5601. సుముఖమై నేనెదురొచ్చేసా..
మన్మధుడ్ని సాగనంపేందుకు రమ్మని పిలుపందగానే..
5602. మరుగుజ్జయ్యిందేమో మనసు..
పక్కవారి గొప్పదనాన్ని పొగిడే చేతకాక..
5603. చంచలమైన దేహం..
అచంచలమైన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం రాక..
5604. నిమీలితమై నిలబడిపోయా..
నీ కోరికకే వేళ్ళాడుతుంటే హృదయం..
5605. ఆమె కళ్ళు..
అతని కోసం ఆనందాలను దాచుకున్న కలల లోగిళ్ళు..
5606. కలకండలే నీ నవ్వులు..
నెమరేసేకొద్దీ తీయందనాలు పెంచేస్తూ..
5607. నీ తలపులతోనేగా జాగారం..
నా అనుభూతులన్నీ దోచుకెళ్ళాక..
5608. గోరువెచ్చని కోరికలన్నీ కనిపెట్టేస్తావు..
పొద్దుగుంకిన ముచ్చట్లన్నీ బయటపెడతావెందుకో..
5609. ఎక్కడ దాచమంటావో సిగ్గులన్నీ..
పొదవి పట్టకుండానే ఎత్తిపోసేస్తూ..
5610. నవ్వులకి దారిచ్చేసా పెదవులపై ఆడేందుకు..
నా వేదనలు హృదయంలోనే విహరిస్తున్నాయని..
5611. అనుభూతులను పూసేసుకున్నా..
ఆప్యాయతను రంగరించి నన్ను వలచాడనే..
5612. జీవితమెప్పుడూ ప్రహేళికే..
జవాబుగా చేరిన గమ్యం నచ్చలేకుంటే..
5613. కలలోనే దాచుకున్నానందుకే..
వెన్నెల సంతకంతో మనసు ముద్దయ్యిందనే..
5614. నిన్ను వీడిపోనూ..నీ జతకాలేనూ..
అనుమతిస్తే కలలో మాత్రం జీవితమైపోతాను..
5615. వసంతమనే మాటలు నేర్పేసా చూపుకి..
ఊ కొట్టించాలనే నీ మనసుని..
5616. ప్రేమిప్పుడు బలపడిందిలే..
నా ఆకర్షణకు నువ్వు తాళమేస్తుంటే..
5617. మకరందాల జడివానలు హృదిలో..
వసంతం మళ్ళీ దగ్గరవుతున్నందుకేమో..
5618. కొదమ పువ్వులన్నీ కోసుకొచ్చాను..
నవ్వులతో రంగరించి నీకందిద్దామని..
5619. గ్రీష్మానికెందుకో తొందరపడతావు..
వసంతంలో లీనమై పూర్తిగా అనుభవించకుండానే..
5620. రాధేయంగా మార్చేసావు..
ఆరాధన ప్రణయమై నిన్ను అలరించాలంటూ..
5621. అధారనందం..
చుంబనంతో వలపు గెలుపైతే ఖాయమయ్యిందని..
5622. నిలదీసి అడగాలనుంది..
అంత తేలిగ్గా మాటలెలా మారుస్తారోనని..
5623. నిలదీసి అడగాలనుంది..
అవ్యక్తాలలో చేరి నాకెందుకు దూరమయ్యావని..
5624. నిలదీసి అడగాలనుంది..
చివరి జ్ఞాపకంగానైనా మిగులుంటానో లేదోనని..
5625. ఓర్చుకోవద్దింక..
ఓటమిని గెలిపించే ప్రయత్నాలు మొదలెడుతూ..
5626. అక్షరాలు అలసిపోతున్నాయట..
నిర్లిప్తతను పదేపదే అదేపనిగా రాసిరాసి..
5627. ఉగాదులన్నీ ఉన్నవాడికే..
పూరిగుడిసెలో పట్టెడు పంచదార కరువై..
5628. శిల్పివని గుర్తించానప్పుడే..
