11901. ప్రకృతిని ప్రేమిస్తున్నా..
నన్ను ప్రోత్సహిస్తుందదేగా..
11902. వింటున్నా నీ గానం..
ప్రేమను రగిలించి పాడుతున్నావనే..
ప్రేమను రగిలించి పాడుతున్నావనే..
11903. సంగీతం నీ పేరడిగింది..
నిన్ను కలిపి పాడాననే
11904. నీ క్షణాలు పరిమళాలే..
నా జ్ఞాపకాలున్నాయిగా అందులో..
11905. సకాలంలో కురుస్తున్న వర్షాలు..
ఋతువులకు క్రమశిక్షణ తెలిసినట్టుంది..
11906. దీర్ఘశ్వాసలు విరిగినట్టే..
నువ్వొచ్చి మనసు బాధ తీర్చేసాక..
11907. చిరునవ్వు తాకింది పెదవులను..
ఇన్నాళ్ళకి గుర్తొచ్చిన ఆనందంలో..
11908. తలలూపుతున్న ఆకులు..
గాలెంత మనొహరంగా వీస్తుందోనని మురిసిపోతూ..
11909. ఊహిస్తూ రాస్తున్నా..
మన పరిచయగీతానికి నిన్నే పల్లవిగా..
11910. పెదవుల మాటు దాచక తప్పలేదు..
మనసులో ముసురుకుంది అశాంతి మరి..
11911. వెలివేస్తుంది నిద్ర..
విరహమో..విషాదమో ఈ రాతిరిది..
11912. నీకు నువ్వుగా వచ్చావనుకున్నా..
నే పిలిచింది కల్లోనని..
11913. జ్ఞాపకం మురిసింది..
ఏకాంతంలో తనని పిలిచి ఆనందించావని..
ఏకాంతంలో తనని పిలిచి ఆనందించావని..
11914. పదింతలయ్యింది ప్రేమ..
నీతో కలిసి తను స్పందించేందుకని..
నీతో కలిసి తను స్పందించేందుకని..
11915. చినుకందుకే చిన్నగా కురిసింది..
మట్టి మురిపెం పరిమళించాలనే..
మట్టి మురిపెం పరిమళించాలనే..
11916. ఏముందో తెలీదా మనసులో..
నేనే నువ్వయిన క్షణంలో..
నేనే నువ్వయిన క్షణంలో..
11917. రోజుకో స్వప్నం..
నిన్నూ నన్నూ కలిపేందుకే రాత్రికొస్తుంది..
నిన్నూ నన్నూ కలిపేందుకే రాత్రికొస్తుంది..
11918. పువ్వులు తాకినంత మెత్తని నవ్వు..
నన్నెంత సున్నితంగా చూస్తున్నావో చెప్తూ..
నన్నెంత సున్నితంగా చూస్తున్నావో చెప్తూ..
11919. కలలు జారిపోతాయేమోననే కంగారది..
పెదవులు మాటలు ఒలికిస్తేనని..
పెదవులు మాటలు ఒలికిస్తేనని..
11920. తడబడుతోంది హృదయం..
నీ చూపుల్లో ఆనందం నేనవుతుంటే..
నీ చూపుల్లో ఆనందం నేనవుతుంటే..
11921. మనసుకి మొలిచిన రెక్కలివి..
కాగితంతో చేసినవని ఎగరొద్దంటావేం..
కాగితంతో చేసినవని ఎగరొద్దంటావేం..
11922. మబ్బుల పల్లకీ కదులుతోంది ముందుకు..
ఇక్కడ కురవడం అయిపోయిందనే మరి..
ఇక్కడ కురవడం అయిపోయిందనే మరి..
11923. తీరమంతా పంచదార తీపయ్యిందిగా..
నీ పలకరింపుల పుణ్యమనుకుంటానది..
నీ పలకరింపుల పుణ్యమనుకుంటానది..
11924. మట్టు పరిమళిస్తున్నప్పుడే అనుకున్నా..
చందనాన్ని పోలింది ఎందుకోనని..
11925.
Nice.!
ReplyDelete