8801. లేచి నిలబడే గడ్డిపువ్వునడగాలి..
తొక్కినా విశ్రమించకెలా నిలబడిందోనని..
8802. వల్లిస్తూనే ఉంటావలా ప్రణయవేదాలు..
వద్దంటున్నా వెంటబడి కవ్విస్తూ..
8803. ఎన్నిసార్లని విశ్వాసాన్ని కోల్పోవాలో..
నమ్మిన ప్రతిసారీ ఉక్కిరిబిక్కిరిస్తుంటే..
8804. కన్నీరూ తీపవుతోందిప్పుడు..
నీ పెదవుల్లో నెలవంక నేనైనందుకు..
8805. గులాబీలతో గుచ్చాలని ఆశలంట..
అబద్దాలాటకి సున్నితత్వం తక్కువయ్యిందని..
8806. కాలమలా కదులుతూనే ఉంది..
కాగితప్పడవలో మునకలనూ ఆస్వాదించుకుంటూ..
8807. ఆశలన్నీ పేకమేడలయ్యుంటాయి..
అంతస్తు పెంచగానే సహజంగానే కూలిపోయుంటాయి..
8808. కొందరి పలుకులంతే..
తేనె పూసిన కత్తి మాదిరి మదిలో దిగుతుంటాయి..
8809. పరిమళమిలా అందింది..
పవనమొచ్చి సుతిమెత్తగా నన్ను తడమగానే..
8810. తెలివి తక్కువతనం బయటపడింది..
తలవంది తెలిసినట్లు విరచించగానే..
8811. నా విషాదాలు గులాబీలు..
నెమరేస్తున్నవి నీ స్మృతులైనందుకు..
8812. దిగులు నీరయినట్లుంది..
ఆమె కన్నుల్లో శోకం ప్రవహిస్తోంది..
8813. ఎందుకో నువ్విలా..
లేనిపోని ఊహల్లో ఊపుతూ నన్నిలా..
8814.కురుస్తూనే ఉంటానలా..
కవిత్వాన్ని చదివేందుకు నీకు మనసైనప్పుడల్లా..
8815. అనుకూలంగానే నేనున్నా..
ఆకాశంలో సగమేంటని నువ్వు ప్రశ్నిస్తున్నా..
8816. ఈడూజోడే వాళ్ళిద్దరూ..
దాంపత్యం అనుకూలించలేదంతే..
8817. నీకు మాత్రమే వినిపించాలనుకున్న నవ్వులు..
నా పెదవొంపున విరబూస్తున్న కెంపులు
8818. కలంగానైనా మారాలనుంది..
ప్రవహిస్తున్న ప్రేమను కాగితంపైనైనా ఒంపుదామని..
8819. ఆపాదమస్తకం కంపిస్తోంది..
ప్రేమాద్వైతాన్ని ఆలకించగానే..
8820. నువ్వెదజల్లిన ప్రేమే..
నాపై కురిసిన వెన్నెల వాన..
8821. ఋతువేదైతేనెం..
కవిత్వమైతే కురుస్తూనే ఉందిగా నాలోనిలా..
8822. నీరిచ్చవెందుకో నా కళ్ళకు..
నీ ఎదురుచూపుల్లో ఓడినందుకేమో..
8823. మౌనాన్ని ఆరాధిస్తున్నా..
నా మాటల్లో నానార్ధాలు వెతుకుతున్నావనే..
8824. కురిసిన ప్రేమ నిజమేగా..
నా హృదయమిక్కడ చెమరించిందంటే..
8825. నా కలలెప్పటికీ కల్లలు కావుగా..
కన్నుల్లో తన రూపం వెలుగుతున్నంతవరకూ..
8826. వలపు సరిగమలు..
భావాల మేళవింపులో..
8827. గుండెతడి మెరుస్తోందిలా..
స్మృతుల వెల్లువైనందుకేమో..
8828. నువ్వుదయిస్తే బాగుండనుంది..
నా నుదుట సింధూరమై ఏ ఒక్క జన్మలోనైనా..
8829. నాలాగే ఒంటరిదనుకుంటా..
