5701. మనసేమో నీది..
వివశమేమో నాది..
5702. హిమాంశు కిరణమై వచ్చానందుకే..
హృది వేసవిని తరిమేసేందుకు..
5703. తీయదనమేదో మనసుకి తెలిసింది..
చిరునవ్వని నువ్వు చెప్పేలోపునే..
5704. గుర్తించడంలో పొరపాటు చేయనంటూ మనసు..
కళ్ళు మూసుకున్నా నిన్ను చూడగలనంటూ..
5705. వింతగా వెలుగుతోంది వసంతం..
నా భావాలకు మౌనాలనద్దుకొని..
5706. కొన్ని పొరపాట్లు దిద్దుకోలేనివే..
చేతులు కాలినా మందు పూసుకోడం కుదరని యాతనలో..
5707. ఇప్పుడైతే నువ్వే నా లోకం..
బాహ్య ప్రపంచంలో ఎవరికి ఎవరేమైపోయినా..
5708. ఆరాధించడం పొరపాటని తెలియలేదు..
తను నిరాకరించే వరకూ..
5709. ఊపిరాగినట్లుంది నీ విరహానికి..
శ్వాసలు కలిసే రోజెప్పుడొస్తుందోనని..
5710. కలలూ కలయికలూ కూడాననుకుంటా..
నా మనసు బదులిస్తోంది..
5711. కవిత్వమెక్కడో ఉందని పొరపడ్డాను..
చల్లని నవ్వుల్లో నల్లని నీ కనుపాపల్లో గమనించకుండానే..
5712. శిక్ష ఆమె ఒక్కదానికేనట..
పొరపాటు చేసింది ఇద్దరైనా..
5713. ప్రాణాలైదు అందుకే పట్టేసా..
నిన్ను ఖైదీగా మార్చుకుందామనే..
5714. పొరబడింది నేనేనేమో..
కాస్తంత వెచ్చదనం తను తగిలించగానే..
5715. నీకెప్పుడూ అలవాటే..
అందాన్ని చూసి తప్పించుకు పోవడం..
5716. నీలో మదనాంశ కనిపెట్టేసా..
నీ నవ్వుల విసుర్లకి గాయాలు తీయగా గుచ్చగానే..
5717. మందారాలు కోరానందుకే..
గులాబీలూ మల్లెలూ నన్ను చూసి రంగు మారిపోతున్నాయనే..
5718. కలలోనూ కలవరం..
కోరికల బుసబుసలతో కన్నుల్లో పరవశాలతో..
5719. మాటే మంత్రమనుకున్నా..
మౌనం ముగ్ధమవుతుంటే..
5720. యుగాలెన్నో కన్నుల్లో దాచేసాను..
క్షణాలు రెప్పలార్ఫక నిలబడుతుంటే..
5721. హృదయమున్నందుకేనేమో..
రేయింబవళ్ళు ఈ విరహాలూ..విలాపాలు..
5722. కళ్ళనడ్డుపెట్టింది అందుకేగా..
హృదయన్ని పెదవిప్పకుండానే నీకు చేరేస్తాయని..
5723. దొంగను చేస్తావనుకోలేదు..
ఒక్కరేయి నిదుర కరువైనంత మాత్రాన..
5724. అదృష్టమంటే ఆమెదే..
నడిచే కొడుకును నవ్వుతూ దీవిస్తుంటే..
5725. శిల్పంగా మలచడం మర్చిపోయావు..
నేనింకా రాయిగానే మిగిలున్నానంటున్నా..
5726. సువాసనలతో గాలి వీస్తున్నప్పుడే అనుకున్నా..
కావ్యాలతో కనికట్టు చేసి నన్నాహ్వానిస్తున్నావని..
5727. నిన్నటివరకూ దొరసానినే..
నీ చూపులకే దొంగనై దొరికిపోతున్నా..
5728. కొల్లగొట్టలేనుగా హృదయాన్ని..
దొంగతనం నేరం నాపై పడుతుందనుకుంటే..
5729. ఎప్పుడూ అపార్ధాలే నీతో..
ఆచితూచి నే మాట్లాడుతున్నా..
5730. వానకోయిలలతో హోరెత్తాలి..
కురిసిన వానకి తరువులెల్ల తమకమవుతుంటే..
5731. కొన్ని ఆనందాలు మదిలోనే దాచిపెట్టా..
భవిష్యత్తులో నీతో కలిసి అనుభూతించేందుకే..
5732. మేఘుడూ కరిగినట్లున్నాడు..
భగ్గుమని అలిగిన అవనిని బుజ్జగించేందుకు..
5733. అంచలంచలుగా ఆనందమవుతోంది..
అప్పుడెప్పుడో కోరిన వరమిప్పుడు తీరుతుంటే..
5734. ఆకలైనప్పుడే అనుకున్నా..
వెన్నెలవిందుకి వేళయ్యిందని..
5735. నన్ను నీకు కోల్పోయా..
సంతోషాన్ని సజీవం చేసుకోవాలనే..
5736. నిన్నెప్పుడూ ఓడనివ్వనుగా..
ఆనందంతో వెలిగిస్తూనే జీవితాంతం తోడుంటా..
5737. ఆనందపర్వం మొదలెట్టేసా..
విషాదానికి చెదలు పడితే పోనివ్వమని..
5738. కలల కాణాచినే..
నిదురొస్తే నీ కన్నులకు గమ్యమైపోతూ..
5739. వింతైన కొసమెరుపు..
నా మనసద్దంలో నీ ప్రతిబింబం..
5740. సంక్రాంతొచ్చింది మదికి..
నీ కన్నుల్లో నన్ను చిత్రించినందుకే..
5741. మబ్బుల్లో నీరు చూసి మురవొద్దన్నానందుకే..
మనసు దాహం కాస్తైనా తీరకుండానే..
5742. పట్టుకొమ్ములు ముక్కలైనందుకేమో..
పచ్చదనపు రోదన ఏరులై సాగింది..
5743. ముత్యాలపాటలే అన్నీ..
రాగాలకోయిల వసంతాన్ని నాలా కూస్తుంటే..
5744. మదిలోనే దాగావనుకున్నా ఇప్పటివరకూ..
దీర్ఘమైన దిగులొచ్చి కమ్ముకొనేవరకూ..
5745. ఏమో నాకు ప్రేమించడం రావట్లేదేమో..
తెలియకుండానే నిన్ను దూరం చేసుకుంటున్నానేమో..
5746. విలువ తెలిసొస్తున్న క్షణాలు కొన్ని..
నీ ఎడబాటులో నన్ను వెతుక్కుంటుంటే..
ఒక్కరేయి నిదుర కరువైనంత మాత్రాన..
5724. అదృష్టమంటే ఆమెదే..
నడిచే కొడుకును నవ్వుతూ దీవిస్తుంటే..
5725. శిల్పంగా మలచడం మర్చిపోయావు..
నేనింకా రాయిగానే మిగిలున్నానంటున్నా..
5726. సువాసనలతో గాలి వీస్తున్నప్పుడే అనుకున్నా..
కావ్యాలతో కనికట్టు చేసి నన్నాహ్వానిస్తున్నావని..
5727. నిన్నటివరకూ దొరసానినే..
నీ చూపులకే దొంగనై దొరికిపోతున్నా..
5728. కొల్లగొట్టలేనుగా హృదయాన్ని..
దొంగతనం నేరం నాపై పడుతుందనుకుంటే..
5729. ఎప్పుడూ అపార్ధాలే నీతో..
ఆచితూచి నే మాట్లాడుతున్నా..
5730. వానకోయిలలతో హోరెత్తాలి..
కురిసిన వానకి తరువులెల్ల తమకమవుతుంటే..
5731. కొన్ని ఆనందాలు మదిలోనే దాచిపెట్టా..
భవిష్యత్తులో నీతో కలిసి అనుభూతించేందుకే..
5732. మేఘుడూ కరిగినట్లున్నాడు..
భగ్గుమని అలిగిన అవనిని బుజ్జగించేందుకు..
5733. అంచలంచలుగా ఆనందమవుతోంది..
అప్పుడెప్పుడో కోరిన వరమిప్పుడు తీరుతుంటే..
5734. ఆకలైనప్పుడే అనుకున్నా..
వెన్నెలవిందుకి వేళయ్యిందని..
5735. నన్ను నీకు కోల్పోయా..
సంతోషాన్ని సజీవం చేసుకోవాలనే..
5736. నిన్నెప్పుడూ ఓడనివ్వనుగా..
ఆనందంతో వెలిగిస్తూనే జీవితాంతం తోడుంటా..
5737. ఆనందపర్వం మొదలెట్టేసా..
విషాదానికి చెదలు పడితే పోనివ్వమని..
5738. కలల కాణాచినే..
నిదురొస్తే నీ కన్నులకు గమ్యమైపోతూ..
5739. వింతైన కొసమెరుపు..
నా మనసద్దంలో నీ ప్రతిబింబం..
5740. సంక్రాంతొచ్చింది మదికి..
నీ కన్నుల్లో నన్ను చిత్రించినందుకే..
5741. మబ్బుల్లో నీరు చూసి మురవొద్దన్నానందుకే..
మనసు దాహం కాస్తైనా తీరకుండానే..
5742. పట్టుకొమ్ములు ముక్కలైనందుకేమో..
పచ్చదనపు రోదన ఏరులై సాగింది..
5743. ముత్యాలపాటలే అన్నీ..
రాగాలకోయిల వసంతాన్ని నాలా కూస్తుంటే..
5744. మదిలోనే దాగావనుకున్నా ఇప్పటివరకూ..
దీర్ఘమైన దిగులొచ్చి కమ్ముకొనేవరకూ..
5745. ఏమో నాకు ప్రేమించడం రావట్లేదేమో..
తెలియకుండానే నిన్ను దూరం చేసుకుంటున్నానేమో..
5746. విలువ తెలిసొస్తున్న క్షణాలు కొన్ని..
నీ ఎడబాటులో నన్ను వెతుక్కుంటుంటే..
5747. నీ కవనంలో నేను..
వసంతపు తొలిపొద్దు వేకువలా..
5748. కలిసినట్టే కనపడదాం ఎప్పటికీ..
ఏదరిలో ఎవ్వరమున్నా ఈజన్మకి..
5749. సరైన సమయంలో సరైన విత్తు..
వానకాలం వచ్చే దాకా ఆగాల్సిందే..
5750. వసంతమని తెలుసేమో కోయిలకి..
వనవాసం దాటొచ్చి మనసలరిస్తోంది..
5751. ఆరున్నొక్క రాగంలోనే ఆగిపోతున్నాం...
సప్తస్వరాలనెప్పుడు మీటుకుంటామో జీవితంలో..
5752. అందం గ్రంధమయ్యింది..
నిన్ను అనువదించే క్రమంలో ఒదిగిపోతూ..
5753. ఏ ముసుగేసుకొచ్చినా గుర్తుపట్టేస్తా ప్రేమని..
తనంటే అంత ప్రేమ నాకు..
5754. ఆస్వాదించడం నేర్చుకుంటున్నా..
అస్తిత్వంతో పోరాటాలు విజయాన్ని ఇవ్వలేవనే..
5755. తన తలపు వెన్నెలయ్యింది..
నన్ను మేఘలతేరులోకి రమ్మంటూ..
5756. ముక్కలయ్యింది హృదయం..
ప్రతి ముక్కలో నిన్నే చూపిస్తూ..
5757. ఎంతపని చేసిందో నిరీక్షణ..
నన్నో శిల్పంగా ఘనీభవించింది...
5758. నీ ఊసుల స్వరజతులు పంచకలా..
నా హృదయం ఆనందాన్ని నర్తించేలా..
5759. తడవాల్సిందెప్పటికైనా నువ్వేగా..
మేఘమై నే కురవడం మొదలెడితే..
5760. కలలన్నింటిలో నీవే..
నిదురంటూ నే కనుమూస్తే చాలు..
5761. సుమరాణినని ఎప్పుడు గ్రహించావో..
సరసమైన విరిజల్లుగా తడిపేస్తూ..
5762. క్షణాలకెప్పుడూ పరవశాలే..
నిన్ను తడుముకొని తమలో నవ్వుకున్నప్పుడు..
5763. ఒదిగిపోయిన భావమొకటి..
హృదయాన్ని హత్తుకొని అనుభూతించమనే నీలా...
5764. నేనే వెన్నెలైపోయా..
నీ మనసును వెండిపూతలతో నింపాలని..
5765. వాడి కుందేలుకు మూడే కాళ్ళు
మూర్ఖత్వమన్నా సరే మరి ఒప్పుకోడు..
5766. మల్లెలవాన కురవడం నిజమేనేమో..
పరిమళిస్తున్న వేకువేగా సాక్షి..
5767. ప్రతిక్షణమూ పరిమళమే..
నా హృదయాంతరాళలో నీ నర్తనమే..
5768. నిన్ను తప్ప తాకనంటూ చూపులు..
ఎన్ని వసంతాలు కన్నులపండుగై ఆహ్వానిస్తున్నా..
5769. నిర్జీవపు ఎడారిలో నేను..
నీ జాడలేవీ కనిపించక..
5770. వెన్నెలపందిరి కింద విరహాలు..
మల్లెలవేళకు నేను ఒంటరయ్యాననే..
5771. కోరికల రెక్కలు మొలిపించాను..
ఆకాశమంటి నన్ను అందుకుంటావనే..
5772. రెప్పల వాకిట్లోనే నిలుచున్నా..
నిద్రిస్తే స్వప్నంలో గిలిగింతనవ్వాలని..
5773. జీవితపుటలెన్నిసార్లు తిరగేసినా అంతే..
మొదటి వాక్యమెప్పుడూ ఇష్టమే..
5774. సౌందర్యమంటే మక్కువన్నావనే..
కనులు మూసినా నన్ను చూడగలవనుకున్నా..
5775. ప్రాణమున్న బొమ్మనేగా నేను..
నీ గుండెచప్పుడుకి దూరమయ్యాక..
5776. శ్వాసనై తిరిగొచ్చేస్తాలే..
ఊపిరిలోకి నువ్వాహ్వానిస్తానంటే
5777. ప్రతిక్షణమూ పరిమళమే.'
నీ ఎదపై ఊయలూగిన సాయంత్రాన.
5778. గులాబీల గంధమే నా మనసంతా..
ప్రేమైక నిరీక్షణలో నువ్వున్నావని తెలిసాక..
5779. నీ జతలో నేను..
నిదురలో నీ కలల పుస్తకానికి ముఖచిత్రంగా మారిపోతూ..
5780. అష్టోత్తరంతో సరిపెడతావనుకున్నా..
అందానికి సహస్రనామార్చనే మొదలెట్టావని తెలీక..
5781. పునీతమైపోతున్నా..
నీ అనురాగాలతో ముద్దైన ప్రతిసారీ
5782. మౌనంపైనే మనసయ్యింది..
చిరునవ్వు కిరణాలతో నిన్నూహించి ఆనందిస్తుంటే
5783. బంధం బలపడిపోయింది..
నీ భావాలలో నన్నమరం చేసాక..
5784. మంచు పూసలట..
ఆకాశమంటిన వృక్షరాజులను కిరీటాలతో అలంకరిస్తూ..
5785. అడపాదడపా మంచితనం..
అరకొరగా గొప్ప పనులతో మెప్పిస్తూ..
5786. కలలో పెనవేసుకున్న అధరాలు..
ఇలలో హృదయానికి వెచ్చదనాలిస్తూ..
5787. ప్రేమ వెలిసినట్లుంది..
కురిసిన అభినందనతో హృదయం ఆరబెట్టాలిక..
5788. మనసులో చేరిపోయానందుకే..
కాటుక మబ్బులతో పోరాడి గెలవలేననే..
5789. ప్రతిక్షణమూ పరిమళమే..
వినమ్ర మౌనాన్ని హృదయం కప్పుకొనుంటే..
5790. కవితలో దాచిపెడతాలే..
ఆమెకి మాత్రమే అర్ధమయ్యేలా నిన్ను రాసి చూపిస్తా..
5791. అంతరంగం ఇరుకైంది..
కాలం అడ్డుగోడగా కారణమై మిగిలేందుకు..
5792. పరవశించింది రాతిరి..
మనల్ని తాకి వెన్నెలే వివశమైనందుకేమో..
5793. ఆశగా వస్తావు..
ఆనందాన్ని పంచిస్తావు..
5794. కలవరిస్తావెందుకలా..
కలతలో నన్ను ముంచేలా..
5795. కానుకై వస్తాలే..
కలని మరిపించేలా..
5796. చిందేస్తున్నా..
వెన్నెల విందుకు పిలిచావనే
5797. బుగ్గలకెందుకో ఎరుపుదనాలు..
విందుకు రమ్మంది మది పెదవులనైతే
5798. పున్నమివేళ..
మదిలో పున్నాగ హేల..
5799. అంతరంగాన్ని దోచెస్తావెందుకో..
భావ పవనాలతో హృదయం ఓలలాడుతుంటే
5800. నా అందాలకెందుకో కేరింతలు..
నిద్దురపోనంది నీ కన్నులైతే..
వసంతపు తొలిపొద్దు వేకువలా..
5748. కలిసినట్టే కనపడదాం ఎప్పటికీ..
ఏదరిలో ఎవ్వరమున్నా ఈజన్మకి..
5749. సరైన సమయంలో సరైన విత్తు..
వానకాలం వచ్చే దాకా ఆగాల్సిందే..
5750. వసంతమని తెలుసేమో కోయిలకి..
వనవాసం దాటొచ్చి మనసలరిస్తోంది..
5751. ఆరున్నొక్క రాగంలోనే ఆగిపోతున్నాం...
సప్తస్వరాలనెప్పుడు మీటుకుంటామో జీవితంలో..
5752. అందం గ్రంధమయ్యింది..
నిన్ను అనువదించే క్రమంలో ఒదిగిపోతూ..
5753. ఏ ముసుగేసుకొచ్చినా గుర్తుపట్టేస్తా ప్రేమని..
తనంటే అంత ప్రేమ నాకు..
5754. ఆస్వాదించడం నేర్చుకుంటున్నా..
అస్తిత్వంతో పోరాటాలు విజయాన్ని ఇవ్వలేవనే..
5755. తన తలపు వెన్నెలయ్యింది..
నన్ను మేఘలతేరులోకి రమ్మంటూ..
5756. ముక్కలయ్యింది హృదయం..
ప్రతి ముక్కలో నిన్నే చూపిస్తూ..
5757. ఎంతపని చేసిందో నిరీక్షణ..
నన్నో శిల్పంగా ఘనీభవించింది...
5758. నీ ఊసుల స్వరజతులు పంచకలా..
నా హృదయం ఆనందాన్ని నర్తించేలా..
5759. తడవాల్సిందెప్పటికైనా నువ్వేగా..
మేఘమై నే కురవడం మొదలెడితే..
5760. కలలన్నింటిలో నీవే..
నిదురంటూ నే కనుమూస్తే చాలు..
5761. సుమరాణినని ఎప్పుడు గ్రహించావో..
సరసమైన విరిజల్లుగా తడిపేస్తూ..
5762. క్షణాలకెప్పుడూ పరవశాలే..
నిన్ను తడుముకొని తమలో నవ్వుకున్నప్పుడు..
5763. ఒదిగిపోయిన భావమొకటి..
హృదయాన్ని హత్తుకొని అనుభూతించమనే నీలా...
5764. నేనే వెన్నెలైపోయా..
నీ మనసును వెండిపూతలతో నింపాలని..
5765. వాడి కుందేలుకు మూడే కాళ్ళు
మూర్ఖత్వమన్నా సరే మరి ఒప్పుకోడు..
5766. మల్లెలవాన కురవడం నిజమేనేమో..
పరిమళిస్తున్న వేకువేగా సాక్షి..
5767. ప్రతిక్షణమూ పరిమళమే..
నా హృదయాంతరాళలో నీ నర్తనమే..
5768. నిన్ను తప్ప తాకనంటూ చూపులు..
ఎన్ని వసంతాలు కన్నులపండుగై ఆహ్వానిస్తున్నా..
5769. నిర్జీవపు ఎడారిలో నేను..
నీ జాడలేవీ కనిపించక..
5770. వెన్నెలపందిరి కింద విరహాలు..
మల్లెలవేళకు నేను ఒంటరయ్యాననే..
5771. కోరికల రెక్కలు మొలిపించాను..
ఆకాశమంటి నన్ను అందుకుంటావనే..
5772. రెప్పల వాకిట్లోనే నిలుచున్నా..
నిద్రిస్తే స్వప్నంలో గిలిగింతనవ్వాలని..
5773. జీవితపుటలెన్నిసార్లు తిరగేసినా అంతే..
మొదటి వాక్యమెప్పుడూ ఇష్టమే..
5774. సౌందర్యమంటే మక్కువన్నావనే..
కనులు మూసినా నన్ను చూడగలవనుకున్నా..
5775. ప్రాణమున్న బొమ్మనేగా నేను..
నీ గుండెచప్పుడుకి దూరమయ్యాక..
5776. శ్వాసనై తిరిగొచ్చేస్తాలే..
ఊపిరిలోకి నువ్వాహ్వానిస్తానంటే
5777. ప్రతిక్షణమూ పరిమళమే.'
నీ ఎదపై ఊయలూగిన సాయంత్రాన.
5778. గులాబీల గంధమే నా మనసంతా..
ప్రేమైక నిరీక్షణలో నువ్వున్నావని తెలిసాక..
5779. నీ జతలో నేను..
నిదురలో నీ కలల పుస్తకానికి ముఖచిత్రంగా మారిపోతూ..
5780. అష్టోత్తరంతో సరిపెడతావనుకున్నా..
అందానికి సహస్రనామార్చనే మొదలెట్టావని తెలీక..
5781. పునీతమైపోతున్నా..
నీ అనురాగాలతో ముద్దైన ప్రతిసారీ
5782. మౌనంపైనే మనసయ్యింది..
చిరునవ్వు కిరణాలతో నిన్నూహించి ఆనందిస్తుంటే
5783. బంధం బలపడిపోయింది..
నీ భావాలలో నన్నమరం చేసాక..
5784. మంచు పూసలట..
ఆకాశమంటిన వృక్షరాజులను కిరీటాలతో అలంకరిస్తూ..
5785. అడపాదడపా మంచితనం..
అరకొరగా గొప్ప పనులతో మెప్పిస్తూ..
5786. కలలో పెనవేసుకున్న అధరాలు..
ఇలలో హృదయానికి వెచ్చదనాలిస్తూ..
5787. ప్రేమ వెలిసినట్లుంది..
కురిసిన అభినందనతో హృదయం ఆరబెట్టాలిక..
5788. మనసులో చేరిపోయానందుకే..
కాటుక మబ్బులతో పోరాడి గెలవలేననే..
5789. ప్రతిక్షణమూ పరిమళమే..
వినమ్ర మౌనాన్ని హృదయం కప్పుకొనుంటే..
5790. కవితలో దాచిపెడతాలే..
ఆమెకి మాత్రమే అర్ధమయ్యేలా నిన్ను రాసి చూపిస్తా..
5791. అంతరంగం ఇరుకైంది..
కాలం అడ్డుగోడగా కారణమై మిగిలేందుకు..
5792. పరవశించింది రాతిరి..
మనల్ని తాకి వెన్నెలే వివశమైనందుకేమో..
5793. ఆశగా వస్తావు..
ఆనందాన్ని పంచిస్తావు..
5794. కలవరిస్తావెందుకలా..
కలతలో నన్ను ముంచేలా..
5795. కానుకై వస్తాలే..
కలని మరిపించేలా..
5796. చిందేస్తున్నా..
వెన్నెల విందుకు పిలిచావనే
5797. బుగ్గలకెందుకో ఎరుపుదనాలు..
విందుకు రమ్మంది మది పెదవులనైతే
5798. పున్నమివేళ..
మదిలో పున్నాగ హేల..
5799. అంతరంగాన్ని దోచెస్తావెందుకో..
భావ పవనాలతో హృదయం ఓలలాడుతుంటే
5800. నా అందాలకెందుకో కేరింతలు..
నిద్దురపోనంది నీ కన్నులైతే..
![]() | Virus-free. www.avast.com |
No comments:
Post a Comment