8701. అనిర్వచనీయమైనదంతా కవిత్వమే..
మనసుని కదిలించి ప్రకంపనాలు రేపాలంతే..
8702. గుండె గుప్పెడంతే..
స్పందనలెన్నో గుట్టుగా తనలో దాచుకుంటూ..
8703. గరికలా తీసిపారేస్తావెందుకో..
అలిగిన ప్రతిసారీ నువ్వు నలగలేనంటూ..
8704. ఆనందం గుప్పుమంది..
నీ పలుకుల పన్నీరలా చిలకగానే..
8705. అకాలముగా వర్షం..
సకాలమైన నీ రాకను స్వాగతిస్తూ..
8706. కాలాలు కలగాపులం..
ఊసులదొంతర్లతో మనసు పుస్తకం నిండిపోతున్నా..
8707. మనసారా నవ్వుతున్నా..
వైశాఖపు వర్షంలో తడిచిన అనుభూతికి..
8708. ఈ క్షణం నాదే..
ఊహలన్నీ నీపరం చేసాక..
8709. ఆలపిస్తూనే నేనున్నా..
నా ఆరాధన నీకు అవగతమవ్వాలని..
8710. మనసిప్పుడు తొణికింది..
నీలా నన్నొచ్చి కవ్వించినవారే లేరంటూ..
8711. మనోబలం పుంజుకున్నా..
నీ మౌనం మాటగా కురిసిందనే..
8712. అంతర్ముఖమైనప్పుడే కనుగొన్నా..
వర్తమానాన్ని కాదని గతానికి పయనమయ్యుంటావని..
8713. పున్నమి కోసమని ఎదురుచూసా..
నీ అక్షరాలలా కురిసాయంతే..
8714. కవితలన్నీ తొలకరిగా మారినట్లున్నాయ్..
ఆకాశమాపలేని ఆనందమై కురుస్తూ..
8715. నీ నీడన్నా నాకిష్టమే..
నన్ననుసరించి వెనువెంటే కదిలిందంటే..
8716. మందారమైతే నీవే..
నే పూజకి రమ్మని పిలిచినప్పుడల్లా..
8717. నా పులకరింతల్లో నువ్వే..
పరవశాలేవీ ప్రత్యేకంగా పులమకున్నా..
8718. నీ మనసెందుకో కుప్పిగెంతులు..
నా జడకుప్పెలు కదిలినప్పుడల్లా..
8719. పున్నమనగానే పైకొస్తావు..
జాబిలివి కాదంటే రేయి అలుగుతుందిప్పుడు..
8720. ఆకాశమంత ప్రేమయ్యింది నిజమే..
ఆ రాతిరంత ముసురుకున్నా..
8721. కన్నుల్లో కదులుతున్న ఆకృతి..
నీలా మారి కవ్వించింది..
8722. ఆలింగనానికై నేనొచ్చా..
నీ ఆలోచనలో చోటిచ్చావనే నమ్మకంతో..
8723. ఆనందాన్ని కోరుకున్న విధిగా..
జాబిలి జతైనందుకు ప్రతిగా..
8724. ఏకాంతమెప్పుడూ ఆనందమివ్వలేదు..
నీ వియోగంలో వలపు వేధిస్తుంటే..
8725. కన్నీరెంత కురిసిందో లెక్కలేదు..
వర్షంలో కరిగి జారిపోయాక..
8726. రెప్పల్లో దాచుకున్నా వెతలన్నీ..
కన్నుల్లో ఎదురైతే కలవరపడతావనే..
8727. మనసంతా కేరింత..
నీ కవ్వింతలో అదో పులకింత..
8728. ఆరడుగులని గర్వమెందుకో..
అయిదడుగులైన నాతో తలొంచుకొనే మాట్లాడాలిగా..
8729. అందానికి ఎదురెళ్ళడం మానేసానందుకే..
నాలో నిజం కనుమరుగైపోతుందనే..
8730. నువ్వు మెచ్చిన పుస్తకాన్ని నేను..
