6201. కొసరి కొసరి చూస్తావెందుకలా..
మల్లెలు మీటినట్లు మనసులిక్కిపడుతుంటే
6202. గొంతు మూగబోయిందెందుకో..
నిన్ను చూడగానే కన్నులకు మాటలిచ్చి..
6203. మరో సంకలనం కోసమే ఎదురుచూపులు..
నీలో సంచలనం నేనని తెలిసాక..
6204. నీ ఆశలకు ఊపిరులూదాలనే నేనొచ్చా...
నిన్ను కనికరించి ప్రేమను పంచివ్వాలని.
6205. జంటజావళిగా మిగిలిపోదామనుకున్నా..
నీ జతలో జలపాతమై ఉరకలేస్తూ..
6206. నీ మనసుకెప్పుడూ అల్లరేగా..
నన్ను దూరం చేసి మరీ విరహాన్ని రాస్తానంటూ..
6207. నా ప్రపంచమైతే నీతోనే..
నీ ప్రపంచంలోనికి ఆహ్వానించినందుకు.
6208. విరహంలో రాలిన పువ్వులు కొన్ని..
నాలా మారి నిన్ను ఓదార్చాలని..
6209. ముత్యాల వసంతానికనే నేనొచ్చా..
ముద్దులతో స్వాగతిస్తావని తెలియగానే...
6210. కనుమూసినా కలలో నేనుంటా..
వెన్నెలను కలిసి ఆస్వాదిద్దామంటే
6211. వెన్నెలకన్నా హాయిగా అనిపిస్తోంది..
స్మృతులే నీలా లాలిస్తుంటే..
6212. నీ మనసుకన్నా మెత్తగా ఏముంది..
తడుముకున్నప్పుడల్లా గమకాలకు తమకాలు తోడిస్తూ..
6213. ఎన్ని కావ్యాలో హృదయానికి..
తన మౌనంలోనికి నువ్వొచ్చాక
6214. ఏం తక్కువైందని అడుగుతావెందుకో..
విరహానికి నన్ను కానుకిచ్చి..
6215.ఆదర్శమైన ప్రేమంటా..
మల్లెలు మీటినట్లు మనసులిక్కిపడుతుంటే
6202. గొంతు మూగబోయిందెందుకో..
నిన్ను చూడగానే కన్నులకు మాటలిచ్చి..
6203. మరో సంకలనం కోసమే ఎదురుచూపులు..
నీలో సంచలనం నేనని తెలిసాక..
6204. నీ ఆశలకు ఊపిరులూదాలనే నేనొచ్చా...
నిన్ను కనికరించి ప్రేమను పంచివ్వాలని.
6205. జంటజావళిగా మిగిలిపోదామనుకున్నా..
నీ జతలో జలపాతమై ఉరకలేస్తూ..
6206. నీ మనసుకెప్పుడూ అల్లరేగా..
నన్ను దూరం చేసి మరీ విరహాన్ని రాస్తానంటూ..
6207. నా ప్రపంచమైతే నీతోనే..
నీ ప్రపంచంలోనికి ఆహ్వానించినందుకు.
6208. విరహంలో రాలిన పువ్వులు కొన్ని..
నాలా మారి నిన్ను ఓదార్చాలని..
6209. ముత్యాల వసంతానికనే నేనొచ్చా..
ముద్దులతో స్వాగతిస్తావని తెలియగానే...
6210. కనుమూసినా కలలో నేనుంటా..
వెన్నెలను కలిసి ఆస్వాదిద్దామంటే
6211. వెన్నెలకన్నా హాయిగా అనిపిస్తోంది..
స్మృతులే నీలా లాలిస్తుంటే..
6212. నీ మనసుకన్నా మెత్తగా ఏముంది..
తడుముకున్నప్పుడల్లా గమకాలకు తమకాలు తోడిస్తూ..
6213. ఎన్ని కావ్యాలో హృదయానికి..
తన మౌనంలోనికి నువ్వొచ్చాక
6214. ఏం తక్కువైందని అడుగుతావెందుకో..