ఏదో కాంక్షిస్తూ సముద్రం ఎగిసిపాటు..
8830. మౌనం మింగిన మాటలు కొన్ని..
నా ఆలోచన విస్తరించింది మరి..
8831. తలపునెప్పుడో నీపరం చేసా..
వలపై నిన్ను గెలవాలనుకున్నాక..
8832. కదిలే కాలంతో నేను పోటీపడుతున్నా..
నీ జ్ఞాపకాలు చెరిగేలోపు మన్నవ్వాలని..
8833. బయటపడుతుందనుకోలా మనసు..
కాస్త దూరానికిలా రోదించి నీరవుతుందని..
8834. నా నవ్వులేమో అవి..
వెన్నెలొచ్చి నిన్ను తడిపిందన్నావంటే..
8835. భావాన్నలా మోస్తున్నా..
అక్షరమై దిగనంటుంటే..
8836. భావాన్నలా మోస్తున్నా..
గుండెతడి తెలిసిన నేస్తం దొరకలేదనే..
8837. భావాన్నలా మోస్తున్నా..
కలలో తను కలిసినప్పుడు పంచుకోవాలని..
8838. పరిమళిస్తున్న జ్ఞాపకాలు..
క్షణాల్లో ముసిరిన మేఘాల తాకిడికి..
8839. చూపెందుకో చెదిరింది..
ఏకాంతంగా పరవశిస్తున్న ఎదలోకి తొంగిచూసి..
8840. విషాదమే తూగుతోందెప్పుడూ..
ఆనందం అరచేతిలో ఇసుకలా జారిపోతుంటే..
8841. నాలో రాగానికో అందమొచ్చింది..
నీవో గీతమై కదిలొచ్చావనే..
8842. రేపటికి నేనేగా..
నిన్నంత ద్వేషించి నేడు చేరువైనందుకు..
8843. గమనమలా కుదిరిందిగా..
జంటగా క్షణాలు పంచుకున్నది కాసేపైనా..
8844. ఆనందం సీతాకోకయ్యింది..
ఇన్ని రంగులు హృదిలోంచీ బయటపడగానే..
8845. మోహం చిగురించినప్పుడే అనుకున్నా..
పరవశాల పండక్కి సిద్ధమైపోవాలని..
8846. రేయికోసం ఎదురుచూస్తూ నేను..
కలనైనా నిన్నోసారి చూడొచ్చని..
8847. జీవంలేని నవ్విప్పుడు..
జ్ఞాపకాల హోరుతో మనసు ఏడవలేనంటుంటే...
8848. నాయికని కావాలనుకొని ఓడిపోయా..
అపాత్రమైన నాటకాన్ని ఆడలేకనే..
8849. సువాసనేస్తున్న క్షణాలిప్పుడు..
నిను తలచిన అనుభూతులు ప్రవహించగానే..
8850. మధురస్మృతులకు మాటలొస్తే బాగుండనుకున్నా..
ఆనందాన్ని మరోసారి పంచుకోవచ్చని..
8851. గుండెకెన్ని గాయాలో..
కాలమెంత కదులుతున్నా మానకుండా వేధిస్తూ..
8852. నా మౌనమొక్కటీ చాలుగా..
నీలో రాగాలు మొదలయ్యేందుకు..
8853. చూపులనెలా పసిగడతావో..
అలుకలో నేనుండి అటువైపు చూస్తున్నా..
8854. మాలికలవుతూ నా భావాలు..
అక్షరాలనలా పేర్చుతున్న కొద్దీ..
8855. మనసు మరణించింది..
ఈ ఒంటరితనంలోని వైరాగ్యానికి విసుగొచ్చి..
8856.నీ స్మృతుల వానలో తడుస్తున్నా..
గ్రీష్మించిన మనసుకి కాస్త సాంత్వనివ్వాలని..
8857. మాట మారింది..
పాటగా కూర్చాలని నేను సంకల్పించగానే..
8858. నా పెదవులకెప్పుడు పరిచయమయ్యావో..
నిన్ను తలవగానే విచ్చుతున్నాయిప్పుడు..
