3851. చూపుకి కనికట్టు నేర్పింది నువ్వేగా..
పచ్చని అందాన్ని మాత్రమే చూపమంటూ..
3852. మెరుపు మొహం ఎరుగనట్లు మాట్లాడతావే..
ప్రతిరోజూ నీ కళ్ళముందే తిరుగుతున్నా..
3853.కలలకి ఆలశ్యం అవుతుందేమోనని భ్రమపడ్డావెందుకో..
రెప్పలపై చిరుముద్దునై తడిగా మెరిసిపోతున్నా..
3854. కన్నీరు తీపయ్యిందెందుకో అనుకున్నా..
నువ్వొచ్చి కలగలిసావని తెలియక
3855. విచ్చేసా వసంతమై..
నాకోసం ఎదురుచూస్తుంటావనే..
3856. తలపై తడుముతావెందుకు..
తపము చేసి నిన్ను గెలుచుకుందామనుకుంటే..
3857. బృందావనంలోకి నువ్వెప్పుడొచ్చావో..
నా పేరుని కృష్ణుడికి తెలియకుండా కాజేసి నవ్వులాటలా..
3858. మౌనం రంగులీనింది..
ఊహించని మనమధ్య విరుస్తున్న ప్రణయానికి..
3859. స్వప్నాన్ని కెలుకుతావెందుకో..
కన్నీటిలో జలకాలాడే విచిత్రమైన కోరికుందంటూనే..
3860. కాలంకాని కాలంలో వానవిల్లెలా విరిసిందో..
ప్రేమ చేసే వింతల్లో ఒకటయ్యేందుకేమో..
3861. అలుకలను రేపెట్టకు మరి..
పదాలను ముచ్చటగా పేర్చుకుంటూ..
3862. మోయలేని బరువెందుకిస్తావో రెప్పలకు..
రాతిరవుతుంటే హాయిని తట్టుకోమంటూ..
3863. నీ స్మృతులుంటే చాలవా నాకు..
ప్రత్యుషలనే రాత్రిగా మార్చి కవ్వించేందుకు..
3864. ప్రేమరంగు కళ్ళజోడెప్పటికీ తీయను..
ప్రపంచం పలువర్ణాల్లో కనిపిస్తుంటే..
3865. నీ మనసో మధుకలశమయ్యింది..
నన్ను మైకంలో నెట్టేస్తూ..
3866. అరక్షణాన్నీ భరించలేకున్నా..
కాలానికి మనల్ని విడదీసేంత కసేంటో కనుక్కోలేని అసహాయతలో..
3867. అల్లరి నా కంటికి అందమొచ్చిందిలే..
నల్లనిమబ్బునే అలంకరించిన నీ చిలిపిదనానికి..
3868. పాపలే నిన్నటి వరకూ..
నీ కంటబడ్డాక ఏమవుతాయో..
3869. పదాలూ అందెలుగా మారినట్లున్నాయి..
నీ మదిలో మోగాలనే ఆరాటం వెల్లువై ఎగిసినందుకు..
3870. నువ్వు నేర్పిన విద్యయేననుకుంటా..
కధను కంచికి కాదని కాశ్మీరంలోకి మలుపు తిప్పడం..
3871. శ్వాసలకు గంధాలంటించావు..
బుగ్గలకు అందమంటించినట్లుగానే..
3872. గెలుపుల పర్వమే మనది..
అలుపులేని సయ్యాటల సందళ్ళలో..
3873. సంధ్యారాగాన్ని మరచిపోయా..
స్మృతులలో పొద్దస్తమానూ కునుకులు తీస్తుంటే..
3874. దిండుకెందుకో దిగులు..
దుప్పటనుకొని నువ్వు నన్ను కప్పుకోబోతే..
3875. నర్తనం చేస్తున్నా రెప్పలపైనే..
మదిలో వేదిక నచ్చలేదనే..
