6401. నీ ఊపిరి తడిమితే చాలనుకున్నా..
నా మనసు వెచ్చబడటం తెలుస్తుందని..
6402. ధ్యానిస్తున్నా..
నా జీవనమింక నీదేనంటూ..
6403. సహచరించడమప్పుడే నేర్చుకున్నా..
నేనే రాధనై నిన్నో మాధవునిగా మదిలో భావించుకున్నాక..
6404. నా గుట్టు నీకెరుకేగా..
నీ పట్టు చిక్కిపోయాక..
6405. నీ భావాల వరదలాంటిది..
నన్నో సంద్రమై ముంచేస్తూ..
6406. అనుబంధానికి అర్ధాలు వెతుకుతున్నా..
ఊహల్లోనూ అనుమానాలే హోరెత్తుతుంటే..
6407. నీ తలపు కిరణాలతోనే వెలుగుతున్నా..
నీ నిరీక్షణలో మనసెంత నిశీధిలోనున్నా..
6408. వర్షం పడితే ఏమోననుకున్నా..
సిరివాన కురిపించావని కనిపెట్టలేక..
6409. నీ వలపు వెచ్చదనం తెలిసిందిప్పుడే..
కలల పరిష్వంగంలో నేను చేరిపోగానే..
6410. నిన్ను వెంటాడే స్వరమెప్పటికీ నాదేగా..
మరొకరిని నువ్వు అభిమానించకుండా ఉంటే..
6411. నా కన్నీటి బిందువులు అద్దాలయ్యాయి..
నీ రూపుని మసకేసి చూస్తున్నప్పుడల్లో..
6412. సప్తపదులు కలిసి వేస్తేనేమి..
నడవడికలో మార్పు స్పష్టమయ్యాక..
6413. ఎప్పుడాగిపోతుందో తెలియంది గుండె..
నువ్వు చూపుతున్న అలక్ష్యానికి.
6414. వలపు చిగురించిందప్పుడేగా..
నీ ప్రేమొకటి తొలకరిగా కురవగానే
6415. కనుమరుగైన సంతోషం..
నా జీవితమంతా అమాసకే అంకితమవుతుంటే
6416. కలల కౌగిలిలోనే సూర్యోదయం..
నిద్దుర లేచేలోపే పొద్దుపోతుంటే..
6417. హృదయాన్ని వెలిగించింది ప్రేమేననుకుంటా..
సమస్తమూ కాంతివంతమై మెరుస్తుంటే..
6418. లోకులెందరు కనిపెట్టారో నిన్ను..
కన్నుల్లో దోబూచులాడొద్దంటే వినవుగా..
6419. చిత్తడయ్యింది మది..
అనంత జలరాశి నీలా కురిసినందుకే..
6420. అదేమానందమో మరి..
అంతరంగాన్ని గిచ్చి సంతోషపడుతూ కొందరు..
6421. నీకోసం ఎన్ని జన్మలెత్తాలో..
ఎప్పటికి నన్నుగా గుర్తిస్తావోననుకుంటూ..
6422. గుండెలో గుడిగంట మోగినట్లుంది..
నీ ఒక్క మాట అణువణువులో ప్రకంపనాన్ని రేపుతుంటే..
6423. మౌనంలోనూ మీటుకుంటున్నా..
అంతర్నాద స్వరాలు నిన్ను పలుకుతాయేమోనని..
6424. నేనో అనురాగ సంకేతాన్ని..
మేఘాలతోనే సందేశాన్ని నీకంపేస్తూ..
6425. ఊపిరిలో బంధించినా నాకదృష్టమే..
నీ అనుభూతిలో నిండిపోవాలనుకున్నాక..
6426. మేఘానికి చినుకై జారక తప్పలేదు..
తనకై అవని ఎదురుచూస్తుందని తెలిసినందుకు..
6427. కాలమూ.. కనికరమూ నాకెందుకులే..
నీ జ్ఞాపకమైతే చాలనుకున్నాక..
6428. హృదయపు కాంతి కన్నులకిచ్చింది..
భాష్పంగా రాల్చేస్తుందని తెలీక..
6429. చిరునవ్వు చెక్కిన ముఖమేగా నీది..
