8901. ఆ పదాలకెంత గర్వమో..
పదాలన్నీ గుదిగుచ్చిన మాలికలవుతూ..
8902. చిన్నినవ్వుతో సరిపెట్టేసా..
కేరింతలేస్తే నువ్వు కంగారు పడతావనే..
8903. పట్టుబడనంటూ లౌక్యం..
నాలో నిజాయితీతో తాను తలబడలేనంటూ..
8904. మౌనంగా పలకరిస్తున్న చూపులు..
నాపైని ఇష్టానికి సంకేతాలు..
8905. అనుభూతి సంద్రమైనందుకేమో..
పట్టరాని అలలై ఎగిసింది ఆనందం..!
8906. కదలికుండటం మంచిదైంది కాలానికి..
గతంలోంచీ నన్నిలా బ్రతికించింది..!
8907. తనెప్పుడూ దొంగోడే..
మనసు దాచేసి ఏమెరుగనట్టు బుకాయిస్తూ..
8908. జీవితం కలిపిందిలా..
ఎగురేపక్షులైన నిన్నూ నన్నూ ఒకటిగా..
8909. జీవితం కలిపిందిలా..
గతజన్మలోని తప్పును ఇప్పుడు దిద్దుకోవాలనే..
8910. జీవితం కలిపిందిలా..
తన కన్నులకో పండుగ కావాలని..
8911. ఆమెకదో పిచ్చి..
మనసు లేనోడని తెలిసినా వెంటపడటం..
8912. ఆ పుస్తకమందుకే దాచుకున్నా..
కొన్ని మధురానుభూతులు అక్షరాలయ్యాయని..
8913. అక్షరాలందుకే రాయలేదక్కడ..
నీలో శూన్యమో కవిత్వమై తాకిందనే..
8914. అక్షరాలకెన్ని కేరింతలో..
నీ ప్రతీ భావములో నన్నుంచుతుంటే..
8915. అంతులేని కలల తాకిడి..
కొన్ని అనుభవాల పొర్లాటలో..
8916. రైలటు కదులుతోంది..
మది నిన్నల్లో మరచిన నవ్వుల్ని చీకట్లో తడుముకుంటుంటే..
8917. తొలివేకువతని రూపముతోనే..
ఎన్ని అలుకలు రెప్పల్లో తారాడుతున్నా..
8918. నువ్వంటే నాకిష్టమే..
నీ అణువణువుల్లో నన్ను నింపినందుకు..
8919. కలలబరువు కన్నుల్లో..
ఈ పగలెందుకో రేయిని తలపిస్తూ..
8920. అతులిత భారం నా రెప్పలకిది..
నీ ఊహను మోయలేని కన్నులయ్యాక
8921. భావాల సందడి మొదలైందిలా..
నీ చూపులేం చర్చించినందుకో..
8922. నరాలవీణకెన్ని రాగాలో..
నీ తలపునొక్కమారు మీటుకుంటే చాలు..
8923. ఊపిరిప్పుడు తేలికయ్యింది..
నీ మాట మంత్రమై వినబడగానే..
8924. కలత మానుకున్నానిప్పుడు..
కలలన్నిటా నువ్వొస్తున్నందుకు..
8925. నిశ్శబ్దమో నరకమే..
మనసు భారమై మాటలు పెగలనప్పుడు..
8926. భారం తేలికైందిగా..
గోగులు పూచే పాటలే పెదవిపైనిప్పుడు...
8927. భారం కాని వియోగముండదేమో..
అతిప్రేమలో విషాదం మిళితమవుతుంటే..
8928. ప్రవహించడం ఆగలేదు జీవితం..
నిర్లిప్తత గ్రీష్మమై అడ్డుపడ్డదంతే..
8929. శ్రావణమిప్పుడు మొదలయ్యింది..
రైతన్న కన్నీటిని కడిగేస్తున్న జల్లులతో..
8930. మనసులో చోటిస్తే చాలనుకున్నా..
నీ ప్రపంచమవుతానని తెలీక..
