.11601. ఒంటరితనపు చీకటిగదిలో ఎందుకుంటావలా..
వేకువ వెన్నెలను తెలుసుకోవాలనుకోలేదా..
11602. విరహమంటి వేడిగాలి..
కిటికీ అవతల నువ్వు వీస్తున్నట్టుగా..
కిటికీ అవతల నువ్వు వీస్తున్నట్టుగా..
11603. నిరీక్షణంటే ఇదేనేమో..
చానాళ్ళుగా నీకై మనసు తపిస్తున్నట్టుంది..
చానాళ్ళుగా నీకై మనసు తపిస్తున్నట్టుంది..
11604. ఈ స్వప్నాలేమిటో..
నా నీవున్న మాయని అనుభూతించమన్నట్టు..
నా నీవున్న మాయని అనుభూతించమన్నట్టు..
11605. అత్తరు దీపాల్లా నీ కళ్ళు..
రెప్పలు ఆపలేని వెలుతుర్లు వెదజల్లుతూ..
రెప్పలు ఆపలేని వెలుతుర్లు వెదజల్లుతూ..
11606. వినబడ్డవి నీ పిలుపులు..
పయనిస్తుంటే నా స్వప్నాల్లో..
పయనిస్తుంటే నా స్వప్నాల్లో..
11607. హద్దు మీరిన సహనం..
కోపాన్ని ప్రకోపిస్తూ అరుపయ్యింది..
కోపాన్ని ప్రకోపిస్తూ అరుపయ్యింది..
11608. పరిమళిస్తున్న చీకటి..
రేయంతా మల్లెగాలి కనపడకుండా వీస్తున్నందుకే..
రేయంతా మల్లెగాలి కనపడకుండా వీస్తున్నందుకే..
11609. అలలు అలలుగా కలలీనాడు..
నిద్రించి చానాళ్ళైంది నేనైతే..
నిద్రించి చానాళ్ళైంది నేనైతే..
11610. ప్రవహిస్తున్న కన్నీరు..
ఎదలో ఆనందం సింధువుగా మారి..
ఎదలో ఆనందం సింధువుగా మారి..
11611. సంద్రానికి సమానమైపోయా..
ఉప్పగా జారే కన్నీటిరుచి మార్చలేక..
ఉప్పగా జారే కన్నీటిరుచి మార్చలేక..
11612. వలపును పంచుతున్నా..
నా ఊసులుగా నీకు గుర్తుండాలని..
నా ఊసులుగా నీకు గుర్తుండాలని..
11613. నిన్నటి మన అనుభూతులే..
నేటి అనుభావాలైనవి నాకు..
నేటి అనుభావాలైనవి నాకు..
11614. మూగైంది మనసు..
నీ మాటలు ఆలకించి చానాళ్ళయిందని..
నీ మాటలు ఆలకించి చానాళ్ళయిందని..
11615. నన్ను మరచి చానాళ్ళయింది..
నువ్వుగా మారడమొక్కటే గుర్తుంది..
నువ్వుగా మారడమొక్కటే గుర్తుంది..
11616. పసిడిగా మెరుస్తున్నాను..
నీ మనసాకాశంలో నక్షత్రం నేనయ్యాక..
నీ మనసాకాశంలో నక్షత్రం నేనయ్యాక..
11617. గుర్తించలేకున్నాం మనుషుల్ని..
ముసుగేసుకుంటుంటే మంచితనాన్ని..
ముసుగేసుకుంటుంటే మంచితనాన్ని..
11618. తీరమై ఎదురుచూస్తుంటుంది తను..
కెరటమై నువ్వు ముద్దాడతావనే..
కెరటమై నువ్వు ముద్దాడతావనే..
11619. మరణానికి దారి వెతుకుతున్నా..
జీవితపు ముళ్ళను ఓర్చలేకనే..
జీవితపు ముళ్ళను ఓర్చలేకనే..
11620. భాషకందని భావాలే కదా నీవన్నీ..
నాపై దాచుకున్న ప్రేమను ప్రకటిస్తున్నట్టు..
నాపై దాచుకున్న ప్రేమను ప్రకటిస్తున్నట్టు..
11621. నా పేరు ప్రణయమయ్యింది..
