7901. కాలానికీ గాయలేనట..
కొన్ని అనువదించుకోలేని వేదనా గేయాలతో..
7902. హేమంతపు ముగింపులో వర్షం..
కొన్ని ఎడబాట్ల నిట్టూర్పుల్లో..
7903. మేలిముసుగులో నేనుండిపోయా..
పగటికి చెలులు చేరి కవ్విస్తారనే..
7904. నీరవం సంగీతమైంది..
నాలోని శూన్యం సరిగమలు మొదలెట్టగానే..
7905. నీరవం సంగీతమైంది..
ప్రకృతితో పరిచయం పరవశాన్ని పెంచగానే..
7906. నీరవం సంగీతమైంది..
తన మాట మంత్రమై నన్నలరించగానే..
7910. పంచుకుందాం రా..
జ్ఞాపకాల్లోని పరిష్వంగపు పరవశాల మేళవింపుని..
7911. ముఖచిత్రానికి రంగులేస్తున్నా..
నలుపు తెలుపుల్లో నీడలుగా కదలాడుతుంటే..
7912.మనసొదిలి పోయావెందుకో..
ఉదయాస్తమానాలు నీ ధ్యాసనే పొదుపుకుంటున్నా..
7913. ఒంటరితనానికీ లోకువయ్యా..
నా ప్రేమకు గమ్యం దొరకనందుకే..
7914. సింధూరమప్పుడే కరిగింది..
నీ ఊహలవేడి నా మనసునంటగానే..
7915. ఆప్తమయ్యేందుకు తొందరపడ్డా..
ఆసక్తిలేని అనుబంధానికి ఆశగా ఎదురేగి..
7916. అరక్షణం కౌగిలికే కోటి అనుభూతులు..
గతజన్మ జ్ఞాపకపు గంధాలు పరిమళించినట్లు..
7917. పులకించిందో రాతిరి..
కలలో కౌగిలి వరమై నిజమైనందుకు..
7918. వియోగమలా వలసపోయింది..
నీ స్మృతులు నక్షత్రాలై మిణుక్కుమంటుంటే..
7919. ఏకాత్మగా మిగిలిపోయా..
విషాదం ఘనీభవించి మనసు ముక్కలయ్యాక..
7920. మెలితిరగడం ఆపుకున్నా..
నీ చూపులు వశం తప్పుతున్నాయనే..
7921. భావాలెంత అలవోకలో..
అక్షరాలుగా మారి కాగితాన్ని కౌగిలించేవేళ..
7922. నీరెండిన కళ్ళవి..
నీ రూపు కదలాడే ఆశలు కొన్ని అస్తమించి..
7923. జీవితమో నాటకమయ్యింది..
విషాదాన్ని దాచి సంతసాన్ని అభినయిస్తూ..
7924. సరిగమలతో ఆపేసా చిన్నప్పుడు..
గమకాలకో తమకముందని తెలీక..
7925. నాతో నేను విడిపోయా..
నీ విరుపుల్లో ముక్కలయ్యాక..
7926. నిరీక్షణిలా కదిలింది..
నువ్వొచ్చిన ఆనందానికి ఎదురవ్వాలనే ఆరాటంలో..
7927. గంధమప్పుడు రాసినట్లుంది..
నీ భావాల మేళవింపులో నన్నుంచినప్పుడు..
7928. గరళమూ తీపయ్యింది..
కొన్ని జ్ఞాపకాలను గుటకలుగా వేస్తుంటే..
7929. పెదవొంపు తీపెక్కింది..
నులివెచ్చని నీ శ్వాసల పరిమళానికి..
7930. భావానికందని దూరం..
మన మధ్య ప్రేమని పెంచింది..
7931. నువ్వంటే నాకిష్టం..
నా ప్రపంచమైన నీ ఊహలసాక్షి..
7932. ఒక స్వప్నం నిజమైంది..
రెండు మనసుల కలయికతో..