8859. ఊసులందుకే వెంటంపుతున్నా..
నీ ఏకాంతానికి తోడుగా పరిమళిస్తాయని..
8860. కలలను వేలివేస్తూ కన్నులు..
కోరుకున్న అనుభూతుల్ని రానివ్వట్లేదని..
8861. నిదురకు స్వాగతమిప్పుడు..
కలలో నా స్వగతాన్ని చిత్రించాలనే..
8862. స్వాతివానగా నేనందుకే..
ముత్యాలహారమై నీ మెడను అలంకరించాలనే..
8863. ఎన్ని మాయలు తెలుసో నీకు..
నా ఆనందానికి వంతలు పాడేవేళ..
8864. నీ జతలో నేనేగా జన్మలెన్నైనా..
నా పెదవుల్లో మంత్రాక్షరిగా నిన్నుంచాక..
8865. నీ జతలో నేనేగా జన్మలెన్నైనా..
నా పెదవుల్లో మంత్రాక్షరిగా నిన్నుంచాక..
8866. మనసిలా ఒలకపోస్తావనుకోలేదు..
నీలో కవినొక్కసారి నేను చూడాలనుకోగానే..
8867. ప్రేమో పదమే అనుకున్నా..
ప్రతినిథిగా నువ్వెదురయ్యే క్షణంవరకూ..
8868. నా నయనాలకో అందమబ్బింది..
నిన్ను తలచిన మైమరపులోనేమో..
8869. ఎంతకని మురుస్తావో నీలో నువ్వే..
క్షణక్షణం నాలో విరహాన్ని పెంచుతూ..
8870. అక్కడంతా పరిమళం..
తన చిరునవ్వులు ప్రణవమైన చోటది..
8871. నా పేరుకో అర్ధం తెలిసింది..
నీ పెదవుల్లో శృతిగా వినబడగానే..
8872. పూసిన పువ్వులు..
కొన్ని నీ పూజకైతే కొన్ని నా సిగలోనికి..
8873. మరుజన్మకి ఎవరికేమవుతామో..
ఈ జన్మకే నువ్వూ నేనూ..
8874. వేదాన్ని చదువుతున్నా నీ రెప్పల్లో..
నాలో నిర్వేదం ఆలోచనై కదిలినప్పుడల్లా..
8875. శిశిరమంటే నాకిప్పుడిష్టమైంది..
మారాకు వేసేందుకు వసంతానికి చోటిస్తుందని..
8876. వలపులన్నీ తమకాలిప్పుడు..
నీలో సంగీతాన్ని నాకు పరిచయించినందుకు..
8877. చంచలత్వం నశించింది..
మన గడచిన క్షణాలపై మనసెళ్ళగానే..
8878. గ్రీష్మమెందుకు చేరువయ్యిందో..
వసంతం కావాలని నీవెంటే నడిచినా..
8879. జ్ఞాపకాల ముగ్గులేసుకుంటూ మది..
కన్నీరు కల్లాపిగా మారినందుకే..
8880. నీ నవ్వులు వేసిన బంధమేనది..
నా మదిలో పూలతీగై అల్లుకున్నది..
8881. నాకు నేను దూరమయ్యానెప్పుడో..
నీ కలలో మెలకువైనప్పుడే..
8882. కలలకు సవ్వడుందనుకోలేదు..
నీ జతలో సంబరాలు చేరువయ్యేదాకా..
8883. కువకువలాపమని బ్రతిమాలుతున్నా..
మదిలో రాగాలకి సమయం సిద్ధమవలేదని..
8884. మధురమైన అవశేషాలు కొన్ని..
జ్ఞాపకాలుగా నాలో నిక్షిప్తమవుతూ..
8885. రాసుకోవాలనుకున్న సన్నివేశమొక్కటి..
కనుపాపల నీడల్లో అపురూపమై దాగింది..
8886. రక్తికట్టే సన్నివేశమేముందని..
ఈతిబాధల్లోనే ఆమె జీవితం కరిగిపోతుంటే.
8887. రేయికెంత తాపత్రయమో..
