7601. ముడేసుకున్నా అక్షరాలను..
అలవోకగా నన్నల్లుకున్నాయనే..
7602. పెదవంటిన అక్షరాలకూ తీపంటింది..
మధుపాత్రను ఎర్రగా దాచుకున్నందుకేమో..
7603. నీ తలపులే మనసైన బోయీలు..
నా మౌనాన్ని మోస్తున్న ఊరేగింపులో..
7604. మనసంతా సుస్వరాలు..
నీ తలపులు మీటిన బృందగానాలు..
7605. ఎడారంటే ఎక్కడో లేదు..
తడారిన గుండెల్లో తొంగిచూడు..
7606. నా సిగ్గే లక్ష్మణ రేఖయ్యింది..
నీకు హద్దులు గీసిన క్షణాన..
7607. ఆస్వాదిస్తున్నా జీవితాన్ని..
మధువును గ్రోలినంత సున్నితంగా మలచుకుంటూ..
7608. నువ్వు స్వర్గానికొచ్చినప్పుడే అనుకున్నా..
నన్ను వెతుక్కుంటూ వచ్చేసుంటావని..
7609. నిద్దురపోతే కల్లోకొద్దామనుకున్నా..
వేచిచూస్తూ మెలకువతోనుంటావనుకోలా..
7610. మహరాణిని చేద్దామనుకున్నా..
నా హృదయంలో సుస్థిరమై ఉంటావని..
7611. సంధ్యాకిరణంలో పోల్చుకున్నా..
నువ్వొచ్చి వెచ్చదనాన్ని పంచింది నాకోసమేనని..
7612. అలుకనే ఆయుధం చేసుకున్నా..
నీ పరిష్వంగంలో పరవశించాలని..
7613. కలిసున్నప్పుడు పచ్చగానున్న ప్రకృతి..
వియోగించినప్పుడు వికృతిగా మారిందెందుకో..
7614. నువ్వంతరంగంలో కాలు మోపినప్పుడనుకోలా..
నాలో రాగాలు రంజితాలవుతాయని..
7615. అల్లుకుంది మధుమాసం నీలా..
మనసంతా పరిమళాలు కుసుమించేలా..
7616. సన్నగా నవ్వాననుకున్నా..
నీపై ప్రేమజల్లు కురుస్తుందని తెలియక..
7617. శ్వాసను కూడదీసుకుంటున్నా..
నీ ధ్యాసలో ఊపిరాగిపోతుందని భయమేసే..
7618. హృదయమంతా నువ్వయ్యావు..
నీ భావాలు నావిగా పదిలపరచుకున్నందుకే..
7619. మౌనంతో ముచ్చటిస్తున్నా..
నువ్వొచ్చి మాటలతో కవ్విస్తావని తెలీక..
7620. నాలోకి తొంగిచూసినప్పుడే అనుకున్నా..
మౌనాన్ని చూపులతోనే ఆస్వాదించగలవని..
7621. అలుకలో అందాన్ని చూడాలనుకున్నా..
అందుకే ఆలశ్యంగా నిన్ననునయిస్తున్నా..
7622. అదృశ్యమైనట్లుంది అంతరాత్మ..
మన మధ్య వియోగనది ప్రవహిస్తుంటే..
7623. ఆకాశానికెగరవలసిన రెక్కలు కూలబడ్డవి..
జీవనానికని జంట వలసపోగానే.
7624. నీరవమెందుకు నవ్వుతుందో..
మౌనంతో క్రీడిస్తున్న వర్తమానాన్ని విసిగిస్తూ..
7625. కోయిలను బ్రతిమాలినప్పుడే అనుకున్నా..
నాకోసమే వసంతగానం నేర్చుతున్నావని..
7626. పాఠంలో అప్పుడే వెనకబడ్డా..
జీవితాన్ని చేజార్చుకొని రోదించినప్పుడే..
7627. శిశిరమందుకే పారిపోయింది..
వసంతానికి చోటిస్తే తనను మెచ్చుతావని..
7628. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది..
నీ ప్రణయంలో ఉక్కిరిబిక్కిరైనప్పట్నుంచి..
7629. మన ఊసులెన్ని వడకట్టానో..
