3411. విరహంతో చంపుతున్నావెందుకో..
నీకు కన్నీరంత లోకువ కాకుంటే..
3412. నన్నలరించబోతున్న రేపొకటి..
పగటి కలగా నిత్యం నన్నూరిస్తూ..
3413. ఎన్ని కోరికల కుప్పవో నువ్వు..
చెక్కిలిపై చెమరింపును చారగా ఎండగడుతూ..
3414. మధువొలుకుతున్న భావాలు..
నీ తలపుతోనే నాలో ఉప్పొంగుతూ..
3415. బంగారువన్నె చిలకనైపోయా..
నీ ఊహలో మెరుపై కొలువుండిపోవాలనే
3416. సావాసమయ్యానందుకే..
పచ్చని ఆశను పువ్వుగా చేసావనే..
3415. మనసొక మధుగీతం..
పాడేకొద్దీ తనలో పరవశాన్ని పెంచుకుంటూ..
3416. తొలకరినై విచ్చేసా..
ముత్యమై మెరిసే అదృష్టం నాకుందనే..
3417. అమాసను వెతుక్కుంటావెందుకో..
పున్నమినై నేనొచ్చినా పట్టించుకోని ప్రవరాఖ్యుడిలా..
3418. నీ మనసు పైకెగిరితే చూడాలనుకున్నా..
జయప్రదనడిగి సిరిసిరిమువ్వలు అరువు తెచ్చానందుకే..
3419. పుష్యరాగాలను పలికించా కన్నుల్లో..
నీ చూపులు వెలిగించాలనే..
3420. మనసువారధి కొట్టుకుపోయిందనేమో..
కన్నుల్లో కలల కట్టడం కూలిపోకుండా కన్నీటిని చిలకరిస్తూ..
3421. మౌనమంటే ఎందుకంత ముచ్చటో..
మాటల్లోకి అనువదించేందుకు రాదనేమో..
3422. ఆమడదూరాలే బంధాలెప్పుడూ..
అనుబంధాలను వెక్కిరించినట్లు..
3423. మౌనానికి వెలుగొచ్చింది..
నీరవంలో నిండుగా తను నవ్వినందుకే..
3424. సప్పుడు సవ్వడైందనేమో..
చూపులో అలవికాని సిగ్గొచ్చి చేరింది..
3425. బరువెక్కిన వేకువ..
గడిచిన రేయి హాయిని నెమరింతల్లో...
నీకు కన్నీరంత లోకువ కాకుంటే..
3412. నన్నలరించబోతున్న రేపొకటి..
పగటి కలగా నిత్యం నన్నూరిస్తూ..
3413. ఎన్ని కోరికల కుప్పవో నువ్వు..
చెక్కిలిపై చెమరింపును చారగా ఎండగడుతూ..
3414. మధువొలుకుతున్న భావాలు..
నీ తలపుతోనే నాలో ఉప్పొంగుతూ..
3415. బంగారువన్నె చిలకనైపోయా..
నీ ఊహలో మెరుపై కొలువుండిపోవాలనే
3416. సావాసమయ్యానందుకే..
పచ్చని ఆశను పువ్వుగా చేసావనే..
3415. మనసొక మధుగీతం..
పాడేకొద్దీ తనలో పరవశాన్ని పెంచుకుంటూ..
3416. తొలకరినై విచ్చేసా..
ముత్యమై మెరిసే అదృష్టం నాకుందనే..
3417. అమాసను వెతుక్కుంటావెందుకో..
పున్నమినై నేనొచ్చినా పట్టించుకోని ప్రవరాఖ్యుడిలా..
3418. నీ మనసు పైకెగిరితే చూడాలనుకున్నా..
జయప్రదనడిగి సిరిసిరిమువ్వలు అరువు తెచ్చానందుకే..
3419. పుష్యరాగాలను పలికించా కన్నుల్లో..
నీ చూపులు వెలిగించాలనే..
3420. మనసువారధి కొట్టుకుపోయిందనేమో..
కన్నుల్లో కలల కట్టడం కూలిపోకుండా కన్నీటిని చిలకరిస్తూ..
3421. మౌనమంటే ఎందుకంత ముచ్చటో..
మాటల్లోకి అనువదించేందుకు రాదనేమో..
3422. ఆమడదూరాలే బంధాలెప్పుడూ..
అనుబంధాలను వెక్కిరించినట్లు..
3423. మౌనానికి వెలుగొచ్చింది..
నీరవంలో నిండుగా తను నవ్వినందుకే..
3424. సప్పుడు సవ్వడైందనేమో..
చూపులో అలవికాని సిగ్గొచ్చి చేరింది..
3425. బరువెక్కిన వేకువ..
గడిచిన రేయి హాయిని నెమరింతల్లో...
3427. మానసవీణల మౌనమే ఇది..
సద్దుచేయని సంగీతం తానవ్వాలని.
సద్దుచేయని సంగీతం తానవ్వాలని.
3429. మది కందిన భావం..
