11401. అమాసలు ఉన్నవని ఎన్నడో మర్చిపోయా..
తన నవ్వుల వెన్నెల్లో తడుస్తున్నందుకు..
తన నవ్వుల వెన్నెల్లో తడుస్తున్నందుకు..
11402. కొన్ని కలలంతే..
వేకువయ్యే కొద్దీ కన్నుల్లో పొదుపుకుంటుంటాయి..
వేకువయ్యే కొద్దీ కన్నుల్లో పొదుపుకుంటుంటాయి..
11403. ఆ కోనేటిఅందాలు చెప్పలేనివి..
జాబిల్లీ కలువల రాసలీలతో..
జాబిల్లీ కలువల రాసలీలతో..
11404. నీ ఎదుటే నేనెప్పుడూ..
మాయలా వెంటుండమని అడిగినందుకు..
మాయలా వెంటుండమని అడిగినందుకు..
11405. అదే నవ్వు..
నీ కన్నుల చిలిపిదనం నాకిష్టమందుకే..
నీ కన్నుల చిలిపిదనం నాకిష్టమందుకే..
11406. గడ్డిపరకే అనుకోకు..
అదిమిపెట్టినా నిలిచుండే స్థైర్యం ఎప్పటికీ దాని సొంతం..
అదిమిపెట్టినా నిలిచుండే స్థైర్యం ఎప్పటికీ దాని సొంతం..
11407. ఏకాంతానికే తెలుసు..
నిన్నూ నన్నూ కలిపుంచే ఆనందమేమిటో..
నిన్నూ నన్నూ కలిపుంచే ఆనందమేమిటో..
11408. మూగభాష్యాలేనవి..
నిన్నల్లో కరిగిపోయిన మన ఆనందాలు..
నిన్నల్లో కరిగిపోయిన మన ఆనందాలు..
11409. కనుమరుగవ్వాల్సిందే జ్ఞాపకాలు..
వాస్తవంలో మనసుకి వసంతం పరిచయమైతే..
వాస్తవంలో మనసుకి వసంతం పరిచయమైతే..
11410. ప్రేమ గుప్పుమన్నప్పుడే అనుకున్నా..
పరిమళించే మనసు నాదయ్యిందని..
పరిమళించే మనసు నాదయ్యిందని..
11411. ప్రేమలోకమదంతే..
ప్రత్యేకమైన విడిది ప్రేమికులకి మాత్రమే..
ప్రత్యేకమైన విడిది ప్రేమికులకి మాత్రమే..
11412. చరిత్రకి చావులేదంతే..
చదివేకొద్దీ మరిన్ని ముద్రణలుగా నిలుస్తూ..
11413. నీ పరిమళమే..
మనసున మోజులు రేపుతుంది నిజమే..
చదివేకొద్దీ మరిన్ని ముద్రణలుగా నిలుస్తూ..
11413. నీ పరిమళమే..
మనసున మోజులు రేపుతుంది నిజమే..
11414. ఆనందభాష్పాల వెల్లువలు..
చూపుకొసల నువ్వున్నందుకేగా..
చూపుకొసల నువ్వున్నందుకేగా..
11415. లీనమై నేనుండిపోయా..
నువ్వు పాడిన ప్రేమపాట నాకోసమేనని..
నువ్వు పాడిన ప్రేమపాట నాకోసమేనని..
11416. అలుపులేని కాలం..
అనంత దూరాల వింత యానం..
11417. గుప్పెడుమట్టే..
పరిమళం మాత్రం అనంతమై వ్యాపిస్తూ..
11418. ఉస్సూరుమంటున్నా..
నీ నిరీక్షణలో విషాదపు అంచున నిలబడి..
11419. రెండూ ఎక్కువే..
ప్రేమైనా..బాధయినా సమమే నాకు..
11420. సహజత్వానికి దగ్గరగా నేను..
నీ సాన్నిహిత్యపు సౌరభాలతో..
11421. నవ్వుతూనే నేనుంటున్నా..
మనసందం విస్తరించాలని..
11422. ఎదురుచూపులతో నేనున్నది నిజం..
