Tuesday, 7 March 2017

6501 to 6600

6501. ప్రతి కధకీ ఒక అస్తిత్వముంటుంది..
తడి తెలిసిన హృదయానికే అందుతూ..
6502. కొన్ని కలలంతే..
వేకువైనా రాత్రి కోసమే కలవరించేలా..
6503. ఊపిరులన్నీ కుంచెలుగా మార్చావుగా..
నీ కలానికి కవితనైనందుకు..
6504. మాట గెలవక తప్పలేదు..
అహంకారాన్ని చిదిమి కదిలాక..
6505. అపశృతులు కాబోవు నా జ్ఞాపకాలెప్పటికీ..
శిరిరమైనా శిధిలమైనా వసంతాన్నే కాంక్షిస్తూ..
6506. అంబరమై నాలో పరచుకున్నప్పుడే అనుకున్నా..
మెరుపు చుక్కగానైనా నీలో నేనుండాలని..
6507. నీకు మాత్రమే ఉంది..
నన్ను సంతోషపెట్టగలిగే నేర్పు..
6508. ప్రకృతికీ ఎప్పుడూ కుళ్ళే..
నీ వసంతం నేనవుతుంటే..
6509. ఒకరిలో ఒకరమై విస్తరించింది మనమేగా..
ఇరువురూ ఏకమై కరిగి నీరయ్యాక..
6510. శిశిరానికి జారుకోక తప్పలేదు..
వసంతమొచ్చి రాగాత్మగా నిలబడ్డాక..
6511. కాటుకలకూ వర్ణాహంకారమేనట..
పెదవులనూ చెక్కిళ్ళను చూసి వెక్కిరిస్తూ..
6512. సహజత్వాన్ని కోల్పోతున్న మది..
అతికించుకున్న నవ్వులతోనే జీవించేస్తూ..
6513. నిన్నటి దాకా శిశిరాన్నే..
నీవే కోయిలై వచ్చి వసంతాన్ని గుర్తు చేసేదాకా..
6514. వర్తమాన్నాన్నే గుర్తిచాలంట..
భవిష్యత్తులో చేదు కన్నీరు చిందరాదనుకొంటే..
6515. ఆకాశమై విస్తరించలేనా..
విశ్వకర్మనే పిలుచుకొచ్చి కలల కుటీరపు నిర్మాణం మొదలెడతానంటే..
6516. కలతగా చేరావనుకున్న కన్నుల్లో..
నలతగా మారేవరకూ మనసులో..
6517. సిరుల సౌరభాలకే మత్తిల్లుతున్నా..
పొదుపుకున్నది నీ పరిష్వంగంలోనైతే..
6518. మనసాదరించని నిజాలు కొన్ని..
అడుగులేసే అబద్దాలకే దారిస్తాయి..
6519. అవారంఛితమైన ఆవేదనది..
ప్రేమించిన పాపానికి మరణించిన ఆనందంలా..
6520. శూన్యానికే నివేదనిచ్చావుగా నన్ను..
జీవితం చేదుగా ఉందన్నందుకు
6521. భావాలకు ప్రాణం పోసీ లాభామేముంది..
భావుకతను గుర్తించే మనసులే కరువవుతుంటే..
6522. విరిసిన హరివిల్లులో చిక్కుకుంది మది..
విడిచిన భాష్పాలన్నీ నన్నే చూపుతుంటే..
6523. కవితలద్దుకున్న కన్నీరు..
నీ కంటిని రాసినప్పుడల్లా తుడుచుకోలేక..
6524. సంతకం చేయని లేఖలేగా నీవన్నీ..
దారి మరచి ఇల్లిల్లూ తిరుగుతూ..
6525. వాడో అవిశ్రాంత శ్రామికుడు..
ఉత్పత్తినంతా స్వేదంలోనే వెలికితీస్తూ..
6526. ఉనికి కోల్పోయిన కన్నీరు..
ఎంత ప్రవహించినా ఉలుకు లేని చెక్కిళ్ళ సావాసంతో..
6527. ఊహల ఊర్ధ్వలోకాలలో ఉన్నా నేను..
గడ్డకట్టిన జ్ఞాపకాలను నువ్వు నెమరేసుకుంటుంటే..
6528. నా పెదవులకు పన్నీరు అలదినట్లుంది..
పువ్వుల తేనెలన్నీ నన్నే వరిస్తుంటే..
6529. ఎంత చూసినా దాహం తీరదెందో కన్నులకు..
నీ రూపం ఎండమావిలా కనుమరుగవుతుందనే అనుమానంలో..
6530. తెరలు తెరలుగా ఆవేదన..
మనసు పగిలిన నిశ్శబంలో..
6531. కలలోనే కనుమరుగవుతున్నా..
వర్ణమై నేను విరబూసిన ప్రతిసారీ నీకు మెలకువొస్తుంటే..
6532. మనసు మువ్వలు ఘల్లుమన్న సవ్వడి..
 నిద్దురలేచిన నీ తలపుల ఆనవాళ్ళతో..
6533. రసోదయమీ శుభోదయం..
నీ సమక్షంలో ప్రణయమో మోహనరాగమవుతుంటే..
6534. అనుబంధమెప్పుడో వలసపోయింది..
జీవితచక్రాల వేగానికి మజిలీలు వేరవుతుంటే..
6535. పరవశంలో మునకేసిందో జీవితం..
హేమంతం అవ్యక్తమై అల్లుకుంటుంటే..
6536. నిశీధంటే మనిషికెప్పుడూ భయమే..
సుషుప్తిలో జీవితం సమాప్తమవుతుందేమోనని..
6537. అరుణోదయాన్ని మరిచావెందుకో..
వేకువచుక్కను చూసి రాత్రయ్యిందని భ్రమిస్తూ..
6538. నీ కన్నుల్లో మునకలాపలేను..
మనసు మధురానుభూతులనే ఆశిస్తుంటే..
6539. వసంతాన్ని సాగనంపాల్సొచ్చింది..
నాలో సంతోషాన్ని చిగురించేట్టు చేయలేదని..
6540. మనసెటు తప్పిపోయిందో నీ వెతుకులాటలో..
వియోగంతో నా కన్నులు సెలయేళ్ళవుతుంటే..
6541. నిన్ను నువ్వే మరచిపోతావనుకోలేదు..
ప్రేమను అన్వేషించే రహస్యమార్గంలో..
6542. కొన్ని ఊహలు అబద్దాలైనా అందమే..
చిలిపిదనంతోనే మనసుని ఉలికులికి పడేస్తుంటే..
6543. ఆరాధనైనా చాలనుకున్నా..
శృతిలేక నన్ను స్వరబద్దం చేసినా లోలోన సంతోషిస్తూనే..
6544. ప్రేమపైన ప్రశ్నావళెందుకులే..
రెండు మనసులు కలిసి లోకాన్ని ఓడిస్తాయని తెలిసాక..
6545.తలపులన్నీ కలల కొరకే..
కేవలం రాత్రికే పరిమితమైపోతూ..
6546. బ్రతికున్నప్పుడు విలువలేని మనిషే..
చచ్చాక మహనీయుడిగా గుర్తింపు..
6547. నీటిబుడగే జీవితమెప్పటికీ..
కాలాలెంత కదులుతున్నా మృత్యువే మజిలీగా..
6548. కాటుకలతోనే కళ్ళకందం..
చూపులతోనే అల్లుకొనే మనసైన బంధం..
6549. తప్పని అలుకలే కొన్ని..
అనురాగాన్ని ఆశించే చంచలత్వానికి..
6550. నాకంటూ మిగిలిందేమని..
వలపంతా నీ పరమై నేనొంటరయ్యాక..
6551. నువ్వూ వెన్నెలా ఎప్పుడూ ఒకటేగా..
అప్పుడప్పుడూ నా పెదవులపై కురిసిపోతూ..
6552. హంసలా ఆరునెల్లున్నా చాలనుకుంటారందరూ..
దేహమొకటి దశాబ్దాలుగా ప్రవహిస్తున్నా..
6553. మార్పు అనివార్యమని మర్చిపోతున్న జనాలు..
తనతోనే మొదలెట్టేందుకు అక్కర్లేనన్ని సందేహాలు..
6554. నవ్వులకి నగుబాటు తప్పలేదు..
కన్నీరొచ్చి చెక్కిళ్ళను మైదానంగా మార్చి కళ్ళాపి చల్లేస్తుంటే..
6555. మౌనాన్ని స్వరబద్దం చేద్దాం రా..
నీరవానికి రవాన్ని పరిచయించే భాగ్యంగా..
6556. మునుగుతున్నా తేలినట్లే ఉంది..
అడక్కుండానే ఆసరా అవుతుంటే
6557. రెప్పల మాటునే దోగాడుతావుగా నువ్వు..
ఉదయాస్తమానాలూ కొత్తగా మెరిపిస్తూ నాలో..
6558. ప్రబంధమే అయ్యింది ప్రణయం..
రసానందానికి పరాకాష్ఠగా మనమయ్యాక..
6559. ఎన్ని తిమిరింతలు కావాలో నీకు..
పులకరింతలతో ప్రాణం కుదుట పడలేదంటూ..
6560. జల్లుగానే కురవాలనుకున్న కన్నీరు..
జ్ఞాపకాలు ఒంటరిగా తరలొస్తే..
6561. అలసటెరుగని స్మృతులే నీవి..
మనసెన్ని మైళ్ళు ప్రయాణించినా..
6562.  సరిహద్దు నేనై నిలబడ్డా..
నీ నడకను నిలవరించేందుకే..
6563.శిల్పానికున్న మెత్తదనం గమనించావేమో..
నాలో సున్నితత్వాన్ని గుర్తించి..
6564. హద్దులు చెరిపేసుకున్న దేహమది..
ఆనందమే ఊపిరిగా జీవాన్నింపుకొని..
6565. సరికొత్త వింతలాగుంది..
పువ్వులు మువ్వలై మదిని దోచేస్తుంటే..
6566. పానకమనుకొని తాగేసా..
నువ్వు కన్నీరిచ్చినా పన్నీటిగానే భ్రమించి..
6567. నాకెందుకో ఇప్పుడే తెల్లవారినట్లుంది..
