8501. విషాదమైతేనేమి గతం..
భవిష్యత్తులో నువ్వుండబోతావుగా
8502. మౌనం అమృతమయ్యింది..
అంతర్మధనంలో మనసు మెదడుని చదివాక..
8503. నీ కక్ష్యలోనే తిరుగుతున్నా..
అనురాగం కాసింత పంచుతావని..
8504. వెన్నెల్లో తడిచేందుకు వగపెందుకో..
జాబిలే కనుకొట్టి రమ్మంటున్నా..
8505. యుగళగీతమయ్యింది..
నీతో గొంతుకలిపి నేనో అనుపల్లవి పాడగానే..
8506. నీ తలపుల్లో నేను మమేకం..
మనసైన పరిమళాన్ని నీకు అంటుకడుతూ..
8507. నాలోనూ నవ్వులే..
నా బుగ్గల్లో నిన్ను ముడేయాలని..
8508. ఆ దేహానికి పరిమళమెక్కువ..
మంచితనమనే గంధం తోడైనందుకు..
8509. విగతమే ఆ దేహం..
విహంగాలై ఆశలు ఎగిరిపోయినందుకు..
8510. అపరిమితమే అనుభూతులు..
దేహాన్ని దాటి ఆత్మను సృజిస్తున్నప్పుడు..
8511. శాశ్వతమనుకున్నంతసేపు పట్టదుగా..
ప్రాణమలా గాలిలో కలిసి ఎగిసేందుకు..
8512. ఆ పుస్తకమెన్నటికీ అర్ధమవదు..
మనసు నచ్చలేదంటూ మొదలెడితే..
8513. కరిగిపోతుంటాయ్ వసంతాలు..
జ్ఞాపకాల పచ్చబొట్లు మాత్రం మిగుల్చుతూ..
8514. కురిసేదంతా కవిత్వమే..
వేసవిలోనూ మనసు తడవడం నిజమే..
8515. చందమామని ఒప్పుకున్నా..
రోజుకా మచ్చ పెరిగి కృష్ణపక్షమవుతుంటే..
8516. అక్షరాలతో అలరిస్తున్నా..
అందాన్ని చదవడం మక్కువని నువ్వనగానే..
8517. మనసంతా సంబరమే..
నీ పాటల్లో పదనిసలు నావవుతుంటే..
8518. పొలిమేర దాటినట్లే దేహం..
నాలో ప్రేమన్నది మరణించాక..
8519. చూపులతో కవ్విస్తున్నా..
మాటలంటే మళ్ళీ మైకంలో పడిపోతావనే..
8520. ఆవలిస్తూ..తాను..
కలవరపడుతూ..నేను..
8521. నీ తలపునే దిద్దుకుంటా..
అద్దంలో చూసుకోవాలనుకున్న ప్రతిసారీ..
8522. లుప్తమయ్యిందెప్పుడో మనసు..
ఏమరుపాటుగా నేనున్న క్షణాలను మంత్రించి..
8523. మనసుకు ఆర్తి..
నన్ను తలుచుకున్నావనే చిన్న నమ్మకంతోనే..
8524. ఆనందమిప్పుడు అరచేతిలోనే..
నిన్ను మోస్తున్న అదృష్టం నాదయినందుకు..
8525. వలపుల గారం తీరేదెన్నటికో..
అలకలతోనే అనురాగం ఆరంభమవుతుంటే..
8526. దేహానికెన్ని ఆర్భాటాలో..
చివరికి కప్పుకునేది మట్టిదుప్పటేనని తెలిసినా..
8527. ఆకాశం వైపు చూడలేనుగా..
నువ్వెంత చేయందించి పైకిరమ్మంటున్నా..
8528. అందిన కోమలాంగివే నీవు..
జాబిలితో జతపడాలని నేనాశపడ్డందుకు..
8529. ఆరున్నొక్కరాగంతో నేను..
నీ అనురాగాన్ని తట్టుకోలేని యాతనల్లో..
8530. వసంతం తిరిగొచ్చేసింది..
పచ్చదనాన్ని మోహించినందుకేమో..
8531. జయదేవునితో జతకడతావనుకున్నా..
నన్నో అష్టపదిగా పాడతావని ఊహించి..
8532. మనసంతా పరిమళాల విరిజల్లులు..
అమృతంలో తడిచిన భావనకేమో..
8533. నిట్టూర్పులైతేనేమి..
నీవిడిచే నిశ్వాసల్లో ఉన్నది నేనైతే..
8534. కదలనంటూ కలం..
నాలో భావాలను నువ్వు మెచ్చనంతవరకూ..
8535. మతిపోతుందంటే నమ్మేదెందరో..
నా ప్రేమలో పైత్యముందని ఆక్షేపిస్తూ..
8536. అవిశ్రాంతమవుతూ నా నడక..
చీకటిదారుల్లో వెలుతురుని కలగన్నట్లు..
8537. కలిపితే అతనేగా..
నాలుగు భావాలూ..మించిన అనుభూతులూ..
8538. అనురక్తి నిజమేలే..
అడక్కుండానే అప్పుడప్పుడూ ముద్దులు కొసరిస్తావని..
8539. ఆరారు కాలాలూ వసంతమవ్వాలనుంది..
శిశిరమై నువ్వుంటే చిగురింపజేయాలని..
8540. జన్మజన్మల చెలిమి కావాలనుంది..
మన అనుబంధమొకటి ఋజువైతే..
8541. సీతాకోక రంగుల్లాంటిది యవ్వనం..
వెలిసిపోతున్న హరివిల్లంటిది వృద్దాప్యం..
8542. ఆశలు చంపుకోక తప్పదుగా..
అనుబంధం బాగుందనుకున్న ఆత్మవంచనలో..
8543. నిత్యమూ కోతలే..
అడగ్గానే ఆలోచించక హృదయమిచ్చిన పాపానికి..
8544. అలుకలతో సర్దుకుంటున్నా..
కోపాగ్ని పెరిగితే నువ్వు దగ్ధమవుతావనే..
8545. కన్నుల్లో రూపం నీదే..
కలవరాలెన్నున్నా కరగనివ్వక కాపాడినందుకు..
8546. అద్వితీయమే మనసు..
అందుకున్నది నిజమైతే..
8547. ఆరోహణలోనే నేను..
పాడుతున్న పాటకి పల్లవి నీవైతే..
8548. వీచింది పవనమేననుకున్నా..
నీ పరిమళాన్ని మది గుర్తించేవరకూ..
8549. ఊయలూగింది నిజమే..
నీ ఊహలు కమ్మిన క్షణాలసాక్షి..
8550. తనో విశేషమని ఒప్పుకోవలసిందే..
నాలో అవ్యక్తాలు సవ్వడించినప్పుడన్నా..
8551. భవిష్యత్తు అయోమయం..
గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని విస్మరిస్తుంటే..
8552. రాతిరలా రాజుకోవలసిందే..
నింగిలోని జాబిలి ఇలకు జారి సరిజోడుగా పక్కనుంటే..
8553. పరిమళించవలసిందే ప్రేమలోని హృదయాలు..
పేర్చుకున్న కలలు నిజమైనందుకు..
8554. నీ మనసెందుకు అలసిపోతుందో..
అందమంటుకుని మెరిసిపోతుంది నేనైతే..
8555. మనసు తేలికయ్యిందిప్పుడే..
నీ ఊపిరిలో సునాయాసంగా చోటిచ్చినందుకు..
8556. కన్నుల్లో నువ్వన్నందుకేమో..
కన్నీరూ తీయదనపు రుచి మార్చుకుందిలా..
8557. ఎన్ని కలలని వాయిదా వేయమంటావో..
ప్రతీదీ నా ఇష్టమనే దెప్పిపొడుస్తుంటే..
8558. కలువలే కన్నులు..
కలిసే నీకై ఎదురుచూసే వేళలన్నింటిలో..
8559. కన్నీరే రహదారి..
ప్రవహిస్తున్న బాధకు ఆనకట్ట కుదరనప్పుడు..
8560. రసోదయమే నిత్యం..
నీ చిరునవ్వులు తాదాత్మ్యంలో మేల్కొగలిగినందుకు..
8561. జ్ఞాపకాన్ని విడువకలా..
ఆనందాన్ని మనసుకి దూరం చేసే హక్కు నీకేల..
8562. పచ్చకోకలో ప్రకృతి..
నీ ముచ్చట కోసం వసంతమైపోతూ..
8563. చూపులతో కనిపెట్టేస్తావెందుకో..
మనసు చదివే భాషేదో నీకొచ్చినట్లు..
8564. సశేషమై మిగిలిపోతా..
ముగించాలనుకున్న తన కథలో కన్నీటిబొట్టవుతూ..
8565. కలనైనా పొదుపుకోవలసిందే..
జ్ఞాపకాలతోనే జీవించమని నుదుట రాసిపెట్టుంటే..
8566. మౌనమలా రవళిస్తుంది..
కొన్ని నిజాలు మనసును మూసేస్తుంటే..
8567. నా మనసు తీపయ్యింది..
పాటలో పేరు నాదయినందుకే..
8568. మధురోహలే పల్లకీలు..
కల్పించుకున్న కౌగిలిలో కాసేపలా కోల్పోయేందుకు..
8569. స్పందిస్తే సంతోషమే..
నా భావాలు నిన్ను చేరుతున్నాయని..
8570. నిరీక్షణంతా నిట్టూర్పులోనే..
ఓదార్పు కరువైన నీ వియోగంలో..
8571. మండిపడుతున్న మల్లెలు..
మనసు పంచుకోలేని క్షణాలలా కదిలిపోతుంటే..
8572. వెలిగించాలనుకున్నా వలపుని..
నీలో అనుభూతులు అడుగంటాయని తెలీక..
8573. నిరంతర ప్రవాహమవుతూ కన్నీరు..
చెదిరిపోయిన కలలను కూడగట్టలేక..
8574. ముద్దుగా నవ్వుతూ మువ్వలు..
మల్లెలతో మీటుతున్న నీవైనానికి..
8575. నిన్నటి పాటే..
రాతిరి రాగాన్ని కలగలిపి పాడుతున్నానంతే..
8576. వెన్నెల కుమ్మరించక మాననుగా..
పున్నమికై ఎదురుచూస్తూ నీవుంటే..
8577. కనుపాపల్లోనే నువ్వున్నందుకేమో..
వియోగాన్నీ సంతృప్తి పడుతూ సరిపుచ్చుకుంటున్నా.
8578. కనుపాపల్లోనే నువ్వున్నందుకేమో..
మనసులో చీకటున్నా చూపుతో వెలుగుతున్నా..!
8579. నడివేసవిలో చల్లని గాలులు..
సాయంత్రానికి రమ్మని సంకేతాలు..
8580. నీకోసం నవ్విన నవ్వే..
చెవిలో పువ్వనుకుంటూ నువ్వు..
8581. అనుభూతికలా తెర లేస్తుంది..
నీ నవ్వుల్లో చేరిపోగానే..
8582. నేనెప్పుడూ ఇంతే..
ఆనందాన్ని ఆశించి విషాదంతో ముగుస్తాను..
8583. నీ కలల కొరకెన్ని పడిగాపులో..
వేళాపాళా లేక నిద్దరోతున్నానని ఎందరంటున్నా..
8584. చూపులతో జరుగుతున్న సంభాషణది..
అనువదించుకోవడం తెలిసిన మనసులకి..
8585. విశ్రాంతే ఒద్దనిపిస్తుంది..
నీకు దూరమైనప్పుడల్లా ఏకాంతం వెక్కిరిస్తుంటే..
8586. మువ్వనై మురిసిపోతున్నా..
నీ గుండెలో రవళించేందుకు రమ్మన్నావనే..
8587. తరువుల సందేహాలు..
కిరణాల స్పర్శతో పులకింతలు పుడమికెందుకని..
8588. సన్నజాజులు రువ్విన నవ్వులనుకుంటా..
అక్కడంతా పరిమళం వ్యాపించింది..
8589. కలలోనూ విషాదమే..
నువ్విడిచిపోయిన జ్ఞాపకాలు నిదురలో కదలగానే..
8590. నమ్మకానికందని నిజం..
నీ స్వార్ధంలో ప్రాణం నిలబెట్టుకున్నానని..
8591. ఎంతకని నిరీక్షించాలో..
నీవొచ్చేలోపు నా నిట్టూర్పులు లెక్కించుకుంటూ..
8592. మనసు ముసురేసినప్పుడనుకున్నా..
కన్నీరు కురిసేందుకు కాలంతో పనిలేదని..
8593. విచ్చుకుంటున్న అధరాలు..
ఏ అద్భుతాన్ని వివరించాలో మరి..
8594. జ్ఞాపకాలకు రంగులుంటాయనుకోలా..
కన్నీరలా ఎర్రగా కురిసేంత వరకూ..
8595. ఇలా గుర్తుపడతావనుకోలా..
కల నిజమైన ఆనందాన్ని నాకందిస్తూ..
8596. నీతో నీకు దోబూచులాటెందుకో..
ఎదురైన నన్నాడమని పిలవకుండా..
8597. దీర్ఘకాలికమనుకోలా ఎడబాటు..
కవిత రాసేంత మౌనం మొలకెత్తేవరకూ..
8598. నేను తన పరిమళాన్ని..
అనుబంధమనే పువ్వుగా మారినందుకు..
8599. ఆమొక ఆకాశమెక్కి కూర్చుంది..
ఎప్పటికీ అవగతమవని అద్వైతములా..
8600. హరివిల్లైతే విరబూసిందిగా..
కురిసిన చినుకులు నాలుగే అయినా..
భవిష్యత్తులో నువ్వుండబోతావుగా
8502. మౌనం అమృతమయ్యింది..
అంతర్మధనంలో మనసు మెదడుని చదివాక..
8503. నీ కక్ష్యలోనే తిరుగుతున్నా..
అనురాగం కాసింత పంచుతావని..
8504. వెన్నెల్లో తడిచేందుకు వగపెందుకో..
జాబిలే కనుకొట్టి రమ్మంటున్నా..
8505. యుగళగీతమయ్యింది..
నీతో గొంతుకలిపి నేనో అనుపల్లవి పాడగానే..
8506. నీ తలపుల్లో నేను మమేకం..
మనసైన పరిమళాన్ని నీకు అంటుకడుతూ..
8507. నాలోనూ నవ్వులే..
నా బుగ్గల్లో నిన్ను ముడేయాలని..
8508. ఆ దేహానికి పరిమళమెక్కువ..
మంచితనమనే గంధం తోడైనందుకు..
8509. విగతమే ఆ దేహం..
విహంగాలై ఆశలు ఎగిరిపోయినందుకు..
8510. అపరిమితమే అనుభూతులు..
దేహాన్ని దాటి ఆత్మను సృజిస్తున్నప్పుడు..
8511. శాశ్వతమనుకున్నంతసేపు పట్టదుగా..
ప్రాణమలా గాలిలో కలిసి ఎగిసేందుకు..
8512. ఆ పుస్తకమెన్నటికీ అర్ధమవదు..
మనసు నచ్చలేదంటూ మొదలెడితే..
8513. కరిగిపోతుంటాయ్ వసంతాలు..
జ్ఞాపకాల పచ్చబొట్లు మాత్రం మిగుల్చుతూ..
8514. కురిసేదంతా కవిత్వమే..
వేసవిలోనూ మనసు తడవడం నిజమే..
8515. చందమామని ఒప్పుకున్నా..
రోజుకా మచ్చ పెరిగి కృష్ణపక్షమవుతుంటే..
8516. అక్షరాలతో అలరిస్తున్నా..
అందాన్ని చదవడం మక్కువని నువ్వనగానే..
8517. మనసంతా సంబరమే..
నీ పాటల్లో పదనిసలు నావవుతుంటే..
8518. పొలిమేర దాటినట్లే దేహం..
నాలో ప్రేమన్నది మరణించాక..
8519. చూపులతో కవ్విస్తున్నా..
మాటలంటే మళ్ళీ మైకంలో పడిపోతావనే..
8520. ఆవలిస్తూ..తాను..
కలవరపడుతూ..నేను..
8521. నీ తలపునే దిద్దుకుంటా..
అద్దంలో చూసుకోవాలనుకున్న ప్రతిసారీ..
8522. లుప్తమయ్యిందెప్పుడో మనసు..
ఏమరుపాటుగా నేనున్న క్షణాలను మంత్రించి..
8523. మనసుకు ఆర్తి..
నన్ను తలుచుకున్నావనే చిన్న నమ్మకంతోనే..
8524. ఆనందమిప్పుడు అరచేతిలోనే..
నిన్ను మోస్తున్న అదృష్టం నాదయినందుకు..
8525. వలపుల గారం తీరేదెన్నటికో..
అలకలతోనే అనురాగం ఆరంభమవుతుంటే..
8526. దేహానికెన్ని ఆర్భాటాలో..
చివరికి కప్పుకునేది మట్టిదుప్పటేనని తెలిసినా..
8527. ఆకాశం వైపు చూడలేనుగా..
నువ్వెంత చేయందించి పైకిరమ్మంటున్నా..
8528. అందిన కోమలాంగివే నీవు..
జాబిలితో జతపడాలని నేనాశపడ్డందుకు..
8529. ఆరున్నొక్కరాగంతో నేను..
నీ అనురాగాన్ని తట్టుకోలేని యాతనల్లో..
8530. వసంతం తిరిగొచ్చేసింది..
పచ్చదనాన్ని మోహించినందుకేమో..
8531. జయదేవునితో జతకడతావనుకున్నా..
నన్నో అష్టపదిగా పాడతావని ఊహించి..
8532. మనసంతా పరిమళాల విరిజల్లులు..
అమృతంలో తడిచిన భావనకేమో..
8533. నిట్టూర్పులైతేనేమి..
నీవిడిచే నిశ్వాసల్లో ఉన్నది నేనైతే..
8534. కదలనంటూ కలం..
నాలో భావాలను నువ్వు మెచ్చనంతవరకూ..
8535. మతిపోతుందంటే నమ్మేదెందరో..
నా ప్రేమలో పైత్యముందని ఆక్షేపిస్తూ..
8536. అవిశ్రాంతమవుతూ నా నడక..
చీకటిదారుల్లో వెలుతురుని కలగన్నట్లు..
8537. కలిపితే అతనేగా..
నాలుగు భావాలూ..మించిన అనుభూతులూ..
8538. అనురక్తి నిజమేలే..
అడక్కుండానే అప్పుడప్పుడూ ముద్దులు కొసరిస్తావని..
8539. ఆరారు కాలాలూ వసంతమవ్వాలనుంది..
శిశిరమై నువ్వుంటే చిగురింపజేయాలని..
8540. జన్మజన్మల చెలిమి కావాలనుంది..
మన అనుబంధమొకటి ఋజువైతే..
8541. సీతాకోక రంగుల్లాంటిది యవ్వనం..
వెలిసిపోతున్న హరివిల్లంటిది వృద్దాప్యం..
8542. ఆశలు చంపుకోక తప్పదుగా..
అనుబంధం బాగుందనుకున్న ఆత్మవంచనలో..
8543. నిత్యమూ కోతలే..
అడగ్గానే ఆలోచించక హృదయమిచ్చిన పాపానికి..
8544. అలుకలతో సర్దుకుంటున్నా..
కోపాగ్ని పెరిగితే నువ్వు దగ్ధమవుతావనే..
8545. కన్నుల్లో రూపం నీదే..
కలవరాలెన్నున్నా కరగనివ్వక కాపాడినందుకు..
8546. అద్వితీయమే మనసు..
అందుకున్నది నిజమైతే..
8547. ఆరోహణలోనే నేను..
పాడుతున్న పాటకి పల్లవి నీవైతే..
8548. వీచింది పవనమేననుకున్నా..
నీ పరిమళాన్ని మది గుర్తించేవరకూ..
8549. ఊయలూగింది నిజమే..
నీ ఊహలు కమ్మిన క్షణాలసాక్షి..
8550. తనో విశేషమని ఒప్పుకోవలసిందే..
నాలో అవ్యక్తాలు సవ్వడించినప్పుడన్నా..
8551. భవిష్యత్తు అయోమయం..
గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని విస్మరిస్తుంటే..
8552. రాతిరలా రాజుకోవలసిందే..
నింగిలోని జాబిలి ఇలకు జారి సరిజోడుగా పక్కనుంటే..
8553. పరిమళించవలసిందే ప్రేమలోని హృదయాలు..
పేర్చుకున్న కలలు నిజమైనందుకు..
8554. నీ మనసెందుకు అలసిపోతుందో..
అందమంటుకుని మెరిసిపోతుంది నేనైతే..
8555. మనసు తేలికయ్యిందిప్పుడే..
నీ ఊపిరిలో సునాయాసంగా చోటిచ్చినందుకు..
8556. కన్నుల్లో నువ్వన్నందుకేమో..
కన్నీరూ తీయదనపు రుచి మార్చుకుందిలా..
8557. ఎన్ని కలలని వాయిదా వేయమంటావో..
ప్రతీదీ నా ఇష్టమనే దెప్పిపొడుస్తుంటే..
8558. కలువలే కన్నులు..
కలిసే నీకై ఎదురుచూసే వేళలన్నింటిలో..
8559. కన్నీరే రహదారి..
ప్రవహిస్తున్న బాధకు ఆనకట్ట కుదరనప్పుడు..
8560. రసోదయమే నిత్యం..
నీ చిరునవ్వులు తాదాత్మ్యంలో మేల్కొగలిగినందుకు..
8561. జ్ఞాపకాన్ని విడువకలా..
ఆనందాన్ని మనసుకి దూరం చేసే హక్కు నీకేల..
8562. పచ్చకోకలో ప్రకృతి..
నీ ముచ్చట కోసం వసంతమైపోతూ..
8563. చూపులతో కనిపెట్టేస్తావెందుకో..
మనసు చదివే భాషేదో నీకొచ్చినట్లు..
8564. సశేషమై మిగిలిపోతా..
ముగించాలనుకున్న తన కథలో కన్నీటిబొట్టవుతూ..
8565. కలనైనా పొదుపుకోవలసిందే..
జ్ఞాపకాలతోనే జీవించమని నుదుట రాసిపెట్టుంటే..
8566. మౌనమలా రవళిస్తుంది..
కొన్ని నిజాలు మనసును మూసేస్తుంటే..
8567. నా మనసు తీపయ్యింది..
పాటలో పేరు నాదయినందుకే..
8568. మధురోహలే పల్లకీలు..
కల్పించుకున్న కౌగిలిలో కాసేపలా కోల్పోయేందుకు..
8569. స్పందిస్తే సంతోషమే..
నా భావాలు నిన్ను చేరుతున్నాయని..
8570. నిరీక్షణంతా నిట్టూర్పులోనే..
ఓదార్పు కరువైన నీ వియోగంలో..
8571. మండిపడుతున్న మల్లెలు..
మనసు పంచుకోలేని క్షణాలలా కదిలిపోతుంటే..
8572. వెలిగించాలనుకున్నా వలపుని..
నీలో అనుభూతులు అడుగంటాయని తెలీక..
8573. నిరంతర ప్రవాహమవుతూ కన్నీరు..
