5001. అదే జీవనవైచిత్రి..
మనసుకీ జీవితానికి పొంతన కుదరక..
5002. జీవితమంతా అన్వేషణేగా..
ఆశించే ప్రేమ గగనకుసుమమై అందుకోలేకపోతుంటే..
5003. ఆనందమెప్పుడూ కలిసిరాదు..
నువ్వు లేకుంటే తానెందుకని మళ్ళిపోతూ..
5004. ఏకాకితనం చిగురిస్తుందిలే..
జీవితాన్ని మరోకోణంలో తిలకించే ప్రయత్నంచేస్తే..
5005. జీవించడం నేర్చేసుకున్నా..
పునరాలోచించడం మొదలెట్టగానే
5006. అనివార్యమే నటన..
జీవితమో రంగస్థలమనుకొంటే..
5007. జీవితం విలువ తెలుసుకోలేకున్నా..
నిత్యమూ మరణిస్తూండడం వల్లనేమో..
5008. చీకట్లో ఉండిపోవడం నచ్చిందేమో నీకు..
వెలుతురులో జీవితముందని తెలుసుకో ఇక..
5009. జీవితం కలగూరలగంప..
వండుకున్నవారికి వండుకున్నంత..
5010. నీ చెలిమే జీవితమయ్యింది..
తూకమేసే అవసరమేదీ రాకుండానే..
5011. వేరే నష్టమేముంది జీవితంలో..
ఏకాకితనమొక్కటే రమించేందుకు మిగిలాక..
5012. దిద్దుకుందామనుకున్నా భవిష్యత్తు..
వర్తమానం పూర్తిగా గతానికి ఇవ్వొద్దనే..
5013. రవికాంతి ఒక్కటే మిగిలింది..
చీకటినొద్దనుకున్న నా జీవితంలో..
5014. వెలుగునీడలు జీవితంలో భాగమేగా..
నువ్వూనేనూ సగం సగమైనట్టు..
5015. అందాన్ని అతిగా అందుకే ఆస్వాదించొద్దన్నాను ..
నీలాలు కారితే నేను చూడలేననే..
5016. మాటలకు అందవు..మౌనాన్ని వీడవు..
ఎదలో కొలువైన జ్ఞాపకాలు కొన్ని..
5017. కొన్ని జీవితాలంతే..
అర్ధం లేకుండా అడ్డంగా పడిపోతూ..
5018. అనునయిస్తున్నా జీవితాన్ని..
అహం దరిచేరితే విజయం వరించదంటూ..
5019. వెనుదిరిగిన ఆటుపోట్లు..
నా మొదటిపేజీలో సంతోషానికే చోటిచ్చానని..
5020. జీవితమెప్పుడూ అందమైన భావనే..
ఊహల రాగోదయాలు వాస్తవమవుతుంటే..
5021. నిద్దుర లేకుండా చేసావు..
ఒద్దన్నా ఒడిలోకొచ్చి పడుకొని..
5022. అనూహ్యమే ఆ జీవితం..
అతను అవునన్న మరుక్షణం..
5023. జయించలేకపోయా జీవితాన్ని..
ఒక్క నీ హృదయాన్ని గెలుచుకొని..
5024. యుగాలయినట్లున్నవి క్షణాలు..
జీవితంలో చైతన్యం ప్రవహించడం మానేసాక..
5025. రాగమై పెనవేసా..
నీ అక్షరాలు పల్లవులై పరుగెత్తేలా..
5026. జీవితమదే..
ఒక్క అనుభవానికి అంతులేని వేదనలని..
5027. నీతో నడిచిందందుకే..
జీవితమంటే చూపిద్దామనే..
5028. వేదనకు మాత్రం తప్పట్లేదు..
వద్దనుకున్నా జ్ఞాపకాలను అనుసరించడం..
5029. వలపో వైపరిత్యమేగా..
నీకై నిరీక్షించిన ఉదయం చీకటనిపిస్తుంటే
5030.పద్దులు రాసే ఉంచాను..
మనసుకీ జీవితానికి పొంతన కుదరక..
5002. జీవితమంతా అన్వేషణేగా..
ఆశించే ప్రేమ గగనకుసుమమై అందుకోలేకపోతుంటే..
5003. ఆనందమెప్పుడూ కలిసిరాదు..
నువ్వు లేకుంటే తానెందుకని మళ్ళిపోతూ..
5004. ఏకాకితనం చిగురిస్తుందిలే..
