5301. నీరవంలో నిట్టూర్పునే..
నా అనురాగాలన్నీ చరమగీతంలో కొట్టుకుపోయాక..
5302. నా ఊహలు పరిమళించినప్పుడే అనుకున్నా..
సంపెంగి నవ్వులొచ్చి నీలా చేరుంటాయని..
5303. నా అందానిదదెంత అదృష్టమో..
ఈ పూట నీ కనులకు విందయ్యే సౌందర్యం..
5304. హృదయమంతా కవిత్వమయ్యింది..
ముసిరిన భావాలన్నీ మురిపెంగా పేర్చుకోగానే..
5305. నీలో దాగిన మనసు..
అప్పుడప్పుడూ నిన్ను కవ్విస్తూ..
5306. నీలో దాగిన నా మనసు..
అప్పుడప్పుడూ నిన్ను కవ్వించి స్పృశించాలనే
5307. ఎక్కడ దాచాలో తెలియని తపనలు..
నువ్విలా స్నానంతో రంగరించి పోసేస్తుంటే..
5308. విరసమెక్కువయ్యిందిలే నీకు..
సరసానికి రానన్నానని ముప్పొద్దులా వెక్కిరిస్తూ..
5309. వేకువ ఎక్కడయ్యింది నాకు..
నీ రూపం తొలి దీపమై నిద్దుర లేపలేదంటే..
5310. నీ హృదయమే నా ఆకాశం..
నే జాబిలినై వెలగాలనుకునే వేళల్లో..
5311. ఎందుకన్నీ నిష్ఠూరాలాడతావో..
నీ గొంతులో రాగమై రవళించలేనన్నానని..
5312. అర్ధాలుండవనుకుంటా..
కొన్ని మాటలకు శబ్దాలు తప్ప..
5313. మౌనంతో రాయబారం నడుపుతావేం..
కన్నులు కలబోసుకున్నాయని కనిపెట్టలేదనా..
5314. సంతోషంగా ఉందిప్పుడు..
నీ వెనుక విజయరహస్యాన్ని నేనైనందుకు..
5315. నవ్వుతూ నేనుండిపోలేనా..
నా అధరాల తేజస్సుతో నీ ప్రపంచం వెలుగుతుందంటే.
5316. నవ్వంటే అదేగా..
నా గుండెతడి కన్నుల్లో కనిపించడం..
5317. గుండె జారిపోయింది..
నా హృదయం మోయలేని నీ బరువు హాయికే..
5318. ఆలకిస్తూనే ఉన్నే..
నీ మౌనాన్ని అనురాగముగా అనువదించుకున్నందుకు..
5319. నీ హృదయమంత నవనీతమెందుకో..
ముట్టకుండానే నన్ను కరిగించేస్తూ..
5320. నీకర్ధమైతే చాలనుకున్నా..
భాషేదైనా మన భావాలు ఒకటేగా..
5321. కొన్ని భావాలు దాచేసానందుకే..
భావచౌర్యం మనదాకా రావొద్దని..
5322. మనసంతా మల్లెలే..
నువ్వు నవ్వులు రువ్విన ప్రతిసారీ..
5323.నువ్వు తలపుకొచ్చేదందుకేగా..
నా నవ్వుల్లో కరిగి పూసయ్యేందుకు..
5324. గిలిగింతలతో గిచ్చేస్తావెందుకు..
ఒక్కమారు నా పెదవులు అలకపూనాయని..
5325. పెదవుల్లో నెలవంకవై ఎప్పుడో విచ్చేసావుగా..
అమాసన్నదే లేకుండా నా జీవితంలోనే..
5324. పరిమళమెక్కడిదోననుకున్నా..
నీ నవ్వులు సుమాలై విరబూసాయనుకోలా..
5325. ఆనందాన్ని మించిన తమకమయ్యింది..
నా అధరాలు విశాలమవ్వగానే..
5326. విరహమంతా కాలిపోయింది..
నీ నవ్వు స్మృతిపధంలో మెదలగానే..
5327. నేనే తారనైనందుకేమో..