నా హృదిలో పోటెత్తిన రుధిరాలు జలపాతాలై ఎగిసిపడుతుంటే..
నా హృదిలో పోటెత్తిన రుధిరాలు జలపాతాలై ఎగిసిపడుతుంటే..
3430. ఏరువాక పొంగినట్లుంది నీ హృదయంలో..
విరహం కట్టెలు తెంచుకు ప్రవహిస్తుంటే..
విరహం కట్టెలు తెంచుకు ప్రవహిస్తుంటే..
3431. పగబట్టిన పసితనమొకటి..
ముసుగు తొలగిన తల్లిదండ్రుల మిధ్యాబింబాల్లో..
ముసుగు తొలగిన తల్లిదండ్రుల మిధ్యాబింబాల్లో..
3432. తిరిగి ఊపిరి పోసుకున్న జీవనం..
నీ శ్వాసలోని గంధాలు పూసుకొని..
నీ శ్వాసలోని గంధాలు పూసుకొని..
3433. లయమైన శృతి..
నీ పదనిసలకు పాదాలను కలగలిపి..
నీ పదనిసలకు పాదాలను కలగలిపి..
3434. ఏకాంతాన్ని నటిస్తున్న మనసు..
ఒంటరితనాన్ని చాటుకొని లోకువవలేక..
ఒంటరితనాన్ని చాటుకొని లోకువవలేక..
3435. భారమైంది మది..
వర్షంలో ముద్దైన పువ్వులా ముడుచుకొని..
వర్షంలో ముద్దైన పువ్వులా ముడుచుకొని..
3436. మరందాలతీపి తెలిసినట్లైంది..
తేనెఉప్పెనెల్లా నవ్వులు నన్ను ముంచెత్తుతుంటే..
తేనెఉప్పెనెల్లా నవ్వులు నన్ను ముంచెత్తుతుంటే..
3437. ఊపిరాగిపోతానంది..
నీ శ్వాసలో చోటివ్వక కసురుకుంటుంటే..
నీ శ్వాసలో చోటివ్వక కసురుకుంటుంటే..
3438. సంబరాలను మరచిన మనసులు..
అహరహం వేదనల్లోనే మునిగితేలుతూ..
అహరహం వేదనల్లోనే మునిగితేలుతూ..
3439. ముసురుకున్న మనసుమేఘం..
దిగులు దాచేసి మయూరమై నర్తిస్తూ..
దిగులు దాచేసి మయూరమై నర్తిస్తూ..
3440. అపరాజితనే నేనెప్పుడూ..
నీ హృదయ స్థావరాన్ని ఆక్రమించినందుకు..
నీ హృదయ స్థావరాన్ని ఆక్రమించినందుకు..
3441. గుండెల్లో అనంతవాహినై ప్రవహిస్తోంది..
నిన్న తొలకరించిన ప్రేమేననుకుంటా.
నిన్న తొలకరించిన ప్రేమేననుకుంటా.
3442. అక్షరహొయలంతే..
అణువణువూ ఒయారమై పరవళ్ళు తొక్కుతూ..
అణువణువూ ఒయారమై పరవళ్ళు తొక్కుతూ..
3443. కుంకుమపువ్వులని భ్రమపడ్డా..
నీ చెంపలు కెంపులుగా మెరుస్తుంటే ఆ మధ్యాహ్నంలో..
నీ చెంపలు కెంపులుగా మెరుస్తుంటే ఆ మధ్యాహ్నంలో..
3444. మనమై గెలిచిన సంతోషం..
చూపుల్లో మంగళతోరణాలు వెలిగిస్తూ..
చూపుల్లో మంగళతోరణాలు వెలిగిస్తూ..
3445. పువ్వై నవ్వుకున్న అందం..
నువ్వో తుమ్మెదవై అనుసరిస్తున్నందుకే..
నువ్వో తుమ్మెదవై అనుసరిస్తున్నందుకే..
3446. మమేకమై మునిగిపోతున్నా..
మనసైన ముచ్చట్ల మాయాజాలంలో మంత్రమేసినట్లుగా..
మనసైన ముచ్చట్ల మాయాజాలంలో మంత్రమేసినట్లుగా..
3447. నక్షతాల్లో నక్కినవేమో నీ చూపులు..
అమాసైనా మిణుక్కుమంటూ మేనంతా గిచ్చేస్తూ..
అమాసైనా మిణుక్కుమంటూ మేనంతా గిచ్చేస్తూ..
3448. నయగారాలై ఒలికాయి ఒయారాలు..
వలపుల్లో ఒణికిన సంగీతాలుగా..
వలపుల్లో ఒణికిన సంగీతాలుగా..
3449. నీ మౌనమే నా రక్ష..
మరో అనర్ధానికి కారణం కాకుండా
మరో అనర్ధానికి కారణం కాకుండా
3450. ప్రేమ శివంగినే..
నిన్ను అనుభూతుల ప్రవాహంలో ముంచెత్తువేళలో..
నిన్ను అనుభూతుల ప్రవాహంలో ముంచెత్తువేళలో..
No comments:
Post a Comment