జీవితాన్ని మరోకోణంలో తిలకించే ప్రయత్నంచేస్తే..
5005. జీవించడం నేర్చేసుకున్నా..
పునరాలోచించడం మొదలెట్టగానే
5006. అనివార్యమే నటన..
జీవితమో రంగస్థలమనుకొంటే..
5007. జీవితం విలువ తెలుసుకోలేకున్నా..
నిత్యమూ మరణిస్తూండడం వల్లనేమో..
5008. చీకట్లో ఉండిపోవడం నచ్చిందేమో నీకు..
వెలుతురులో జీవితముందని తెలుసుకో ఇక..
5009. జీవితం కలగూరలగంప..
వండుకున్నవారికి వండుకున్నంత..
5010. నీ చెలిమే జీవితమయ్యింది..
తూకమేసే అవసరమేదీ రాకుండానే..
5011. వేరే నష్టమేముంది జీవితంలో..
ఏకాకితనమొక్కటే రమించేందుకు మిగిలాక..
5012. దిద్దుకుందామనుకున్నా భవిష్యత్తు..
వర్తమానం పూర్తిగా గతానికి ఇవ్వొద్దనే..
5013. రవికాంతి ఒక్కటే మిగిలింది..
చీకటినొద్దనుకున్న నా జీవితంలో..
5014. వెలుగునీడలు జీవితంలో భాగమేగా..
నువ్వూనేనూ సగం సగమైనట్టు..
5015. అందాన్ని అతిగా అందుకే ఆస్వాదించొద్దన్నాను ..
నీలాలు కారితే నేను చూడలేననే..
5016. మాటలకు అందవు..మౌనాన్ని వీడవు..
ఎదలో కొలువైన జ్ఞాపకాలు కొన్ని..
5017. కొన్ని జీవితాలంతే..
అర్ధం లేకుండా అడ్డంగా పడిపోతూ..
5018. అనునయిస్తున్నా జీవితాన్ని..
అహం దరిచేరితే విజయం వరించదంటూ..
5019. వెనుదిరిగిన ఆటుపోట్లు..
నా మొదటిపేజీలో సంతోషానికే చోటిచ్చానని..
5020. జీవితమెప్పుడూ అందమైన భావనే..
ఊహల రాగోదయాలు వాస్తవమవుతుంటే..
5021. నిద్దుర లేకుండా చేసావు..
ఒద్దన్నా ఒడిలోకొచ్చి పడుకొని..
5022. అనూహ్యమే ఆ జీవితం..
అతను అవునన్న మరుక్షణం..
5023. జయించలేకపోయా జీవితాన్ని..
ఒక్క నీ హృదయాన్ని గెలుచుకొని..
5024. యుగాలయినట్లున్నవి క్షణాలు..
జీవితంలో చైతన్యం ప్రవహించడం మానేసాక..
5025. రాగమై పెనవేసా..
నీ అక్షరాలు పల్లవులై పరుగెత్తేలా..
5026. జీవితమదే..
ఒక్క అనుభవానికి అంతులేని వేదనలని..
5027. నీతో నడిచిందందుకే..
జీవితమంటే చూపిద్దామనే..
5028. వేదనకు మాత్రం తప్పట్లేదు..
వద్దనుకున్నా జ్ఞాపకాలను అనుసరించడం..
5029. వలపో వైపరిత్యమేగా..
నీకై నిరీక్షించిన ఉదయం చీకటనిపిస్తుంటే
5030.పద్దులు రాసే ఉంచాను..
ఈసారి హద్దులు నావనుకుంటూ..
5031. ఇనుములో హృదయం మొలవడం చూస్తున్నాను..
నీ గుండె మెలికపడిందని నువ్వంటుంటే..
5032. ఆ దేహం అమరమే..
జీవిత సందేహాన్ని తీర్చేసినందుకు..
5033. వచ్చేసానందుకే..
తింటూండగానే తలచుకున్నావని..
5034. నేనన్నది మరచిపోయా..
నేనో ఇంద్రజాలం చేసానని నువ్వంటుంటే..
5035. చప్పుడు చేయనంటున్న నా ఊహలు..
నీ మౌనానికి భగ్నం చేయడమెందుకనే..
5036. ఊపిరాడుతోంది ఇప్పుడిప్పుడే..
తీయందనాలు వీచి ప్రాణాలు నిలబెట్టావనే
5037. పంచమవేదం వల్లిస్తూ ఎదురుచూస్తున్నా..
