3651. ప్రేమనుకొనే మొదలెట్టా స్నేహం..
యుద్ధమై ముగుస్తుందని తెలియక..
3652. పువ్వులపల్లకిలో ఊరేగుతున్నట్లుంది..
నీ నవ్వులు నన్నింతగా ఊపేస్తుంటే..
3653. పువ్వులపల్లకిలో ఊరేగుతున్నట్లుంది..
నీ నవ్వులు నన్నింతగా ఊపేస్తుంటే..
3654. ఉడుకుతనం నేర్పుతావెందుకో మనసుకి..
మరొకరి అందాలను పొగిడి..
3655. చూపుతోనే అందుకున్నా రాయబారాలు..
పెదవులు చెప్పలేని ప్రేమకబుర్లు..
3656. చెమరింపునిచ్చిన నీ ఊహలు...
గాయాన్ని మరింత రేప్పెడుతూ..
3657. అక్షరాల్ని ఎక్కుపెట్టాననుకున్నా నువ్వు వలపిస్తావని..
మనసు విలపిస్తోంది నువ్వెంత ప్రమాదమోనని..
3658. ఆదర్శం కాలేని అక్షరాలు కొన్ని..
నీటిలో రాసినట్లుగా నోట్లోంచీ జారిపోతూ..
3659. మనసు నిండిపోయింది..
నువ్వంపిన తేనెవిందులను ప్రియమారా ఆరగించి..
3660. అనుసరిస్తూనే ఉన్న నీలినీడలు..
నేనెక్కడ చూపుదాటి కనుమరుగవుతానోనని..
3661.
మువ్వలు ముడుచుకున్నాయి..
నా నవ్వుల సవ్వళ్ళనే నువ్వాస్వాదిస్తుంటే..
3662. మరణించి చానాళయ్యిందని మరచిందా మనసు..
పెదవులెప్పుడూ ఎర్రగా నవ్వినట్లే అనిపిస్తుంటే.
3663. కలానికీ లోకువవుతున్నా..
నిన్ను రాయాలని ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమవుతున్న నేను..!
3664. కరిగి నీరై ప్రవహిస్తున్నా..
మనసులో తడింకా ఇంకిపోలేదని..
3665. లయమైపోమంది ఆనందంలో..
సవ్వడించే నీ హృదయాన్ని హత్తుకుంటూనే..
3666. కట్టెలకైతే తప్పలేదు..
తుదివీడ్కోలు తన మీదుగా సాగడం..
3667. వెన్నెలైన చీకటిరేయి..
నీ సన్నిధిలో నేను పరవశించినందుకు..
3668. మనసాలకిస్తోందొక మధుర కవనం..
హేమంతం స్పృశించిన చల్లనిభావం..
3669. రేపటి నిరీక్షణలో నేను..
నా నవ్వులు తిరిగిచ్చేస్తావని..
3670. ఊపిరిపోస్తున్నా ఆశలకు..
నా జీవనాన్ని వెలిగించేందుకు నువ్వొస్తావని..
3671. ముద్దైతేనేమి చెక్కిలి..
ఏడ్చేడ్చి మనసూ శరీరమూ తేలికవుతున్నయిగా..
3672. అక్షరాలకు పుప్పొడినద్దా..
అనుభూతులు మెరుస్తాయని..
3673. నాకంటూ మిగిలిందేంటని..
నా జీవితాన్ని నువ్వే ఆక్రమించుకున్నాక..
3674. నియంత్రించలేని జలపాతంలా ఆనందం..
నీ మేలిమలుపు నేనయ్యాననే..
3675. ఎదురుచూపులకు మంగళం పాడమంటున్నా..
నేనొచ్చాననే సంకేతాన్ని సవ్వడిస్తూ..
3676. వ్యర్ధమైన అపార్ధాలే..
వ్యక్తిత్వమెంత వికసించినా..
3677. శ్వేతవర్ణం పులుముకుంది మది..
పరిమళిస్తున్న స్వేదానికి పరవశించి
3678. అమితంగా ఆస్వాదించిన ఆ క్షణాలేగా..
స్మృత్యంతర ప్రవాహంలో నిన్ను దగ్గరచేసినవి..
3679. లెక్క తప్పిన జీవితం..
తీసివేతలనే పెనవేతలుగా భ్రమపడ్డందుకు..
3680.హేమంతాన్ని రాయడం నీ దగ్గరే నేర్చుకున్నా..
గడచిన అనుభూతుల గంధాన్ని మదికి పూసావని..
3681. ఏరు దాటాక తగలేసే తెప్పలే ఎక్కువ..
నిండు పడవకి మునకేమిటో తెలియదు కనుక..
3682. ఎదురీదుతున్నా ప్రవాహానికే..
నీ తొలిస్పర్శ సంతోషం నేనైనందుకే..
3683. వినిపిస్తోందో కమ్మనిస్వరం
గమ్మత్తుగా తనలో లీనం చేసుకుంటూ..