నువ్వందిస్తున్న లాలసానికి మురిసినందుకే..
నువ్వందిస్తున్న లాలసానికి మురిసినందుకే..
11622. ఒప్పుకోదు మనసెప్పటికీ..
కన్నుల ద్వారా బయటపడొద్దని చెప్తున్నా..
కన్నుల ద్వారా బయటపడొద్దని చెప్తున్నా..
11623. కాలాన్నెంతగానో బుజ్జగించా..
నీ జ్ఞాపకాలనైనా కడదాకా తోడిమ్మని..
నీ జ్ఞాపకాలనైనా కడదాకా తోడిమ్మని..
11624. కన్నీటివాన ఎప్పటికీ తీపవదేమో..
జ్ఞాపకంగానైనా నువ్వు మిగలకపోయాక..
జ్ఞాపకంగానైనా నువ్వు మిగలకపోయాక..
11625. గతి తప్పుతున్న కొన్ని ఘడియలు..
స్వప్నాన్నీ వాస్తవాన్నీ వేరు చేయలేక..
స్వప్నాన్నీ వాస్తవాన్నీ వేరు చేయలేక..
11626. ఇంటిపేరు మౌనమయ్యింది..
నీ మాటలతో మనసు మూగదయ్యి..
నీ మాటలతో మనసు మూగదయ్యి..
11627. కనురెప్ప చాటు కవితనవుతా..
కలవరిస్తున్నది నన్నేనని తెలిస్తే..
కలవరిస్తున్నది నన్నేనని తెలిస్తే..
11628. మౌనం ముత్యమనుకున్నా..
మాట బంగారమని నువ్వు చెప్పేవరకూ..
మాట బంగారమని నువ్వు చెప్పేవరకూ..
11629. నా కన్నుల్లో నల్లపూసలు..
నిన్ను చూడక చానాళ్ళయినందుకేమో..
నిన్ను చూడక చానాళ్ళయినందుకేమో..
11630. మనసంతా పన్నీరు..
ఊహించని నీ దర్శనం అయినందుకు..
ఊహించని నీ దర్శనం అయినందుకు..
11631. అనునయించవెందుకలా..
వైశాఖమాసాన వలపుల వానంటే ఇష్టమంటూనే..
వైశాఖమాసాన వలపుల వానంటే ఇష్టమంటూనే..
11632. నీ కనురెప్పలు కటకటాలే..
నన్ను బంధించి దాచుకున్నాయంటే..
నన్ను బంధించి దాచుకున్నాయంటే..
11633. తలపుల వాకిటే నిలబడిపోయా..
యెదలోపలి ఆహ్వానాన్ని ఆశిస్తూ..
యెదలోపలి ఆహ్వానాన్ని ఆశిస్తూ..
11634. పులకించి పరవశిస్తున్నా..
పరిమళాలు నులివెచ్చగా ప్రాణాలు తీసేస్తుంటే..
పరిమళాలు నులివెచ్చగా ప్రాణాలు తీసేస్తుంటే..
11635. వేసారిపోతుంటా ప్రతిసారీ..
నీ మాటలు గుచ్చుకున్నా ఫరవాలేదనుకుంటూ..
నీ మాటలు గుచ్చుకున్నా ఫరవాలేదనుకుంటూ..
11636. ఎన్ని రంగులని కలగలపాలో..
నీలో నవ్వులు ఇంద్రధనుసయ్యేందుకు..
నీలో నవ్వులు ఇంద్రధనుసయ్యేందుకు..
11637. చూపులతో సంధించినప్పుడే అనుకున్నా..
చిలిపిదనం గుచ్చుకోక మానదని..
చిలిపిదనం గుచ్చుకోక మానదని..
11638. రేపటికి రూపమివ్వాలనుంది..
నిన్నటి మనం ఈరోజైనా ఒక్కటైతే..
నిన్నటి మనం ఈరోజైనా ఒక్కటైతే..
11639. నువ్వు నా నిజమన్నా నమ్మరెవ్వరూ..
నేను నీ నీడై ఉంటున్నా..
నేను నీ నీడై ఉంటున్నా..
11640. గానం సమస్తమయ్యింది..
