5501. నయనాలకెప్పుడూ తన్మయాలే..
నీ జ్ఞాపకాల తీయని బాధతో..
5502. విపంచినని భావించడమెందుకో..
జీవనరాగానికి నన్ను పల్లవిని చేయలేనప్పుడు..
5503. మనసిప్పుడు కుదుటపడ్డది..
నీ ప్రపంచం నేనని ఒప్పుకోగానే..
5504. రామసక్కని నయనాలనుకున్నా నీవి..
విరహంలో చూపును మరణించనివ్వకలా..
5505. స్మృతులంటే మక్కువే నాకు..
నువ్వెన్ని అవతారాలు మార్చుకొచ్చినా..
5506. భావోద్వేగాన్ని దాచేసా..
మౌనానికే మత్తిల్లిపోతుంటే..
5507. ఎంత లయించాలో తెలుసుకున్నాను..
నీ భావంలో ఒదగాలనుకుంటే..
5508. నీ ఊపిరిలో నేను..
కొత్త శ్వాసనై పరిమళిస్తూ..
5509. నన్ను నేనే మరచిపోయా..
నీ చిరునవ్వులో చేరినప్పుడే..
5510. నా పెదవులపైనే నీ దృష్టంతా..
మెరిసే కెంపులు అద్భుతాలేమో అన్నట్టు
5511. అత్యద్భుతం అందుకే..
నీకు నచ్చినందుకే
5512. ఆత్మలు మాత్రం ఒకటేగా..
చెరోతీరంలో ఇరువురం నిలబడ్డా..
5513. అనంతమవుతూ నిర్జీవ కాలం..
క్షణాలను లెక్కించరాని సంక్షోభంలో..
5514. నీవన్నది విన్లేదు..
నే విన్నది నీకర్ధం కాలేదు..
5515. కలలో కౌగిళ్ళు బానే రాసిస్తావు..
వాస్తవంలో హృదయమే లేనట్టు వేధిస్తూ..
5516. కన్నీరెప్పటికీ తీయగా మారదేమో..
కాలమెన్ని చెక్కరనీళ్ళు కలిపినా..
5517. మల్లెసొదలే మనసంతా..
నీ మౌనం మత్తుగా మాట్లాడుతుంటే..
5518. తరంగమై వచ్చాననుకున్నా నీకై..
సురగంగగా నీలో మెదిలేవరకూ..
5519. ఓర్చుకుంటున్నా..
నీ చూపుల ముళ్ళెన్ని గాయాలు చేస్తున్నా..
5520. కలంలో ఒంపుకోనూ..
అక్షరమై నిన్ను రాసేందుకు నువ్వనుమతిస్తే..
5521. కారం..
నీ హృదయంలోని మమకారం..
5522. మదిలో స్వరజతులే..
నీ తలపులతో లయమై పాడుతుంటే..
5523. స్వర్గమే..
కలనైనా మదికోరే బంధం..
5524. అమృతమే వలపు..
తలపుల్లో విరబూసి వాస్తవమై పరిమళిస్తే..
5525. నేనెప్పుడూ హేమంతాన్నే..
నీ మౌనం నన్ను తడమలేదంతే..
5526. నీ ఊహలు రాసుకుందామనుకున్నా..
నువ్వలిగినప్పుడు నాకు తోడుంటాయని..
5527. నిర్వచనానికందని పరిమళాలు..
నా చూపును గంధంగా నువ్వలదుకుంటుంటే..
5528. మనసంతా మైకమే..
నీ మోహపు ఆవిరుల గమ్మత్తులకే..
5529. మాటలకు కరువొచ్చిందెందుకో..
మనసులు ఒక్కటయినందుకేమో..
5530. నీవెప్పుడూ అపరాజితవే..
కానీ నన్నోడించలేదంతే..
5531. శిశిరంలో తప్పిపోనందుకేమో..
కోయిలనైనా కూయలేకున్నాను..
5532. మనసుకెప్పుడూ గ్రీష్మమే..
నీ తలపుల జల్లన్నదే కురవక..
5533. వేరే నిప్పెందుకులే..
మనసావరించుకున్న నిరాశ చాలుగా..జీవితాన్ని మసి చేసేందుకు..
5534. గుండెను తడుముకోవలసిన పరిస్థితే ప్రతిసారీ..
తడిని రాద్దామని కలం ఆక్రోశించినప్పుడల్లా..
5535. కలలో తడిమినట్లనిపించడం నిజమేమో..
