Tuesday, 7 March 2017

7301 to 7400

7301. ఎన్నెన్ని భావాలో..
మూసిన రెప్పలపైనా లిఖించమని చేరువవుతూ..
7302. పదివేల స్మృతుల కల్లోలాలు..
నిశ్శబ్దాన్ని దరిచేరనివ్వని ఏకాంతంలో..
7303. కనిపించని అందాలెన్నో నాలో..
ఒక్కోరాగం తుళ్ళింతగా వర్ణిస్తుంటే
7304. గమ్మత్తైన అనుభవాలెన్నో..
భావానికందని ఆనందంలో మదిని ముంచేస్తూ
7305. మల్లెలకెందుకో కేరింతలు..
కురులారబోసుకుంటున్నది నేనైతే..
7306. కలలు బరువైన కన్నులట..
రేయైనా నిద్దురపోనని మారాంచేస్తూ..
7307. కన్నులు మాట్లాడుతాయనిప్పుడే తెలిసింది..
నా మౌనాన్ని ప్రశ్నిస్తున్నందుకు
7308. అలుకను ఎరగా వేయాల్సొస్తోంది..
నా కాటుకనప్పుడైనా గమనిస్తావని..
7309. మల్లెల పరవశమదేమో..
కురులను చేరి నీ మదిని మీటాలనే ఆరాటంలో..
7310. మల్లెల్లో సగపాల్లెందుకో..
సరిగమలు పాడుతున్నది నా పెదవులైతే..
7311. మల్లెలకెంత ముచ్చటో..
ఎంకీనాయుడి సరసాల్లో తనకీ చోటిస్తే..
7312. మల్లెల అత్తర్లు మదిని మీటినవనుకున్నా..
నీ గులాబీ మాటలకు లొంగిపోతూ..
7313. తలపులకెప్పుడూ తడబాటే..
నిశ్శబ్దంలో నీవొస్తే చిలిపిదనాన్ని తట్టుకోలేనని..
7314. ముద్దులు కరువైన మురిపాలు మనవి..
హద్దులు ఎక్కువైన ఏకాంత వెన్నెల్లో..
7315. నా శ్వాస వేగం పెరిగింది..
నీ గుండెచప్పుడు గుట్టుగా నన్నల్లగానే..
7316. మానవత్వం పరిమళిస్తుంది..
చెక్కు చెదరని నీ మాటలతోనే..
7317. నీ మనసెందుకు వశం తప్పిందో..
శిల్పాకృతిగా ఆకర్షిస్తుంది నా తనువైతే..
7318. తలపుల వీణొకటి మ్రోగిందలా..
నీ విరహపుసడి చేరేయాలనేమో..
7319. విడిపోడాలుండవ్..
ఒక్కసారి మనసులంటూ ముడిపడ్డాక
7320. విషాదమే జీవితమెప్పుడూ..
మనసు దాహాన్ని కన్నీటితో తీర్చుకుంటూ..
7321. నీ మనసుకెప్పుడూ తొందరెక్కువే..
మదనుడిగా నిన్ను పరిచయించేందుకు..
7322. ముకుళించిన మొగ్గగానే మిగిలిపోయా..
పరవశ మౌనాన్నీ పట్టుకోగలవనే..
7323. నీ కధిప్పుడు నాదే..
నా కల్లలన్నింటా నువ్వున్నందుకు..
7324. ఎరుపుదనమంటే నీకు మక్కువనుకున్నా..
పచ్చదనంపై దాడి చేస్తుంటే
7325. గుడంటే అంతే..
ఇచ్చేవాడ్ని కొనియాడుతూ అడుక్కునే జనాలతో..
7326. వెనుదిరిగే ఓటమికే తెలుసు..
గెలుపుతో ముందడుగు వేయడమెలాగో..
7327. ఆకాశాన్ని పరికిస్తున్నా..
రెక్కలు వాలిపోకుండానే జయకేతనాన్ని ఎగరేద్దామని..
7328. మౌనానికెన్ని మాటలొచ్చాయో..
నీ కళ్ళొక్కసారి నవ్వుల విందివ్వగానే..
7329. హృదయపు తలుపులు మూసుకుంటావెందుకో..
రమ్మన్న ఆహ్వానం మరచిపోయినట్లు..
7330. మమకారమే నీది..
అక్షరాలను కూర్చి మనసుతెరలు తొలగించింది..
7331. విషాదపు కొసనే నిలబడున్నా..
వియోగమడ్డొచ్చి మౌనాన్ని లెక్కిస్తుంటే..
7332. కన్నీటిబొట్టు ఆనందభాష్పమయ్యింది..
తను ప్రేమన్నాకే..
7333. వాళ్ళూ మనుషులే..
ఆదరించి ఆసరానిచ్చే చేతులు కరువయ్యాయంతే..