నీ మల్లికను అలంకరించుకుందామనే..
5038. ఒప్పని మొదలెట్టిన పనే..
తప్పని నలుగురంటుంటే తప్పించుకోలేక..
5039. వెలిసిందొక జ్ఞాపకం..
నా స్మృతులలో తాను ఇమడలేనంటూ..
5040. నాలో నిన్నెందుకు దర్శించుకున్నావో..
రాధ హృదయం కృష్ణలోహితమైనందుకా
5041. రుచి తగ్గావెందుకో..
వద్దనుకుంటూనే నిన్నారగిస్తున్నందుకేమో..
5042. రాగరంజితమైన హృదయం..
ప్రతిజన్మకీ మనమే రాధాకృష్ణులమని నువ్వంటుంటే..
5043. రేపల్లెందుకు చిన్నబోతోందో..
గోకులం పోయి మనం శాశ్వతిద్దామనుకుంటే
5044. పదముపదములో మన అడుగులే..
ప్రతిపదంలో ప్రేమ పల్లవిస్తుంటే
5045. నీ మనసే నేనయ్యా..
నన్ను మార్చుకోవాలని అనుకోగానే..
5046. విసిరి విసిరి వీస్తున్నా..
తరంగమై నిన్ను చేరాలని..
5047. అద్వైతం జోలికి రావొద్దన్నానా..
ఎంత నేస్తమైతే మాత్రం..
5048. వలపుల ఝరి..
ఒద్దన్నా జలపాతమై చూపుల్లో జారుతోంది..
5049. అనుభూతులన్నీ బలహీనమే..
ఆ సుస్వరం కఠోరమై వినబడుతుంటే..
5050. ఆడాలంటే భయమేస్తుంది..
నిన్న గెలిచినట్లు రేపు గెలుస్తానోలేదోనని..
5051. ఎన్ని శిశిరాలు సాగనంపానో..
వసంతమై ఏనాటికైన చిగురిస్తావనే..
5052. చెమరిన చూపొక్కటే సరిపోయింది..
ఈ పొద్దు నా ముద్దు తీరిందని చెప్పేందుకు..
5053. అన్వేషణే మిగిలింది జీవితమంతా..
ఆ కళ్ళలో అకళ్ళే తప్ప ఆర్తి లేనందుకే..
5054. వర్తమానంలోనే నిలబడిపోయా..
భవిష్యత్గమ్యం భయపెడుతుంటే..
5055. కొన్ని ఆత్మీయతలంతే..
కొన్ని క్షణాలను మెరిపించి మాయమవుతూ..
5056. చెలిమికి పర్యాయమైన నీ మనసు..
చీకటిలో కిరణమేగా ఎప్పటికీ నాకు..
5057. కన్నీళ్ళకూ లోకువైనందుకేమో..
వేదనలో వీడ్కోలిచ్చి నన్ను వీడిపోతూ..
5058. నీ గుండెల్లో దాగిపోవాలనుకున్నా..
మువ్వలు ధరిస్తావని తెలీక..
5059. కాలమాగిపోయిందక్కడ..
నాలో చైతన్యమైన నువ్వీడిపోయావనేగా..
5060. కలిపుంచడం తెలియదు కాలానికి..
కాసిని కావ్యాలు రాసుకుంటామనేమో..
5061. జ్ఞాపకాలు చేదైనప్పుడే అనుకున్నా..
అంతరంగంలోంచీ నువ్వు నడిచెళ్ళిపోయావని..
5062. ప్రేమగా పిలిచావని శ్వాసలోకొచ్చి చేరా..
విరహమై విడిచేస్తావని గ్రహించలేని నిట్టూర్పులో..
5063. కొన్ని జ్ఞాపకాలంతే..
అనివార్యమయ్యే వేదనలంతే..
5064. మెరుపు కలలెన్నో కన్నుల్లో..
ఒకరికి ఒకరై మనమున్నట్లు..
5065. తానో కలవరింత..
నా మధురభావంలో..
5066. చేతగానితనమై మిగులుతున్న మంచితనం..
కొన్ని అసహనాలను ఓర్చుకుంటున్నందుకు..
5067. నాన్నకెప్పటికీ తప్పని బరువు..
బంధాలు బాధ్యతలుగా స్వీకరించాక..
5068. జీవన మాధుర్యం తెలిసొచ్చింది..