7933. ఆ గుండెకెప్పుడూ భూకంపాలే..
ఓదార్చుకోలేని తాపాలతో ముక్కలైపోతూ..
7934. నాలోనూ మెరుపొచ్చింది..
కొన్ని నవ్వులు నిన్నలరిస్తున్నాయని గమనించి..
7935. నటించడం అలవాటయ్యింది..
కన్నులు సహకరించకున్నా అధరాల సాయంతో..
7936. నీ దగ్గరొదిలేసా కొన్ని జ్ఞాపకాలు..
ఏకాంత క్షణాల్లోనైనా హత్తుకోకపోతావా అని..
7937. కలవరాన్నిలా పెంచేసావు..
ఊహామాత్రంగా చిత్రించగానే కల్లోకొచ్చి కవ్విస్తూ..
7938. మనసో వేదికైంది..
ఏకాంతాన్ని పిలవగానే నువ్వొచ్చి అలరిస్తున్నందుకు..
7940. గుండెచప్పుడు మారడం గుర్తించలేదు..
వలపు సహజంగా నన్నల్లినందుకు..
7941. ఆలాపనిప్పుడు మారింది..
నా పాటలో ప్రేమొచ్చి చేరగానే..
7942. నీరవానికో రాగం తెలిసింది..
నిశ్శబ్దాన్ని నువ్వు విసుక్కోగానే..
7943. తపనలకిదే ఆరంభం..
నీ పిలుపు సరిగమలకు తమకం నేనై బదులిస్తుంటే..
7944. రవికాంచని సొగసును పోతపెట్టా..
రసేశ్వరుడు తానొచ్చే సమయమవుతుందని..
7945. ఆవేదనలో కన్నీరు..
కలల నిట్టూర్పులను తాను విస్మరించలేక..
7946. విషాదాన్ని సాగనంపేసా..
అనురాగాన్ని ఆలపించాలని మనసు నిర్ణయమయ్యాక..
7947. మన భావాలకెప్పుడూ శుక్లపక్షమే..
సంపూర్ణమయ్యేదాకా సంబరాలు పంచుతూ..
7948. అనుబంధాలకు బీటలవే..
నమ్మకాలు బ్రద్దలై ఊహించని భూకంపాలతో..
7949. కలానికో చైతన్యమొచ్చిందట..
అక్షరాలను మచ్చిక చేసుకోవాలని మనసనుకోగానే..
7950. ఉషోదయానికే మొదలైన ఆవేదనొకటి..
నిన్నూహించాలనుకున్న మనసుకి ముసురుపట్టిందని..
7951. ఆనందం అరుణిమై మెరిసింది..
హేమంతంలో సింధూరమై నొసటికి..
7952. నిముషానికీ నిట్టూర్పులే..
కాస్తైనా బదులివ్వని కాలానికి దాసోహమవ్వలేక..
7953. కార్తీకమై వెలిగిపోతా..
నా నిరీక్షణకు బదులుగా నువ్వొస్తే..
7954. నా కన్నుల్లో కోటికాంతులు..
దీపావళి చూడాలని నువ్వనగానే..
7955. లేలేత వసంతంగా ఎదురైనప్పుడే అనుకున్నా..
శిశిరంపు రూపు క్షణాల్లో మార్చేస్తావని..
7956. శిశిరంతో సమానమే నేను..
ఊహలు వలసపోయిన రోజునుండీ..
7957. విరహం మరణంతో సమానమే..
నా మనసూ ప్రాణాలు నీ కడనే విడిచిపెట్టేసాక..
7958. మౌనానికి ప్రతినిధిగా నేను..
నీ అనురాగానికి దూరమయ్యాక..
7959. తీపిరాగాల కోయిలనైపోనా..
ఆప్తమైన నువ్వొచ్చి మధుమాసానికి రమ్మంటే..
7960. పెదవిప్పకుండానే కువకువలు..
ప్రేమపక్షులకు మాత్రమే సొంతమైన సవ్వళ్ళు..