కలవరిస్తున్నది నిన్నైనందుకు ఆనందం..
11423. నిరీక్షణంటే నిష్ఠూరమెందుకో..
క్షణాలు లెక్కించడం నాకో సంబరమైనట్టు..
11424. నవరాగాలన్నీ నాలోనే..
మనసు శృతిచేస్తుంది నువ్వని తెలియగానే..
11425. ప్రేమకి దూకుడెక్కువే..
మనసు ఆశను ఇట్టే నెరవేర్చుతుంది..
11426. జ్ఞాపకాల పరమైంది మనసు..
గతాన్ని తలపోస్తూ కూర్చుంటుంటే..
11427. ఇప్పటికిదే మనలోకం..
ప్రేమని పేరొస్తే మాత్రం తప్పేముంది..
11428. పాటలుగా పాడుతోంది నా పెదవి..
నువ్వు పేర్చిన పదాలనే మరి..
11429. జ్వలిస్తున్నది మనసనుకున్నా..
నాలో ప్రేమ పుట్టిందని తెలీనప్పుడు..
నాలో ప్రేమ పుట్టిందని తెలీనప్పుడు..
11430. నీకు దూరమయ్యాగా నేనెప్పుడో..
మనసు పొలిమేరల్లో వెతుకుతావేం..
మనసు పొలిమేరల్లో వెతుకుతావేం..
11431. చుక్కల నడుమ నేను..
అమాసొకటున్నా.. తక్కిన రోజులుంటాగా..
అమాసొకటున్నా.. తక్కిన రోజులుంటాగా..
11432. మనసు పులకిస్తోందిక్కడ..
నా ప్రేమ నిన్నంటినట్టు అనిపించగానే..
నా ప్రేమ నిన్నంటినట్టు అనిపించగానే..
11433. బంతులేసి కొట్టినప్పుడే అనుకున్నా..
నవ్వులన్నీ సిగ్గులు చేయబోతున్నావని..
నవ్వులన్నీ సిగ్గులు చేయబోతున్నావని..
11434. మాలికలన్నీ నీ పేరుతోనే..
పరిమళాలంటే మక్కువిక్కడ మరి..
పరిమళాలంటే మక్కువిక్కడ మరి..
11435. పులకిస్తోంది నా కలం..
నీకు పరవశాన్నందిస్తున్న ఆనందంలో..
నీకు పరవశాన్నందిస్తున్న ఆనందంలో..
11436. మాటలతో పనేముందిప్పుడు..
చూపులాపని మొదలెట్టేసాక..
చూపులాపని మొదలెట్టేసాక..
11437. చీకటేమొస్తుందిక నీలో..
నా చూపులు కోటిదీపాలుగా అభివర్ణించుకున్నాక..
నా చూపులు కోటిదీపాలుగా అభివర్ణించుకున్నాక..
11438. నవ్వుల ప్రవాహమిక్కడ..
నీ రెప్పల చప్పట్లు వినబడినందుకే..
నీ రెప్పల చప్పట్లు వినబడినందుకే..
11439. స్వధర్మం అడుగంటిపోయింది..
స్వప్రయోజనాలకని లోకులు పరధర్మాల వెంటపడగానే..
స్వప్రయోజనాలకని లోకులు పరధర్మాల వెంటపడగానే..
11440. వలసపోతున్న ఆశలు..
నీ జ్ఞాపకాలు నీటిమూటలై కరిగినందుకే..
నీ జ్ఞాపకాలు నీటిమూటలై కరిగినందుకే..
11441. సరిగమలందుకే సరసమయ్యాయి..
అనురాగాలు నీతో పాడి యుగళమయ్యాయని..
అనురాగాలు నీతో పాడి యుగళమయ్యాయని..
11442. ఊపిరి వేడెక్కుతోంది..
నీ మాటలు చిలిపిదనాలు మించిపోతుంటే..
నీ మాటలు చిలిపిదనాలు మించిపోతుంటే..
11443. పులకింతల పరమవుతూ నేను..
నీ తలపునందుకే హత్తుకుంటున్నా..
