3951. నీకు నేనూపిరిగా మారినప్పుడే అనుకున్నా..
ప్రపంచం నీకు శత్రువు కాబోతోందని..
3952. నిట్టూర్చడం మానేసా..
సెగలతో పగలంతా నువ్వు రగిలిపోతున్నావనే..
3953. మనసుపడ్డానందుకే..
ఎండమావినంటూ నన్ను విస్మరించలేదనే..
3954. వస్త్రం చుట్టే ప్రయత్నం చేయవలసింది..
అందమైన లోకాన్ని అందరికీ కానుకచేస్తూ..
3956. మైమురుస్తోంది హృదయం..
క్షణాలతో అర్చించేందుకు నువ్వు నిరీక్షిస్తున్నావని..
3957. చప్పట్లకి చేతులెప్పుడూ సిద్ధమే..
కురచైన మనిషిని కాలేనందుకు..
3958. మధుశృతులు మిగిలే ఉన్నాయి..
నీ వియోగాన్ని ఆస్వాదించమంటూ..
3959. రెప్పపాటునెందుకు విసుక్కుంటావలా..
కలలోనూ నీ జతయ్యే నేనుండగానే..
3960. లోకానికి వెరుస్తావెందుకో..
మంచిపని చేసేందుకు సంకల్పం నేనిస్తానంటే..
3961. నేనో అవకాశాన్నే..
నీ తలపులజల్లులో కురిసేందుకే ఎదురుచూస్తూ..
3962. నిప్పులాంటి సత్యాన్ననే వెనుకనున్నా..
ముందుకొస్తే నీకు మండుతుందని..
3963. మచ్చికచేసుకోవాలి లోకాన్ని..
విశ్వంలోని ప్రేమంతా నీకు మోకరిల్లంటే..
3964. మధువై రాల్చిన మధురోహలెన్నో..
దోసిలిలో ఇమడలేనని జారిపోతూ..
3965. విరహోన్మాదాన్ని నాకిచ్చావు..
నా తలపులవిలాసాల్లో నువ్వు మునుగుతూనే..
3966. వలపు నివేదనది..
కరగని హృదయానికి పల్లవై రవళిస్తూ..
3967. ఒడిసిపట్టా స్మృతులు కొన్ని..
అలసినప్పుడు హృదయాన్ని చైతన్యపరుస్తాయని..
3968. ఎముకలగూడులో ఉండనంటోంది నా మనసు..
నీ పస్తులకు విరహమనే పేరెట్టుకుంటుంటే..
3969. నేనో తీపినే..
చప్పని హృదయానికి రుచిని అందిస్తూ..
3970. అశ్వంగా మారింది శ్వాస..
ఊపిరివై నువ్వు హృదిలోనికొస్తుంటే..
3971. మధురభావనే నేను..
అర్ధం చేసుకుంటే నీలా..అర్ధం కాకుంటే నాలా..
3972. శిలాశాసనాల మాటెందుకులే..
శిధిలమైన నీ హృదయం నాకొద్దంటుంటే..
3973. హృద్గుహలోకెప్పుడొచ్చావో..
మదిలోని ఊసులన్నీ కొరుక్కు తినేస్తూ..
3974. అరిగిపోయిన సుద్దులే మిగిలాయి..
బుద్ధిని మార్చలేని యాతనల్లో..
3975. నివురయ్యావెందుకో నిరీక్షణలో..
నీ పిపాసను అర్ధంచేసుకొనే అవకాశమివ్వకుండానే..
3976. చిలక్కొయ్యకు తగిలించావేమో హృదయాన్ని..
మాటలతోనే నన్ను నొప్పిస్తూ..
3977. పొగమంచు నవ్వింది..
మరోనెల నీకు చలిదుప్పట్లు కప్పొచ్చని..
3978. పేరెప్పుడో మరచిపోయా..
నీతో కలిపి సంబోధిస్తుంటే నన్నంతా..
3979. కృష్ణుడ్నెప్పుడూ మరచిపోతావు..
బృందావనానికి నన్ను మాత్రమే ఆహ్వానించాడని..
3980. మనోహరమైనప్పుడే అనుకున్నా..
రాధను మెప్పించగలిగే ఆరాధన నీదేనని..
3981. రజనీవని తెలియదు కాబోలు..
పట్టపగలు నల్లపూసలా కనబడుతుంటే..
3982. నీకు కానుకైనప్పుడే అనుకున్నా..
మరో ఏడుజన్మలు నీతోనేనని..
3983. గవ్వనై సవ్వడిస్తున్నా..
నీ అరచేతిలో ఆటగానైనా మిగిలిపోవాలని..
3984. తారల తోడు తీసుకున్నావనుకున్నా..
