4301. అమృతానికి తాతయ్యవనేగా..
వరస కుదిరిందని నిన్ను వలచింది..
4302. ఒంటరిపోరాటం చేస్తుంది మది..
దగ్గరైన కుతంత్రాన్ని వదిలించుకోలేక..
4303. ఎదురైనప్పుడే అనుకున్నా..
వలపులవల విసిరేందుకు సిద్ధమైన రాజువని..
4304. అబద్దం కుబుసం విడిచింది..
నిజాన్ని నగ్నం చేసేందుకే..
4305. రేపెలా ఉంటానో..
నన్నిలా నవ్విస్తే..
4306. ఆద్యంతం అందమైన భావాలే..
నిన్ను రాద్దామని కూర్చుంటే
4307. అక్షరం విలువ తరిగింది ఆనాడే
పిచ్చివాడి చేతిలో కలంగా మారి..
4308. అక్షరం ఓడిపోయింది..
కులోద్మాదుల ఎరుపు జీరల్లో తడిచినందుకే..
4309. పరవశాన్ని గుర్తెట్టుకున్నాలే..
కైవల్యాన్ని కరుణించిందని..
4310. నాకు కనిపిస్తే చాలనుకున్నా..
మన్మధుడివై నాలో సజీవమైనప్పుడే..
4311. సరసోత్సవ శుభఘడియలకేముందిలే తొందర..
పూలతెమ్మెరలను ఒక్కమారన్నా వీయనీ..
4312. మరణసదృసమే జీవనం..
కొన్ని బంధాలను వీడినా వెంటపడుతుంటే..
4313. నీ అక్షరాల మెరుపులే..
మిణుగురులై నన్ను చదివిస్తూ..
4314. రెప్పలను ముద్దు చేయొద్దన్నానందుకే..
అవసరమైనప్పుడు అరమోడ్పులుగా మారుతున్నాయని..
4315. నీ హృదయంలో ఆలాపనయ్యా నేనప్పుడే..
నీ రాగంలో కలిపి పాడినందుకే..
4316. గుభాళిస్తూనే ఉందిగా మైత్రివనం..
గంధమంటించే చెలిమి తోడవ్వగా..
4317. శవరాజకీయాలు అన్నదందుకే..
మనషులనే కాక చావునూ తమకు అనుకూలంగా మార్చుకుంటారని..
4318. ప్రేమందుకే వెనక్కు మళ్ళింది..
అహమంటేనే తనకి మక్కువయ్యిందని..
4319. విరజాజులనెందుకు వెలివేస్తావు..
ఉదయం పూయకున్నా సాయంత్రానికి జోడవుతుందిగా..
4320. నీ చూపుదొంతరలో చిక్కుకుంది మనసు..
మౌనాన్ని మల్లెలుగా చల్లడం తెలుస్తోందేమో..
4321. యుగాలవుతున్న క్షణాలెన్నో..
వియోగాన్ని నీ స్మృతులతో లెక్కించుకుంటూ..
4322. నువ్వు చూస్తే చాలనుకున్నా నన్ను..
మనుచరిత్రలో నన్ను చేర్చి రాస్తావని..
4323. శ్రీమంతుడివైతే చాలనుకున్నా..
నా కోరికల చిట్టా విప్పొచ్చని..
4324. నీ చూపులు కరుగుతున్నప్పుడే అనుకున్నా..
కన్నీరు ప్రవహించే సూచన ఇచ్చావని..
4325. ఎర్రటి కోయిలనే..
నీకైన ఎదురుచూపుల్లో కన్నులు కలతపడినందుకు..
4326. పగటినిద్ర పనికి రాదంటే మానుకోవు..
నిశీధిలో వెలుతురు లేదని గోలపెడుతూ..
4327. గుసగుసలు చాటవుతున్నాయి..
గుట్టెక్కడ విప్పుతావోనని..
4328. మొదలయ్యింది వలపుహేల..
నీ మాటల్లో అంత్యాక్షరిగా చేరతానంటూ..
4329. గుండెల్లో కలదిరుగుతున్న వెచ్చదనం..
నీ గుసగుసలు గుర్తుకొచ్చినందుకే..
4330. నీ చూపులో రెండు నక్షత్రాలు..