చెదలు సైతం ఆరగించేందుకు వచ్చాయంటే..
6430. వేసవిరాత్రిలోనూ చలి పుట్టిస్తావు..
నా శ్వాసలను పైకంపేస్తూ..
6431. నేనెప్పటికీ నీ ఆనవాలునే..
మట్టిలో కలిసి శిధిలమయ్యేవరకూ..
6432. నిన్ను గుర్తుపడుతున్నది అందుకేగా..
ఎల్లలు దాటిన ప్రేమున్నందుకేగా..
6433. ఆశల సంచిలో వెతుక్కున్నా..
నీ చేతివ్రాతను తడుముకోవాలని..
6434. అశాంతిలోకి జారింది మది..
స్మృతులు గాయాన్ని రేపుతుంటే..
6435. నీ తలపుల మెరుపులే అవన్నీ..
నాలో కాంతిలహరులై చూపును వెలిగిస్తూ..
6436. కాటుక కళ్ళ విరహం కనిపెట్టావేమో..
మకుటంగా నన్ను రాయడం మొదలెట్టావు..
6437. పలుకరించావనే పులకరించాను..
కొసమెరుపుగా నన్ను దూరం చేసావు..
6438. నీరెండల్లో నా తోడయ్యావు..
మెరుపుచురకల నుండీ రక్షించి.
6439. మృదంగమవ్వాలి నీ మది..
నేనోసారి తిరిగి నర్తించాలంటే..
6440. కొసరికొసరి చూసిందెప్పుడు గమనించావో..
ఆరాధించింది నిన్ను కల్లోనైతే..
6441. కురిపించింది జల్లుగా ప్రేమనంతా..
మన స్వప్నాల రంగులు సౌందర్యం చేసి వెదజల్లేలా..
6442. మేమెప్పుడూ ఒకరికొకరమే..
వెన్నెలా చీకటిగా విడిపోయి కనిపిస్తున్నా..
6443. రెక్కలు కట్టుకునెగిరిందట..
నవ్వితే మనసుకి లోకువైపోతాననుకొన్న ఆనందం..
6444. ప్రేమమయమేగా జగతి..
దయాగుణమే అంతర్లీన సౌందర్యమై మనలోనుంటే..
6445. మిణుగురై మెరిసింది ఆనందం..
అవకాశం వరించింది నన్నేనని..
6446. కవితాత్మ పెనవేసిన అక్షరాలవి..
పువ్వులను పెనవేసిన తావిలా..
6447. చైతన్యమొకటి చెలరేగింది..
కల నిజమై కపోతముగా నవ్వుతుంటే..
6448. ఆత్మహుతి చేసుకున్న సత్యమొకటి..
అబద్దమొచ్చి ఆదర్శాన్ని స్రవించినందుకే..
6449.మలుపు తిరిగే అవసరమేముంది..
గమ్యం ఎదురుగా కనిపిస్తుంటే..
6450. వివశమై విరబూసింది రాధ..
వేణునాదపు ఊపిరి గిలిగింతలకే..
6451. స్వప్నాల పరిధులు దాటి సాగని జీవనం..
ఊపిరిబిగపెట్టి తనను తానే నిలువుతద్దంలో చూసుకున్నట్లు..
6452. ఆలోచనలకెప్పుడూ సరికొత్త ఆకృతులు...
అప్పుడేగా కవిత్వానికా అనుభూతులు..
6453. నీ మదిలో కురిసిన వెన్నెలనే..
చీకటి చేరనివ్వని అమాస రాతిరిలో..
6454. ఆరంభమైన ఆనందమొకటి..
ఆచరణలోని అవరోధాల్ని అంతం చేస్తూ
6455. నేనో నిమీలితనే..
నీవో తుమ్మెదనై మకరందాం గ్రోలేవేళ..
6456. కాలావధుల్ని కరిగించాలేమో..
నీ చేత బాల్యానికి పరుగుపెట్టించాలంటే..
6457. ఆనకట్టే కాటుక..
నలుగురి దృష్టీ నాలోని నీ దరికి చేరనివ్వకుండా..
6458. పొగిలిపొగిలి నవ్వుతున్నా..