రసవంతమైన ఒక్క సన్నివేశాన్నైనా ఆలకించాలని..
8888. ఊహించని సన్నివేశమది..
అలుకగా మారిన ఆనందపు క్షణాలలో..
8889. ఊపిరాగిపోతుందిక్కడ..
నీ శ్వాసలో నే లయ తప్పుతుంటే..
8890. మనసెప్పుడో ఒంటరయ్యింది..
ఒక్క కవితైనా నాపై కురవలేదనే..!
8891. విస్తుపోతున్న ఆత్మ..
మరణించేట్టు నటిస్తూ తనకి నిప్పెడుతున్నావని..
8892. దిక్కులు చూస్తూ మనసు..
యవ్వనం రమ్మంటుంటే ఉరకాల్సిందేనంటూ..
8893. చిలిపిదనం చెలిమయ్యింది..
నా నిశ్శబ్దాన్ని అనువదిస్తున్నావని తెలియగానే..
8894. కొత్తగా వలపును చదువుతూ పెదవులు..
నీ కన్నుల్లో కదులుతున్న స్వప్నాలనే..
8895. కురిసిన చినుకునల్లా ఒడిసిపట్టాలనుంది..
కవిత్వమేరూపంలో నన్ను కరుణిస్తుందోనని..
8896. ఎదురుచూస్తున్న ముహూర్తం దగ్గరయ్యింది..
శ్రావణమాసం అలుకను వెలివేసినందుకే..
8897. మూతి తిప్పుకోవాల్సిందే...!
విరబూసిన నీ నవ్వును చూసే ప్రతి పూవ్వు..
8898. కొన్నైతేనేమి పదాలు..
నాలో కవితగా రూపాంతరం చెందాలనుకున్నాయిగా..
8899. కాలానికొదలవలసిందే వ్యధలు కొన్ని..
కుమిలిపోయేకొద్దీ నిర్లిప్తత దగ్గరవుతుంది..
8900. పులకరింతనై రావాలనుకుంటా ప్రతిసారీ..
గిచ్చానని నిందలేస్తుంటే విస్తుపోతున్నా..
తొక్కినా విశ్రమించకెలా నిలబడిందోనని..
8802. వల్లిస్తూనే ఉంటావలా ప్రణయవేదాలు..
వద్దంటున్నా వెంటబడి కవ్విస్తూ..
8803. ఎన్నిసార్లని విశ్వాసాన్ని కోల్పోవాలో..
నమ్మిన ప్రతిసారీ ఉక్కిరిబిక్కిరిస్తుంటే..
8804. కన్నీరూ తీపవుతోందిప్పుడు..
నీ పెదవుల్లో నెలవంక నేనైనందుకు..
8805. గులాబీలతో గుచ్చాలని ఆశలంట..
అబద్దాలాటకి సున్నితత్వం తక్కువయ్యిందని..
8806. కాలమలా కదులుతూనే ఉంది..
కాగితప్పడవలో మునకలనూ ఆస్వాదించుకుంటూ..
8807. ఆశలన్నీ పేకమేడలయ్యుంటాయి..
అంతస్తు పెంచగానే సహజంగానే కూలిపోయుంటాయి..
8808. కొందరి పలుకులంతే..
తేనె పూసిన కత్తి మాదిరి మదిలో దిగుతుంటాయి..
8809. పరిమళమిలా అందింది..
పవనమొచ్చి సుతిమెత్తగా నన్ను తడమగానే..
8810. తెలివి తక్కువతనం బయటపడింది..
తలవంది తెలిసినట్లు విరచించగానే..
8811. నా విషాదాలు గులాబీలు..
నెమరేస్తున్నవి నీ స్మృతులైనందుకు..
8812. దిగులు నీరయినట్లుంది..
ఆమె కన్నుల్లో శోకం ప్రవహిస్తోంది..
8813. ఎందుకో నువ్విలా..
లేనిపోని ఊహల్లో ఊపుతూ నన్నిలా..
8814.కురుస్తూనే ఉంటానలా..
కవిత్వాన్ని చదివేందుకు నీకు మనసైనప్పుడల్లా..