నీతో కలిసి ఆలపించాలని నేననుకోగానే..
నీతో కలిసి ఆలపించాలని నేననుకోగానే..
11641. మౌనం నిత్యమయ్యింది..
నిరంతరం నీ పలుకులనే ఆలకిస్తూ..
నిరంతరం నీ పలుకులనే ఆలకిస్తూ..
11642. కలలోనూ నువ్వే..
అనుబంధమయ్యావు మరి..
అనుబంధమయ్యావు మరి..
11643. పుచ్చేసుకుంటాలే నీ హృదయాన్ని..
నిన్ను కాదని నాదరికొచ్చినందుకు..
నిన్ను కాదని నాదరికొచ్చినందుకు..
11644. కెరటమై ఎగిసింది ప్రేమ..
అభిమానం అంతర్లీనమై ఉన్నందుకు..
అభిమానం అంతర్లీనమై ఉన్నందుకు..
11645. నువ్వొస్తున్న శబ్దమయ్యింది..
నిశ్శబ్దాన్ని భరించలేననుకోగానే..
నిశ్శబ్దాన్ని భరించలేననుకోగానే..
11646. మొదలైంది తెలియని గిలిగింత..
నీ రాకతో మనసంతా..
నీ రాకతో మనసంతా..
11647. శిశిరాన్ని ప్రేమిస్తున్నా చిత్రంగా..
వసంతానికి చోటిస్తూ కదిలిందని..
వసంతానికి చోటిస్తూ కదిలిందని..
11648. ఏకాంతం నవ్వుతోంది..
క్షణక్షణం నే జారుతున్నా తనలోకని..
క్షణక్షణం నే జారుతున్నా తనలోకని..
11649. నిద్దరోలేదని కలలు ఆగవు..
ఊహలుగానైనా ఎదను కొరుకుతుంటాయి..
ఊహలుగానైనా ఎదను కొరుకుతుంటాయి..
11650. ప్రతిజన్మకూ నువ్వే..
ఎన్ని జన్మలెత్తేందుకైనా నే సిద్ధమందుకే..
ఎన్ని జన్మలెత్తేందుకైనా నే సిద్ధమందుకే..
11651. విషాదం నిత్యమయ్యింది..
ఓదార్చే హృదయమేదీ నన్ను చేరదీయలేదనే..
ఓదార్చే హృదయమేదీ నన్ను చేరదీయలేదనే..
11652. చీకటిని మరిపించాలనుకున్నా..
నీ నవ్వులనే దీపాలను గుర్తుచేసుకున్నా..
నీ నవ్వులనే దీపాలను గుర్తుచేసుకున్నా..
11653. సంతోషం సగమైనా మిగల్లేదు..
నీకు మనసిచ్చిన పాపానికి..
నీకు మనసిచ్చిన పాపానికి..
11654. వైశాఖానికి ముందే వస్తావు..
వానలా నాలో కురవాలనుందంటూ..
వానలా నాలో కురవాలనుందంటూ..
11655. రాగమెప్పుడో లయ తప్పింది..
తాళమసలు కుదిరేలా లేదని..
తాళమసలు కుదిరేలా లేదని..
11656. వేకువలో వెన్నెల ఆనవాళ్ళు..
ఒలకపోసిన నవ్వుల సింగారాలు..
ఒలకపోసిన నవ్వుల సింగారాలు..
11657. నలుగురందుకే మిగిలారు..
నాకో పేరుందని మోసేందుకు చివరకు..
నాకో పేరుందని మోసేందుకు చివరకు..
11658. కలానికి బలమొచ్చింది..
కదులుతున్న కాలాన్ని అందుకోవాలని సాహసించి..
కదులుతున్న కాలాన్ని అందుకోవాలని సాహసించి..
11659. ఒక ఉలికిపాటు స్పర్శ..
మనదో పురాతన బంధమనుకుంటా..
మనదో పురాతన బంధమనుకుంటా..
11660. నాకోసం నవ్వుతాయనుకుంటా..
నీ కన్నులు చూసిన ప్రతిసారీ..
నీ కన్నులు చూసిన ప్రతిసారీ..
11661. కాలాన్ని కదలనిచ్చా..