చెదిరిపోయిన కలలను కూడగట్టలేక..
8574. ముద్దుగా నవ్వుతూ మువ్వలు..
మల్లెలతో మీటుతున్న నీవైనానికి..
8575. నిన్నటి పాటే..
రాతిరి రాగాన్ని కలగలిపి పాడుతున్నానంతే..
8576. వెన్నెల కుమ్మరించక మాననుగా..
పున్నమికై ఎదురుచూస్తూ నీవుంటే..
8577. కనుపాపల్లోనే నువ్వున్నందుకేమో..
వియోగాన్నీ సంతృప్తి పడుతూ సరిపుచ్చుకుంటున్నా.
8578. కనుపాపల్లోనే నువ్వున్నందుకేమో..
మనసులో చీకటున్నా చూపుతో వెలుగుతున్నా..!
8579. నడివేసవిలో చల్లని గాలులు..
సాయంత్రానికి రమ్మని సంకేతాలు..
8580. నీకోసం నవ్విన నవ్వే..
చెవిలో పువ్వనుకుంటూ నువ్వు..
8581. అనుభూతికలా తెర లేస్తుంది..
నీ నవ్వుల్లో చేరిపోగానే..
8582. నేనెప్పుడూ ఇంతే..
ఆనందాన్ని ఆశించి విషాదంతో ముగుస్తాను..
8583. నీ కలల కొరకెన్ని పడిగాపులో..
వేళాపాళా లేక నిద్దరోతున్నానని ఎందరంటున్నా..
8584. చూపులతో జరుగుతున్న సంభాషణది..
అనువదించుకోవడం తెలిసిన మనసులకి..
8585. విశ్రాంతే ఒద్దనిపిస్తుంది..
నీకు దూరమైనప్పుడల్లా ఏకాంతం వెక్కిరిస్తుంటే..
8586. మువ్వనై మురిసిపోతున్నా..
నీ గుండెలో రవళించేందుకు రమ్మన్నావనే..
8587. తరువుల సందేహాలు..
కిరణాల స్పర్శతో పులకింతలు పుడమికెందుకని..
8588. సన్నజాజులు రువ్విన నవ్వులనుకుంటా..
అక్కడంతా పరిమళం వ్యాపించింది..
8589. కలలోనూ విషాదమే..
నువ్విడిచిపోయిన జ్ఞాపకాలు నిదురలో కదలగానే..
8590. నమ్మకానికందని నిజం..
నీ స్వార్ధంలో ప్రాణం నిలబెట్టుకున్నానని..
8591. ఎంతకని నిరీక్షించాలో..
నీవొచ్చేలోపు నా నిట్టూర్పులు లెక్కించుకుంటూ..
8592. మనసు ముసురేసినప్పుడనుకున్నా..
కన్నీరు కురిసేందుకు కాలంతో పనిలేదని..
8593. విచ్చుకుంటున్న అధరాలు..
ఏ అద్భుతాన్ని వివరించాలో మరి..
8594. జ్ఞాపకాలకు రంగులుంటాయనుకోలా..
కన్నీరలా ఎర్రగా కురిసేంత వరకూ..
8595. ఇలా గుర్తుపడతావనుకోలా..
కల నిజమైన ఆనందాన్ని నాకందిస్తూ..
8596. నీతో నీకు దోబూచులాటెందుకో..
ఎదురైన నన్నాడమని పిలవకుండా..
8597. దీర్ఘకాలికమనుకోలా ఎడబాటు..
కవిత రాసేంత మౌనం మొలకెత్తేవరకూ..
8598. నేను తన పరిమళాన్ని..
అనుబంధమనే పువ్వుగా మారినందుకు..
8599. ఆమొక ఆకాశమెక్కి కూర్చుంది..
ఎప్పటికీ అవగతమవని అద్వైతములా..
8600. హరివిల్లైతే విరబూసిందిగా..
కురిసిన చినుకులు నాలుగే అయినా..
No comments:
Post a Comment