8931. అనురాగంలో అలసిపోతాననుకోలేదు..
జ్ఞాపకాలుగా మారిన రేయి సుషుప్తిలో..
8932. ఎన్ని తపస్సులు వృధా అయినవో..
నీ ఎదురుచూపుల్లో నేనోడిన కాలంలో.
8933. నా మనసు నీదైనప్పటి సంగతి..
అద్దంలోనూ నువ్వే అప్పటి సంధి..
8934.అలుకందుకే పరిమళిస్తుంది..
మౌనాన్నో పువ్వును చేసి నువ్వాస్వాదించినందుకే..
8935. మాటేసినప్పుడే అనుకున్నా..
మామిడితోపులో ముచ్చట్లకి ముహూర్తమేదో పెట్టుంటావని..
8936. నవ్వుల ముగ్గులేసానందుకే..
ఎదురుచూపుల వాకిట్లో సంక్రాంతిని వెదికావనే..
8937. తలవాకిట తడబడుతున్నా..
నువ్వు పిలవలేదనే మొహమాటాన్ని జయించలేకనే..
8938. నా చిరునవ్వులు మనసుపాటలే..
నిన్ను స్వాగతించేందుకు సంగీతమయ్యాయనే..
8939. కలలు కురిసినప్పుడే అనుకున్నా..
నీలాకాశంలో నక్షత్రాలు మాయమవుతున్నవని..
8940. భావాలమోపుతో నేనొస్తున్నా..
నీ పదాలు కొన్నయినా కలుపుకుందామని..
8941. కన్నులు దోనెలుగా మారినప్పుడే అనుకున్నా..
తొలిదీపాలు పెట్టబోతుంది నా రూపమేనని..
8942. ఆనందమిప్పుడు ఆకాశం..
పెదవుల్లో మత్తులు కన్నులను చేరినందుకేమో..
8943. అలలవుతూ నాలో అరనవ్వులు..
నీ మాటలకే ముగ్ధమవుతూ..
8944. మనసుకదో మాయరోగం..
ప్రణయాన్ని వెతుకుతూ విషాదాన్ని వరిస్తుంది..
8945. మాసం మారినప్పుడే అనుకున్నా..
కూజితానికి చేరువగా నేనొస్తానని..
8946. సహనం సడలిపోతుంది..
తీరమని తెలిసీ అలలు వెనుదిరుగుతుంటే..
8947. నాలో వలపు గర్జించినప్పుడే అనుకున్నా.
మేఘవృత్తమైన మనసు నీకు అందుతుందని..
8948. నిదుర గల్లంతేగా నీకిప్పుడు..
నాపై ఆశలు కిలికించితాలవుతుంటే..
8949. తుళ్ళింతలే గుండెకిక..
ఉప్పొంగే అలలతో నే సముద్రమవుతుంటే..
8950. తుళ్ళింతలే గుండెకిక..
నాలో ఇల్లరికానికొచ్చావుగా.
8951. తుళ్ళింతలే గుండెకిక..
అపార్ధాలు ఆహుతయ్యాయిగా..
8952. వలపు మేఘమై కురిసిపోతున్నా..
పుడమి దాహమై ఎదురుచూసావని..
8953. విశేషమని కనిపెట్టా నేనప్పటికే..
సశేషమని లోకులు నమ్ముతుంటే..
8954. కాటుకలకెందుకో బెదుర్లు..
మౌనం కురుస్తున్న చప్పుళ్ళు మనసిచ్చానంటుంటే..
8955. సౌందర్యమంతా నిజమే మరి..
నిన్నాకట్టాలని చేస్తున్న తపస్సులో..
8956. క్షణాలకి సమాంతరంగా నడుస్తున్నా..
నీ ఏకాంతానికి నేనెదురవ్వాలని..
8957. చెలిమందుకే ప్రియం..
వెలితిని పూడ్చేందుకు గుండె నింపుతుందని..
8958. నిర్వచనానికందని ఉద్వేగం..