నన్ను చూసి మెరిసినవే అనుకున్నందుకు..
4331. హేమంత కౌగిళ్ళవి..
చూపుల వెచ్చదనంతో చలి కాచుకుంటే..
4332. జ్ఞాపకాల వీధుల్లో తిరగడం మానేసా..
మధుమాసం మేఘమై వచ్చి పిలిచిందనే..
4333. వంతెనేస్తే బాగుండేది..
బాటలో కొత్తిమీరపువ్వులు అలవకుండా ఎదిగేందుకు..
4334. వేకువవుతుందంటే అదెంత ఆనందమో ఊహలకి..
మరో మాలికాతోరణంతో మనసుని అలంకరిద్దామని..
4335. నీరసమొస్తోంది నాకెందుకో..
వెలుతురై దారిచూపుతుంటే దీపాన్ని వెతుక్కొనే నిన్ను చూసి..
4336. పిలిచావనే వచ్చేసా వెన్నెలనై..
మొన్ననే పున్నమైందని గుర్తొచ్చినా..
4337. మరాళినని గుర్తించావుగా..
మనసుకది చాలులే..
4338. నా చెక్కిలి మెరుస్తోందిక్కడ..
నీ కన్నీరు వరావర్తనమవుతుంటే..
4339. ఎన్నడో కోయిలనయ్యా..
కనుపాపలు సంధ్యను కళ్ళకు పూసుకున్నప్పుడే..
4340. చీకటనే హృదయానికీ స్పందన తెలుస్తుందేమో..
ఏ వెలుగును కౌగిలించాలోననే ఆలోచనలో..
4341. నిత్యం ఓదార్పులే నెలరాజు..
రాతిరయ్యేవేళకు అలా తిరిగొస్తానని..
4342. వియోగాన్నెందుకలా విసుక్కుంటావో..
వసంతం విరియాలంటే ఋతువులు గడవొద్దూ..
4343. తప్పించుకోలేని కల్లోలాలు కొన్ని..
కల్మషం కొలువైన అనుబంధాలలో..
4344. కృత్రిమత్వాన్ని కలిపి కుట్టేస్తే చాలేమో..
బ్రతుకు చిత్రం సరికొత్త ముస్తాబుతో..
4345. జీవించే ఉన్నా..
నీ భావాలలో నన్ను ఆవిష్కరించుకుంటూ..
4346. అలసిపోతూనే ఉన్నా..
నీ అల్లరిమాటలకు పదేపదే పులకరిస్తూనే
4347. తేనెలూరాయెందుకో నా కనుపాపలు..
సప్తవర్ణాలనూ అనేకంగా చూసేందుకేమో..
4348. బాల్యమో సహజత్వం..
నటించే నేటికన్నా అదే నిజం..
4349. భిన్నంగా చూసినందుకేమో..
దివ్యత్వం బయటపడింది..
4350. నా చూపుల్లోని వాడి నీ కన్నులది..
నా కన్నుల్లోని వేడి నీ నవ్వులది..
4351. ఇహలోకి వచ్చానిప్పుడే..
నీ పరిమళమేదో నన్ను తాకినందుకే..
4352. నన్ను చూసి వికసిస్తున్న పువ్వులు..
ఒక్కరోజే ప్రాణమని తెలిసినా నవ్వుతూ..
4353. కలలో దారి మరచినందుకేమో..
నీముందిలా ప్రత్యక్షమై నేను..
4354. చూపులకు అమృతం సోకినందుకేమో..
కొసచూపుతో ప్రాణాలు తిరిగొస్తూ..
4355. మౌనరాగాలు తొలిసంధవే..
సాయంకాలానికి పుట్టింటికి పయనమవ్వక తప్పదుగా..
4356. భావం కుదిరిందనుకున్నా..
నన్నే నీ కవితగా భావిస్తుంటే..
4357. నీ కళ్ళలోగిళ్ళలో నిలిచానుగా..
కన్నీటితో కల్లాపులకోసం ఆగుతూ..
4358. అక్షరాలను దాచుకోమంటున్నా..
సేద్యం చేసేందుకు సమయం ముందుందని..
4359. చూడక తప్పలేదా కన్నుల్లోకి..
అల్లుకుపోవాలనే ఆకాంక్షలు నిలవనీకపోతుంటే..
4360. మనస్సయిందో బృందావనం..
నువ్వో కోయిలవై పల్లవించి తిరుగుతూంటే..
4362. కన్నుల కిటికీనెందుకు మరచావో..
రెప్పలు మూస్తే మనోచూపుల వాకింట్లో నిలబడ్డది నేనేగా..
4363. మధుపమై వచ్చినప్పుడే అనుకున్నా..
నన్నో పువ్వని భ్రమించేసావని..
4364. నీ మంట చూస్తేనే తెలుస్తోంది..
నా విరహం నీకు నవ్వులాటయ్యిందని..
4365. తలపులసవ్వడికే ఉలిక్కిపడతావెందుకో..
తలుపు మూసి రమ్మని వినబడ్డందుకా..
4366. కవితగా మారిందో నిశ్శబ్దం..
మౌనంగా చదివే నువ్వున్నావనే..
4367. పులిహోరతో సరిపెడత్తావే..
పరమాన్నం నాకు ప్రీతని తెలిసికూడా..
4368. శిక్ష అనుభవించే బయటకొచ్చే మనం..
మరోమాయను కప్పుకొని లోకాన్ని గెలిచేందుకు..
4369. నువ్వెప్పుడూ పరాయివే..
నిన్నుగా స్వీకరించించలేని లోకపు కొలతలకి..
4370. కృషిని నమ్మినందుకేగా..
ప్రయత్నం ఫలించకపోయినా నమస్కారం మిగిలింది..
4371. సూర్యునిలోనూ విప్లవం చూస్తున్నా నేడు..
హేమంతపు చలిలోనూ ఇంతగా మండిస్తుంటే..
4372. తలుపే తట్టని కొన్ని కలలు..
రెప్పలు మూసే అవకాశమే నేనివ్వలేదని..
4373. వలసొచ్చేస్తా సూటిగా ఎదలోకే..
చకోరమై చేయిచాచి పిలిచావంటే..
4374. బతుకు జట్కాబండి చూడటం ఆపేసా..
ఊహించని అగాధాలను కళ్ళకుకట్టి చూపిస్తున్నారనే..
4375. అక్షరాల లాలింపు కావాలనిపిస్తుంది..
నువ్వు వెల్లువై గుర్తొచ్చినప్పుడల్లా..
4376. ఒప్పుకున్నా నీ ఆనందం..
ప్రకృతిని నీలో మమైకం చేసి నన్ను స్వాగతించడం..
4377. అక్షరాల హొయలు..
ఉత్తుంగప్రవాహంలో పాయలుగా ఒయారమంతా ఒలికిస్తూ..
4378. ఆనందయోగమే మనసుకి..
అక్షరతేనెవాకలో ప్రవహించే అదృష్టం నాదైనందుకు...
4379. ఇష్టమైన ఆరాటం..
కష్టాన్ని వెక్కిరించి కన్నీటిని తీపిచేసే చన్నీటి హేమంతం..
4380. అభినేత్రిని కాలేకపోయానందుకే..
కన్నీరూ సాయంచేయక ఏడ్చినా నవ్వినట్లుంటుంటే..
4381. దర్పణంగా మారితే అంతే..
లోకపు ఆమోదం కోసం నీకు నువ్వు పరాయివవ్వాల్సిందే..
4382. నవ్వులు పెదవుల్ని వీడిపోయాయి..
కన్నుల్లోనైతే మరింతగా ప్రకటించవచ్చని..
4383. అనుభూతి దగ్గరయ్యిందిగా..
అక్షరాన్ని అలవోకగా మౌనదీక్షకి పురిగొల్పి..
4384. రాయితోనేగా శిల్పాన్ని మలచేది..
శిల్పిగా మారేందుకు సిద్ధమైపోతానైతే..
4385. మనసెప్పుడూ వసంతంలోనే..
మాటలు శిశిరాలై గాలికి ఎగిరిపడుతున్నా..
4386. మనోధైర్యానివే నాకెప్పటికీ..
ఒంటరితనంలోనూ జ్ఞాపకమై విషాదాన్ని మరపిస్తూ..
4387. ఊపిరిలో గాలి నింపింది నీవేగా..
శ్వాసకు శాశ్వత పరిమళాలను ధారపోసి..
4388. ఇంతలోనే ఎన్ని పరవశాలో..
ఎదను పొదరిల్లుగా మార్చేస్తూ నీ ఊహల సరిగమలు..
4389. మరణమో వరమే..
అంతర్ముఖాలను చదవలేని మన జీవితాల్లో..
4390. కొన్ని వరాలు శాపాలుగానే పరిణమిస్తాయి..
అసంగతమైన విషయాలనే మనసు పరిగ్రహిస్తుంటే..
4391. నిశ్శబ్దమూ పరిమళిస్తోంది..
మౌనంగా నిన్ను రాస్తూ నేనుంటే..
4392. చూపుని ఆవహిస్తున్న నవ్వులు..
పెదవులు కోపంగా చూస్తుంటే
4393. నిర్మానుష్యమైన నా మనసు..
నీ ఒక్క వెనుకడుగుతోనే.
4394. జీవితమో రంగస్థలమే..
పాత్రలు వేర్వేరు ప్రదేశాల్లో నటిస్తున్నా..
4395. చూపులు గిచ్చాయంటావే..
నవ్వులు కరుస్తున్నా పెద్దగా పట్టించుకోనట్లు..
4396. బరువైన కలలు కనొద్దన్నానందుకే..
రెప్పలు మోయలేక విడిచేస్తాయనే
4397. ప్రతి నవ్వుబొట్టులోనూ అనుభూతి కనిపిస్తోంది..
చిత్తరువుని చేసి నన్నునిలబడమంటూ..
4398. రసోదయమై వెలిగిపోతోంది ఉదయం..
పరిమళాల ప్రకృతి నీ తలపును చీరగా చుట్టబెడుతుంటే..
4399. ఒదగలేని పాత్రలే కొన్ని..
వద్దన్నా తప్పించుకోలేని అభినయాలలో..
4400. అలలదెంత అదృష్టమో..
క్షణానికోమారు తీరాన్ని వెల్లువై ముద్దాడుతూ..
వరస కుదిరిందని నిన్ను వలచింది..
4302. ఒంటరిపోరాటం చేస్తుంది మది..
దగ్గరైన కుతంత్రాన్ని వదిలించుకోలేక..
4303. ఎదురైనప్పుడే అనుకున్నా..
వలపులవల విసిరేందుకు సిద్ధమైన రాజువని..
4304. అబద్దం కుబుసం విడిచింది..
నిజాన్ని నగ్నం చేసేందుకే..
4305. రేపెలా ఉంటానో..
నన్నిలా నవ్విస్తే..
4306. ఆద్యంతం అందమైన భావాలే..
నిన్ను రాద్దామని కూర్చుంటే
4307. అక్షరం విలువ తరిగింది ఆనాడే
పిచ్చివాడి చేతిలో కలంగా మారి..
4308. అక్షరం ఓడిపోయింది..
కులోద్మాదుల ఎరుపు జీరల్లో తడిచినందుకే..
4309. పరవశాన్ని గుర్తెట్టుకున్నాలే..
కైవల్యాన్ని కరుణించిందని..
4310. నాకు కనిపిస్తే చాలనుకున్నా..
మన్మధుడివై నాలో సజీవమైనప్పుడే..
4311. సరసోత్సవ శుభఘడియలకేముందిలే తొందర..
పూలతెమ్మెరలను ఒక్కమారన్నా వీయనీ..
4312. మరణసదృసమే జీవనం..
కొన్ని బంధాలను వీడినా వెంటపడుతుంటే..
4313. నీ అక్షరాల మెరుపులే..
మిణుగురులై నన్ను చదివిస్తూ..
4314. రెప్పలను ముద్దు చేయొద్దన్నానందుకే..
అవసరమైనప్పుడు అరమోడ్పులుగా మారుతున్నాయని..
4315. నీ హృదయంలో ఆలాపనయ్యా నేనప్పుడే..
నీ రాగంలో కలిపి పాడినందుకే..
4316. గుభాళిస్తూనే ఉందిగా మైత్రివనం..
గంధమంటించే చెలిమి తోడవ్వగా..
4317. శవరాజకీయాలు అన్నదందుకే..
మనషులనే కాక చావునూ తమకు అనుకూలంగా మార్చుకుంటారని..
4318. ప్రేమందుకే వెనక్కు మళ్ళింది..
అహమంటేనే తనకి మక్కువయ్యిందని..
4319. విరజాజులనెందుకు వెలివేస్తావు..
ఉదయం పూయకున్నా సాయంత్రానికి జోడవుతుందిగా..
4320. నీ చూపుదొంతరలో చిక్కుకుంది మనసు..
మౌనాన్ని మల్లెలుగా చల్లడం తెలుస్తోందేమో..
4321. యుగాలవుతున్న క్షణాలెన్నో..
వియోగాన్ని నీ స్మృతులతో లెక్కించుకుంటూ..
4322. నువ్వు చూస్తే చాలనుకున్నా నన్ను..
మనుచరిత్రలో నన్ను చేర్చి రాస్తావని..
4323. శ్రీమంతుడివైతే చాలనుకున్నా..
నా కోరికల చిట్టా విప్పొచ్చని..
4324. నీ చూపులు కరుగుతున్నప్పుడే అనుకున్నా..
కన్నీరు ప్రవహించే సూచన ఇచ్చావని..
4325. ఎర్రటి కోయిలనే..
నీకైన ఎదురుచూపుల్లో కన్నులు కలతపడినందుకు..
4326. పగటినిద్ర పనికి రాదంటే మానుకోవు..
నిశీధిలో వెలుతురు లేదని గోలపెడుతూ..
4327. గుసగుసలు చాటవుతున్నాయి..
గుట్టెక్కడ విప్పుతావోనని..
4328. మొదలయ్యింది వలపుహేల..
నీ మాటల్లో అంత్యాక్షరిగా చేరతానంటూ..
4329. గుండెల్లో కలదిరుగుతున్న వెచ్చదనం..
నీ గుసగుసలు గుర్తుకొచ్చినందుకే..
4330. నీ చూపులో రెండు నక్షత్రాలు..
నన్ను చూసి మెరిసినవే అనుకున్నందుకు..
4331. హేమంత కౌగిళ్ళవి..
చూపుల వెచ్చదనంతో చలి కాచుకుంటే..
4332. జ్ఞాపకాల వీధుల్లో తిరగడం మానేసా..
మధుమాసం మేఘమై వచ్చి పిలిచిందనే..
4333. వంతెనేస్తే బాగుండేది..
బాటలో కొత్తిమీరపువ్వులు అలవకుండా ఎదిగేందుకు..
4334. వేకువవుతుందంటే అదెంత ఆనందమో ఊహలకి..
మరో మాలికాతోరణంతో మనసుని అలంకరిద్దామని..
4335. నీరసమొస్తోంది నాకెందుకో..
వెలుతురై దారిచూపుతుంటే దీపాన్ని వెతుక్కొనే నిన్ను చూసి..
4336. పిలిచావనే వచ్చేసా వెన్నెలనై..
మొన్ననే పున్నమైందని గుర్తొచ్చినా..
4337. మరాళినని గుర్తించావుగా..
మనసుకది చాలులే..
4338. నా చెక్కిలి మెరుస్తోందిక్కడ..
నీ కన్నీరు వరావర్తనమవుతుంటే..
4339. ఎన్నడో కోయిలనయ్యా..
కనుపాపలు సంధ్యను కళ్ళకు పూసుకున్నప్పుడే..
4340. చీకటనే హృదయానికీ స్పందన తెలుస్తుందేమో..
ఏ వెలుగును కౌగిలించాలోననే ఆలోచనలో..
4341. నిత్యం ఓదార్పులే నెలరాజు..
రాతిరయ్యేవేళకు అలా తిరిగొస్తానని..
4342. వియోగాన్నెందుకలా విసుక్కుంటావో..
వసంతం విరియాలంటే ఋతువులు గడవొద్దూ..
4343. తప్పించుకోలేని కల్లోలాలు కొన్ని..
కల్మషం కొలువైన అనుబంధాలలో..
4344. కృత్రిమత్వాన్ని కలిపి కుట్టేస్తే చాలేమో..
బ్రతుకు చిత్రం సరికొత్త ముస్తాబుతో..
4345. జీవించే ఉన్నా..
నీ భావాలలో నన్ను ఆవిష్కరించుకుంటూ..
4346. అలసిపోతూనే ఉన్నా..
నీ అల్లరిమాటలకు పదేపదే పులకరిస్తూనే
4347. తేనెలూరాయెందుకో నా కనుపాపలు..
సప్తవర్ణాలనూ అనేకంగా చూసేందుకేమో..
4348. బాల్యమో సహజత్వం..
నటించే నేటికన్నా అదే నిజం..
4349. భిన్నంగా చూసినందుకేమో..
దివ్యత్వం బయటపడింది..
4350. నా చూపుల్లోని వాడి నీ కన్నులది..
నా కన్నుల్లోని వేడి నీ నవ్వులది..
4351. ఇహలోకి వచ్చానిప్పుడే..
నీ పరిమళమేదో నన్ను తాకినందుకే..
4352. నన్ను చూసి వికసిస్తున్న పువ్వులు..
ఒక్కరోజే ప్రాణమని తెలిసినా నవ్వుతూ..
4353. కలలో దారి మరచినందుకేమో..
నీముందిలా ప్రత్యక్షమై నేను..
4354. చూపులకు అమృతం సోకినందుకేమో..
కొసచూపుతో ప్రాణాలు తిరిగొస్తూ..
4355. మౌనరాగాలు తొలిసంధవే..
సాయంకాలానికి పుట్టింటికి పయనమవ్వక తప్పదుగా..
4356. భావం కుదిరిందనుకున్నా..
నన్నే నీ కవితగా భావిస్తుంటే..
4357. నీ కళ్ళలోగిళ్ళలో నిలిచానుగా..
కన్నీటితో కల్లాపులకోసం ఆగుతూ..
4358. అక్షరాలను దాచుకోమంటున్నా..
సేద్యం చేసేందుకు సమయం ముందుందని..
4359. చూడక తప్పలేదా కన్నుల్లోకి..
అల్లుకుపోవాలనే ఆకాంక్షలు నిలవనీకపోతుంటే..
4360. మనస్సయిందో బృందావనం..
నువ్వో కోయిలవై పల్లవించి తిరుగుతూంటే..
4362. కన్నుల కిటికీనెందుకు మరచావో..
రెప్పలు మూస్తే మనోచూపుల వాకింట్లో నిలబడ్డది నేనేగా..
4363. మధుపమై వచ్చినప్పుడే అనుకున్నా..
నన్నో పువ్వని భ్రమించేసావని..
4364. నీ మంట చూస్తేనే తెలుస్తోంది..
నా విరహం నీకు నవ్వులాటయ్యిందని..
4365. తలపులసవ్వడికే ఉలిక్కిపడతావెందుకో..
తలుపు మూసి రమ్మని వినబడ్డందుకా..
4366. కవితగా మారిందో నిశ్శబ్దం..
మౌనంగా చదివే నువ్వున్నావనే..
4367. పులిహోరతో సరిపెడత్తావే..
పరమాన్నం నాకు ప్రీతని తెలిసికూడా..
4368. శిక్ష అనుభవించే బయటకొచ్చే మనం..
మరోమాయను కప్పుకొని లోకాన్ని గెలిచేందుకు..
4369. నువ్వెప్పుడూ పరాయివే..
నిన్నుగా స్వీకరించించలేని లోకపు కొలతలకి..
4370. కృషిని నమ్మినందుకేగా..
ప్రయత్నం ఫలించకపోయినా నమస్కారం మిగిలింది..
4371. సూర్యునిలోనూ విప్లవం చూస్తున్నా నేడు..
హేమంతపు చలిలోనూ ఇంతగా మండిస్తుంటే..
4372. తలుపే తట్టని కొన్ని కలలు..
రెప్పలు మూసే అవకాశమే నేనివ్వలేదని..
4373. వలసొచ్చేస్తా సూటిగా ఎదలోకే..
చకోరమై చేయిచాచి పిలిచావంటే..
4374. బతుకు జట్కాబండి చూడటం ఆపేసా..
