Wednesday, 6 July 2016

3551 to 3600

3551. మాఘమాసపు వెన్నెలకి తొందరెందుకులే..
హేమంతపు చలిరేయిని చవిచూడకుండానే..
3552. వెన్నెలపాట వినబడుతోంది..
నెలవంక నవ్వుల్లో తను చేరినందుకేమో..
3553. శాంతించనంటోంది మౌనం..
ప్రేమను పెంచుతూ విరహం సవ్వడిస్తుంటే..!
3554. కస్సుమంటున్న కలలు..
నిద్దుర చేరనివ్వని నన్ను తిట్టిపోస్తూ..
3555. నిర్లక్ష్యం చేసానంటావెందుకో..
లక్ష్యం లేకుండా నా కక్ష్యలో తిరొగొద్దని నేనంటుంటే..
3556. జాబిలి జాముకెక్కింది..
జాజుల జావళీలలు జోలగా మారలేదనే..
3557. నేనసంపూర్ణమని తెలుసులే..
నీలో సగమై పూర్ణమవాలనుకొనే నిజములో..
3558. పగటికలలకు చేరువైనందుకేమో..
రాతిరిరాణి అలుకను అలంకరించి రెచ్చగొడుతోంది..
3559. నీ ఆలోచనలన్నీ నల్లకలువలేగా..
చూసే కన్నులుంటే రెప్పేయనివ్వక..
3560. వలపు తీపయ్యింది..
నువ్వు తేనెవాకవై నన్ను ముంచెత్తుతుంటే..
3561. నాలో ఉన్నది నీవేగా..
బైటకొచ్చి తిరిగటమెందుకని మనసడుగుతోంది..
3562. 
శ్వాస సంపెంగయ్యింది..

నీ నిశ్వాసలు నన్ను ఆవహిస్తుంటే..
3563. ముంచుడెక్కువయ్యిందిగా..
అనురాగస్వరాన్ని అపస్వరంగా మార్చేస్తూ..
3564. జూకామల్లెల తోడుతెచ్చుకున్నా..
వలపు పరిమళంతోనైన నిన్ను బంధించాలని..
3565. 
మౌనం మొగ్గేసింది..
హేమంతం చేరువైనా బుగ్గలు ఎరుపెక్కలేదని..
3566. ఏమారుస్తావెందుకు మనసుని..
నాకోసమలా సప్తస్వరాలను ఏకంచేసి పాడుతుంటే..
3567. ధనుర్మాసపు ముగ్గులు బుగ్గల్లో వేసావెందుకో..
రంగులతో నునుపెక్కి మోహం పెరిగేందుకేనా..
3568. ఏకపక్షంగా గెలిచేస్తా నీలోని ప్రేమను..
నీ మనసును చూపులతో దోచేసి..
3569. ఆనందతాండవమే..
పార్వతితో నర్తిస్తే పరమశివునికి..
3570. ముసుగేసుకుందా మోము..
చిరునవ్వులు ఎదురుచూస్తుంటాయనే..
3571. అక్షరమై ప్రవహిస్తున్నా..
ఒక్కరిలోనైనా చైతన్యానికి పునాది నేనవ్వాలని..
3572. అక్షరాలై ప్రవహిస్తున్నా..
ఘనీభవించిన మనసు పన్నీరై కరిగిందనే..
3573. అక్షరమై ప్రవహిస్తున్నా..
అసంతృప్తితో నిలబడలేక..
3574. కనుపాపనే వదలని చిన్నారి స్వప్నం..
నన్ను కాదనలేని నీ కన్నులా...
3575. గగనమెక్కిన మరుదివ్వెనేగా..
నీ మనసు అర్ధంచేసుకోలేని నేను.
3576. జీవితానికర్ధం చెప్పిన ఆకు..
శిశిరమొస్తే రాలక తప్పదని..
3577. వెన్నెల్లో దాచుకున్ననో అనుభూతిని..
నిన్నల్లో జార్చుకోవడం ఇష్టంలేదని..
3578. చూపుల్లోనే తెలుస్తుందో చెమరింపు..
మనసును వశం చేసుకుందని..
3579. మౌనాలు మోగుతున్న సవ్వడేనది..
ముత్యమంత ముద్దై వినబడిందని..
3580. పంచకల్యాణవుతూ మనసు..
నీ ఊహను స్వారీచేస్తున్న ప్రతిసారీ..
3581. అపరాజితనై నిలబడిపోయా..
గెలుపు వరించినందుకే..
3582. వెన్నెల్లో కాశ్మీరంలా నీ వలపు..
హేమంతపు హాయిలో నిలువెల్లా ముంచేస్తూ..
3583. ఏ పెదవులు ఊపిరి పోసినందుకో..
ప్రాణం లేచి వచ్చింది వెదురుకొమ్మకి..
3584. నక్షత్రాలను దోచుకున్నవేమో అక్షరాలు..
ఉదయపు వెన్నెలను వర్ణించడానికి..
3585. మనసు పరిమళించినపుడే తెలిసింది..
నీ ఊహను కప్పుకున్నందుకని..
3586. పగటికలలు నేర్పుతున్నా కనులకు..
మెలకువలోనూ గమ్మత్తును చూడొచ్చని..
3587. మౌనపంజరాన్ని వీడనంది మనసు..
ఊహలకోయిలలెంత కమ్మగా పాడుతున్నా...
3588. నువ్వెప్పటికీ ప్రేమాన్వేషివే..
మదిలో రహస్యంగా కొలువున్న నీ రాధను గుర్తించలేకుంటే..
3589. నింగీనేలా కలిసిన్నట్లు భ్రమలు..
నువ్వూ నేనూ దూరమైనా కలలో రహస్యంగా కలుస్తున్నట్లు..
3590. 
అలుకను పూస్తావెందుకో నా పెదవులకు..
నీ మెడఒంపుకు గిలిగింతలు కరువైనప్పుడల్లా..
3591. నేను హేమంతాన్నే..
నీ వియోగంలో దిగులుగా ఘనీభవించి..
3592. మదిలో కొలువైన నువ్వు..
గుడిలో శిలైన దేవుడిలా..
3593. తలఊచుతున్న భావాలు..
నీ పిలుపో పల్లవై వినబడుతుంటే..
3594. కన్నులకెందుకో ఆ ఎరుపు..
సిగ్గుపడుతుంది నీ బుగ్గలైతే..
3595. తాపం ఓపలేనంటోంది తనువు..
అణువణువూ అమృతమే ప్రవహిస్తుంటే..
3596. ఆరున్నొక్కరాగం ఆపమంటే వినవుగా..
పీడకలలను పనిగట్టుకు ఆహ్వానిస్తూ..
3597. వసంతం చేసేస్తాలే వర్తమానాన్ని..
హేమంతాన్ని నువ్వు తట్టుకోలేనంటే..
3598. తప్పొప్పుల తూకం తీసేసా...
తనని అప్పుడప్పుడూ గెలిపించాలనే..
3599. కన్నులవిందే కన్నులకు..
నీ భావాలు ప్రియమారా వడ్డిస్తుంటే..
3600. తీపేదో తడిమింది తొలిసారి..
మదిని తేనెవాక చేసేస్తూ..

No comments:

Post a Comment