విరహానికి నన్ను కానుకిచ్చి..
6215.ఆదర్శమైన ప్రేమంటా..
ఒక్కరి వ్యక్తిత్వం మాత్రమే బ్రతికింది..
6216. నేనే మధువైపోతున్నా..
అధరాన్ని తాకాలనుందని మధుపమై నువ్వనగానే..
6217. వైశాఖ పున్నమంటే రేయికీ మక్కువే..
వెన్నెల చీరను తనువారా అలంకరించేందుకు..
6218. ఎదురుచూస్తున్నానందుకే..
నా కనుపాపలకు తోడుగా నీవిచ్చే కలలను హత్తుకుందామని..
6219. ఎన్ని రంగులు మిళితమయ్యాయో రాతిరిలో..
లోకాన్ని పూర్తి విశ్రాంతిలోకి నెట్టేస్తూ..
6210. అనంతసౌఖ్యాన్ని గుర్తించా నీ మదిలో..
కొత్తగా మౌనాన్ని ధరిస్తున్నావని గమనించాక..
6211. నిట్టూర్పుగా మారుతున్న కొన్ని నిశ్వాసలు..
నా ఊపిరి విడిచి నువ్వెళ్ళిపోతుంటే..
6212. అద్భుతం జరగొచ్చు..
ఆకాంక్ష బలమై ఆరాటంగా మారిపోతే..
6213. నీ అడుగులకెందుకో మరి తడబాటు..
ఏడడుగులు వేయిస్తానని నన్ను రమ్మన్నాక..
6214. ఆత్మీయతా గుభాళింపులేనవి..
దూరమై చేరువైన స్మృతుల పరవశాలు..
6215. ఛస్తూ బ్రతికే జీవితం..
కన్నీటికీ లోకువైన ప్రారబ్దం..
6216. కొన్ని మాధుర్యాలెప్పుడూ మనసులోనే..
పెదవంచు దాటలేని మకరందంలా..
6217. హేమంతం అడ్డొచ్చిందని అనుకోలేదు..
వసంతాన్ని ముద్దాడాలని నీవనుకున్నా..
6218. రాళ్ళన్నీ అరిగినట్టే..
జలపాతానికే కదలికుంటే
6219. మౌనాన్ని హత్తుకుంది నా తలపు..
మూగభాష మొదలెట్టింది నీ మనసనే..
6220.గిలిగింతలకు కొదవేముంది..
వేసవిగాలంతా నీలా మారి నన్నల్లుతుంటే
6221. తొలకరిని తోడుకొచ్చేసా..
నీ విరహపు ప్రణయాగ్నిని చల్లార్చేందుకే..
6222. చినుకులై చేరుతున్న భావాలు కొన్ని..
మది బీడులో కవిత్వాన్ని మొలకెత్తేందుకు..
6223. కొత్తబంగారు లోకమే కలలో..
బాల్యాన్ని తడుముకున్నప్పుడల్లా ఇలలో..
6224. ఇంత నవ్వుకున్నారని తెలీలేదు..
ఏడుపునీ ఎగతాళి చేసేవరకూ..
6225. యవ్వనానికి సిగ్గొచ్చింది..
బాల్యంలోని క్షణాలను పెదవంచునే దాచేసావని..
6226. మరకతమై మెరిసిపోతున్నా..
నువ్వలదిన పచ్చలతో తనువంతా అలలారిందని..
6227. నీ విరహం ఆమెకెలా తెలిసిందో..
తొలకరి నిన్ను చేరిందిగా తపనలో..
6228. ఎదురీతకు అలవాటుపడిన మనసు..
జీవనపయనాన్ని గమ్యం చేర్చాలని..
6229. ఎన్ని చిగురింతలో పల్లవానికి..
పదనిసలన్నీ చిరునవ్వులై వెలుగుతుంటే
6230. తీరాన్ని చేరలేని కెరటంలా నేను..
అందనంత దూరాన నువ్వుండి విరహమైనందుకు..