శిలవంటి నన్ను మలచుకుంటానని నువ్వన్నప్పుడే..
5629. దుర్ముఖమై విచ్చేసింది వసంతరాణి..
సుముఖమైతే మన్మధుడు వెనుదిరగడనేమో..
5630. దుర్ముఖమైతేనేమి..
నువ్వాదరిస్తే సుముఖమై చిరునవ్వులు చిందిస్తుందిగా
5631. జీవితమంతే..
షడ్రుచులూ సమానమంటూ ఒక్కరుచినీ ఆస్వాదించనివ్వదు..
5632. అలలై పారుతున్న సాహిత్యం..
నీ నవ్వులదొంతరలను చుట్టుకుంటూ..
5633. మకరందమై కురిసిపోలేనా..
అంతర్జాలమంతా తీయగా మార్చేద్దాం రమ్మంటే..
5634. ప్రేమజ్వరంలా అనిపిస్తోందెందుకో..
వసంతమంటే ఇదేనా..
5635. పచ్చనోట్లన్నీ పరారు..
మన్మధుడ్ని సాగనంపేందుకు రమ్మని పిలుపందగానే..
5602. మరుగుజ్జయ్యిందేమో మనసు..
పక్కవారి గొప్పదనాన్ని పొగిడే చేతకాక..
5603. చంచలమైన దేహం..
అచంచలమైన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం రాక..
5604. నిమీలితమై నిలబడిపోయా..
నీ కోరికకే వేళ్ళాడుతుంటే హృదయం..
5605. ఆమె కళ్ళు..
అతని కోసం ఆనందాలను దాచుకున్న కలల లోగిళ్ళు..
5606. కలకండలే నీ నవ్వులు..
నెమరేసేకొద్దీ తీయందనాలు పెంచేస్తూ..
5607. నీ తలపులతోనేగా జాగారం..
నా అనుభూతులన్నీ దోచుకెళ్ళాక..
5608. గోరువెచ్చని కోరికలన్నీ కనిపెట్టేస్తావు..
పొద్దుగుంకిన ముచ్చట్లన్నీ బయటపెడతావెందుకో..
5609. ఎక్కడ దాచమంటావో సిగ్గులన్నీ..
పొదవి పట్టకుండానే ఎత్తిపోసేస్తూ..
5610. నవ్వులకి దారిచ్చేసా పెదవులపై ఆడేందుకు..
నా వేదనలు హృదయంలోనే విహరిస్తున్నాయని..
5611. అనుభూతులను పూసేసుకున్నా..
ఆప్యాయతను రంగరించి నన్ను వలచాడనే..
5612. జీవితమెప్పుడూ ప్రహేళికే..
జవాబుగా చేరిన గమ్యం నచ్చలేకుంటే..
5613. కలలోనే దాచుకున్నానందుకే..
వెన్నెల సంతకంతో మనసు ముద్దయ్యిందనే..
5614. నిన్ను వీడిపోనూ..నీ జతకాలేనూ..
అనుమతిస్తే కలలో మాత్రం జీవితమైపోతాను..
5615. వసంతమనే మాటలు నేర్పేసా చూపుకి..
ఊ కొట్టించాలనే నీ మనసుని..
5616. ప్రేమిప్పుడు బలపడిందిలే..
నా ఆకర్షణకు నువ్వు తాళమేస్తుంటే..
5617. మకరందాల జడివానలు హృదిలో..
వసంతం మళ్ళీ దగ్గరవుతున్నందుకేమో..
5618. కొదమ పువ్వులన్నీ కోసుకొచ్చాను..
నవ్వులతో రంగరించి నీకందిద్దామని..
5619. గ్రీష్మానికెందుకో తొందరపడతావు..
వసంతంలో లీనమై పూర్తిగా అనుభవించకుండానే..
5620. రాధేయంగా మార్చేసావు..
ఆరాధన ప్రణయమై నిన్ను అలరించాలంటూ..