మన సరసానికి కన్నుకుట్టి జాబిల్లి..
5328. అదో తన్మయత్వం..
పరిపూర్ణమైన ఆనందపు అమ్మనైన పరవశం..
5329. కన్నీటిలో శృతి కలిసిన నవ్వు..
వర్షపు జోరులో కొట్టుకుపోయిన జ్ఞాపకమై..
5330. కృష్ణుని అల్లరి ఆగడంలేదు..
తాను రాధనని భావించుకున్నాక..
5331. మనసయ్యింది..
నీ నవ్వు నాదయ్యక
5332. మది నిండింది..
ఆ కాస్త మధువూ పుచ్చుకున్నాక..
5333. నీ మందహాసం తెలుస్తోంది..
నా అధరం నీవయ్యాక..
5334. జయించేసా జీవితాన్ని..
ఎదురైన మృత్యువునే చిరునవ్వుతో సాగనంపి..
5335. ప్రబంధమే రాసేస్తావులే..
మన అనుబంధాన్ని అక్షరం చేయాలనుకుంటే..
5336. అన్నీ ముచ్చెమటలే..
తన చిరునవ్వుకి నేనుక్కిరిబిక్కిరి అవుతుంటే..
5337. చూపుతో రాసిన ప్రేమలేఖ చాలులే..
అదిరిన నా అందాల సాక్షిగా..
5338. కడలై పొంగిన ఆనందం..
నా నవ్వులు నీకిష్టమనే..
5339. నీ నవ్వులన్నీ దోచుకున్నా..
ఎదలో ప్రతిధ్వనిస్తూనే ఉండాలని..
5340. వలపంతా వసంతమే..
నీ రాక మనసుకి తెలిసాక..
5341. ఎన్ని గిలిగింతలిస్తావో చూపులకి..
మనసంతా రాసుకోమని అరువిచ్చి..
5342. శిశిరాన్ని పంపేసానందుకే..
నన్ను గుర్తిస్తావని..
5343.
నా అనురాగాలన్నీ చరమగీతంలో కొట్టుకుపోయాక..
5302. నా ఊహలు పరిమళించినప్పుడే అనుకున్నా..
సంపెంగి నవ్వులొచ్చి నీలా చేరుంటాయని..
5303. నా అందానిదదెంత అదృష్టమో..
ఈ పూట నీ కనులకు విందయ్యే సౌందర్యం..
5304. హృదయమంతా కవిత్వమయ్యింది..
ముసిరిన భావాలన్నీ మురిపెంగా పేర్చుకోగానే..
5305. నీలో దాగిన మనసు..
అప్పుడప్పుడూ నిన్ను కవ్విస్తూ..
5306. నీలో దాగిన నా మనసు..
అప్పుడప్పుడూ నిన్ను కవ్వించి స్పృశించాలనే
5307. ఎక్కడ దాచాలో తెలియని తపనలు..
నువ్విలా స్నానంతో రంగరించి పోసేస్తుంటే..
5308. విరసమెక్కువయ్యిందిలే నీకు..
సరసానికి రానన్నానని ముప్పొద్దులా వెక్కిరిస్తూ..
5309. వేకువ ఎక్కడయ్యింది నాకు..
నీ రూపం తొలి దీపమై నిద్దుర లేపలేదంటే..
5310. నీ హృదయమే నా ఆకాశం..
నే జాబిలినై వెలగాలనుకునే వేళల్లో..
5311. ఎందుకన్నీ నిష్ఠూరాలాడతావో..
నీ గొంతులో రాగమై రవళించలేనన్నానని..
5312. అర్ధాలుండవనుకుంటా..
కొన్ని మాటలకు శబ్దాలు తప్ప..
5313. మౌనంతో రాయబారం నడుపుతావేం..
కన్నులు కలబోసుకున్నాయని కనిపెట్టలేదనా..
5314. సంతోషంగా ఉందిప్పుడు..
నీ వెనుక విజయరహస్యాన్ని నేనైనందుకు..
5315. నవ్వుతూ నేనుండిపోలేనా..
నా అధరాల తేజస్సుతో నీ ప్రపంచం వెలుగుతుందంటే.
