7701. జాబిలిగానే వెలగాలనుకుంటున్నా..
నా వలపు నిన్ను ఊహలూపేదాకా..
7702. అభిమానమెక్కువే అక్షరాలకు..
అతిశయాన్ని గుప్పించి పొగడాలనే క్రమంలో..
7703. ఆధిపత్యమిచ్చింది నువ్వేగా..
తొలి వలపుకి సారధిగా నన్నుండమంటూ..
7704. నీ మంత్రలిపికి పడిపోయా..
చూపుతో మాట్లాడగలవని తెలిసాక..
7705. మనసప్పుడే అదుపుతప్పింది..
నా నిరీక్షణ ఫలించదని సంకేతమవ్వగానే..
7706. తన పలకరింపు కరువైనప్పుడే అనుకున్నా..
ఈ రోజంతా ఉదాశీనంగా గడవబోతోందని..
7707. కలల నెత్తావు మొదలయ్యింది..
ఏకాంతపు రేయిపై మనసుపడగానే..
7708. చూపులతో పిలిచావనుకున్నా..
చేయి చాచకుండానే మనసొచ్చి వాలిపోతుంటే
7709. అద్దంలో నేను..
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అరుదైన మెరికలా..
7710. వసంతం శాశ్వతం కాదని తెలుస్తోంది..
శరద్వలువలు వీడిన జీవాత్మను చూస్తుంటే..
7711. అతిశయంలో నువ్వు..
అక్షరాలు ఈర్ష్యపడేలా మాలికను రాస్తానంటూ..
7712. మనసంతా సందడొచ్చింది..
నిశ్శబ్దం జారుకొని కవిత్వానికి చోటివ్వగానే..
7713. పెదవులకి ప్రాసొచ్చని తెలీనేలేదు..
అణువణువూ ఆగకుండా లిఖించేవరకూ..
7714. మనసు మోడయ్యింది..
ఎన్ని జన్మలెత్తినా నువ్వు కానరాక..
7715. పున్నమినై నేనెదురు చూస్తున్నా..
చకోరమై వస్తుంది నువ్వోకాదోనని..
7716. చూపులకెందుకు పట్టుబడ్డావో..
కనుసైగనూ నేనర్ధం చేసుకోగలనని తెలిసీ..
7717. చురుక్కుమన్నప్పుడు గమనించా..
చూపులతో నన్ను గిచ్చింది నువ్వేనని..
7718. నీ వేకువ పిలుపులు మంజీరనాదాలు..
నా రాతిరి దిగుళ్ళు విషసర్పాలు..
7719. నీరవానికి పల్లవి నేనయ్యా..
ఆశించిన చరణాలెన్నటికీ కలవలేవని..
7720. మనసురంగులో నువ్వు..
నా ఊహల్లో ఇంద్రధనస్సువై వెలుగుతూ..
7721. అదే నవ్వు..
నిన్నల్లో నా మనసు వెంపర్లాడిన నీ అధరాల్లో..
7722. వెన్నెలదీ నా పోలికే..
వస్తూనే పరవశాలు కురిపిస్తుందంటే..
7723. వేరే పోలికెందుకు..
కావ్యసృష్టిలో నువ్వో కాళిదాసుని మించిపోతుంటే..
7724. సాలోచనలో నా మది..
ఏ పోలికలోనూ నిన్నుంచలేక..
7725. కన్నుల్లో హేమంతాలెన్నడూ చూడలేదు..
ఘనీభవించిన కలలెన్ని దాచుకున్నావో..
7726. పువ్వుల పరిమళం చుట్టుముట్టినట్లుంది..
మనోవనంలో నువ్వెప్పుడు నాటుకున్నావో..
7727. శిశిరమంటిన నవ్వులవి..
పండకనే విచలించే పువ్వులుగా రాలిపోతూ..
7728. నా ప్రతి గెలుపులో నువ్వే..
నీ అడుగులతో నన్ను నడిపిస్తూ..
7729. నిశ్శబ్దానికో గంధముందని తెలిసింది..
నాలోని మౌనం పరిమళించగానే..
