Wednesday, 6 July 2016

3751 to 3800

3751. మిణుగురులను చూసి పొరబడ్డావేమో..
పున్నమికింకా పక్షానికి ముందుంది..
3752. కొత్తరూపాన్ని నాలో గమనించవెందుకో..
పాతచింతలకే వంతలు పాడుతూ..
3753. రూపం మార్చినా పాపాయినేగా..
నీకు రూపాలిచ్చిన రుబాయిలా..
3754. ఒక్కరాత్రినీ పండుగ చేసుకుంటున్నా..
ప్రతిరాత్రినీ గుర్తుకు తేవొద్దంటూ..
3755. మరో కొత్తకధ..
పాతది పూర్తవకుండానే..
3756. నీ చూపులో కరిగిపోతానేమో..
తడియారని మనసులోకెప్పుడు దించుతావో..
3757. కలలు నిజమయ్యే కొత్తవత్సరం..
కలతలను మరచిపొమ్మంది అరక్షణం..
3758. దృష్టి తగులుతుందని భయపడుతున్నా..
మరెన్ని గాలాలకు చిక్కుతానోనని..
3759. కొన్ని జీవితాలంతే..
శూన్యానికే అంకితమైపోతూ..
3760. చూపును సరిదిద్దుకుంటున్నా..
నీ అక్షరాల పదును చూడాలనే..
3761. మనసురకలేసింది..
ఆపలేని చెలియలకట్టను దాటుకొని తానాగనంటూ..
3762. హృదయానికి హత్తుకుంటే చాలనుకున్నా..
చేతులు చేజార్చినా ఫరవాలేదనే..
3763. కోయిలనైపోయా నేనే..
నీ వలపుపాటకు బదులిచ్చే ఆనందంలోనే..
3764. 
రోజూలాగే తెల్లారిందేమిటో కొత్త సంవత్సరం..
కొత్తపువ్వూ.. నవ్వూ ఏదీ పూయకుండానే
3765. నిన్న విశ్వకర్మని పిలిచినప్పుడే అనుకున్నా..
నా జ్ఞాపకాలతో వైభవకట్టడమేదో నిర్మించబోతున్నావని..
3766. చిగురాకుల ఊసులు వింటున్నా..
హేమంత చలిగాలికి ఒణుకుతున్నట్లు..
3767. ఆత్మపరిశీలన మొదలెట్టా..
నాలో సంతోషం దాగుందేమో వెలికితీద్దామనే..
3768. వయసు దాచేసా నా ఊహలకు..
వెంటబడే ఆలోచనుంటే నువ్వు మానుకుంటావని..
3769. పరవశాల పర్ణశాలైంది నా మది..
నీతో కలిసి అక్షరయఙ్ఞం చేస్తుంటే..
3770. మూగనోము వీడితే చాలనుకుంటా..
మాటలు ప్రవహించి పారేందుకు..
3771. కన్నుకొడుతుంటే పొరబడ్డా..
కొంపదీసి ఏ కబురు వినాలోనని..
3772. కకావికలమైంది మది..
నా జ్ఞాపకాలలోని నువ్వో అబద్ధమని..
3773. మమతకు గడేసా..
నా మదిలోంచీ నువ్వు పారిపోరాదని..
3774. కన్నుల్లో పువ్వులేసుకొని ఎదురుచూస్తున్నా..
దారితప్పక నువ్వు తిరిగొస్తావనే..
3775. తోడవుతున్నా నీతో..
అలశ్యంగానైనా పెరుగవుదామనే..
3776. కొత్తకధలెందుకులే..
నీ కలలోకి నన్ను పిలవలేనని చెప్పక..
3777. చీకటిలోనూ మెరుస్తావు..
ఆనందం నీ ఇంటిపేరని కాబోలు..
3778. పరవశానికి పలుభంగిమలు..
నీ కన్నీటిబొమ్మల్లో నన్ను తిలకిస్తుంటే..
3779. ఎర్రచీర కట్టుకొని అలసిపోయిన తీరాన్నే..
ఒడ్డుకు చేరని అలవై నువ్వాడిస్తుంటే..
3780. మనసుకు దూరం పెట్టానందుకే..
నీ వలపుసెగలకే వేడెక్కువయ్యానని...
3781. పాత సంసారమనే అనుకున్నా..
కొత్తరాగాలు నువ్వాలపించే వరకూ..
3782. నివురైపోవద్దని వేడుకుంటున్నా..
కాలపు గాలాన్ని విడిపించుకుని వద్దామనే..
3783. వేకువపూలకై వేచిచూస్తున్నా..
మంచుతెరలను చీల్చుకొని నాపై కురుస్తాయనే..
3784. నమ్మకానికి రెక్కలొచ్చాయి..
నీ అక్షరాల్లోనూ ప్రేమ కనుమరుగయ్యిందనే
3785. 
క్షమార్హం కోల్పోయిన ప్రేమ..లిపినే మరచిన నిరీక్షణలో
3786. వెన్నెలనై వద్దామనుకున్నా రాతిరికి..
నిద్దరోయావనే కలలోకొచ్చి చేరిపోయా
3787. సిరివెన్నెలైంది..
బంధాలు పరిమళించే గంధాలను గుర్తుకుతెస్తుంటే..
3788. భావాలకెన్ని సెగలో..
రాయొద్దనుకుంటూనే మౌనాన్ని రాసేందుకు  సాహసించినందుకేమో 
3789. ఉరకలెత్తింది మనసు..
గోదారివై నాకోసం కాచుకున్నావని తెలిసి..
3790. తూకమేసాలే నీ వలపుని..
నా బరువుని మించిపోయుంటుందని..
3791. రాత్రి తాలూకు చీకటికి సైతం సానుభూతయ్యింది..
ఒక సమాధి కాలేని నిజం మౌనమయ్యిందని..
3792. తరువై ఎదిగిన తనువనుకుంటా..
పచ్చదనాన్ని ప్రతికాలంలోనూ కాపాడుకుంటూ..
3793. సిరాలో నెత్తురు కలిసిందేమో పాపం..
భాష్యానికందని పాండిత్యం ఒలికిస్తోంది కలం..
3794. నల్లనయ్యవనే మెచ్చాను..
రూపును కాదని మహిమను గుర్తించి..
3795. పావురానివనే నీతో జతకట్టాను..
నీ మనసలా ప్రతిబంబించిందని..(శాంతి..స్
వచ్ఛత..శ్వేతవర్ణం)
3796. తిరునాళ్ళేమిటో తనువులో..
నిద్దురపోమంటే లేచి నాట్యం మొదలెడుతోంది..
3797. నీ మౌనం మోగినట్లయ్యింది..
మోహానికి గగనమే హద్దయ్యిందనేమో..
3798. కలల కోసమే పగటినిద్రను మొదలెట్టా..
అలావాటు కాకముందే నీ ఆరోపణలెందుకో..
3799. వేకువపూలు చల్లానందుకే..
పరిమళ ఉషోదయాన్ని నువ్వు గుర్తించాలని..
3800. కన్నీటిలో కనుమరుగైపోవాలనుంది..
వియోగాన్ని విషాదంగా మార్చి రాల్చేస్తావని..

No comments:

Post a Comment