3601. నిద్దరోనన్న దేహం..
చీకటైనా నీ చింతనలు తీరలేదని..
3602. అంబరాన్ని చుంబించే భావం..
నన్ను చూసి నీ పెదవులుల్లో చిగురించే హాసం..
3603. మంత్రాలు తెలుసేమో నీ మౌనానికి..
నా చూపుని తనవైపుకి లాక్కుంటూ..
3604. నీ పెదవులదదెంత అదృష్టమో..
తీరనిఆశలకు తేలికగా పొగపెడుతూ..
3605. ఆరుకాలాలూ వసంతాలేగా..
చెలినవ్వుల జలతారులో నీవు కప్పుకొనుంటే,,
3606. కదిలిపోయా నీ భావాలకు..
అక్షరాలను చెక్కినట్లు చిత్రిస్తుంటే..
3607. ఎదలో తేనెలు తుళ్ళిపడుతుంటాయి..
నువ్వొచ్చి జలకాలడినట్లుండే ప్రతిసారీ..
3608. సంకెళ్ళు లేని జీవితం..
ఒంటరితనానికదే ఎనలేని ఓదార్పు..
3609. నవ్వులాటైపోతుందేమో జీవితం..
మానవత్వాన్ని నిరంతరం వెతుకుతూ కూర్చుంటే..
3610. శరత్వెన్నెల్లా కొన్ని అనుభూతులు..
వెన్నలా మనసును హత్తుకుంటూ..
3611. కరుణిస్తానని మాటిస్తున్నా..
మూలమంత్రంగా నన్ను మూడుకోట్లసార్లు జపిస్తానంటే..
3612. ఒక్కకొటిస్తే చాలంటున్నా..
నీకై గుండెల్లో గుడి కట్టేందుకు..
3613. అవధానం చేస్తావని ఆశిస్తున్నా..
అష్టోత్తరానికే ఆయాసపడతావని తెలీక..
3614. చిరునామా తప్పు రాసినందుకేమో..
గతితప్పిన ప్రేమలేఖ భగ్గుమంది..
3615. నీ పరిమళమే ప్రేమ నాకు..
రెప్పలమాటున కలవై దాగుడుమూతలతో నీవొస్తే..
3616. దిగంతాలు దాటొచ్చిన నీ పిలుపు..
మంజీర నాదమేగా వలపించిన మనసుకు..
3617. ప్రేమ తీయదనం నీకు పడలేదనేమో..
ఊపిరితీస్తోందని తెలియని విరహం ఉప్పేసింది..
3618. మంత్రం చేస్తున్నా మౌనాన్ని..
అనునయించలేని నీ అలుకలకి..
3619. మౌనమొక సాక్ష్యం..
బదులివ్వలేని ప్రశ్నలకి..
3620. వసంతమొచ్చేదాకా ఆగమన్నా..
హేమంతపు హాయిని ఒంటరిగా అనుభవిద్దామనే..
3621. మనసుదాహం తీరదనిపిస్తోంది..
నీ కవిత్వాన్ని కన్నులు తాగేదాకా.
3622. విలోమం చేస్తున్నా నవ్వుల్ని..
నా కోపాన్ని బదులివ్వాలనే..
3623. కాలాన్ని కౌగిలింతకిచ్చేస్తాలే..
జీవితాన్ని పెనవేస్తుందని..
3624. వేయికలువలను కానుకిద్దామనుకున్నా..
వసంతుడివై నువ్వు ఆనందాన్ని చవిచూపితే..
3625. ఏకాకితనన్ని ఏకాక్షరం చేద్దామన్నా..
ఒంటరితనన్ని తుంటరిగా మార్చేస్తూ..
3626. వెన్నెలై విచ్చేసానందుకే..
పూలవానల పరిమళాలను నీకు పూయాలనే..
3627. పంచదారగా పలకరించనూ..
తీయదనాలు నీకు మక్కువని తెలిసాక..
3628. ఆదమరచిపోతున్నా పొద్దుల్లో..
నిద్దుర కరువైన రాత్రులను పరితపిస్తూ..
3629. మధువుకీ బంధం తెలిసింది..
అనుబంధాన్ని రుచిగా మార్చేసాక..
3630. పరవశాన్ని పానుపు చేద్దామనుకున్నా..
చిగురంటి నీవు కందిపోరాదని..
3631. కుదురుగా లేనంది నా మనసు..
నీ ఊహలు భగ్నం చేస్తుంటే..
3632. నీ చూపుల వెచ్చదనం సోకిందనుకేగా..
పచ్చని చెక్కిలి అరుణిమై పూసింది..
3633. జామురాతిరప్పుడే పిలిచింది..
జాబిల్లికి జోలపాడే వేళయ్యింది రమ్మని..
3634. ఏ దూరతీరాలకేగిందో మనసు..
కబురంపినా రానని కసిరికొడుతూ..
3635. క్షణాలకి సెగ పెట్టావెందుకో..
జ్ఞాపకాల్ని చంచలం చేసేస్తూ..
3636. కలలోనూ చిత్తరువునయ్యా..
నీ చిత్తాన్ని అనువదించలేని అసహాయతలో..
3637. సుడిగుండాలకు చిక్కిన మనసు..
పడవమునక జీవితానికి తప్పదంటూ..
3638. చిలుకలు నవ్వుకుంటున్నాయి..
తన పలుకులు నువ్వు వల్లిస్తున్నావని..
3639. నీ పులకరింత తడిమినట్లుంది..
మనసు గంధమై పరిమళిస్తోంది..
3640. వెంటాడుతున్న జ్ఞాపకమొకటి..
రాగరంజితమైన మోమును మౌనం మోహించినట్లు..
3641. ఇష్టాలన్నీ విడిచినట్లయ్యింది..
నా నుంచీ నువ్వు దూరమయ్యాక..
3642. బులిపిస్తుందో ఆనందం..
నీ ఎదలోని సద్దు నేనేనని..
3643. ధమనుల మధన పెరిగిపోయింది..
కన్నీటికి ఎరుపుదనాలు పూసేస్తుంటే..
3644. కేరింత కొట్టాయి నా నవ్వులు..
సాహిత్యపు సిరులు తనకి అంటుగట్టావని..
3645. అలరిస్తోందనే ఆస్వాదిస్తున్నా..
నా ప్రేమను మకుటం చేసావని..
3646. విలువ తరిగిన కన్నీరు..
జారి నేలరాలి నీరైనందుకే
3647. వెన్నెలకీ పలు ఆనందాలు..
జంటజావళిని తిలకించిన మైమరపులా..
3648. మీనాలైన నయనాలు..
నీ చూపుల చిలిపిదనానికి మెలితిరుగుతూ..
3649. నిద్దరోనంటున్న కన్నులు..
కన్నీటితో కన్నుల కాటుక చెదిరిపోతుంటే..
3650. మరందమై రాలింది..
నిన్ను ప్రేమించిన కన్నులోని తీపొకటి..
చీకటైనా నీ చింతనలు తీరలేదని..
3602. అంబరాన్ని చుంబించే భావం..
నన్ను చూసి నీ పెదవులుల్లో చిగురించే హాసం..
3603. మంత్రాలు తెలుసేమో నీ మౌనానికి..
నా చూపుని తనవైపుకి లాక్కుంటూ..
3604. నీ పెదవులదదెంత అదృష్టమో..
తీరనిఆశలకు తేలికగా పొగపెడుతూ..
3605. ఆరుకాలాలూ వసంతాలేగా..
చెలినవ్వుల జలతారులో నీవు కప్పుకొనుంటే,,
3606. కదిలిపోయా నీ భావాలకు..
అక్షరాలను చెక్కినట్లు చిత్రిస్తుంటే..
3607. ఎదలో తేనెలు తుళ్ళిపడుతుంటాయి..
నువ్వొచ్చి జలకాలడినట్లుండే ప్రతిసారీ..
3608. సంకెళ్ళు లేని జీవితం..
ఒంటరితనానికదే ఎనలేని ఓదార్పు..
3609. నవ్వులాటైపోతుందేమో జీవితం..
మానవత్వాన్ని నిరంతరం వెతుకుతూ కూర్చుంటే..
3610. శరత్వెన్నెల్లా కొన్ని అనుభూతులు..
వెన్నలా మనసును హత్తుకుంటూ..
3611. కరుణిస్తానని మాటిస్తున్నా..
మూలమంత్రంగా నన్ను మూడుకోట్లసార్లు జపిస్తానంటే..
3612. ఒక్కకొటిస్తే చాలంటున్నా..
నీకై గుండెల్లో గుడి కట్టేందుకు..
3613. అవధానం చేస్తావని ఆశిస్తున్నా..
అష్టోత్తరానికే ఆయాసపడతావని తెలీక..
3614. చిరునామా తప్పు రాసినందుకేమో..
గతితప్పిన ప్రేమలేఖ భగ్గుమంది..
3615. నీ పరిమళమే ప్రేమ నాకు..
రెప్పలమాటున కలవై దాగుడుమూతలతో నీవొస్తే..
3616. దిగంతాలు దాటొచ్చిన నీ పిలుపు..
మంజీర నాదమేగా వలపించిన మనసుకు..
3617. ప్రేమ తీయదనం నీకు పడలేదనేమో..
ఊపిరితీస్తోందని తెలియని విరహం ఉప్పేసింది..
3618. మంత్రం చేస్తున్నా మౌనాన్ని..
అనునయించలేని నీ అలుకలకి..
3619. మౌనమొక సాక్ష్యం..
బదులివ్వలేని ప్రశ్నలకి..
3620. వసంతమొచ్చేదాకా ఆగమన్నా..
హేమంతపు హాయిని ఒంటరిగా అనుభవిద్దామనే..
3621. మనసుదాహం తీరదనిపిస్తోంది..
నీ కవిత్వాన్ని కన్నులు తాగేదాకా.
3622. విలోమం చేస్తున్నా నవ్వుల్ని..
నా కోపాన్ని బదులివ్వాలనే..
3623. కాలాన్ని కౌగిలింతకిచ్చేస్తాలే..
జీవితాన్ని పెనవేస్తుందని..
3624. వేయికలువలను కానుకిద్దామనుకున్నా..
వసంతుడివై నువ్వు ఆనందాన్ని చవిచూపితే..
3625. ఏకాకితనన్ని ఏకాక్షరం చేద్దామన్నా..
ఒంటరితనన్ని తుంటరిగా మార్చేస్తూ..
3626. వెన్నెలై విచ్చేసానందుకే..
పూలవానల పరిమళాలను నీకు పూయాలనే..
3627. పంచదారగా పలకరించనూ..
తీయదనాలు నీకు మక్కువని తెలిసాక..
3628. ఆదమరచిపోతున్నా పొద్దుల్లో..
నిద్దుర కరువైన రాత్రులను పరితపిస్తూ..
3629. మధువుకీ బంధం తెలిసింది..
అనుబంధాన్ని రుచిగా మార్చేసాక..
3630. పరవశాన్ని పానుపు చేద్దామనుకున్నా..
చిగురంటి నీవు కందిపోరాదని..
3631. కుదురుగా లేనంది నా మనసు..
నీ ఊహలు భగ్నం చేస్తుంటే..
3632. నీ చూపుల వెచ్చదనం సోకిందనుకేగా..
పచ్చని చెక్కిలి అరుణిమై పూసింది..
3633. జామురాతిరప్పుడే పిలిచింది..
జాబిల్లికి జోలపాడే వేళయ్యింది రమ్మని..
3634. ఏ దూరతీరాలకేగిందో మనసు..
కబురంపినా రానని కసిరికొడుతూ..
3635. క్షణాలకి సెగ పెట్టావెందుకో..
జ్ఞాపకాల్ని చంచలం చేసేస్తూ..
3636. కలలోనూ చిత్తరువునయ్యా..
నీ చిత్తాన్ని అనువదించలేని అసహాయతలో..
3637. సుడిగుండాలకు చిక్కిన మనసు..
పడవమునక జీవితానికి తప్పదంటూ..
3638. చిలుకలు నవ్వుకుంటున్నాయి..
తన పలుకులు నువ్వు వల్లిస్తున్నావని..
3639. నీ పులకరింత తడిమినట్లుంది..
మనసు గంధమై పరిమళిస్తోంది..
3640. వెంటాడుతున్న జ్ఞాపకమొకటి..
రాగరంజితమైన మోమును మౌనం మోహించినట్లు..
3641. ఇష్టాలన్నీ విడిచినట్లయ్యింది..
నా నుంచీ నువ్వు దూరమయ్యాక..
3642. బులిపిస్తుందో ఆనందం..
నీ ఎదలోని సద్దు నేనేనని..
3643. ధమనుల మధన పెరిగిపోయింది..
కన్నీటికి ఎరుపుదనాలు పూసేస్తుంటే..
3644. కేరింత కొట్టాయి నా నవ్వులు..
సాహిత్యపు సిరులు తనకి అంటుగట్టావని..
3645. అలరిస్తోందనే ఆస్వాదిస్తున్నా..
నా ప్రేమను మకుటం చేసావని..
3646. విలువ తరిగిన కన్నీరు..
జారి నేలరాలి నీరైనందుకే
3647. వెన్నెలకీ పలు ఆనందాలు..
జంటజావళిని తిలకించిన మైమరపులా..
3648. మీనాలైన నయనాలు..
నీ చూపుల చిలిపిదనానికి మెలితిరుగుతూ..
3649. నిద్దరోనంటున్న కన్నులు..
కన్నీటితో కన్నుల కాటుక చెదిరిపోతుంటే..
3650. మరందమై రాలింది..
నిన్ను ప్రేమించిన కన్నులోని తీపొకటి..
No comments:
Post a Comment