Tuesday, 7 March 2017

7401 to 7500

  1. 7401. స్వప్నాలు రాసినప్పుడు అనుకోలేదు..
నువ్వో అతిధిగానే మదిలోకొచ్చావని..
7402. అనుభూతినై కురవాలనుంది..
ఆరు ఋతువులకు విభిన్నంగా నీలో..
7403. ఆనకట్టలు సరిపోవా కన్నులకి..
కన్నీరు చెలియలకట్ట దాటేవేళలో..
7404. నీకర్ధమై భంగపడ్డా..
నీ అల్లోచన పసిగట్టిన ప్రతిసారీ..
7405. పుడమి పులకరించిందప్పుడే..
చినుకులు నక్షత్రాలై తనను తాకినప్పుడే..
7406. అనుభూతుల కోలాటాలు..
ఫలించిన నా వలపు తపస్సిద్ధికి..
7407. కొన్ని అనుభూతులంతే..
మనసుపొరలను నిత్యం చిలుకుతూనే నర్తిస్తాయి..
7408. నువ్వు గుర్తురావడమన్నదో అబద్ధమేగా..
మనసెప్పుడు మరచిందని ప్రశ్నించుకుంటే..
7409. కదలనంటూ అడుగులు..
ఆ దారిలోని హరితస్మృతులు ఎండినందుకే..
7410. మనసు నిద్రించడం గుర్తించలేదామె..
కన్నీటి చుక్కలను లెక్కించుకుంటూ..
7411. స్వప్నాలు చల్లుతావెందుకో..
నా మౌనంలోకి తొంగి చూసినట్లు..
7412. కన్నుల కాంతిలో కొట్టుకుంటున్నా..
నీ చూపులంతగా చుట్టబెడుతుంటే..
7413. కలలపై మక్కువయ్యింది..
సంద్రమై నీ మనసు నాతో సంగమానికి ఎదురుచూస్తుంటే..
7414. నిశ్శబ్దానికి రాగాలు కూర్చుతున్నా..
మౌనాన్ని నువ్వు ఆలకిస్తావనే..
7415. గమ్మత్తుగా మాట్లాడుతావే..
కలలోకి రమ్మనకుండానే విచ్చేసిన చొరవతోనే..
7416. నా హృదయానికి మాలిక నువ్వేగా..
తోరణముగా అలంకరించినా..అక్షరముగా రాసుకున్నా..
7417. కలుపుతున్నా కలలు..
అడుగులేసే వేళ ఏడన్నా కలిసొస్తాయని..
7418. పాఠాలవుతున్న అనుభవాలు..
మదికంటిన గాయలను నిమురుకున్న ప్రతిసారీ..
7419. చాటుపద్యాల్లో వెతుకున్నా..
నీ నానార్ధాల్లో నన్ను వర్ణించావేమోనని..
7420. కనురెప్పల తహతహలు..
నీవొస్తే కన్నుల్లో దాచేసుకుని తలుపేసుకుందామని..
7421. నీ కలల వెచ్చదనం చాలనుకున్నా..
రాతిరైతే వలపు తప్పక పండుతుందని..
7422.  కధలన్నింటినీ మరచిపోయా..
కన్నీటితో నిదురను ఆహ్వానించలేని రాతిరిలో..
7423. హేమంతంలోకి నడిపిస్తా పద..
కథలో నాతో సమంగా నీకో అనువైన పాత్రనిచ్చి..
7424. కన్నులతోనే వారిస్తున్నా పరికించి చూడొద్దని..
నీ చూపులు అలిసిపోతాయేమోననే కంగారులో..
7425. నా కన్నులనెంతగా స్వాప్నిస్తావో..
భరించలేని ఆనందాన్ని పెనవేసేందుకు..
7426. అక్షరాలతోనే లాలసనిస్తావు..
నిద్దురరాని నయనాలను జోకొట్టేందుకు ప్రయత్నిస్తూ..
7427. నీ కావ్యంలో చోటిచ్చినప్పుడే అనుకున్నా..
నేను కాక కధానాయిక మరెవ్వరుంటారని..
7428. దాచుకోక తప్పలేదు రహస్యాలు..
