11206. దశావతారాలందుకే దాచేసా..
నువ్వు దడిస్తే ఓదార్చడం వల్లకాదని..
11207. అనుబంధం చిక్కబడ్డప్పుడే అనుకున్నా..
అనురాగాన్ని బాగా చిలికుంటావని..
11208. కొన్ని ఆశలంతే..
తీరం చేరేవరకూ ప్రాణాలు నిలబడాలనుకుంటూ..
11209. కలలన్నిటా నేనే..
నన్ను కవితగా రాస్తానని మాటిచ్చావుగా..
11210. జ్ఞాపకాలు మెరుపులవంతే..
మనసు చీకటైనప్పుడల్లా గుర్తొచ్చి వెలిగేందుకు..
11211. కన్నులకెప్పుడూ కంగారే..
కలలో కొస్తావని ఎల్లప్పుడూ నిద్రపోతూ..
11212. ప్రాణాధారం నేనే..
నిత్యపూజలతో నన్ను ఆరాధించినప్పుడే కనుగొన్నా..
11213.క్షణాలు కరిగిపోతున్న ఆవిర్లు..
నీ ఊసుల వెచ్చదనానికేమో..
11214. నీ జ్ఞాపకాల చలువేనది..
ఎండల్లో వెన్నెల్లు కురిపిస్తుంది..
11215. నీ జ్ఞాపకాల చలువేనది..
ఎండల్లో వెన్నెల్లు కురిపిస్తుంది..
11216. ఆ చెక్కిళ్ళెప్పుడూ తడిగానే..
చెమ్మగిల్లిన కళ్ళకు తోడైనట్టు..
11217. నా కనులు వెలుగుతుంటాయెలాగో..
నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ..
11218. నీ కనుల జాగారం తెలుస్తోంది..
ఆ మనసు జ్ఞాపకాలతో మేలుకునుందని..
11219. ఇంద్రజాలమంతా నీదేగా..
చెలిమోము వికసించేందుకు నీ అతిశయాలెన్నో..
11220. చెలికాడిలో సగాన్ని మరి..
రాణినై హృదయాన్ని పరిపాలించాలని..
11221. తడబడినప్పుడల్లా గుర్తిస్తావుగా..
జ్ఞాపకాల్లోకి జారిపోయుంటానని..
11222. అదృశ్యమవుతున్న జ్ఞాపకాలు..
నా అంతరంగాన ఆనందమిక చేరలేదని..
11223. ఉగాదిపండగ మైమరపిది..
వసంతమై నువ్వొచ్చినట్టు నా ఎదలోకి..
11224. జగత్తు అత్తరద్దుకుంది..
నీ భావావేశానికి ఆనందంలో మత్తిల్లిపోతూ..
11225. నా చూపులంతే..
వజ్రమంటి కళ్ళతో మాట్లాడితే కోసినట్టవుతాయి..
11226. గుప్పెడు చోటిమ్మన్నప్పుడే అనుకున్నా..
గుండెలో పాగా వేసేందుకొచ్చావని..
11227. ప్రేమంటే మనదేగా..
ఒకరికొకరం కలిసి ఒక్కటిగా లోకమయ్యాక..
11228. మౌనానికి తెలిసిన రాగాలవి..
నిశ్శబ్దం శబ్దమై వినబడుతుందంటే..
11229. అనుభవాలందుకేనేమో..
జీవితానికి సరిపడా నెమరేసుకోడానికి..
11230. నేనేగా నీ అంతర్ముఖం..
నువ్వు మనసుపడ్డ ప్రపంచం....
11231. మౌనం సవ్వడించినప్పుడే అనుకున్నా..
మాట కలిపేందుకు నువ్వొస్తున్నావని..
11232. జీవితాన్ని కాచుకుంటున్నా అందుకే..
మనసుతడి నీ చెలిమిలోనిదేనని..
11233. ఉదయమైందంటే విలవిల పూచిన పూలన్నిటికీ..
నీ చెలితో పోల్చి బాధిస్తావని..
11234. హెచ్చుస్వరంలో నవ్వుతా రా..
నీ మాలికలో చెలినవుతూ..
11235. కొన్ని తలపులందుకే..
కలలో నువ్వెలానూ రావని ఊహలైపోతూ..
11236. ఆ కన్నుల సిగ్గు తెలుస్తోంది..
పెదవులు దాటి చూపులు నవ్వినప్పుడే..