3684. ఏ మధురసాలు తాగావో..
చెవిలోనూ తీయందనాలు చొప్పిస్తూ..
3685. ఝడుసుకున్న రాతిరి..
పురివిప్పుకున్న వెలుతురుకు చూపు ఆనక..
3686. ప్రేమరసాన్ని పాడమన్నా..
నీ నిషాదాల విషాదాలను ఓర్వలేకనే..
3687. ఏం సాయమడిగానని..
చూపులతోనే కసిరి కొడుతూ నువ్వు..
3688. చెలియలకట్టలెన్నైనా ఆపలేవుగా..
ప్రేమ ఉప్పొంగి ఉధృతమై నిన్నల్లుకుంటే..
3689. చూపుతిప్పుకోనివ్వవుగా..
కన్నులలో మంత్రదండమేదో దాచుకున్న నువ్వు..
3690. ఆనందాన్ని అర్ధం చేసుకున్నా..
అందాన్ని నువ్వలా వెతుకుతుంటే..
3691. కంచికి చేరని కధలే చెప్తావెందుకో..
నీ గమ్యాన్ని నేనని మరచిపోతూ..
3692. చీకటిలో వెతుకులాటలేమిటో..
శశివదనమై నే నెదురుగనే నిలబడితే..
3693. పదునైన కోరికని కాదనలేకున్నా..
పరువం గుసగుసలను కావాలంటుంటే..
3694. వెక్కిళ్ళెందుకో హృదయానికి..
అందాన్ని ఆరగిస్తూ గొంతులోకి దిగనివ్వక..
3695. పువ్వులమేనాలో తోడుకెళ్తున్నా..
మెత్తనైన నీ మది కందిపోరాదనే..
3696. నిన్నెప్పుడో మరచిపోయా..
కొత్తగా పరిచయం చేసుకొనేందుకు ప్రయత్నించు..
3697. మకరందానికి మత్తెక్కుతావేమో..
నేను కలిపే నవ్వుల తీపెక్కువైతే..
3698. నీ కమ్మనైన కబురులే జ్ఞాపకం..
మోడువారిన హృదయానికి తడిని మిగులుస్తూ..
3699. స్పృహ తెప్పించే మంత్రమేదీ రాదంటున్నా..
నీ మాటలు అర్ధం చేసుకోలేకనే..
3700. ఆనందం నేనౌతున్నా..
నీ అక్షరం నన్ను అనుభూతించినప్పుడల్లా..
యుద్ధమై ముగుస్తుందని తెలియక..
3652. పువ్వులపల్లకిలో ఊరేగుతున్నట్లుంది..
నీ నవ్వులు నన్నింతగా ఊపేస్తుంటే..
3653. పువ్వులపల్లకిలో ఊరేగుతున్నట్లుంది..
నీ నవ్వులు నన్నింతగా ఊపేస్తుంటే..
3654. ఉడుకుతనం నేర్పుతావెందుకో మనసుకి..
మరొకరి అందాలను పొగిడి..
3655. చూపుతోనే అందుకున్నా రాయబారాలు..
పెదవులు చెప్పలేని ప్రేమకబుర్లు..
3656. చెమరింపునిచ్చిన నీ ఊహలు...
గాయాన్ని మరింత రేప్పెడుతూ..
3657. అక్షరాల్ని ఎక్కుపెట్టాననుకున్నా నువ్వు వలపిస్తావని..
మనసు విలపిస్తోంది నువ్వెంత ప్రమాదమోనని..
3658. ఆదర్శం కాలేని అక్షరాలు కొన్ని..
నీటిలో రాసినట్లుగా నోట్లోంచీ జారిపోతూ..
3659. మనసు నిండిపోయింది..
నువ్వంపిన తేనెవిందులను ప్రియమారా ఆరగించి..
3660. అనుసరిస్తూనే ఉన్న నీలినీడలు..
నేనెక్కడ చూపుదాటి కనుమరుగవుతానోనని..
3661.
మువ్వలు ముడుచుకున్నాయి..
నా నవ్వుల సవ్వళ్ళనే నువ్వాస్వాదిస్తుంటే..
3662. మరణించి చానాళయ్యిందని మరచిందా మనసు..
పెదవులెప్పుడూ ఎర్రగా నవ్వినట్లే అనిపిస్తుంటే.
3663. కలానికీ లోకువవుతున్నా..
నిన్ను రాయాలని ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమవుతున్న నేను..!
3664. కరిగి నీరై ప్రవహిస్తున్నా..
మనసులో తడింకా ఇంకిపోలేదని..
3665. లయమైపోమంది ఆనందంలో..
సవ్వడించే నీ హృదయాన్ని హత్తుకుంటూనే..
3666. కట్టెలకైతే తప్పలేదు..
తుదివీడ్కోలు తన మీదుగా సాగడం..
3667. వెన్నెలైన చీకటిరేయి..
నీ సన్నిధిలో నేను పరవశించినందుకు..
3668. మనసాలకిస్తోందొక మధుర కవనం..
హేమంతం స్పృశించిన చల్లనిభావం..
3669. రేపటి నిరీక్షణలో నేను..
నా నవ్వులు తిరిగిచ్చేస్తావని..
3670. ఊపిరిపోస్తున్నా ఆశలకు..
నా జీవనాన్ని వెలిగించేందుకు నువ్వొస్తావని..
3671. ముద్దైతేనేమి చెక్కిలి..
ఏడ్చేడ్చి మనసూ శరీరమూ తేలికవుతున్నయిగా..
3672. అక్షరాలకు పుప్పొడినద్దా..
అనుభూతులు మెరుస్తాయని..
3673. నాకంటూ మిగిలిందేంటని..
నా జీవితాన్ని నువ్వే ఆక్రమించుకున్నాక..
3674. నియంత్రించలేని జలపాతంలా ఆనందం..
నీ మేలిమలుపు నేనయ్యాననే..
3675. ఎదురుచూపులకు మంగళం పాడమంటున్నా..
నేనొచ్చాననే సంకేతాన్ని సవ్వడిస్తూ..
3676. వ్యర్ధమైన అపార్ధాలే..
వ్యక్తిత్వమెంత వికసించినా..
3677. శ్వేతవర్ణం పులుముకుంది మది..
పరిమళిస్తున్న స్వేదానికి పరవశించి
3678. అమితంగా ఆస్వాదించిన ఆ క్షణాలేగా..
స్మృత్యంతర ప్రవాహంలో నిన్ను దగ్గరచేసినవి..
3679. లెక్క తప్పిన జీవితం..
తీసివేతలనే పెనవేతలుగా భ్రమపడ్డందుకు..
3680.హేమంతాన్ని రాయడం నీ దగ్గరే నేర్చుకున్నా..
గడచిన అనుభూతుల గంధాన్ని మదికి పూసావని..
3681. ఏరు దాటాక తగలేసే తెప్పలే ఎక్కువ..
నిండు పడవకి మునకేమిటో తెలియదు కనుక..
3682. ఎదురీదుతున్నా ప్రవాహానికే..
నీ తొలిస్పర్శ సంతోషం నేనైనందుకే..
3683. వినిపిస్తోందో కమ్మనిస్వరం
గమ్మత్తుగా తనలో లీనం చేసుకుంటూ..
3684. ఏ మధురసాలు తాగావో..
చెవిలోనూ తీయందనాలు చొప్పిస్తూ..
3685. ఝడుసుకున్న రాతిరి..
పురివిప్పుకున్న వెలుతురుకు చూపు ఆనక..
3686. ప్రేమరసాన్ని పాడమన్నా..
నీ నిషాదాల విషాదాలను ఓర్వలేకనే..
3687. ఏం సాయమడిగానని..
చూపులతోనే కసిరి కొడుతూ నువ్వు..
3688. చెలియలకట్టలెన్నైనా ఆపలేవుగా..
ప్రేమ ఉప్పొంగి ఉధృతమై నిన్నల్లుకుంటే..
3689. చూపుతిప్పుకోనివ్వవుగా..
కన్నులలో మంత్రదండమేదో దాచుకున్న నువ్వు..
3690. ఆనందాన్ని అర్ధం చేసుకున్నా..
అందాన్ని నువ్వలా వెతుకుతుంటే..
3691. కంచికి చేరని కధలే చెప్తావెందుకో..
నీ గమ్యాన్ని నేనని మరచిపోతూ..
3692. చీకటిలో వెతుకులాటలేమిటో..
శశివదనమై నే నెదురుగనే నిలబడితే..
3693. పదునైన కోరికని కాదనలేకున్నా..
పరువం గుసగుసలను కావాలంటుంటే..
3694. వెక్కిళ్ళెందుకో హృదయానికి..
అందాన్ని ఆరగిస్తూ గొంతులోకి దిగనివ్వక..
3695. పువ్వులమేనాలో తోడుకెళ్తున్నా..
మెత్తనైన నీ మది కందిపోరాదనే..
3696. నిన్నెప్పుడో మరచిపోయా..
కొత్తగా పరిచయం చేసుకొనేందుకు ప్రయత్నించు..
3697. మకరందానికి మత్తెక్కుతావేమో..
నేను కలిపే నవ్వుల తీపెక్కువైతే..
3698. నీ కమ్మనైన కబురులే జ్ఞాపకం..
మోడువారిన హృదయానికి తడిని మిగులుస్తూ..
3699. స్పృహ తెప్పించే మంత్రమేదీ రాదంటున్నా..
నీ మాటలు అర్ధం చేసుకోలేకనే..
3700. ఆనందం నేనౌతున్నా..
నీ అక్షరం నన్ను అనుభూతించినప్పుడల్లా..
No comments:
Post a Comment