7730. ఎందుకో జాలినవ్వులు..
నట్టింట్లో ఆడపిల్ల మెత్తగా అడుగులేస్తుంటే..
7731. మనసుకధ మొదలయ్యిందిలా..
మనలోని మౌనాలు మోహాలు లిఖిస్తుండగా..
7732. అక్షరలక్షల్లో నేను..
నీ తాదాత్మ్యపు రాతల్లో భావమవుతూ..
7733. నీలో నేనున్న క్షణాలనడుగు..
మనసెందుకు పదేపదే నవ్వుకుంటుందో
7734. ఒణికిన ప్రశంసకే తెలియాలేమో..
పెదవులు దాచుకున్న పదరహస్యాలు..
7735. అనుభూతులు అడవిపాలే..
అనురాగంలో విషాదాన్ని మాత్రమే ఆలకించేవారికి..
7736. ప్రేమొక ఆనందానికి పుట్టిన పర్యవసానం..
నీ భావాలన్నిటా సాక్షాత్కరిస్తుంది నేనయ్యాక..
7737. అయిదో అడుగేసి ఆగినప్పుడే అనుకున్నా..
తప్పటడుగు వేసే పాదాలే తనవని..
7738. పులకరింతనై రాలేనా..
నీరవంలో రాగాకృతిగా నన్ను పాడుకుంటానంటే..
7739. కవ్విస్తోంది కాలం..
కరిగిపోతున్న యవ్వనాన్ని సవాలుగా మార్చేస్తూ..
7740. కవ్విస్తోంది కాలం..
ప్రేమంటే విరహమేనని ప్రశాంతంగా కదిలిపోతూ..
7741. అక్షరాలు తప్ప ఏం మిగిలాయని..
నాలోని భావాలన్నీ నిన్ను దాటిపోయాక..
7742. అడుగుకెంత తడబాటో..
మనసిచ్చిన వేలుపట్టుకు అపురూపంగా నడవడం..
7743. కన్నుల్లో నీరే కదాని అనుకున్నా..
ఘనీభవించిన హిమమై చూపుకడ్డవుతాయని తెలీక..
7744. కలవరిస్తున్నా నిన్నే..
కలలోనూ వీడక నన్నే వరించావని..
7745. కొన్ని గాయాలంతే..
ప్రశాంతతను దూరం చేయు అవేదనలు..
7746. మౌనరాగంలో ఆరోహణలు..
నీ విరహంలోని నా సుస్వరాలు..
7747. నీరవం..
నీ మౌనానికి నేనిచ్చే సమాధానం..
7748. నువ్వు దూరమైనప్పుడే మరణించా..
వేరే జీవితమేముందిలే సరికొత్తగా..
7749. ఆర్తి అందలేదు ఇంతవరకూ..
అణువణువూ దాచుకున్నానని నేననుకున్నా..
7750. అక్షరాల తొక్కిసలాటయ్యింది..
సమయం చాలని భావాలను గుప్పిస్తుంటే..
7751. స్మృతుల నెమరింతలో నేనున్నా..
నీలో శూన్యాన్ని భరించలేక..
7752. పులకింతల మేనాలో నేనున్నా..
పారవశ్యపు లాహిరిలో నువ్వూపుతుంటే..
7753. ఎన్ని జ్ఞాపకాలు తిష్టవేసాయో మదిలో..
నా వర్తమానాన్ని ముందుకు కదలనివ్వనంటూ..
7754. మనిద్దరి నడుమ ప్రేమ..
నా ప్రాణం.. నీ ప్రణవం.. రెండూ కలగలిసినట్లు..
7755. మాటలురాని చిలుకనైనా బాగుండేది..
మనసు పగిలినా మౌనవించేందుకు..
7756. కోయిలై వినిపిస్తే వసంతమనుకున్నా..
నీ చిరునవ్వుల మంత్రపుష్పం నాకై చదివావని గుర్తించక..
7757. జ్ఞాపకాలతోనే తడిచిపోతున్నా..
ఆరారు కాలాలూ నువ్వే గుర్తొస్తుంటే..