3876. సందేహం తీరిపోయింది..
నా నవ్వులు పారిజాతాలై సేదతీర్చాయంటుంటే..
3877. భావాల గంధాలు బయటపడ్డాయి..
అక్షరాల్ని దివ్యంగా సానపెట్టినందుకేమో..
3878. పెదవుల్లో సరిగమలకూ లోకువైపోయా..
నిన్ను పాటగట్టి పాడలేదని..
3879. ఆనందతాండవం ముగిసింది..
నీ హృదయ సంబరం తీరిందని..
3880. విషాదమనే విషాన్ని మింగుతూనే ఉండాలి..
ఆనందమనే అమృతాన్ని మాత్రమే పంచుతూ..
3881. శిశిరాన్ని ఊహిస్తోంది మనసెందుకో..
హేమంతంలో పూర్తిగా తడవకుండానే..
3882. కవితలను అందంగా ముస్తాబు చేసా..
ఒక్కమారైన నిన్ను ఆకట్టుకోమని చెప్పి..
3883. మాటలు కరువయ్యాయి..
మౌనపు సెగలకు కరిగి నీరైనందుకేమో..
3884. ఆకాశం అందరిపైనా ఒకటేగా..
నీపైనా..నాపైనా..మనపైనా..
3885. చందమామనై నేనొచ్చా..
వెన్నెలవానలో చల్లగా నిన్ను మైమరపిద్దామని..
3886. అలవాటైన స్వరాలు కొన్ని..
నీ మదిని మీటమని నా పెదవులను తొందరపెడుతూ..
3887. తమకు తామే అలంకరించుకున్న పెదవులు..
నీ పెదవులను చేరడమే తమకానందమంటూ..
3887. భగ్గుమంటున్న మౌనం..
పదునెక్కిన నీ మాటలు అగ్గిపెడుతుంటే..
3888. ఎన్ని అక్షరాలతో నిన్ను కొలుచుకోవాలో...
క్షణక్షణానికీ నాలో చైతన్యం ప్రవహించాలంటే..
3889. నీ అల్లరొక్కటీ సరిపోతుందనుకుంటా..
నా ప్రతిస్పందన కుదుటపడేందుకు..
3890. తప్పని పరుగులెక్కువే జీవితానికి..
ఉనికిని కాపాడుకోవాలన్న ఆరాటంలో..
3891. రెక్కలుంటే బాగుండేది స్వార్ధానికి..
కాస్త దూరంగానన్నా ఎగిరేది
3892. ఉచ్ఛాసనిశ్వాసలను తప్పుపడతావెందుకు..
జీవించడంలో జీవం లేదని ఒప్పుకోకుండా..
3893. అదే వలయం..అదే పరుగు..
వంపులతో..వంకరటింకరగా..రొప్పుతూ ..పడుతూలేస్తూ..
3894. విషమించిన విరహం..
నీ పాటలో నేను కనిపించలేదని..
3895. సౌందర్యమే..
నా మేనికి నీ మనసూ జతై వెలిగిపోతుంటే..
3896. మధురగానం వినబడింది..
అల్లంత దూరానున్నా..మనసును ఊయలూపుతూ..
3897. ప్రేమించడం నేర్పాలనుకుంటా మనిషికి..
ఇసుకలోనూ పంచదారను అనుభూతించాలంటే..
3898. సాయానికొచ్చానిప్పుడే..
ఈ రాత్రైనా నేను నీ మధువునవ్వాలని..
3899. పట్టుబడిపోయా జీవితానికి..
పరుగెత్తి అధిగమించిన మైలురాళ్ళు అస్తిత్వాన్నివ్వలేదని..
3900. నిలువరించలేని పరుగులు కొన్ని..
భవిష్యత్తుచింతనలో బంధాలు అడ్డుగోడలంటూ..

వంపులతో..వంకరటింకరగా..రొప్పుతూ

No comments:
Post a Comment