ఊహించని అగాధాలను కళ్ళకుకట్టి చూపిస్తున్నారనే..
4375. అక్షరాల లాలింపు కావాలనిపిస్తుంది..
నువ్వు వెల్లువై గుర్తొచ్చినప్పుడల్లా..
4376. ఒప్పుకున్నా నీ ఆనందం..
ప్రకృతిని నీలో మమైకం చేసి నన్ను స్వాగతించడం..
4377. అక్షరాల హొయలు..
ఉత్తుంగప్రవాహంలో పాయలుగా ఒయారమంతా ఒలికిస్తూ..
4378. ఆనందయోగమే మనసుకి..
అక్షరతేనెవాకలో ప్రవహించే అదృష్టం నాదైనందుకు...
4379. ఇష్టమైన ఆరాటం..
కష్టాన్ని వెక్కిరించి కన్నీటిని తీపిచేసే చన్నీటి హేమంతం..
4380. అభినేత్రిని కాలేకపోయానందుకే..
కన్నీరూ సాయంచేయక ఏడ్చినా నవ్వినట్లుంటుంటే..
4381. దర్పణంగా మారితే అంతే..
లోకపు ఆమోదం కోసం నీకు నువ్వు పరాయివవ్వాల్సిందే..
4382. నవ్వులు పెదవుల్ని వీడిపోయాయి..
కన్నుల్లోనైతే మరింతగా ప్రకటించవచ్చని..
4383. అనుభూతి దగ్గరయ్యిందిగా..
అక్షరాన్ని అలవోకగా మౌనదీక్షకి పురిగొల్పి..
4384. రాయితోనేగా శిల్పాన్ని మలచేది..
శిల్పిగా మారేందుకు సిద్ధమైపోతానైతే..
4385. మనసెప్పుడూ వసంతంలోనే..
మాటలు శిశిరాలై గాలికి ఎగిరిపడుతున్నా..
4386. మనోధైర్యానివే నాకెప్పటికీ..
ఒంటరితనంలోనూ జ్ఞాపకమై విషాదాన్ని మరపిస్తూ..
4387. ఊపిరిలో గాలి నింపింది నీవేగా..
శ్వాసకు శాశ్వత పరిమళాలను ధారపోసి..
4388. ఇంతలోనే ఎన్ని పరవశాలో..
ఎదను పొదరిల్లుగా మార్చేస్తూ నీ ఊహల సరిగమలు..
4389. మరణమో వరమే..
అంతర్ముఖాలను చదవలేని మన జీవితాల్లో..
4390. కొన్ని వరాలు శాపాలుగానే పరిణమిస్తాయి..
అసంగతమైన విషయాలనే మనసు పరిగ్రహిస్తుంటే..
4391. నిశ్శబ్దమూ పరిమళిస్తోంది..
మౌనంగా నిన్ను రాస్తూ నేనుంటే..
4392. చూపుని ఆవహిస్తున్న నవ్వులు..
పెదవులు కోపంగా చూస్తుంటే
4393. నిర్మానుష్యమైన నా మనసు..
నీ ఒక్క వెనుకడుగుతోనే.
4394. జీవితమో రంగస్థలమే..
పాత్రలు వేర్వేరు ప్రదేశాల్లో నటిస్తున్నా..
4395. చూపులు గిచ్చాయంటావే..
నవ్వులు కరుస్తున్నా పెద్దగా పట్టించుకోనట్లు..
4396. బరువైన కలలు కనొద్దన్నానందుకే..
రెప్పలు మోయలేక విడిచేస్తాయనే
4397. ప్రతి నవ్వుబొట్టులోనూ అనుభూతి కనిపిస్తోంది..
చిత్తరువుని చేసి నన్నునిలబడమంటూ..
4398. రసోదయమై వెలిగిపోతోంది ఉదయం..
పరిమళాల ప్రకృతి నీ తలపును చీరగా చుట్టబెడుతుంటే..
4399. ఒదగలేని పాత్రలే కొన్ని..
వద్దన్నా తప్పించుకోలేని అభినయాలలో..
4400. అలలదెంత అదృష్టమో..
క్షణానికోమారు తీరాన్ని వెల్లువై ముద్దాడుతూ..
![]() | This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment