7801. కొన్ని జ్ఞాపకాలంటే..
కన్నీటితో కడిగేసినా మరోరకంగా హత్తుకుంటాయ్..
7802. చలికాలం చెమరింతలే..
అవ్యక్త రాగాల తమకపు సరిగమలు..
7803. కలలు వలసపోయినప్పుడనుకున్నా..
నిదురపట్టని రాత్రులింక నాకు ముందున్నాయని..
7804. కలల రాగానికే మైమరచిపోతున్నా..
కాలమాగి కదిలినట్లు అనిపించగానే..
7805. అంబరమై ఎగిసింది చెలిమి..
హరివిల్లుని సవాలు చేద్దామని..
7806.మొలకెత్తించేసా ఆశలన్నీ..
శిశిరాన్ని సాగనంపి కలలు నేరవేర్చుకుందామని..
7807. ప్రేమొక సుదూర స్వప్నమేగా..
కలతలతో రోజులు కరిగిపోతుంటే..
7808. కల్పనలోనే జీవితం..
ఒంటరితనాన్ని పూరించుకొనే నా ప్రయత్నంలో..
7809. మౌనాన్నెందుకు రెచ్చగొడుతున్నావో మరి..
నువ్వు నచ్చడంతో ముడిపెట్టి..
7810. నటించక తప్పని జీవితం..
జీవించేందుకు అవకాశమే కరువవుతుంటే..
7811. మనసు బరువుగానే ఉంచుకున్నాను..
కన్నీటితో జార్చెస్తే తేలికవుతుందని..
7812. పూలకలలెన్ని కోల్పోయానో..
నీ వియోగంతో రానన్న నిద్దురలో..
7813. కదలికలన్నీ కవితలుగా రాసేసుకున్నా..
కల్పనతో మనసు బరువెక్కుతుందని..
7814. నా కల్పనలో నువ్విలా..
నీ చేతుల్లోని నేనులా..
7815. హేమంతానికి చిక్కిన గులాబీ..
ఘనీభవించినా సౌందర్యాన్ని కోల్పోనంటూ..
7816. నా శ్వాసకు సంగీతమందించింది నువ్వే..
నీ ఊహల్లో లీనమవుతూ నేనుంటే..
7817. నీ కల్పనగానే మిగిలిపోలేనా..
యుగయుగాల ఆరాధన నీదనిపిస్తే..
7818. ఆమె సౌందర్యం వెలిగిపోతుంది..
అతనికభిముఖమై కదిలి ఆగినందుకే..
7819. భావనగా మిగిలినా చాలనుకున్నా..
నీ అనుభూతిలో నన్నో మాలికగా రాసుకుంటే చదవాలని..
7820. మరోజన్మకై వేచున్నా..
వసంతమొస్తే నీకై మరలా పూయాలని..
7821. ధనుర్మాసమొచ్చినప్పుడే అనుకున్నా..
నువ్వు వెతికే రంగవల్లులు నా సిగ్గుల మోములోనేనని..
7822. కుసుమ విలాపానికి మూగయ్యింది మది..
మనసు పరిమళం సహితంగా రోదిస్తుంటే..
7823. కలలపై విరుచుకుపడతావెందుకో..
హేమంతాన్ని హాయిగా నిద్దురలోనే అనుభవిస్తూ..
7824.చెలిమి చిరునామా మనమయ్యాముగా..
వసంతమంటి నన్ను పాడుతున్నవేళ..
7825. మదిలో మువ్వలు మోగినప్పుడే అనుకున్నా..
ప్రేమకోసమైనా ఎక్కడో అప్పటికే పుట్టుంటావని..
7826. అనురాగపు కిరణమద్దినప్పుడే అనుకున్నా..
నులివెచ్చని స్పర్శ నీదైయుంటుందని..
7827. కొన్ని జ్ఞాపకాలు కెరటాలే..
మనోతీరాన్ని ఎప్పటికీ తడారనివ్వనంటూ..
7828. కలగానే మిగిలిపోతున్నా..
కవిత కాలేని నీ రాతల్లో..
7829. హేమంతంలో నా అందాన్ని పొగుడుతున్నావెందుకో..
అసలే చిగురుటాకునై ఒణికుతున్నా మేను..
7830. మేఘాల వంకే చూస్తూ నేనున్నా..