చిన్నారి అడుగులకు మడుగులెత్తే భాగ్యమవుతుంటే..
8960. కలవరించడమెప్పుడో మానేసా..
నీ కలల్లో ఊగుతూ తేలుతున్నందుకే..
8961. వెన్నెల్లో తడిచినట్టుంది..
నా జ్ఞాపకాలు నీలో ఊరేగుతున్నాయంటుంటే..
8962. ఎన్నిసార్లు తడిచినా బాగుంది..
కవిత్వమై కురుస్తున్నది ప్రేమైతే..
8963. ఆత్మవిశ్వాసమనుకుంటా..
ఆమె నవ్వులో కొత్త అందమిప్పుడు..
8964. అనుభవాన్నే భావముగా రాసుకున్నా..
నాలో ఆనందాన్ని నువ్వాస్వాదిస్తావని..
8965. కాటుకల అభినయాలెకువయ్యాయి కన్నులకు..
కలలో విన్యాసాలను ప్రయత్నిస్తూ..
8966. కన్నులకెప్పుడూ చెమరింతలే..
ఉరకలెత్తే జలపాతాలకు అవి పోలికలే..
8967. వలపు వానజల్లై కురిసావనుకున్నా..
నే మురిసేలోగా వెలిసిపోయావెందుకో..
8968. అపరిమితమే నా ఊహలు..
అణువణువూ కదలాడుతున్నది నువ్వయితే..
8969. పరసువేదినై కరిగిపోతున్నా..
నీ వలపు సెగలు మెరుగుపెడుతున్నాయనే..
8970. ప్రతిఫలిస్తున్న ఊహలే అన్నీ..
ప్రకృతికి నటించడమైతే రాదుగా..
8971. విరులు విస్తుపోయాయి..
పరిమళిస్తున్న ప్రియురాలితో తాము పోటీపడలేమని..
8972. కలహాలు నిత్యకృత్యమే జీవితంలో..
సాటివారిని ప్రేమించడం తెలియకపోతే..
8973. ఇద్దరమొకటేగా..
భావాలు కలవలేదంటూనే అనుభవాలు పోగేసుకుంటుంటే..
8974. నా కన్నుల్లో ఆరాలెందుకో..
నక్షత్రాలు గాలించాలని ఆకాంక్షిస్తూ..
8975. ఆవిరైపోయిన కలలు..
లయమవ్వాలనుకున్న కన్నుల్లో కాంతి కాలేకపోయినందుకు..
8976. వసంతమయ్యింది నిజమే..
శిశిరంలోనూ నీ మేఘసందేశం నాకందిందిగా..
8977. అతడే జీవితం అనుకుందామె..
అతనికామో సరదాయేనని తెలిసినా..
8978. ఉక్కిరిబిక్కిరి నేనవుతున్నా..
నీ భావాలధూపపు పరిమళానికే మరి..
8979. నిర్వచనమేదీ లేదంటూ మది..
నీ పరిష్వంగానికేదీ అతులితమవదని..
8980. అక్షరాల సందడి..
బాల్యపు లోకిట్లోకి అడుగులు నువ్వేయించావని..
8981. కలవరాలెందుకో కనకాంబరాలకు..
కాస్త సున్నిసత్వం నాకు అరువిచ్చేందుకు..
8982. అక్షర్రలు మాత్రమే కావవి..
నాలో భావాలకు ప్రతిరూపాలు..
8983. ప్రేమందుకే విడువలేను..
ఏనాటికైనా ద్వేషాన్ని జయించి తీరుదామనే..
8984. నాదెప్పుడూ రాణీవాసమే..
నీ హృదయంలో చోటివ్వకుంటే మరోదాంట్లో..
8985. ముసురేసిన వైనమిది..
నువ్వలిగితే నా ఎదలో ఉరుములైనట్టు..
8986. పరిమళమందినప్పుడే అనుకున్నా..
నీ చెలిమిలో స్వచ్ఛంగా మనసుండగలదని..
8987. దిగులు దూరమయ్యింది..