నీ తలపునందుకే హత్తుకుంటున్నా..
11444. మనసెండిపోయింది..
ప్రేమ విఫలమై ప్రాణం మిగిలున్నందుకే..
ప్రేమ విఫలమై ప్రాణం మిగిలున్నందుకే..
11445. షడ్జమం నిషాదంగా మారింది..
విషాదానికి మది చేరువయ్యిందని..
విషాదానికి మది చేరువయ్యిందని..
11446. విడిపోముగా మనము..
విరహం విడిదికొచ్చి వలపునెంత వేధించినా..
విరహం విడిదికొచ్చి వలపునెంత వేధించినా..
11447. ఎవరికీ అర్ధమవదందుకే..
అద్వైతమంటూ విడదీసి ఇద్దర్నీ కలుపుతున్నావని..
అద్వైతమంటూ విడదీసి ఇద్దర్నీ కలుపుతున్నావని..
11448. ఒకప్పుడు చినుకులు రాలింది నిజమే..
అవే క్షణాలని నువ్వు గుర్తుపట్టలేదంతే..
అవే క్షణాలని నువ్వు గుర్తుపట్టలేదంతే..
11449. పదనిసకి పిలిచినప్పుడే అనుకున్నా..
గమకాలుగా తమకమంతా పేర్చుంటావని..
గమకాలుగా తమకమంతా పేర్చుంటావని..
11450. చందమామ చిన్నబోయింది..
చిన్నదాని చందం చిరునవ్వును చెరిపిందని..
చిన్నదాని చందం చిరునవ్వును చెరిపిందని..
11451. ఘడియకో కలవరింత..
నీవల్ల పులకింతలు పదింతలవుతుంటే నాలో..
నీవల్ల పులకింతలు పదింతలవుతుంటే నాలో..
11452. మనసలా మెరుస్తుంది..
ప్రేమ కురిసి తనో ముత్యమయినందుకే..
ప్రేమ కురిసి తనో ముత్యమయినందుకే..
11453. తలపులను వారించలేకున్నా..
పిలవగానే నీ వార్తను మోసుకొస్తుందనే..
పిలవగానే నీ వార్తను మోసుకొస్తుందనే..
11454. కాలానికదే పని..
గతజన్మలో విడిపోయిన మనసులను కలుపుతుంటుంది..
గతజన్మలో విడిపోయిన మనసులను కలుపుతుంటుంది..
11455. సీమంతానికి తొందరయ్యింది..
హేమంతమందుకే ఋతువులు దాటుకొని విచ్చేసింది..
హేమంతమందుకే ఋతువులు దాటుకొని విచ్చేసింది..
11456. ముచ్చెమటలు అదేమో తెలీలేదు..
నేననుసరిస్తున్న మనసు నీదైనందుకేమో..
నేననుసరిస్తున్న మనసు నీదైనందుకేమో..
11457. చందమామ చందమది..
అందంగా వెన్నెల కురిపిస్తూ నవ్వుతుంటుంది..
అందంగా వెన్నెల కురిపిస్తూ నవ్వుతుంటుంది..
11458. అల్లకల్లోలమవుతావెందుకో గుండెలో..
చెలి నవ్వులు చిలిపిదనాలు చిలికిస్తుంటే..
చెలి నవ్వులు చిలిపిదనాలు చిలికిస్తుంటే..
11459. పూర్ణమయ్యిందిలా పక్షం..
చందమామ కళలన్నీ తిరిగి రప్పిస్తూ..
చందమామ కళలన్నీ తిరిగి రప్పిస్తూ..
11460. క్షణాల కువకువేనది..
నిన్నూ నన్నూ కలిపి ఆనందించేందుకని..
నిన్నూ నన్నూ కలిపి ఆనందించేందుకని..
11461. తడిచిన ప్రతిసారీ అనుకుంటా..
వసంతంలో వానొచ్చిందంటే నీవల్లనేనని..
వసంతంలో వానొచ్చిందంటే నీవల్లనేనని..
11462. ఆయాసమప్పుడే మొదలయ్యింది గుండెకు..
కన్నులు ఆగక కురుస్తున్నందుకు..