7758. ఆమనై సాగిపోవాలనుంది..
నీ రహస్య కువకువలను దాచుకుంటూ..
7759. మనసెప్పుడో చిట్లింది..
నిశ్శబ్దపు సవ్వడిలో తానూ కలిసిపోతూ..
7760. మహాప్రస్థానానికి సిద్ధమైపోనా..
తన మదిలో లేనన్న మరుక్షణమే..!
7761. హృదయం స్పందిస్తుంటే ఏమోననుకున్నా..
నీ ఊహను దిద్దుకుంటుందనుకోలా..
7762. హృదయానికి గాయాలెందుకో..
నువ్వు చేస్తున్న యుద్ధం కన్నులతోనైతే..
7763. అనుభూతులన్నీ మనవేగా..
రేయంతా కరిగి తాదాత్మ్యమొక్కటీ మిగిలాక..
7764. కాసింత చిరునవ్వు చాలనుకున్నా..
విషాదానికి చేరువకాలేని నిశ్శబ్దంలో..
7765. తొలిప్రేమ గెలిచింది..
మనువైన మాఘమాసంలో..
7766. వేదాలెన్నడో మరచిపోయా..
నువ్వు దూరమై నిర్వేదనొచ్చి చేరినప్పుడే..
7767. ప్రేమ పరిచయం జరిగిపోయింది..
ఒక్కరై నడిచేదే మిగిలింది..
7768. ప్రేమనే నీ ఆరాటం తెలిసింది..
నన్నో శీతలపవనంలా అప్పుడప్పుడూ తడుముతుంటే
7769. విషాదం విహారానికెళ్ళింది..
నీ జ్ఞాపకాన్ని వ్యాపకంగా మార్చుకోగానే..
7770. రేపటికోసమే ఎదురుచూస్తున్నా..
వెన్నెలంటి నీ మాటలు వినకపోతానాని..
7771. మాలికగా నేనుండిపోతే చాలనుకున్నా
నీ అక్షరాలమాటు జాబిల్లిగా..
7772. నేనే వెన్నెలనైపోనా..
నువ్వు కురవాలని ఆశించే ప్రతిక్షణం..
7773. నిదురించిన క్షణాలను లేపుతున్నా..
వెన్నెల వలసపోయేలోపు అంబరమంటాలని..
7774. నువ్వో విపంచివి..
లిపిలేని ఆనందాలను లిఖించే సమయంలో..
7775. హేమంతం కురిసిన సవ్వడనుకుంటా..
నాలో సరికొత్తరాగాల ఆవిర్భావన..
7776. చీకటికి మాటలు రావనుకున్నా..
మనసు వియోగానికి బానిసయ్యిందని..
7777. నేడు రేపవుతుంటే ఉత్సాహం..
సంకల్పానికి చేరువగా అడుగేస్తుంటే..
7778. హృదయవీణ మోహనరాగం మొదలెట్టింది..
అనుపమానమైన నిన్ను మోహించగానే..
7779. కన్నుల్లో చేరి ప్రవహించనా..
పున్నమివెన్నెలకై నీ ఎదురుచూపులంటే..
7780. నిరాశకు సమాధి జరిగిందక్కడ..
ఆశలు వెల్లువవుతుంటే నలువైపులా..
7781. మనసుపడ్డప్పుడే కుదురు కోల్పోయా..
నిన్ననుసరించి మిగులుతున్న వియోగంలో..
7782. మైకమేమందించావో నువ్వు..
కన్నుల్లోంచి మనసులోకి జారిపోతూ నేను..
7783. కన్నుల్లో రహస్యంలా ఇమడలేని నేను..
మనసుదాకా రానిచ్చి పొరపాటు చేసినందుకు..
7784. నిశ్శబ్దానికి అలవాటు పడిపోయారిద్దరూ..
ఎవరి ప్రపంచం వారిదయ్యాక..
7785. మనసెన్నిసార్లు ఆరబెట్టుకోవాలో..
ప్రేమలో తడిచి రోదించే ప్రతిసారీ..
7786. కన్నుల్లో మెరుపులు..