7334. రైలు కూతేసినప్పుడల్లా అనుకుంటున్నా..
జీవించేందుకు ముహూర్తం కుదురుతుందేమోనని..
7335. పరువానికి పరుగాపాలనుందట..
యవ్వనాన్ని కరిగేలోపు కాస్తైనా ఆస్వాదించాలని..
7336. కలలు..
నేనెప్పుడూ తప్పిపోవాలనుకొనే నీ లోగిలి..
7337. ఎప్పుడూ గెలవాలనే అనుకుంటా..
నిద్దురను దోచేసే విషయంలో..
7338. వియోగం మాయమయ్యింది..
కోరినట్లే ప్రతిరాత్రి కలలో నువ్వొస్తుంటే..
7339. కెరటానికదో ఓదార్పు..
తీరం చేతిస్పర్శలో దొరికే ఉల్లాసం..
7340. నీ ప్రతిమాలికలోనూ అనురాగమే..
ఏ రాగం గుప్పించావో..
7341. రెప్పల వాకిళ్ళలో నే నిలబడున్నా..
ఒక్కమారు విచ్చి నన్ను  చూస్తావనే..
7342. నింగినీ నేలనూ కలిపేందుకేమో వానొచ్చింది..
నువ్వూనేనూ కలిసేందుకే అద్భుతం జరగాలో..
7343. నేనేగా వానవిల్లు..
నువ్వు కోరిన రంగులన్నీ నింపుకున్నాక..
7344. నీ పెదవులకు వానాకాలమొచ్చిందేమో..
ముద్దులుగా కురిసేందుకు సిద్ధమవుతోంది..
7345. అతనో కొంటెకృష్ణుడే..
మాయచేసి అతివల హృదయాల్ని కొల్లగొడుతూ
7346. సహజత్వానికి సువాసనెందుకు..
నవ్వుల పువ్వులకే మనసులు మమేకమయ్యేప్పుడు
7347. వేకువకెంత తొందరో..
కలలు కనుమరుగు కాగానే మేల్కొల్పుతూ..
7348. దారం ఆధారమయ్యింది..
వాడిన పువ్వు అస్తిత్వపు పరిమళాన్ని లోకానికి పంచేందుకు.. 
7349. మనసిరిగిపోయింది..
అడక్కుండానే జీవితంలోకొచ్చి చెప్పకుండానే మరలినందుకు
7350. జ్ఞాపకాల వెలుగులు..
చీకటి జీవితానికి రంగులద్దాలనే ఆరాటంలో..
7351. అదే వెన్నెల..
ప్రేమ లాహిరిలో ముంచుతోంది నన్నిలా..
7352. అంతరంగాల వంతెన..
కొలవరాని దూరాన్ని మనసుతో కలిపేందుకలా..
7353. ఆగనంటూ వాన..
మనసు నిండేవరకూ కురుస్తానని మాటిచ్చినందుకు..
7354. ఆకాశమంత వాన..
అంతమైన ప్రేమ విషాదపు రోదన..
7355. నీ తలపు స్వప్నాలు..
నాలోని వలపు మౌనాలు..
7355. నీ తలపు స్వప్నాలు..
వేకువల వెన్నెల విచిత్రాలు..
7356. నీ తలపు స్వప్నాలు..
నా వియోగాపు వీడ్కోలు..
7357. సంతోషం సగమయ్యింది..
మనసుకెప్పుడూ విషాదాన్నే రుచి చూపుతుంటే..
7358. భావాలకు మౌనమంటింది..
విలవిలలాడిన హృదయం వెతలను కౌగిలించగానే..
7359. పరిమళించక తప్పవుగా..
జ్ఞాపకాలను మనసుపొరల్లో మల్లెలుగా దాచుకున్నాక..
7360. ఓడి గెలిచా..
నన్ను నీకు అర్పితం చేసుకొని..
7361. నా మస్తకంలో నిన్నే నిలుపుకున్నా..
మది పుస్తకంలో ముఖచిత్రం నీదుండాలని..
7362. కన్నుల్లో బొమ్మగానే మిగిలావు..
వాస్తవంలో వియోగాన్ని వాటేసి..
7363. ఎన్ని భాష్పాలని చిందించాలో..
జీవితపు చెమరింపు తీరాలంటే..
7364. కాలాన్ని పట్టించుకోలేదు..
కన్నీరు ఖర్చైపోతుందనే బాధలో మునిగిపోతూ..
7365. గారాల నవ్వులకు కొదవేముందిలే..
అలుకకో బహుమతి నువ్విచ్చాక..
7366. ఎన్ని ఊసులు మూటకట్టావో..
రెప్పలమాటు రహస్యాలను కుదిపి..
7367. వెన్నెలను కలగంటున్నా..
నీ వియోగంలో పున్నమని మరచిపోయి..