కన్నులు ఆగక కురుస్తున్నందుకు..
11463. అలల్లాంటివే కదా కష్టాలు..
తీరం తరిమికొడితే వెనుదిరుగుతుంటాయి..
తీరం తరిమికొడితే వెనుదిరుగుతుంటాయి..
11464. కాలమెందుకు కరుగుతుందో..
కాళ్ళరిగేలా నువ్వు నావెంట తిరుగుతుంటే..
కాళ్ళరిగేలా నువ్వు నావెంట తిరుగుతుంటే..
11465. నిట్టూర్పులవుతూ కొన్ని ఆశలు..
మనసంతా శూన్యమైనట్టు కనిపించగానే..
మనసంతా శూన్యమైనట్టు కనిపించగానే..
11466. మధుమాసమందుకే నాకిష్టం..
మనిద్దరి కల నిజమైన కాలమదని..
మనిద్దరి కల నిజమైన కాలమదని..
11467. పరిమళమంటిందలా చెలికి..
నీ గుండె గులాబీలతో పూజించావనే..
నీ గుండె గులాబీలతో పూజించావనే..
11468. ఆగనన్న కాలంతో నా అడుగు కలపాలనుంది..
జతగా నువ్వొస్తే కలొకటి నిజమయ్యే వీలుంది..
11469. కనికరమే లేనట్టుంది కాలానికీ..
కదులిపోతూ కనుతిప్పి చూడకుందిప్పటికి..
కదులిపోతూ కనుతిప్పి చూడకుందిప్పటికి..
11470. సున్నితత్వం మొగ్గ తొడిగిందలా..
అమ్మతనం మనసుకలా తగలగానే..
అమ్మతనం మనసుకలా తగలగానే..
11471. వసంతమొచ్చిందని పసిగట్టేసా..
నీ రాకతో మనోవిలాపం తీరిపోగానే..
నీ రాకతో మనోవిలాపం తీరిపోగానే..
11472. దేహమందుకే దేవాలయమైంది..
ఎన్నో ప్రతిమలకు జీవాన్ని అందించిందని..
ఎన్నో ప్రతిమలకు జీవాన్ని అందించిందని..
11473. ఎన్ని చుక్కలు రాలిపోయాయో రాతిరి..
వేకువకొక్క కలనైనా నిజం చేయాలని..
వేకువకొక్క కలనైనా నిజం చేయాలని..
11474. కథనమప్పుడే కనిపెట్టేసా..
కవితలల్లా తన ఊసే నింపావని..
కవితలల్లా తన ఊసే నింపావని..
11475. శిశిరమందుకే కదిలిపోయింది..
వసంతమొస్తే కొన్ని చిగురులు మొలకెత్తుతాయని..
వసంతమొస్తే కొన్ని చిగురులు మొలకెత్తుతాయని..
11476. మధుమాసపు మారాకు నీవు..
మనసంతా మధువనిగా మార్చేస్తూ..
మనసంతా మధువనిగా మార్చేస్తూ..
11477. సందడలా మొదలయ్యింది..
ఆకాశమే హద్దుగా మదిలో ప్రేమయ్యిందని..
ఆకాశమే హద్దుగా మదిలో ప్రేమయ్యిందని..
11478. అనుభవం చిన్నదే..
అనుభూతే..అక్షరమై అపురూపమై అమరమయ్యింది..
అనుభూతే..అక్షరమై అపురూపమై అమరమయ్యింది..
11479. మనసెప్పుడూ నీవెంటే..
భావాలన్నీ నాకు చుట్టి రాస్తుంటావనే..
భావాలన్నీ నాకు చుట్టి రాస్తుంటావనే..
11480. వేసవిలో శ్వాసలంటావు..
ఊపిరి నిశ్వసించేందుకూ నిట్టూరుస్తూ నేనుంటే..
ఊపిరి నిశ్వసించేందుకూ నిట్టూరుస్తూ నేనుంటే..
11481. తనువూగినప్పుడే అనుకున్నా..
ఊయలూపే మంత్రమేదో దూరాన్నుంచే వేసుంటావని..