6231. సంధ్యకెందుకు సిగ్గయ్యిందో..
మన నడకల్లో తనకి చోటిచ్చినందుకేమో..
6232. ఊసుపోలేదన్నది నువ్వేగా..
ఇరుపొద్దుల్లోనూ నన్నే ఎదలోకి రమ్మంటూ..
6233. ఆ సాయంత్రంలోనే నేనుండిపోయా..
నీ కన్నుల్లోని నా రూపానికే ముగ్ధ చిత్తరువైనట్టు..
6234. ఆనందం నేనై స్పందిస్తున్నా..
నీలో ప్రేమకు బదులడిగావనే..
6235. కుసుమమై చేరిపోయా..
నా వలపు గంధాన్ని గుర్తిస్తావో లేదోనని గమనించేందుకే..
6236. కలలోనూ కలవరాలే..
నీ విరహంలోనే మది మూగబోతుంటే
6237. మనసులో రాలుగాయివే..
నా మాటలనే సన్నాయిగా మార్చేస్తూ..
6238. మాటల్లో మెలికెలు వెతుకుతావే..
మనసులో మెరుపు కురిపిస్తున్నా..
6239. సంపెంగనెందుకు నొప్పించావో..
నా పరిమళంతో పోల్చి విదిలిస్తూ..
6240. భావాలకి భయమెక్కడుందిలే..
మనసును పరిచే తొందరెక్కువై ఉరకలేస్తుంటే..
6241. నా మనసు గుభాళించడం తెలుస్తోంది..
నీ సన్నజాజులకు 'సై' అన్నందుకేమో..
6242. ప్రతి ఋతువూ వసంతమైనట్లే ఉంది..
ఊరు మనసు నిదుర లేపుతున్నప్పుడల్లా..
6243. నక్షత్రాలకెందుకో అరమోడ్పులు..
నువ్వో వెన్నెల పున్నాగువై శృతి చేస్తుంది నన్నైతే..
6244. పగటికెన్ని కొంటెకలలో..
రాతిరైతే విజృంభించాలని..
6245. మలయమారుతాలు మాత్రమాగలేదుగా..
రోజంతా నీ రాకకై నేనెంత ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నా..
6246. కాటుకల్లోనే దాచేసాను కొన్ని కలలు..
మనసుకి తెలిస్తే ముప్పు తప్పదని..
6247. శూన్యాకాశంలో వెలిగే ఒంటరినక్షత్రంలా బాల్యం..
కన్నీటికీ లోకువైన లేత వెన్నముద్దల ప్రాయం
6248. ఊహించని శిక్షలెన్నో బాల్యానికి..
నిట్టూర్పు సెగలతో మండిపోతూ..
6249. నీవో చెంగల్వ కోమలివే..
చంద్ర కిరణాలు సోకి ఎర్రని అందంతో మెరిసిపోతూ..
6250. నీకై పూసుకున్న గంధపునూనంతా కొట్టుకుపోయింది..
మూణ్ణాళ్ళ విరహనికి మైలస్నానం ముగించావనే..
6251. కలలన్నీ నీ పరం చేసా..
ఒంటరితనాన్ని ఓర్వలేనని నా హృదయమంటుంటే..
6252. నన్ను నాకు దూరం చేసినందుకేమో..
నీకు నువ్వు కాకుండా మిగిలిపోయావు..
6253. అనుభవాల దండలేగా కధలన్నీ..
అక్షరమాలలో అందంగా ఒదిగిపోతూ..
6254. అనురాగాన్నే పునాది చేసాను..
చినుకు సవ్వడి సైతం నీకు దూరం కారాదనేగా..
6255. సానుభూతికి సమయమయ్యింది..
ఆకలి అవధి దాటి ముందుకెళ్తుంటే..
6256. ఆనందమూ నీదేగా..
నాలోనికి ప్రవహించి కొత్తరంగులు నింపుకున్నాక..
6257. కసరత్తులన్నీ కలల్లోనే..
ఇలలో అడుగులు కదలనని మొరాయిస్తుంటే
6258. మన తొలి పరిచయాన్ని తడుముకుంటున్నా..
వెన్నెల మరగడాన్ని ఇంకోసారి చూడాలనిపించే..
6259. సప్తపదికే అందమొచ్చింది..
సప్తాశ్వాలను దాటి హృదయాలు ఉరకలేస్తుంటే..
6260. రాగాలన్నీ ఆరున్నొక్కటై మిగిలాయి..
అతను చూపిన నరకంతోనే..
6261. నిత్యమైన వెతుకులాటొకటి..
నీలో తప్పిపోయిన మనసును కనుగొనలేక..
6262. ఆరు ఋతువులు దాటాలనుకుంది శిశిరం..
తృణపత్రాలన్నీ రాల్చి కవిత్వానికైనా తోడవ్వాలని..
6263. కెరటమవుతోంది మానసం..
నీ ఊహల ఊయలకి మత్తెక్కుతూనే..
6264. మది స్వప్నం నుండీ వేరయ్యిందిప్పుడే..
నీ పరిమళమొకటి నిద్దుర లేపగానే..
6265. కిరణమై మేల్కొల్పింది నువ్వే..
నాలోని చీకటిని తరిమేస్తూ..
6266. తడుముకోలేని అనుభూతులెన్నో..
నీ ఆనందంలో భావాలుగా మారలేక..
6267. మరోసారి జన్మించాలనుంది..
ఈసారైనా నీలో నవనీతమై కరిగిపోవాలని..
6268. విరహానికీ విలువొచ్చేసింది..
వియోగంలో ప్రేమ మరింత పెరిగిందనే..
6269. ప్రేమెప్పుడూ పొరపాటు చేయదుగా..
హృదయానికి రసస్పందనలు అందించడంలో..
6270. వెన్నెలకూ వయసొచ్చినట్లుంది..
మన మనసులను చదివి మత్తెక్కుతుంటే
6271. కొన్ని పొరపాట్లు గ్రహపాట్లే..
అగచాట్లలో ముచ్చట్లను పడవేస్తూ..
6272. విషాదాలు వెనుదిరిగాయి..
సంతోషం నీలా భాష్పమై మెరిసాక..
6273. లెక్కచేయడం మానేసా లోకాన్ని..
ప్రపంచమొకటి నీతో కలితిరిగాక..
6274. నేనే నీ లోకమైపోయా..
మౌనరాగంతోనే మనసులు ముడిపడ్డాక
6275. శుభమూర్తం అదేగా మనసుకి..
మంగళతోరణాలుగా మన భావాలకి..
6276. అడుగుల్లోనూ నాట్యాలే..
నీ పెదవులు పాడే పల్లవికేనేమో..
6277. నేనే మాలికనైపోలేనా..
అక్షరం చేసి నన్ను రాస్తానంటే
6278. కిలకిల నవ్వే మధుమాసం నేనేగా..
నువ్వు రాసే వసంతాలన్నే నావైతే
6279. నీలో సగమైపోతున్నా అనురాగానికి..
అర్ధభాగమిచ్చి పిలవకుండానే నేనడుగులేసేస్తూ..
6280. గ్రీషమొస్తే మనకేంటిలే..
నిత్యవసంతమే యోగించి మనసులు ఏకమయ్యాక..
6281. హృదయం సైతం హెచ్చింది..
నీ అభినందనకు మెచ్చిందేమో..
6282. నేనర్ధమయ్యానని అనుకున్నావెందుకో..
అద్వైతాన్నింకా అనుభవించకుండానే..
6283. మౌనం సంగీతమై వినబడుతోంది..
నిశ్శబ్దంలో నీ శబ్దమవుతుంటే..
6284. అర్ధమవకున్నా ఫరవాలేదనిపిస్తోంది..
మాట్లాడేది నీ హృదయమే ఐతే..
6285. ఊహలను నా పరం చేసావెందుకో..
పరిమళాలన్నీ పట్టుకెళ్ళి పున్నమికే రాసిచ్చి..
6286. క్షేమమే..
నీకై దాచిన పదిల హృదయమిక్కడ..
6287. కన్నులకెప్పుడూ అరమోడ్పులే..
నీవు ఆలపించే గానంలో లయమవుతుంటే
6288. పరకాయ ప్రవేశమవుతున్నా మువ్వలోనికి..
నీ ముద్దులు మొదలయ్యేదక్కడేనని..
6289. ఇష్టమైన వ్యసనమయ్యావు..
నిన్ను చదవడం మానలేని అసహాయతలో..
6290. ఎప్పటికీ గుర్తించవెందుకో..
మనసు దాటి కన్నుల్లో తేలానని..
6291. తలవని తలపుగా ఎదురయ్యావు..
వీడని జంటగా మనమయ్యేందుకేగా..
6292. పురస్కారమైనా తిరస్కారమంటావు..
మదిలో పూజించి ధూపమేయలేదని అలిగేస్తూ..
6293. అచ్చుపోసిన మానవత్వం నేనయ్యాను..
నువ్వు పంచిన మమకారంలోనే
6294. బ్రహ్మకే బెంగ పట్టుకుందో..
హృదయానికి పాషాణమవ్వమని శాపమిచ్చాడు..
6295. వలపించిన ఆనందమొకటి తెలుస్తోంది..
మనసుకి తీపిని పరిచయిస్తూ..
6296. భావాలను మార్చుకోక తప్పలేదు..
ఆనందాన్ని దగ్గర చేసుకోవాలంటే..
6297. ఊహలలోనే మధురాలన్నీ..
రేపటి రుచులన్నింటినీ నేడే అందిస్తూ..
6298. పరిమళాన్ని పంచుతూ నీ జ్ఞాపకాలు..
నా రాతిరికి పరవశాన్ని పరిచయిస్తూ..
6299. సన్నజాజుల సుగంధమే నీవు..
కురులారబోసుకొనే ఆశలో నేను..
6300. నేను నీలానే అన్నది నిజమే..
నువ్వు నాదేనని ఒక నమ్మకమే..
6216. నేనే మధువైపోతున్నా..
అధరాన్ని తాకాలనుందని మధుపమై నువ్వనగానే..
6217. వైశాఖ పున్నమంటే రేయికీ మక్కువే..
వెన్నెల చీరను తనువారా అలంకరించేందుకు..
6218. ఎదురుచూస్తున్నానందుకే..
నా కనుపాపలకు తోడుగా నీవిచ్చే కలలను హత్తుకుందామని..
6219. ఎన్ని రంగులు మిళితమయ్యాయో రాతిరిలో..
లోకాన్ని పూర్తి విశ్రాంతిలోకి నెట్టేస్తూ..
6210. అనంతసౌఖ్యాన్ని గుర్తించా నీ మదిలో..
కొత్తగా మౌనాన్ని ధరిస్తున్నావని గమనించాక..
6211. నిట్టూర్పుగా మారుతున్న కొన్ని నిశ్వాసలు..
నా ఊపిరి విడిచి నువ్వెళ్ళిపోతుంటే..
6212. అద్భుతం జరగొచ్చు..
ఆకాంక్ష బలమై ఆరాటంగా మారిపోతే..
6213. నీ అడుగులకెందుకో మరి తడబాటు..
ఏడడుగులు వేయిస్తానని నన్ను రమ్మన్నాక..
6214. ఆత్మీయతా గుభాళింపులేనవి..
దూరమై చేరువైన స్మృతుల పరవశాలు..
6215. ఛస్తూ బ్రతికే జీవితం..
కన్నీటికీ లోకువైన ప్రారబ్దం..
6216. కొన్ని మాధుర్యాలెప్పుడూ మనసులోనే..
పెదవంచు దాటలేని మకరందంలా..
6217. హేమంతం అడ్డొచ్చిందని అనుకోలేదు..
వసంతాన్ని ముద్దాడాలని నీవనుకున్నా..