అడుగులకు దగ్గరలో ఆలింగనానికై నువ్వెదురొస్తుంటే..
8988. ఉప్పెనై ముంచుతావన్న భయం నాది..
ఆకాశమంత వియోగాన్ని నేను భరించలేనని..
8989. నులివెచ్చని సదనమే నా వదనం..
నీ అరచేతుల పారవశ్యానికి చేరువైనప్పుడల్లా..
8990. గుండెల్లోనే దాచాలి కన్నీరు..
కన్నుల్లోకి ప్రవహిస్తే లోకువైనట్టేగా..
8991. చెలిమంత చిక్కనయ్యింది..
చింతలన్నింటినీ ఒకేసారి చిరునవ్వులుగా మార్చినందుకే..
8992. మనసు ముసురేయడం నిజమే..
స్మృతుల శ్రావణంలో నేనున్నందుకు..
8993. తేనెల తేటలే మనసుకిప్పుడు..
తెలుగందాలు అక్షరాల్లో కనువిందవుతుంటే..
8994. నీ కంటి జాబిలి నేనేగా..
నా వెలుగు నీకు వెన్నెలయ్యిందంటే..
8995. వానెప్పటికీ ఆగకుంటే బాగుండనిపించింది..
చెలికాని చూపులు వెచ్చబెడుతుంటే..
8996. చిరునవ్వుతో నేను..
నాకోసం పురివిప్పుకొని నువ్వెదురు చూస్తున్నావనే..
8997. బాల్యానికందుకే ఉరకాలనిపిస్తుంది..
బంధాలను దాటి స్వేచ్ఛగా విహరించాలని..
8998. మమతల వానెంత కురిసినా బాగుంది..
అణువణువూ తడిమే చూపుల ఆలింగనానికై.
8999. రాతిరైనప్పుడే అనుకున్నా..
అందమే అతిశయించేలా నన్ను పొగుడుతావని..
9000. కాలాన్నెందుకు కసురుకుంటావో..
అప్పుడప్పుడూ చెలి దూరమైన విరహంలో..
పదాలన్నీ గుదిగుచ్చిన మాలికలవుతూ..
8902. చిన్నినవ్వుతో సరిపెట్టేసా..
కేరింతలేస్తే నువ్వు కంగారు పడతావనే..
8903. పట్టుబడనంటూ లౌక్యం..
నాలో నిజాయితీతో తాను తలబడలేనంటూ..
8904. మౌనంగా పలకరిస్తున్న చూపులు..
నాపైని ఇష్టానికి సంకేతాలు..
8905. అనుభూతి సంద్రమైనందుకేమో..
పట్టరాని అలలై ఎగిసింది ఆనందం..!
8906. కదలికుండటం మంచిదైంది కాలానికి..
గతంలోంచీ నన్నిలా బ్రతికించింది..!
8907. తనెప్పుడూ దొంగోడే..
మనసు దాచేసి ఏమెరుగనట్టు బుకాయిస్తూ..
8908. జీవితం కలిపిందిలా..
ఎగురేపక్షులైన నిన్నూ నన్నూ ఒకటిగా..
8909. జీవితం కలిపిందిలా..
గతజన్మలోని తప్పును ఇప్పుడు దిద్దుకోవాలనే..
8910. జీవితం కలిపిందిలా..
తన కన్నులకో పండుగ కావాలని..
8911. ఆమెకదో పిచ్చి..
మనసు లేనోడని తెలిసినా వెంటపడటం..
8912. ఆ పుస్తకమందుకే దాచుకున్నా..
కొన్ని మధురానుభూతులు అక్షరాలయ్యాయని..
8913. అక్షరాలందుకే రాయలేదక్కడ..
నీలో శూన్యమో కవిత్వమై తాకిందనే..
8914. అక్షరాలకెన్ని కేరింతలో..
నీ ప్రతీ భావములో నన్నుంచుతుంటే..
8915. అంతులేని కలల తాకిడి..
కొన్ని అనుభవాల పొర్లాటలో..
8916. రైలటు కదులుతోంది..
మది నిన్నల్లో మరచిన నవ్వుల్ని చీకట్లో తడుముకుంటుంటే..
8917. తొలివేకువతని రూపముతోనే..
ఎన్ని అలుకలు రెప్పల్లో తారాడుతున్నా..
8918. నువ్వంటే నాకిష్టమే..
నీ అణువణువుల్లో నన్ను నింపినందుకు..
8919. కలలబరువు కన్నుల్లో..
ఈ పగలెందుకో రేయిని తలపిస్తూ..
8920. అతులిత భారం నా రెప్పలకిది..
నీ ఊహను మోయలేని కన్నులయ్యాక
8921. భావాల సందడి మొదలైందిలా..
నీ చూపులేం చర్చించినందుకో..
8922. నరాలవీణకెన్ని రాగాలో..
నీ తలపునొక్కమారు మీటుకుంటే చాలు..
8923. ఊపిరిప్పుడు తేలికయ్యింది..
నీ మాట మంత్రమై వినబడగానే..
8924. కలత మానుకున్నానిప్పుడు..
కలలన్నిటా నువ్వొస్తున్నందుకు..
8925. నిశ్శబ్దమో నరకమే..
మనసు భారమై మాటలు పెగలనప్పుడు..
8926. భారం తేలికైందిగా..
గోగులు పూచే పాటలే పెదవిపైనిప్పుడు...
8927. భారం కాని వియోగముండదేమో..
అతిప్రేమలో విషాదం మిళితమవుతుంటే..
8928. ప్రవహించడం ఆగలేదు జీవితం..
నిర్లిప్తత గ్రీష్మమై అడ్డుపడ్డదంతే..
8929. శ్రావణమిప్పుడు మొదలయ్యింది..
రైతన్న కన్నీటిని కడిగేస్తున్న జల్లులతో..
8930. మనసులో చోటిస్తే చాలనుకున్నా..
నీ ప్రపంచమవుతానని తెలీక..
8931. అనురాగంలో అలసిపోతాననుకోలేదు..
జ్ఞాపకాలుగా మారిన రేయి సుషుప్తిలో..
8932. ఎన్ని తపస్సులు వృధా అయినవో..
నీ ఎదురుచూపుల్లో నేనోడిన కాలంలో.
8933. నా మనసు నీదైనప్పటి సంగతి..
అద్దంలోనూ నువ్వే అప్పటి సంధి..
8934.అలుకందుకే పరిమళిస్తుంది..
మౌనాన్నో పువ్వును చేసి నువ్వాస్వాదించినందుకే..
8935. మాటేసినప్పుడే అనుకున్నా..
మామిడితోపులో ముచ్చట్లకి ముహూర్తమేదో పెట్టుంటావని..
8936. నవ్వుల ముగ్గులేసానందుకే..
ఎదురుచూపుల వాకిట్లో సంక్రాంతిని వెదికావనే..
8937. తలవాకిట తడబడుతున్నా..
నువ్వు పిలవలేదనే మొహమాటాన్ని జయించలేకనే..
8938. నా చిరునవ్వులు మనసుపాటలే..
నిన్ను స్వాగతించేందుకు సంగీతమయ్యాయనే..
8939. కలలు కురిసినప్పుడే అనుకున్నా..
నీలాకాశంలో నక్షత్రాలు మాయమవుతున్నవని..
8940. భావాలమోపుతో నేనొస్తున్నా..
నీ పదాలు కొన్నయినా కలుపుకుందామని..
8941. కన్నులు దోనెలుగా మారినప్పుడే అనుకున్నా..
తొలిదీపాలు పెట్టబోతుంది నా రూపమేనని..
8942. ఆనందమిప్పుడు ఆకాశం..
పెదవుల్లో మత్తులు కన్నులను చేరినందుకేమో..
8943. అలలవుతూ నాలో అరనవ్వులు..
నీ మాటలకే ముగ్ధమవుతూ..
8944. మనసుకదో మాయరోగం..