ఊహలు అక్షరాలుగా పూయనన్నాయని..
7630. కలలెన్ని కలతలుగా మిగిలినవో..
కన్నీటిలో వలపుగూడు చెదిరిపోయాక..
7631. అల్లిబిల్లి మాటలతో ఆకట్టుకుంటావు..
వెచ్చదనాన్ని నిలువెల్లా చుట్టబెడుతూ..
7632. నిశీధిని ఇష్టపడ్డావనుకున్నా..
ఒంటరితనానికి భయపడక ఏకాంతంగా మార్చుకున్నావని..
7633. మనసులోకెప్పుడు తొంగిచూసావో..
ఆవేదన అంచుల్లోనే నన్ను నిలబెడుతూ..
7634. భావాలజల్లులెన్నో..
మనసంతా పువ్వులు పూయాలని సంకల్పించిన శరత్తులో..
7635. వెలుగునీడల సయ్యాటలో కలిసానందుకే..
విచిత్రానుభూతుల్లో నన్ను కనుగొంటావనే
7636. నేనంటూ అస్తమించినట్లేగా..
నిన్ను తలవని క్షణాలంటూ మిగిలుంటే..
7637. నీ కవితలోకొచ్చి కుదురుకున్నా..
పున్నమివన్నెల్లో నన్నూ రాస్తావనే
7638. పులకించినప్పుడే గుర్తించా..
నీ మనసు నా హృదిలో మాయేదో చేసిందని..
7639. మధువునే తలుస్తుంటావెందుకో ఎప్పుడూ..
పూర్వజన్మలో నువ్వు మధుపానివైనందుకేమో..
7640. నిన్నెప్పుడో కనుగొన్నా..
నే నడచిన బాటకి గమ్యానివైనప్పుడే
7641. అభూతకల్పనైనా బాగుంది..
నీ కన్నుల్లో కొలువయ్యింది నేనంటుంటే..
7642. ఏ కవిత కలిపిందో ఇద్దరినీ..
నువ్వాదరినీ నేనీదరినీ విడిగానే మసలుతుంటే..
7643. మరణానెప్పుడో జయించేసా..
నీలో ప్రణయదేవతగా నువ్వు ప్రకటించాక..
7644. దాటేసానందుకే నేర్వలేని పాఠం..
జీవనసత్యాన్ని వర్తమానంలో నేర్వాలని..
7645. నా చెలిమికి తీపెక్కువే..
మధుమేహమని దూరమవకుంటే సరి..
7646. నిశ్శబ్దమేదో శపిస్తున్నట్లుంది నన్ను..
నీ అన్వేషణ పూర్తవనందుకు..
7647. మధుపానం చేయకుండానే మత్తెక్కిస్తావు..
మంత్రలిపి నేర్చిందెక్కడో నెరజాణ..
7648. మార్పు మన మంచికే..
మరకను దిద్దుకోవడం రావాలందుకే..
7649. మహేంద్రజాలం మొదలెడతావు..
మన ప్రపంచమే వేరని లాక్కుపోతూ..
7650. నీ అక్షరాలన్నీ నాకేగా అంకితం..
కవనమంటూ నన్నే ముద్దుగా రాసుకున్నాక..
7651. ఏకాంతదర్పణంలో చూసుంటావు..
మనసును మరలించడం నీకు మాత్రమే తెలిసిన విద్యగా..
7652. అద్దానికీ అతిశయమెక్కువే..
నా అనురాగాన్ని నీలా చూపిస్తుంది..
7653. వగరనుకున్నది తీపయ్యింది..
నీ మనసురుచి నా పెదవంటి..
7654. ప్రేమను కవిత్వరీకరించినప్పుడే అనుకున్నా..
అక్షరాల్లో నన్ను దాచుకున్నావని..
7655. శిశిరమెరుగని ఆకుపచ్చవేగా..
స్మృతులంటూ నీలోనే నే విలీనమయ్యాక..
7656. నాలో మౌనాలు మల్లెలై కురవాలేమో..
నీలో శూన్యాన్ని ఆకర్షించి నిద్దురలేపాలంటే..
7657. అక్షయమైంది తీయదనం..
మరందాల పూబాలను నువ్వలా ప్రశ్నించగానే..