నీకు నచ్చినట్లు నన్ను చదివేట్టు..
8731. అనుబంధమలా పెంచుకోవాలనుంది..
నీ కాస్త ఋణాన్ని ఈ జన్మకి తీర్చకుండా
8732. భావాల గమ్మత్తు..
అక్షరాలకు మత్తుపూసి హృదయాలను ఆకర్షిస్తూ..
8733. చదివేస్తున్నా మనసులను..
నాకర్ధం కానిదేదీ ఉండదనే నమ్మకంతోనే..
8734. చదివేస్తున్నా మనసులను..
కవితలుగా రాసేద్దామని..
8735. చదివేస్తున్నా మనసులను..
నడుస్తున్న శవాలు ఎన్నున్నాయో కనిపెడదామని..!
8736. ఆ ఊహనక్కడితో ఆపేసా..
అనుభూతినలా నిక్షిప్తం చేద్దామని..
8737. నిన్నటి కలో ఇంద్రజాలమనుకున్నా..
వాస్తవమై నేడు కురిసేంతవరకూ..
8738. పక్వం కావెప్పటికీ కొందరి బుద్ధులు..
పచ్చిగా..కచ్ఛగా ఉండుండీ విస్పోటిస్తూ..
8739. కవితగా వెలుగుదామనుకున్నా..
ఒక్కసారన్నా నువ్వు అక్షరంగా రాస్తావనంటే..
8740. జాబిలే గెలిచిందిగా..
వానెంత కురిసినా పున్నమిని నా మది కోరుకోగానే..
8741. ఎన్నాళ్ళకు విరిసిందో చెలిమి కుసుమం..
స్మృతుల పరిమళాన్ని నాకు పంచేందుకు..
8742. నా నవ్వులంతే..
చితి నుండీ లేచేవరకూ కవ్విస్తుంటాయి..
8743. కావాలనే ఋణమిస్తున్నా..
ఈ జన్మకి తీర్చలేవనే నమ్మకంతోనే..
8744. నల్లపూసనైపోయానందుకే..
పున్నమినాడు కనిపించినా నన్ను పట్టించుకోవట్లేదనే..
8745. నీ అలజడో సంగీతమై వినిపిస్తోంది..
ఆలింగనానికి రమ్మంటూ నీ కబురందగానే..
8746. పరాచికాలెక్కువే నీకు..
ప్రేమ చూపిస్తానంటూ నన్ను చేరినప్పుడల్లా..
8747. అంతరంగం మరణించినందుకేమో..
భావాలు శూన్యమై మౌనం చేరువయ్యిందిలా..
8748. కలలన్నింటినీ కౌగిలించేసా..
నా మనసు కోరినవన్నీ సాక్షాత్కరిస్తున్నాయనే..
8749. ప్రేమిలా ఓడిపోవలసిందేనేమో..
బరువెక్కుతున్న మనసును రోదిస్తూ మోయలేక
8750. ఆమె కళ్ళెప్పుడూ సజలాలే..
ఆపలేని ఆవేదనకు సాక్ష్యాలవుతూ..
8751. మధువనంలో మనమేగా..
నీకు నువ్వూ..నాకు నేనుగా కలలు కంటున్నా..
8752. మనసు కోయిల విషాదగీతం..
ఆస్వాదించేలోగానే వసంతం వలసపోయిందని..
8753. వీనులవిందే నీ కవితలు..
మనసారా నన్ను పాడుతున్నందుకే..
8754. తొలకరినై నే పాడుతున్నా..
నా గానంలో తడవాలనుందన్నావనే..
8755. కాలాన్నందుకే సాయమడిగా..
నాలో భావాలకు అనుభూతి రుచినందించాలనే..
8756. అనురాగమందుకే బదులిస్తుంది..
ప్రతిస్పందనలో పరిమళాన్ని నీకు పంచాలనే..
8757. అనురాగమందుకే బదులిస్తుంది..
ప్రతిస్పందనలో పరిమళాన్ని నీకు పంచాలనే..
8758. భావాలు పదివేలు..
నువ్వెప్పుడొచ్చినా వినిపిద్దామనే నా ఎదురుచూపులు..
8759. కలల కేరింతలు..
కన్నుల కలయికలో..
8760. మనసలా చెదిరింది..
వీగిన నమ్మకం విలవిలలాడిన సాక్షిగా..
8761. నీ అలుకలే ఆసాంతం..
నన్ను వలపించాలని తలపించినప్పుడల్లా..
8762. సోలిపోతున్న పల్లవాలు..
పూలపాటల జోలపాటలకనుకున్నా..
8763. నిశ్వాసలోనూ నిన్ను వీడలేకున్నా..
నా ఊపిరిలో నువ్వున్నందుకే..
8764. భావాల పువ్వులు పూయాల్సిందే..
అక్షరం ఒయారంగా కదిలిందంటే..
8765. విరహాన్ని జల్లెడేసేసా..
నా ఎదురుచూపులు ఫలిస్తాయని అనుకోగానే..
8766. శిశిరమందుకే తరలిపోయింది..
వసంతమొస్తే తన ఉనికి ఉండబోదని..
8767. అంతర్మథనమనుకుంటా..
మనసు మౌనాన్ని హత్తుకుపోయింది..
8768. మనసు పడవేసుకొని నేనొచ్చేసా..
విహారానికి నువ్వొస్తే పోదామని..
8769. అపహాస్యాన్ని ఒప్పుకోకెప్పుడూ..
మందహాసం మనదయ్యిందిగా..
8770. ఎన్నిసార్లందుకుంటావో హృదయాన్ని..
పూవంత కమ్మనైన పరిమళం నాకుందని..
8771. గతాన్ని చెరిపేసాను..
భవిష్యత్తు కలలో ఊరిస్తూ రమ్మనగానే..
8772. చూపులతోనే గీసుకుంటున్న చిత్రాలు..
ఇన్నాళ్ళూ మదిలోనున్న ఊహలు..
8773. అచ్చెరువైన చిత్రాన్నే..
రెప్పలతోనూ రాగాలు రేపగలవని తెలుస్తుంటే..
8774. పరిప్రశ్నలు మానేసుకున్నా..
జవాబులు వెతకలేని నిస్సహాయతుందని తెలిసే..
8775. చీకటికో చక్కదనమొచ్చింది..
చిక్కగా కురుస్తూ స్మృతులను రేపుతుంటే..
8776. నా ఆనందానికి తడబడటం తెలీదనుకున్నా..
నీతో ముడిపడుందని గమనించక మునుపు..
8777. నీలో నువ్వు నవ్వుకున్నప్పుడే అనుకున్నా..
నా కన్నులు అద్దంలా మెరిసుంటాయని..
8778. కంగారవుతోంది ప్రేమవుతుంటే..
ఎవరైనా కనిపెడితే ఏం చెప్పాలాని..
8779. ఎన్నివేదనల్లో తడిచిందో..
అయినా ఓదార్పుకు సిద్ధమంటోంది తలగడ..
8780. ఓ హరివిల్లు ఒంగింది వింతగా..
నా పెదవొంపుతో పోటీపడాలనుందంటూ కొత్తగా..
8781. అనురాగమూ విషమవుతుంది..
ఇష్టమంటూనే రోజూ అపార్ధాన్ని పాడుతుంటే..
8782. కలలోనూ నిన్నెతుకుతూ కన్నులు..
పరిష్వంగపు పరవశంలో తోడున్ననూ..
8783. ఎన్ని మనసులు మాయలో పడ్డాయో..
నీ మౌనాన్ని మాటల్లోకి అనువదించుకొని..
8784. ఎన్ని కుసుమాలు విరగబూసాయో..
మన సుస్వరాలు పరిమళించాలని..
8785. లిపికందని వేదనలే నావన్నీ..
మరలిరాని లోకానికి తనెళ్ళిపోయాక..
8786. అశ్రువులను లెక్కించాలనుకున్నా..
బిందువులు కూడి సంద్రమవుతాయని తెలీక..
8787. ముగింపులేని మనోవ్యథ..
మృత్యువొచ్చి కరుణించాల్సిందేనిక..
8788. బలుమున్నోడిదే ఏలుబడి..
రైతన్న కన్నులకేముందని..చివరికది కంటతడి..
8789. వియోగపు పొద్దుపొడుపులోనేగా జీవితం..
ప్రణయం అందని ద్రాక్షయ్యాక..
8790. కొన్ని ఆశలు మౌనవించాయి..
నిన్నటి గతాన్ని తవ్వుకుంటూ..
8791. ఎదురుచూపుల వైరాగ్యం..
ఇంకెప్పటికీ మనం కలవబోమని తెలిసాక..
8792. ఆమె కనుమరుగైతేనేం..
అతనికి రోజుకో కవితగా ఎదురవుతోందిగా..
8793. గాయమూ మంచిదేననుకున్నా..
నాలో గేయాలు సరికొత్తగా పుట్టుకొచ్చాయని..
8794. నేలపైనా సుఖంగా నిద్రిస్తున్నా..
నేస్తమంటి తలగడ తోడుందనే..
8795. విషాదాన్నే పాడుతోంది నా పెదవిప్పుడు...
యుగళాన్ని ఆలపించేందుకు నువ్వు లేనందుకు..
8796. ఆనందపు పడవలో మనమేగా..
ఆషాడపు తొలివానలు గిలిగింతలిస్తుంటే..
8797. బుగ్గలకెందుకులే గంధాలు..
ఎప్పుడో విరిసెనుగా మది మందారాలు..
8798. నా అక్షరాలంతే..
కన్నీటిని ఆనందభాష్పాలుగా చేయగల అస్త్రాలు..
8799. చెలిమలా చిగురించింది..
చింతల్లో చైత్రమై నువ్వు చేయందించగానే..
8800. నా చూపులంతే..
నీ గుండెచప్పుళ్ళకు శృతిచేయక మానవు..
మనసుని కదిలించి ప్రకంపనాలు రేపాలంతే..
8702. గుండె గుప్పెడంతే..
స్పందనలెన్నో గుట్టుగా తనలో దాచుకుంటూ..
8703. గరికలా తీసిపారేస్తావెందుకో..
అలిగిన ప్రతిసారీ నువ్వు నలగలేనంటూ..
8704. ఆనందం గుప్పుమంది..
నీ పలుకుల పన్నీరలా చిలకగానే..
8705. అకాలముగా వర్షం..
సకాలమైన నీ రాకను స్వాగతిస్తూ..
8706. కాలాలు కలగాపులం..
ఊసులదొంతర్లతో మనసు పుస్తకం నిండిపోతున్నా..
8707. మనసారా నవ్వుతున్నా..
వైశాఖపు వర్షంలో తడిచిన అనుభూతికి..
8708. ఈ క్షణం నాదే..
ఊహలన్నీ నీపరం చేసాక..
8709. ఆలపిస్తూనే నేనున్నా..
నా ఆరాధన నీకు అవగతమవ్వాలని..
8710. మనసిప్పుడు తొణికింది..
నీలా నన్నొచ్చి కవ్వించినవారే లేరంటూ..
8711. మనోబలం పుంజుకున్నా..
నీ మౌనం మాటగా కురిసిందనే..
8712. అంతర్ముఖమైనప్పుడే కనుగొన్నా..
వర్తమానాన్ని కాదని గతానికి పయనమయ్యుంటావని..
8713. పున్నమి కోసమని ఎదురుచూసా..
నీ అక్షరాలలా కురిసాయంతే..
8714. కవితలన్నీ తొలకరిగా మారినట్లున్నాయ్..
ఆకాశమాపలేని ఆనందమై కురుస్తూ..
8715. నీ నీడన్నా నాకిష్టమే..
నన్ననుసరించి వెనువెంటే కదిలిందంటే..
8716. మందారమైతే నీవే..
నే పూజకి రమ్మని పిలిచినప్పుడల్లా..
8717. నా పులకరింతల్లో నువ్వే..
పరవశాలేవీ ప్రత్యేకంగా పులమకున్నా..
8718. నీ మనసెందుకో కుప్పిగెంతులు..
నా జడకుప్పెలు కదిలినప్పుడల్లా..
8719. పున్నమనగానే పైకొస్తావు..
జాబిలివి కాదంటే రేయి అలుగుతుందిప్పుడు..
8720. ఆకాశమంత ప్రేమయ్యింది నిజమే..
ఆ రాతిరంత ముసురుకున్నా..
8721. కన్నుల్లో కదులుతున్న ఆకృతి..
నీలా మారి కవ్వించింది..
8722. ఆలింగనానికై నేనొచ్చా..
నీ ఆలోచనలో చోటిచ్చావనే నమ్మకంతో..
8723. ఆనందాన్ని కోరుకున్న విధిగా..
జాబిలి జతైనందుకు ప్రతిగా..
8724. ఏకాంతమెప్పుడూ ఆనందమివ్వలేదు..
నీ వియోగంలో వలపు వేధిస్తుంటే..
8725. కన్నీరెంత కురిసిందో లెక్కలేదు..
వర్షంలో కరిగి జారిపోయాక..
8726. రెప్పల్లో దాచుకున్నా వెతలన్నీ..
కన్నుల్లో ఎదురైతే కలవరపడతావనే..
8727. మనసంతా కేరింత..
నీ కవ్వింతలో అదో పులకింత..
8728. ఆరడుగులని గర్వమెందుకో..
అయిదడుగులైన నాతో తలొంచుకొనే మాట్లాడాలిగా..
8729. అందానికి ఎదురెళ్ళడం మానేసానందుకే..
నాలో నిజం కనుమరుగైపోతుందనే..
8730. నువ్వు మెచ్చిన పుస్తకాన్ని నేను..
నీకు నచ్చినట్లు నన్ను చదివేట్టు..
8731. అనుబంధమలా పెంచుకోవాలనుంది..
నీ కాస్త ఋణాన్ని ఈ జన్మకి తీర్చకుండా
8732. భావాల గమ్మత్తు..
అక్షరాలకు మత్తుపూసి హృదయాలను ఆకర్షిస్తూ..
8733. చదివేస్తున్నా మనసులను..
నాకర్ధం కానిదేదీ ఉండదనే నమ్మకంతోనే..
8734. చదివేస్తున్నా మనసులను..
కవితలుగా రాసేద్దామని..
8735. చదివేస్తున్నా మనసులను..
నడుస్తున్న శవాలు ఎన్నున్నాయో కనిపెడదామని..!
8736. ఆ ఊహనక్కడితో ఆపేసా..
అనుభూతినలా నిక్షిప్తం చేద్దామని..
8737. నిన్నటి కలో ఇంద్రజాలమనుకున్నా..
వాస్తవమై నేడు కురిసేంతవరకూ..
8738. పక్వం కావెప్పటికీ కొందరి బుద్ధులు..
పచ్చిగా..కచ్ఛగా ఉండుండీ విస్పోటిస్తూ..
8739. కవితగా వెలుగుదామనుకున్నా..
ఒక్కసారన్నా నువ్వు అక్షరంగా రాస్తావనంటే..
8740. జాబిలే గెలిచిందిగా..
వానెంత కురిసినా పున్నమిని నా మది కోరుకోగానే..
8741. ఎన్నాళ్ళకు విరిసిందో చెలిమి కుసుమం..
స్మృతుల పరిమళాన్ని నాకు పంచేందుకు..
8742. నా నవ్వులంతే..
చితి నుండీ లేచేవరకూ కవ్విస్తుంటాయి..
8743. కావాలనే ఋణమిస్తున్నా..
ఈ జన్మకి తీర్చలేవనే నమ్మకంతోనే..
8744. నల్లపూసనైపోయానందుకే..
పున్నమినాడు కనిపించినా నన్ను పట్టించుకోవట్లేదనే..
8745. నీ అలజడో సంగీతమై వినిపిస్తోంది..
ఆలింగనానికి రమ్మంటూ నీ కబురందగానే..
8746. పరాచికాలెక్కువే నీకు..
ప్రేమ చూపిస్తానంటూ నన్ను చేరినప్పుడల్లా..
8747. అంతరంగం మరణించినందుకేమో..
భావాలు శూన్యమై మౌనం చేరువయ్యిందిలా..
8748. కలలన్నింటినీ కౌగిలించేసా..
నా మనసు కోరినవన్నీ సాక్షాత్కరిస్తున్నాయనే..
8749. ప్రేమిలా ఓడిపోవలసిందేనేమో..
బరువెక్కుతున్న మనసును రోదిస్తూ మోయలేక
8750. ఆమె కళ్ళెప్పుడూ సజలాలే..
ఆపలేని ఆవేదనకు సాక్ష్యాలవుతూ..
8751. మధువనంలో మనమేగా..
నీకు నువ్వూ..నాకు నేనుగా కలలు కంటున్నా..
8752. మనసు కోయిల విషాదగీతం..
ఆస్వాదించేలోగానే వసంతం వలసపోయిందని..
8753. వీనులవిందే నీ కవితలు..
మనసారా నన్ను పాడుతున్నందుకే..
8754. తొలకరినై నే పాడుతున్నా..
నా గానంలో తడవాలనుందన్నావనే..
8755. కాలాన్నందుకే సాయమడిగా..
నాలో భావాలకు అనుభూతి రుచినందించాలనే..
8756. అనురాగమందుకే బదులిస్తుంది..
ప్రతిస్పందనలో పరిమళాన్ని నీకు పంచాలనే..
8757. అనురాగమందుకే బదులిస్తుంది..
ప్రతిస్పందనలో పరిమళాన్ని నీకు పంచాలనే..
8758. భావాలు పదివేలు..
నువ్వెప్పుడొచ్చినా వినిపిద్దామనే నా ఎదురుచూపులు..
8759. కలల కేరింతలు..
కన్నుల కలయికలో..
8760. మనసలా చెదిరింది..
వీగిన నమ్మకం విలవిలలాడిన సాక్షిగా..
8761. నీ అలుకలే ఆసాంతం..
నన్ను వలపించాలని తలపించినప్పుడల్లా..
8762. సోలిపోతున్న పల్లవాలు..
పూలపాటల జోలపాటలకనుకున్నా..
8763. నిశ్వాసలోనూ నిన్ను వీడలేకున్నా..
నా ఊపిరిలో నువ్వున్నందుకే..
8764. భావాల పువ్వులు పూయాల్సిందే..
అక్షరం ఒయారంగా కదిలిందంటే..
8765. విరహాన్ని జల్లెడేసేసా..
నా ఎదురుచూపులు ఫలిస్తాయని అనుకోగానే..
8766. శిశిరమందుకే తరలిపోయింది..
వసంతమొస్తే తన ఉనికి ఉండబోదని..
8767. అంతర్మథనమనుకుంటా..
మనసు మౌనాన్ని హత్తుకుపోయింది..
8768. మనసు పడవేసుకొని నేనొచ్చేసా..
విహారానికి నువ్వొస్తే పోదామని..
8769. అపహాస్యాన్ని ఒప్పుకోకెప్పుడూ..
మందహాసం మనదయ్యిందిగా..
8770. ఎన్నిసార్లందుకుంటావో హృదయాన్ని..
పూవంత కమ్మనైన పరిమళం నాకుందని..
8771. గతాన్ని చెరిపేసాను..
భవిష్యత్తు కలలో ఊరిస్తూ రమ్మనగానే..
8772. చూపులతోనే గీసుకుంటున్న చిత్రాలు..
ఇన్నాళ్ళూ మదిలోనున్న ఊహలు..
8773. అచ్చెరువైన చిత్రాన్నే..
రెప్పలతోనూ రాగాలు రేపగలవని తెలుస్తుంటే..
8774. పరిప్రశ్నలు మానేసుకున్నా..
జవాబులు వెతకలేని నిస్సహాయతుందని తెలిసే..
8775. చీకటికో చక్కదనమొచ్చింది..
చిక్కగా కురుస్తూ స్మృతులను రేపుతుంటే..
8776. నా ఆనందానికి తడబడటం తెలీదనుకున్నా..
నీతో ముడిపడుందని గమనించక మునుపు..
8777. నీలో నువ్వు నవ్వుకున్నప్పుడే అనుకున్నా..
నా కన్నులు అద్దంలా మెరిసుంటాయని..
8778. కంగారవుతోంది ప్రేమవుతుంటే..
ఎవరైనా కనిపెడితే ఏం చెప్పాలాని..
8779. ఎన్నివేదనల్లో తడిచిందో..
అయినా ఓదార్పుకు సిద్ధమంటోంది తలగడ..
8780. ఓ హరివిల్లు ఒంగింది వింతగా..
నా పెదవొంపుతో పోటీపడాలనుందంటూ కొత్తగా..
8781. అనురాగమూ విషమవుతుంది..
ఇష్టమంటూనే రోజూ అపార్ధాన్ని పాడుతుంటే..
8782. కలలోనూ నిన్నెతుకుతూ కన్నులు..
పరిష్వంగపు పరవశంలో తోడున్ననూ..
8783. ఎన్ని మనసులు మాయలో పడ్డాయో..
నీ మౌనాన్ని మాటల్లోకి అనువదించుకొని..
8784. ఎన్ని కుసుమాలు విరగబూసాయో..
మన సుస్వరాలు పరిమళించాలని..
8785. లిపికందని వేదనలే నావన్నీ..
మరలిరాని లోకానికి తనెళ్ళిపోయాక..
8786. అశ్రువులను లెక్కించాలనుకున్నా..
బిందువులు కూడి సంద్రమవుతాయని తెలీక..
8787. ముగింపులేని మనోవ్యథ..
మృత్యువొచ్చి కరుణించాల్సిందేనిక..
8788. బలుమున్నోడిదే ఏలుబడి..
రైతన్న కన్నులకేముందని..చివరికది కంటతడి..
8789. వియోగపు పొద్దుపొడుపులోనేగా జీవితం..
ప్రణయం అందని ద్రాక్షయ్యాక..
8790. కొన్ని ఆశలు మౌనవించాయి..
నిన్నటి గతాన్ని తవ్వుకుంటూ..
8791. ఎదురుచూపుల వైరాగ్యం..
ఇంకెప్పటికీ మనం కలవబోమని తెలిసాక..
8792. ఆమె కనుమరుగైతేనేం..
అతనికి రోజుకో కవితగా ఎదురవుతోందిగా..
8793. గాయమూ మంచిదేననుకున్నా..
నాలో గేయాలు సరికొత్తగా పుట్టుకొచ్చాయని..
8794. నేలపైనా సుఖంగా నిద్రిస్తున్నా..
నేస్తమంటి తలగడ తోడుందనే..
8795. విషాదాన్నే పాడుతోంది నా పెదవిప్పుడు...
యుగళాన్ని ఆలపించేందుకు నువ్వు లేనందుకు..
8796. ఆనందపు పడవలో మనమేగా..
ఆషాడపు తొలివానలు గిలిగింతలిస్తుంటే..
8797. బుగ్గలకెందుకులే గంధాలు..
ఎప్పుడో విరిసెనుగా మది మందారాలు..
8798. నా అక్షరాలంతే..
కన్నీటిని ఆనందభాష్పాలుగా చేయగల అస్త్రాలు..
8799. చెలిమలా చిగురించింది..
చింతల్లో చైత్రమై నువ్వు చేయందించగానే..
8800. నా చూపులంతే..
నీ గుండెచప్పుళ్ళకు శృతిచేయక మానవు..
No comments:
Post a Comment