5316. నవ్వంటే అదేగా..
నా గుండెతడి కన్నుల్లో కనిపించడం..
5317. గుండె జారిపోయింది..
నా హృదయం మోయలేని నీ బరువు హాయికే..
5318. ఆలకిస్తూనే ఉన్నే..
నీ మౌనాన్ని అనురాగముగా అనువదించుకున్నందుకు..
5319. నీ హృదయమంత నవనీతమెందుకో..
ముట్టకుండానే నన్ను కరిగించేస్తూ..
5320. నీకర్ధమైతే చాలనుకున్నా..
భాషేదైనా మన భావాలు ఒకటేగా..
5321. కొన్ని భావాలు దాచేసానందుకే..
భావచౌర్యం మనదాకా రావొద్దని..
5322. మనసంతా మల్లెలే..
నువ్వు నవ్వులు రువ్విన ప్రతిసారీ..
5323.నువ్వు తలపుకొచ్చేదందుకేగా..
నా నవ్వుల్లో కరిగి పూసయ్యేందుకు..
5324. గిలిగింతలతో గిచ్చేస్తావెందుకు..
ఒక్కమారు నా పెదవులు అలకపూనాయని..
5325. పెదవుల్లో నెలవంకవై ఎప్పుడో విచ్చేసావుగా..
అమాసన్నదే లేకుండా నా జీవితంలోనే..
5324. పరిమళమెక్కడిదోననుకున్నా..
నీ నవ్వులు సుమాలై విరబూసాయనుకోలా..
5325. ఆనందాన్ని మించిన తమకమయ్యింది..
నా అధరాలు విశాలమవ్వగానే..
5326. విరహమంతా కాలిపోయింది..
నీ నవ్వు స్మృతిపధంలో మెదలగానే..
5327. నేనే తారనైనందుకేమో..
మన సరసానికి కన్నుకుట్టి జాబిల్లి..
5328. అదో తన్మయత్వం..
పరిపూర్ణమైన ఆనందపు అమ్మనైన పరవశం..
5329. కన్నీటిలో శృతి కలిసిన నవ్వు..
వర్షపు జోరులో కొట్టుకుపోయిన జ్ఞాపకమై..
5330. కృష్ణుని అల్లరి ఆగడంలేదు..
తాను రాధనని భావించుకున్నాక..
5331. మనసయ్యింది..
నీ నవ్వు నాదయ్యక
5332. మది నిండింది..
ఆ కాస్త మధువూ పుచ్చుకున్నాక..
5333. నీ మందహాసం తెలుస్తోంది..
నా అధరం నీవయ్యాక..
5334. జయించేసా జీవితాన్ని..
ఎదురైన మృత్యువునే చిరునవ్వుతో సాగనంపి..
5335. ప్రబంధమే రాసేస్తావులే..
మన అనుబంధాన్ని అక్షరం చేయాలనుకుంటే..
5336. అన్నీ ముచ్చెమటలే..
తన చిరునవ్వుకి నేనుక్కిరిబిక్కిరి అవుతుంటే..
5337. చూపుతో రాసిన ప్రేమలేఖ చాలులే..
అదిరిన నా అందాల సాక్షిగా..
5338. కడలై పొంగిన ఆనందం..
నా నవ్వులు నీకిష్టమనే..
5339. నీ నవ్వులన్నీ దోచుకున్నా..
ఎదలో ప్రతిధ్వనిస్తూనే ఉండాలని..
5340. వలపంతా వసంతమే..
నీ రాక మనసుకి తెలిసాక..
5341. ఎన్ని గిలిగింతలిస్తావో చూపులకి..
మనసంతా రాసుకోమని అరువిచ్చి..
5342. శిశిరాన్ని పంపేసానందుకే..
నన్ను గుర్తిస్తావని..
5343.
కొన్ని బంధాలంతే..
మాధుర్యమే మనోభావమై ఏకం చేసేందుకు..
5344. ఇష్టమదినై నవ్వుకున్నా..
అపరాజితగా నన్ను నువ్వు గెలిపించాక..