కన్నీరేమో ఆగనంది విచిత్రంగా..
5536. తడుముకున్నా మనసుని..
అల్లిన నీ చూపులు గుచ్చుకుంటుంటే..
5537. కన్నీరంతా ఖర్చైపోతుంది..
ఒక్క నీ మనసు తడిపేందుకే
5538. అతడి కళ్ళెవరికి కావాలిప్పుడు..
ఆమె తడి కళ్ళు మెరుపులు చూడాలని కానీ..
5539. మనసు సరోవరమైపోలా..
నీ మాటలకు కరిగి నీరవగానే..
5540. ముత్యమల్లే దాచుకున్నా..
నీ చూపులు చినుకులై కురిసి నన్ను తడుపుతుంటే..
5541. స్వాగతించేసా సరాగానికి..
ఏకాంత గవాక్షంపై ఎదురు నిలబడ్డావనే..
5542. కొన్ని అనుబంధాలంతే..
ముగిసిపోతే గానీ విలువను సంతరించుకోవు..
5543. హృదయం కంపిస్తోంది..
తనాలపించే చరమగీతాలలోని తడి తగిలినందుకే..
5544. తల్లడిల్లిన మది..
తరలిపోతున్న ప్రవాహంలో కొట్టుకుపోతోంది నేడు..
5545. నీ ఊపిరులు తడిమాయనే అనుకున్నా..
గాలికి నా కురులు ఊగినప్పుడల్లా..
5546. జీవితం అవగతమయ్యింది..
నేనో ప్రవాహమై నీవైపు సాగుతుంటే..
5547. లోలకమై ఊగిపోతున్నా..
సంశయమో..సందేహమో తేల్చుకోలేని సందిగ్ధంలో
5548. అనురాగ సంగమం సరైనదే..
భావాలెన్ని భాష్యాలను కూర్చుకున్నా..
5549. నేనంటే నీకభిమానమే..
పాటగా పల్లవించినా..సాహిత్యమై శృతిచేసినా..
5550. జీవితం గతి తప్పినందుకేమో..
అంతరంగం భగ్నమై బూడిదయ్యింది..
5551. భావాలకెన్ని రంగులేస్తావో..
ప్రతిపదాన్నీ హరివిల్లుగా మెరిపించాలనే ఆత్రంలో..
5552. నీ స్మృతిలోనే నేనుంటాలే..
ఎన్ని నీడలు ముంచుకొచ్చినా
5553. ఒంటరి తీరంలో వేచున్నా..
నీవొచ్చి పలకరించి మురుస్తావనే..
5554. కొన్ని పలకరింతలంతే కామోసు..
పులకరింతలైనా పరవశాలు తీరిపోవు..
5555. వెన్నెలకాపు మొదలయ్యిందిలే..
నువ్వు పిలిచిన జాబిలి రాకతోనే..
5556. మనసంతా మరువాల గుభాళింపు..
నీ తలపులు పొంగిపొర్లుతున్నందుకే..
5557. చెలియలకట్టలే కురులు..
నీలోని విరహన్ని తనలోనే ఆపేందుకు..
5558. నవ్వులు నింగికెగిసాయి..
నీ మనసును సున్నితంగా కోసేయాలనే..
5559. ఆగలేని పిపాస రేగాలి..
కదిలితే కావ్యాలు రాయాలంటే..
5560. శరత్తువై రావొచ్చుగా..
హేమంతానికైనా హత్తుకుంటాను..
5561. నక్షత్రమై కూర్చుంది అమ్మ..
చందమామని కావాలని అడిగానని..
5562. ధైర్యం వీగిపోయింది..
అష్టలక్ష్మివైన నువ్వు కాదని వెళ్ళిపోయావనే..
5563. పారిజాతాలుగా ఏరుకున్నా..
నీ భావలను మాలగా గుచ్చుకోవాలనే..
5564. ప్రేముంటే చాలుగా..
కొసమెరుపుగా నేనుంటా..
5565. ఓదార్చవెందుకో..
ఊటలయ్యే నేత్రాలను తుడవకుండా నిలబడుతూ..
5566. మనోలాసమైతే అయ్యిందిగా..
నీ మనసు మయూరమై నర్తించగానే..
5567. ఇంకుడు గుంతయ్యింది హృదయం..
కన్నీరంతా తనలో ఒంపుకొని..
5568. అపశృతిని సరిచేస్తాలే..
శివరంజని తీసేసి కల్యాణిని మొదలెట్టి..
