7001. వలపు సోయగమిది..
నీ పిలుపు నన్నంటిన వేళ
7002. వెన్నెల పారావారంలోకే అడుగులన్నీ..
మనసు మునకేయమని తొందరచేస్తుంటే..
7003. వియోగం దారిమళ్ళింది..
కలల పేరంటానికి పిలవగానే నువ్విచ్చేసినందుకు..
7004. జీవితమెందుకు వాడిపోతుందో..
అలమటించిన ఆప్యాయతకు సరైన నీరందకేమో..
7005. పున్నమో వేడుకే..
వెన్నెలవానలో తడవాలనుకొనే సరస హృదయులకు..
7006. గతమెప్పుడూ నాతోనే..
నీ స్మృతుల శీతాకాలపు గిలిగింతలిస్తూ..
7007. వేరే పువ్వులొద్దంటూ నా మది..
నీ నవ్వులోనే తన మధువనమంటూ..
7008. కుసుమాల కోమలమవసరమేగా..
నా పెదవుల నునుపులు పరీక్షించేందుకైనా..
7009. కన్నుల్లో మెరుపులు..
వెన్నెల్లో నిన్నూహించిన ఎద మైమరపులు..
7010. చందమామ నట్టింట దిగిందనుకున్నా..
అతిధివై నీవు విచ్చేయగానే..
7011. చేరువైనప్పుడే అనుకున్నా..
శ్రావణానికి ముహూర్తం పెట్టించమని సాధిస్తావని..
7012. అక్షరాల ఆలపనెప్పుడూ..
నాకు సంగీతంతో సంబంధం లేనప్పుడూ..
7013. అక్షరకృతులేనన్నీ..
వేదనను కరిగించి హృదయాన్ని తేలిక చేసేందుకు..
7014. అక్షరాలే నేస్తాలు..
ఆలోచనలు పురివిప్పి రాయమని అడిగినప్పుడల్లా..
7015. ఏకాంతంలోనే గడపాలిక..
నీ సాన్నిధ్యాన్ని నెమరేసుకోవాలనుకున్న ప్రతిసారీ
7016. రాతిరికలగా నేనొస్తున్నా..
పగలు పారాహుషారన్నావనే..
7017. అనిమేషమైపోతున్నా..
నీ చూపుల అల్లికల స్వర్గానికే..
7018. మౌనం శబ్దించినప్పుడే అనుకున్నా..
ప్రేమైక గమ్యానికి చేరువయ్యానని..
7019. కౌముదులెన్నో కన్నుల్లో..
కల నిజమై నీలా ఎదురైనందుకు..
7020. అరవిరిసే ఉన్నానింకా..
పువ్వునైతే తుమ్మెదల దాడి తట్టుకోలేననే..
7021. నా వలపు తాపం కెరటమయ్యింది..
నీ సారస్యపు కన్నుల కౌగిలింతలలో..
7022. పచ్చదనపు పండుగొచ్చింది..
మది పులకాంకురాలతో ఆనందం అదుముకోగానే
7023. మనసుకు హత్తుకున్న నీ నవ్వులు..
వెన్నెలను మరిపించే మనోహర సరసాలాపనలు..
7024. నీ జవాబులెందుకో..
ప్రశ్నించకుండానే నాలో అనుమానాలు రేకెత్తిస్తూ..
7025. నా బుగ్గల్లో మందార ఎరుపులు..
చప్పుడు చేయక నువ్వు చుంబించినట్లుగా..
7026. నీ తలపులు కలహంసలే..
ఊహలకు రెక్కలొచ్చి నా ప్రపంచం రూపు మారినప్పుడు..
7027. జన్మజన్మలకూ నువ్వే కావాలంటూ మది..
పెదవికి చిరునవ్వును శాశ్వతం చేసావని..
7028. శృంగారవాసంతినై ఒణుకుతున్నా..
నువ్వు మార్చుకొచ్చిన శరద్వెన్నెల రూపానికే..
7029. మధుమాసమై పరిమళిస్తున్నా..
వీచిన నీ వలపుగాలి గంధాలకే..
7030. కలలెన్ని పొదుగుతున్నావో..
ఒంటరివేళను ఏకాంతముగా తలపులు దిద్దుకొని..
7031. వేకువ తెరలు తీయక తప్పదుగా.
రాతిరి వగలెన్ని కవ్వింతలు దోచినా..
7032. తురుముకుంటూనే ఉన్నా నీ తలపులను..
నవ్వుతున్న హృదయానికి నవరసాలు పంచివ్వాలని..
7033. మల్లెలంటే మక్కువెందుకో..
గ్రీష్మమెళ్ళి వానకన్యను వలపులిమ్మని పంపుతున్నా..
7034. కోల్పోతున్న జీవం..
మూగసాక్షిగా మిగల్లేకనే..
7035. ఊహగానైనా నువ్వొస్తే చాలనుకున్నా..
మది అనునయాన్ని కోరుకున్నవేళ..
7035. అసంపూర్ణంలోనే ఆగిపోతూ కొందరు..
మెరుపు వెలుతురుకి భయపడేనేమో..
7036. అధిమిస్తూనే ఉండాలి మైలురాళ్ళన్నీ..
గెలుపుకి చెలియలకట్టుండదని నిరూపించాలంటే..
7037. అమ్మకన్నీ పస్తులే..
పిల్లల ఆకలి తీర్చే ఉపవాసాల్లో..
7038. వలపప్పుడే ఒంటరయ్యింది..
నా నవ్వును కాజేసుకు నువ్వెళ్ళినప్పుడు..
7039. వేలక్షణాలు నిరుపయోగాలేగా..
నిన్నూ నన్ను కలపకుండానే కదిలిపోతే..
7040. అనుభూతి వికసించినప్పుడే అనుకున్నా..
మౌనంతో ముచ్చట్లాడేందుకు నువ్వొచ్చేసావని..
7041. నిరాశల నిట్టూర్పులేనవి..
జ్ఞాపకాల వినువీధుల్లో దారితప్పిన హృదయానిది..
7042. స్వీకరించక తప్పలేదు అపజయాన్ని..
విజయాన్ని వెనుకాలే పిలుచుకొస్తుందని..
7043. వెలుగునీడలేగా సుఖదుఃఖాలంటే..
ఒకటిలేనిది రెండోదాని విలువ లేదుగా..
7044. కన్నీరెందుకు ఘనీభవిస్తుందో..
నీ ఎదుట ప్రవహించాలనుకున్న ప్రతిసారీ..
7045.కలలకే కష్టమొచ్చిందో..
కన్నులను వీడి చీకటిలో పయనమవుతూ..
7046. ప్రతిరేయి పండుగ కావాలనుకున్నా..
కలలన్నింటిలో నిన్నే దర్శించాలనుకున్నందుకు..
7047. మట్టి విలువ తెలిసిన కన్నీరేమో..
పచ్చని పరిమళాన్ని ప్రవహిస్తూ కన్నులు..
7048. పోరాడక తప్పని జీవితాలు..
సమయానుకూలంగా సమస్యలను ఛేదించుకుంటూ..
7049. శ్వాసనెందుకు ఆపేస్తావో..
పట్టపగలే పెదవొంపుతో మతిని పోగొడుతూ..
7050. ఆనందరసార్ణవమే మదిలో..నీ పిలుపు నన్నంటిన వేళ
7002. వెన్నెల పారావారంలోకే అడుగులన్నీ..
మనసు మునకేయమని తొందరచేస్తుంటే..
7003. వియోగం దారిమళ్ళింది..
కలల పేరంటానికి పిలవగానే నువ్విచ్చేసినందుకు..
7004. జీవితమెందుకు వాడిపోతుందో..
అలమటించిన ఆప్యాయతకు సరైన నీరందకేమో..
7005. పున్నమో వేడుకే..
వెన్నెలవానలో తడవాలనుకొనే సరస హృదయులకు..
7006. గతమెప్పుడూ నాతోనే..
నీ స్మృతుల శీతాకాలపు గిలిగింతలిస్తూ..
7007. వేరే పువ్వులొద్దంటూ నా మది..
నీ నవ్వులోనే తన మధువనమంటూ..
7008. కుసుమాల కోమలమవసరమేగా..
నా పెదవుల నునుపులు పరీక్షించేందుకైనా..
7009. కన్నుల్లో మెరుపులు..
వెన్నెల్లో నిన్నూహించిన ఎద మైమరపులు..
7010. చందమామ నట్టింట దిగిందనుకున్నా..
అతిధివై నీవు విచ్చేయగానే..
7011. చేరువైనప్పుడే అనుకున్నా..
శ్రావణానికి ముహూర్తం పెట్టించమని సాధిస్తావని..
7012. అక్షరాల ఆలపనెప్పుడూ..
నాకు సంగీతంతో సంబంధం లేనప్పుడూ..
7013. అక్షరకృతులేనన్నీ..
వేదనను కరిగించి హృదయాన్ని తేలిక చేసేందుకు..
7014. అక్షరాలే నేస్తాలు..
ఆలోచనలు పురివిప్పి రాయమని అడిగినప్పుడల్లా..
7015. ఏకాంతంలోనే గడపాలిక..
నీ సాన్నిధ్యాన్ని నెమరేసుకోవాలనుకున్న ప్రతిసారీ
7016. రాతిరికలగా నేనొస్తున్నా..
పగలు పారాహుషారన్నావనే..
7017. అనిమేషమైపోతున్నా..
నీ చూపుల అల్లికల స్వర్గానికే..
7018. మౌనం శబ్దించినప్పుడే అనుకున్నా..
ప్రేమైక గమ్యానికి చేరువయ్యానని..
7019. కౌముదులెన్నో కన్నుల్లో..
కల నిజమై నీలా ఎదురైనందుకు..
7020. అరవిరిసే ఉన్నానింకా..
పువ్వునైతే తుమ్మెదల దాడి తట్టుకోలేననే..
7021. నా వలపు తాపం కెరటమయ్యింది..
నీ సారస్యపు కన్నుల కౌగిలింతలలో..
7022. పచ్చదనపు పండుగొచ్చింది..
మది పులకాంకురాలతో ఆనందం అదుముకోగానే
7023. మనసుకు హత్తుకున్న నీ నవ్వులు..
వెన్నెలను మరిపించే మనోహర సరసాలాపనలు..
7024. నీ జవాబులెందుకో..
ప్రశ్నించకుండానే నాలో అనుమానాలు రేకెత్తిస్తూ..
7025. నా బుగ్గల్లో మందార ఎరుపులు..
చప్పుడు చేయక నువ్వు చుంబించినట్లుగా..
7026. నీ తలపులు కలహంసలే..
ఊహలకు రెక్కలొచ్చి నా ప్రపంచం రూపు మారినప్పుడు..
7027. జన్మజన్మలకూ నువ్వే కావాలంటూ మది..
పెదవికి చిరునవ్వును శాశ్వతం చేసావని..
7028. శృంగారవాసంతినై ఒణుకుతున్నా..
నువ్వు మార్చుకొచ్చిన శరద్వెన్నెల రూపానికే..
7029. మధుమాసమై పరిమళిస్తున్నా..
వీచిన నీ వలపుగాలి గంధాలకే..
7030. కలలెన్ని పొదుగుతున్నావో..
ఒంటరివేళను ఏకాంతముగా తలపులు దిద్దుకొని..
7031. వేకువ తెరలు తీయక తప్పదుగా.
రాతిరి వగలెన్ని కవ్వింతలు దోచినా..
7032. తురుముకుంటూనే ఉన్నా నీ తలపులను..
నవ్వుతున్న హృదయానికి నవరసాలు పంచివ్వాలని..
7033. మల్లెలంటే మక్కువెందుకో..
గ్రీష్మమెళ్ళి వానకన్యను వలపులిమ్మని పంపుతున్నా..
7034. కోల్పోతున్న జీవం..
మూగసాక్షిగా మిగల్లేకనే..
7035. ఊహగానైనా నువ్వొస్తే చాలనుకున్నా..
మది అనునయాన్ని కోరుకున్నవేళ..
7035. అసంపూర్ణంలోనే ఆగిపోతూ కొందరు..
మెరుపు వెలుతురుకి భయపడేనేమో..
7036. అధిమిస్తూనే ఉండాలి మైలురాళ్ళన్నీ..
గెలుపుకి చెలియలకట్టుండదని నిరూపించాలంటే..
7037. అమ్మకన్నీ పస్తులే..
పిల్లల ఆకలి తీర్చే ఉపవాసాల్లో..
7038. వలపప్పుడే ఒంటరయ్యింది..
నా నవ్వును కాజేసుకు నువ్వెళ్ళినప్పుడు..
7039. వేలక్షణాలు నిరుపయోగాలేగా..
నిన్నూ నన్ను కలపకుండానే కదిలిపోతే..
7040. అనుభూతి వికసించినప్పుడే అనుకున్నా..
మౌనంతో ముచ్చట్లాడేందుకు నువ్వొచ్చేసావని..
7041. నిరాశల నిట్టూర్పులేనవి..
జ్ఞాపకాల వినువీధుల్లో దారితప్పిన హృదయానిది..
7042. స్వీకరించక తప్పలేదు అపజయాన్ని..
విజయాన్ని వెనుకాలే పిలుచుకొస్తుందని..
7043. వెలుగునీడలేగా సుఖదుఃఖాలంటే..
ఒకటిలేనిది రెండోదాని విలువ లేదుగా..
7044. కన్నీరెందుకు ఘనీభవిస్తుందో..
నీ ఎదుట ప్రవహించాలనుకున్న ప్రతిసారీ..
7045.కలలకే కష్టమొచ్చిందో..
కన్నులను వీడి చీకటిలో పయనమవుతూ..
7046. ప్రతిరేయి పండుగ కావాలనుకున్నా..
కలలన్నింటిలో నిన్నే దర్శించాలనుకున్నందుకు..
7047. మట్టి విలువ తెలిసిన కన్నీరేమో..
పచ్చని పరిమళాన్ని ప్రవహిస్తూ కన్నులు..
7048. పోరాడక తప్పని జీవితాలు..
సమయానుకూలంగా సమస్యలను ఛేదించుకుంటూ..
7049. శ్వాసనెందుకు ఆపేస్తావో..
పట్టపగలే పెదవొంపుతో మతిని పోగొడుతూ..
నీ మాటలకు సిగ్గులు తొలకరిస్తుంటే..
7051. ఉక్కిరిబిక్కిరవుతున్నా ఊహలకు..
వెల్లువై స్వరాలుగా నన్ను ముంచేస్తుంటే..
7052. పులకించిన మౌనమవుతున్నా..
నీ కన్నుల్లోకి దూకిన ప్రతిసారీ..
7053. అనుభూతులైతే మనవేగా..
నువ్వు రాసే ప్రేమ కవితలన్నింటిలోనూ..
7054. నిశ్శబ్ద రాగాకృతులే నీ జ్ఞాపకాలు..
అస్పష్ట సంగీతమై మనసును ఓదార్చుతూ..
7055. ఏకాంతాన్ని మది కోరినప్పుడే అనుకున్నా..
నీ ఊహలతో పొద్దుపుచ్చాలని భావిస్తుందని..
7056. నీ మౌనాన్నే గమనిస్తున్నా..
కొసమెరుపుగానైనా నన్ను పలకరిస్తుందేమోనని..
7057. మౌనాన్ని నేర్వలేకున్నా..
ఒంటరితనంలోనూ నీ కోపంతో సంఘర్షిస్తూ..
7058. స్వేచ్ఛా జీవితం అనుకోడానికి లేదు..
కనిపించని పంజరంలో జీవితం చిక్కుకుంటే..
7059. తలపులు కుమ్మరించినప్పుడే అనుకున్నా..
బాల్యాన్ని గుర్తుచేసేందుకే నువ్వొచ్చావని..
7060. మౌనమలా మిగిలిందంతే..
రాతకందని మనసు స్పందనలు దాచుకొని..
7061. ఆనంద తాండవాలే నీ తలపులు..
నిదురించిన నన్ను రాగాలతో రంజిస్తూ..
7062. ఉనికిలేని గగనముగా మిగిలిపోలేనుగా..
వెన్నెలరేడువై రేయినంతా నువ్వెలిగిస్తుంటే..
7063. కధానికల కాలమిది..
ముభావమైనా ముచ్చట్లుగా మలచి ప్రచురించేందుకు..
7064. అలలెందుకు సిగ్గు పడుతున్నాయో..
తీరాన్ని ముద్దాడేందుకు ముందుకెళ్తూనే..
7065.కలలోకే ఆహ్వానాలు..
ఎదురైతే తప్పుకోడాలు..
7066. మరలమరల అదే స్వప్నం..
మరుజన్మకైనా నిజం చేసుకోమంటూ..
7067. ఆ ముఖచిత్రం నవ్వుతున్నప్పుడే అనుకున్నా..
పరిమళించే పుటలున్న పుస్తకం నీదని..
7068. పారవశ్యపు తీగల జలతారులు..
విరుల తొలకరులైనట్లు మనసులో..
7069. జ్ఞాపకాల మౌనరాగాలు..
మలిసందె జీవితానికి మల్లెరెక్కల సౌరభాలు..
7070. వసంతమై అనుకురించినప్పుడే అనుకున్నా..
తీపిని పంచిచ్చేందుకు నువ్వొస్తున్నావని..
7071. మనసుపొరల్లో ఘుమఘుమలు..
నీ మాటలను దాచుకున్న మరుగంధాలై..
7072. నిత్యవసంతమే నీ చెలిమి..
మధురగీతమై మంచితనాన్ని పంచిస్తూ..
7073. గులాబినై విచ్చుకున్నా ఈ రోజు..
నువ్వు కళ్ళతో నవ్వితే చూద్దామని..
7074. వియోగంలో నేత్రాంచలాలు..
కన్నీటిని కొలుకుల్లోనే ఆపేందుకు ప్రయత్నిస్తూ..
7075. పసితనం వైపే లాగుతుంది మనసెందుకో..
మన ఊరి జ్ఞాపకాలను మోసుకొస్తుందనేమో..
7076. మాటలతో మౌనాన్ని కరిగిస్తున్నా..
నిర్జన వారధిలో నిలబడ్డావనే..
7077. గోదారే నాయికయ్యింది..
వెన్నెల్లో విరచించబోయే నా కవనానికి..
7078. నేలమ్మను అభిషేకించు పువ్వులు..
నక్షత్రాలే ఇలకు జారినట్లు..
7079. మనసెందుకో మౌనవించింది..
అపశృతులను సరిచేయలేని రాతిరి వెతలలో..
7080. అగరుధూపాలకే మత్తెక్కిపోయా..
నిరీక్షణలో క్షణాలు కదలక మొరాయిస్తుంటే..
7081. నిట్టూర్పులే నావయ్యాయి..
నిరుత్సాహం చాప కింద నీరులా నన్ను తడమగానే..
7082. రాధమ్మనవ్వాలనుంది..
బృందావనం ఎదురయ్యి నన్ను రమ్మంటుంటే..
7083. వసంతం తిరిగొచ్చినట్లుంది..
నీ కవిత్వంలో నన్ను చదువుకుంటుంటే..
7084. తీయని కలలన్నీ నీకిచ్చేస్తా..
నిరీక్షణా తీరమై నువ్వుంటే..
7085. అనుభూతికందిన భావాలెన్నో..
తన స్పర్శ సోకిన సాయంత్రంలో..
7086. ఆయాచితమైనదేదీ వద్దనుకున్నా..
కానుకిచ్చి ప్రతిఫలమేదని పదేపదే కోరుతుంటే..
7087. మనసారా తడిచిపోతున్నా..
మనకై కురుస్తున్న ప్రేమజల్లు కల్పనల్లోనే..
7088. కడపటి గీతం పాడుకుంటున్న మది..
నెమరింతలకే పరిమితమవుతున్న నీ జ్ఞాపకాలతో..
7089. మనసున మధువులే నీ తలపులు..
కనిపించని తొలి వలపుకు నీరాజనాలు..
7090. వర్షమొచ్చి హర్షమిచ్చింది..
ఎండిన నా హృదయంపై కురిసినందుకు..
7091. సుప్రభాతమవడం గుర్తించలేదు..
కమ్మని నీ కలల పరిష్వంగంలో..
7092. కలవరింతలే ప్రతిరాతిరీను..
ప్రపంచమే రంగులు దిద్దినట్లు కనిపిస్తుంటే..
7093. నాలాగే ఉన్నాననుకున్నా..
నువ్వొచ్చి నీలా మారానని చెప్పేవరకూ..
7094. కలతలు లేని మనసెక్కడుంది..
పొంగులెత్తే వేదనలు నిత్యకృత్యమయ్యాక..
7095. కన్నులతో నవ్వినప్పుడే అనుకున్నా..
పెదవులు త్వరపడే సమయమయ్యిందని..
7096. అలమటించక తప్పలేదు ఆత్మీయతను..
చెలిమి చేరువై హత్తుకున్నాక..
7097. వేరే సంగీతం నాకెందుకులే..
నీ పిలుపు సుప్రభాతాలతో నాకు ప్రత్యుషాలు మొదలవుతుంటే..
7098. కన్నీరెప్పుడూ సశేషమేగా..
మదిలోని ఘోష కన్నుల్లో హోరెత్తినప్పుడల్లా..
7099. నిదురలో కలవరించావనేమో..
పెదవికి నా పేరు తీపంటింది..
7100. ఈదక తప్పదు జీవనసముద్రాన్ని..
ఆనందమనే తీరాన్ని చేరుకోవాలనుకుంటే..
No comments:
Post a Comment