5345. పువ్వులవానై కురుస్తావనేగా..
నవ్వుల నావై నే దరిచేర్చింది..
5346. ఊపిరి తగిలితే తట్టుకోలేకపోయా..
కన్నులు నవ్వేస్తాయని తెలియక..
5347. నకిలీ నవ్వులేనన్నీ..
పెదవంచుకు వెలసిన రంగులను మెరిపించినట్లు..
5348. పేలాలే ఆ నవ్వులు..
పేలిపోయేందుకే పెదవుల జారిపడుతూ..
5349. ఇక్కడ వివశమవుతోంది..
అక్కడ గుసగుస చెవిని చేరగానే..
5350. అభినేత్రినైపోయానెప్పుడో..
నవ్వుతూ నటించడంలో ఆరితేరి..
5351. ప్రేమనై కోసుకొచ్చివ్వమన్నా..
నీ నవ్వుల్లో దాచుకున్నావని తెలిసాక..
5352. విరామమెక్కడుంది జీవితానికి..
నిత్యానుభూతుల అన్వేషణలో కాలం పరిగెత్తిస్తుంటే..
5353. నా ఊపిరి బరువెక్కుతోందెందుకో..
నీకోసం నవ్వులు రువ్విరువ్వి..
5354. మండిపోతున్న మనసు..
ఆ పెదవుల అభినయానికి విస్తుపోతూ..
5355.నిదురమబ్బులే బాగున్నట్లుంది కన్నులకు..
నీ కలలను పొదుపుకుంటున్నందుకు..
5356. వెర్రినైపోయానొక్కసారిగా..
నీ ప్రేమను తట్టుకోలేక..
5357. వెన్నెల చిందుకు వేళయ్యింది..
ఆరాగింపుకు ఆలశ్యం చేస్తావెందుకో..
5358. నిరీక్షణలోనే జీవితం..
నిశీధిలో నిలబడి నిన్ను నెమరేస్తుంటే..
5359. తనెప్పుడూ మన్మధుడే..
నాకు మాత్రమే కనిపించే వరమిచ్చాక..
5360. పగటికలై మిగిలింది యవ్వనం..
ఊహలతోనే కాపురం చేస్తుంటే..
5361. కళ్ళెంతగా తిరుగుతున్నాయో..
నీతో ఉప్పులగుప్పల్లో నే సొమ్మసిల్లిపోతుంటే..
5362. కైంకర్యమైపోయావుగా..
కాగల కార్యం కౌగిలిలోనే కానిచ్చి..
5363. తలమునకలైపోయా నీ ధ్యాసలో..
అలముకోవాలనుకున్న శూన్యాన్ని వెక్కిరించినట్లు..
5364. కొన్ని క్షణాలంతే..
యుగాలుగా మారి నిట్టూర్పుల్లోకి జారిపోతూ..
5365. వెలుతురెక్కడ మిగిలింది..
నీవు లేని లోకం చీకటయ్యాక..
5366. మౌన సంగీతమొకటి వినబడుతోంది..
నన్ను ఆస్వాదిస్తున్నది నీవేననిపిస్తూ.
5367. పల్లవిని అందుకోలేకపోతున్నా..
నీకు పాటలంటే ఇష్టమని తెలిసినా..
5368. నీ చిలిపితనానికి కానుకలేనవి..
పెదవులనుండీ కన్నుల్లోకి చేరినవేళలో..
5369. ఎంత మురిపమయ్యిందో ఒక్కసారిగా..
నీ ఆనందం నాదయ్యేంతగా..
5370. సస్మితమైన స్వరాలు..
నీ సరిగమలకు సొబగులను జోడించి..
5371. మాలికలేగా మాట్లాడింది..
నా మాటలెందుకు లెక్కకడతావో ప్రతిసారీ..
5372. గెలిచిందిగా వలపు..
మన కవిత్వాన్ని తనలోకి స్వీకరించి..
5373. పురుడోసుకుంటూనే తలపు..
నీ సౌరభాన్ని పీల్చిన ప్రతిసారీ..
5374. మునుపెరుగని నునుపులు..
తొలకరమై నన్ను తడిపిన నీ ఊహల వెల్లువకే..
5375. వసంతమనుకొని ముందే కూసింది కోయిల..
కాలాలన్నీ వెనుకకు జరిగిపోయాయని తెలియక..
5376. మధురభావాలన్నీ మనవేగా..
మోహనరాగాలతో కలిపి ఇరువురం పంచుకొంటుంటే..
5377. విడువక తప్పదు విషాదాన్ని..
ఎదురొచ్చిన ఆనందాన్ని ఆస్వాదించాలంటే..
5378. నన్నేగా నువ్వు తలచింది..
నవ్వులతోనే నన్ను గెలిచింది..
5379. అలగడం మానేస్తానైతే..
బుజ్జగించలేనని ఒప్పుకున్నందుకైనా..
5380. కంపిస్తున్న జ్ఞాపకాలు..
హృదయంలో నిర్లిప్తత కన్నులను చేరగానే..
5381. కవిత్వమై మురిసింది కాగితంపై అక్షరం..
మన అంతరంగ దాహాన్ని తీర్చేస్తూనే...
5382. ఆమె కళ్ళెప్పుడూ ఆర్ద్రమైనవే..
కన్నీటిని దాచుకొని నటించినా ఆనందభాష్పాలతో నిన్ను దీవించినా
5383. అమ్మ జ్ఞాపకమేనది..
ఒంటరి తీరాలలో విషాదమై ముంచేస్తూ..
5384. మాటలతో గుచ్చడం నీకే తెలుసు..
ఊహల పూలదండలెన్ని మెళ్ళో నేనేసినా..
5385. కురవడం నిత్యకృత్యమైంది మనసుకు..
ఒలికేందుకు కన్నులు సహకరిస్తుంటే
5386. ప్రణయం కొట్టుకుపోయింది..
చెలియలకట్ట వేయలేని కన్నుల ప్రవాహంలోనే..
5387. శబ్దించని స్వరంలా నేను..
నీ జ్ఞాపకాల విషాదాలకి..
మాధుర్యమే మనోభావమై ఏకం చేసేందుకు..
5344. ఇష్టమదినై నవ్వుకున్నా..
అపరాజితగా నన్ను నువ్వు గెలిపించాక..
5345. పువ్వులవానై కురుస్తావనేగా..
నవ్వుల నావై నే దరిచేర్చింది..
5346. ఊపిరి తగిలితే తట్టుకోలేకపోయా..
కన్నులు నవ్వేస్తాయని తెలియక..
5347. నకిలీ నవ్వులేనన్నీ..
పెదవంచుకు వెలసిన రంగులను మెరిపించినట్లు..
5348. పేలాలే ఆ నవ్వులు..
పేలిపోయేందుకే పెదవుల జారిపడుతూ..
5349. ఇక్కడ వివశమవుతోంది..
అక్కడ గుసగుస చెవిని చేరగానే..
5350. అభినేత్రినైపోయానెప్పుడో..
నవ్వుతూ నటించడంలో ఆరితేరి..
5351. ప్రేమనై కోసుకొచ్చివ్వమన్నా..
నీ నవ్వుల్లో దాచుకున్నావని తెలిసాక..
5352. విరామమెక్కడుంది జీవితానికి..
నిత్యానుభూతుల అన్వేషణలో కాలం పరిగెత్తిస్తుంటే..
5353. నా ఊపిరి బరువెక్కుతోందెందుకో..
నీకోసం నవ్వులు రువ్విరువ్వి..
5354. మండిపోతున్న మనసు..
ఆ పెదవుల అభినయానికి విస్తుపోతూ..
5355.నిదురమబ్బులే బాగున్నట్లుంది కన్నులకు..
నీ కలలను పొదుపుకుంటున్నందుకు..
5356. వెర్రినైపోయానొక్కసారిగా..
నీ ప్రేమను తట్టుకోలేక..
5357. వెన్నెల చిందుకు వేళయ్యింది..
ఆరాగింపుకు ఆలశ్యం చేస్తావెందుకో..
5358. నిరీక్షణలోనే జీవితం..
నిశీధిలో నిలబడి నిన్ను నెమరేస్తుంటే..
5359. తనెప్పుడూ మన్మధుడే..
నాకు మాత్రమే కనిపించే వరమిచ్చాక..
5360. పగటికలై మిగిలింది యవ్వనం..
ఊహలతోనే కాపురం చేస్తుంటే..
5361. కళ్ళెంతగా తిరుగుతున్నాయో..
నీతో ఉప్పులగుప్పల్లో నే సొమ్మసిల్లిపోతుంటే..
5362. కైంకర్యమైపోయావుగా..
కాగల కార్యం కౌగిలిలోనే కానిచ్చి..
5363. తలమునకలైపోయా నీ ధ్యాసలో..
అలముకోవాలనుకున్న శూన్యాన్ని వెక్కిరించినట్లు..
5364. కొన్ని క్షణాలంతే..
యుగాలుగా మారి నిట్టూర్పుల్లోకి జారిపోతూ..
5365. వెలుతురెక్కడ మిగిలింది..
నీవు లేని లోకం చీకటయ్యాక..
5366. మౌన సంగీతమొకటి వినబడుతోంది..
నన్ను ఆస్వాదిస్తున్నది నీవేననిపిస్తూ.
5367. పల్లవిని అందుకోలేకపోతున్నా..
నీకు పాటలంటే ఇష్టమని తెలిసినా..
5368. నీ చిలిపితనానికి కానుకలేనవి..
పెదవులనుండీ కన్నుల్లోకి చేరినవేళలో..
5369. ఎంత మురిపమయ్యిందో ఒక్కసారిగా..
నీ ఆనందం నాదయ్యేంతగా..
5370. సస్మితమైన స్వరాలు..
నీ సరిగమలకు సొబగులను జోడించి..
5371. మాలికలేగా మాట్లాడింది..
నా మాటలెందుకు లెక్కకడతావో ప్రతిసారీ..
5372. గెలిచిందిగా వలపు..
మన కవిత్వాన్ని తనలోకి స్వీకరించి..
5373. పురుడోసుకుంటూనే తలపు..
నీ సౌరభాన్ని పీల్చిన ప్రతిసారీ..
5374. మునుపెరుగని నునుపులు..
తొలకరమై నన్ను తడిపిన నీ ఊహల వెల్లువకే..
5375. వసంతమనుకొని ముందే కూసింది కోయిల..
కాలాలన్నీ వెనుకకు జరిగిపోయాయని తెలియక..
5376. మధురభావాలన్నీ మనవేగా..
మోహనరాగాలతో కలిపి ఇరువురం పంచుకొంటుంటే..
5377. విడువక తప్పదు విషాదాన్ని..
ఎదురొచ్చిన ఆనందాన్ని ఆస్వాదించాలంటే..
5378. నన్నేగా నువ్వు తలచింది..
నవ్వులతోనే నన్ను గెలిచింది..
5379. అలగడం మానేస్తానైతే..
బుజ్జగించలేనని ఒప్పుకున్నందుకైనా..
5380. కంపిస్తున్న జ్ఞాపకాలు..
హృదయంలో నిర్లిప్తత కన్నులను చేరగానే..
5381. కవిత్వమై మురిసింది కాగితంపై అక్షరం..
మన అంతరంగ దాహాన్ని తీర్చేస్తూనే...
5382. ఆమె కళ్ళెప్పుడూ ఆర్ద్రమైనవే..
కన్నీటిని దాచుకొని నటించినా ఆనందభాష్పాలతో నిన్ను దీవించినా
5383. అమ్మ జ్ఞాపకమేనది..
ఒంటరి తీరాలలో విషాదమై ముంచేస్తూ..
5384. మాటలతో గుచ్చడం నీకే తెలుసు..
ఊహల పూలదండలెన్ని మెళ్ళో నేనేసినా..
5385. కురవడం నిత్యకృత్యమైంది మనసుకు..
ఒలికేందుకు కన్నులు సహకరిస్తుంటే
5386. ప్రణయం కొట్టుకుపోయింది..
