5401. ఆనందభాష్పాలనుకున్నా నిన్న..
విషాదమై నేడు కురిసేవరకూ నమ్మలేక..
5402. ఎన్ని ఆకృతులు రూపుదిద్దుకున్నాయో ఆకాశంలో..
నేను కలిపిన తారల చేతులతో..
5403. ఎన్ని కలతలు తరిగిపోయాయో..
ఒక్కసారా చూపు మీటగానే..
5404. నీ మదిలో తొలిదీపమవ్వాలనుకున్నా..
ఉషోదయమై నీకు వెలిగిస్తూ
5405. ప్రేమయుద్ధమేదీ జరగలేదందుకే..
అద్వైతమే వారి ప్రేమతత్వమని ఋజువయ్యాక..
5406. జీవనరాగమేనది..
నీ హృది నుండీ నా పెదవుల్లోనికి ప్రవహిస్తూ..
5407. పరువుతో పనిలేని కామసుందరుడు..
కమలలోచనుడైన రాధికా వల్లభుడు..
5408. మనసెప్పుడూ వశమే..
నీ ఆత్మీయత వెన్నెల్లో నిత్యపరవశమే..
5409. అనుబంధానికదేగా నిర్వచనం..
ఆ ఒక్కబొట్టు కట్టమనే తాపత్రయం..
5410. కొట్టుకుపోతున్న అనుభవాలు..
మిగిలిపోయిన జ్ఞాపకాలతో..
5411. మనసిట్టే చదివేస్తావు..
ఎంత దాచుకోవాలని చూసినా నువ్వు..
5412. నీరజాక్షుడే..
నయనమోహనమైన కోమలాకృతుడు..
5413. ఎన్ని మల్లెలద్దమంటావో..
నా భావాల పరిమళం అందలేదంటూ..
5414. ప్రతి ఋతువూ గ్రీష్మమై వెక్కిరిస్తోంది..
నాతో నువ్వులేని జీవితాన్ని తలపోసుకొని..
5415. అనుభూతులన్నీ దాచేసాను..
నీ అహంకారానికి ఎదురీదాలని లేనందుకే..
5416. వెలుగంటే మాత్రమదే..
నా రాకతో నీ చూపుల్లో విరిసే చిరునవ్వు..
5417. నీ మాటలు మరింత సున్నితమే..
నన్ను పొగిడిన ప్రతిసారీ అలసిపోతూ..
5418. కన్నీటితో మునిగిన తెప్ప..
గమ్యాన్ని ఆగమ్యగోచరం చేసేస్తూ..
5419. రంగులద్దుకున్న తొలివలపు..
వసంతమై నీవొచ్చి చూపులు చ(జ)ల్లగానే..
5420. నా మనసెందుకు అలసిపోయిందో..
నీ చూపులు సైగలేస్తుంటే..
5421. జావళీలేనట జాజులకు..
తన పరిమళానికే మనం వివశమైనందుకు..
5422. నిన్నంతా ఏమయ్యావో గుర్తుచేసుకుంటున్నా..
ఈరోజొచ్చి పెదవులు పూయమంటుంటే..
5423. సింధూరవీచికలే ఎదలో..
నీ ఊహలు చిరునవ్వులై పరామర్శించినప్పుడల్లా..
5424. ప్రేమరంగుకి ఒక్కరోజు..
హోలి అనుకుంటే అభ్యంతరం లేదు..
5425. కష్టపెట్టలేకున్నా మనసుని..
నిన్ను కాదని పక్కకి తిరగనంటుంటే
5426. నీ నానార్ధాలతో ఛస్తున్నా..
ప్రతిపదార్ధాలతో నన్ను రెచ్చగొడుతుంటే..
5427. గెలిచుకున్నావుగా హృదయాన్ని..
ప్రేమంటే ఆకర్షణను మించినదేదో ఉందంటూ..
5428. నా తలపులు సంపెంగలేగా..
నీ మనసు సింగారించుకున్నప్పుడల్లా..
5429. ఎనిమిదో రంగేదో అలరిస్తోంది..
నీ ప్రేమ హరివిల్లు కొత్తగా విరిసినట్లు అనిపిస్తుంటే..