5569. కొన్ని అపురూపాలంతే..
కేవలం నటనలోనే జీవించే అనుభవాలనిస్తూ..
5570. కొన్ని భావాలంతే..
కలలో కవ్వించి వాస్తవంలో ఏడిపిస్తూ..
5571. మనో మధనంలో మధురిమలు..
నా తలపులన్నీ నీవయ్యాక..
5572. మలయసమీరంపై మనసయ్యింది..
చెలికాడ్ని తాకొచ్చి నన్ను తడుముతుందని..
5573. అధరువు లేదంటావెందుకో..
ఆనందన్ని అద్దుకోకుండా తప్పొప్పులనే ఆరగిస్తూ
5574. అనుమానమే ప్రేమకు సంకేతమని తెలుసుకోవెందుకో..
నీ జ్ఞాపకాలతో తలబడలేక నేనుంటుంటే..
5575. మనసంతా లాలనే..
నీ చిరునవ్వుల గారాలకి పొంగిపోతూ..
5576. కొదమపువ్వులా నీ నవ్వు..
భాషకందని భావాలను ఒలికిస్తూ..
5577. తీయననిపిస్తున్న కన్నీరు నేడు..
నీ తలపుల్లోంచీ జారిపడ్డందుకే
5578. ఆనందమనాలేమో..
నవ్వాలనుకుంటే కన్నీరొచ్చింది మరి..
5579. జ్ఞాపకాలెప్పుడూ గ్రీష్మంలోనే..
వసంతానికి రమ్మన్నా ఆలస్యాన్నే అనుసరిస్తూ..
5580. కన్నుగప్పింది నువ్వనుకోలా..
మనసు పొలిమేరల్లో అడుగులు తడబడుతుంటే
5581. కలల కాణాచిగా మారిపోయా..
నీకు నిద్ర మక్కువనేగా..
5582. కొత్త జన్మెత్తాలేమో..
కలలు కన్న జీవితాన్ని పొందాలంటే..
5583. కాసిన్ని స్మృతులు కోరినందుకేమో..
నెలవంకలు మాత్రమిచ్చి వెళ్ళావ్..
5584. కలలవనంలోకి తీసుకుపోదామనుకున్నా..
విహారానికి రమ్మని నువ్వు పిలిచుంటే..
5585. ప్రారంభించేసా ప్రార్ధనందుకే..
గుడిగంట కొట్టగానే నువ్వు స్పందిస్తావని..
5586. భావాల వరదలు..
అక్షరాలన్నీ ఉరకలేసి కలాన్ని హత్తుకుంటుంటే..
5587. మనసు కోయిలై వినబడుతోంది..
వసంతం నీలా దగ్గరవుతుంటే..
5588. మౌనంపై మక్కువేస్తుంది..
నీ మాటలన్నీ మనసులోనే వినబడుతుంటే..
5589. శిశిరమని మర్చిపోతున్నావు..
హేమంతం చల్లగా నిన్నొచ్చి తడిమినందుకేగా
5590. కాలావధుల్ని దాటొచ్చేసాను..
నువ్వెదురు చూస్తున్నావని మనసుకి అనిపించగానే..
5591. ప్రణయం ఫలించింది..
పరిణయం పూర్తైనందుకే
5592. కన్నీటి బొట్లెన్ని పోగుపెట్టావో..
నాకు ముత్యాలపై మక్కువనేనా..
5593. చూపులభాషకెప్పుడో దాసోహయ్యిందిగా మనసు..
పెదవులతో అనవసరపు నసెందుకో..
5594. వాళ్ళిద్దరూ అపరిచితులే..
బంధమన్న పేరుతో కలిసున్నట్లు నటిస్తూ.
5595. ప్రపంచానికి తెలియని నిజమొకటి..
మనమిద్దరం కాదు..ఒకటేనని..
5596. ఆనందమే అనుకుంటున్నా..
నిశ్శబ్దం విరుస్తున్న నీరులా నువ్వొస్తుంటే
5597. రాగాలాపనకై కోయిల..
దుర్ముఖి పాడనిస్తుందో లేదోనని ఆలోచిస్తూ..
5598. నవ్వులెందుకలా దాచుకుంటావో..
నీ ముందే నేనున్నా గుర్తుంచక..
5599. నీ తలపులనే భుజిస్తున్నా..
నా వలపు నీరసిస్తుంటే..
5600. పయనం ప్రాణమయ్యింది..
నా శ్వాసల గమ్యం నీవైనందుకే..