మదిలో నువ్వు మెదులుతున్న ఆనవాళ్ళు..
7787. కొన్ని రాగాలంతే..
మౌనంగానే మదిలో అనుభూతులు గుప్పిస్తూ..
7788. మౌనాన్నే హత్తుకుంటున్నా..
నా మాటలన్నీ నీకు చేర్చలేక..
7789. ఊసులసవ్వడికి స్పందించా..
ఏవో గుసగుసలు మదిని మీటినట్లయ్యి..
7790. మరణంతో ముగిసిపోలేను నేను..
అంబరమంత అనురాగంతో నువ్వుండగా..
7791. జీవితం నాటకమే..
ఏడుపుతో మొదలై..ఏడిపిస్తూ ముగిసిపోతూ..
7792. ఏకాంతమెంత బాగుందో..
నీ జ్ఞాపకాల విహారినై ఊరేగుతుంటే..
7793. మనసెందుకు తీపెక్కుతుందో..
నీ పెదవి నా పేరుని ఒక్కసారి పిలవగానే..
7794. పులకలు పుట్టడం కొత్త కాదుగా..
నా మది మాధుర్యమంతా నీవయ్యాక..
7795. అందాన్ని నిలువరించానందుకే..
నీ పరిధి దాటి వర్ణించలేక నువ్వు కుమిలిపోతావని..
7796. వయసిప్పుడు నవ్వుకుంది..
నీ మనసును కదిలించిన తన సౌందర్యానికి గర్వపడి..
7797. చూపులజల్లుకే ఒణికిపోతావు..
వలపు జడివానై కురిస్తే ఏమైపోతావో..
7798. చందురునికి చెల్లెల్ని..
సౌందర్యాన్ని ఆరాధించేవారికి వశమయ్యే మెరుపుని..
7799. శిశిరం శాశ్వతమవుతుందనుకోలా..
జ్ఞాపకాల సుడిగుండంలోకే మనసు జారిపోతూంటే..
7800. మరణమంటే మక్కువేలే..
మరొక జన్మను కొత్తగా తొడుక్కోవచ్చని..
నా వలపు నిన్ను ఊహలూపేదాకా..
7702. అభిమానమెక్కువే అక్షరాలకు..
అతిశయాన్ని గుప్పించి పొగడాలనే క్రమంలో..
7703. ఆధిపత్యమిచ్చింది నువ్వేగా..
తొలి వలపుకి సారధిగా నన్నుండమంటూ..
7704. నీ మంత్రలిపికి పడిపోయా..
చూపుతో మాట్లాడగలవని తెలిసాక..
7705. మనసప్పుడే అదుపుతప్పింది..
నా నిరీక్షణ ఫలించదని సంకేతమవ్వగానే..
7706. తన పలకరింపు కరువైనప్పుడే అనుకున్నా..
ఈ రోజంతా ఉదాశీనంగా గడవబోతోందని..
7707. కలల నెత్తావు మొదలయ్యింది..
ఏకాంతపు రేయిపై మనసుపడగానే..
7708. చూపులతో పిలిచావనుకున్నా..
చేయి చాచకుండానే మనసొచ్చి వాలిపోతుంటే
7709. అద్దంలో నేను..
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అరుదైన మెరికలా..
7710. వసంతం శాశ్వతం కాదని తెలుస్తోంది..
శరద్వలువలు వీడిన జీవాత్మను చూస్తుంటే..
7711. అతిశయంలో నువ్వు..
అక్షరాలు ఈర్ష్యపడేలా మాలికను రాస్తానంటూ..
7712. మనసంతా సందడొచ్చింది..
నిశ్శబ్దం జారుకొని కవిత్వానికి చోటివ్వగానే..
7713. పెదవులకి ప్రాసొచ్చని తెలీనేలేదు..
అణువణువూ ఆగకుండా లిఖించేవరకూ..
7714. మనసు మోడయ్యింది..
ఎన్ని జన్మలెత్తినా నువ్వు కానరాక..
7715. పున్నమినై నేనెదురు చూస్తున్నా..
చకోరమై వస్తుంది నువ్వోకాదోనని..