5621. అధారనందం..
చుంబనంతో వలపు గెలుపైతే ఖాయమయ్యిందని..
5622. నిలదీసి అడగాలనుంది..
అంత తేలిగ్గా మాటలెలా మారుస్తారోనని..
5623. నిలదీసి అడగాలనుంది..
అవ్యక్తాలలో చేరి నాకెందుకు దూరమయ్యావని..
5624. నిలదీసి అడగాలనుంది..
చివరి జ్ఞాపకంగానైనా మిగులుంటానో లేదోనని..
5625. ఓర్చుకోవద్దింక..
ఓటమిని గెలిపించే ప్రయత్నాలు మొదలెడుతూ..
5626. అక్షరాలు అలసిపోతున్నాయట..
నిర్లిప్తతను పదేపదే అదేపనిగా రాసిరాసి..
5627. ఉగాదులన్నీ ఉన్నవాడికే..
పూరిగుడిసెలో పట్టెడు పంచదార కరువై..
5628. శిల్పివని గుర్తించానప్పుడే..
శిలవంటి నన్ను మలచుకుంటానని నువ్వన్నప్పుడే..
5629. దుర్ముఖమై విచ్చేసింది వసంతరాణి..
సుముఖమైతే మన్మధుడు వెనుదిరగడనేమో..
5630. దుర్ముఖమైతేనేమి..
నువ్వాదరిస్తే సుముఖమై చిరునవ్వులు చిందిస్తుందిగా
5631. జీవితమంతే..
షడ్రుచులూ సమానమంటూ ఒక్కరుచినీ ఆస్వాదించనివ్వదు..
5632. అలలై పారుతున్న సాహిత్యం..
నీ నవ్వులదొంతరలను చుట్టుకుంటూ..
5633. మకరందమై కురిసిపోలేనా..
అంతర్జాలమంతా తీయగా మార్చేద్దాం రమ్మంటే..
5634. ప్రేమజ్వరంలా అనిపిస్తోందెందుకో..
వసంతమంటే ఇదేనా..
5635. పచ్చనోట్లన్నీ పరారు..
తీరానికావలివైపు పచ్చదనాన్ని ఘనంగా పోషిస్తూ..
5636. గమనమప్పుడే ఆగింది..
రైలు ప్రయాణంలో ఎర్రజెండా ఎదురుపడ్డప్పుడే..
5637. అనుభూతి విశాలమైనదే..
నీ కవనములోని సౌందర్యం నేనైతే..
5638. మౌనం అనివార్యం..
మనమధ్య మాటలకు చోటు కావాలనుకొనేవరకూ..
5639. రాగరంజితమైంది జీవితం..
తన పంచమస్వరం పైపైకే సాగుతున్నందుకు..
5640. అరమూతలుగానే బాగున్నట్లుంది కన్నులకు..
కొసరికొసరి నన్ను చూడాలనుకున్నప్పుడు.
5641. బుద్ధిమంతులని భావించుకుంటారు..
ప్రముఖుల్లో చేరిన కొందరు దుర్ముఖులు..
5642. ఒంటరితనమే మంచిదనిపిస్తోంది..
నమ్మకంలేని మనసుల్ని వెంటేసుకు తిరిగేకన్నా..
5643. వెన్నెల విరగబూసింది..
నిశీధిలో నీ పాటకు పులకరించగానే..
5644. ఆనందభాష్పాలుగా కురవాల్సిన అశ్రువులు నేడు..
నీ ఎడబాటులో కన్నీరై ఒలికిపోతూ..
5645. కోవెలగా మారింది నీ హృదయం..
మంగళ స్వరూపముగా నన్ను భావించుకున్నావనే..
5646. అతివలెప్పుడూ అద్భుతాలే..
హరివిల్లుగా మనసున భావించుకొనే కనులుంటే..
5647. నీ ఆరాధనకర్ధం తెలిసింది..
నా అనుభూతి సజీవమనిపించినందుకే..
5648. నీ ఊపిరికి తెలిసిన వాస్తవమదేగా..
జీవితంపై అనురక్తి పెంచింది ప్రేమేగా..
5649. మనసింకా నిద్రిస్తూనే ఉంది..
తిమిరమావహించిన స్వప్నజగతిని వీడలేక..
5650. ముచ్చటగా పేర్చుకున్న పదాలేగా అన్నీ..
అక్షరం ఆసరాగా శిశిరాన్ని తరిమేయాలని..
5651. విహంగమై ఎగిరింది మనసానాడే..
నీ ఊహలరెక్కలు మొలిచి నన్ను గగనానికి పిలిచినప్పుడే..
5652. మౌనభావాలన్నీ మధువులైనందుకేమో..
నీ తలపుల్లోనూ తేనెతుంపరలు కురిసిపోతూ..
5653. విశాలమయ్యింది నా హృదయమందుకే..
కాస్త చోటిమ్మని నువ్వడిగినందుకే..
5654. తపనలెప్పుడూ అంతే..
తమకాన్ని చెరిసగం చేసి తడిమేస్తాయి..
5655. నువ్వవడం గమనించానప్పుడే..
నేనెవరని మనసు నన్ను ప్రశ్నించినప్పుడే..
5656. అమృతంగా మారాయి అశ్రువులన్నీ..
అక్షింతలంటూ నువ్వు అనువదించగానే..
5657. నా నయనలెప్పుడూ ముత్యపుచిప్పలేగా..
నీ రూపం ముత్యమై కన్నుల్లో ఒదిగినంత కాలం..
5658. హృదయానికావల రెపరెపలాడుతున్న చిన్నారి ఆశలు..
ప్రేమను పన్నీరుగా ఆమెపై కురిపించినందుకేగా..
5659. నిశ్శబ్దమూ మాట్లాడుతుంది..
కొన్ని అవ్యక్తాలను అనువదించే ఆరాటంలో..
5660. కృతజ్ఞాభివందనలే దేవునికి..
హృదయం బరువైనప్పుడు కన్నీటితో తగ్గిస్తున్నందుకు..
5661. ఏకాంతవనంలో అనుసరిస్తూనే ఉన్నాలే..
ఏ కాంత నీ కన్నుల్లో చేరి నలుసవరాదని..
5662. అద్దానికీ అర్ధమయ్యిందని..
నన్ను చూపిస్తే నువ్వు ఆనందపడతావని..
5663. కొన్ని భావాలంతే..
వద్దనుకున్నా వెంటబడి వాటేసుకొని మెలిపెడతాయి..
5664. గుండె చెరువయ్యింది..
వాస్తవం మానసిక ఆనందాన్ని దోచేస్తుంటే..
5665. కొన్ని మువ్వలు విడిచిపెట్టా దారిలో..
నీ గమనానికి నాలా తోడవుతాయనే..
5666. మరో కొత్త పరిచయంగా మొదలవమంటోంది మనసు..
నీకు కోల్పోయి జీవితాన్ని సజీవం చేసుకోమంటూ..
5667. కన్నుల లిపి చదవగలిగిన మనసది..
అనువాదానికి అందని అనురాగం జాలువారిందనే..
5668. అభిమానిస్తున్నావనుకున్నా..
పగలూ రేయి మరచి వెంటబడుతుంటే..
5669. కనుసైగలే చాలనుకున్నా..
కలలో సైతం కలవరిస్తావని తెలీక..
5670. ఏకాకితనం మాయమయ్యిందిగా..
పడమటకి నిర్దాక్షణ్యంగా నువ్వు పొమ్మనగానే..
5671. ప్రతిపొద్దూ మైమరపులేగా..
తానొచ్చే నా తలపుల వాకిట్లో..
5672. నాలో ఉన్నదీ నువ్వేగా..
ప్రేమని వేరే పేరెందుకులే..
5673. కోల్పోయి కనుమరుగయ్యింది నేనేగా..