నీ జ్ఞాపకాల తీయని బాధతో..
5502. విపంచినని భావించడమెందుకో..
జీవనరాగానికి నన్ను పల్లవిని చేయలేనప్పుడు..
5503. మనసిప్పుడు కుదుటపడ్డది..
నీ ప్రపంచం నేనని ఒప్పుకోగానే..
5504. రామసక్కని నయనాలనుకున్నా నీవి..
విరహంలో చూపును మరణించనివ్వకలా..
5505. స్మృతులంటే మక్కువే నాకు..
నువ్వెన్ని అవతారాలు మార్చుకొచ్చినా..
5506. భావోద్వేగాన్ని దాచేసా..
మౌనానికే మత్తిల్లిపోతుంటే..
5507. ఎంత లయించాలో తెలుసుకున్నాను..
నీ భావంలో ఒదగాలనుకుంటే..
5508. నీ ఊపిరిలో నేను..
కొత్త శ్వాసనై పరిమళిస్తూ..
5509. నన్ను నేనే మరచిపోయా..
నీ చిరునవ్వులో చేరినప్పుడే..
5510. నా పెదవులపైనే నీ దృష్టంతా..
మెరిసే కెంపులు అద్భుతాలేమో అన్నట్టు
5511. అత్యద్భుతం అందుకే..
నీకు నచ్చినందుకే
5512. ఆత్మలు మాత్రం ఒకటేగా..
చెరోతీరంలో ఇరువురం నిలబడ్డా..
5513. అనంతమవుతూ నిర్జీవ కాలం..
క్షణాలను లెక్కించరాని సంక్షోభంలో..
5514. నీవన్నది విన్లేదు..
నే విన్నది నీకర్ధం కాలేదు..
5515. కలలో కౌగిళ్ళు బానే రాసిస్తావు..
వాస్తవంలో హృదయమే లేనట్టు వేధిస్తూ..
5516. కన్నీరెప్పటికీ తీయగా మారదేమో..
కాలమెన్ని చెక్కరనీళ్ళు కలిపినా..
5517. మల్లెసొదలే మనసంతా..
నీ మౌనం మత్తుగా మాట్లాడుతుంటే..
5518. తరంగమై వచ్చాననుకున్నా నీకై..
సురగంగగా నీలో మెదిలేవరకూ..
5519. ఓర్చుకుంటున్నా..
నీ చూపుల ముళ్ళెన్ని గాయాలు చేస్తున్నా..
5520. కలంలో ఒంపుకోనూ..
అక్షరమై నిన్ను రాసేందుకు నువ్వనుమతిస్తే..
5521. కారం..
నీ హృదయంలోని మమకారం..
5522. మదిలో స్వరజతులే..
నీ తలపులతో లయమై పాడుతుంటే..
5523. స్వర్గమే..
కలనైనా మదికోరే బంధం..
5524. అమృతమే వలపు..
తలపుల్లో విరబూసి వాస్తవమై పరిమళిస్తే..
5525. నేనెప్పుడూ హేమంతాన్నే..
నీ మౌనం నన్ను తడమలేదంతే..
5526. నీ ఊహలు రాసుకుందామనుకున్నా..
నువ్వలిగినప్పుడు నాకు తోడుంటాయని..
5527. నిర్వచనానికందని పరిమళాలు..
నా చూపును గంధంగా నువ్వలదుకుంటుంటే..
5528. మనసంతా మైకమే..
నీ మోహపు ఆవిరుల గమ్మత్తులకే..
5529. మాటలకు కరువొచ్చిందెందుకో..
మనసులు ఒక్కటయినందుకేమో..
5530. నీవెప్పుడూ అపరాజితవే..
కానీ నన్నోడించలేదంతే..
5531. శిశిరంలో తప్పిపోనందుకేమో..
కోయిలనైనా కూయలేకున్నాను..
5532. మనసుకెప్పుడూ గ్రీష్మమే..
నీ తలపుల జల్లన్నదే కురవక..
5533. వేరే నిప్పెందుకులే..
మనసావరించుకున్న నిరాశ చాలుగా..జీవితాన్ని మసి చేసేందుకు..
5534. గుండెను తడుముకోవలసిన పరిస్థితే ప్రతిసారీ..
తడిని రాద్దామని కలం ఆక్రోశించినప్పుడల్లా..
5535. కలలో తడిమినట్లనిపించడం నిజమేమో..
కన్నీరేమో ఆగనంది విచిత్రంగా..
5536. తడుముకున్నా మనసుని..
అల్లిన నీ చూపులు గుచ్చుకుంటుంటే..
5537. కన్నీరంతా ఖర్చైపోతుంది..
ఒక్క నీ మనసు తడిపేందుకే
5538. అతడి కళ్ళెవరికి కావాలిప్పుడు..
ఆమె తడి కళ్ళు మెరుపులు చూడాలని కానీ..
5539. మనసు సరోవరమైపోలా..
నీ మాటలకు కరిగి నీరవగానే..
5540. ముత్యమల్లే దాచుకున్నా..
నీ చూపులు చినుకులై కురిసి నన్ను తడుపుతుంటే..
5541. స్వాగతించేసా సరాగానికి..
ఏకాంత గవాక్షంపై ఎదురు నిలబడ్డావనే..
5542. కొన్ని అనుబంధాలంతే..
ముగిసిపోతే గానీ విలువను సంతరించుకోవు..
5543. హృదయం కంపిస్తోంది..
తనాలపించే చరమగీతాలలోని తడి తగిలినందుకే..
5544. తల్లడిల్లిన మది..
తరలిపోతున్న ప్రవాహంలో కొట్టుకుపోతోంది నేడు..
5545. నీ ఊపిరులు తడిమాయనే అనుకున్నా..
గాలికి నా కురులు ఊగినప్పుడల్లా..
5546. జీవితం అవగతమయ్యింది..
నేనో ప్రవాహమై నీవైపు సాగుతుంటే..
5547. లోలకమై ఊగిపోతున్నా..
సంశయమో..సందేహమో తేల్చుకోలేని సందిగ్ధంలో
5548. అనురాగ సంగమం సరైనదే..
భావాలెన్ని భాష్యాలను కూర్చుకున్నా..
5549. నేనంటే నీకభిమానమే..
పాటగా పల్లవించినా..సాహిత్యమై శృతిచేసినా..
5550. జీవితం గతి తప్పినందుకేమో..
అంతరంగం భగ్నమై బూడిదయ్యింది..
5551. భావాలకెన్ని రంగులేస్తావో..
ప్రతిపదాన్నీ హరివిల్లుగా మెరిపించాలనే ఆత్రంలో..
5552. నీ స్మృతిలోనే నేనుంటాలే..
ఎన్ని నీడలు ముంచుకొచ్చినా
5553. ఒంటరి తీరంలో వేచున్నా..
నీవొచ్చి పలకరించి మురుస్తావనే..
5554. కొన్ని పలకరింతలంతే కామోసు..
పులకరింతలైనా పరవశాలు తీరిపోవు..
5555. వెన్నెలకాపు మొదలయ్యిందిలే..
నువ్వు పిలిచిన జాబిలి రాకతోనే..
5556. మనసంతా మరువాల గుభాళింపు..
నీ తలపులు పొంగిపొర్లుతున్నందుకే..
5557. చెలియలకట్టలే కురులు..
నీలోని విరహన్ని తనలోనే ఆపేందుకు..
5558. నవ్వులు నింగికెగిసాయి..
నీ మనసును సున్నితంగా కోసేయాలనే..
5559. ఆగలేని పిపాస రేగాలి..
కదిలితే కావ్యాలు రాయాలంటే..
5560. శరత్తువై రావొచ్చుగా..
హేమంతానికైనా హత్తుకుంటాను..
5561. నక్షత్రమై కూర్చుంది అమ్మ..
చందమామని కావాలని అడిగానని..
5562. ధైర్యం వీగిపోయింది..
అష్టలక్ష్మివైన నువ్వు కాదని వెళ్ళిపోయావనే..
5563. పారిజాతాలుగా ఏరుకున్నా..
నీ భావలను మాలగా గుచ్చుకోవాలనే..
5564. ప్రేముంటే చాలుగా..
కొసమెరుపుగా నేనుంటా..
5565. ఓదార్చవెందుకో..
ఊటలయ్యే నేత్రాలను తుడవకుండా నిలబడుతూ..
5566. మనోలాసమైతే అయ్యిందిగా..
నీ మనసు మయూరమై నర్తించగానే..
5567. ఇంకుడు గుంతయ్యింది హృదయం..
కన్నీరంతా తనలో ఒంపుకొని..
5568. అపశృతిని సరిచేస్తాలే..
శివరంజని తీసేసి కల్యాణిని మొదలెట్టి..
5569. కొన్ని అపురూపాలంతే..