నా ఊహలకి నేనే ప్రాణమిద్దామని..
నా ఊహలకి నేనే ప్రాణమిద్దామని..
11662. ఇంద్రజాలం ఫలించినట్టుంది..
ఇన్నాళ్ళైనా నువ్వు నావెంటిలా పడుతున్నావంటే..
ఇన్నాళ్ళైనా నువ్వు నావెంటిలా పడుతున్నావంటే..
11663. పేరని ఎవరన్నారు..
నువ్వు పిలిచినందుకు నే కవితనయ్యాగా..
నువ్వు పిలిచినందుకు నే కవితనయ్యాగా..
11664. అదేమి వానో..
సకాలాన్ని కాదని అకాలానికి ప్రత్యక్షమవుతుంది..
సకాలాన్ని కాదని అకాలానికి ప్రత్యక్షమవుతుంది..
11665. వెలుతురుకై వేచిచూస్తున్నా..
నీ రూపంలో వచ్చి తీరుతుందని..
నీ రూపంలో వచ్చి తీరుతుందని..
11666. ఆవిరైన అనుభూతులు నాలో..
అణువంతైనా నిన్ను కదల్చలేకపోయానని..
అణువంతైనా నిన్ను కదల్చలేకపోయానని..
11667. అక్షరాలతో అల్లుకుంటావలా..
నాలోని శూన్యాన్ని పూర్తిగా పంపించాలంటూ..
నాలోని శూన్యాన్ని పూర్తిగా పంపించాలంటూ..
11668. అపరిచితమే అనుకున్నా..
రంగులకలవై నా నిద్దుర చెదిరేవరకూ..
రంగులకలవై నా నిద్దుర చెదిరేవరకూ..
11669. అరమోడ్పు కావాల్సిందేగా కన్నులు..
రేయంతా వెన్నెల్లో తడిచినందుకు..
రేయంతా వెన్నెల్లో తడిచినందుకు..
11670. అక్షరమే రక్ష..
ఇన్నాళ్ళైనా నిన్నూ నన్నూ కలిపుంచిందంటే..
ఇన్నాళ్ళైనా నిన్నూ నన్నూ కలిపుంచిందంటే..
11671. సుమగంధాలే నీ భావాలు..
పరవశాన్ని నాకు పంచినప్పుడల్లా..
పరవశాన్ని నాకు పంచినప్పుడల్లా..
11672. మనసంతా వెన్నెలే..
కలవరింత నీదైనందుకు..
కలవరింత నీదైనందుకు..
11673. మనసయ్యిందే మౌనం..
నిశ్శబ్దంలో నిన్ను నేమరేస్తూ నేనున్నప్పుడు..
నిశ్శబ్దంలో నిన్ను నేమరేస్తూ నేనున్నప్పుడు..
11674. రసోదయమీనాడు..
నీ కలలు నా మాలికలైనందుకు..
నీ కలలు నా మాలికలైనందుకు..
11675. విడిచేసా కొన్నిష్టాలు..
నిన్ను మెప్పించే వీల్లేక ఓడినవని..
నిన్ను మెప్పించే వీల్లేక ఓడినవని..
11676. మౌనం మధురమే..
నా అనురాగాన్నిలా ప్రతిసారీ నీకందిస్తూ..
నా అనురాగాన్నిలా ప్రతిసారీ నీకందిస్తూ..
11677. వలపు సుడిగాలిలా నేనొస్తా..
పులకించాలని నీ మనసుకుంటే..
పులకించాలని నీ మనసుకుంటే..
11678. మొగ్గతొడిగిన నా వాక్యాలు..
నీ స్పందనకని ఎదురుచూస్తూ..
నీ స్పందనకని ఎదురుచూస్తూ..
11679. రాయని కృతిలా నేనవుతూ..
నీ స్మృతులలో మునిగినప్పుడల్లా..
నీ స్మృతులలో మునిగినప్పుడల్లా..
11680. ఉధృతిని నేనే..
గతితప్పిన హోరనుకొని నువ్వు ఆలకించలేదంతే..
గతితప్పిన హోరనుకొని నువ్వు ఆలకించలేదంతే..
11681. శిశిరాన్నసలు గుర్తించనే లేదు..
వసంతమూ హేమంతమూ ఇష్టమనుకున్నాక..
వసంతమూ హేమంతమూ ఇష్టమనుకున్నాక..
11682. ఆత్మసమార్పణందుకే చేసా..
నీ ఆరాధన నాకూ సమ్మతమేనని..
నీ ఆరాధన నాకూ సమ్మతమేనని..
11683. అచ్చుతప్పులవుతూ అక్షరాలు..
తడబడితే నీ వలపు సరిచేస్తుందని..
తడబడితే నీ వలపు సరిచేస్తుందని..
11684. ప్రతిస్పందనకి అవకాశమిస్తున్నా..
నాకు స్పందించి నువ్వో భావమవుతావని..
నాకు స్పందించి నువ్వో భావమవుతావని..
11685. ఆలకించేసా అనురాగాన్ని..
అసంకల్పితంగానైనా అనుసరిస్తున్నావని..
అసంకల్పితంగానైనా అనుసరిస్తున్నావని..
11686. ఇలాగే పాడుకుందాం యుగళగీతం..
యుగాంతమైనా అనుబంధం నిలిచుండేలా..
యుగాంతమైనా అనుబంధం నిలిచుండేలా..
11687. నివేదించినప్పుడే అనుకున్నా..
కృతిగా నా స్మృతినే సమర్పించావని..
కృతిగా నా స్మృతినే సమర్పించావని..
11688. మానసికమయ్యింది ఆనందం..
ఇన్ని రాగాల స్వరాలాపన మొదలయ్యిందని..
ఇన్ని రాగాల స్వరాలాపన మొదలయ్యిందని..
11689. శిల్పంగా మారిపోలేనా..
శిలగా భావించి నువ్వులి పట్టావంటే..
శిలగా భావించి నువ్వులి పట్టావంటే..
11690. సమాధి చేసేసా ఊహల్ని..
శకలాలై నన్ను పొడుస్తున్నాయని..
శకలాలై నన్ను పొడుస్తున్నాయని..
11691. తమకమే అనుకున్నా నిన్నటివరకూ..
గమనమై వెంటుంటావని తెలీక..
గమనమై వెంటుంటావని తెలీక..
11692. ప్రేమలోకం రమ్మంటుందిగా..
కలని నిజం చేస్తే తప్పేముందిప్పుడు..
కలని నిజం చేస్తే తప్పేముందిప్పుడు..
11693. మబ్బుల్లో దాగున్నా చందమామలా..
ముసురేసిన ఆకాశానికి చాటయ్యేందుకే..
ముసురేసిన ఆకాశానికి చాటయ్యేందుకే..
11694. నువ్వన్నది నిజమే..
గుప్పెడంత ప్రేమతో నీ గుండెను పాలిస్తున్నది నేనే..
గుప్పెడంత ప్రేమతో నీ గుండెను పాలిస్తున్నది నేనే..
11695. రెండో జాబిలందుకుందేమో నన్ను..
ఆకాశమందుకే అలా ఆశ్చర్యపోతుంది..
ఆకాశమందుకే అలా ఆశ్చర్యపోతుంది..
11696. అనంతమైన సుమగంధాలు..
నా నవ్వులు నీతో ప్రతిధ్వనిస్తున్నందుకు..
నా నవ్వులు నీతో ప్రతిధ్వనిస్తున్నందుకు..
11697. చుక్కల నవ్వులు..
ఎంతకని ఆమె వెన్నెలను అనుకరిస్తుందని..
ఎంతకని ఆమె వెన్నెలను అనుకరిస్తుందని..
11698. అధికమవుతూ అపురూపాలు..
నా నవ్వులు నీవిగా చేసుకున్నందుకు..
నా నవ్వులు నీవిగా చేసుకున్నందుకు..
11699. మరపురాని ఆనందాలు..
మధురిమలందించు నీ భావాల సుధలతో..
మధురిమలందించు నీ భావాల సుధలతో..
11700. మరువమంటి గుభాళింపులు..
మల్లెపూలను మించి దారాన్ని పెనవేసినట్టు
మల్లెపూలను మించి దారాన్ని పెనవేసినట్టు
No comments:
Post a Comment