5430. పదాలతోనే పాట పాడేస్తావు..
నేను అక్షరాలను పేర్చుతుండగానే..
5431. నీవెంటే నేనెప్పుడూ..
నా పగటి కలలోనూ నువ్వున్నప్పుడు..
5432. నవ్వుతూనే ఉన్నాను..
నన్ను పొగిడే సదావకాశాన్ని వినియోగించుకున్నావని..
5433. మౌనంతో గిల్లుతావెందుకలా..
పదాలను పెదవుల నుండీ జారనివ్వకుండా..
5434. ఎన్ని పల్లవులు కూర్చిపెట్టావో..
పాటల మధువులు పొంగేవేళలో..
5435. నీ మనసుపాట మెప్పించింది..
అరనవ్వుల పెదవుల లాస్యాలతోనే..
5436. క్షణాలకెందుకో పరితాపం..
నీ నవ్వులకు నేను బదులివ్వలేదంటే..
5437. ఆమని కవ్వించినట్లుందేమో..
హృదయం కోయిలై నాలా కూసింది..
5438. ఎన్నిసార్లు అడుగెట్టావో వాకిళ్ళలో..
నా చూపు లోగిళ్ళు ముగ్గులేసి నిన్ను రమ్మంటుంటే..
5439. నేనే కలనై రావాలనుకున్నా..
తారకోసం నువ్వెదురు చూస్తున్నావని..
5440. శిశిరాలకీ అలజడొస్తోంది..
వాసంతికవై నా చిరునవ్వునే స్వాప్నిస్తుంటే..
5441. ప్రేమను పలకరించేసాను..
నీ సమక్షంలో కన్నీరు ఆనందమై భాష్పాలు చిందుతుంటే..
5442. పెదవులలో చోటిచ్చావుగా..
ఎన్ని పువ్వులు పూస్తాయో రేపటికి వేచి చూడాలిక..
5443. ఊహల కోయిలకెన్ని కూతలో..
నన్ను మించాలనే తపనల్లో..
5444. అందం రెట్టింపవడం తెలుస్తోంది..
కవితా కుసుమాలతో నువ్వర్చించినందుకేమో..
5445. కవిని కనిపెట్టాలనుకున్నా..
ఆ హృదయంలో ఎవరున్నారో తెలుసుకుందామని..
5446. కలల్ని భరించలేకున్నా..
స్మృతుల ప్రవాహంలో ఊపిరాడనీయక ముంచేస్తుంటే..
5447. కలల్ని భరించలేకున్నా..
ఆలోచనల నిలువుటద్దమై మరకలన్నీ చూపుతుంటే.
5448. మనసొకటైతే చాలనుకున్నా..
మనమొకటైనా కాకున్నా..
5449. వెలుగుకేతనాల్ని రువ్వే నీ తలపులు..
నాలో నిశీధిని వెన్నెలతో నింపేస్తూ..
5450. ఒకరికొకరం పొందామనవేందుకో..
నిన్ను గెలుచుకున్నానని నేను ఒప్పుకుంటున్నా..
5451. ఎన్ని వన్నెలు రుచి చూసావో..
నన్నే వెన్నలా కరిగించేస్తూ నువ్వు..
5452. ఆ కన్నులకు కొంటెదనమెందుకో..
నేను మెదిలింది పెదవులపైనైతే..
5453. నెలవంకలైన నా నవ్వులు..
హృదయంలో నిన్ను కనుగొన్నందుకేగా..
5454. కలలోనే తీరిన ఆకలి వాడికి..
వాస్తవంలో మెతుకును ఆస్వాదించే ఆశలేక
5455. చూపునదుపులో పెట్టుకోవాలేమో..
రెప్పలు నన్ను దాచుకోవాలని ఆరాటపడొద్దంటే..
5456. ఎన్ని అవ్యక్తాలను వినగలిగిందో మనసు..
మౌనరాగాన్ని అక్షరబద్దం నే చేస్తుంటే..
5457. వలపంటే మనసైనందుకేగా..
నిశ్శబ్దానికీ ఏకాంతానికీ లోకువైంది మది..