నీ ఆర్తి నన్నంటినప్పుడే..
5069. నాకూ ఇష్టమే..
సుప్రభాతసేవ నుంచీ పవళింపుసేవకూ నువ్వొస్తుంటే..
5070. నీ జ్ఞాపకాల వైభవమేగా..
హృదయసీమను ఈనాటికీ వెలిగిస్తూ..
5072. గెలిచినప్పుడల్లా నన్నాడిపోసుకుంటావెందుకో..
ముక్కలాటంటే నీకిష్టమంటూనే..
5073. మనసెప్పుడూ రాగరంజితమేలే..
నీవాలపించే నవరాగాలతో..
5074. వాగులా నా హృదయం..
పడవేసుకు నువ్వు విహరిస్తానంటే..
5075. ఎన్ని మధురోహలో..
నీ కలల రెక్కల చప్పుళ్ళలో..
5076. అత్యాశెక్కువే నీకు..
శిధిలాల్లో మానవత్వపు జాడలు వెతుక్కుంటూ...
5077. సత్యనరకమే జీవితం..
భూలోక నరకాసురలతో..
5078. ప్రేమ అవగతమవుతోంది..
ఏనాడో నన్ను మరచిన నాలో నువ్వొచ్చి సంచరిస్తుంటే..
5079. మధుమాసమొచ్చింది మనసుకి..
మధువంతా ఒకేసారి నాపై చిలకరిస్తుంటే..
5080. అవే కలలు..
నీ హృదయాన్ని దాటి నా కన్నుల్లోకి ప్రవహిస్తూ..
5081. అవే కబుర్లు..
నా కాటుకలు నీతో చెప్పినట్లు..
5082. నెలవంక రమ్మని పిలిచిందనేమో..
రాతిరిని కలవరిస్తున్న కనులు..
5083. రాగల ఆనందమే నీవు..
నన్ను మరిపించే క్షణాన..
5084. ఉదయరాగమై పెనవేసావు..
నిశీధికి నేను జోలపాడటం మొదలెట్టగానే
5085. చీకటి జరిగిపోయింది..
మనసైన నీ ఊసుల వెన్నెలలో..
5086. ఎన్ని అలజడులో..
నీ తలపులలో నాకు చోట్టిచ్చావంటే..
5087. వెతలన్నీ మటుమాయమే..
నీ మహేంద్రజాలముతోనే..
5088. సంతోషానికి తీరం నువ్వు..
నేనో అన్వేషిత కెరట్టాన్నైతే..
5089. గోరంత గుండెకూ మోయడం తెలుసు..
అనుభూతుల రహస్యాలను మదిలో దాచుకోవడం..
5090. మనసెంత శూన్యమని..
నిన్ను చేరలేని నా నీరవంలా..
5091. కాలం కలిసి రావాలేమో..
వసంతం వాయిదా పడకూడదంటే..
5092. అవే పూలు..
నా మదినో బృందావనముగా మార్చేస్తూ..
5093. గ్రీష్మానికి తాపమెక్కడిది..
నన్నే ఉష్ణంతో రగిలించి చంపేస్తూ..
5094. అవే అనుభూతులు..
నీ ఊహాలుగా నన్ను తరుముకుంటూ..
5095. శీతలమయ్యిందెందుకో మది..
శిశిరంలో హేమంతాన్ని నువ్వు తలపిస్తుంటే..
5096. ఊరడింపులన్నీ ఊసుల్లోనే..
కన్నులు కలవరపడుతుంటే..
5097. నీ చేతలే చైత్రం..
నీ ఆగమనమే అపురూపం..
5098. సువాసనొచ్చినప్పుడే అనుకున్నా..
నాకోసం దేవలోకం నుండీ నువ్వొచ్చేసావని..
5099. ఉమ్మెత్తలా నువ్వు..
తెల్లగా కవ్విస్తూ..
5100. లోకకళ్యాణమయ్యింది..
శివుడు హాలాహలం మింగి కర్పూర గాత్రుడయిందనుకే..
5031. ఇనుములో హృదయం మొలవడం చూస్తున్నాను..
నీ గుండె మెలికపడిందని నువ్వంటుంటే..
5032. ఆ దేహం అమరమే..
జీవిత సందేహాన్ని తీర్చేసినందుకు..
5033. వచ్చేసానందుకే..
తింటూండగానే తలచుకున్నావని..
5034. నేనన్నది మరచిపోయా..
నేనో ఇంద్రజాలం చేసానని నువ్వంటుంటే..
5035. చప్పుడు చేయనంటున్న నా ఊహలు..
నీ మౌనానికి భగ్నం చేయడమెందుకనే..
5036. ఊపిరాడుతోంది ఇప్పుడిప్పుడే..
తీయందనాలు వీచి ప్రాణాలు నిలబెట్టావనే
5037. పంచమవేదం వల్లిస్తూ ఎదురుచూస్తున్నా..
నీ మల్లికను అలంకరించుకుందామనే..
5038. ఒప్పని మొదలెట్టిన పనే..
తప్పని నలుగురంటుంటే తప్పించుకోలేక..
5039. వెలిసిందొక జ్ఞాపకం..
నా స్మృతులలో తాను ఇమడలేనంటూ..
5040. నాలో నిన్నెందుకు దర్శించుకున్నావో..
రాధ హృదయం కృష్ణలోహితమైనందుకా
5041. రుచి తగ్గావెందుకో..
వద్దనుకుంటూనే నిన్నారగిస్తున్నందుకేమో..
5042. రాగరంజితమైన హృదయం..
ప్రతిజన్మకీ మనమే రాధాకృష్ణులమని నువ్వంటుంటే..
5043. రేపల్లెందుకు చిన్నబోతోందో..
గోకులం పోయి మనం శాశ్వతిద్దామనుకుంటే
5044. పదముపదములో మన అడుగులే..
ప్రతిపదంలో ప్రేమ పల్లవిస్తుంటే
5045. నీ మనసే నేనయ్యా..
నన్ను మార్చుకోవాలని అనుకోగానే..
5046. విసిరి విసిరి వీస్తున్నా..
తరంగమై నిన్ను చేరాలని..
5047. అద్వైతం జోలికి రావొద్దన్నానా..
ఎంత నేస్తమైతే మాత్రం..
5048. వలపుల ఝరి..
ఒద్దన్నా జలపాతమై చూపుల్లో జారుతోంది..
5049. అనుభూతులన్నీ బలహీనమే..
ఆ సుస్వరం కఠోరమై వినబడుతుంటే..
5050. ఆడాలంటే భయమేస్తుంది..
నిన్న గెలిచినట్లు రేపు గెలుస్తానోలేదోనని..
5051. ఎన్ని శిశిరాలు సాగనంపానో..
వసంతమై ఏనాటికైన చిగురిస్తావనే..
5052. చెమరిన చూపొక్కటే సరిపోయింది..
ఈ పొద్దు నా ముద్దు తీరిందని చెప్పేందుకు..
5053. అన్వేషణే మిగిలింది జీవితమంతా..
ఆ కళ్ళలో అకళ్ళే తప్ప ఆర్తి లేనందుకే..
5054. వర్తమానంలోనే నిలబడిపోయా..
భవిష్యత్గమ్యం భయపెడుతుంటే..
5055. కొన్ని ఆత్మీయతలంతే..
కొన్ని క్షణాలను మెరిపించి మాయమవుతూ..
5056. చెలిమికి పర్యాయమైన నీ మనసు..
చీకటిలో కిరణమేగా ఎప్పటికీ నాకు..
5057. కన్నీళ్ళకూ లోకువైనందుకేమో..
వేదనలో వీడ్కోలిచ్చి నన్ను వీడిపోతూ..
5058. నీ గుండెల్లో దాగిపోవాలనుకున్నా..
మువ్వలు ధరిస్తావని తెలీక..
5059. కాలమాగిపోయిందక్కడ..
నాలో చైతన్యమైన నువ్వీడిపోయావనేగా..
5060. కలిపుంచడం తెలియదు కాలానికి..
కాసిని కావ్యాలు రాసుకుంటామనేమో..
5061. జ్ఞాపకాలు చేదైనప్పుడే అనుకున్నా..
అంతరంగంలోంచీ నువ్వు నడిచెళ్ళిపోయావని..
5062. ప్రేమగా పిలిచావని శ్వాసలోకొచ్చి చేరా..
విరహమై విడిచేస్తావని గ్రహించలేని నిట్టూర్పులో..
5063. కొన్ని జ్ఞాపకాలంతే..
అనివార్యమయ్యే వేదనలంతే..
5064. మెరుపు కలలెన్నో కన్నుల్లో..
ఒకరికి ఒకరై మనమున్నట్లు..
5065. తానో కలవరింత..
నా మధురభావంలో..
5066. చేతగానితనమై మిగులుతున్న మంచితనం..
కొన్ని అసహనాలను ఓర్చుకుంటున్నందుకు..
5067. నాన్నకెప్పటికీ తప్పని బరువు..
బంధాలు బాధ్యతలుగా స్వీకరించాక..
5068. జీవన మాధుర్యం తెలిసొచ్చింది..
నీ ఆర్తి నన్నంటినప్పుడే..
5069. నాకూ ఇష్టమే..
సుప్రభాతసేవ నుంచీ పవళింపుసేవకూ నువ్వొస్తుంటే..
5070. నీ జ్ఞాపకాల వైభవమేగా..
హృదయసీమను ఈనాటికీ వెలిగిస్తూ..
5072. గెలిచినప్పుడల్లా నన్నాడిపోసుకుంటావెందుకో..
ముక్కలాటంటే నీకిష్టమంటూనే..
5073. మనసెప్పుడూ రాగరంజితమేలే..
నీవాలపించే నవరాగాలతో..
5074. వాగులా నా హృదయం..
పడవేసుకు నువ్వు విహరిస్తానంటే..
5075. ఎన్ని మధురోహలో..
నీ కలల రెక్కల చప్పుళ్ళలో..
5076. అత్యాశెక్కువే నీకు..
శిధిలాల్లో మానవత్వపు జాడలు వెతుక్కుంటూ...
5077. సత్యనరకమే జీవితం..
భూలోక నరకాసురలతో..
5078. ప్రేమ అవగతమవుతోంది..
ఏనాడో నన్ను మరచిన నాలో నువ్వొచ్చి సంచరిస్తుంటే..
5079. మధుమాసమొచ్చింది మనసుకి..
మధువంతా ఒకేసారి నాపై చిలకరిస్తుంటే..
5080. అవే కలలు..
నీ హృదయాన్ని దాటి నా కన్నుల్లోకి ప్రవహిస్తూ..
5081. అవే కబుర్లు..
నా కాటుకలు నీతో చెప్పినట్లు..
5082. నెలవంక రమ్మని పిలిచిందనేమో..
రాతిరిని కలవరిస్తున్న కనులు..
5083. రాగల ఆనందమే నీవు..
నన్ను మరిపించే క్షణాన..
5084. ఉదయరాగమై పెనవేసావు..
నిశీధికి నేను జోలపాడటం మొదలెట్టగానే
5085. చీకటి జరిగిపోయింది..
మనసైన నీ ఊసుల వెన్నెలలో..
5086. ఎన్ని అలజడులో..
నీ తలపులలో నాకు చోట్టిచ్చావంటే..
5087. వెతలన్నీ మటుమాయమే..
నీ మహేంద్రజాలముతోనే..
5088. సంతోషానికి తీరం నువ్వు..
నేనో అన్వేషిత కెరట్టాన్నైతే..
5089. గోరంత గుండెకూ మోయడం తెలుసు..
అనుభూతుల రహస్యాలను మదిలో దాచుకోవడం..
5090. మనసెంత శూన్యమని..
నిన్ను చేరలేని నా నీరవంలా..
5091. కాలం కలిసి రావాలేమో..
వసంతం వాయిదా పడకూడదంటే..
5092. అవే పూలు..
నా మదినో బృందావనముగా మార్చేస్తూ..
5093. గ్రీష్మానికి తాపమెక్కడిది..
నన్నే ఉష్ణంతో రగిలించి చంపేస్తూ..
5094. అవే అనుభూతులు..
నీ ఊహాలుగా నన్ను తరుముకుంటూ..
5095. శీతలమయ్యిందెందుకో మది..
శిశిరంలో హేమంతాన్ని నువ్వు తలపిస్తుంటే..
5096. ఊరడింపులన్నీ ఊసుల్లోనే..
కన్నులు కలవరపడుతుంటే..
5097. నీ చేతలే చైత్రం..
నీ ఆగమనమే అపురూపం..
5098. సువాసనొచ్చినప్పుడే అనుకున్నా..
నాకోసం దేవలోకం నుండీ నువ్వొచ్చేసావని..
5099. ఉమ్మెత్తలా నువ్వు..
తెల్లగా కవ్విస్తూ..
5100. లోకకళ్యాణమయ్యింది..
శివుడు హాలాహలం మింగి కర్పూర గాత్రుడయిందనుకే..
This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment