3501. మెలకువచ్చినప్పుడే తెలిసింది..
నీ తలపొచ్చి నిద్దుర లేపిందని..
3502. తొలిపులకింత నీవే..
ఆమనివై నీవొచ్చి వసంతాన్ని చూపినట్టు..
3503. ఆనందపు రసపట్టు నీవే..
పట్టుకొమ్మవై చేయిపట్టి నడిపించగా..
3504. ఆటపట్టు ఆటవెలదివి నీవే..
సయ్యాటల సంబరాలకీ సిద్ధమవుతూ..
3505. బుసకొట్టే నాగరాజువే అనుకున్నాను..
వెన్నలమాటలు నోట వినేవరకూ..
3506. వలపు కోరింది నువ్వేగా..
మెరుపువేగంతో నన్ను ఆకట్టుకుంటూ..
3507. నాకైతే నిద్దురే లేకుండా చేసావు..
నీ ఊహలే మత్తుగా ముద్రించి..
3508. అర్ధమయ్యేదా అంతరంగం..
తనని నమ్ముకోకపోయుంటే..
3509. అరవైనాలుగుకళల నీ చెలి..
మకుటాయమానమైంది చదరంగమాడిస్తూ నీతో..
3510. విరహపు సెగలు రేగాయెందుకనో..
శరత్తు పూర్తిగా సెలవివ్వకుండానే..
3511. మోదం ఆమోదమయ్యింది..
ఖేదాన్ని అరచేత్తో నువ్వు తుడిచేసాక..
3512. మార్గశీర్షానికెదురు చూస్తున్న మనసు..
హేమంతాన్ని పూర్తిగా చవిచూడాలనే..
3513. తెలిసినట్లు మనసంతా చదివేస్తావు..
ఒక్కపేజీనైనా నే తెరవకుండానే..
3514. వదలని నీడలా నీ రూపం..
నిద్దురలోనూ భయపెట్టేలా నన్ను వెంటాడుతూ..
3515. ఆనందాన్నీ రాల్చనివ్వవెందుకో..
కంట నీరొలికితే కన్నీరేనని భ్రమపడుతూ..
3516. జాబిల్లి బుగ్గను గిల్లాలనుందన్నావు..
వెన్నెలో నునుకెంపులు మెరిసినందుకేనా..
3517. ప్రబంధానికి ప్రాణం పోసావనుకున్నాను..
నన్ను రాయడం మొదలెట్టవనే..
3518. దాచలేని మనసే నాది..
చెలియలకట్ట ఆపలేని ఆవేదనలో..
3519. నీ అక్షరాలకు గంధం పులిమినందుకేమో..
మాలికలను మించి గుబాళిస్తున్న గ్రంధం..
3520. అంతరంగంలో నిర్వేదం..
నిర్లక్ష్యంగా నన్ను దాటి నువ్వెళ్తుంటే..
3521. నిశీధిలో రంగులు మార్చుతున్న ఆకాశం..
నక్షత్రాలు మధుమాసపు సరసాలను వల్లిస్తున్నందుకేమో..
3522. పూబంతులపై పుస్తకం రాయొచ్చేమో..
కవీంద్రుడివై రహస్యాలు పూరిస్తున్నావుగా..
3523. తొలిపొద్దు సింధూరమే...
తిరిగి సంధ్యారాగమై మదిలో వెలిగింది..
3524. వల్లించేవి నా పెదవులనేమో..
మురిసిపోతున్నవి నీ అక్షరముత్యాలు..
3525. విడిచెపెట్టవు ఏ వివరాన్ని..
పూటకో పోలికేస్తి పొగుడుతూ..
3526. జలతారు వెన్నెలై కురిసింది హాసం..
స్వాతిముత్యాలుగా చేసి ఒడిసిపట్టే నువ్వున్నావనే..
3527. నన్నంటుకున్న నీ ఆలోచనలు..
ఊహల్లో పువ్వులై విరబూస్తూ..
3528. బంధాలేసే నీ చిరునవ్వులు..
ఎడారిలో కోయిల కచేరీలా..
3529. కన్నీటికి అక్షరలక్షల విలువుందని అనుకున్నా..
నువ్వంత తేలికగా ఖర్చుపెడతావని తెలియక..
3530. నీ రూపం అపూరూపమని మరచినట్లుంది..
కోకిల ముసుగేసుకున్న కాకిమనసు చెలి..
3531. తీపి పులకరింతలు..
మరందాల ఆలింగనాలు..
3532. ఆయువు పోసేసానెప్పుడో నీ ఆశలకు..
ఆశువుగా నా మదిని చేరదీసావనే..
3533. కలవరమిచ్చింది నీ పలవరింత..
కందిరీగై నన్ను నిద్రలేపి..
3534. కన్నీటికి విలువ పెరిగింది..
చెంపలజేరి ముత్యమై ఒదిగిందనే..
3535. ఆదరించా అనుకోకుండా...
వనమాలిమై విచ్చేసావనే..
3536. వియోగానికి వింతేముందిలే..
వసంతానికి చోటీయలేనప్పుడు..
3537. నీ కంటికి బంగారం నేనేగా..
వేరే వెలుతురెందుకు నీకై దీపమవుతుండగా..
3538. మరపురానివి జ్ఞాపకాలే..
కన్నీటిలో కరిగినా తిరిగి మొలకెత్తుతూ..
3539. కలకోయిలనై వేచేఉన్నా..
ఆమనొస్తే నీకెదురుపడదామని..
3540. రెప్పలుమూస్తే కల నేనేననుకున్నా..
నిద్దురపోవని నాకు తెలిసినా
3541. నీరాజనమైతేనేమి
పరిమళమై నిన్నంటుకున్నది చాలుగా..
3542. చిరునవ్వులైన చిటపటలు కొన్ని..
నీ స్మృతుల నెమరింతల్లో..
3543. చిరునవ్వులనాట్లేస్తే చాలేమో..
తొలివలపు బహుమానం త్వరలోనే పుష్పించునుగా..
3544. కలకలమెందుకో మదికి..
కోరికను కవితచేసి కోయిలగా వినిపించక..
3545. మేఘాన్ని తాకిన నా చిరునవ్వులు..
నీలో పురివిప్పే వెలుగులు తామవ్వాలని..
3546. వాడని బంగరుపువ్వునై వికసించాలనుకున్నా ఆనాడే..
నీ మనసో ప్రణయసరోవరమని భావించినందుకే..
3547. నా కలవెప్పుడూ నీవేలే..
పొరబడి పగటినిద్రలో విచ్చేసినా..
3548. నీ లేతకిరణాలే వెలుగు చాలుగా..
నాలో చిరునవ్వుల వెన్నెలలు నింపేందుకు..
3549. చెలిని రాయిగా తలచి రోదిస్తావెందుకు..
జవరాలుగా మారే రోజు ముందుండగా..
3550. గుండె దిట్టవు చేసుకోమని చెప్తున్నానందుకే..
హేమంత శిశిరలు దాటేదాకా గడ్డకట్టుకుంటావని..
నీ తలపొచ్చి నిద్దుర లేపిందని..
3502. తొలిపులకింత నీవే..
ఆమనివై నీవొచ్చి వసంతాన్ని చూపినట్టు..
3503. ఆనందపు రసపట్టు నీవే..
పట్టుకొమ్మవై చేయిపట్టి నడిపించగా..
3504. ఆటపట్టు ఆటవెలదివి నీవే..
సయ్యాటల సంబరాలకీ సిద్ధమవుతూ..
3505. బుసకొట్టే నాగరాజువే అనుకున్నాను..
వెన్నలమాటలు నోట వినేవరకూ..
3506. వలపు కోరింది నువ్వేగా..
మెరుపువేగంతో నన్ను ఆకట్టుకుంటూ..
3507. నాకైతే నిద్దురే లేకుండా చేసావు..
నీ ఊహలే మత్తుగా ముద్రించి..
3508. అర్ధమయ్యేదా అంతరంగం..
తనని నమ్ముకోకపోయుంటే..
3509. అరవైనాలుగుకళల నీ చెలి..
మకుటాయమానమైంది చదరంగమాడిస్తూ నీతో..
3510. విరహపు సెగలు రేగాయెందుకనో..
శరత్తు పూర్తిగా సెలవివ్వకుండానే..
3511. మోదం ఆమోదమయ్యింది..
ఖేదాన్ని అరచేత్తో నువ్వు తుడిచేసాక..
3512. మార్గశీర్షానికెదురు చూస్తున్న మనసు..
హేమంతాన్ని పూర్తిగా చవిచూడాలనే..
3513. తెలిసినట్లు మనసంతా చదివేస్తావు..
ఒక్కపేజీనైనా నే తెరవకుండానే..
3514. వదలని నీడలా నీ రూపం..
నిద్దురలోనూ భయపెట్టేలా నన్ను వెంటాడుతూ..
3515. ఆనందాన్నీ రాల్చనివ్వవెందుకో..
కంట నీరొలికితే కన్నీరేనని భ్రమపడుతూ..
3516. జాబిల్లి బుగ్గను గిల్లాలనుందన్నావు..
వెన్నెలో నునుకెంపులు మెరిసినందుకేనా..
3517. ప్రబంధానికి ప్రాణం పోసావనుకున్నాను..
నన్ను రాయడం మొదలెట్టవనే..
3518. దాచలేని మనసే నాది..
చెలియలకట్ట ఆపలేని ఆవేదనలో..
3519. నీ అక్షరాలకు గంధం పులిమినందుకేమో..
మాలికలను మించి గుబాళిస్తున్న గ్రంధం..
3520. అంతరంగంలో నిర్వేదం..
నిర్లక్ష్యంగా నన్ను దాటి నువ్వెళ్తుంటే..
3521. నిశీధిలో రంగులు మార్చుతున్న ఆకాశం..
నక్షత్రాలు మధుమాసపు సరసాలను వల్లిస్తున్నందుకేమో..
3522. పూబంతులపై పుస్తకం రాయొచ్చేమో..
కవీంద్రుడివై రహస్యాలు పూరిస్తున్నావుగా..
3523. తొలిపొద్దు సింధూరమే...
తిరిగి సంధ్యారాగమై మదిలో వెలిగింది..
3524. వల్లించేవి నా పెదవులనేమో..
మురిసిపోతున్నవి నీ అక్షరముత్యాలు..
3525. విడిచెపెట్టవు ఏ వివరాన్ని..
పూటకో పోలికేస్తి పొగుడుతూ..
3526. జలతారు వెన్నెలై కురిసింది హాసం..
స్వాతిముత్యాలుగా చేసి ఒడిసిపట్టే నువ్వున్నావనే..
3527. నన్నంటుకున్న నీ ఆలోచనలు..
ఊహల్లో పువ్వులై విరబూస్తూ..
3528. బంధాలేసే నీ చిరునవ్వులు..
ఎడారిలో కోయిల కచేరీలా..
3529. కన్నీటికి అక్షరలక్షల విలువుందని అనుకున్నా..
నువ్వంత తేలికగా ఖర్చుపెడతావని తెలియక..
3530. నీ రూపం అపూరూపమని మరచినట్లుంది..
కోకిల ముసుగేసుకున్న కాకిమనసు చెలి..
3531. తీపి పులకరింతలు..
మరందాల ఆలింగనాలు..
3532. ఆయువు పోసేసానెప్పుడో నీ ఆశలకు..
ఆశువుగా నా మదిని చేరదీసావనే..
3533. కలవరమిచ్చింది నీ పలవరింత..
కందిరీగై నన్ను నిద్రలేపి..
3534. కన్నీటికి విలువ పెరిగింది..
చెంపలజేరి ముత్యమై ఒదిగిందనే..
3535. ఆదరించా అనుకోకుండా...
వనమాలిమై విచ్చేసావనే..
3536. వియోగానికి వింతేముందిలే..
వసంతానికి చోటీయలేనప్పుడు..
3537. నీ కంటికి బంగారం నేనేగా..
వేరే వెలుతురెందుకు నీకై దీపమవుతుండగా..
3538. మరపురానివి జ్ఞాపకాలే..
కన్నీటిలో కరిగినా తిరిగి మొలకెత్తుతూ..
3539. కలకోయిలనై వేచేఉన్నా..
ఆమనొస్తే నీకెదురుపడదామని..
3540. రెప్పలుమూస్తే కల నేనేననుకున్నా..
నిద్దురపోవని నాకు తెలిసినా
3541. నీరాజనమైతేనేమి
పరిమళమై నిన్నంటుకున్నది చాలుగా..
3542. చిరునవ్వులైన చిటపటలు కొన్ని..
నీ స్మృతుల నెమరింతల్లో..
3543. చిరునవ్వులనాట్లేస్తే చాలేమో..
తొలివలపు బహుమానం త్వరలోనే పుష్పించునుగా..
3544. కలకలమెందుకో మదికి..
కోరికను కవితచేసి కోయిలగా వినిపించక..
3545. మేఘాన్ని తాకిన నా చిరునవ్వులు..
నీలో పురివిప్పే వెలుగులు తామవ్వాలని..
3546. వాడని బంగరుపువ్వునై వికసించాలనుకున్నా ఆనాడే..
నీ మనసో ప్రణయసరోవరమని భావించినందుకే..
3547. నా కలవెప్పుడూ నీవేలే..
పొరబడి పగటినిద్రలో విచ్చేసినా..
3548. నీ లేతకిరణాలే వెలుగు చాలుగా..
నాలో చిరునవ్వుల వెన్నెలలు నింపేందుకు..
3549. చెలిని రాయిగా తలచి రోదిస్తావెందుకు..
జవరాలుగా మారే రోజు ముందుండగా..
3550. గుండె దిట్టవు చేసుకోమని చెప్తున్నానందుకే..
హేమంత శిశిరలు దాటేదాకా గడ్డకట్టుకుంటావని..
No comments:
Post a Comment