మనసు ముసురిప్పుడు తొలిగినందుకేమో..
6568. మెరుపును తడిమిన పిండివెన్నెల..
చెక్కిళ్ళ నునుపును పరీక్షించేందుకేమో..
6569. నిన్నటిదే ఆరాధన..
నేటికి నవరాగమై పెదవుల్లో పల్లవిస్తూ..
6570. మూడేసి మాలికలే..
ముచ్చటైన మల్లెలబంధాలై మనసును మైమరపించేవి..
6571. ఆమె పల్లవికి వంతపాడింది..
అతని మనసు చురుకుదనం..
6572. నా పెదవిన పూసిన పువ్వొకటి..
నుదుట నువ్వేసిన వేకువ ముగ్గుతోనే...
6573. నా నుదుట నీ రూపం..
నీ కన్నుల్లో నా బొమ్మగా..
6574. ఆధిపత్యపు ముళ్ళకంచెలు..
నిశీధిలోనే మరణించమని శాసించే శృంఖలాలు..
6575. మనసెందుకో బరువవుతోంది..
కవనంలో పదాలు ఒదగనని మొండికేస్తుంటే..
6576. అంధకారమైతే పటాపంచలయ్యిందిగా..
నిద్రలేచిన నీ స్వప్నానికి వేకువెదురయ్యాక..
6577. ఆర్ణవమవుతూ ఆనందాలు..
అధర సంతకాలతో కాలం కరిగిపోతుంటే..
6578. ఋతువులు మరచిన రాగంలో నేను..
నులివెచ్చని ఊపిరిలో చేరింది నువ్వైతే..
6579. వేరే  మరువమేదీ అక్కర్లేదు..
పరిమళించు భావాలన్నీ ఒక్కటైనందుకు..
6580. నీడల్లో నిలబెట్టినప్పుడే అనుకున్నా..
వెన్నెల్లోకి వేరేవారిని వెతుక్కున్నావని..
6581. కన్నుల్లోనే మిగిలిపోయిన కోరికలు..
మనసుదాటి నువ్వు ముందుకెళ్తుంటే
6582. పరిమళాలు పంచే ఆమె చిరునవ్వు..
ఘనీభవించిన అతని హృదయాన్ని కరిగిస్తూ..
6583. వలసపోయిన కొన్ని మధురానుభూతులు..
నిశ్శబ్దమొక్కటీ నాతో మిగిలిపోయాక..
6584. శ్వామనై నేను..శ్వామలవర్ణుడై తను..
అనుభవాల తీర్ధంలో నిత్యం మునకలేస్తూ..
6585. అల్లరి అదుపు తప్పినట్లనిపిస్తోంది..
నీ స్మృతులు కవ్వించినప్పుడల్లా..
6586. నా కనురెప్పలనే ఆల్చిప్పలుగా చేసేసా..
నీ రూపును ముత్యముగా దాచుకోవాలనే..
6587. నవ్వులుగా మలచుకుంటున్నా..
తన మదిలోని అహంకారాన్ని అనువదించలేక..
6588. కనుసైగ చేసినా కనిపెట్టేస్తావు..
నా చూపులనే వెంటాడుతున్నట్లు..
6589. నవ్వులుగా మలచుకుంటున్నా..
నిస్సహాయ క్షణాలు పగిలి నీరవకుండా..
6590. నవ్వులుగా మలచుకుంటున్నా..
వలపు పారవశ్యాన్ని పెదవులు బయటేయకుండా..
6591. నవ్వులతో కరిగించా కాలాన్నీ..
కన్నీటితో జయించలేక జీవితాన్ని..
6592. విజయమొకటి నవ్వుకుంది..
నడిచినదారిలో వెనుకబడ్డ రాళ్ళను చూసి..
6593. అహాన్ని వదులుకున్నా..
పెదవులపై పూయాలనుకున్న నవ్వుకు అడ్డవుతోందని..
6594. ఆనందమై మెరిసింది..
కన్నుల్లో కురిసిన నవ్వుల చుక్క..
6595. మలుపులే తప్ప గమ్యమెరుగని జీవితం..
ఎక్కడ మొదలయ్యిందో గుర్తులేని చైతన్యం..
6596. పశ్చిమాన సరసాలు పూసుకున్నందుకేమో సూర్యుడు..
ఎర్రని కాంతులతో తూరుపును తడమాలనుకుంటాడు..
6597. పరువు కోసం మనసు వెంపర్లాట..
అవకాశావాదాన్ని వీడలేని మనిషి అలవాట్లలో..
6598. కాలం ఆగినట్లుంది..
నీ మురిపాలలో మునిగితేలడం బాగుందని.. 
6599. సజీవమైయున్నది నీ ఒక్క హృదిలోనే..
రేయింబవళ్ళు అస్తిత్వానికి అలమటిస్తున్న జీవితంలో..
6600. నీ శృతి తప్పనివ్వనని మాటిస్తున్నా..
పాటని సరిచేసే భావాలుండగా నాలో..

Virus-free. www.avast.com

No comments:

Post a Comment