11237. ముసిరినప్పుడనుకోలా..
నీలో వలపు వానై నన్ను తడుపుద్దని..
11238. మనసంతా తీపైన పండగిది..
షడ్రుచులు చెలికాడు పంచినందుకు..
11239. నిజమవుతుందనుకున్న కలే..
కథగా రాసుకోడానికి మాత్రం మిగిలింది..
11240. అలుపు తీరిన క్షణాలు కొన్ని..
కవనపు తోటలో పువ్వులై పరిమళిస్తున్నవి..
11241. కొన్ని స్మృతులంతే..
యేళ్ళు గడిచినా మధురాలనే పంచుతుంటాయి..
11242. క్షణాలకెప్పుడూ కంగారేగా..
నిముషాలుగా మారి గంటలుగా ఉరకేయాలని..
11243. నీ తలపులెంత రహస్యమో..
చప్పుడు చేయని మనసు తలుపులు తోసుకొని విచ్చేస్తూ..
11244. కలత తీరిపోయిందలా..
కలవై రాకున్నా కవనంలో నన్నుంచావని..
11245. పరవశం పదింతలు..
నీ తన్మయత్వాన్ని తిలకించింది మొదలు..
11246. దురాశ లేకుంటే చాలులే..
నిరాశ శాశ్వతమేం కాదులే..
11247. రెప్పల రహస్యాలు వింటున్నా..
నా నిద్దురెందుకు దోచాయోనని..
11248. మనసు పరితపించింది నిజమే..
కన్నీరందుకే తీయనైన గుబులయ్యింది..
11249. విరచిస్తున్నా ప్రణయాన్ని..
కాలమిన్నాళ్ళకి నిన్నూ నన్నూ కలిపిందని..
11250. మిత్రుడే అందరికీ మెరుస్తూ సూరీడు.. 
వేకువైనా వేదనైనా తీరుస్తూ కాలాలన్నిటా..
11251. మనసందుకే తెరిచుంచాను..
నే గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు తొంగిచూస్తుంటావని..
11252. నిశ్శబ్దం నాకెప్పుడూ విషాదమే..
నీ వియోగాన్ని తలపిస్తుందనే..
11253. సందడంతా నీదేలే..
చెలి రాకతో మనసుకి పండగొచ్చిందని..
11254. కాలమలా కరిగిపోయింది..
క్షణాల విలువ ఎప్పటికీ తెలుసుకోలేమని..
11255. అలా మొదలయ్యింది..
నీతో జీవితం కొత్తరంగుల కలబోతలా..
11256. శిశిరానికేమయ్యిందో మరి..
వసంతమొస్తే చోటివ్వనని అడ్డుపడి నిలుచుంది..
11257. నటనలో ఆరితేరావులే..
ఎదురుగా నేనున్నా మాటలు మరచినట్టు..
11258. ప్రవహిస్తున్న ఆశలెన్నో నాలో..
నీ జ్ఞాపకాలు సజీవమేనంటూ..
11259. అపురూపమంటే నువ్వే..
అనుసరిస్తున్నావు కనుకనేగా..
11260. నా మనసుకి రెక్కలెప్పుడొచ్చాయో..
నీవైపుకే ఎగురుతోంది సదా..
11261. నా నిరీక్షణ ఫలించిందిగా..
ఎదురొచ్చి నువ్వు పొదుపుకోగానే..
11262. కాలాలన్నీ కరిగినవేమో..
కన్నీరై నా కన్నుల్లో ప్రవహిస్తున్నవంటే..
11263. అలసటేముంది ఈరోజుకిక..
నాతో కలిసి నీ అడుగుపడుతుంటే..
11264. వసంతమందుకే నవ్వుకుంది..
నీ రాక తనకు సమానమైందని..
11265. నా కలతలా తీరిపోయింది..
నీ మోములోని ఆనందానికి..
11266.సమ్మోహనమే మనసు..
పేర్చిన పదాలన్నిటా నన్ను చూసుకుందనే..
11267. అందమే ఆకాశమెప్పుడూ..
చుక్కలన్నీ తనను చుట్టుముట్టి మెరుస్తున్నాయని..
11268. నిజమవని కల..
కవితగా మిగిలిపోతూ..
11269. ఆ కనులంతేనేమో..
తడినద్దుకున్నప్పుడల్లా ప్రకాశిస్తుంటాయి..
11270. విరబూసింది కవనం..
అక్షరం పరిమళించి ఆనందం పంచుతుందనే..
11271. అక్షరమెప్పటికీ అలసిపోదులే..
నాపై ప్రేమను నువ్వెంత రాసుకున్నా..
11272. వ్యాపకమెప్పుడూ ఆనందమే..
నెమరేసుకుంటూ మురిసినప్పుడల్లా..
11273. వసంతం నవ్వుకుంది..
తనతో పోల్చిన నన్ను చూసినందుకేమో..
11274. మనసుకి మరోజన్మే..
నువ్వింకా నన్ను మర్చిపోలేదంటే ఇన్నేళ్ళైనా..
11275. నిన్నటిలోనే నేనెప్పుడూ..
నీ జ్ఞాపకాలే నాకు భావాలయ్యేనని..
11276. వెన్నెల కురుస్తుంటే ఊహలోననుకున్నాను..
నాలో చీకటింకా కరగాల్సున్నట్టుంది..
11277. కొన్ని గుసగుసలు రాగాలయ్యాయి..
కలలో కలస్వనాన్ని పొడిగిద్దామనే..
11278. అవే అక్షరాలు..
చానాళ్ళుగా కవితలై హృదయాల్ని గెలిపిస్తూ 
11279. అక్షరాలదే కంగారు..
నిన్ను రాసేందుకు పోటీగా ముందుకొస్తూ..
11280. మనసంత గుభాళింపు..
పువ్వుల నదిలో నన్ను మునకేయించినందుకేమో..
11281. అనుక్షణం తలపు నీదేలే..
నాలో వలపు పెరుగుతుందంటే..
11282. ఆకాశం అలలారుతోంది..
తారల నడుమ జాబిల్లి కన్నులపండుగైందని..
11283. నీ పిలుపో నాదమై వినిపిస్తుంది..
ఎదలో లయ ఆనందమై తుళ్ళిపడేలా..
11284. వసంతం విరబూసిందిప్పుడే..
నీ గానంతో నాకు తన్మయమందగానే..
11285. వెన్నెల విస్తరించినట్టనిపిస్తుంది..
నీ వలపు మహిమ గమనించినందుకే..
11286. తన్మయత్వమే తరించింది..
నీ మాటలు మనసుకి నచ్చి..
11287. బంధం బలపడిందందుకే..
ఆ నలుగురిని సంపాదించాలని అనుకోగానే..
11288. కెరటమై ఉప్పొంగినప్పుడే అనుకున్నా..
నదితో నన్ను పోల్చుకున్నావని..
11289. స్వరాలతో మమేకమైన ఏడడుగులు..
మనసుని అనుసరించి ముడిపడ్డందుకే..
11290. అస్తిత్వం అగుపడదంతే..
ఎదుటివారు నీ మదిలోకి తొంగిచూడందే..
11291. శుభలేన్నడో రాసేసుకున్నా ఎదలో..
నీ ప్రేమలేఖ నాకందినప్పుడే..
11292. అలలై పొంగుతూ నా అలుక..
అనునయించే తీరమై నువ్వు ఎదురున్నావని..
11293. రెప్పలు మూసి నిన్నాలకిస్తున్నా...
వలపు గమ్మత్తులేం చేస్తావోనని..
11294. నీ చూపుల తడి నాకంటిందిలే..
నా మదిలో చిగురింతలు పదింతలయ్యేలా..
11295. నిద్దరొచ్చిందని చెప్తావు..
కలలంటేనే నాకన్నా మక్కువంటూ నువ్వు..
11296. సంశయాన్నెప్పుడో వదిలేసా..
సాయంత్రం నువ్వొచ్చి సరాగానికి పిలవగానే..
11297. కబుర్లు బానే చెప్తావు నువ్వు..
కవ్వించినా కాస్తంత కరిగవు కానీ..
11298. ఆకాశమందుకేనా తొంగిచూస్తుంది..
రెక్కలు లేకుండా మనమెలా ఎగురుతామోనని..
11299. మన వలపే ఆదర్శమవ్వాలి..
ఎన్నో చూపులు ఆశీర్వదించేలా..
11300.నీ ప్రేమంతా కనిపిస్తుందిలే..
ఒక్కసారి గుండెల్లోకి తొంగిచూసినా..

No comments:

Post a Comment