మనసుపొరలు అప్పుడప్పుడూ గుభాళించాలనుకున్నాక..
7429. కలిమిలో నువ్వేగా..
దూరమెంతైనా సంతోషాల సంపదలు చుట్టబెడుతూ..
7430. అనుసరించలేకున్నా నిన్ను..
కన్నీటి జలపాతంలో నన్నెప్పుడు ముంచేస్తావోననే..
7431. నీకోసం మళ్ళీ పుట్టింది నిజమే..
ఈ జన్మలోనైనా మనం ఒకటవ్వాలని..
7432. స్వరాలకీ తీపంటింది..
రాకాచంద్రునివై వెన్నెల కురిపించింది నువ్వంటే..
7433. నీ వలపు నెమరింతకే చిక్కిపోతున్నా..
తలపుల తాంబూలమేసుకొని భోజనం మరుస్తున్నందుకే..
7434. వేయిస్వరాల వసంతమొచ్చింది..
పూలధనస్సు ఎక్కుపెట్టిన మన్మధుడువై నువ్వెదురవగానే..
7435. వేయిస్వరాల వసంతమొచ్చింది..
విరహాన వేణుగానమై నీ పిలుపందగానే..
7436. చిరునవ్వులకావ్యం రాద్దామనుకున్నా..
అలుక తీర్చేందుకు నన్ను పాడావంటే..
7437. చూపులతో మంత్రించావెందుకో..
చింతకాయ పులుపుకి చెలి చురుక్కుమనేలా..
7438. కలలాపనంటూ కన్నులు..
నా కాగితంపై కవితగా రావాలనుకుంటూ..
7439. 
వసంతఋతువయ్యింది మదిలో..
నీ ఊహలు పువ్వులై వికసించగానే..
7440. స్పర్శ కోల్పోయిన మనసామెది..
అంగడిలో తనువు తాకట్టయినందుకే..
7441. నా తనువంతా వెన్నెల మరకలు..
నీ చూపుల నవనీతం కురిసినందుకే..
7442. జ్వలిస్తున్న తనువు..
ప్రణయాగ్ని రగిలించిన అధరాల అల్లికలో..
7443. పులకలు పూసిన తనువయ్యింది తానే..
నీ ఊహల పరిమళపు కిలకిలలో..
7444. ఒడిసిపడుతున్నా భావాలన్నీ..
కరిగిపోతున్న నీ మనసు నేనందుకోవాలని..
7445. మనసు మురిసిపోతుంది..
కన్నీటిబిందువులో సింధువంటి నన్ను కనుగొన్నందుకే
7446. కన్నులు నలిపినప్పుడనుకోలేదు..
మరకంటించి నీ రూపాన్ని కడుగుతున్నానని..
7447. తనువొక్కటే మిగిలిందిక్కడ..
నిన్ను వరించిన  కలల సాక్షి..
7448. తిరిగొచ్చిందిలా..
కోల్పోయిన నా నవ్వు నీ రాకతోనే
7449. కొన్ని ఎడబాట్లంతే..
జ్ఞాపకాలు ఇంద్రధనస్సులైనా రంగులు కలగలిసిపోతుంటాయి..
7450. ఆకాశంవైపే చూస్తూ కూర్చున్నా..
నీ సందేశం పూలవానై నన్ను తడిపే క్షణాలకై..
7451. ప్రమోదాన్ని గుర్తించా..
తన సమక్షంలో పులకింతలు పదివేలవగానే..
7452. ఈరోజు దీపావళి అన్నదెవరో..
నా రాకతో నీ మోము వెలిగింది ఆనాడేగా..
7453. మౌనసంకేతాలవే నా కన్నులవి..
మదినిరీక్షణ నిన్ను చేరాలనుకున్నవేళ..
7454. నీ తలపుతోనే ఊగింది మది..
సిగ్గుపూలు సీతాకోకలై బుగ్గలు మీటగానే..
7455. నీ కళ్ళైతే అయస్కాంతాలేగా..
ఏవైపునున్నా నన్నిట్టే ఆకర్షిస్తూ..
7456. గుండె లోపలికి తొంగి చూసినప్పుడనుకున్నా..
నిన్నాపగలిగే చెరసాలేదీ నాలో లేదని..
7457. ప్రతీక్షణలో నేనుండటం నిజమే..
మధురోహాలూరించి నువ్విలా మాయమవుతుంటే..
7458.తనే నేనైన ఉనికంటే అదేగా..
పూలతీగేదో అల్లుకున్నట్లు పరిమళిస్తుంటే మేనంతా..
7459. మాలికగా మారిన వేదనది..
నా వాక్యంలో ప్రవహిస్తానంటూ..
7460. నిశ్శబ్దమెందుకో నవ్వుతోంది..
ప్రతిక్షణమూ తన నిశ్వాసలో జ్వలిస్తున్న నన్ను చూసి..  
7461. ప్రేమెందుకో పెరిగిపోతుంది..
నిన్ను చూసిన క్షణాల మహిమనుకుంటా..
7462. కనిపించని తిరుగుబాట్లే ప్రతిచోటా..
ఆకాశంలో అంధకారాన్ని తరిమేయాలనుకుంటూ..
7463. నా భావాలను వెంటాడుతున్నావెందుకో..
నీ గుండె బలహీనమయ్యిందంటూనే..
7464. అమరమైపోయా నేనే..
అమృతమంటి నీ హృదయాన్ని అవలోకించినందుకే..
7465. చీకటిలో నిలబడ్డప్పుడనుకోలేదు..
సంతోషాలు నన్నిడిచి వెలుగును వెతుక్కున్నాయని..
7466. మరో జన్మనెలా ఎత్తగలనో..
నీ ప్రేమాగ్నికిలా దగ్ధమవుతుంటే..
7467. కన్నీరు చూసి కలత పడుతున్నా..
కాగితంపై ఒలికితే అక్షరం చెరుగుతుందని..
7468. నవ్వడం తప్ప తెలీదు నాకేదీ..
నీ తలపుల్లోకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడల్లా..
7469. నానార్ధాల నీ గడుసుదనం..
ఏకాకితనాన్ని ఒంటరిగా వెలివేస్తూ..
7470. మనసు గుమ్మెత్తినప్పుడే అనుకున్నా..
విరహానికి విరామమిచ్చే వేళయ్యిందని..
7471. హేమంతంలోనూ వసంతాన్ని చూడగలవుగా..
గ్రీష్మపత్రాలపై సందేశాలు రాస్తున్నావంటే.. 
7472. రాత్రి వృధా అయినప్పుడే అనుకున్నా..
పున్నమి కోసం ఆకాశానికేసి చూస్తున్నావని..
7473. ఆనందం పుట్టిందందుకే..
అనుభూతులే ఆత్మీయతా కానుక చేసావని..
7474. ప్రేమకు ప్రాయశ్చిత్తమదేనేమో..
ఊహలకు ఉరేసి వాస్తవంలో జీవించడం.. 
7475. దుఃఖసాగరంలో మునుగుతున్నానిక్కడ..
ప్రేమకు అనారోగ్యమంటూ ప్రాణం తీస్తుంటే..
7476. ఊహాగానాలు వినబడ్డప్పుడే అనుకున్నా..
నీ మనసు కోయిల పాడిన పాట నాకోసమేనని..
7477. తలపుల్లోకొచ్చి చేరానప్పుడే..
పంచాంగంలో శుభమూర్తమేదీ లేదని నువ్వంటున్నా..
7478. వసంతం తిరిగొచ్చింది..
నీ రాకను ఏ కోయిల పాడిందో మరి..
7479. యుగళగీతమై వినబడుతోంది..
నీ మౌనం ఆలపించిన భావమనేమో..
7480. పెదవంటింది నీ ముద్దులతడి..
సడిచేయని అనురాగానికి లోబడి..
7481. ఒంటరినని అంటున్నదెవరో..
తన తలపుల సాహచర్యపు మధురిమను పెనవేస్తూ నేనుంటే..
7482. జీవితపు బరువు తెలుస్తోందిప్పుడే..
అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు ఒంటరినైనప్పుడు..
7483. నేనొచ్చింది నిజమే..
నెమలికన్నులతో నాకోసం ఎదురుచూస్తూ నువ్వుంటావని..
7484. ఆ కళ్ళెప్పుడూ మడుగులే..