కేవలం నటనలోనే జీవించే అనుభవాలనిస్తూ..
5570. కొన్ని భావాలంతే..
కలలో కవ్వించి వాస్తవంలో ఏడిపిస్తూ..
5571. మనో మధనంలో మధురిమలు..
నా తలపులన్నీ నీవయ్యాక..
5572. మలయసమీరంపై మనసయ్యింది..
చెలికాడ్ని తాకొచ్చి నన్ను తడుముతుందని..
5573. అధరువు లేదంటావెందుకో..
ఆనందన్ని అద్దుకోకుండా తప్పొప్పులనే ఆరగిస్తూ
5574. అనుమానమే ప్రేమకు సంకేతమని తెలుసుకోవెందుకో..
నీ జ్ఞాపకాలతో తలబడలేక నేనుంటుంటే..
5575. మనసంతా లాలనే..
నీ చిరునవ్వుల గారాలకి పొంగిపోతూ..
5576. కొదమపువ్వులా నీ నవ్వు..
భాషకందని భావాలను ఒలికిస్తూ..
5577. తీయననిపిస్తున్న కన్నీరు నేడు..
నీ తలపుల్లోంచీ జారిపడ్డందుకే
5578. ఆనందమనాలేమో..
నవ్వాలనుకుంటే కన్నీరొచ్చింది మరి..
5579. జ్ఞాపకాలెప్పుడూ గ్రీష్మంలోనే..
వసంతానికి రమ్మన్నా ఆలస్యాన్నే అనుసరిస్తూ..
5580. కన్నుగప్పింది నువ్వనుకోలా..
మనసు పొలిమేరల్లో అడుగులు తడబడుతుంటే
5581. కలల కాణాచిగా మారిపోయా..
నీకు నిద్ర మక్కువనేగా..
5582. కొత్త జన్మెత్తాలేమో..
కలలు కన్న జీవితాన్ని పొందాలంటే..
5583. కాసిన్ని స్మృతులు కోరినందుకేమో..
నెలవంకలు మాత్రమిచ్చి వెళ్ళావ్..
5584. కలలవనంలోకి తీసుకుపోదామనుకున్నా..
విహారానికి రమ్మని నువ్వు పిలిచుంటే..
5585. ప్రారంభించేసా ప్రార్ధనందుకే..
గుడిగంట కొట్టగానే నువ్వు స్పందిస్తావని..
5586. భావాల వరదలు..
అక్షరాలన్నీ ఉరకలేసి కలాన్ని హత్తుకుంటుంటే..
5587. మనసు కోయిలై వినబడుతోంది..
వసంతం నీలా దగ్గరవుతుంటే..
5588. మౌనంపై మక్కువేస్తుంది..
నీ మాటలన్నీ మనసులోనే వినబడుతుంటే..
5589. శిశిరమని మర్చిపోతున్నావు..
హేమంతం చల్లగా నిన్నొచ్చి తడిమినందుకేగా
5590. కాలావధుల్ని దాటొచ్చేసాను..
నువ్వెదురు చూస్తున్నావని మనసుకి అనిపించగానే..
5591. ప్రణయం ఫలించింది..
పరిణయం పూర్తైనందుకే
5592. కన్నీటి బొట్లెన్ని పోగుపెట్టావో..
నాకు ముత్యాలపై మక్కువనేనా..
5593. చూపులభాషకెప్పుడో దాసోహయ్యిందిగా మనసు..
పెదవులతో అనవసరపు నసెందుకో..
5594. వాళ్ళిద్దరూ అపరిచితులే..
బంధమన్న పేరుతో కలిసున్నట్లు నటిస్తూ.
5595. ప్రపంచానికి తెలియని నిజమొకటి..
మనమిద్దరం కాదు..ఒకటేనని..
5596. ఆనందమే అనుకుంటున్నా..
నిశ్శబ్దం విరుస్తున్న నీరులా నువ్వొస్తుంటే
5597. రాగాలాపనకై కోయిల..
దుర్ముఖి పాడనిస్తుందో లేదోనని ఆలోచిస్తూ..
5598. నవ్వులెందుకలా దాచుకుంటావో..
నీ ముందే నేనున్నా గుర్తుంచక..
5599. నీ తలపులనే భుజిస్తున్నా..
నా వలపు నీరసిస్తుంటే..
5600. పయనం ప్రాణమయ్యింది..
నా శ్వాసల గమ్యం నీవైనందుకే..
This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment