3701. స్మృతుల పరవశాలే..
ఎదను తడిమి పువ్వులా పలకరిస్తూ..
3702. నట్టువాంగం చిందులేసింది..
నా అడుగులకు నువ్వు మృదంగమవుతుంటే..
3703. ఉదయాన్నే నీ తలపుల కచేరీలు..
నా హృదయానికి రసోదయాన్ని పరిచయించినట్లు
3704. మదిని దాటి కన్నుల్లోకెందుకు చేరావో..
నా చూపుకు రెక్కలు తొడిగేందుకా..
3705. అంతఃచక్షువుకి ఆరాటమెక్కువైంది..
అసంతృప్తి అస్తిత్వాన్ని కాదని పయనిస్తోందని..
3706. మౌనపంజరాన్నేనాడో విడిచేసా..
స్వాత్రంత్ర్యమొచ్చి నీ మదిలోకి ఎగిరొచ్చినప్పుడే..
3707. సెగ పెట్టిస్తావెందుకు ఆవేశాన్ని..
కోపాన్ని తారాజువ్వతో పోలుస్తూ..
3708. ఆత్మబంధువు నువ్వేగా..
నా ఊపిరికి వేణువులూదే కన్నయ్యవైతే
3709. వెదురుపుల్లని తీసిపారేయలేదందుకే..
నీ శ్వాసను ఆలపించి నా ప్రాణాలు నిలబెట్టిందని..
3710. మోదం ఎంత ప్రమాదమో..
ఆమోదంలేని ప్రేమను హత్తుకుంటే..
3711. మౌనం రాలి పడింది..
జీవితానికి వసంతమొచ్చే వేళయ్యిందని..
3712. చూపులను వెలిగిస్తున్నా..
నువ్వొచ్చే దారిలో చీకట్లనేవి కమ్ముకోరాదనే..
3713. ఊహలపల్లకికి కబురంపానందుకే..
మధురోహల మోతను నేనొక్కదాన్నీ మోయలేనని..
3714. నీ కలానికి ఊపిరి పోయాలనొచ్చా..
అక్షరంగా మలచి నాకో ఆకృతినిస్తావనే..
3715. మనసుందని మరచానప్పుడే..
పచ్చని ఆశలను పొలిమేరల్లో విడిచేసినప్పుడే..
3716. నీ తలపుల విందుకే తల్లడిల్లుతున్నా..
గుప్పెడంత గుండెకూ ఆయాసం ఇవ్వలేక..
3717. వేకువని వెతకడం మానేసా..
మెరుపంటి నీవు తోడవ్వగానే..
3718. నిద్దురపొద్దులు కరిగినవెన్నో..
వలపు మాయలో మాసాలను గుర్తించక..
3719. ఆకాశమే హద్దయ్యింది..
ఎగిసిన ఆనందాన్ని చేయిచాచి కౌగిలిస్తూ..
3720. . నీలివెన్నెల నవ్వులు..
మంచుతెరలను దాటొచ్చిన పువ్వెన్ని చెక్కిలిగింతలిచ్చిందో
3721. నవ్వుకున్న విధి..
రెండు విరుద్ధాకర్షణలకు విజయవంతంగా ముడేసానని.
3722. హేమంతగాలిని మరచావెందుకో..
ఋతువును మరచి వేసవిగాడ్పునే నిరంతరం మదిలో తలచుకుంటూ...
3723. ఎన్ని నవ్వులని ఏరుకుంటావో..
నీ మనసంతా ముత్యాలజల్లవుతుంటే..
3724. సమీరమంతగా ఎందుకు వేడెక్కిందో..
జీవితాన్ని సరైనకోణంలో చూడనందుకేమో..
3725. సరికొత్త పుస్తకాన్ని మొదలుపెట్టు..
కొత్తవత్సరం నిరాశను మింగేస్తుందేమో..
3726. ప్రశ్నించడం మానేసా జీవితాన్ని..ఎదను తడిమి పువ్వులా పలకరిస్తూ..
3702. నట్టువాంగం చిందులేసింది..
నా అడుగులకు నువ్వు మృదంగమవుతుంటే..
3703. ఉదయాన్నే నీ తలపుల కచేరీలు..
నా హృదయానికి రసోదయాన్ని పరిచయించినట్లు
3704. మదిని దాటి కన్నుల్లోకెందుకు చేరావో..
నా చూపుకు రెక్కలు తొడిగేందుకా..
3705. అంతఃచక్షువుకి ఆరాటమెక్కువైంది..
అసంతృప్తి అస్తిత్వాన్ని కాదని పయనిస్తోందని..
3706. మౌనపంజరాన్నేనాడో విడిచేసా..
స్వాత్రంత్ర్యమొచ్చి నీ మదిలోకి ఎగిరొచ్చినప్పుడే..
3707. సెగ పెట్టిస్తావెందుకు ఆవేశాన్ని..
కోపాన్ని తారాజువ్వతో పోలుస్తూ..
3708. ఆత్మబంధువు నువ్వేగా..
నా ఊపిరికి వేణువులూదే కన్నయ్యవైతే
3709. వెదురుపుల్లని తీసిపారేయలేదందుకే..
నీ శ్వాసను ఆలపించి నా ప్రాణాలు నిలబెట్టిందని..
3710. మోదం ఎంత ప్రమాదమో..
ఆమోదంలేని ప్రేమను హత్తుకుంటే..
3711. మౌనం రాలి పడింది..
జీవితానికి వసంతమొచ్చే వేళయ్యిందని..
3712. చూపులను వెలిగిస్తున్నా..
నువ్వొచ్చే దారిలో చీకట్లనేవి కమ్ముకోరాదనే..
3713. ఊహలపల్లకికి కబురంపానందుకే..
మధురోహల మోతను నేనొక్కదాన్నీ మోయలేనని..
3714. నీ కలానికి ఊపిరి పోయాలనొచ్చా..
అక్షరంగా మలచి నాకో ఆకృతినిస్తావనే..
3715. మనసుందని మరచానప్పుడే..
పచ్చని ఆశలను పొలిమేరల్లో విడిచేసినప్పుడే..
3716. నీ తలపుల విందుకే తల్లడిల్లుతున్నా..
గుప్పెడంత గుండెకూ ఆయాసం ఇవ్వలేక..
3717. వేకువని వెతకడం మానేసా..
మెరుపంటి నీవు తోడవ్వగానే..
3718. నిద్దురపొద్దులు కరిగినవెన్నో..
వలపు మాయలో మాసాలను గుర్తించక..
3719. ఆకాశమే హద్దయ్యింది..
ఎగిసిన ఆనందాన్ని చేయిచాచి కౌగిలిస్తూ..
3720. . నీలివెన్నెల నవ్వులు..
మంచుతెరలను దాటొచ్చిన పువ్వెన్ని చెక్కిలిగింతలిచ్చిందో
3721. నవ్వుకున్న విధి..
రెండు విరుద్ధాకర్షణలకు విజయవంతంగా ముడేసానని.
3722. హేమంతగాలిని మరచావెందుకో..
ఋతువును మరచి వేసవిగాడ్పునే నిరంతరం మదిలో తలచుకుంటూ...
3723. ఎన్ని నవ్వులని ఏరుకుంటావో..
నీ మనసంతా ముత్యాలజల్లవుతుంటే..
3724. సమీరమంతగా ఎందుకు వేడెక్కిందో..
జీవితాన్ని సరైనకోణంలో చూడనందుకేమో..
3725. సరికొత్త పుస్తకాన్ని మొదలుపెట్టు..
కొత్తవత్సరం నిరాశను మింగేస్తుందేమో..
సమయానుకూలంగా సమాధానాలు సూచించట్లేదనే..
3727. అలవోకమైన మదిలోని భావాలు..
చినుకులై నాలో కురిసి నిన్ను పాడమని తొందరపెడుతూ..
3728. అనిర్వచనీయమైన ఆత్మతృప్తి..
నాలోని నన్ను కనుగొన్న ఆనందాన..
3729. వసంతాన్ని విడువలేనుగా..
శిశిరమై రాలినా మరోమారు చిగురిద్దామని..
3730. వానకారు కోయిలని గమనించానానాడే...
నాకో మేఘసందేశం మోసుకొస్తోందని..
3731. ఎన్ని భావాలు దాచుకోవాలో..
మెరుపంటి నువ్వు కనిపెట్టరాదంటే..
3732. తెరచాటు బ్రతుకుని భరించలేకేమో..
కలలా సాగిన జీవితన్నూహిస్తూ చావుని చేరదీస్తారు నటులు..
3733. ఆశల రెక్కలు విప్పుకుంది మది..
అందరాని ఆకాసానున్న నిన్ను అందుకోవాలని..
3734. తేనెకళ్ళకెన్ని మత్తులో..
గమ్మత్తుగా నువ్వెదురై సైగలు చేస్తుంటే..
3735. హత్తుకున్ననో విరహాన్ని..
పున్నమై కలవరిస్తున్న ప్రేమను తెలుసుకోవాలని..
3736. లోకువయ్యింది రాత్రి..
మరచిపోయిన రాగాలను పగలు పాడనివ్వలేదని..
3737. నిర్వచించడం మానేసా ప్రేమను..
అపార్ధాలెక్కువై అర్ధం మారిపోతుందని..
3738. నువ్వో అత్తరువే..
మాలికలో గుభాళింపును మరింతగా పెంచేస్తూ..
3739. మావిచివురునయ్యానందుకే..
కోయిలవై మెక్కి కొంగొత్త పాటలను పాడుకుంటావనే..
3740. మందారాలనెందుకు చిన్నబుచ్చుతావో..
కెంపులను నా బుగ్గలకు పూసేస్తూ..
3741. ఋతురాగాలను మార్చేయాలనొచ్చా..
సన్నయిలా నీ మనసులో సవ్వడిస్తూనే..
3742. ఆడంబరమనిపించే అతిశయం..
నిన్నాకట్టుకోవాలని నేను చేసే మంత్రజాలం..
3743. మధువులకు కొత్తేమీ కాదుగా నేను..
నిత్యమూ నీ పలుకులనే తాగేస్తూ..
3744. విరహమైన విరిగా మారిపోయా..
నన్నో స్మృతిగా స్వీకరించావనే..
3745. సూత్రాలలో ఇమిడ్చేసా..
ఆరడుగుల ప్రేమనీ మూడేముళ్ళేసుకొని మరీ..
3746. మూతవడని రెప్పలు..
నేత్రాంచలాల్లో కన్నీరు ఉధృతమై ప్రవహిస్తుంటే..
3747. మూతవడని రెప్పలు..
నిరీక్షిస్తున్న స్వాతంత్ర్యంలో వేకువలు కానరాక..
3748. తీపి మాత్రమే రాయడం తెలుసు నీ కలానికి..
వెటకారాన్ని వేటువేసే విద్యలు తెలియక కాబోలు..
3749. ఇంతేనంటావా జీవితం..
ఆలకిస్తూ కాసేపూ..అనునయిస్తూ కాసేపూ..
3750. కొత్త ఆలోచనలకు చోటివ్వమంటున్నా ఎదలో..
భావాలను అక్షరాలుగా ముస్తాబు చేసేందుకే..
No comments:
Post a Comment