6218. రాళ్ళన్నీ అరిగినట్టే..
జలపాతానికే కదలికుంటే
6219. మౌనాన్ని హత్తుకుంది నా తలపు..
మూగభాష మొదలెట్టింది నీ మనసనే..
6220.గిలిగింతలకు కొదవేముంది..
వేసవిగాలంతా నీలా మారి నన్నల్లుతుంటే
6221. తొలకరిని తోడుకొచ్చేసా..
నీ విరహపు ప్రణయాగ్నిని చల్లార్చేందుకే..
6222. చినుకులై చేరుతున్న భావాలు కొన్ని..
మది బీడులో కవిత్వాన్ని మొలకెత్తేందుకు..
6223. కొత్తబంగారు లోకమే కలలో..
బాల్యాన్ని తడుముకున్నప్పుడల్లా ఇలలో..
6224. ఇంత నవ్వుకున్నారని తెలీలేదు..
ఏడుపునీ ఎగతాళి చేసేవరకూ..
6225. యవ్వనానికి సిగ్గొచ్చింది..
బాల్యంలోని క్షణాలను పెదవంచునే దాచేసావని..
6226. మరకతమై మెరిసిపోతున్నా..
నువ్వలదిన పచ్చలతో తనువంతా అలలారిందని..
6227. నీ విరహం ఆమెకెలా తెలిసిందో..
తొలకరి నిన్ను చేరిందిగా తపనలో..
6228. ఎదురీతకు అలవాటుపడిన మనసు..
జీవనపయనాన్ని గమ్యం చేర్చాలని..
6229. ఎన్ని చిగురింతలో పల్లవానికి..
పదనిసలన్నీ చిరునవ్వులై వెలుగుతుంటే
6230. తీరాన్ని చేరలేని కెరటంలా నేను..
అందనంత దూరాన నువ్వుండి విరహమైనందుకు..
6231. సంధ్యకెందుకు సిగ్గయ్యిందో..
మన నడకల్లో తనకి చోటిచ్చినందుకేమో..
6232. ఊసుపోలేదన్నది నువ్వేగా..
ఇరుపొద్దుల్లోనూ నన్నే ఎదలోకి రమ్మంటూ..
6233. ఆ సాయంత్రంలోనే నేనుండిపోయా..
నీ కన్నుల్లోని నా రూపానికే ముగ్ధ చిత్తరువైనట్టు..
6234. ఆనందం నేనై స్పందిస్తున్నా..
నీలో ప్రేమకు బదులడిగావనే..
6235. కుసుమమై చేరిపోయా..
నా వలపు గంధాన్ని గుర్తిస్తావో లేదోనని గమనించేందుకే..
6236. కలలోనూ కలవరాలే..
నీ విరహంలోనే మది మూగబోతుంటే
6237. మనసులో రాలుగాయివే..
నా మాటలనే సన్నాయిగా మార్చేస్తూ..
6238. మాటల్లో మెలికెలు వెతుకుతావే..
మనసులో మెరుపు కురిపిస్తున్నా..
6239. సంపెంగనెందుకు నొప్పించావో..
నా పరిమళంతో పోల్చి విదిలిస్తూ..
6240. భావాలకి భయమెక్కడుందిలే..
మనసును పరిచే తొందరెక్కువై ఉరకలేస్తుంటే..
6241. నా మనసు గుభాళించడం తెలుస్తోంది..
నీ సన్నజాజులకు 'సై' అన్నందుకేమో..
6242. ప్రతి ఋతువూ వసంతమైనట్లే ఉంది..
ఊరు మనసు నిదుర లేపుతున్నప్పుడల్లా..
6243. నక్షత్రాలకెందుకో అరమోడ్పులు..
నువ్వో వెన్నెల పున్నాగువై శృతి చేస్తుంది నన్నైతే..
6244. పగటికెన్ని కొంటెకలలో..
రాతిరైతే విజృంభించాలని..
6245. మలయమారుతాలు మాత్రమాగలేదుగా..
రోజంతా నీ రాకకై నేనెంత ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నా..
6246. కాటుకల్లోనే దాచేసాను కొన్ని కలలు..
మనసుకి తెలిస్తే ముప్పు తప్పదని..
6247. శూన్యాకాశంలో వెలిగే ఒంటరినక్షత్రంలా బాల్యం..
కన్నీటికీ లోకువైన లేత వెన్నముద్దల ప్రాయం
6248. ఊహించని శిక్షలెన్నో బాల్యానికి..
నిట్టూర్పు సెగలతో మండిపోతూ..
6249. నీవో చెంగల్వ కోమలివే..
చంద్ర కిరణాలు సోకి ఎర్రని అందంతో మెరిసిపోతూ..
6250. నీకై పూసుకున్న గంధపునూనంతా కొట్టుకుపోయింది..
మూణ్ణాళ్ళ విరహనికి మైలస్నానం ముగించావనే..
6251. కలలన్నీ నీ పరం చేసా..
ఒంటరితనాన్ని ఓర్వలేనని నా హృదయమంటుంటే..
6252. నన్ను నాకు దూరం చేసినందుకేమో..
నీకు నువ్వు కాకుండా మిగిలిపోయావు..
6253. అనుభవాల దండలేగా కధలన్నీ..
అక్షరమాలలో అందంగా ఒదిగిపోతూ..
6254. అనురాగాన్నే పునాది చేసాను..
చినుకు సవ్వడి సైతం నీకు దూరం కారాదనేగా..
6255. సానుభూతికి సమయమయ్యింది..
ఆకలి అవధి దాటి ముందుకెళ్తుంటే..
6256. ఆనందమూ నీదేగా..
నాలోనికి ప్రవహించి కొత్తరంగులు నింపుకున్నాక..
6257. కసరత్తులన్నీ కలల్లోనే..
ఇలలో అడుగులు కదలనని మొరాయిస్తుంటే
6258. మన తొలి పరిచయాన్ని తడుముకుంటున్నా..
వెన్నెల మరగడాన్ని ఇంకోసారి చూడాలనిపించే..
6259. సప్తపదికే అందమొచ్చింది..
సప్తాశ్వాలను దాటి హృదయాలు ఉరకలేస్తుంటే..
6260. రాగాలన్నీ ఆరున్నొక్కటై మిగిలాయి..
అతను చూపిన నరకంతోనే..
6261. నిత్యమైన వెతుకులాటొకటి..
నీలో తప్పిపోయిన మనసును కనుగొనలేక..
6262. ఆరు ఋతువులు దాటాలనుకుంది శిశిరం..
తృణపత్రాలన్నీ రాల్చి కవిత్వానికైనా తోడవ్వాలని..
6263. కెరటమవుతోంది మానసం..
నీ ఊహల ఊయలకి మత్తెక్కుతూనే..
6264. మది స్వప్నం నుండీ వేరయ్యిందిప్పుడే..
నీ పరిమళమొకటి నిద్దుర లేపగానే..
6265. కిరణమై మేల్కొల్పింది నువ్వే..
నాలోని చీకటిని తరిమేస్తూ..
6266. తడుముకోలేని అనుభూతులెన్నో..
నీ ఆనందంలో భావాలుగా మారలేక..
6267. మరోసారి జన్మించాలనుంది..
ఈసారైనా నీలో నవనీతమై కరిగిపోవాలని..
6268. విరహానికీ విలువొచ్చేసింది..
వియోగంలో ప్రేమ మరింత పెరిగిందనే..
6269. ప్రేమెప్పుడూ పొరపాటు చేయదుగా..
హృదయానికి రసస్పందనలు అందించడంలో..
6270. వెన్నెలకూ వయసొచ్చినట్లుంది..
మన మనసులను చదివి మత్తెక్కుతుంటే
6271. కొన్ని పొరపాట్లు గ్రహపాట్లే..
అగచాట్లలో ముచ్చట్లను పడవేస్తూ..
6272. విషాదాలు వెనుదిరిగాయి..
సంతోషం నీలా భాష్పమై మెరిసాక..
6273. లెక్కచేయడం మానేసా లోకాన్ని..
ప్రపంచమొకటి నీతో కలితిరిగాక..
6274. నేనే నీ లోకమైపోయా..
మౌనరాగంతోనే మనసులు ముడిపడ్డాక
6275. శుభమూర్తం అదేగా మనసుకి..
మంగళతోరణాలుగా మన భావాలకి..
6276. అడుగుల్లోనూ నాట్యాలే..
నీ పెదవులు పాడే పల్లవికేనేమో..
6277. నేనే మాలికనైపోలేనా..
అక్షరం చేసి నన్ను రాస్తానంటే
6278. కిలకిల నవ్వే మధుమాసం నేనేగా..
నువ్వు రాసే వసంతాలన్నే నావైతే
6279. నీలో సగమైపోతున్నా అనురాగానికి..
అర్ధభాగమిచ్చి పిలవకుండానే నేనడుగులేసేస్తూ..
6280. గ్రీషమొస్తే మనకేంటిలే..
నిత్యవసంతమే యోగించి మనసులు ఏకమయ్యాక..
6281. హృదయం సైతం హెచ్చింది..
నీ అభినందనకు మెచ్చిందేమో..
6282. నేనర్ధమయ్యానని అనుకున్నావెందుకో..
అద్వైతాన్నింకా అనుభవించకుండానే..
6283. మౌనం సంగీతమై వినబడుతోంది..
నిశ్శబ్దంలో నీ శబ్దమవుతుంటే..
6284. అర్ధమవకున్నా ఫరవాలేదనిపిస్తోంది..
మాట్లాడేది నీ హృదయమే ఐతే..
6285. ఊహలను నా పరం చేసావెందుకో..
పరిమళాలన్నీ పట్టుకెళ్ళి పున్నమికే రాసిచ్చి..
6286. క్షేమమే..
నీకై దాచిన పదిల హృదయమిక్కడ..
6287. కన్నులకెప్పుడూ అరమోడ్పులే..
నీవు ఆలపించే గానంలో లయమవుతుంటే
6288. పరకాయ ప్రవేశమవుతున్నా మువ్వలోనికి..
నీ ముద్దులు మొదలయ్యేదక్కడేనని..
6289. ఇష్టమైన వ్యసనమయ్యావు..
నిన్ను చదవడం మానలేని అసహాయతలో..
6290. ఎప్పటికీ గుర్తించవెందుకో..
మనసు దాటి కన్నుల్లో తేలానని..
6291. తలవని తలపుగా ఎదురయ్యావు..
వీడని జంటగా మనమయ్యేందుకేగా..
6292. పురస్కారమైనా తిరస్కారమంటావు..
మదిలో పూజించి ధూపమేయలేదని అలిగేస్తూ..
6293. అచ్చుపోసిన మానవత్వం నేనయ్యాను..
నువ్వు పంచిన మమకారంలోనే
6294. బ్రహ్మకే బెంగ పట్టుకుందో..
హృదయానికి పాషాణమవ్వమని శాపమిచ్చాడు..
6295. వలపించిన ఆనందమొకటి తెలుస్తోంది..
మనసుకి తీపిని పరిచయిస్తూ..
6296. భావాలను మార్చుకోక తప్పలేదు..
ఆనందాన్ని దగ్గర చేసుకోవాలంటే..
6297. ఊహలలోనే మధురాలన్నీ..
రేపటి రుచులన్నింటినీ నేడే అందిస్తూ..
6298. పరిమళాన్ని పంచుతూ నీ జ్ఞాపకాలు..
నా రాతిరికి పరవశాన్ని పరిచయిస్తూ..
6299. సన్నజాజుల సుగంధమే నీవు..
కురులారబోసుకొనే ఆశలో నేను..
6300. నేను నీలానే అన్నది నిజమే..
నువ్వు నాదేనని ఒక నమ్మకమే..
![]() | Virus-free. www.avast.com |
No comments:
Post a Comment