ప్రణయాన్ని వెతుకుతూ విషాదాన్ని వరిస్తుంది..
8945. మాసం మారినప్పుడే అనుకున్నా..
కూజితానికి చేరువగా నేనొస్తానని..
8946. సహనం సడలిపోతుంది..
తీరమని తెలిసీ అలలు వెనుదిరుగుతుంటే..
8947. నాలో వలపు గర్జించినప్పుడే అనుకున్నా.
మేఘవృత్తమైన మనసు నీకు అందుతుందని..
8948. నిదుర గల్లంతేగా నీకిప్పుడు..
నాపై ఆశలు కిలికించితాలవుతుంటే..
8949. తుళ్ళింతలే గుండెకిక..
ఉప్పొంగే అలలతో నే సముద్రమవుతుంటే..
8950. తుళ్ళింతలే గుండెకిక..
నాలో ఇల్లరికానికొచ్చావుగా.
8951. తుళ్ళింతలే గుండెకిక..
అపార్ధాలు ఆహుతయ్యాయిగా..
8952. వలపు మేఘమై కురిసిపోతున్నా..
పుడమి దాహమై ఎదురుచూసావని..
8953. విశేషమని కనిపెట్టా నేనప్పటికే..
సశేషమని లోకులు నమ్ముతుంటే..
8954. కాటుకలకెందుకో బెదుర్లు..
మౌనం కురుస్తున్న చప్పుళ్ళు మనసిచ్చానంటుంటే..
8955. సౌందర్యమంతా నిజమే మరి..
నిన్నాకట్టాలని చేస్తున్న తపస్సులో..
8956. క్షణాలకి సమాంతరంగా నడుస్తున్నా..
నీ ఏకాంతానికి నేనెదురవ్వాలని..
8957. చెలిమందుకే ప్రియం..
వెలితిని పూడ్చేందుకు గుండె నింపుతుందని..
8958. నిర్వచనానికందని ఉద్వేగం..
చిన్నారి అడుగులకు మడుగులెత్తే భాగ్యమవుతుంటే..
8960. కలవరించడమెప్పుడో మానేసా..
నీ కలల్లో ఊగుతూ తేలుతున్నందుకే..
8961. వెన్నెల్లో తడిచినట్టుంది..
నా జ్ఞాపకాలు నీలో ఊరేగుతున్నాయంటుంటే..
8962. ఎన్నిసార్లు తడిచినా బాగుంది..
కవిత్వమై కురుస్తున్నది ప్రేమైతే..
8963. ఆత్మవిశ్వాసమనుకుంటా..
ఆమె నవ్వులో కొత్త అందమిప్పుడు..
8964. అనుభవాన్నే భావముగా రాసుకున్నా..
నాలో ఆనందాన్ని నువ్వాస్వాదిస్తావని..
8965. కాటుకల అభినయాలెకువయ్యాయి కన్నులకు..
కలలో విన్యాసాలను ప్రయత్నిస్తూ..
8966. కన్నులకెప్పుడూ చెమరింతలే..
ఉరకలెత్తే జలపాతాలకు అవి పోలికలే..
8967. వలపు వానజల్లై కురిసావనుకున్నా..
నే మురిసేలోగా వెలిసిపోయావెందుకో..
8968. అపరిమితమే నా ఊహలు..
అణువణువూ కదలాడుతున్నది నువ్వయితే..
8969. పరసువేదినై కరిగిపోతున్నా..
నీ వలపు సెగలు మెరుగుపెడుతున్నాయనే..
8970. ప్రతిఫలిస్తున్న ఊహలే అన్నీ..
ప్రకృతికి నటించడమైతే రాదుగా..
8971. విరులు విస్తుపోయాయి..
పరిమళిస్తున్న ప్రియురాలితో తాము పోటీపడలేమని..
8972. కలహాలు నిత్యకృత్యమే జీవితంలో..
సాటివారిని ప్రేమించడం తెలియకపోతే..
8973. ఇద్దరమొకటేగా..
భావాలు కలవలేదంటూనే అనుభవాలు పోగేసుకుంటుంటే..
8974. నా కన్నుల్లో ఆరాలెందుకో..
నక్షత్రాలు గాలించాలని ఆకాంక్షిస్తూ..
8975. ఆవిరైపోయిన కలలు..
లయమవ్వాలనుకున్న కన్నుల్లో కాంతి కాలేకపోయినందుకు..
8976. వసంతమయ్యింది నిజమే..
శిశిరంలోనూ నీ మేఘసందేశం నాకందిందిగా..
8977. అతడే జీవితం అనుకుందామె..
అతనికామో సరదాయేనని తెలిసినా..
8978. ఉక్కిరిబిక్కిరి నేనవుతున్నా..
నీ భావాలధూపపు పరిమళానికే మరి..
8979. నిర్వచనమేదీ లేదంటూ మది..
నీ పరిష్వంగానికేదీ అతులితమవదని..
8980. అక్షరాల సందడి..
బాల్యపు లోకిట్లోకి అడుగులు నువ్వేయించావని..
8981. కలవరాలెందుకో కనకాంబరాలకు..
కాస్త సున్నిసత్వం నాకు అరువిచ్చేందుకు..
8982. అక్షర్రలు మాత్రమే కావవి..
నాలో భావాలకు ప్రతిరూపాలు..
8983. ప్రేమందుకే విడువలేను..
ఏనాటికైనా ద్వేషాన్ని జయించి తీరుదామనే..
8984. నాదెప్పుడూ రాణీవాసమే..
నీ హృదయంలో చోటివ్వకుంటే మరోదాంట్లో..
8985. ముసురేసిన వైనమిది..
నువ్వలిగితే నా ఎదలో ఉరుములైనట్టు..
8986. పరిమళమందినప్పుడే అనుకున్నా..
నీ చెలిమిలో స్వచ్ఛంగా మనసుండగలదని..
8987. దిగులు దూరమయ్యింది..
అడుగులకు దగ్గరలో ఆలింగనానికై నువ్వెదురొస్తుంటే..
8988. ఉప్పెనై ముంచుతావన్న భయం నాది..
ఆకాశమంత వియోగాన్ని నేను భరించలేనని..
8989. నులివెచ్చని సదనమే నా వదనం..
నీ అరచేతుల పారవశ్యానికి చేరువైనప్పుడల్లా..
8990. గుండెల్లోనే దాచాలి కన్నీరు..
కన్నుల్లోకి ప్రవహిస్తే లోకువైనట్టేగా..
8991. చెలిమంత చిక్కనయ్యింది..
చింతలన్నింటినీ ఒకేసారి చిరునవ్వులుగా మార్చినందుకే..
8992. మనసు ముసురేయడం నిజమే..
స్మృతుల శ్రావణంలో నేనున్నందుకు..
8993. తేనెల తేటలే మనసుకిప్పుడు..
తెలుగందాలు అక్షరాల్లో కనువిందవుతుంటే..
8994. నీ కంటి జాబిలి నేనేగా..
నా వెలుగు నీకు వెన్నెలయ్యిందంటే..
8995. వానెప్పటికీ ఆగకుంటే బాగుండనిపించింది..
చెలికాని చూపులు వెచ్చబెడుతుంటే..
8996. చిరునవ్వుతో నేను..
నాకోసం పురివిప్పుకొని నువ్వెదురు చూస్తున్నావనే..
8997. బాల్యానికందుకే ఉరకాలనిపిస్తుంది..
బంధాలను దాటి స్వేచ్ఛగా విహరించాలని..
8998. మమతల వానెంత కురిసినా బాగుంది..
అణువణువూ తడిమే చూపుల ఆలింగనానికై.
8999. రాతిరైనప్పుడే అనుకున్నా..
అందమే అతిశయించేలా నన్ను పొగుడుతావని..
9000. కాలాన్నెందుకు కసురుకుంటావో..
అప్పుడప్పుడూ చెలి దూరమైన విరహంలో..
No comments:
Post a Comment