7716. చూపులకెందుకు పట్టుబడ్డావో..
కనుసైగనూ నేనర్ధం చేసుకోగలనని తెలిసీ..
7717. చురుక్కుమన్నప్పుడు గమనించా..
చూపులతో నన్ను గిచ్చింది నువ్వేనని..
7718. నీ వేకువ పిలుపులు మంజీరనాదాలు..
నా రాతిరి దిగుళ్ళు విషసర్పాలు..
7719. నీరవానికి పల్లవి నేనయ్యా..
ఆశించిన చరణాలెన్నటికీ కలవలేవని..
7720. మనసురంగులో నువ్వు..
నా ఊహల్లో ఇంద్రధనస్సువై వెలుగుతూ..
7721. అదే నవ్వు..
నిన్నల్లో నా మనసు వెంపర్లాడిన నీ అధరాల్లో..
7722. వెన్నెలదీ నా పోలికే..
వస్తూనే పరవశాలు కురిపిస్తుందంటే..
7723. వేరే పోలికెందుకు..
కావ్యసృష్టిలో నువ్వో కాళిదాసుని మించిపోతుంటే..
7724. సాలోచనలో నా మది..
ఏ పోలికలోనూ నిన్నుంచలేక..
7725. కన్నుల్లో హేమంతాలెన్నడూ చూడలేదు..
ఘనీభవించిన కలలెన్ని దాచుకున్నావో..
7726. పువ్వుల పరిమళం చుట్టుముట్టినట్లుంది..
మనోవనంలో నువ్వెప్పుడు నాటుకున్నావో..
7727. శిశిరమంటిన నవ్వులవి..
పండకనే విచలించే పువ్వులుగా రాలిపోతూ..
7728. నా ప్రతి గెలుపులో నువ్వే..
నీ అడుగులతో నన్ను నడిపిస్తూ..
7729. నిశ్శబ్దానికో గంధముందని తెలిసింది..
నాలోని మౌనం పరిమళించగానే..
7730. ఎందుకో జాలినవ్వులు..
నట్టింట్లో ఆడపిల్ల మెత్తగా అడుగులేస్తుంటే..
7731. మనసుకధ మొదలయ్యిందిలా..
మనలోని మౌనాలు మోహాలు లిఖిస్తుండగా..
7732. అక్షరలక్షల్లో నేను..
నీ తాదాత్మ్యపు రాతల్లో భావమవుతూ..
7733. నీలో నేనున్న క్షణాలనడుగు..
మనసెందుకు పదేపదే నవ్వుకుంటుందో
7734. ఒణికిన ప్రశంసకే తెలియాలేమో..
పెదవులు దాచుకున్న పదరహస్యాలు..
7735. అనుభూతులు అడవిపాలే..
అనురాగంలో విషాదాన్ని మాత్రమే ఆలకించేవారికి..
7736. ప్రేమొక ఆనందానికి పుట్టిన పర్యవసానం..
నీ భావాలన్నిటా సాక్షాత్కరిస్తుంది నేనయ్యాక..
7737. అయిదో అడుగేసి ఆగినప్పుడే అనుకున్నా..
తప్పటడుగు వేసే పాదాలే తనవని..
7738. పులకరింతనై రాలేనా..
నీరవంలో రాగాకృతిగా నన్ను పాడుకుంటానంటే..
7739. కవ్విస్తోంది కాలం..
కరిగిపోతున్న యవ్వనాన్ని సవాలుగా మార్చేస్తూ..
7740. కవ్విస్తోంది కాలం..
ప్రేమంటే విరహమేనని ప్రశాంతంగా కదిలిపోతూ..
7741. అక్షరాలు తప్ప ఏం మిగిలాయని..
నాలోని భావాలన్నీ నిన్ను దాటిపోయాక..
7742. అడుగుకెంత తడబాటో..
మనసిచ్చిన వేలుపట్టుకు అపురూపంగా నడవడం..
7743. కన్నుల్లో నీరే కదాని అనుకున్నా..
ఘనీభవించిన హిమమై చూపుకడ్డవుతాయని తెలీక..