7658. మనసు మసకేసినప్పుడే అనుకున్నా..
మౌనం మధురాక్షరిగా కురవబోతుందని..
7659. చీకటంటే మక్కువయ్యిందిప్పుడే..
రేయైతే నీ తలపులకు చేరువకావొచ్చనే..
7660. మౌనం మౌనం రాసుకుంటాయని ఆశపడుతున్నా..
సరికొత్త భావాలకు మాట రావొచ్చని..
7661. మౌనన్నందుకే నేర్చాను..
నీలో నిరంతర శూన్యాన్ని తరిమికొట్టాలనే..
7662. చెమటలు రద్దు..
నీ శ్వాసలు వీవనై నన్నల్లగానే..
7663. చెలికి హేమంతమంటే ఇష్టమని తెలిసిందట..
మంచుకిరీటాన్ని అలంకరించుకొని ఎదురుచూస్తోంది పచ్చిక..
7664. వ్యామోహమొక్కటీ మిగిలిపోతుంది..
మోహాన్నొక జ్ఞాపకాల మరకగా అనుకోగానే..
7665. ఏ రాహువూ మింగలేదుగా..
మనమిద్దరం ఒకరిలోకొకరు విలీనమయ్యాక..
7666. అనుభూతులన్నీ సొంతమేగా..
నా తలపులన్నిటా నువ్వే నిండిపోతుంటే..
7667. మనసుపొరల్లో ప్రకంపనలు..
కొన్ని జ్ఞాపకాలు భూకంపాలై కుదుపుతుంటే..
7668. కొన్ని స్మృతులెప్పుడూ పరిమళాలు..
క్షణాలు పువ్వులై నవ్వుకున్నట్లు..
7669. నేనెప్పుడో చైతన్యమైపోయా..
నీ అభిమానం అలౌకికమై నన్నల్లగానే
7670. నిశ్శబ్దానికో సవ్వడుందనిపిస్తోంది..
హృదయంలో పోటెత్తిన శూన్యాన్ని గమనిస్తుంటే..
7671. నేనేగా ప్రేరణ..
నీలో వెలుగునీడల కలలకు ఊతమిస్తూ..
7672. హృదయమెప్పుడో చలించింది..
నిరీక్షణలో నీ కళ్ళు ఎరుపెక్కినందుకే..
7673. ఒక పువ్వు పూసిందక్కడ..
నాలో కవిత్వాన్ని మేల్కొల్పేందుకట..
7674. క్షణాలు గుచ్చుకుంటాయని తెలీదు..
నిరీక్షణలో కదలనని మొరాయిస్తూ..
7675. కుసుమించిన నవ్వది..
ఆనందం పడగలెత్తి నర్తించిన పులకింతకి..
7676. ఎదురుచూపులకర్ధం తెలిసింది..
నాకై నిరీక్షణను తపస్సులా చేస్తుంటే..
7677. కలలోనూ కువకువలే..
బుజ్జగిస్తున్నంది నువ్వైతే
7678. ఆనందం అధికమవుతోంది..
పరమరహస్యంలా నీ పేరునే పలవరిస్తుంటే..
7679. వినిపించని రాగమది..
నా మౌనంలో అంతర్లీనమై సాగుతున్నది..
7680. పెదవెందుకు అదురుతోందో..
నువ్వు చేసిన నులివెచ్చని సంతకం నుదుట మీదనైతే..
7681. వెన్నెల బొమ్మై నవ్వుకున్నా..
అతిశయోక్తులతో నిరంతరం నువ్వర్చిస్తుంటే..
7682. అణువుఅణువుకో సన్నాయంట..
పులకింతలు పదివేలై పూయిస్తుంటే తనువంతా..
7683. పూటకో కవనమంట..
నువ్వు కాళిదాసువైతే అందానికి పండుగేనంటూ..
7684. రాగానికో అతిశయమంట..
నీ రాణి సోయగాన్ని అనువదించినందుకట..
7685. భావానికో ఉల్లాసమట..
నీ శ్వాసను తాకిన తమకమట..
7686. మౌనానికి మనసు బరువెక్కిందట..
నిశ్శబ్దపు ఉరేగింపు సవ్వడికనుకుంట..
7687. అపురూపమై కదిలిందా రాతిరి..
అనుభూతులు అక్షరాలుగా నర్తించినందుకే.
7688. పదానికో ప్రయోగమట..
రేపుదయానికి ఆకాశం తప్పక అందునట
7689. జీవితం బరువెక్కింది..
గెలుపుకైన నిరీక్షణలో ఓటమికి ఎదురెళ్ళి..
7690. హృదయస్పందనలోని అవకతవకలు..
నువ్వు దూరమవుతుంటే దిగులు సవ్వళ్ళు.
7691. నిశ్వాసలో రాగాలు వెతుకుతావెందుకో..
ఊపిరిలో నిన్ను దాచుకున్నానంటుంటే..
7692. మనసెన్ని ముక్కలైతేనేమిలే..
ముక్కలన్నింటిలో నన్ను కవ్విస్తున్నది నువ్వైతే
7693. నీలా కళ్ళతో మాట్లాడినవారు లేరు..
మనసందుకే నీ పరమయ్యింది కాబోలు..
7694. కలతల్ని కాలానికొదిలేసా..
కలలన్నీ కమనీయంగా రచించుకోవాలనే సంకల్పంలో..
7695. ఊహలపల్లకి ఎక్కేసినట్లుంది..
నీలా నన్నెవ్వరూ ఊయలూపలేదు ఇప్పటివరకూ..
7696. కలల నెత్తావులకే మత్తిల్లినా..
వాస్తవమై ఎదురవుతావని తెలీక..
7697. ఈ క్షణాలెప్పటికీ అపురూపమే..
నీ రూపం నా కన్నుల్లో శాశ్వతమైన సమ్మోహం..
7698. కౌగిలింత నిజమనుకోనా..
కలలన్నీ ఋజువై పులకింతలు పుట్టాక..
7699. నిదురెప్పుడో ఎగిరిపోయింది..
తను పలకరించిన కమ్మని క్షణాన..
7700. నువ్వూ నేనూ ఎప్పటికీ భిన్నధృవాలమే..
ఏ మూలనున్నా పరస్పరం ఆకర్షించుకుంటూ..
అలవోకగా నన్నల్లుకున్నాయనే..
7602. పెదవంటిన అక్షరాలకూ తీపంటింది..
మధుపాత్రను ఎర్రగా దాచుకున్నందుకేమో..
7603. నీ తలపులే మనసైన బోయీలు..
నా మౌనాన్ని మోస్తున్న ఊరేగింపులో..
7604. మనసంతా సుస్వరాలు..
నీ తలపులు మీటిన బృందగానాలు..
7605. ఎడారంటే ఎక్కడో లేదు..
తడారిన గుండెల్లో తొంగిచూడు..
7606. నా సిగ్గే లక్ష్మణ రేఖయ్యింది..
నీకు హద్దులు గీసిన క్షణాన..
7607. ఆస్వాదిస్తున్నా జీవితాన్ని..
మధువును గ్రోలినంత సున్నితంగా మలచుకుంటూ..
7608. నువ్వు స్వర్గానికొచ్చినప్పుడే అనుకున్నా..
నన్ను వెతుక్కుంటూ వచ్చేసుంటావని..
7609. నిద్దురపోతే కల్లోకొద్దామనుకున్నా..
వేచిచూస్తూ మెలకువతోనుంటావనుకోలా..
7610. మహరాణిని చేద్దామనుకున్నా..
నా హృదయంలో సుస్థిరమై ఉంటావని..
7611. సంధ్యాకిరణంలో పోల్చుకున్నా..
నువ్వొచ్చి వెచ్చదనాన్ని పంచింది నాకోసమేనని..
7612. అలుకనే ఆయుధం చేసుకున్నా..
నీ పరిష్వంగంలో పరవశించాలని..
7613. కలిసున్నప్పుడు పచ్చగానున్న ప్రకృతి..
వియోగించినప్పుడు వికృతిగా మారిందెందుకో..
7614. నువ్వంతరంగంలో కాలు మోపినప్పుడనుకోలా..
నాలో రాగాలు రంజితాలవుతాయని..
7615. అల్లుకుంది మధుమాసం నీలా..
మనసంతా పరిమళాలు కుసుమించేలా..
7616. సన్నగా నవ్వాననుకున్నా..
నీపై ప్రేమజల్లు కురుస్తుందని తెలియక..
7617. శ్వాసను కూడదీసుకుంటున్నా..
నీ ధ్యాసలో ఊపిరాగిపోతుందని భయమేసే..
7618. హృదయమంతా నువ్వయ్యావు..
నీ భావాలు నావిగా పదిలపరచుకున్నందుకే..
7619. మౌనంతో ముచ్చటిస్తున్నా..
నువ్వొచ్చి మాటలతో కవ్విస్తావని తెలీక..
7620. నాలోకి తొంగిచూసినప్పుడే అనుకున్నా..
మౌనాన్ని చూపులతోనే ఆస్వాదించగలవని..
7621. అలుకలో అందాన్ని చూడాలనుకున్నా..
అందుకే ఆలశ్యంగా నిన్ననునయిస్తున్నా..
7622. అదృశ్యమైనట్లుంది అంతరాత్మ..
మన మధ్య వియోగనది ప్రవహిస్తుంటే..
7623. ఆకాశానికెగరవలసిన రెక్కలు కూలబడ్డవి..
జీవనానికని జంట వలసపోగానే.
7624. నీరవమెందుకు నవ్వుతుందో..
మౌనంతో క్రీడిస్తున్న వర్తమానాన్ని విసిగిస్తూ..
7625. కోయిలను బ్రతిమాలినప్పుడే అనుకున్నా..
నాకోసమే వసంతగానం నేర్చుతున్నావని..
7626. పాఠంలో అప్పుడే వెనకబడ్డా..
జీవితాన్ని చేజార్చుకొని రోదించినప్పుడే..
7627. శిశిరమందుకే పారిపోయింది..
వసంతానికి చోటిస్తే తనను మెచ్చుతావని..
7628. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది..
నీ ప్రణయంలో ఉక్కిరిబిక్కిరైనప్పట్నుంచి..
7629. మన ఊసులెన్ని వడకట్టానో..
ఊహలు అక్షరాలుగా పూయనన్నాయని..
7630. కలలెన్ని కలతలుగా మిగిలినవో..
కన్నీటిలో వలపుగూడు చెదిరిపోయాక..
7631. అల్లిబిల్లి మాటలతో ఆకట్టుకుంటావు..
వెచ్చదనాన్ని నిలువెల్లా చుట్టబెడుతూ..
7632. నిశీధిని ఇష్టపడ్డావనుకున్నా..
ఒంటరితనానికి భయపడక ఏకాంతంగా మార్చుకున్నావని..
7633. మనసులోకెప్పుడు తొంగిచూసావో..
ఆవేదన అంచుల్లోనే నన్ను నిలబెడుతూ..
7634. భావాలజల్లులెన్నో..
మనసంతా పువ్వులు పూయాలని సంకల్పించిన శరత్తులో..
7635. వెలుగునీడల సయ్యాటలో కలిసానందుకే..
విచిత్రానుభూతుల్లో నన్ను కనుగొంటావనే
7636. నేనంటూ అస్తమించినట్లేగా..
నిన్ను తలవని క్షణాలంటూ మిగిలుంటే..
7637. నీ కవితలోకొచ్చి కుదురుకున్నా..
పున్నమివన్నెల్లో నన్నూ రాస్తావనే
7638. పులకించినప్పుడే గుర్తించా..
నీ మనసు నా హృదిలో మాయేదో చేసిందని..
7639. మధువునే తలుస్తుంటావెందుకో ఎప్పుడూ..
పూర్వజన్మలో నువ్వు మధుపానివైనందుకేమో..
7640. నిన్నెప్పుడో కనుగొన్నా..
నే నడచిన బాటకి గమ్యానివైనప్పుడే
7641. అభూతకల్పనైనా బాగుంది..
నీ కన్నుల్లో కొలువయ్యింది నేనంటుంటే..
7642. ఏ కవిత కలిపిందో ఇద్దరినీ..
నువ్వాదరినీ నేనీదరినీ విడిగానే మసలుతుంటే..
7643. మరణానెప్పుడో జయించేసా..
నీలో ప్రణయదేవతగా నువ్వు ప్రకటించాక..
7644. దాటేసానందుకే నేర్వలేని పాఠం..
జీవనసత్యాన్ని వర్తమానంలో నేర్వాలని..
7645. నా చెలిమికి తీపెక్కువే..
మధుమేహమని దూరమవకుంటే సరి..
7646. నిశ్శబ్దమేదో శపిస్తున్నట్లుంది నన్ను..
నీ అన్వేషణ పూర్తవనందుకు..
7647. మధుపానం చేయకుండానే మత్తెక్కిస్తావు..
మంత్రలిపి నేర్చిందెక్కడో నెరజాణ..
7648. మార్పు మన మంచికే..
మరకను దిద్దుకోవడం రావాలందుకే..
7649. మహేంద్రజాలం మొదలెడతావు..
మన ప్రపంచమే వేరని లాక్కుపోతూ..
7650. నీ అక్షరాలన్నీ నాకేగా అంకితం..
కవనమంటూ నన్నే ముద్దుగా రాసుకున్నాక..
7651. ఏకాంతదర్పణంలో చూసుంటావు..
మనసును మరలించడం నీకు మాత్రమే తెలిసిన విద్యగా..
7652. అద్దానికీ అతిశయమెక్కువే..
నా అనురాగాన్ని నీలా చూపిస్తుంది..
7653. వగరనుకున్నది తీపయ్యింది..
నీ మనసురుచి నా పెదవంటి..
7654. ప్రేమను కవిత్వరీకరించినప్పుడే అనుకున్నా..
అక్షరాల్లో నన్ను దాచుకున్నావని..
7655. శిశిరమెరుగని ఆకుపచ్చవేగా..
స్మృతులంటూ నీలోనే నే విలీనమయ్యాక..
7656. నాలో మౌనాలు మల్లెలై కురవాలేమో..
నీలో శూన్యాన్ని ఆకర్షించి నిద్దురలేపాలంటే..
7657. అక్షయమైంది తీయదనం..
మరందాల పూబాలను నువ్వలా ప్రశ్నించగానే..
7658. మనసు మసకేసినప్పుడే అనుకున్నా..
మౌనం మధురాక్షరిగా కురవబోతుందని..
7659. చీకటంటే మక్కువయ్యిందిప్పుడే..
రేయైతే నీ తలపులకు చేరువకావొచ్చనే..
7660. మౌనం మౌనం రాసుకుంటాయని ఆశపడుతున్నా..
సరికొత్త భావాలకు మాట రావొచ్చని..
7661. మౌనన్నందుకే నేర్చాను..
నీలో నిరంతర శూన్యాన్ని తరిమికొట్టాలనే..
7662. చెమటలు రద్దు..
నీ శ్వాసలు వీవనై నన్నల్లగానే..
7663. చెలికి హేమంతమంటే ఇష్టమని తెలిసిందట..
మంచుకిరీటాన్ని అలంకరించుకొని ఎదురుచూస్తోంది పచ్చిక..
7664. వ్యామోహమొక్కటీ మిగిలిపోతుంది..
మోహాన్నొక జ్ఞాపకాల మరకగా అనుకోగానే..
7665. ఏ రాహువూ మింగలేదుగా..
మనమిద్దరం ఒకరిలోకొకరు విలీనమయ్యాక..
7666. అనుభూతులన్నీ సొంతమేగా..
నా తలపులన్నిటా నువ్వే నిండిపోతుంటే..
7667. మనసుపొరల్లో ప్రకంపనలు..
కొన్ని జ్ఞాపకాలు భూకంపాలై కుదుపుతుంటే..
7668. కొన్ని స్మృతులెప్పుడూ పరిమళాలు..
క్షణాలు పువ్వులై నవ్వుకున్నట్లు..
7669. నేనెప్పుడో చైతన్యమైపోయా..
నీ అభిమానం అలౌకికమై నన్నల్లగానే
7670. నిశ్శబ్దానికో సవ్వడుందనిపిస్తోంది..
హృదయంలో పోటెత్తిన శూన్యాన్ని గమనిస్తుంటే..
7671. నేనేగా ప్రేరణ..
నీలో వెలుగునీడల కలలకు ఊతమిస్తూ..
7672. హృదయమెప్పుడో చలించింది..
నిరీక్షణలో నీ కళ్ళు ఎరుపెక్కినందుకే..
7673. ఒక పువ్వు పూసిందక్కడ..
నాలో కవిత్వాన్ని మేల్కొల్పేందుకట..
7674. క్షణాలు గుచ్చుకుంటాయని తెలీదు..
నిరీక్షణలో కదలనని మొరాయిస్తూ..
7675. కుసుమించిన నవ్వది..
ఆనందం పడగలెత్తి నర్తించిన పులకింతకి..
7676. ఎదురుచూపులకర్ధం తెలిసింది..
నాకై నిరీక్షణను తపస్సులా చేస్తుంటే..
7677. కలలోనూ కువకువలే..
బుజ్జగిస్తున్నంది నువ్వైతే
7678. ఆనందం అధికమవుతోంది..
పరమరహస్యంలా నీ పేరునే పలవరిస్తుంటే..
7679. వినిపించని రాగమది..
నా మౌనంలో అంతర్లీనమై సాగుతున్నది..
7680. పెదవెందుకు అదురుతోందో..
నువ్వు చేసిన నులివెచ్చని సంతకం నుదుట మీదనైతే..
7681. వెన్నెల బొమ్మై నవ్వుకున్నా..
అతిశయోక్తులతో నిరంతరం నువ్వర్చిస్తుంటే..
7682. అణువుఅణువుకో సన్నాయంట..
పులకింతలు పదివేలై పూయిస్తుంటే తనువంతా..
7683. పూటకో కవనమంట..
నువ్వు కాళిదాసువైతే అందానికి పండుగేనంటూ..
7684. రాగానికో అతిశయమంట..
నీ రాణి సోయగాన్ని అనువదించినందుకట..
7685. భావానికో ఉల్లాసమట..
నీ శ్వాసను తాకిన తమకమట..
7686. మౌనానికి మనసు బరువెక్కిందట..
నిశ్శబ్దపు ఉరేగింపు సవ్వడికనుకుంట..
7687. అపురూపమై కదిలిందా రాతిరి..
అనుభూతులు అక్షరాలుగా నర్తించినందుకే.
7688. పదానికో ప్రయోగమట..
రేపుదయానికి ఆకాశం తప్పక అందునట
7689. జీవితం బరువెక్కింది..
గెలుపుకైన నిరీక్షణలో ఓటమికి ఎదురెళ్ళి..
7690. హృదయస్పందనలోని అవకతవకలు..
నువ్వు దూరమవుతుంటే దిగులు సవ్వళ్ళు.
7691. నిశ్వాసలో రాగాలు వెతుకుతావెందుకో..
ఊపిరిలో నిన్ను దాచుకున్నానంటుంటే..
7692. మనసెన్ని ముక్కలైతేనేమిలే..
ముక్కలన్నింటిలో నన్ను కవ్విస్తున్నది నువ్వైతే
7693. నీలా కళ్ళతో మాట్లాడినవారు లేరు..
మనసందుకే నీ పరమయ్యింది కాబోలు..
7694. కలతల్ని కాలానికొదిలేసా..
కలలన్నీ కమనీయంగా రచించుకోవాలనే సంకల్పంలో..
7695. ఊహలపల్లకి ఎక్కేసినట్లుంది..
నీలా నన్నెవ్వరూ ఊయలూపలేదు ఇప్పటివరకూ..
7696. కలల నెత్తావులకే మత్తిల్లినా..
వాస్తవమై ఎదురవుతావని తెలీక..
7697. ఈ క్షణాలెప్పటికీ అపురూపమే..
నీ రూపం నా కన్నుల్లో శాశ్వతమైన సమ్మోహం..
7698. కౌగిలింత నిజమనుకోనా..
కలలన్నీ ఋజువై పులకింతలు పుట్టాక..
7699. నిదురెప్పుడో ఎగిరిపోయింది..
తను పలకరించిన కమ్మని క్షణాన..
7700. నువ్వూ నేనూ ఎప్పటికీ భిన్నధృవాలమే..
ఏ మూలనున్నా పరస్పరం ఆకర్షించుకుంటూ..
No comments:
Post a Comment