నీవంపిన సందేశాలు కుమ్మరించకుండానే కదిలిపోతాయేమోనని..
7831. నీ మధురోహలు పల్లకీలే..
అధిరోహించిన ప్రతిసారీ స్వర్గమనిపిస్తూ..
7832. కలస్వనాలనే కూస్తానంటోంది..
నీ ఊపిరితో చెదిరిన స్వరమొకటి..
7833. మోడ్పులైన కన్నుల్ని ఆరాతీయవెందుకు..
వసంతమేనాడు అనుభవమైందో తెలుసుకొనేందుకు..
7834. నీ మౌనానికో భాషుందనిపించింది..
పెదవిప్పకుండానే నువ్వు మాట్లాడుతుంటే
7835. అశాంతిగా మిగిలిపోతున్నా..
అశ్రువులతో కలిపి నన్ను జార్చేస్తున్నందుకు..
7836. అక్షరమాలనే వరించేసా..
కవనంగా మారిన కలలను గుర్తించలేకనే
7837. భావాల సితారనేగా..
నన్ను నేను అక్షరముగా ఆవిష్కరించుకున్నప్పుడల్లా.
7838. విస్తుపోయిందో ఉదయం..
రాతిరంటే మక్కువన్నానని..
7839. అనురాగం కురిపించాయేమో కన్నులు..
ఆనందపు ఆస్వాదనలో పెదవులు..
7840. ముత్యాలెన్ని దాచుకున్నావో చూపులను దొంగిలించి..
పెదవులనెందుకు పలకరిస్తావో నక్షత్రమాల గుచ్చాలని..
7841. నీ వియోగం మృత్యువులాంటిది..
జ్ఞాపకాలే చితిపేర్చినట్లు..నాకై..
7842. నువ్వున్నప్పుడెన్ని గంటలు క్షణాలుగా కదిలిపోయాయో..
ఎంతాగమన్నా నా మనవే లేక్కచేయకుండా..
7843. నువ్విచ్చిన క్షణాలే మక్కువయ్యాయి..
కాలమెంత కంగారుగా కదిలిపోతున్నా..
7844. గమ్యమెంత దూరమో..
నిన్నందుకోలేని నా నిస్సహాయపు అడుగులకు..
7845. మొలకెత్తేందుకు సిద్ధమైపో..
అక్కడ మట్టి నిన్ను కనాలనుకుంటోంది..
7846. ఎన్ని సంతకాలని కోరుకుంటావో..
మనసుపై చెరగని ముద్రలెన్నేసినా..
7847. నీ పేరే నా పల్లవి..
నేనో పాటంటూ పాడగలనని నువ్వనుకుంటే..
7848. కలిసున్నామని భ్రమపడుతున్నాం ఒక్కొక్కరుగా..
ప్రవహించడమాగిన జీవితాన్ని తలవలేనట్లుగా..
7849. మూగబోయిందొక సంధ్యారాగం..
నిశీధి నిండిన హృదయపు ఏకాకితనానికి..
7850. మలుపులు తిరిగి అలసిపోతున్నా..
అంతమెరుగని నీ అనురాగపు గమ్యం అందుకోలేని ప్రయాసలో..
7851. నా కులుకును కనిపెట్టినప్పుడనుకోలేదు..
నన్నో అమూల్యముగా దిద్దుకుంటావని..
7852. మధురక్షణాల మేలుకలయికది..
నిన్నూనన్నూ కలిపిన ఏకాంతపు నిరీక్షణది..
7853. కదులుతున్న కాలాన్నడిగా..
నీ నవ్వు వెన్నెల్లోనే నన్నుంచమని..
7854. అనుబంధపు రుచితెలిసింది..
నీ జతలో మేలుకొల్పులు అవుతుండగానే..
7855. కౌగిలికి కొలతుండదుగా..
ఆనందమెన్ని రాసులుగా పోసినా అధికమవుతుంటే..
7856. మైమరపెక్కువే నీ ఊహలకు..
నన్నో దూదిపింజెగా ఎగరేసేవేళ..
7857. కాలానికి అనుగుణంగా నువ్వు..
కరిగిపోక తప్పదని గుర్తించినందుకేమో..
7858. వలసపోయిన క్షణాలు కొన్ని..
అల్లుకోబోయిన దిగులుశూన్యాన్ని భరించలేమంటూ..
7859. కొన్ని జ్ఞాపకాలు సశేషాలే..
మనసు మిగుల్చుకున్న అవశేషాలతో..
7860. మైమరపలా ముగిసింది..
తన ప్రేమలోని నిజాయితీ కరిగిపోగానే..
7861. తన్మయత్వంలో నేను..
మధురోహల పరిమళాన్ని పంచుతూ నీవు..
7862. నాలో నేను మిగిలిపోయా..
నీ స్వప్నంలోంచీ జారిపోగానే..
7863. నీరవం నన్ను తక్కిన అలజడి..
నీకు దూరమైన హేమంతపు చలిగాలుల్లో..
7864. మరోసారి పాడాలనుంది..
నీ మనసు మెచ్చిన నా ప్రియమైన పాట..
7865. పారేసానక్కడే గతాన్ని..
నెమరేసేకొద్దీ గాయాన్ని రేపి మంటపెడుతుందని
7866. నేనే అక్షరమైపోయా..
నువ్వు తప్పక చదువుతావనే చిరు ఆశలోనే
7867. కొసమెరుపుగా మిగిలిన మైమరపు..
ఊహల్లో కరిగిన కాటుకలతో..
7868. విషాదం వలసపోయింది..
నీ జ్ఞాపకాల జాడల్లో నేనున్నానని..
7869. రాజహంసగా మారిపోయా నేనే..
కొంటెచూపుతో నువ్వలా వరించగానే..
7870. మధూదయమే మనసుకి..
నిత్యమల్లెలా నవ్వుతూ నువ్వు మేల్కొల్పుతుంటే..
7871. జీవితఖైదీనేగా ఇక..
మనువంటూ నాకో బంధాన్ని ముడిపెట్టాక..
7872. అతిశయమూ అందమే..
పొగుడుతున్న మాలికలన్నీ నాకు మాలలవుతుంటే..
7873. ముద్దొచ్చినప్పుడే అనుకున్నా..
అద్దంగా మారి మురిపిస్తున్నది నువ్వని..
7874. తలపు హరివిల్లుగా నీవు..
వలపు నులివెచ్చగా నేను..
7875. నీ చక్కెరనవ్వులకర్ధం తెలిసింది..
నాలోని మౌనం గుసగుసలాడగానే..
7876. అక్కడో జ్ఞాపకం చేజారింది..
మూగబోయిన అక్షరం సాక్షిగా..
7877. చిరునవ్వులతోనే మురిపిస్తావుగా..
కోపాన్ని కొండెక్కమని నేర్పుగా మందలిస్తూ..
7878. కదిలిపోయిందా కాలం..
కవితలతో మెప్పించి కరిగించిన లౌక్యము..
7879. ఆదమరచిన క్షణాలకే తెలుసు..కన్నీటితో కడిగేసినా మరోరకంగా హత్తుకుంటాయ్..
7802. చలికాలం చెమరింతలే..
అవ్యక్త రాగాల తమకపు సరిగమలు..
7803. కలలు వలసపోయినప్పుడనుకున్నా..
నిదురపట్టని రాత్రులింక నాకు ముందున్నాయని..
7804. కలల రాగానికే మైమరచిపోతున్నా..
కాలమాగి కదిలినట్లు అనిపించగానే..
7805. అంబరమై ఎగిసింది చెలిమి..
హరివిల్లుని సవాలు చేద్దామని..
7806.మొలకెత్తించేసా ఆశలన్నీ..
శిశిరాన్ని సాగనంపి కలలు నేరవేర్చుకుందామని..
7807. ప్రేమొక సుదూర స్వప్నమేగా..
కలతలతో రోజులు కరిగిపోతుంటే..
7808. కల్పనలోనే జీవితం..
ఒంటరితనాన్ని పూరించుకొనే నా ప్రయత్నంలో..
7809. మౌనాన్నెందుకు రెచ్చగొడుతున్నావో మరి..
నువ్వు నచ్చడంతో ముడిపెట్టి..
7810. నటించక తప్పని జీవితం..
జీవించేందుకు అవకాశమే కరువవుతుంటే..
7811. మనసు బరువుగానే ఉంచుకున్నాను..
కన్నీటితో జార్చెస్తే తేలికవుతుందని..
7812. పూలకలలెన్ని కోల్పోయానో..
నీ వియోగంతో రానన్న నిద్దురలో..
7813. కదలికలన్నీ కవితలుగా రాసేసుకున్నా..
కల్పనతో మనసు బరువెక్కుతుందని..
7814. నా కల్పనలో నువ్విలా..
నీ చేతుల్లోని నేనులా..
7815. హేమంతానికి చిక్కిన గులాబీ..
ఘనీభవించినా సౌందర్యాన్ని కోల్పోనంటూ..
7816. నా శ్వాసకు సంగీతమందించింది నువ్వే..
నీ ఊహల్లో లీనమవుతూ నేనుంటే..
7817. నీ కల్పనగానే మిగిలిపోలేనా..
యుగయుగాల ఆరాధన నీదనిపిస్తే..
7818. ఆమె సౌందర్యం వెలిగిపోతుంది..
అతనికభిముఖమై కదిలి ఆగినందుకే..
7819. భావనగా మిగిలినా చాలనుకున్నా..
నీ అనుభూతిలో నన్నో మాలికగా రాసుకుంటే చదవాలని..
7820. మరోజన్మకై వేచున్నా..
వసంతమొస్తే నీకై మరలా పూయాలని..
7821. ధనుర్మాసమొచ్చినప్పుడే అనుకున్నా..
నువ్వు వెతికే రంగవల్లులు నా సిగ్గుల మోములోనేనని..
7822. కుసుమ విలాపానికి మూగయ్యింది మది..
మనసు పరిమళం సహితంగా రోదిస్తుంటే..
7823. కలలపై విరుచుకుపడతావెందుకో..
హేమంతాన్ని హాయిగా నిద్దురలోనే అనుభవిస్తూ..
7824.చెలిమి చిరునామా మనమయ్యాముగా..
వసంతమంటి నన్ను పాడుతున్నవేళ..
7825. మదిలో మువ్వలు మోగినప్పుడే అనుకున్నా..
ప్రేమకోసమైనా ఎక్కడో అప్పటికే పుట్టుంటావని..
7826. అనురాగపు కిరణమద్దినప్పుడే అనుకున్నా..
నులివెచ్చని స్పర్శ నీదైయుంటుందని..
7827. కొన్ని జ్ఞాపకాలు కెరటాలే..
మనోతీరాన్ని ఎప్పటికీ తడారనివ్వనంటూ..
7828. కలగానే మిగిలిపోతున్నా..
కవిత కాలేని నీ రాతల్లో..
7829. హేమంతంలో నా అందాన్ని పొగుడుతున్నావెందుకో..
అసలే చిగురుటాకునై ఒణికుతున్నా మేను..
7830. మేఘాల వంకే చూస్తూ నేనున్నా..
నీవంపిన సందేశాలు కుమ్మరించకుండానే కదిలిపోతాయేమోనని..
7831. నీ మధురోహలు పల్లకీలే..
అధిరోహించిన ప్రతిసారీ స్వర్గమనిపిస్తూ..
7832. కలస్వనాలనే కూస్తానంటోంది..
నీ ఊపిరితో చెదిరిన స్వరమొకటి..
7833. మోడ్పులైన కన్నుల్ని ఆరాతీయవెందుకు..
వసంతమేనాడు అనుభవమైందో తెలుసుకొనేందుకు..
7834. నీ మౌనానికో భాషుందనిపించింది..
పెదవిప్పకుండానే నువ్వు మాట్లాడుతుంటే
7835. అశాంతిగా మిగిలిపోతున్నా..
అశ్రువులతో కలిపి నన్ను జార్చేస్తున్నందుకు..
7836. అక్షరమాలనే వరించేసా..
కవనంగా మారిన కలలను గుర్తించలేకనే
7837. భావాల సితారనేగా..
నన్ను నేను అక్షరముగా ఆవిష్కరించుకున్నప్పుడల్లా.
7838. విస్తుపోయిందో ఉదయం..
రాతిరంటే మక్కువన్నానని..
7839. అనురాగం కురిపించాయేమో కన్నులు..
ఆనందపు ఆస్వాదనలో పెదవులు..
7840. ముత్యాలెన్ని దాచుకున్నావో చూపులను దొంగిలించి..
పెదవులనెందుకు పలకరిస్తావో నక్షత్రమాల గుచ్చాలని..
7841. నీ వియోగం మృత్యువులాంటిది..
జ్ఞాపకాలే చితిపేర్చినట్లు..నాకై..
7842. నువ్వున్నప్పుడెన్ని గంటలు క్షణాలుగా కదిలిపోయాయో..
ఎంతాగమన్నా నా మనవే లేక్కచేయకుండా..
7843. నువ్విచ్చిన క్షణాలే మక్కువయ్యాయి..
కాలమెంత కంగారుగా కదిలిపోతున్నా..
7844. గమ్యమెంత దూరమో..
నిన్నందుకోలేని నా నిస్సహాయపు అడుగులకు..
7845. మొలకెత్తేందుకు సిద్ధమైపో..
అక్కడ మట్టి నిన్ను కనాలనుకుంటోంది..
7846. ఎన్ని సంతకాలని కోరుకుంటావో..
మనసుపై చెరగని ముద్రలెన్నేసినా..
7847. నీ పేరే నా పల్లవి..
నేనో పాటంటూ పాడగలనని నువ్వనుకుంటే..
7848. కలిసున్నామని భ్రమపడుతున్నాం ఒక్కొక్కరుగా..
ప్రవహించడమాగిన జీవితాన్ని తలవలేనట్లుగా..
7849. మూగబోయిందొక సంధ్యారాగం..
నిశీధి నిండిన హృదయపు ఏకాకితనానికి..
7850. మలుపులు తిరిగి అలసిపోతున్నా..
అంతమెరుగని నీ అనురాగపు గమ్యం అందుకోలేని ప్రయాసలో..
7851. నా కులుకును కనిపెట్టినప్పుడనుకోలేదు..
నన్నో అమూల్యముగా దిద్దుకుంటావని..
7852. మధురక్షణాల మేలుకలయికది..
నిన్నూనన్నూ కలిపిన ఏకాంతపు నిరీక్షణది..
7853. కదులుతున్న కాలాన్నడిగా..
నీ నవ్వు వెన్నెల్లోనే నన్నుంచమని..
7854. అనుబంధపు రుచితెలిసింది..
నీ జతలో మేలుకొల్పులు అవుతుండగానే..
7855. కౌగిలికి కొలతుండదుగా..
ఆనందమెన్ని రాసులుగా పోసినా అధికమవుతుంటే..
7856. మైమరపెక్కువే నీ ఊహలకు..
నన్నో దూదిపింజెగా ఎగరేసేవేళ..
7857. కాలానికి అనుగుణంగా నువ్వు..
కరిగిపోక తప్పదని గుర్తించినందుకేమో..
7858. వలసపోయిన క్షణాలు కొన్ని..
అల్లుకోబోయిన దిగులుశూన్యాన్ని భరించలేమంటూ..
7859. కొన్ని జ్ఞాపకాలు సశేషాలే..
మనసు మిగుల్చుకున్న అవశేషాలతో..
7860. మైమరపలా ముగిసింది..
తన ప్రేమలోని నిజాయితీ కరిగిపోగానే..
7861. తన్మయత్వంలో నేను..
మధురోహల పరిమళాన్ని పంచుతూ నీవు..
7862. నాలో నేను మిగిలిపోయా..
నీ స్వప్నంలోంచీ జారిపోగానే..
7863. నీరవం నన్ను తక్కిన అలజడి..
నీకు దూరమైన హేమంతపు చలిగాలుల్లో..
7864. మరోసారి పాడాలనుంది..
నీ మనసు మెచ్చిన నా ప్రియమైన పాట..
7865. పారేసానక్కడే గతాన్ని..
నెమరేసేకొద్దీ గాయాన్ని రేపి మంటపెడుతుందని
7866. నేనే అక్షరమైపోయా..
నువ్వు తప్పక చదువుతావనే చిరు ఆశలోనే
7867. కొసమెరుపుగా మిగిలిన మైమరపు..
ఊహల్లో కరిగిన కాటుకలతో..
7868. విషాదం వలసపోయింది..
నీ జ్ఞాపకాల జాడల్లో నేనున్నానని..
7869. రాజహంసగా మారిపోయా నేనే..
కొంటెచూపుతో నువ్వలా వరించగానే..
7870. మధూదయమే మనసుకి..
నిత్యమల్లెలా నవ్వుతూ నువ్వు మేల్కొల్పుతుంటే..
7871. జీవితఖైదీనేగా ఇక..
మనువంటూ నాకో బంధాన్ని ముడిపెట్టాక..
7872. అతిశయమూ అందమే..
పొగుడుతున్న మాలికలన్నీ నాకు మాలలవుతుంటే..
7873. ముద్దొచ్చినప్పుడే అనుకున్నా..
అద్దంగా మారి మురిపిస్తున్నది నువ్వని..
7874. తలపు హరివిల్లుగా నీవు..
వలపు నులివెచ్చగా నేను..
7875. నీ చక్కెరనవ్వులకర్ధం తెలిసింది..
నాలోని మౌనం గుసగుసలాడగానే..
7876. అక్కడో జ్ఞాపకం చేజారింది..
మూగబోయిన అక్షరం సాక్షిగా..
7877. చిరునవ్వులతోనే మురిపిస్తావుగా..
కోపాన్ని కొండెక్కమని నేర్పుగా మందలిస్తూ..
7878. కదిలిపోయిందా కాలం..
కవితలతో మెప్పించి కరిగించిన లౌక్యము..
ఆగమ్యంగా దాచుకున్న మైమరపు..
7880. మౌనవాటికలో నేను..
శూన్యమొకటి దగ్గరై అద్దంలో నీ నైజాన్ని చూపుతుంటే..
7881. ప్రేమకు నిలువుటద్దమైపోయా..
నీలోకి నన్నాహ్వానించి మనసు మురిపించగానే
7882. చదవాలనిపించే ఏకైక పుస్తకం..
తన ఉనికిని దాచుకున్న నా మనసు సుస్వప్నం..
7883. పసిదనానికి పరుగెడుతున్నా..
కలకలమను అమాయకత్వాన్ని మరోసారి ఆత్మీకరించుకోవాలని..
7884. శిశిరమిద్దరికీ సమానమేగా..
నేనోదరినీ నువ్వోదరినీ విడివిడిగా విలపిస్తున్నా..
7885. పుంతలు తొక్కుతోందిలా ప్రేమ..
మనసుకధ రాయడం మొదలెట్టగానే.
7886. ఒక కలతలా కరిగిపోయింది..
కొన్ని జ్ఞాపకాలను కౌగిలించగానే..
7887. పయనమయిన ఆశలు..
అభిమానించు గుండెల్లో స్థానం కల్పించుకుంటామంటూ
7888. తీపెక్కుతున్న సాయంత్రం..
నిన్ను కలవబోతున్నాననే తలపు ముసురేయగానే..
7889. కన్నీటికెప్పుడూ ఆరాటమే..
చెంపలను తడిమి ముగ్గులుగా మిగిలిపోవాలని..
7890. మనసుకిన్ని తిమిరాలెందుకో..
జ్ఞాపకం తడమగానే ఏకాకితనానికి పరుగుతీస్తూ..
7891. చిరునవ్వులెన్ని వెదజల్లుతావో నీ చూపుతో..
నాలోని ఏకాంతం వశం తప్పేట్టు
7892. జీవించక తప్పట్లేదు..
చిరునామా లేని మనసును మోసుకుంటూ..
7893. ఒయారం పెరిగింది నిన్ను చూసి..
చూపులు చుట్టేస్తున్న చిలిపి ఊహలతో..
7894. మౌనాన్ని చదవడం నేర్చేసా..
నీ ఏకాంతానికి రాణినవగనే..
7895. నిశీధిని మార్చేస్తున్నా వెన్నెలగా..
నీకో అద్భుతాన్ని కానుకివ్వాలని..
7896. నడిరేయి నర్తనాలు నాలో..
తలపుల్లోకి తొంగిచూసి రమ్మంటున్నావనే..
7897. మేళమాడేందుకు రమ్మనగానే అనుకున్నా..
మాలికల్లో మనమయ్యేందుకే వలచావని..
7898. హేమంతమెన్ని మాసాలుంటేనేమిలే..
కరిగించేందుకో కౌగిలింతవై పదాలలో నువ్వుండగా..
7899. రేయెప్పటికీ పూర్తికాదు..
నీ కలలతో నేను మమేకమైయ్యుండగా..
7900. పులకింతలతో గడిపేస్తున్నా..
నా పలుకులమాలలోని పువ్వులు నిన్నల్లినాయనే..
No comments:
Post a Comment