పరిమళాన్ని కాజేసేందుకే ఎదలో చేరుతున్నావని..
6459. వసంత రెక్కలను తగిలించుకొస్తున్నా..
నీ ఊహలతెమ్మెర నేనవ్వాలని..
6460. సూర్యోదయాన్ని గమనించు..
వెలిగే వేకువను నా మదిలోంచి..
6461. ఊయలయ్యింది హృదయం..
నువ్వు చెప్పే వెన్నెల ఊసులకు..
6462. సరసోదయాలే కావాలి నీకన్నీ..
కన్నులు తెరవని వెన్నెల్లో..
6463. విరహోదయంలోనే ఉంటావెందుకో..
నీకన్నా గంటముందే నే మేల్కొన్నా..
6464. చీకటి కళ్ళకు వెలుగు తెలిసింది..
మసకవెన్నెల్లో నీ కవిత కదలగానే..
6465. గోరువెచ్చని ఊపిరింకా తెలుపుతోంది..
పెదవుల ఆర్తింకా తీరలేదని..
6466. పెల్లుబుకుతూనే ఉంది కన్నీరింకా..
ప్రేమొక మోసమని గుర్తొచ్చినప్పుడల్లా..
6467. కల్లోకి రానివ్వలేదని కంగారెందుకు..
ఊహల్లోని వెన్నెలంతా మనదయ్యాక..
6468. కానుకగా పుచ్చుకున్నందుకేమో కన్నీరు..
ఓదార్చుతూనే ఉంది మనసునింకా..
6469. ప్రేమను పంచుకొనే మనసొకటి కావాలి..
మదిలో ప్రకంపనను సుస్వరముగా మార్చేలా..
6470. కలిసే అడుగేద్దాం రా..
అంతరాల వారధిని నిర్మించేలా..
6471. అప్పుడే చేరావుగా నాలో..
నీ గమనం మార్చేసుకొని..
6472. నీ గుండె బరువెంతో తెలిసింది..
రాలిపడ్డ నక్షత్రాలను తేలికగా మోసాక..
6473. గుండె గతుక్కుమనేలాగుంది..
ఇన్నిసార్లు నువ్విలా తలపును తడుతుంటే..
6474. వలపు రాయకుండా వెళ్ళొద్దన్నానందుకే..
మోహం మాలికైతే చూడాలనే..
6475. అడుగులు కదిపానందుకే..
మల్లెలబాటలో నన్ను నడిపించగలిగేది నువ్వేనని..
6476. యుద్ధాలే మానేస్తా..
నిన్ను గెలిపించకపోయినా నువ్వే విజేతవని..
6477. మోహమాధుర్యంలో హద్దులెందుకో..
పొద్దుల్లో ముద్దులకు పద్దులు రాయలేమంతే..
6478. ఛాదస్తానికే ఉరేయొచ్చుగా..
మనసుకి కాస్త సరదాలు పంచిస్తూ..
6479. ప్రేమెక్కువైతే మదికిబ్బందే లేదు..
తక్కువైతే నష్టపోయేది నువ్వేగా..
6480. సగపాల్లో సర్దుకోవచ్చులే..
సంధ్యల్లో ఆరాటాలన్నీ మలిపొద్దుకి దాచుకొని..
6481. వదిలించుకోవాలనే చూస్తావెందుకో..
కన్నుల్లోనైనా కొలువుందామని ప్రేమగా నేనొస్తే
6482. వేకువ వెన్నెలై విచ్చేయాలనుకున్నా..
పువ్వులు మువ్వలై పలుకరించగానే..
6483. నీ అడుగులను అనుసరించి నడుస్తున్నా..
మువ్వల ప్రేరణిచ్చి ముందుకు నడిపించాలనే..
6484. అతిశయించింది అనుభూతి..
అనురాగాన్ని నువ్వాలకించి అక్షరాలను బదులిచ్చావని..
6485. ఊయలూగుతున్న మబ్బులు..
నా హృదయాన్ని అనుకరించాలనే క్షణాలలో..
6486. ఎందుకలా గిరి గీస్తావో..
పంచుకున్న ప్రణయాన్ని మరచినట్లు..
6487. చీకటివెలుగుల్లో చిక్కింది మది..
వెలుగునీడల్లో..వెలుగునే కోరుకున్నా..
6488. మౌనవాటికలో మురిసిపోతున్నా..
నీ శ్వాసలలోని తాదాత్మ్యత నేనవుతుంటే..
6489. నీ భావాలకు బంధీనైపోయానందుకే..
అక్షరలక్షలతో ప్రదక్షిణలు చేసినందుకే..
6490. మునుపు శిలనేగా..
నీ ఎదలో శిల్పమై పూజలందుకొనేవరకూ..
6491. కలలు కనడం తగ్గించావేమో..
ఊహాల్లో నాకు చోటిచ్చినందుకు..
6492. ఖర్జూరతోటల్లోనే సేద తీరాలనుకుంటా..
అధిక తాపానికి తట్టుకోలేకుంటే..
6493. ప్రతిరోజూ మెలకువప్పుడే వస్తుంది..
మనసైన నీ మోము రెప్పల వాకిట్లో తారాడినప్పుడే..
6494. వలసపోయే సమయం ఆసన్నమయ్యిందేమో..
జీవితమక్కడ చితికి చచ్చిపోయేలా..
6495. పులకరింతలు చేసా పలకరింపులన్నీ..
పలవరింతలుగా నన్ను తాకాయనే..
6496. విశాలమైనట్లనిపిస్తోంది మది..
నీ ఊసులను నెమరేసుకొని ఆస్వాదించేకొద్దీ..
6497. ఆ కలలో పెదవి విప్పినందుకేమో..
ఈ మదిలో వెన్నెల కురిసినట్లయ్యింది..
6498. చూపులతోనే పల్లవించే భావం నాది..
నీ కన్ను ఓదార్పుగా తాకినా..
6499. చిత్తభ్రాంతలాగే మిగిలిపోయింది..
కన్నీరంతా కరిగి కళ్ళు ఎండిపోయినా..
6500. మనసుకి గారాలు నేర్పింది నువ్వేగా..
నా అలుకలకు అనునయాలు పాడిపాడి..
నా మనసు వెచ్చబడటం తెలుస్తుందని..
6402. ధ్యానిస్తున్నా..
నా జీవనమింక నీదేనంటూ..
6403. సహచరించడమప్పుడే నేర్చుకున్నా..
నేనే రాధనై నిన్నో మాధవునిగా మదిలో భావించుకున్నాక..
6404. నా గుట్టు నీకెరుకేగా..
నీ పట్టు చిక్కిపోయాక..
6405. నీ భావాల వరదలాంటిది..
నన్నో సంద్రమై ముంచేస్తూ..
6406. అనుబంధానికి అర్ధాలు వెతుకుతున్నా..
ఊహల్లోనూ అనుమానాలే హోరెత్తుతుంటే..
6407. నీ తలపు కిరణాలతోనే వెలుగుతున్నా..
నీ నిరీక్షణలో మనసెంత నిశీధిలోనున్నా..
6408. వర్షం పడితే ఏమోననుకున్నా..
సిరివాన కురిపించావని కనిపెట్టలేక..
6409. నీ వలపు వెచ్చదనం తెలిసిందిప్పుడే..
కలల పరిష్వంగంలో నేను చేరిపోగానే..
6410. నిన్ను వెంటాడే స్వరమెప్పటికీ నాదేగా..
మరొకరిని నువ్వు అభిమానించకుండా ఉంటే..
6411. నా కన్నీటి బిందువులు అద్దాలయ్యాయి..
నీ రూపుని మసకేసి చూస్తున్నప్పుడల్లో..
6412. సప్తపదులు కలిసి వేస్తేనేమి..
నడవడికలో మార్పు స్పష్టమయ్యాక..
6413. ఎప్పుడాగిపోతుందో తెలియంది గుండె..
నువ్వు చూపుతున్న అలక్ష్యానికి.
6414. వలపు చిగురించిందప్పుడేగా..
నీ ప్రేమొకటి తొలకరిగా కురవగానే
6415. కనుమరుగైన సంతోషం..
నా జీవితమంతా అమాసకే అంకితమవుతుంటే
6416. కలల కౌగిలిలోనే సూర్యోదయం..
నిద్దుర లేచేలోపే పొద్దుపోతుంటే..
6417. హృదయాన్ని వెలిగించింది ప్రేమేననుకుంటా..
సమస్తమూ కాంతివంతమై మెరుస్తుంటే..
6418. లోకులెందరు కనిపెట్టారో నిన్ను..
కన్నుల్లో దోబూచులాడొద్దంటే వినవుగా..
6419. చిత్తడయ్యింది మది..
అనంత జలరాశి నీలా కురిసినందుకే..
6420. అదేమానందమో మరి..
అంతరంగాన్ని గిచ్చి సంతోషపడుతూ కొందరు..
6421. నీకోసం ఎన్ని జన్మలెత్తాలో..
ఎప్పటికి నన్నుగా గుర్తిస్తావోననుకుంటూ..
6422. గుండెలో గుడిగంట మోగినట్లుంది..
నీ ఒక్క మాట అణువణువులో ప్రకంపనాన్ని రేపుతుంటే..
6423. మౌనంలోనూ మీటుకుంటున్నా..
అంతర్నాద స్వరాలు నిన్ను పలుకుతాయేమోనని..
6424. నేనో అనురాగ సంకేతాన్ని..
మేఘాలతోనే సందేశాన్ని నీకంపేస్తూ..
6425. ఊపిరిలో బంధించినా నాకదృష్టమే..
నీ అనుభూతిలో నిండిపోవాలనుకున్నాక..
6426. మేఘానికి చినుకై జారక తప్పలేదు..
తనకై అవని ఎదురుచూస్తుందని తెలిసినందుకు..
6427. కాలమూ.. కనికరమూ నాకెందుకులే..
నీ జ్ఞాపకమైతే చాలనుకున్నాక..
6428. హృదయపు కాంతి కన్నులకిచ్చింది..
భాష్పంగా రాల్చేస్తుందని తెలీక..
6429. చిరునవ్వు చెక్కిన ముఖమేగా నీది..
చెదలు సైతం ఆరగించేందుకు వచ్చాయంటే..
6430. వేసవిరాత్రిలోనూ చలి పుట్టిస్తావు..
నా శ్వాసలను పైకంపేస్తూ..
6431. నేనెప్పటికీ నీ ఆనవాలునే..
మట్టిలో కలిసి శిధిలమయ్యేవరకూ..
6432. నిన్ను గుర్తుపడుతున్నది అందుకేగా..
ఎల్లలు దాటిన ప్రేమున్నందుకేగా..
6433. ఆశల సంచిలో వెతుక్కున్నా..
నీ చేతివ్రాతను తడుముకోవాలని..
6434. అశాంతిలోకి జారింది మది..
స్మృతులు గాయాన్ని రేపుతుంటే..
6435. నీ తలపుల మెరుపులే అవన్నీ..
నాలో కాంతిలహరులై చూపును వెలిగిస్తూ..
6436. కాటుక కళ్ళ విరహం కనిపెట్టావేమో..
మకుటంగా నన్ను రాయడం మొదలెట్టావు..
6437. పలుకరించావనే పులకరించాను..
కొసమెరుపుగా నన్ను దూరం చేసావు..
6438. నీరెండల్లో నా తోడయ్యావు..
మెరుపుచురకల నుండీ రక్షించి.
6439. మృదంగమవ్వాలి నీ మది..
నేనోసారి తిరిగి నర్తించాలంటే..
6440. కొసరికొసరి చూసిందెప్పుడు గమనించావో..
ఆరాధించింది నిన్ను కల్లోనైతే..
6441. కురిపించింది జల్లుగా ప్రేమనంతా..
మన స్వప్నాల రంగులు సౌందర్యం చేసి వెదజల్లేలా..
6442. మేమెప్పుడూ ఒకరికొకరమే..
వెన్నెలా చీకటిగా విడిపోయి కనిపిస్తున్నా..
6443. రెక్కలు కట్టుకునెగిరిందట..
నవ్వితే మనసుకి లోకువైపోతాననుకొన్న ఆనందం..
6444. ప్రేమమయమేగా జగతి..
దయాగుణమే అంతర్లీన సౌందర్యమై మనలోనుంటే..
6445. మిణుగురై మెరిసింది ఆనందం..
అవకాశం వరించింది నన్నేనని..
6446. కవితాత్మ పెనవేసిన అక్షరాలవి..
పువ్వులను పెనవేసిన తావిలా..
6447. చైతన్యమొకటి చెలరేగింది..
కల నిజమై కపోతముగా నవ్వుతుంటే..
6448. ఆత్మహుతి చేసుకున్న సత్యమొకటి..
అబద్దమొచ్చి ఆదర్శాన్ని స్రవించినందుకే..
6449.మలుపు తిరిగే అవసరమేముంది..
గమ్యం ఎదురుగా కనిపిస్తుంటే..
6450. వివశమై విరబూసింది రాధ..
వేణునాదపు ఊపిరి గిలిగింతలకే..
6451. స్వప్నాల పరిధులు దాటి సాగని జీవనం..
ఊపిరిబిగపెట్టి తనను తానే నిలువుతద్దంలో చూసుకున్నట్లు..
6452. ఆలోచనలకెప్పుడూ సరికొత్త ఆకృతులు...
అప్పుడేగా కవిత్వానికా అనుభూతులు..
6453. నీ మదిలో కురిసిన వెన్నెలనే..
చీకటి చేరనివ్వని అమాస రాతిరిలో..
6454. ఆరంభమైన ఆనందమొకటి..
ఆచరణలోని అవరోధాల్ని అంతం చేస్తూ
6455. నేనో నిమీలితనే..
నీవో తుమ్మెదనై మకరందాం గ్రోలేవేళ..
6456. కాలావధుల్ని కరిగించాలేమో..
నీ చేత బాల్యానికి పరుగుపెట్టించాలంటే..
6457. ఆనకట్టే కాటుక..
నలుగురి దృష్టీ నాలోని నీ దరికి చేరనివ్వకుండా..
6458. పొగిలిపొగిలి నవ్వుతున్నా..
పరిమళాన్ని కాజేసేందుకే ఎదలో చేరుతున్నావని..
6459. వసంత రెక్కలను తగిలించుకొస్తున్నా..
నీ ఊహలతెమ్మెర నేనవ్వాలని..
6460. సూర్యోదయాన్ని గమనించు..
వెలిగే వేకువను నా మదిలోంచి..
6461. ఊయలయ్యింది హృదయం..
నువ్వు చెప్పే వెన్నెల ఊసులకు..
6462. సరసోదయాలే కావాలి నీకన్నీ..
కన్నులు తెరవని వెన్నెల్లో..
6463. విరహోదయంలోనే ఉంటావెందుకో..
నీకన్నా గంటముందే నే మేల్కొన్నా..
6464. చీకటి కళ్ళకు వెలుగు తెలిసింది..
మసకవెన్నెల్లో నీ కవిత కదలగానే..
6465. గోరువెచ్చని ఊపిరింకా తెలుపుతోంది..
పెదవుల ఆర్తింకా తీరలేదని..
6466. పెల్లుబుకుతూనే ఉంది కన్నీరింకా..
ప్రేమొక మోసమని గుర్తొచ్చినప్పుడల్లా..
6467. కల్లోకి రానివ్వలేదని కంగారెందుకు..
ఊహల్లోని వెన్నెలంతా మనదయ్యాక..
6468. కానుకగా పుచ్చుకున్నందుకేమో కన్నీరు..
ఓదార్చుతూనే ఉంది మనసునింకా..
6469. ప్రేమను పంచుకొనే మనసొకటి కావాలి..
మదిలో ప్రకంపనను సుస్వరముగా మార్చేలా..
6470. కలిసే అడుగేద్దాం రా..
అంతరాల వారధిని నిర్మించేలా..
6471. అప్పుడే చేరావుగా నాలో..
నీ గమనం మార్చేసుకొని..
6472. నీ గుండె బరువెంతో తెలిసింది..
రాలిపడ్డ నక్షత్రాలను తేలికగా మోసాక..
6473. గుండె గతుక్కుమనేలాగుంది..
ఇన్నిసార్లు నువ్విలా తలపును తడుతుంటే..
6474. వలపు రాయకుండా వెళ్ళొద్దన్నానందుకే..
మోహం మాలికైతే చూడాలనే..
6475. అడుగులు కదిపానందుకే..
మల్లెలబాటలో నన్ను నడిపించగలిగేది నువ్వేనని..
6476. యుద్ధాలే మానేస్తా..
నిన్ను గెలిపించకపోయినా నువ్వే విజేతవని..
6477. మోహమాధుర్యంలో హద్దులెందుకో..
పొద్దుల్లో ముద్దులకు పద్దులు రాయలేమంతే..
6478. ఛాదస్తానికే ఉరేయొచ్చుగా..
మనసుకి కాస్త సరదాలు పంచిస్తూ..
6479. ప్రేమెక్కువైతే మదికిబ్బందే లేదు..
తక్కువైతే నష్టపోయేది నువ్వేగా..
6480. సగపాల్లో సర్దుకోవచ్చులే..
సంధ్యల్లో ఆరాటాలన్నీ మలిపొద్దుకి దాచుకొని..
6481. వదిలించుకోవాలనే చూస్తావెందుకో..
కన్నుల్లోనైనా కొలువుందామని ప్రేమగా నేనొస్తే
6482. వేకువ వెన్నెలై విచ్చేయాలనుకున్నా..
పువ్వులు మువ్వలై పలుకరించగానే..
6483. నీ అడుగులను అనుసరించి నడుస్తున్నా..
మువ్వల ప్రేరణిచ్చి ముందుకు నడిపించాలనే..
6484. అతిశయించింది అనుభూతి..
అనురాగాన్ని నువ్వాలకించి అక్షరాలను బదులిచ్చావని..
6485. ఊయలూగుతున్న మబ్బులు..
నా హృదయాన్ని అనుకరించాలనే క్షణాలలో..
6486. ఎందుకలా గిరి గీస్తావో..
పంచుకున్న ప్రణయాన్ని మరచినట్లు..
6487. చీకటివెలుగుల్లో చిక్కింది మది..
వెలుగునీడల్లో..వెలుగునే కోరుకున్నా..
6488. మౌనవాటికలో మురిసిపోతున్నా..
నీ శ్వాసలలోని తాదాత్మ్యత నేనవుతుంటే..
6489. నీ భావాలకు బంధీనైపోయానందుకే..
అక్షరలక్షలతో ప్రదక్షిణలు చేసినందుకే..
6490. మునుపు శిలనేగా..
నీ ఎదలో శిల్పమై పూజలందుకొనేవరకూ..
6491. కలలు కనడం తగ్గించావేమో..
ఊహాల్లో నాకు చోటిచ్చినందుకు..
6492. ఖర్జూరతోటల్లోనే సేద తీరాలనుకుంటా..
అధిక తాపానికి తట్టుకోలేకుంటే..
6493. ప్రతిరోజూ మెలకువప్పుడే వస్తుంది..
మనసైన నీ మోము రెప్పల వాకిట్లో తారాడినప్పుడే..
6494. వలసపోయే సమయం ఆసన్నమయ్యిందేమో..
జీవితమక్కడ చితికి చచ్చిపోయేలా..
6495. పులకరింతలు చేసా పలకరింపులన్నీ..
పలవరింతలుగా నన్ను తాకాయనే..
6496. విశాలమైనట్లనిపిస్తోంది మది..
నీ ఊసులను నెమరేసుకొని ఆస్వాదించేకొద్దీ..
6497. ఆ కలలో పెదవి విప్పినందుకేమో..
ఈ మదిలో వెన్నెల కురిసినట్లయ్యింది..
6498. చూపులతోనే పల్లవించే భావం నాది..
నీ కన్ను ఓదార్పుగా తాకినా..
6499. చిత్తభ్రాంతలాగే మిగిలిపోయింది..
కన్నీరంతా కరిగి కళ్ళు ఎండిపోయినా..
6500. మనసుకి గారాలు నేర్పింది నువ్వేగా..
నా అలుకలకు అనునయాలు పాడిపాడి..
![]() | Virus-free. www.avast.com |
No comments:
Post a Comment