నువ్వలా ఆశలో మిణుక్కుమంటుంటే..
3985. జీవితనౌక గమ్యమొకటుందని అనుకోలా..
నన్నక్షరాల నడుమ చేర్చేవరకూ..
3986. బలీయమైంది మానసం..
నీ సాగతీతలకు వెతలను కరిగించి..
3987. నయనతారగా మిగిలిపోదామనుకున్నా..
సితారవంటూ చదివి పక్కనపడేస్తావని తెలిసే..
3988. ఎంతో బంగారం బయటపడుతుందనుక్కున్నా..
బంగారమంటూ నన్నిన్నాళ్ళూ దాచుకున్నవనే..
3989. పెదవులకి తప్పని రంగులు..
వెతల్ని మింగలేని బ్రతుకులో..
3990. ఇంద్రుడికి ముందే చెప్దామనుకున్నా..
తన కళ్ళిచ్చి నాకై వేచే నిన్ను వెలిగించొద్దని..
3991. అమ్మలా ఆహ్వానించిదిగా ఊరు..
కౌగిలించడంలో నీదే ఆలశ్యం..
3992. తుమ్మెదలా వచ్చాననుకోకుండా..
పువ్వై పిలిచావనుకొని..
3993. విరహమయ్యావందుకేనా..
ప్రేమకవతలి వైపు తీపిని పరిచయించేందుకు..
3994. అనునయమై ఉందామనుకున్నా..
నీ మౌనంతో మరణిస్తానని ఊహించక..
3995. వారధిమనమవుదామా..
దూరాలను కలిపే నింగీనేలగా మారి..
3996. భావవల్లరిలో చిక్కినట్లుంది..
గిజిగాడివై వేకువనే నువ్వలా అల్లుతుంటే..
3997. లయమయిపోవడం గుర్తులేదు..
నీ శృతులలో పల్లవిగా మారుమోగుతుంటే..
3998. మౌనిగా మారింది నేనేగా..
నీలో నిశ్శబ్దాన్ని కాజేస్తూ..
3999. బ్రహ్మాండమైన సత్యాలెందుకులే..
కంటికి కనిపించని అస్పష్టతను వెతుక్కుంటూ..
4000. కుంకుమపువ్వుల సందళ్ళు నెలతమోములో..
మనసావహించిన మధురస్మృతుల సాంత్వనలో..
ప్రపంచం నీకు శత్రువు కాబోతోందని..
3952. నిట్టూర్చడం మానేసా..
సెగలతో పగలంతా నువ్వు రగిలిపోతున్నావనే..
3953. మనసుపడ్డానందుకే..
ఎండమావినంటూ నన్ను విస్మరించలేదనే..
3954. వస్త్రం చుట్టే ప్రయత్నం చేయవలసింది..
అందమైన లోకాన్ని అందరికీ కానుకచేస్తూ..
3956. మైమురుస్తోంది హృదయం..
క్షణాలతో అర్చించేందుకు నువ్వు నిరీక్షిస్తున్నావని..
3957. చప్పట్లకి చేతులెప్పుడూ సిద్ధమే..
కురచైన మనిషిని కాలేనందుకు..
3958. మధుశృతులు మిగిలే ఉన్నాయి..
నీ వియోగాన్ని ఆస్వాదించమంటూ..
3959. రెప్పపాటునెందుకు విసుక్కుంటావలా..
కలలోనూ నీ జతయ్యే నేనుండగానే..
3960. లోకానికి వెరుస్తావెందుకో..
మంచిపని చేసేందుకు సంకల్పం నేనిస్తానంటే..
3961. నేనో అవకాశాన్నే..
నీ తలపులజల్లులో కురిసేందుకే ఎదురుచూస్తూ..
3962. నిప్పులాంటి సత్యాన్ననే వెనుకనున్నా..
ముందుకొస్తే నీకు మండుతుందని..
3963. మచ్చికచేసుకోవాలి లోకాన్ని..
విశ్వంలోని ప్రేమంతా నీకు మోకరిల్లంటే..
3964. మధువై రాల్చిన మధురోహలెన్నో..
దోసిలిలో ఇమడలేనని జారిపోతూ..
3965. విరహోన్మాదాన్ని నాకిచ్చావు..
నా తలపులవిలాసాల్లో నువ్వు మునుగుతూనే..
3966. వలపు నివేదనది..
కరగని హృదయానికి పల్లవై రవళిస్తూ..
3967. ఒడిసిపట్టా స్మృతులు కొన్ని..
అలసినప్పుడు హృదయాన్ని చైతన్యపరుస్తాయని..
3968. ఎముకలగూడులో ఉండనంటోంది నా మనసు..
నీ పస్తులకు విరహమనే పేరెట్టుకుంటుంటే..
3969. నేనో తీపినే..
చప్పని హృదయానికి రుచిని అందిస్తూ..
3970. అశ్వంగా మారింది శ్వాస..
ఊపిరివై నువ్వు హృదిలోనికొస్తుంటే..
3971. మధురభావనే నేను..
అర్ధం చేసుకుంటే నీలా..అర్ధం కాకుంటే నాలా..
3972. శిలాశాసనాల మాటెందుకులే..
శిధిలమైన నీ హృదయం నాకొద్దంటుంటే..
3973. హృద్గుహలోకెప్పుడొచ్చావో..
మదిలోని ఊసులన్నీ కొరుక్కు తినేస్తూ..
3974. అరిగిపోయిన సుద్దులే మిగిలాయి..
బుద్ధిని మార్చలేని యాతనల్లో..
3975. నివురయ్యావెందుకో నిరీక్షణలో..
నీ పిపాసను అర్ధంచేసుకొనే అవకాశమివ్వకుండానే..
3976. చిలక్కొయ్యకు తగిలించావేమో హృదయాన్ని..
మాటలతోనే నన్ను నొప్పిస్తూ..
3977. పొగమంచు నవ్వింది..
మరోనెల నీకు చలిదుప్పట్లు కప్పొచ్చని..
3978. పేరెప్పుడో మరచిపోయా..
నీతో కలిపి సంబోధిస్తుంటే నన్నంతా..
3979. కృష్ణుడ్నెప్పుడూ మరచిపోతావు..
బృందావనానికి నన్ను మాత్రమే ఆహ్వానించాడని..
3980. మనోహరమైనప్పుడే అనుకున్నా..
రాధను మెప్పించగలిగే ఆరాధన నీదేనని..
3981. రజనీవని తెలియదు కాబోలు..
పట్టపగలు నల్లపూసలా కనబడుతుంటే..
3982. నీకు కానుకైనప్పుడే అనుకున్నా..
మరో ఏడుజన్మలు నీతోనేనని..
3983. గవ్వనై సవ్వడిస్తున్నా..
నీ అరచేతిలో ఆటగానైనా మిగిలిపోవాలని..
3984. తారల తోడు తీసుకున్నావనుకున్నా..
నువ్వలా ఆశలో మిణుక్కుమంటుంటే..
3985. జీవితనౌక గమ్యమొకటుందని అనుకోలా..
నన్నక్షరాల నడుమ చేర్చేవరకూ..
3986. బలీయమైంది మానసం..
నీ సాగతీతలకు వెతలను కరిగించి..
3987. నయనతారగా మిగిలిపోదామనుకున్నా..
సితారవంటూ చదివి పక్కనపడేస్తావని తెలిసే..
3988. ఎంతో బంగారం బయటపడుతుందనుక్కున్నా..
బంగారమంటూ నన్నిన్నాళ్ళూ దాచుకున్నవనే..
3989. పెదవులకి తప్పని రంగులు..
వెతల్ని మింగలేని బ్రతుకులో..
3990. ఇంద్రుడికి ముందే చెప్దామనుకున్నా..
తన కళ్ళిచ్చి నాకై వేచే నిన్ను వెలిగించొద్దని..
3991. అమ్మలా ఆహ్వానించిదిగా ఊరు..
కౌగిలించడంలో నీదే ఆలశ్యం..
3992. తుమ్మెదలా వచ్చాననుకోకుండా..
పువ్వై పిలిచావనుకొని..
3993. విరహమయ్యావందుకేనా..
ప్రేమకవతలి వైపు తీపిని పరిచయించేందుకు..
3994. అనునయమై ఉందామనుకున్నా..
నీ మౌనంతో మరణిస్తానని ఊహించక..
3995. వారధిమనమవుదామా..
దూరాలను కలిపే నింగీనేలగా మారి..
3996. భావవల్లరిలో చిక్కినట్లుంది..
గిజిగాడివై వేకువనే నువ్వలా అల్లుతుంటే..
3997. లయమయిపోవడం గుర్తులేదు..
నీ శృతులలో పల్లవిగా మారుమోగుతుంటే..
3998. మౌనిగా మారింది నేనేగా..
నీలో నిశ్శబ్దాన్ని కాజేస్తూ..
3999. బ్రహ్మాండమైన సత్యాలెందుకులే..
కంటికి కనిపించని అస్పష్టతను వెతుక్కుంటూ..
4000. కుంకుమపువ్వుల సందళ్ళు నెలతమోములో..
మనసావహించిన మధురస్మృతుల సాంత్వనలో..
No comments:
Post a Comment