7961. ప్రేమలేఖలన్నీ కాల్చేసా..
గతాన్ని సమాధి చేయాలని సంకల్పించగానే..
7962. ప్రేమఫలానికై ఎదురుచూపులు..
ఆరారుకాలాల మన ఆనందాలు ఫలిస్తాయని..
7963. నీ జతగా ఉండాలనుంది..
ఆకుపాటల్లో పువ్వులను ఊహించుకుంటూ..
7964. అక్షరమెందుకు అలిగిందో..
నిన్ను రాసేలోపు మనసు విరహిస్తుంటే..
7965. గుండెల్లో చోటిచ్చావనుకున్నా..
స్వేచ్ఛకై నువ్వొంటరిగా కదిలిపోతావని తెలియక..
7966. దూరమవుతావనుకోలెన్నడూ..
నేనంటూ మిగలక నీలో ఒదిగిపోయాక..
7967. ఎన్ని రంగులో నా కలలో..
ఊహల తెమ్మెరను వాస్తవంలోకి అనువదిస్తానంటూ..
7968. అమ్మంటే అంబరమేగా..
రెండక్షరాల్లో కుదించేందుకు కలానికందని స్వరూపమేగా..
7969. నిరీక్షణదేగా..
ప్రకృతి తెరతీసే సౌందర్యావిష్కరణలో మనముండాలని..
7970. నిత్యశుభాలా జంటకి..
కృతులన్నీ అనురాగపు శృతిలోనే పాడుకుంటుంటే..
7971. ఏకాంతాన్ని ఆశించక తప్పలేదు..
ఆక్రమిస్తున్న ఆలోచనలకు దారిచ్చేందుకు..
7972. ప్రేమంటే గాడ్పులని తెలీలేదు..
మనసంటుకొని గాయంగా మారేవరకూ..
7973. కొన్ని హృదయాలంతే..
ఆకర్షణకు తప్ప ఆత్మీయతకు లొంగవు..
7974. నీ ఊహలే నాకూపిరులు..
నిద్దుర దరిచేరని ఉక్కబోతలో..
7975. వెన్నెల దారాలే నీ చూపులు..
నాలో చైతన్యాన్ని జాగృతం చేసేవేళ..
7976. నవ్వులకు కారణాలు అడుగుతావేం..
నాతో నువ్వున్నది నిజమేగా..
7977.మనసుకొక్కటే తెలుసు..
నీ జ్ఞాపకాలతో తన సహజీవనం..
7978. తొలిచూపు శుభలేఖ నిజమనిపించింది....
పెదవుల మౌనాన్ని అనువదించాక..
7979. క్షణాలెందుకు చివుక్కుమన్నాయో..
నిన్ను కలవాలనే నిరీక్షణలో నేనుంటే..
7980. కవితిప్పుడు కమ్మగా పూర్తయ్యింది..
కొన్నక్షరాలు మనసుని ఆవిష్కరించగానే..
7981. అనురాగానికి కట్టుబడిపోయా..
నన్ను రాధను చేసి నువ్వు మాధవునిగా మారగానే..
7982. నిశీధే నచ్చుతోందిప్పుడు..
నీ తలపును ప్రేమించడం మొదలెట్టగానే..
7983. చీకటి వెలుగులు సహజమే జీవితానికి..
నీ నవ్వుతో నాకు ఉదయమవుతుందంతే..
7984. కాలాన్ని వేడుకుంటున్నా..
నాలోని ఉల్లాసానికి ప్రాణంపోసి బ్రతికించమని..
7985. రేయంతా ఊహలతో గడుపుతున్నా..
నువ్వొచ్చి కిరణాలతో జోకొడతావెందుకో..
7986. తారలు దిగి వచ్చినప్పుడు గమనించలేదు..
నా పక్కనో చందమామ మెరిసిపోతున్నాడని..
7987. రాజుకుంది మదిలో ప్రేమ..
కలలవీధుల్లో ప్రతిసారీ నువ్వెదురైనందుకే..
7988. ఎడబాటుకీ లోకువవుతున్నా..
విరహాన్ని హత్తుకోవాలనుకుంటూ క్షణాల్ని జార్చేస్తుంటే..
7989. వేకువైనా కన్నుల్లో కలల మబ్బులే..
మనసా వాచా మోహించింది నిన్ననే..
7990. ఏకాకివని ఎందుకనుకుంటావో..
నీలో అంతర్వాహినై నే ప్రవహిస్తున్నా..
7991. కవిగా గుర్తించనేలేదు..
నీ అక్షరాలొచ్చి ఆత్మీయంగా తడిమేవరకూ..
7992. ప్రేమెందుకలా ముదిరిపోతుందో..
పరితాపాన్ని తగ్గించుకొనేందుకు ఒక్క పలకరింపుతో..
7993. భావుకత్వమదే..
నవరసాలు నీ నవ్వులుగా
7994. ఎన్ని కిరణాలుగా విరియాలో నేను..
నీలో నిశీధిని వెన్నెలగా మార్చేందుకు..
7995. భావాలతో పండుగలే నా మనసుకి..
నీ కన్నుల్లోకి చూసిన ప్రతిసారీ..
7996. నీ కళలన్నీ కలల్లోనేగా..
హరివిల్లుని వంచానని కోతలెందుకో..
7997. హేమంతమై మిగిలున్నా..
శిశిరమైనా తుషారాన్ని గాలిస్తావని తెలిసే..
7998. గతంలోకి పారిపోతున్నా..
వాస్తవం వెక్కిరింపులు మరీ ఎక్కువయ్యాయనే..
7999. ముగ్గులేయడం మానేసా..
నువ్వు ముగ్గులోకి దిగుతావని అనుమానమొచ్చే..
8000. సరిగమల ఆలాపననే..
నీలో సంగీతానికి పరీక్షలు పెడుతూ..
కొన్ని అనువదించుకోలేని వేదనా గేయాలతో..
7902. హేమంతపు ముగింపులో వర్షం..
కొన్ని ఎడబాట్ల నిట్టూర్పుల్లో..
7903. మేలిముసుగులో నేనుండిపోయా..
పగటికి చెలులు చేరి కవ్విస్తారనే..
7904. నీరవం సంగీతమైంది..
నాలోని శూన్యం సరిగమలు మొదలెట్టగానే..
7905. నీరవం సంగీతమైంది..
ప్రకృతితో పరిచయం పరవశాన్ని పెంచగానే..
7906. నీరవం సంగీతమైంది..
తన మాట మంత్రమై నన్నలరించగానే..
7910. పంచుకుందాం రా..
జ్ఞాపకాల్లోని పరిష్వంగపు పరవశాల మేళవింపుని..
7911. ముఖచిత్రానికి రంగులేస్తున్నా..
నలుపు తెలుపుల్లో నీడలుగా కదలాడుతుంటే..
7912.మనసొదిలి పోయావెందుకో..
ఉదయాస్తమానాలు నీ ధ్యాసనే పొదుపుకుంటున్నా..
7913. ఒంటరితనానికీ లోకువయ్యా..
నా ప్రేమకు గమ్యం దొరకనందుకే..
7914. సింధూరమప్పుడే కరిగింది..
నీ ఊహలవేడి నా మనసునంటగానే..
7915. ఆప్తమయ్యేందుకు తొందరపడ్డా..
ఆసక్తిలేని అనుబంధానికి ఆశగా ఎదురేగి..
7916. అరక్షణం కౌగిలికే కోటి అనుభూతులు..
గతజన్మ జ్ఞాపకపు గంధాలు పరిమళించినట్లు..
7917. పులకించిందో రాతిరి..
కలలో కౌగిలి వరమై నిజమైనందుకు..
7918. వియోగమలా వలసపోయింది..
నీ స్మృతులు నక్షత్రాలై మిణుక్కుమంటుంటే..
7919. ఏకాత్మగా మిగిలిపోయా..
విషాదం ఘనీభవించి మనసు ముక్కలయ్యాక..
7920. మెలితిరగడం ఆపుకున్నా..
నీ చూపులు వశం తప్పుతున్నాయనే..
7921. భావాలెంత అలవోకలో..
అక్షరాలుగా మారి కాగితాన్ని కౌగిలించేవేళ..
7922. నీరెండిన కళ్ళవి..
నీ రూపు కదలాడే ఆశలు కొన్ని అస్తమించి..
7923. జీవితమో నాటకమయ్యింది..
విషాదాన్ని దాచి సంతసాన్ని అభినయిస్తూ..
7924. సరిగమలతో ఆపేసా చిన్నప్పుడు..
గమకాలకో తమకముందని తెలీక..
7925. నాతో నేను విడిపోయా..
నీ విరుపుల్లో ముక్కలయ్యాక..
7926. నిరీక్షణిలా కదిలింది..
నువ్వొచ్చిన ఆనందానికి ఎదురవ్వాలనే ఆరాటంలో..
7927. గంధమప్పుడు రాసినట్లుంది..
నీ భావాల మేళవింపులో నన్నుంచినప్పుడు..
7928. గరళమూ తీపయ్యింది..
కొన్ని జ్ఞాపకాలను గుటకలుగా వేస్తుంటే..
7929. పెదవొంపు తీపెక్కింది..
నులివెచ్చని నీ శ్వాసల పరిమళానికి..
7930. భావానికందని దూరం..
మన మధ్య ప్రేమని పెంచింది..
7931. నువ్వంటే నాకిష్టం..
నా ప్రపంచమైన నీ ఊహలసాక్షి..
7932. ఒక స్వప్నం నిజమైంది..
రెండు మనసుల కలయికతో..
7933. ఆ గుండెకెప్పుడూ భూకంపాలే..
ఓదార్చుకోలేని తాపాలతో ముక్కలైపోతూ..
7934. నాలోనూ మెరుపొచ్చింది..
కొన్ని నవ్వులు నిన్నలరిస్తున్నాయని గమనించి..
7935. నటించడం అలవాటయ్యింది..
కన్నులు సహకరించకున్నా అధరాల సాయంతో..
7936. నీ దగ్గరొదిలేసా కొన్ని జ్ఞాపకాలు..
ఏకాంత క్షణాల్లోనైనా హత్తుకోకపోతావా అని..
7937. కలవరాన్నిలా పెంచేసావు..
ఊహామాత్రంగా చిత్రించగానే కల్లోకొచ్చి కవ్విస్తూ..
7938. మనసో వేదికైంది..
ఏకాంతాన్ని పిలవగానే నువ్వొచ్చి అలరిస్తున్నందుకు..
7940. గుండెచప్పుడు మారడం గుర్తించలేదు..
వలపు సహజంగా నన్నల్లినందుకు..
7941. ఆలాపనిప్పుడు మారింది..
నా పాటలో ప్రేమొచ్చి చేరగానే..
7942. నీరవానికో రాగం తెలిసింది..
నిశ్శబ్దాన్ని నువ్వు విసుక్కోగానే..
7943. తపనలకిదే ఆరంభం..
నీ పిలుపు సరిగమలకు తమకం నేనై బదులిస్తుంటే..
7944. రవికాంచని సొగసును పోతపెట్టా..
రసేశ్వరుడు తానొచ్చే సమయమవుతుందని..
7945. ఆవేదనలో కన్నీరు..
కలల నిట్టూర్పులను తాను విస్మరించలేక..
7946. విషాదాన్ని సాగనంపేసా..
అనురాగాన్ని ఆలపించాలని మనసు నిర్ణయమయ్యాక..
7947. మన భావాలకెప్పుడూ శుక్లపక్షమే..
సంపూర్ణమయ్యేదాకా సంబరాలు పంచుతూ..
7948. అనుబంధాలకు బీటలవే..
నమ్మకాలు బ్రద్దలై ఊహించని భూకంపాలతో..
7949. కలానికో చైతన్యమొచ్చిందట..
అక్షరాలను మచ్చిక చేసుకోవాలని మనసనుకోగానే..
7950. ఉషోదయానికే మొదలైన ఆవేదనొకటి..
నిన్నూహించాలనుకున్న మనసుకి ముసురుపట్టిందని..
7951. ఆనందం అరుణిమై మెరిసింది..
హేమంతంలో సింధూరమై నొసటికి..
7952. నిముషానికీ నిట్టూర్పులే..
కాస్తైనా బదులివ్వని కాలానికి దాసోహమవ్వలేక..
7953. కార్తీకమై వెలిగిపోతా..
నా నిరీక్షణకు బదులుగా నువ్వొస్తే..
7954. నా కన్నుల్లో కోటికాంతులు..
దీపావళి చూడాలని నువ్వనగానే..
7955. లేలేత వసంతంగా ఎదురైనప్పుడే అనుకున్నా..
శిశిరంపు రూపు క్షణాల్లో మార్చేస్తావని..
7956. శిశిరంతో సమానమే నేను..
ఊహలు వలసపోయిన రోజునుండీ..
7957. విరహం మరణంతో సమానమే..
నా మనసూ ప్రాణాలు నీ కడనే విడిచిపెట్టేసాక..
7958. మౌనానికి ప్రతినిధిగా నేను..
నీ అనురాగానికి దూరమయ్యాక..
7959. తీపిరాగాల కోయిలనైపోనా..
ఆప్తమైన నువ్వొచ్చి మధుమాసానికి రమ్మంటే..
7960. పెదవిప్పకుండానే కువకువలు..
ప్రేమపక్షులకు మాత్రమే సొంతమైన సవ్వళ్ళు..
7961. ప్రేమలేఖలన్నీ కాల్చేసా..
గతాన్ని సమాధి చేయాలని సంకల్పించగానే..
7962. ప్రేమఫలానికై ఎదురుచూపులు..
ఆరారుకాలాల మన ఆనందాలు ఫలిస్తాయని..
7963. నీ జతగా ఉండాలనుంది..
ఆకుపాటల్లో పువ్వులను ఊహించుకుంటూ..
7964. అక్షరమెందుకు అలిగిందో..
నిన్ను రాసేలోపు మనసు విరహిస్తుంటే..
7965. గుండెల్లో చోటిచ్చావనుకున్నా..
స్వేచ్ఛకై నువ్వొంటరిగా కదిలిపోతావని తెలియక..
7966. దూరమవుతావనుకోలెన్నడూ..
నేనంటూ మిగలక నీలో ఒదిగిపోయాక..
7967. ఎన్ని రంగులో నా కలలో..
ఊహల తెమ్మెరను వాస్తవంలోకి అనువదిస్తానంటూ..
7968. అమ్మంటే అంబరమేగా..
రెండక్షరాల్లో కుదించేందుకు కలానికందని స్వరూపమేగా..
7969. నిరీక్షణదేగా..
ప్రకృతి తెరతీసే సౌందర్యావిష్కరణలో మనముండాలని..
7970. నిత్యశుభాలా జంటకి..
కృతులన్నీ అనురాగపు శృతిలోనే పాడుకుంటుంటే..
7971. ఏకాంతాన్ని ఆశించక తప్పలేదు..
ఆక్రమిస్తున్న ఆలోచనలకు దారిచ్చేందుకు..
7972. ప్రేమంటే గాడ్పులని తెలీలేదు..
మనసంటుకొని గాయంగా మారేవరకూ..
7973. కొన్ని హృదయాలంతే..
ఆకర్షణకు తప్ప ఆత్మీయతకు లొంగవు..
7974. నీ ఊహలే నాకూపిరులు..
నిద్దుర దరిచేరని ఉక్కబోతలో..
7975. వెన్నెల దారాలే నీ చూపులు..
నాలో చైతన్యాన్ని జాగృతం చేసేవేళ..
7976. నవ్వులకు కారణాలు అడుగుతావేం..
నాతో నువ్వున్నది నిజమేగా..
7977.మనసుకొక్కటే తెలుసు..
నీ జ్ఞాపకాలతో తన సహజీవనం..
7978. తొలిచూపు శుభలేఖ నిజమనిపించింది....
పెదవుల మౌనాన్ని అనువదించాక..
7979. క్షణాలెందుకు చివుక్కుమన్నాయో..
నిన్ను కలవాలనే నిరీక్షణలో నేనుంటే..
7980. కవితిప్పుడు కమ్మగా పూర్తయ్యింది..
కొన్నక్షరాలు మనసుని ఆవిష్కరించగానే..
7981. అనురాగానికి కట్టుబడిపోయా..
నన్ను రాధను చేసి నువ్వు మాధవునిగా మారగానే..
7982. నిశీధే నచ్చుతోందిప్పుడు..
నీ తలపును ప్రేమించడం మొదలెట్టగానే..
7983. చీకటి వెలుగులు సహజమే జీవితానికి..
నీ నవ్వుతో నాకు ఉదయమవుతుందంతే..
7984. కాలాన్ని వేడుకుంటున్నా..
నాలోని ఉల్లాసానికి ప్రాణంపోసి బ్రతికించమని..
7985. రేయంతా ఊహలతో గడుపుతున్నా..
నువ్వొచ్చి కిరణాలతో జోకొడతావెందుకో..
7986. తారలు దిగి వచ్చినప్పుడు గమనించలేదు..
నా పక్కనో చందమామ మెరిసిపోతున్నాడని..
7987. రాజుకుంది మదిలో ప్రేమ..
కలలవీధుల్లో ప్రతిసారీ నువ్వెదురైనందుకే..
7988. ఎడబాటుకీ లోకువవుతున్నా..
విరహాన్ని హత్తుకోవాలనుకుంటూ క్షణాల్ని జార్చేస్తుంటే..
7989. వేకువైనా కన్నుల్లో కలల మబ్బులే..
మనసా వాచా మోహించింది నిన్ననే..
7990. ఏకాకివని ఎందుకనుకుంటావో..
నీలో అంతర్వాహినై నే ప్రవహిస్తున్నా..
7991. కవిగా గుర్తించనేలేదు..
నీ అక్షరాలొచ్చి ఆత్మీయంగా తడిమేవరకూ..
7992. ప్రేమెందుకలా ముదిరిపోతుందో..
పరితాపాన్ని తగ్గించుకొనేందుకు ఒక్క పలకరింపుతో..
7993. భావుకత్వమదే..
నవరసాలు నీ నవ్వులుగా
7994. ఎన్ని కిరణాలుగా విరియాలో నేను..
నీలో నిశీధిని వెన్నెలగా మార్చేందుకు..
7995. భావాలతో పండుగలే నా మనసుకి..
నీ కన్నుల్లోకి చూసిన ప్రతిసారీ..
7996. నీ కళలన్నీ కలల్లోనేగా..
హరివిల్లుని వంచానని కోతలెందుకో..
7997. హేమంతమై మిగిలున్నా..
శిశిరమైనా తుషారాన్ని గాలిస్తావని తెలిసే..
7998. గతంలోకి పారిపోతున్నా..
వాస్తవం వెక్కిరింపులు మరీ ఎక్కువయ్యాయనే..
7999. ముగ్గులేయడం మానేసా..
నువ్వు ముగ్గులోకి దిగుతావని అనుమానమొచ్చే..
8000. సరిగమల ఆలాపననే..
నీలో సంగీతానికి పరీక్షలు పెడుతూ..
No comments:
Post a Comment