7368. కొన్ని బతుకుల్లోనంతే..
కడుపులోని కన్నీళ్ళు కళ్ళల్లోకి కొట్టుకొస్తుంటాయెప్పుడూ..
7369. రెక్కలిప్పింది మనసు..
నీ శృతిలయలోని తమకమొచ్చి తడమగానే..
7370. ముద్దులతోనే రవళిస్తావు..
మాటలేమో వద్దంటూనే
7371. మనసుకదో పులకింత..
ఆకాశమై తనలో నువ్వలా విస్తరించగానే..
7372. మౌనమిలా నవ్వుకుంది..
తన రాగంలో సన్నాయిగా నువ్వినిపిస్తుంటే..
7373. మనోమాధుర్యమేనది..
నీ తలపు పరిమళమై నన్నల్లుకుంది.
7374. తొందరెక్కువే నీ భావాలకు..
మాలికగా నన్ను వర్ణించాలనేమో..
7375. పుష్యమిపువ్వునై నేనొచ్చేసా..
నీ పూజలో ప్రత్యేకంగా నేనుండాలని..
7376. ఒక్కోసారి తలొంచుకొని నడవక తప్పదు..
అనుబంధాల్లో సుడిగుండాలు సహజమని తెలిసాక..
7377. అసిధారావ్రతమెన్నిసార్లు చేయాలో..
నాకు నేను అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు..
7378. రాతిరి నవ్వుతోంది..
నక్షత్రాలను కలగంటున్న నన్ను చూసిందేమో..
7379. ఉడుకెక్కువయ్యింది మనసుకి..
నీ నిర్లక్ష్యంలో తనను చేర్చావనే..
7380. అందమంటే అంతరంగమేగా..
చూసే హృదయానికి కళ్ళుండి తిలకించాలంతే..
7381. మూసిన కన్నుల్లో నువ్వే..
ఊహల్లో రాగమై నివశిస్తూ..
7382. కాశీలో వదిలేసా మౌనాన్ని..
శబ్దాలంకారమేదో నీకు చూపిద్దామనే..
7383. తన్మయత్వం నాకిష్టమే..
నీ జ్ఞాపకాల ప్రవాహంలో నే మునిగిపోతున్నా సరే..
7384. రసఝరిలో మునిగినట్లుంది..
ఆగకుండా కురుస్తున్న వర్షాన్ని వశీకరిస్తుంటే..
7385. స్మృతుల పరవళ్ళు..
కురుస్తున్న వానకు కన్నీరు ఏరవుతుంటే..
7386. చిగురించడం నిజమేగా..
పరవశాల ప్రతి చినుకులో జీవముందంటే..
7387. చదివేకొద్దీ చదవాలనిపించే పరవశాలే కొన్ని..
జడలు కట్టిన ఆనందాలుగా అల్లుకుపోతూ..
7388. అందుకోక తప్పలేని అవకాశం..
అకలాపుకుంటే అవసరం తీరదని..
7389. నవ్వులన్నీ నీకిచ్చేసా..
నీ మనసు నాకిస్తావనే స్వార్ధంతోనే..
7390. రెప్ప వేయడం మానేసా..
నా కన్నుల్లో నీవున్న కాంతి ఎప్పటికీ దూరమవరాదనే..
7391. గుండెల్లోనే గూడేసుకున్నా..
నీవొస్తే ఆశ్రయం కల్పించేందుకు మనసుందనే..
7392. పిలుపులకే పరవశమవుతావే..
పల్లవించేందుకు నేను పాటను సిద్ధంచేస్తుంటే..
7393. నటించడం పరిపాటయ్యింది..
అంతరంగస్థలంలోనూ జీవితం చప్పట్లనే కోరుతుంటే..
7394. చెదిరిపోయిన స్వప్నమొకటి..
వేకువ తెరలేపి కిరణాలు మెరవగానే..
7395. కురుస్తున్న ఆకాశం ఆగిందక్కడ..
ప్రకృతి పులకరింపు వశీకరించినందుకే..
7396. మౌనాన్ని చెరదగొడుతూ నా కనురెప్పలు..
మదిలో రాగాన్ని ఆలకించమని వేడుకుంటూ
7397. కురిసింది పూలవాన తొలిసారి..
చీరొకటి ఉయ్యాలగా మారగానే..
7398. అజరామరమే అనురాగం..
నా జ్ఞాపకాల్లో నువ్వున్నంత కాలం..
7399. నువ్వు చూడని నవ్వులేమున్నాయి నాలో..
భావవాహినిగా కదిలేది నేనేగా నీలో..
7400. జ్ఞాపకాలకి పరిమళమిచ్చింది నువ్వే..
వియోగించినా మదివీడలేని తలపులనిచ్చి..

No comments:

Post a Comment