8815. అనుకూలంగానే నేనున్నా..
ఆకాశంలో సగమేంటని నువ్వు ప్రశ్నిస్తున్నా..
8816. ఈడూజోడే వాళ్ళిద్దరూ..
దాంపత్యం అనుకూలించలేదంతే..
8817. నీకు మాత్రమే వినిపించాలనుకున్న నవ్వులు..
నా పెదవొంపున విరబూస్తున్న కెంపులు
8818. కలంగానైనా మారాలనుంది..
ప్రవహిస్తున్న ప్రేమను కాగితంపైనైనా ఒంపుదామని..
8819. ఆపాదమస్తకం కంపిస్తోంది..
ప్రేమాద్వైతాన్ని ఆలకించగానే..
8820. నువ్వెదజల్లిన ప్రేమే..
నాపై కురిసిన వెన్నెల వాన..
8821. ఋతువేదైతేనెం..
కవిత్వమైతే కురుస్తూనే ఉందిగా నాలోనిలా..
8822. నీరిచ్చవెందుకో నా కళ్ళకు..
నీ ఎదురుచూపుల్లో ఓడినందుకేమో..
8823. మౌనాన్ని ఆరాధిస్తున్నా..
నా మాటల్లో నానార్ధాలు వెతుకుతున్నావనే..
8824. కురిసిన ప్రేమ నిజమేగా..
నా హృదయమిక్కడ చెమరించిందంటే..
8825. నా కలలెప్పటికీ కల్లలు కావుగా..
కన్నుల్లో తన రూపం వెలుగుతున్నంతవరకూ..
8826. వలపు సరిగమలు..
భావాల మేళవింపులో..
8827. గుండెతడి మెరుస్తోందిలా..
స్మృతుల వెల్లువైనందుకేమో..
8828. నువ్వుదయిస్తే బాగుండనుంది..
నా నుదుట సింధూరమై ఏ ఒక్క జన్మలోనైనా..
8829. నాలాగే ఒంటరిదనుకుంటా..
ఏదో కాంక్షిస్తూ సముద్రం ఎగిసిపాటు..
8830. మౌనం మింగిన మాటలు కొన్ని..
నా ఆలోచన విస్తరించింది మరి..
8831. తలపునెప్పుడో నీపరం చేసా..
వలపై నిన్ను గెలవాలనుకున్నాక..
8832. కదిలే కాలంతో నేను పోటీపడుతున్నా..
నీ జ్ఞాపకాలు చెరిగేలోపు మన్నవ్వాలని..
8833. బయటపడుతుందనుకోలా మనసు..
కాస్త దూరానికిలా రోదించి నీరవుతుందని..
8834. నా నవ్వులేమో అవి..
వెన్నెలొచ్చి నిన్ను తడిపిందన్నావంటే..
8835. భావాన్నలా మోస్తున్నా..
అక్షరమై దిగనంటుంటే..
8836. భావాన్నలా మోస్తున్నా..
గుండెతడి తెలిసిన నేస్తం దొరకలేదనే..
8837. భావాన్నలా మోస్తున్నా..
కలలో తను కలిసినప్పుడు పంచుకోవాలని..
8838. పరిమళిస్తున్న జ్ఞాపకాలు..
క్షణాల్లో ముసిరిన మేఘాల తాకిడికి..
8839. చూపెందుకో చెదిరింది..
ఏకాంతంగా పరవశిస్తున్న ఎదలోకి తొంగిచూసి..
8840. విషాదమే తూగుతోందెప్పుడూ..
ఆనందం అరచేతిలో ఇసుకలా జారిపోతుంటే..
8841. నాలో రాగానికో అందమొచ్చింది..
నీవో గీతమై కదిలొచ్చావనే..
8842. రేపటికి నేనేగా..
నిన్నంత ద్వేషించి నేడు చేరువైనందుకు..
8843. గమనమలా కుదిరిందిగా..
జంటగా క్షణాలు పంచుకున్నది కాసేపైనా..
8844. ఆనందం సీతాకోకయ్యింది..
ఇన్ని రంగులు హృదిలోంచీ బయటపడగానే..
8845. మోహం చిగురించినప్పుడే అనుకున్నా..
పరవశాల పండక్కి సిద్ధమైపోవాలని..
8846. రేయికోసం ఎదురుచూస్తూ నేను..
కలనైనా నిన్నోసారి చూడొచ్చని..
8847. జీవంలేని నవ్విప్పుడు..
జ్ఞాపకాల హోరుతో మనసు ఏడవలేనంటుంటే...
8848. నాయికని కావాలనుకొని ఓడిపోయా..
అపాత్రమైన నాటకాన్ని ఆడలేకనే..
8849. సువాసనేస్తున్న క్షణాలిప్పుడు..
నిను తలచిన అనుభూతులు ప్రవహించగానే..
8850. మధురస్మృతులకు మాటలొస్తే బాగుండనుకున్నా..
ఆనందాన్ని మరోసారి పంచుకోవచ్చని..
8851. గుండెకెన్ని గాయాలో..
కాలమెంత కదులుతున్నా మానకుండా వేధిస్తూ..
8852. నా మౌనమొక్కటీ చాలుగా..
నీలో రాగాలు మొదలయ్యేందుకు..
8853. చూపులనెలా పసిగడతావో..
అలుకలో నేనుండి అటువైపు చూస్తున్నా..
8854. మాలికలవుతూ నా భావాలు..
అక్షరాలనలా పేర్చుతున్న కొద్దీ..
8855. మనసు మరణించింది..
ఈ ఒంటరితనంలోని వైరాగ్యానికి విసుగొచ్చి..
8856.నీ స్మృతుల వానలో తడుస్తున్నా..
గ్రీష్మించిన మనసుకి కాస్త సాంత్వనివ్వాలని..
8857. మాట మారింది..
పాటగా కూర్చాలని నేను సంకల్పించగానే..
8858. నా పెదవులకెప్పుడు పరిచయమయ్యావో..
నిన్ను తలవగానే విచ్చుతున్నాయిప్పుడు..
8859. ఊసులందుకే వెంటంపుతున్నా..
నీ ఏకాంతానికి తోడుగా పరిమళిస్తాయని..
8860. కలలను వేలివేస్తూ కన్నులు..
కోరుకున్న అనుభూతుల్ని రానివ్వట్లేదని..
8861. నిదురకు స్వాగతమిప్పుడు..
కలలో నా స్వగతాన్ని చిత్రించాలనే..
8862. స్వాతివానగా నేనందుకే..
ముత్యాలహారమై నీ మెడను అలంకరించాలనే..
8863. ఎన్ని మాయలు తెలుసో నీకు..
నా ఆనందానికి వంతలు పాడేవేళ..
8864. నీ జతలో నేనేగా జన్మలెన్నైనా..
నా పెదవుల్లో మంత్రాక్షరిగా నిన్నుంచాక..
8865. నీ జతలో నేనేగా జన్మలెన్నైనా..
నా పెదవుల్లో మంత్రాక్షరిగా నిన్నుంచాక..
8866. మనసిలా ఒలకపోస్తావనుకోలేదు..
నీలో కవినొక్కసారి నేను చూడాలనుకోగానే..
8867. ప్రేమో పదమే అనుకున్నా..
ప్రతినిథిగా నువ్వెదురయ్యే క్షణంవరకూ..
8868. నా నయనాలకో అందమబ్బింది..
నిన్ను తలచిన మైమరపులోనేమో..
8869. ఎంతకని మురుస్తావో నీలో నువ్వే..
క్షణక్షణం నాలో విరహాన్ని పెంచుతూ..
8870. అక్కడంతా పరిమళం..
తన చిరునవ్వులు ప్రణవమైన చోటది..
8871. నా పేరుకో అర్ధం తెలిసింది..
నీ పెదవుల్లో శృతిగా వినబడగానే..
8872. పూసిన పువ్వులు..
కొన్ని నీ పూజకైతే కొన్ని నా సిగలోనికి..
8873. మరుజన్మకి ఎవరికేమవుతామో..
ఈ జన్మకే నువ్వూ నేనూ..
8874. వేదాన్ని చదువుతున్నా నీ రెప్పల్లో..
నాలో నిర్వేదం ఆలోచనై కదిలినప్పుడల్లా..
8875. శిశిరమంటే నాకిప్పుడిష్టమైంది..
మారాకు వేసేందుకు వసంతానికి చోటిస్తుందని..
8876. వలపులన్నీ తమకాలిప్పుడు..
నీలో సంగీతాన్ని నాకు పరిచయించినందుకు..
8877. చంచలత్వం నశించింది..
మన గడచిన క్షణాలపై మనసెళ్ళగానే..
8878. గ్రీష్మమెందుకు చేరువయ్యిందో..
వసంతం కావాలని నీవెంటే నడిచినా..
8879. జ్ఞాపకాల ముగ్గులేసుకుంటూ మది..
కన్నీరు కల్లాపిగా మారినందుకే..
8880. నీ నవ్వులు వేసిన బంధమేనది..
నా మదిలో పూలతీగై అల్లుకున్నది..
8881. నాకు నేను దూరమయ్యానెప్పుడో..
నీ కలలో మెలకువైనప్పుడే..
8882. కలలకు సవ్వడుందనుకోలేదు..
నీ జతలో సంబరాలు చేరువయ్యేదాకా..
8883. కువకువలాపమని బ్రతిమాలుతున్నా..
మదిలో రాగాలకి సమయం సిద్ధమవలేదని..
8884. మధురమైన అవశేషాలు కొన్ని..
జ్ఞాపకాలుగా నాలో నిక్షిప్తమవుతూ..
8885. రాసుకోవాలనుకున్న సన్నివేశమొక్కటి..
కనుపాపల నీడల్లో అపురూపమై దాగింది..
8886. రక్తికట్టే సన్నివేశమేముందని..
ఈతిబాధల్లోనే ఆమె జీవితం కరిగిపోతుంటే.
8887. రేయికెంత తాపత్రయమో..
రసవంతమైన ఒక్క సన్నివేశాన్నైనా ఆలకించాలని..
8888. ఊహించని సన్నివేశమది..
అలుకగా మారిన ఆనందపు క్షణాలలో..
8889. ఊపిరాగిపోతుందిక్కడ..
నీ శ్వాసలో నే లయ తప్పుతుంటే..
8890. మనసెప్పుడో ఒంటరయ్యింది..
ఒక్క కవితైనా నాపై కురవలేదనే..!
8891. విస్తుపోతున్న ఆత్మ..
మరణించేట్టు నటిస్తూ తనకి నిప్పెడుతున్నావని..
8892. దిక్కులు చూస్తూ మనసు..
యవ్వనం రమ్మంటుంటే ఉరకాల్సిందేనంటూ..
8893. చిలిపిదనం చెలిమయ్యింది..
నా నిశ్శబ్దాన్ని అనువదిస్తున్నావని తెలియగానే..
8894. కొత్తగా వలపును చదువుతూ పెదవులు..
నీ కన్నుల్లో కదులుతున్న స్వప్నాలనే..
8895. కురిసిన చినుకునల్లా ఒడిసిపట్టాలనుంది..
కవిత్వమేరూపంలో నన్ను కరుణిస్తుందోనని..
8896. ఎదురుచూస్తున్న ముహూర్తం దగ్గరయ్యింది..
శ్రావణమాసం అలుకను వెలివేసినందుకే..
8897. మూతి తిప్పుకోవాల్సిందే...!
విరబూసిన నీ నవ్వును చూసే ప్రతి పూవ్వు..
8898. కొన్నైతేనేమి పదాలు..
నాలో కవితగా రూపాంతరం చెందాలనుకున్నాయిగా..
8899. కాలానికొదలవలసిందే వ్యధలు కొన్ని..
కుమిలిపోయేకొద్దీ నిర్లిప్తత దగ్గరవుతుంది..
8900. పులకరింతనై రావాలనుకుంటా ప్రతిసారీ..
గిచ్చానని నిందలేస్తుంటే విస్తుపోతున్నా..
No comments:
Post a Comment