అస్తిత్వానికర్ధాన్ని వివరించలేక ఓడిపోయి..
5674. మురిపాలు పండించుకోవాలనుకుంటే తప్పేంటి..
మనోవనమంతా తిరగడం నిజమనుకున్నాక..
5675. విడుదయినట్లనిపిస్తోంది మనసు..
మనిద్దరం కొత్తజన్మెత్తినట్టు ఋజువులు కనిపిస్తుంటే
5676. వసంత కోయిలలా నీవు..
మావిచిగురులా నేను కనిపించినందుకేమో..
5677. నవరాగానివే నీవు..
నవకాలన్నీ పూసేస్తూ..
5678. ప్రతిరోజూ నూతనత్వమే..
నీ అనురాగతీరంలో నేనో ఆనందమైతే..
5679. నీ ముందుమాట నేనేగా..
ఎన్నిపుటలు బతుకుపుస్తకంలో జతచేరినా..
5680. ఊపిరై వెలువడుతోంది..
నిన్ను చేరాలనుకొనే మది మౌనమొకటి..
5681. కలలతో కమ్ముకోకలా..
రేయికోసమే కలవరించేలా..
5682. నన్ను గుర్తించినప్పుడే జీవనమొచ్చింది..
మృతమైనా నా వలపంతటికీ..
5683. అనుభూతి పరిమళాలు ప్రవహిస్తున్నవి..
నాలో నిన్ను గుర్తిస్తుంటే..
5684. చలి కాచుకోవాలనుకున్న దగ్గరతనమే నువ్వు..
మనసంతా మైమరపుల గంధాన్ని పూసేస్తూ..
5685. ఏకాంతవనంలో ఒకరికొకరుగా..
నా నువ్వు..నీ నేను..
5686. అల్లరిపై మనసవుతోంది..
నువ్వు మునకేయమని మదిలోకి ఆహ్వానించినప్పుడల్లా..
5687. స్మృతులన్నింటినీ సవరిస్తా..
నిదురరాని ఏకాంతాన్ని అనుకూలంగా మార్చుకుంటూ..
5688. మునుపెరుగని సెగలే మదిలో..
తలపుల కుంపటి రగిలిపోతుంటే..
5689. నవ్వులెక్కడ మిగిలినవని..
మనసంతా మౌనం తానై నిండిపోతుంటే..
5690. మనసంతా మౌనం..
స్మృతుల వెల్లువలో శూన్యం ప్రవహిస్తుంటే..
5691. పల్చగా కురిసింది నువ్వేగా..
నన్నో జల్లుగా తడిమేయాలని..
5692. నేనెప్పుడూ గ్రీష్మాన్నే..
నిన్ను తాగి శూన్యాన్ని నింపుకోవాలని..
5693. వేసవి విడిదికన్నా రమ్మంటోంది..
స్మృతులలో సజీవంగానున్న ఊరు..
5694. కొందరు పెద్దలమనుకుంటారు..
అందర్నీ చిన్నచూపు చూసి వెక్కిరిస్తూ..
5695. గ్రీష్మమెందుకో ఎదలో..
కురిసింది కన్నీరు నా కన్నుల్లోనైతే..
5696. మానసిక అవసరంగా మారిపోయావనుకోలా..
బ్రతుకురచన నీతో మొదలెట్టేదాకా..
5697. సుమాలెన్ని తరలొచ్చాయో నువ్వు పిలవగానే
భావాల మాలికలో తమకూ చోటిమ్మంటూ..
5698. మనసంతా ఆనందం..
మన కలలన్నీ నింగిని తాకినందుకు..
5699. ఏకాంతంపై మనసవుతోంది..
రెప్పలపై నీ పెదవులతడి నెమరేసుకుంటుంటే..
5700. పెదవుల్లో దాగిన ఆనందాలు కొన్ని..
పదాల్లోకి అనువదించొద్దని మదిని వేడుకుంటూ..
![]() | Virus-free. www.avast.com |
No comments:
Post a Comment