చెలియలకట్ట వేయలేని కన్నుల ప్రవాహంలోనే..
5387. శబ్దించని స్వరంలా నేను..
నీ జ్ఞాపకాల విషాదాలకి..
5388. అక్షరాలెందుకు తడబడుతున్నవో..
నీ చూపును అనువదించాలని నేను ప్రయత్నించిన ప్రతిసారీ..
5389. ఎందుకిన్ని కష్టాలో..
చంచలమైన జీవితపు అడుగులెటో తడబడుతుంటే
5390. మనసు రహస్యాలు ఆరా తీస్తావెందుకో..
ఇప్పుడిప్పుడే కష్టాలను కంచికి పంపిస్తుంటే..
5391. ఒక్క కలనూ పూర్తికానివ్వవెందుకో..
మధ్యలోనే కళ్ళాపేసి లేపేస్తూ..
5392. భావాలుగా అనువదించేసా స్వప్నాలన్నీ..
అనుభూతులై నిన్ను అల్లుకుంటాయనే..
5393. కాకల నిషాదాన్ని పాడనన్నానందుకే..
నువ్విలా విషాదంలోనే మునిగిపోతావని..
5394. కలకాలం ప్రేమరంగులద్దుకుంటూ..
దివ్యమైన పల్లవులై మన కలలు..
5395. వెన్నెలై నేనొచ్చేసా..
అమాసనుకొని భ్రమపడ్డావనే..
5396. జాబిల్లిని ఆకట్టుకొనే స్వయంవరమనుకున్నా..
తారలన్నీ తళుక్కుమంటూ మెరుస్తుంటే..
5397. సమస్త సుఖాల తధాస్తులూ వినబడుతున్నవి..
ముహూర్తబలం అనంతసుఖాలను దయచేసిందేమో మరి..
5398. నేనెప్పుడూ నీ నీడనే..
నీ కిరణాలకే ప్రకాశిస్తూ..
5399. తానొక శాంతి..
అలజడిలో మదిని మురిపెంగా ఓదార్చుతూ..
5400. కన్నీటికి కార్చిచ్చు ఆగదనుకుంటా..
మనసెంత మూగగా రోదించినా..
నీ చూపును అనువదించాలని నేను ప్రయత్నించిన ప్రతిసారీ..
5389. ఎందుకిన్ని కష్టాలో..
చంచలమైన జీవితపు అడుగులెటో తడబడుతుంటే
5390. మనసు రహస్యాలు ఆరా తీస్తావెందుకో..
ఇప్పుడిప్పుడే కష్టాలను కంచికి పంపిస్తుంటే..
5391. ఒక్క కలనూ పూర్తికానివ్వవెందుకో..
మధ్యలోనే కళ్ళాపేసి లేపేస్తూ..
5392. భావాలుగా అనువదించేసా స్వప్నాలన్నీ..
అనుభూతులై నిన్ను అల్లుకుంటాయనే..
5393. కాకల నిషాదాన్ని పాడనన్నానందుకే..
నువ్విలా విషాదంలోనే మునిగిపోతావని..
5394. కలకాలం ప్రేమరంగులద్దుకుంటూ..
దివ్యమైన పల్లవులై మన కలలు..
5395. వెన్నెలై నేనొచ్చేసా..
అమాసనుకొని భ్రమపడ్డావనే..
5396. జాబిల్లిని ఆకట్టుకొనే స్వయంవరమనుకున్నా..
తారలన్నీ తళుక్కుమంటూ మెరుస్తుంటే..
5397. సమస్త సుఖాల తధాస్తులూ వినబడుతున్నవి..
ముహూర్తబలం అనంతసుఖాలను దయచేసిందేమో మరి..
5398. నేనెప్పుడూ నీ నీడనే..
నీ కిరణాలకే ప్రకాశిస్తూ..
5399. తానొక శాంతి..
అలజడిలో మదిని మురిపెంగా ఓదార్చుతూ..
5400. కన్నీటికి కార్చిచ్చు ఆగదనుకుంటా..
మనసెంత మూగగా రోదించినా..
This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment