Tuesday, 7 March 2017

5101 to 5200

5101. నీ పిలుపే..
వసంత కోయిల పల్లవై వినబడుతూ..
5102. చిత్తమెప్పుడూ చపలమే..
నచ్చితే పామునీ తాడనుకొని వాటేస్తూ..
5103. నీ జ్ఞాపకమే..
నా తలపువాకిట్లో గులాబీమొగ్గలా వికసిస్తూ..
5104. స్వరాలాపన సౌరభాలు..
నీ గీతంలో నన్ను పాడుతుంటే..
5105. విభూతిరేఖలే అలంకారాలు..
మంచుకొండను ఏలేవాడైనా..
5106. భావం ప్రాప్తించింది..
అక్షరాలను ప్రేమగా ఆలింగనం చేసుకోగానే.. 
5107. నీ మెరుపులే..
నాలోని నిశీధిని నిర్దాక్ష్యణ్యంగా వెళ్ళగొడుతూ..
5108. సమస్యల పీడ..
మనల్ని కలవనివ్వని అసహనపు ముళ్ళపొదలా..
5109. నువ్వెప్పుడూ సశేషమే..
నేనెంత విశేషంలోకి నిన్ను లాక్కుపోతున్నా..
5110.  సిసలైన సంఘర్షణ ఒక్కటి చాలేమో..
విజయపు చివరిమెట్టుపై కాలుమోపే ధైర్యమిచ్చేందుకు..
5111. నా నవ్వంతే..
రేపటికి నిన్నో వ్యసనానికి దగ్గరచేస్తూ..
5112. ఎంతకని రోదిస్తావో..
నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నానని చెప్పేందుకు..
5113. వెన్నెల మైదానంలో వేచిఉన్నా..
నాపై చిలికిస్తావనే ఆనందతరంగ..
5114. ఎన్ని రేవులు దాటాలో..
సరైన ప్రేమతీరానికి చేరాలంటే..
5115. కొత్తరుచి మరిగింది నాలుక..
రంగునోట్లను తీయగా ఆరగిస్తూ..
5116. ఆరాధించి చూడు..
అడిగినవన్నీ కాదనక ఇచ్చేస్తాడు కరుణాకటాక్షుడు..
5117. కలలు కనడం ఆపలేదందుకే..
ప్రతి కన్నీటి బిందువూ నిద్దురలో నిన్నే చూపిస్తుంటే..
5118. నేనింతే..
నా నయనాల్లో నీలాన్ని దాచేసుకుంటూ..
5119. ప్రతిరాత్రీ శివరాత్రే..
నీ నామజపంతోనే రేయి తెల్లారిపోతుంటే..
5120. అడక్కుండానే విచ్చేసావుగా..
నా మనసో బృందావనమై ఆకర్షించిందని..
5121. ఆకాశం వైపే చూస్తావెందుకో..
నీ అదృష్టాన్ని నేలపాల్జేస్తుకుంటూ..
5122. నిలబడనివ్వని నీ ఊసులు..
గగనమే సరైన సంతోషమంటూ..
5123. మధువును వేడి చేయొద్దన్నా..
మధురోహల్లో నువ్వు కాలిపోతావనే
5124. వంటిల్లు దాటి బయటకొచ్చేసా..
వసంతోత్సవమిదేనని మగువలంతా పాడుతున్నారనే..
5125. అయస్కాంతమే తను..
దూరమైనప్పుడు ఆకర్షించి..దగ్గరయ్యాక జిగురైనట్టు..
5126. పారిజాతపువ్వై ఒక అనుభూతి..
నీ అక్షరాలు మదినంటగానే..
5127. కన్నీటి ఊటలన్నీ కంటి బయటేగా..
మనసు రాకున్నా చేయందిస్తే చాలుగా..
5128. మరోచరిత్ర మొదలవుతుందేమో..
మీ మనోవేదన నేననువదించే రాసేస్తే..
5129. నేనొక మధువునే..
తాగినా..తలపోసినా..
5130. మనసుతో చూసావెందుకో మరి..
సంపెంగి నవ్వులతోనే నీకిష్టమని..
5131. కల చెదిరిందెందుకో..
నీ హృదయసవ్వడి గతితప్పినట్లు అనిపించాక..
5132. నిద్దురే పట్టకుంది..
కల రమ్మని పిలిచినా కలవరమొస్తోంది..
5133. ఆర్తి చూపామనుకుంటారు..
ఆలోచన దగ్గరే ఎందుకో ఆగిపోతారు..
5134. భావపవనమై తనొస్తే చాలు..
కన్నులెప్పుడూ అరమోడ్పుల రాగాలే..
5135. ఊరించే నా సూరీడైతే నువ్వేగా..
వేకువరేఖల్లో అరమూతలై కనులు విచ్చేవేళ..
5136. నా మదిలో నీ రాగం..
మన అనురాగానికి మౌన భాష్యం..
5137. ఉపనయనాలెన్ని తగిలించాలో..
నిన్ను చదవాలనే కోరిక ఉధృతమవుతుంటే..
5138. ప్రేమగానే స్వీకరిస్తున్నా..
నాకు నచ్చినట్లు మెప్పించి దగ్గరయ్యావనే..
5139. నాలో మునకేస్తూనే ఉన్నావుగా..
మౌనవ్రతాలెందుకులే మాలికలు మూగబోయేలా..
5140. ఎప్పుడూ ఆమె..
నచ్చిన పాత్రకై ఎదురుచూసే అభినేత్రిలా..
5141. నీలిరంగులో చూసినప్పుడే అనుకున్నా..
ఆకాశమంటి నన్నంటుకొని మెరుపులీనుతున్నావని..
5142. ఎన్నిసార్లు పుట్టిన వేచుంటాలే..
కేవలం ఏడుజన్మలతో తీరిపోయే బంధమైతే కాదుగా మనది..
5143. ఎన్ని అనుభవాలైనా అంతేగా..
తాపత్రయమొకటి అశాంతిగా రెచ్చగొడుతుంది..
5144. హృదయాన్ని తడుముకోమన్నా..
నా ఆలాపన తప్పక నచ్చుతుందనే..
5145. నా కలం కలకలమైనప్పుడే అనుకున్నా..
నీ అల్లరేదో నింపుకొని వచ్చుంటుందని..
5146. నీరాజనం అందుకున్నా..
నీ అభిమానం కర్పూరమై వెలిగినప్పుడే..
5147. కొన్ని జీవితాలంతే..
గ్రహణానికి చిక్కిన నిండుగోళాల మిధ్యల్లా..
5148. నిర్లక్ష్యాన్ని మించిన ఓటమేముంది..
అనుక్షణం మానసికంగా చచ్చేందుకు..
5149. ఎన్ని చూపులు చదివిందో ఆమె..
ఆ మనసునిట్టే ఆకళింపు చేసుకుంటూ..
5150. చిరునవ్వులు సోకినప్పుడే అనుకున్నా..
భావతరంగమై ఊహలోనే నన్నల్లావని..
5151. కౌగిలినే నేను..
నీకు గిలిగింతనిచ్చానంటే.
5152. సెలయేళ్ళే ఆ కళ్ళు..
కాలాతీత ప్రవాహాలై ఉరకలేస్తూ..
5153. కౌముదీ కిరణాలామె చూపులో..
చంద్రముఖి పేరు సార్ధకమయ్యిందేమో..
5154. భవిష్యత్తు ఎన్నిక..
ఎవరెక్కువసార్లు వచ్చిపోతే వారికే వరమాల..
5155. వంటిల్లే గర్భగుడి..
నిత్యనైవేద్యాలన్నీ పాపం దేవేరితోనే వండిస్తూ..
5156. మౌన పారవశ్యాలు..
కనువెన్నెల తానై తలపుల్లో కురుస్తుంటే..
5157. అదో మౌన చైతన్యమే..
తీయనిబాధ నిలువెల్లా ప్రవహిస్తుంటే..
5158. జూకామల్లెనై వచ్చా..
జామురాతిరి జానపదం ఝల్లుమని రవళించాలనే..
5159. 
నీ చూపు చొరవలో..
నా అడుగు కలహంస నడుము ఒయ్యరాన్ని అడుగు
5160. సూరీడేగా మార్గదర్శి..
నా కలల గమ్యానికై అడుగులేసేవేళ..
5161. గిలిగింతలైతే ఏమోననుకున్నా..
పరిమళమై కురుల్లోనే దాగున్నావని తెలియక..
5162. జాబిలినై నేనొచ్చేసా..
వెన్నెల జలతారు నీవు మోయలేవని..
5163. ఏ గ్రహమూ నీ వెంటపడదు..
నిగ్రహముగా నీ పనిలో నువ్వుంటే..
5164. మల్లెనై నేను..
మత్తువై నీవు..
5165. హేమంతమే మిగిలింది..
ఒణికించే స్పర్శ శిశిరానికి చేరువయ్యాక..
5166. మోమాటమెక్కువే నీకు..