7744. కలవరిస్తున్నా నిన్నే..
కలలోనూ వీడక నన్నే వరించావని..
7745. కొన్ని గాయాలంతే..
ప్రశాంతతను దూరం చేయు అవేదనలు..
7746. మౌనరాగంలో ఆరోహణలు..
నీ విరహంలోని నా సుస్వరాలు..
7747. నీరవం..
నీ మౌనానికి నేనిచ్చే సమాధానం..
7748. నువ్వు దూరమైనప్పుడే మరణించా..
వేరే జీవితమేముందిలే సరికొత్తగా..
7749. ఆర్తి అందలేదు ఇంతవరకూ..
అణువణువూ దాచుకున్నానని నేననుకున్నా..
7750. అక్షరాల తొక్కిసలాటయ్యింది..
సమయం చాలని భావాలను గుప్పిస్తుంటే..
7751. స్మృతుల నెమరింతలో నేనున్నా..
నీలో శూన్యాన్ని భరించలేక..
7752. పులకింతల మేనాలో నేనున్నా..
పారవశ్యపు లాహిరిలో నువ్వూపుతుంటే..
7753. ఎన్ని జ్ఞాపకాలు తిష్టవేసాయో మదిలో..
నా వర్తమానాన్ని ముందుకు కదలనివ్వనంటూ..
7754. మనిద్దరి నడుమ ప్రేమ..
నా ప్రాణం.. నీ ప్రణవం.. రెండూ కలగలిసినట్లు..
7755. మాటలురాని చిలుకనైనా బాగుండేది..
మనసు పగిలినా మౌనవించేందుకు..
7756. కోయిలై వినిపిస్తే వసంతమనుకున్నా..
నీ చిరునవ్వుల మంత్రపుష్పం నాకై చదివావని గుర్తించక..
7757. జ్ఞాపకాలతోనే తడిచిపోతున్నా..
ఆరారు కాలాలూ నువ్వే గుర్తొస్తుంటే..
7758. ఆమనై సాగిపోవాలనుంది..
నీ రహస్య కువకువలను దాచుకుంటూ..
7759. మనసెప్పుడో చిట్లింది..
నిశ్శబ్దపు సవ్వడిలో తానూ కలిసిపోతూ..
7760. మహాప్రస్థానానికి సిద్ధమైపోనా..
తన మదిలో లేనన్న మరుక్షణమే..!
7761. హృదయం స్పందిస్తుంటే ఏమోననుకున్నా..
నీ ఊహను దిద్దుకుంటుందనుకోలా..
7762. హృదయానికి గాయాలెందుకో..
నువ్వు చేస్తున్న యుద్ధం కన్నులతోనైతే..
7763. అనుభూతులన్నీ మనవేగా..
రేయంతా కరిగి తాదాత్మ్యమొక్కటీ మిగిలాక..
7764. కాసింత చిరునవ్వు చాలనుకున్నా..
విషాదానికి చేరువకాలేని నిశ్శబ్దంలో..
7765. తొలిప్రేమ గెలిచింది..
మనువైన మాఘమాసంలో..
7766. వేదాలెన్నడో మరచిపోయా..
నువ్వు దూరమై నిర్వేదనొచ్చి చేరినప్పుడే..
7767. ప్రేమ పరిచయం జరిగిపోయింది..
ఒక్కరై నడిచేదే మిగిలింది..
7768. ప్రేమనే నీ ఆరాటం తెలిసింది..
నన్నో శీతలపవనంలా అప్పుడప్పుడూ తడుముతుంటే
7769. విషాదం విహారానికెళ్ళింది..
నీ జ్ఞాపకాన్ని వ్యాపకంగా మార్చుకోగానే..
7770. రేపటికోసమే ఎదురుచూస్తున్నా..
వెన్నెలంటి నీ మాటలు వినకపోతానాని..
7771. మాలికగా నేనుండిపోతే చాలనుకున్నా
నీ అక్షరాలమాటు జాబిల్లిగా..
7772. నేనే వెన్నెలనైపోనా..
నువ్వు కురవాలని ఆశించే ప్రతిక్షణం..
7773. నిదురించిన క్షణాలను లేపుతున్నా..
వెన్నెల వలసపోయేలోపు అంబరమంటాలని..
7774. నువ్వో విపంచివి..
లిపిలేని ఆనందాలను లిఖించే సమయంలో..
7775. హేమంతం కురిసిన సవ్వడనుకుంటా..
నాలో సరికొత్తరాగాల ఆవిర్భావన..
7776. చీకటికి మాటలు రావనుకున్నా..
మనసు వియోగానికి బానిసయ్యిందని..
7777. నేడు రేపవుతుంటే ఉత్సాహం..
సంకల్పానికి చేరువగా అడుగేస్తుంటే..
7778. హృదయవీణ మోహనరాగం మొదలెట్టింది..
అనుపమానమైన నిన్ను మోహించగానే..
7779. కన్నుల్లో చేరి ప్రవహించనా..
పున్నమివెన్నెలకై నీ ఎదురుచూపులంటే..
7780. నిరాశకు సమాధి జరిగిందక్కడ..
ఆశలు వెల్లువవుతుంటే నలువైపులా..
7781. మనసుపడ్డప్పుడే కుదురు కోల్పోయా..
నిన్ననుసరించి మిగులుతున్న వియోగంలో..
7782. మైకమేమందించావో నువ్వు..
కన్నుల్లోంచి మనసులోకి జారిపోతూ నేను..
7783. కన్నుల్లో రహస్యంలా ఇమడలేని నేను..
మనసుదాకా రానిచ్చి పొరపాటు చేసినందుకు..
7784. నిశ్శబ్దానికి అలవాటు పడిపోయారిద్దరూ..
ఎవరి ప్రపంచం వారిదయ్యాక..
7785. మనసెన్నిసార్లు ఆరబెట్టుకోవాలో..
ప్రేమలో తడిచి రోదించే ప్రతిసారీ..
7786. కన్నుల్లో మెరుపులు..
మదిలో నువ్వు మెదులుతున్న ఆనవాళ్ళు..
7787. కొన్ని రాగాలంతే..
మౌనంగానే మదిలో అనుభూతులు గుప్పిస్తూ..
7788. మౌనాన్నే హత్తుకుంటున్నా..
నా మాటలన్నీ నీకు చేర్చలేక..
7789. ఊసులసవ్వడికి స్పందించా..
ఏవో గుసగుసలు మదిని మీటినట్లయ్యి..
7790. మరణంతో ముగిసిపోలేను నేను..
అంబరమంత అనురాగంతో నువ్వుండగా..
7791. జీవితం నాటకమే..
ఏడుపుతో మొదలై..ఏడిపిస్తూ ముగిసిపోతూ..
7792. ఏకాంతమెంత బాగుందో..
నీ జ్ఞాపకాల విహారినై ఊరేగుతుంటే..
7793. మనసెందుకు తీపెక్కుతుందో..
నీ పెదవి నా పేరుని ఒక్కసారి పిలవగానే..
7794. పులకలు పుట్టడం కొత్త కాదుగా..
నా మది మాధుర్యమంతా నీవయ్యాక..
7795. అందాన్ని నిలువరించానందుకే..
నీ పరిధి దాటి వర్ణించలేక నువ్వు కుమిలిపోతావని..
7796. వయసిప్పుడు నవ్వుకుంది..
నీ మనసును కదిలించిన తన సౌందర్యానికి గర్వపడి..
7797. చూపులజల్లుకే ఒణికిపోతావు..
వలపు జడివానై కురిస్తే ఏమైపోతావో..
7798. చందురునికి చెల్లెల్ని..
సౌందర్యాన్ని ఆరాధించేవారికి వశమయ్యే మెరుపుని..
7799. శిశిరం శాశ్వతమవుతుందనుకోలా..
జ్ఞాపకాల సుడిగుండంలోకే మనసు జారిపోతూంటే..
7800. మరణమంటే మక్కువేలే..
మరొక జన్మను కొత్తగా తొడుక్కోవచ్చని..
No comments:
Post a Comment