ఊయలూపే మంత్రమేదో దూరాన్నుంచే వేసుంటావని..
11482. అపురూపమైందా వాక్యం..
ఇసుకలా జారిపోయేలోపే రాసి పెట్టుకోవాలందుకే..
ఇసుకలా జారిపోయేలోపే రాసి పెట్టుకోవాలందుకే..
11483. నిస్సహాయిని నేను..
పైకి ఎగరాలనే ఆశలెన్ని మనసునున్నా..
పైకి ఎగరాలనే ఆశలెన్ని మనసునున్నా..
11484. రంగు కోల్పోయిన మనసు..
రుచిని వెతకాలని ప్రయత్నించగానే..
రుచిని వెతకాలని ప్రయత్నించగానే..
11485. గుసగుసలుగా మొదలెట్టా..
పదనిసలై నిన్ను పలకరించాలనే తపనలో..
పదనిసలై నిన్ను పలకరించాలనే తపనలో..
11486. అద్దమంటి మనసే నీది..
నా ప్రతిబింబాన్నందుకే చూపింది..
నా ప్రతిబింబాన్నందుకే చూపింది..
11487. మొరాయిస్తున్న మనసు..
నిన్ను చూడక క్షణమైనా ఆగనంటూ..
నిన్ను చూడక క్షణమైనా ఆగనంటూ..
11488. మౌనమంటే మరేముంది..
మదిలో మంతనాలు మురిపాలుగా మారడమేగా..
మదిలో మంతనాలు మురిపాలుగా మారడమేగా..
11489. మధురస్వర్గమంటే మనదేగా..
జ్ఞాపకాలు కదిలి కలలు నిజమయ్యాయంటే..
జ్ఞాపకాలు కదిలి కలలు నిజమయ్యాయంటే..
11490. పరవశమెక్కువే నావకు..
అలల దోబూచులాటలో నిలువెల్లా ఊగుతూ..
అలల దోబూచులాటలో నిలువెల్లా ఊగుతూ..
11491. మెరిసింది నుదురు..
రాయబడ్డ రాత నిజమైందని చూపేందుకు..
రాయబడ్డ రాత నిజమైందని చూపేందుకు..
11492. కలలన్నీ ప్రణయాలాపనలే..
కన్నులు కలిసిన ముహూర్తం కుదిరిందని..
కన్నులు కలిసిన ముహూర్తం కుదిరిందని..
11493. జూకాల మాటు ఊగుతోంది మది..
నీ గుసగుసలను గుట్టుగా ఆలకిస్తూ..
నీ గుసగుసలను గుట్టుగా ఆలకిస్తూ..
11494. ఆ మాటలెలా దాచుకోవాలో..
నిన్నటి ఊహలోనే నేనుండిపోయానని..
నిన్నటి ఊహలోనే నేనుండిపోయానని..
11495. అస్తిత్వం కనుమరుగయ్యింది..
అంతరాత్మ మరణించినందుకేమో..
అంతరాత్మ మరణించినందుకేమో..
11496. నిశ్శబ్దం నడిచొచ్చింది..
స్వరాల కోసమని ఆకాశం పిలవగానే..
స్వరాల కోసమని ఆకాశం పిలవగానే..
11497. ప్రచురితమే మన ప్రబంధం..
ప్రణయానికి ఆదికావ్యము కదా..
ప్రణయానికి ఆదికావ్యము కదా..
11498. జ్ఞాపకమంటే నీవే..
ఎందరున్నా నన్ను గతంలోకి నడిపిస్తున్నావంటే..
ఎందరున్నా నన్ను గతంలోకి నడిపిస్తున్నావంటే..
11499. ప్రాణం ప్రతిస్పందిస్తోంది..
తిరిగివెళ్తూ నీ స్పందన ఆలకించి..
తిరిగివెళ్తూ నీ స్పందన ఆలకించి..
11500. మనసు బరువెక్కుతోంది..
ఆకులు రాలినా వసంతమింకా రాలేదని..
ఆకులు రాలినా వసంతమింకా రాలేదని..
No comments:
Post a Comment