ఎర్రకలువలు పూసేందుకు ఎదురుచూపులన్నట్లు..
7485. మనసప్పుడే నిండింది..
మధురస్వప్నం నిజమై మమత ముడిపడగానే..
7486. జీవితం స్వప్నమే ఇప్పుడు..
నువ్వు కనుమరుగై నేనొంటరైనందుకు..
7487. జీవనతరంగాల మిలమిలలు..
ఒడ్డున నిలబడి ఆకర్షిస్తుంది నువ్వైనందుకే..
7488. శ్వాస మీద ధ్యాస..
వెలుగు తరంగాల లాలస
7489. పున్నాగనై పెనవేయలేనా..
జతజావళిగా నన్నే నువ్వు కోరుకుంటే..
7490. తన్మయత్వానికి తలుపులేస్తున్నా..
ముద్దులసద్దుకి మేలుకొనేవారుంటారని..
7491. గతంలోకి తొంగిచూస్తున్నా ఇన్నాళ్ళకి..
అవగతం కానిదేదో మిగిలిపోయిందేమోనని..
7492. మధురభావాల మాలికతో నేనొచ్చేసా..
పెదవుల్లో ఇంద్రధనస్సు గుర్తిస్తావనే..
7493. మధురిమను పెంచుకున్న నా పేరు..
నీ ప్రేమలేఖలో తొలిపదముగా చోటివ్వగానే..
7494. తీపెక్కినప్పుడే అనుకున్నా..
పెదవంటేందుకు మధుపమై విచ్చేసింది నువ్వేనని..
7495. జీవనదులేమో కొన్ని జ్ఞాపకాలు..
మనసుదాహాన్ని తీర్చేందుకే ప్రవహిస్తున్నట్లు..
7496. చెలిమిలో సౌఖ్యమదే..
చింతలన్నీ చిటికెలో సమాధి చేసేస్తూ..
7497. ఎప్పుడు లయమయ్యిందో రాధ..
ఆరాధనై మోహనవంశీని ఆకర్షించిందిగా
7498. అందని నువ్వు ద్రాక్షవే అప్పుడు..
అందిన ఆనందం లోకువే ఇప్పుడు..
7499. అనితరసాధ్యాన్ని ఊహిస్తున్నా..
నాకోసం నువ్వు రెక్కల సాయమర్ధిస్తుంటే..
7500. వెన్నెలపై మరకలైనప్పుడనుకున్నా..
నీ హృదయం చిదుముకున్న ఆనావాళ్ళేనని..

7301 to 7400

7301. ఎన్నెన్ని భావాలో..
మూసిన రెప్పలపైనా లిఖించమని చేరువవుతూ..
7302. పదివేల స్మృతుల కల్లోలాలు..
నిశ్శబ్దాన్ని దరిచేరనివ్వని ఏకాంతంలో..
7303. కనిపించని అందాలెన్నో నాలో..
ఒక్కోరాగం తుళ్ళింతగా వర్ణిస్తుంటే
7304. గమ్మత్తైన అనుభవాలెన్నో..
భావానికందని ఆనందంలో మదిని ముంచేస్తూ
7305. మల్లెలకెందుకో కేరింతలు..
కురులారబోసుకుంటున్నది నేనైతే..
7306. కలలు బరువైన కన్నులట..
రేయైనా నిద్దురపోనని మారాంచేస్తూ..
7307. కన్నులు మాట్లాడుతాయనిప్పుడే తెలిసింది..
నా మౌనాన్ని ప్రశ్నిస్తున్నందుకు
7308. అలుకను ఎరగా వేయాల్సొస్తోంది..
నా కాటుకనప్పుడైనా గమనిస్తావని..
7309. మల్లెల పరవశమదేమో..
కురులను చేరి నీ మదిని మీటాలనే ఆరాటంలో..
7310. మల్లెల్లో సగపాల్లెందుకో..
సరిగమలు పాడుతున్నది నా పెదవులైతే..
7311. మల్లెలకెంత ముచ్చటో..
ఎంకీనాయుడి సరసాల్లో తనకీ చోటిస్తే..
7312. మల్లెల అత్తర్లు మదిని మీటినవనుకున్నా..
నీ గులాబీ మాటలకు లొంగిపోతూ..
7313. తలపులకెప్పుడూ తడబాటే..
నిశ్శబ్దంలో నీవొస్తే చిలిపిదనాన్ని తట్టుకోలేనని..
7314. ముద్దులు కరువైన మురిపాలు మనవి..
హద్దులు ఎక్కువైన ఏకాంత వెన్నెల్లో..
7315. నా శ్వాస వేగం పెరిగింది..
నీ గుండెచప్పుడు గుట్టుగా నన్నల్లగానే..
7316. మానవత్వం పరిమళిస్తుంది..
చెక్కు చెదరని నీ మాటలతోనే..
7317. నీ మనసెందుకు వశం తప్పిందో..
శిల్పాకృతిగా ఆకర్షిస్తుంది నా తనువైతే..
7318. తలపుల వీణొకటి మ్రోగిందలా..
నీ విరహపుసడి చేరేయాలనేమో..
7319. విడిపోడాలుండవ్..
ఒక్కసారి మనసులంటూ ముడిపడ్డాక
7320. విషాదమే జీవితమెప్పుడూ..
మనసు దాహాన్ని కన్నీటితో తీర్చుకుంటూ..
7321. నీ మనసుకెప్పుడూ తొందరెక్కువే..
మదనుడిగా నిన్ను పరిచయించేందుకు..
7322. ముకుళించిన మొగ్గగానే మిగిలిపోయా..
పరవశ మౌనాన్నీ పట్టుకోగలవనే..
7323. నీ కధిప్పుడు నాదే..
నా కల్లలన్నింటా నువ్వున్నందుకు..
7324. ఎరుపుదనమంటే నీకు మక్కువనుకున్నా..
పచ్చదనంపై దాడి చేస్తుంటే
7325. గుడంటే అంతే..
ఇచ్చేవాడ్ని కొనియాడుతూ అడుక్కునే జనాలతో..
7326. వెనుదిరిగే ఓటమికే తెలుసు..
గెలుపుతో ముందడుగు వేయడమెలాగో..
7327. ఆకాశాన్ని పరికిస్తున్నా..
రెక్కలు వాలిపోకుండానే జయకేతనాన్ని ఎగరేద్దామని..
7328. మౌనానికెన్ని మాటలొచ్చాయో..
నీ కళ్ళొక్కసారి నవ్వుల విందివ్వగానే..
7329. హృదయపు తలుపులు మూసుకుంటావెందుకో..
రమ్మన్న ఆహ్వానం మరచిపోయినట్లు..
7330. మమకారమే నీది..
అక్షరాలను కూర్చి మనసుతెరలు తొలగించింది..
7331. విషాదపు కొసనే నిలబడున్నా..
వియోగమడ్డొచ్చి మౌనాన్ని లెక్కిస్తుంటే..
7332. కన్నీటిబొట్టు ఆనందభాష్పమయ్యింది..
తను ప్రేమన్నాకే..
7333. వాళ్ళూ మనుషులే..
ఆదరించి ఆసరానిచ్చే చేతులు కరువయ్యాయంతే..
7334. రైలు కూతేసినప్పుడల్లా అనుకుంటున్నా..
జీవించేందుకు ముహూర్తం కుదురుతుందేమోనని..
7335. పరువానికి పరుగాపాలనుందట..
యవ్వనాన్ని కరిగేలోపు కాస్తైనా ఆస్వాదించాలని..
7336. కలలు..
నేనెప్పుడూ తప్పిపోవాలనుకొనే నీ లోగిలి..
7337. ఎప్పుడూ గెలవాలనే అనుకుంటా..
నిద్దురను దోచేసే విషయంలో..
7338. వియోగం మాయమయ్యింది..
కోరినట్లే ప్రతిరాత్రి కలలో నువ్వొస్తుంటే..
7339. కెరటానికదో ఓదార్పు..
తీరం చేతిస్పర్శలో దొరికే ఉల్లాసం..
7340. నీ ప్రతిమాలికలోనూ అనురాగమే..
ఏ రాగం గుప్పించావో..
7341. రెప్పల వాకిళ్ళలో నే నిలబడున్నా..
ఒక్కమారు విచ్చి నన్ను  చూస్తావనే..
7342. నింగినీ నేలనూ కలిపేందుకేమో వానొచ్చింది..
నువ్వూనేనూ కలిసేందుకే అద్భుతం జరగాలో..
7343. నేనేగా వానవిల్లు..
నువ్వు కోరిన రంగులన్నీ నింపుకున్నాక..
7344. నీ పెదవులకు వానాకాలమొచ్చిందేమో..
ముద్దులుగా కురిసేందుకు సిద్ధమవుతోంది..
7345. అతనో కొంటెకృష్ణుడే..
మాయచేసి అతివల హృదయాల్ని కొల్లగొడుతూ
7346. సహజత్వానికి సువాసనెందుకు..
నవ్వుల పువ్వులకే మనసులు మమేకమయ్యేప్పుడు
7347. వేకువకెంత తొందరో..
కలలు కనుమరుగు కాగానే మేల్కొల్పుతూ..
7348. దారం ఆధారమయ్యింది..
వాడిన పువ్వు అస్తిత్వపు పరిమళాన్ని లోకానికి పంచేందుకు.. 
7349. మనసిరిగిపోయింది..
అడక్కుండానే జీవితంలోకొచ్చి చెప్పకుండానే మరలినందుకు
7350. జ్ఞాపకాల వెలుగులు..
చీకటి జీవితానికి రంగులద్దాలనే ఆరాటంలో..
7351. అదే వెన్నెల..
ప్రేమ లాహిరిలో ముంచుతోంది నన్నిలా..
7352. అంతరంగాల వంతెన..
కొలవరాని దూరాన్ని మనసుతో కలిపేందుకలా..
7353. ఆగనంటూ వాన..
మనసు నిండేవరకూ కురుస్తానని మాటిచ్చినందుకు..
7354. ఆకాశమంత వాన..
అంతమైన ప్రేమ విషాదపు రోదన..
7355. నీ తలపు స్వప్నాలు..
నాలోని వలపు మౌనాలు..
7355. నీ తలపు స్వప్నాలు..
వేకువల వెన్నెల విచిత్రాలు..
7356. నీ తలపు స్వప్నాలు..
నా వియోగాపు వీడ్కోలు..
7357. సంతోషం సగమయ్యింది..
మనసుకెప్పుడూ విషాదాన్నే రుచి చూపుతుంటే..
7358. భావాలకు మౌనమంటింది..
విలవిలలాడిన హృదయం వెతలను కౌగిలించగానే..
7359. పరిమళించక తప్పవుగా..
జ్ఞాపకాలను మనసుపొరల్లో మల్లెలుగా దాచుకున్నాక..
7360. ఓడి గెలిచా..
నన్ను నీకు అర్పితం చేసుకొని..
7361. నా మస్తకంలో నిన్నే నిలుపుకున్నా..
మది పుస్తకంలో ముఖచిత్రం నీదుండాలని..
7362. కన్నుల్లో బొమ్మగానే మిగిలావు..
వాస్తవంలో వియోగాన్ని వాటేసి..
7363. ఎన్ని భాష్పాలని చిందించాలో..
జీవితపు చెమరింపు తీరాలంటే..
7364. కాలాన్ని పట్టించుకోలేదు..
కన్నీరు ఖర్చైపోతుందనే బాధలో మునిగిపోతూ..
7365. గారాల నవ్వులకు కొదవేముందిలే..
అలుకకో బహుమతి నువ్విచ్చాక..
7366. ఎన్ని ఊసులు మూటకట్టావో..
రెప్పలమాటు రహస్యాలను కుదిపి..
7367. వెన్నెలను కలగంటున్నా..
నీ వియోగంలో పున్నమని మరచిపోయి..
7368. కొన్ని బతుకుల్లోనంతే..
కడుపులోని కన్నీళ్ళు కళ్ళల్లోకి కొట్టుకొస్తుంటాయెప్పుడూ..
7369. రెక్కలిప్పింది మనసు..
నీ శృతిలయలోని తమకమొచ్చి తడమగానే..
7370. ముద్దులతోనే రవళిస్తావు..
మాటలేమో వద్దంటూనే
7371. మనసుకదో పులకింత..
ఆకాశమై తనలో నువ్వలా విస్తరించగానే..
7372. మౌనమిలా నవ్వుకుంది..
తన రాగంలో సన్నాయిగా నువ్వినిపిస్తుంటే..
7373. మనోమాధుర్యమేనది..
నీ తలపు పరిమళమై నన్నల్లుకుంది.
7374. తొందరెక్కువే నీ భావాలకు..
మాలికగా నన్ను వర్ణించాలనేమో..
7375. పుష్యమిపువ్వునై నేనొచ్చేసా..
నీ పూజలో ప్రత్యేకంగా నేనుండాలని..
7376. ఒక్కోసారి తలొంచుకొని నడవక తప్పదు..
అనుబంధాల్లో సుడిగుండాలు సహజమని తెలిసాక..
7377. అసిధారావ్రతమెన్నిసార్లు చేయాలో..
నాకు నేను అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు..
7378. రాతిరి నవ్వుతోంది..
నక్షత్రాలను కలగంటున్న నన్ను చూసిందేమో..
7379. ఉడుకెక్కువయ్యింది మనసుకి..
నీ నిర్లక్ష్యంలో తనను చేర్చావనే..
7380. అందమంటే అంతరంగమేగా..
చూసే హృదయానికి కళ్ళుండి తిలకించాలంతే..
7381. మూసిన కన్నుల్లో నువ్వే..
ఊహల్లో రాగమై నివశిస్తూ..
7382. కాశీలో వదిలేసా మౌనాన్ని..
శబ్దాలంకారమేదో నీకు చూపిద్దామనే..
7383. తన్మయత్వం నాకిష్టమే..
నీ జ్ఞాపకాల ప్రవాహంలో నే మునిగిపోతున్నా సరే..
7384. రసఝరిలో మునిగినట్లుంది..
ఆగకుండా కురుస్తున్న వర్షాన్ని వశీకరిస్తుంటే..
7385. స్మృతుల పరవళ్ళు..
కురుస్తున్న వానకు కన్నీరు ఏరవుతుంటే..
7386. చిగురించడం నిజమేగా..
పరవశాల ప్రతి చినుకులో జీవముందంటే..
7387. చదివేకొద్దీ చదవాలనిపించే పరవశాలే కొన్ని..
జడలు కట్టిన ఆనందాలుగా అల్లుకుపోతూ..
7388. అందుకోక తప్పలేని అవకాశం..
అకలాపుకుంటే అవసరం తీరదని..
7389. నవ్వులన్నీ నీకిచ్చేసా..
నీ మనసు నాకిస్తావనే స్వార్ధంతోనే..
7390. రెప్ప వేయడం మానేసా..
నా కన్నుల్లో నీవున్న కాంతి ఎప్పటికీ దూరమవరాదనే..
7391. గుండెల్లోనే గూడేసుకున్నా..
నీవొస్తే ఆశ్రయం కల్పించేందుకు మనసుందనే..
7392. పిలుపులకే పరవశమవుతావే..
పల్లవించేందుకు నేను పాటను సిద్ధంచేస్తుంటే..
7393. నటించడం పరిపాటయ్యింది..
అంతరంగస్థలంలోనూ జీవితం చప్పట్లనే కోరుతుంటే..
7394. చెదిరిపోయిన స్వప్నమొకటి..
వేకువ తెరలేపి కిరణాలు మెరవగానే..
7395. కురుస్తున్న ఆకాశం ఆగిందక్కడ..
ప్రకృతి పులకరింపు వశీకరించినందుకే..
7396. మౌనాన్ని చెరదగొడుతూ నా కనురెప్పలు..
మదిలో రాగాన్ని ఆలకించమని వేడుకుంటూ
7397. కురిసింది పూలవాన తొలిసారి..
చీరొకటి ఉయ్యాలగా మారగానే..
7398. అజరామరమే అనురాగం..
నా జ్ఞాపకాల్లో నువ్వున్నంత కాలం..
7399. నువ్వు చూడని నవ్వులేమున్నాయి నాలో..
భావవాహినిగా కదిలేది నేనేగా నీలో..
7400. జ్ఞాపకాలకి పరిమళమిచ్చింది నువ్వే..
వియోగించినా మదివీడలేని తలపులనిచ్చి..