5458. గండుకోయిలకే గాయమయ్యిందో మరి..
పెదవిప్పనంటూ ప్రియురాలిపై అలుకలు..
5459. వసంతం వరకూ ఆగలేని కోయిల..
శిశిరపుగాలికే గొంతు మూగబోయిన వేళలా..
5460. నా సరసానికెప్పుడూ గర్వమే..
ఆరడుగుల అందాన్ని పొందినందుకు..
5461. నీ మోము దర్శనం చాలు..
నా ఎదురుచూపు ఏనాడూ పరవశమయ్యేందుకు..
5462. చిగురించింది ఏకాకితనం..
ఒంటరి మౌనంలో నీ ధ్యాసలో నే లీనమైనందుకే..
5463. వెలుగునీడల కావ్యాలెన్ని పుడుతున్నాయో..
అనుభూతులను అక్షరీకరించాలని కూర్చున్నప్పుడల్లా..
5464. పెనవేసుకున్న తలపులనడుగు..
స్మృతులతో జీవనమెంత దుర్భరమో చెప్పమంటూ..
5465. అందం ప్రబంధమయ్యింది..
నీ చిలిపికన్నులు చదవడం మొదలెట్టగానే
5466. గంధం ఇగిరిపోనంది..
నీ చూపులెంత మృదువుగా తడుముతున్నా..
5467. సంగీతమే నాకు సమస్తం..
సాహిత్యమే మనకు సౌహార్దం..
5468. చిన్మయిగా మార్చేస్తావు..
చెలిమితోనే దోచేస్తూ..
5469. నీ ఆనందాన్ని అనువదిస్తున్నా..
ప్రణయలీలలు పండుగను తలపిస్తుంటే..
5470. జీవితమో గాలిబుడగ..
మౌనసముద్రంపై తేలియాడుతూ..
5471. మాటలు గుదిగుచ్చి చూసుకోమన్నా..
వలపు విరజాజుల పరిమళమిస్తుందనే..
5472. నిద్ర చేయించా జాజులన్నింటినీ..
నువ్వఘ్రాణించే రోజు మేలకువనుండాలని..
5473. విశ్వరహస్యాన్ని ఆరాతీస్తావెందుకో..
నా నవ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించకుండా..
5474. గమకాలను తోడు తెచ్చుకున్నా..
నా తమకాన్ని పాడాలనుకోగానే..
5475. అనూహ్యమైన భావం ప్రవహిస్తోంది..
హృదయమంత కాసారం కవితైనట్టు..
5476. పున్నమెళ్ళిపోయిందనుకున్నా..
నీవే నిండు జాబిలివై వస్తావని తెలియక
5477. చకోరమని ముద్దుగా పిలిచినప్పుడే అనుకున్నా..
నీ భావాల నక్షత్రాలతో చుట్టుముట్టావని..
5478. జ్ఞాపకమంటే..
నాతో కలిసున్న నువ్వు నేడు దూరమవ్వడమేగా..
5479. నీ బుగ్గలనంటింది నేనేగా..
ప్రతి మెరుపులోనూ వెలుగులీనుతూ..
5480. నీ జ్ఞాపకమదే..
కొన్ని రాత్రుల నిదురను దోచుకుపోవడం..
5481. కొన్ని పలుకులెప్పుడూ పులకరింతలే..
వెన్నెల్లో ఆడపిల్లనైనట్టు గిలిగింతలే..
5482. కలవరమయ్యాయి నా కలలు..
నువ్వు వాస్తవమై ఎదురొచ్చాక
5483. నిర్వేదాన్ని తరిమేసా..
వేదమై నువ్వెదురయ్యావనేగా..
5484. సుదీర్ఘమైపోయా..
సగం ఆనందంతో..సగం ప్రోత్సాహముతో..
5485. ఎంత నలిగిందో గాలి..
మన హృదయాల ప్రేమావస్థలో..
5486. కొన్ని కలయికలు కలల్లోనే..
అనుభూతులు కంపించాలని కోరుకున్నా..
5487. దారానికీ దైవత్వమొచ్చింది..