చచ్చిన నిన్నటికోసం రేపు ఎదురుచూస్తానంటూ..
5167. కలలోనే సాగింది రేయంతా..
ఊహలమత్తును పగటికి పంచిచ్చేసి..
5168. ముగ్ధమోహనాలే..
వరించిన వెన్నెల్లో వలపించిన వసంతునితో..
5169. తనువొక ధనువే..
సంధించేందుకైనా..సందిట్లో సంతోషం సముద్రమయేందుకైనా..
5170. ఆ దేహం పునీతమవ్వాలట..
అనుభవతీర్ధంలో ఎన్ని మునకలేయాలో..
5171. రససాగరాలు ఈదొద్దన్నానందుకే..
ప్రతివారూ ఈత నేర్పమని చేరిపోతారనేగా..
5172. రహస్యాలన్నీ చెప్పెస్తావెందుకో..
ఇప్పటికే దృష్టి తగిలి ఛస్తుంటే..
5173. ఎన్ని మాటలు నేర్చావో..
సయ్యాటకు ఒక్కసారి రానన్నానని..
5174. రాలుగాయిగా మారావెందుకో..
వద్దన్న రాగాన్నే పదిమాట్లు ఆలపిస్తూ..
5175. 
రెప్పలు బరువెక్కుతున్నాయెందుకో..
అనుభూతుల రాగాలు మనసు పాడుకుంటుంటే
5176. మరకతాలన్నీ మదిలోనే..
ముత్యాలు మాత్రమే చూపులకు అంటిస్తూ..
5177. ప్రేమస్వరాలన్నీ మదిలోనే..
పైకి సంగీతం రానట్లు కనిపించినా..
5178. కన్నులు వాలిపోయిందందుకే..
నీ హృదయాంజలి సరసోదయాన్ని తలపిస్తుంటే..
5179. నా వలపుల ప్రణయధారలు నాడు..
నీ తలపుల మల్లెలవానలో నేడు..
5180. స్వయంవరాన్ని గుర్తుచేస్తావెందుకో..
ఎంతసేపూ నా సిగ్గునే తడిమేస్తూ..
5181. నా చేయి వదిలిందెప్పుడని..
కలలోనూ నన్నే అనుసరిస్తూ..
5182. నాకైతే ఇష్టమే..
నీ తలపులైనా..నీ కవితలైనా..
5183. మాటలు పరిమళమే..
మనసులో నీవుంటే
5184. ఆరాధనంతా నాదే..
రాధ నేనన్నావని..
5185.గీతికయ్యానందుకే..
నీ వేణునాదం హృదయాన్ని తాకిందనే..
5186. మాలికావనమే బృందావనమవుతోంది..
మనమిద్దరం రాధామాధవులమవుతుంటే..
5187. గుభాళిస్తున్న నీ తలపులు..
అల్లరిగాలిలో చేరి నువ్వొస్తుంటే..
5188. రేపటికి తొందరపడుతున్నా..
మోజులన్నీ మల్లెల్లోకి తీసుకుపోయే వేళవుతుందని..
5189. రేయింబవళ్ళూ పరవశాలేగా..
హృదయంలో బంధీనైనా..
5190. నీ ఉషోదయం నేనేగా..
రాతిరి నిద్దుర కరువైనా
5191. ముందుకెలా వెళ్ళనూ..
వెనుక నుంచీ నువ్వు వాటేస్తుంటే..
5192. ముందుకెలా వెళ్ళనూ..
మోమాటం పట్టిలాగుతుంటే.
5193. ముందుకెలా వెళ్ళనూ..
సౌందర్యం నీలా నన్ను నిలువరించాక..
5194. అన్వేషణలోనే జీవితాలన్నీ..
నిజమైన ప్రేమెక్కడుందోనని..
5195. చంచలమవుతున్న మౌనం..
నా భావాలలో అక్షరాలుగా సంచరిస్తూ..
5196. చిలిపిగా నువ్వు చూడకుండానే సిద్ధం..
నీ అల్లరిని మనసారా చదివేందుకు..
5197. హృదయమంతా వెచ్చదనమే..
నిన్ను కౌగిలించిన ఉచ్ఛ్వాసల గంధాలతో..
5198. 
ముందుకెలా వెళ్ళనూ..
అనుమతినివ్వక నీ ప్రేమతో కట్టేస్తుంటే.
5199. కొన్ని పరిమళాలంతే..
హృదయంలోకే సూటిగా
5200. ఇంత కస్తూరి పూసావెందుకో..
కౌగిలికి దూరమవుతానని భయపడి..



This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment