3451. వెన్నెల్లో నవ్వనన్నానందుకే..
నా వన్నెలన్నీ నక్షత్రాలకు దోచిపెడతావనే..
3452. వెన్నెలకొమ్మవంటూనే ఉక్కుశిల్పాన్ని చేసావు..
నా నవ్వులన్నీ ఘనీభవింపజేసి..
3453. వలపు కోరిన వాయినాలు..
నీ చిరునవ్వుల మధురోహలు..
నా వన్నెలన్నీ నక్షత్రాలకు దోచిపెడతావనే..
3452. వెన్నెలకొమ్మవంటూనే ఉక్కుశిల్పాన్ని చేసావు..
నా నవ్వులన్నీ ఘనీభవింపజేసి..
3453. వలపు కోరిన వాయినాలు..
నీ చిరునవ్వుల మధురోహలు..
3454. మరలిరాని స్మృతులు..
మల్లెల్లో మునకేసిన మధుర గుసగుసలు..
మల్లెల్లో మునకేసిన మధుర గుసగుసలు..
3455. మనసైన మాట..
నన్ను వలచే అనుపల్లవిగ మారిపోతూ..
నన్ను వలచే అనుపల్లవిగ మారిపోతూ..
3456. కలవరపడ్డ శూన్యం..
తన ప్రతిబింబాన్ని మనమధ్యన చూసుకొని..
3457. వ్యర్ధమైన ఆలోచనలను విడిచేసా..
అంతరంగాన్ని ఆనందంగా ఉంచాలనే..
3458. జ్ఞాపకాల సుడులలో చిక్కుకున్నా..
మనసు తూనీగై నిన్నసరిస్తుంటే..
3459. అవేదనంతా అమృతమేగా..
నువ్వూ నేనూ రెండక్షరాల ప్రేమయ్యాక..
3460. నవ్వులతో కవ్విస్తావెందుకో..
చూపులకే నే చిత్తరువునై నిలుచుంటే..
3461. అనుభవం అనుభూతయ్యింది..
మదిలో భావాలను మాలికలుగా అల్లుకొని..
3462. అవగతమైన నీ అంతరంగం..
పిలుపులకే భాష్పధారలుగా కురిసిపోతుంటే..
తన ప్రతిబింబాన్ని మనమధ్యన చూసుకొని..
3457. వ్యర్ధమైన ఆలోచనలను విడిచేసా..
అంతరంగాన్ని ఆనందంగా ఉంచాలనే..
3458. జ్ఞాపకాల సుడులలో చిక్కుకున్నా..
మనసు తూనీగై నిన్నసరిస్తుంటే..
3459. అవేదనంతా అమృతమేగా..
నువ్వూ నేనూ రెండక్షరాల ప్రేమయ్యాక..
3460. నవ్వులతో కవ్విస్తావెందుకో..
చూపులకే నే చిత్తరువునై నిలుచుంటే..
3461. అనుభవం అనుభూతయ్యింది..
మదిలో భావాలను మాలికలుగా అల్లుకొని..
3462. అవగతమైన నీ అంతరంగం..
పిలుపులకే భాష్పధారలుగా కురిసిపోతుంటే..
3463. చూడాల్సింది నన్నేగా..
అంతరంగానికి ఆంతరంగిక ప్రేయసిగా మార్చుకున్నాక..
అంతరంగానికి ఆంతరంగిక ప్రేయసిగా మార్చుకున్నాక..
3464. అంతరంగంలోనూ అలుకలే..
కలనై వచ్చినా కాలక్షేపం చేసే నీ కవిత్వానికి..
కలనై వచ్చినా కాలక్షేపం చేసే నీ కవిత్వానికి..
3465. తుంటరితనమెక్కువే నీ అంతరంగానికి..
ఒంటరితనాన్ని చొరవగా మార్చేసుకుంటూ..
ఒంటరితనాన్ని చొరవగా మార్చేసుకుంటూ..
3466. నీ అంతరంగం నేనయ్యానప్పుడే..
మంగళవాద్యాలు మిన్నంటి మ్రోగినప్పుడే..
మంగళవాద్యాలు మిన్నంటి మ్రోగినప్పుడే..
3467. రంగులకలలెక్కడివో కన్నులకు..
అతలాకుతలమైన అంతరంగం విషాదాలు చిమ్ముతున్నా..!
అతలాకుతలమైన అంతరంగం విషాదాలు చిమ్ముతున్నా..!
3468. అంతరంగమో రహస్యబిలమైంది..
నిశ్శబ్దగతులకు అంకితమైన మౌనాల సాక్షి..!
నిశ్శబ్దగతులకు అంకితమైన మౌనాల సాక్షి..!
3469. అంతరంగమో లోయ..
దిగేకొద్దీ కొలవలేని లోతుల్లో కూరుకుపోతుంటే..
దిగేకొద్దీ కొలవలేని లోతుల్లో కూరుకుపోతుంటే..
3470. ఎకసెక్కాలేగా నీ మాటలు..
ప్రేమకు రాలుగాయిరాగాలు పేర్చుకుంటూ..
ప్రేమకు రాలుగాయిరాగాలు పేర్చుకుంటూ..
3471. ఆహ్వానించావనే అడుగుపెట్టా..
నీ మనోమందిరంలో మందస్మిత మాయమయ్యిందన్నావనే..
నీ మనోమందిరంలో మందస్మిత మాయమయ్యిందన్నావనే..
3472. వెక్కిళ్ళు మొదలెట్టావెందుకో..
ప్రేమలెక్కల పద్దులు నేనడగకుండానే తడబడుతూ..
ప్రేమలెక్కల పద్దులు నేనడగకుండానే తడబడుతూ..
3473. అలంకరించాలేమో అంతరంగాన్ని..
పెదవంచు నవ్వులకో అర్ధాన్ని కల్పించాలంటే..
పెదవంచు నవ్వులకో అర్ధాన్ని కల్పించాలంటే..
3474. నటనెక్కువే నీ ఆర్భాటాలకి..
పక్షినంటూ రెక్కలు విరిచేస్తూ..
పక్షినంటూ రెక్కలు విరిచేస్తూ..
3475. మొలకెత్తిన భావాలెన్నో నీలో..
మధుమాసమంటి చిరునవ్వులో చేరినందుకేమో..
మధుమాసమంటి చిరునవ్వులో చేరినందుకేమో..
3476. క్షణానికో పరవశమిస్తావు..
మంత్రజాలమేదైనా ఉందేమో తెలియకుండా నీలో..
మంత్రజాలమేదైనా ఉందేమో తెలియకుండా నీలో..
3477. పులుపెక్కువే నీ పదాలకు..
మాటకూ మూతిని విరిచేస్తూ..
3478. అమాసని గుర్తుచేస్తావెందుకో..మాటకూ మూతిని విరిచేస్తూ..
మనసు వెన్నెలను పులుముకుందని తెలియనట్లు..
3479. వగరెక్కువే నీ వాక్యాలకి..
వాయిదాలమీద నన్ను రాసేస్తూ..
3480. అస్తిత్వం చేజారిన అంతరంగం..
కలలో ఆనందాన్ని వెతుక్కుంటూ..
3481. వరాలు కురిపించేందుకొచ్చానందుకే..
నీ మదిని హేమంతజల్లుల్లో తడపాలనే..
3482. పరదాలెక్కువే నీ ప్రణయానికి..
వలపును చాటు చేస్తానంటూ..
3483. ఇస్తున్నానో అక్షరరూపం..
నిన్నా రేపటి అంతరంగ విశ్లేషణం..
3484. పెదవులతో ప్రేమలేఖ రాస్తానని ఆశపడ్డట్టున్నావ్..
నేను కలం కోసమని వెతుకుతుంటే..
3485. తెల్లబోతున్న నా మది..
తెల్లనిడైరీలోని అంతరంగాన్ని చదవలేక..
3486. ఆఘమేఘానికి ఆలశ్యమయ్యింది..
నడిచొస్తుంటే మెరుపులేవో అడ్డుపడి ఆరాతీసినందుకే..
3487. ముసుగేసుకున్న అంతరంగాన్ని బయటపెడతావెందుకు..
జనారణ్యంలో మనిషిగా మసలుకుంటుంటే..
3488. తొలకరిజల్లుకి తొందరెందుకో..
మెరుపులింకా మనసు వేదికపై వెలగకుండానే..
3489. ఆవిష్కృతమవుతున్న గతాలు..
మనోగతాల బలవన్మృత్యువులో..
3490. విస్తుపోయి చూస్తున్న కాటుక కన్నులు..
అమృతమంతా పెదవులకే పంచిపెట్టే పిసినారితనమేంటని..
3491. సగపాలకే మాధుర్యము..
మనోజ్ఞసీమల్లో విహారమెప్పుడని..
3492. ఆపలేని ఝరీప్రవాహమే..
వేదనదిగా మారిన అంతరంగ పెనుగంగ..
3493. ప్రక్షాళనైంది అంతరంగం..
ఆ మోములో స్వచ్ఛతను ప్రతిబంబిస్తూ..
3494. విరహానికి సెలవిమ్మన్నానందుకే..
హేమంతం తరుముకొస్తుందనే..
3495. నురగలై ఎగిసిన ఉల్లాసం..
దీపాలు వెలిగిన నడిరేయిలో..
3496. పోలిస్వర్గానికి వేళయ్యింది..
కార్తీకమలా సాగిపోతానంటుంటే..
3497. సమరోత్సాహమెక్కువయ్యిందే..
నిశీధిరేయిని పున్నమిహాయిగా మలచేందుకే..
3498. చలి పెంచుతావెందుకో..
చెలికాడి చొరవంతా చూపుల్లోనే చూపిస్తూ..
3499. మానసవీణల మౌనం సద్దుముగిసిందప్పుడే..
కువకువలాడు ముచ్చట్లు వీనులవిందైనప్పుడే..
3500. తొలిపొద్దు భూపాలం నేనవుతున్నా..
నీ ఊహలు నిద్దురలేచేవేళయ్యిందని..
No comments:
Post a Comment