నీ మెడలో దండగా మారినందుకేమో..
5488. తానం మొదలెట్టా..
పల్లవై ప్రవహించేదెలాగో నువ్వు చెప్తావని..
5489. నిశ్శబ్దమే నేపధ్యమయ్యింది..
నా మౌనానికి సహకరించే సాయంత్రంలో..
5490. జ్ఞాపకాల జడివాన కురుస్తున్నట్లుంటుంది..
నేత్రాంచలాల్లో నీరు నిలిచినప్పుడల్లా..
5491. అడుగేయలేనంటూ పదములు..
నీతో సాగలేదని ఆరో అడుగు దగ్గరే ఆగిపోతూ..
5492. నాలో కన్నీరు ఉప్పెనై ప్రవహిస్తోంది..
జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కొట్టుకుపోతున్నా ఆపలేక
5493. ప్రేమ సైతం అక్కడే మిగిలింది..
పిలిచినా రాలేని నా స్వప్నంలోనే..
5494. చక్కని చుక్కవైన నువ్వు తప్పిపోయినందుకేమో..
తారల తళుకులతో నిన్నెతుకుతూ చందమామ..
5495. ఎప్పుడూ వైరాగ్యమే..
నీకు చేరువ కాలేని హృదయాన్ని తలచి తలచి..
5496. పరిమళిస్తున్న పుటలను పరిశీలించి చూడు..
మన ప్రేమాక్షరాలు వెలుగుతూ కనిపిస్తాయి..
5497. అహమెప్పుడు నేర్చిందో నాలో మౌనం..
ప్రేమించే మనసునే కాదంటూ ధిక్కారం..
5498. వేసవిని తరిమేయాలనుకున్నా..
కాశ్మీరపువ్వై నీ ఎదలో చేరైనా..
5499. గోటితో తీసెద్దామనుకున్నా నీ బాధ..
ప్రేమాకలిగా ఉందని నాతో చెప్పకపోయుంటే..
5500. నీ పిచ్చిలో నేను..
జ్ఞాపకాలనే వాస్తవాలనుకుంటూ అనుక్షణమూ..
విషాదమై నేడు కురిసేవరకూ నమ్మలేక..
5402. ఎన్ని ఆకృతులు రూపుదిద్దుకున్నాయో ఆకాశంలో..
నేను కలిపిన తారల చేతులతో..
5403. ఎన్ని కలతలు తరిగిపోయాయో..
ఒక్కసారా చూపు మీటగానే..
5404. నీ మదిలో తొలిదీపమవ్వాలనుకున్నా..
ఉషోదయమై నీకు వెలిగిస్తూ
5405. ప్రేమయుద్ధమేదీ జరగలేదందుకే..
అద్వైతమే వారి ప్రేమతత్వమని ఋజువయ్యాక..
5406. జీవనరాగమేనది..
నీ హృది నుండీ నా పెదవుల్లోనికి ప్రవహిస్తూ..
5407. పరువుతో పనిలేని కామసుందరుడు..
కమలలోచనుడైన రాధికా వల్లభుడు..
5408. మనసెప్పుడూ వశమే..
నీ ఆత్మీయత వెన్నెల్లో నిత్యపరవశమే..
5409. అనుబంధానికదేగా నిర్వచనం..
ఆ ఒక్కబొట్టు కట్టమనే తాపత్రయం..
5410. కొట్టుకుపోతున్న అనుభవాలు..
మిగిలిపోయిన జ్ఞాపకాలతో..
5411. మనసిట్టే చదివేస్తావు..
ఎంత దాచుకోవాలని చూసినా నువ్వు..
5412. నీరజాక్షుడే..
నయనమోహనమైన కోమలాకృతుడు..
5413. ఎన్ని మల్లెలద్దమంటావో..
నా భావాల పరిమళం అందలేదంటూ..
5414. ప్రతి ఋతువూ గ్రీష్మమై వెక్కిరిస్తోంది..
నాతో నువ్వులేని జీవితాన్ని తలపోసుకొని..
5415. అనుభూతులన్నీ దాచేసాను..
నీ అహంకారానికి ఎదురీదాలని లేనందుకే..
5416. వెలుగంటే మాత్రమదే..
నా రాకతో నీ చూపుల్లో విరిసే చిరునవ్వు..
5417. నీ మాటలు మరింత సున్నితమే..
నన్ను పొగిడిన ప్రతిసారీ అలసిపోతూ..
5418. కన్నీటితో మునిగిన తెప్ప..
గమ్యాన్ని ఆగమ్యగోచరం చేసేస్తూ..
5419. రంగులద్దుకున్న తొలివలపు..
వసంతమై నీవొచ్చి చూపులు చ(జ)ల్లగానే..
5420. నా మనసెందుకు అలసిపోయిందో..
నీ చూపులు సైగలేస్తుంటే..
5421. జావళీలేనట జాజులకు..
తన పరిమళానికే మనం వివశమైనందుకు..
5422. నిన్నంతా ఏమయ్యావో గుర్తుచేసుకుంటున్నా..
ఈరోజొచ్చి పెదవులు పూయమంటుంటే..
5423. సింధూరవీచికలే ఎదలో..
నీ ఊహలు చిరునవ్వులై పరామర్శించినప్పుడల్లా..
5424. ప్రేమరంగుకి ఒక్కరోజు..
హోలి అనుకుంటే అభ్యంతరం లేదు..
5425. కష్టపెట్టలేకున్నా మనసుని..
నిన్ను కాదని పక్కకి తిరగనంటుంటే
5426. నీ నానార్ధాలతో ఛస్తున్నా..
ప్రతిపదార్ధాలతో నన్ను రెచ్చగొడుతుంటే..
5427. గెలిచుకున్నావుగా హృదయాన్ని..
ప్రేమంటే ఆకర్షణను మించినదేదో ఉందంటూ..
5428. నా తలపులు సంపెంగలేగా..
నీ మనసు సింగారించుకున్నప్పుడల్లా..
5429. ఎనిమిదో రంగేదో అలరిస్తోంది..
నీ ప్రేమ హరివిల్లు కొత్తగా విరిసినట్లు అనిపిస్తుంటే..
5430. పదాలతోనే పాట పాడేస్తావు..
నేను అక్షరాలను పేర్చుతుండగానే..
5431. నీవెంటే నేనెప్పుడూ..
నా పగటి కలలోనూ నువ్వున్నప్పుడు..
5432. నవ్వుతూనే ఉన్నాను..
నన్ను పొగిడే సదావకాశాన్ని వినియోగించుకున్నావని..
5433. మౌనంతో గిల్లుతావెందుకలా..
పదాలను పెదవుల నుండీ జారనివ్వకుండా..
5434. ఎన్ని పల్లవులు కూర్చిపెట్టావో..
పాటల మధువులు పొంగేవేళలో..
5435. నీ మనసుపాట మెప్పించింది..
అరనవ్వుల పెదవుల లాస్యాలతోనే..
5436. క్షణాలకెందుకో పరితాపం..
నీ నవ్వులకు నేను బదులివ్వలేదంటే..
5437. ఆమని కవ్వించినట్లుందేమో..
హృదయం కోయిలై నాలా కూసింది..
5438. ఎన్నిసార్లు అడుగెట్టావో వాకిళ్ళలో..
నా చూపు లోగిళ్ళు ముగ్గులేసి నిన్ను రమ్మంటుంటే..
5439. నేనే కలనై రావాలనుకున్నా..
తారకోసం నువ్వెదురు చూస్తున్నావని..
5440. శిశిరాలకీ అలజడొస్తోంది..
వాసంతికవై నా చిరునవ్వునే స్వాప్నిస్తుంటే..
5441. ప్రేమను పలకరించేసాను..
నీ సమక్షంలో కన్నీరు ఆనందమై భాష్పాలు చిందుతుంటే..
5442. పెదవులలో చోటిచ్చావుగా..
ఎన్ని పువ్వులు పూస్తాయో రేపటికి వేచి చూడాలిక..
5443. ఊహల కోయిలకెన్ని కూతలో..
నన్ను మించాలనే తపనల్లో..
5444. అందం రెట్టింపవడం తెలుస్తోంది..
కవితా కుసుమాలతో నువ్వర్చించినందుకేమో..
5445. కవిని కనిపెట్టాలనుకున్నా..
ఆ హృదయంలో ఎవరున్నారో తెలుసుకుందామని..
5446. కలల్ని భరించలేకున్నా..
స్మృతుల ప్రవాహంలో ఊపిరాడనీయక ముంచేస్తుంటే..
5447. కలల్ని భరించలేకున్నా..
ఆలోచనల నిలువుటద్దమై మరకలన్నీ చూపుతుంటే.
5448. మనసొకటైతే చాలనుకున్నా..
మనమొకటైనా కాకున్నా..
5449. వెలుగుకేతనాల్ని రువ్వే నీ తలపులు..
నాలో నిశీధిని వెన్నెలతో నింపేస్తూ..
5450. ఒకరికొకరం పొందామనవేందుకో..
నిన్ను గెలుచుకున్నానని నేను ఒప్పుకుంటున్నా..
5451. ఎన్ని వన్నెలు రుచి చూసావో..
నన్నే వెన్నలా కరిగించేస్తూ నువ్వు..
5452. ఆ కన్నులకు కొంటెదనమెందుకో..
నేను మెదిలింది పెదవులపైనైతే..
5453. నెలవంకలైన నా నవ్వులు..
హృదయంలో నిన్ను కనుగొన్నందుకేగా..
5454. కలలోనే తీరిన ఆకలి వాడికి..
వాస్తవంలో మెతుకును ఆస్వాదించే ఆశలేక
5455. చూపునదుపులో పెట్టుకోవాలేమో..
రెప్పలు నన్ను దాచుకోవాలని ఆరాటపడొద్దంటే..
5456. ఎన్ని అవ్యక్తాలను వినగలిగిందో మనసు..
మౌనరాగాన్ని అక్షరబద్దం నే చేస్తుంటే..
5457. వలపంటే మనసైనందుకేగా..
నిశ్శబ్దానికీ ఏకాంతానికీ లోకువైంది మది..
5458. గండుకోయిలకే గాయమయ్యిందో మరి..
పెదవిప్పనంటూ ప్రియురాలిపై అలుకలు..
5459. వసంతం వరకూ ఆగలేని కోయిల..
శిశిరపుగాలికే గొంతు మూగబోయిన వేళలా..
5460. నా సరసానికెప్పుడూ గర్వమే..
ఆరడుగుల అందాన్ని పొందినందుకు..
5461. నీ మోము దర్శనం చాలు..
నా ఎదురుచూపు ఏనాడూ పరవశమయ్యేందుకు..
5462. చిగురించింది ఏకాకితనం..
ఒంటరి మౌనంలో నీ ధ్యాసలో నే లీనమైనందుకే..
5463. వెలుగునీడల కావ్యాలెన్ని పుడుతున్నాయో..
అనుభూతులను అక్షరీకరించాలని కూర్చున్నప్పుడల్లా..
5464. పెనవేసుకున్న తలపులనడుగు..
స్మృతులతో జీవనమెంత దుర్భరమో చెప్పమంటూ..
5465. అందం ప్రబంధమయ్యింది..
నీ చిలిపికన్నులు చదవడం మొదలెట్టగానే
5466. గంధం ఇగిరిపోనంది..
నీ చూపులెంత మృదువుగా తడుముతున్నా..
5467. సంగీతమే నాకు సమస్తం..
సాహిత్యమే మనకు సౌహార్దం..
5468. చిన్మయిగా మార్చేస్తావు..
చెలిమితోనే దోచేస్తూ..
5469. నీ ఆనందాన్ని అనువదిస్తున్నా..
ప్రణయలీలలు పండుగను తలపిస్తుంటే..
5470. జీవితమో గాలిబుడగ..
మౌనసముద్రంపై తేలియాడుతూ..
5471. మాటలు గుదిగుచ్చి చూసుకోమన్నా..
వలపు విరజాజుల పరిమళమిస్తుందనే..
5472. నిద్ర చేయించా జాజులన్నింటినీ..
నువ్వఘ్రాణించే రోజు మేలకువనుండాలని..
5473. విశ్వరహస్యాన్ని ఆరాతీస్తావెందుకో..
నా నవ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించకుండా..
5474. గమకాలను తోడు తెచ్చుకున్నా..
నా తమకాన్ని పాడాలనుకోగానే..
5475. అనూహ్యమైన భావం ప్రవహిస్తోంది..
హృదయమంత కాసారం కవితైనట్టు..
5476. పున్నమెళ్ళిపోయిందనుకున్నా..
నీవే నిండు జాబిలివై వస్తావని తెలియక
5477. చకోరమని ముద్దుగా పిలిచినప్పుడే అనుకున్నా..
నీ భావాల నక్షత్రాలతో చుట్టుముట్టావని..
5478. జ్ఞాపకమంటే..
నాతో కలిసున్న నువ్వు నేడు దూరమవ్వడమేగా..
5479. నీ బుగ్గలనంటింది నేనేగా..
ప్రతి మెరుపులోనూ వెలుగులీనుతూ..
5480. నీ జ్ఞాపకమదే..
కొన్ని రాత్రుల నిదురను దోచుకుపోవడం..
5481. కొన్ని పలుకులెప్పుడూ పులకరింతలే..
వెన్నెల్లో ఆడపిల్లనైనట్టు గిలిగింతలే..
5482. కలవరమయ్యాయి నా కలలు..
నువ్వు వాస్తవమై ఎదురొచ్చాక
5483. నిర్వేదాన్ని తరిమేసా..
వేదమై నువ్వెదురయ్యావనేగా..
5484. సుదీర్ఘమైపోయా..
సగం ఆనందంతో..సగం ప్రోత్సాహముతో..
5485. ఎంత నలిగిందో గాలి..
మన హృదయాల ప్రేమావస్థలో..
5486. కొన్ని కలయికలు కలల్లోనే..
అనుభూతులు కంపించాలని కోరుకున్నా..
5487. దారానికీ దైవత్వమొచ్చింది..
నీ మెడలో దండగా మారినందుకేమో..
5488. తానం మొదలెట్టా..
పల్లవై ప్రవహించేదెలాగో నువ్వు చెప్తావని..
5489. నిశ్శబ్దమే నేపధ్యమయ్యింది..
నా మౌనానికి సహకరించే సాయంత్రంలో..
5490. జ్ఞాపకాల జడివాన కురుస్తున్నట్లుంటుంది..
నేత్రాంచలాల్లో నీరు నిలిచినప్పుడల్లా..
5491. అడుగేయలేనంటూ పదములు..
నీతో సాగలేదని ఆరో అడుగు దగ్గరే ఆగిపోతూ..
5492. నాలో కన్నీరు ఉప్పెనై ప్రవహిస్తోంది..
జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కొట్టుకుపోతున్నా ఆపలేక
5493. ప్రేమ సైతం అక్కడే మిగిలింది..
పిలిచినా రాలేని నా స్వప్నంలోనే..
5494. చక్కని చుక్కవైన నువ్వు తప్పిపోయినందుకేమో..
తారల తళుకులతో నిన్నెతుకుతూ చందమామ..
5495. ఎప్పుడూ వైరాగ్యమే..
నీకు చేరువ కాలేని హృదయాన్ని తలచి తలచి..
5496. పరిమళిస్తున్న పుటలను పరిశీలించి చూడు..
మన ప్రేమాక్షరాలు వెలుగుతూ కనిపిస్తాయి..
5497. అహమెప్పుడు నేర్చిందో నాలో మౌనం..
ప్రేమించే మనసునే కాదంటూ ధిక్కారం..
5498. వేసవిని తరిమేయాలనుకున్నా..
కాశ్మీరపువ్వై నీ ఎదలో చేరైనా..
5499. గోటితో తీసెద్దామనుకున్నా నీ బాధ..
ప్రేమాకలిగా ఉందని నాతో చెప్పకపోయుంటే..
5500. నీ పిచ్చిలో నేను..
జ్ఞాపకాలనే వాస్తవాలనుకుంటూ అనుక్షణమూ..
This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment