4401. కలువలకన్నులే నావి..
వెన్నెలతో మంట పెట్టించుకోవాలని నీకు మనసైతే చేసేదేముంది..
4402. ఉరేసుకొనే ఉద్దేశ్యమైతే లేదుగా నీకైతే..
విషాదాన్ని పాటగట్టి పాడుకొనే చొరవుండగా..
4403. గోరంత గుండే..
నీ జ్ఞాపకాలతో గుప్పెడుగా మారింది..
4404. వేరే లోకంతో పనేముందనుకున్నా..
నా లోకమే నువ్వయ్యాక..
4405. మౌనవ్రతాన్ని తటస్థం చేసేసా..
నీ మనసుని గుర్తించినందుకే
4406. జీవితానికి హామీ నువ్వేనంటున్నా..
సహానుభూతిగా నా చేయందుకున్నావనే..
4407. మధురమే ప్రణయం..
ఊపిరాడకుండా చేస్తున్ననీ చూపులసాక్షి..
4408. కాలమాగిపోతే బాగుండనుంది..
మనసునున్న మకరందాలు అరవిందాన్ని అలదుకుంటుంటే..
4409. నీ చూపులకే చంచలిస్తోంది మది..
పెదవిప్పకనే ఊసులాడే చొరవ చేస్తున్నాయని..
4410. నిముషాలనే నిలేయనూ..
నవ్యానుభూతిని నీకివ్వకుండా అడ్డుపడి నిలబడతానంటే..
4411. మధువై కురుస్తున్న వెన్నెలొకటి..
కలిసిన మనసుల్ని తడిపిపోవాలని..
4412. చిగురించిన పెదవినడుగు..
నీ జ్ఞాపకాల గలగలను అనువదించి మరీ చెప్తుంది..
4413. దరఖాస్తులా అనిపించింది ప్రేమలేఖ..
నీ ప్రేమకు ఆమోదమెలా తెలిపాలోనని విచారంలోకి తోసేస్తూ..
4414. నిశ్శబ్దపు చప్పుడది..
అస్తిత్వానికి అటూఇటూ మనసు పరుగెడుతుంటే..
4415. వసంతాన్నెందుకు వెక్కిరిస్తావో..
నాలా నవ్వులు నీకివ్వక వేధించిందనా..
4416. మధురమైన భావాలు చాలంటున్నా..
కాగితపుముక్కల్లో ప్రేమను వెతుకలేకనే..
4417. ఒంటరితనం వెలిసిపోయిందిగా..
నన్ను నీకిచ్చి తాను అంతర్ధానమైపోతూ..
4418. మనసు మల్లై విరబూస్తోంది..
మధురోహలో నన్ను గుర్తించమంటూ..
4419. విరహాన్ని రేప్పెడతావెందుకలా..
తలపుల జడివానలో తడవలేక నేనుంటే..
4420. సురగంగా ప్రవాహమై ఉప్పొంగడమెందుకో..
ఒద్దికగా రసడోలలూగి మురిసిపోక..
4421. మనసు ప్రాంగణంలో నీ పరుగులు..
అంతర్నిహిత సంగీతాన్ని నాలో కనుగొన్నట్లు..
4422. కన్నీరు తెలుస్తోంది..
తిరిగిరాని లోకానికెళ్ళిన మనసుకై కన్నులు తామే చెమ్మగిల్లుతుంటే
4423. మనసు మూగబోతోంది..
ఒక్క మౌనంతో శిలగా మారిపోయానెందుకానని..
4424. వ్యర్ధం కానీయకు కన్నీరు..
ఆర్ద్రమైన మనసుకు అట్టేపెట్టు..
4425. విలువైనదే కన్నీరెప్పుడూ..
సాంత్వనపరచినా...ఓదార్చినా..
4426. నక్షత్రాన్ని అలంకరించావు ముక్కెరగా..
దూరమున్నప్పుడు నింగికేసి చూడొచ్చనేగా..
4427. కన్నీటికి తప్పలేదు..
ఎవరు వీడినా మన తోడు చివరిదాకా తానేనంటూ..
4428. చెలియలకట్ట లేదుగా కన్నీటికి..
రెప్పలుదాటి హృదయంలోకి ప్రవహిస్తున్నవందుకే..
4429. కధ సుఖాంతమై కంచికి పోతుందనుకున్నా..
హేమంతంలో కాశ్మీరానికి తీసుకుపోతుందని తెలీక..
4430. హృదయం రోదించడం తెలుస్తోంది..
నిశ్శబ్దక్షణాలలో ఏదో అలికిడవుతుంటే..
4431. కన్నీటికి రుచి తెలియదనుకున్నా..
వేదనొకటి ఉప్పగా వర్షించేవరకూ..
4432. పన్నీరై జారిందా కన్నీరు..
హృదిలో పులకరింతను అభివ్యక్తీకరించాలనే..
4433. సమాధైపోయిన సత్యమొకటి..
హృదయంలోనే ఇంకిపోయిన కన్నీటికి గుర్తుగా..
4434. వేదనదిగా ప్రవహిస్తున్న కన్నీరు..
ఆనకట్టలే ఆపలేని విషాదంలో..
4435. నీ చెలికెప్పుడూ చిలిపిదనమే..
కన్నీటితోనే అనుభూతుల మాలికైపోతూ
4436. మసిగా రాలిన కన్నీరు..
ఎండిపోయిన వృక్షాలకు సాక్షిగా..
4437. అలుకల కన్నీళ్ళేగా నీవన్నీ..
అమ్మస్పర్శ నీకే సొంతమవ్వాలని..
4438. నటనెరుగని కన్నీరేగా విలువైంది..
'వేదన'దులైన కళ్ళెన్ని స్రవిస్తున్నా..
4439. ఒక్క నిప్పురవ్వే..
మనసుని కాల్చేసి కన్నీటిని ఎండగట్టేస్తూ..
4440. కన్నులు పొదగలేని కలలేమోనవి..
కన్నీరై వెచ్చగా జారిపోతూ..
4441. మరో అభినవ మేఘసందేశం మొదలెట్టా..
గ్రీష్మించిన హృదయానికి కన్నీటిని చూపేందుకే..
4442. వారు కన్నీటినే తాగి బ్రతికినందుకేమో..
పన్నీటివాగులై ప్రవహిస్తున్న పిల్లల పసిడికలలు..
4443. అపవిత్రమవుతోందట గంగ సైతం..
మలినమైన మునుషులంతా మునకలేసేసి..
4444. మౌనమొలికిపోతుందేమో..
జలపాతమైన కన్నీటిని చూసిన మరుక్షణం
4445. రంగులు మారుతున్న చెక్కిళ్ళు..
కన్నీటిని పరావర్తనం చెందిస్తూ..
4446. కన్నీటిలో కలువలేమిటో..
తిరిగిరావనుకున్న నువ్వెదురై నా ముందుంటే..
4447. మౌనాన్ని ముడేసుకున్న రెప్పలవి..
అంతర్వాహినిగా కన్నీరు ప్రవహిస్తున్నందుకే..
4448. అనుభూతుల మధువులే..
నీ చిరునవ్వులు అమృతమై చేరుతుంటే..
4449. జలపుష్పాలైన నయనాలు..
నువ్వొచ్చి నాలో సంతోషాన్ని రెట్టింపుచేసావని..
4450. తెల్లగా తాగుతున్నావనే బాధపడుతున్నా.
నేనందించిన హరివిల్లులో ఏడురంగులుంటుంటే..
4451. ఒంపుకుంటూ పన్నీరు..
నీ ఒడిలో సంతోషాలే కావాలంటుంటే..
4452. శాస్త్రాలతో తిప్పికొడతావే..
సంతోషానికి పచ్చదనంతో సంతకం చేయమంటుంటే..
4453. గారాల పన్నీరేనది..
అలుకలతో అందాన్ని రెట్టింపుగా మురిపిస్తూ..
4454. ఊహలను చకోరాలుగా పంపాను..
ఏకాంతంలో జంటగా నీకనిపించాలనేగా..
4455. రెప్పలు మూసుకు చూడవెందుకో..
కల్లోకి రాలేదని కంగారుపడుతూ..
4456.
మౌనానికి ప్రతినిధి నేనయ్యా..
నిశ్శబ్దపుటంచున భావాలు నిలిచిపోతుంటే
4457. నీ భావాలు..
అమాస మనసుపై వెన్నెల మరకలు..
4458. కొబ్బరినీళ్ళ తరువాత కన్నీరే స్వచ్ఛమైనది..
ఆర్ద్రతనేది ఆ మనసులో నిజమైతే..
4459. బృందావనం దాటి నిన్నెవరు బైటకి రమ్మన్నారో..
నిన్ను మరపించినా రాధనే మరచిపోతూ నేడు..
4460. కన్నులెప్పుడూ కలిసే చూపుతాయి..
నీ మనసద్దంలో నేనున్నానంటూ..
4461. అలలై కదులుతున్న జీవమే అది..
జీవనదై కొత్తందాలతో మెరిసే వైనమది..
4462. ముత్యాలుగా మార్చేసా పుప్పొళ్ళన్నీ..
నీవు దోసిలిపట్టుకు నిలబడ్డావనే.
4463. అనేకమవుతున్నావుగా నాలో..
హెచ్చువేసుకుంటూ మదిలో
4464. మిణుగురుగా మారినా నాకిష్టమే..
ఆకాస్త వెలుగునూ అద్దుకొనేందుకు..
4465. కలిపేసుకున్నావుగా నీలో నన్ను..
శేషమనేది విశేషించినా దొరకనట్లు..
4466. మైనమై నేనూ కరుగుతున్నా..
నీ శ్వాసలకు పరవశిస్తూనే..
4467. శూన్యమెక్కడ మిగిలిందని..
మనసంతా నేనై నిండిన హృదయాకాశంలో..
4468. నన్ను శ్వాసించడమాపవుగా..
నీ ఊపిరిని కోరుకున్నానని తెలిసాక..
4469. వెతికివెతికీ అలసిపోయా..
ధూపంలాంటి మంచుల్లోంచీ బైటకొస్తావని తెలియక..
4470. కుంగిన సూరీడు నెలరేడుగా మారిపోయాడు..
ఎప్పటికి చేయందివ్వని అలలపై మండిపడుతూ..
4471. నిశ్శబ్ద సుగంధమొకటి ఆవరించింది..
తొలిపొద్దు తెమ్మెరలోని అనుభూతిలా..
4472. మౌనం మాట్లాడినట్లుంది..
నీ చూపుకొసల కావ్యాలను ఆలకిస్తుంటే..
4473. నిర్ణయం తీసుకోక తప్పలేదు..
నువ్వు రామకోటికే అంకితమైపోతుంటే..
4474. అమరవీరుల త్యాగనిరతే..
మనమనుభవిస్తున్న లోకశాంతి..
4475. అనుసరిస్తూనే ఉంటాయలా..
అక్షయమైన అమ్మప్రేమలా కమ్మనైన జ్ఞాపకాలు..
4476. నవ్వును మూటకట్టేస్తావనుకోలా..
మనసులో స్వేచ్ఛగా ఎగరొచ్చని నేనొస్తే..
4477. అమృతమేగా నా నవ్వులు..
అనుభూతులై నిన్ను బ్రతికిస్తుంటే..
4478. నీ మనసులోకి ఈదలేక చస్తున్నా..
కొలతలకందని లోతుల్లో మణులను దాచుకుంటుంటే..
4479. అమృతఘడియలన్నీ అట్టేపెట్టాను..
నీ మనసు నాకై నిరీక్షించని సమయమే లేదని..
4480. వెన్నెలైపోయిన నా ఆనందాలు..
అమాసనేది ఒకటుందనే మరచిపోతూ..
4481. మనసు ఏకాంతాన్ని కోరింది..
కనుపాపలే అద్దమై మెరుస్తుంటే..
4482. మంకెనలుగా మారుస్తావెందుకో నవ్వుల్ని..
పెదవులసిగ్గును బుగ్గల సొట్టలకంటించి..
4483. మబ్బు పట్టిన మేఘమైపోతా..
నువ్వలా ఆకాశంలోకి ఎక్కిస్తుంటే..
4484. నెమలివై ఆడే దాకా నేనుంటాను..
సల్లాప సుగంధాలను వెదజల్లేందుకు ఎదురుచూస్తూ..
4485. నిశ్శబ్దమైనప్పుడే అనుకున్నా..
శూన్యాలయంలోకి చేరిందికాక నన్నూ రమ్మంటావని..
4486. విరహం అనంతమైంది..
ఏకాకితనంలో నీ ఊహలు బరువెక్కుతున్నకొద్దీ
4487. అమ్మ మూల్యమైనదే..
అందరికీ ప్రేమనే పెన్నిధి దొరకనట్లు..
4488. అదృశ్యమైపోయా నీలోనే..
నీ మనసు ఇరుకైనా నాకిష్టమేనని..
4489. విరహమిప్పుడు తెలుస్తోంది..
లోకం నిద్రిస్తుంటే మెలకువలో నేనున్నందుకు..
4490. అడవి ఎర్రబడిందట..
అమరవీరులకీ ఉద్యమకారులకీ జరిగే అనివార్యపోరాటంలో..
4491. స్వేదానికి పరిమళమెక్కువే..
చిందించే చైతన్యం విజయమై ప్రవహిస్తుంటే..
4492. ఇమిడింది రెండక్షరాలలోనైతేనేమి..
విశ్వమంతా వ్యాపించిన ఆప్యాయతేగా అమ్మంటే..
4493. నిరీక్షణకే మొలకెత్తాను..
క్షణక్షణానికీ మది కన్నీరందించి బ్రతికించినందుకే..
4494. మౌనసందేశం వినబడుతోంది..
నిలకడలేని నిర్ణయాలు మాటలను మింగేస్తుంటే..
4495. వరసకలిపింది ఏకాంతం..
నీతో సావాసానికి త్వరపడమని ఆదేశించి..
4496. వగలెక్కువే ఏకాంతానికి..
జ్ఞపకాల్లో సెగలెందుకని..
4497. ఊపిరాపేస్తావెందుకలా..
ఉప్పెనై ఉరకలేసి ముంచేసేంతలా..
4498. మైకమైపోయానందుకే నీలో..
నిన్నో ప్రేమనుకున్నందుకే..
4499. అడుగు కదపనే అక్కర్లేదు..
ఊహలో నన్నూరూరా తిప్పుతుంటే..
4500. పెదవుల మధువునెందుకు కురిపించావో..
పిలవకుండానే నాకెదురైన చిన్మయిగా..
4501. ఊహలవలేసింది నువ్వేగా..
హృదితంత్రులనూరించి ఉరకలేస్తావెందుకలా..
వెన్నెలతో మంట పెట్టించుకోవాలని నీకు మనసైతే చేసేదేముంది..
4402. ఉరేసుకొనే ఉద్దేశ్యమైతే లేదుగా నీకైతే..
విషాదాన్ని పాటగట్టి పాడుకొనే చొరవుండగా..
4403. గోరంత గుండే..
నీ జ్ఞాపకాలతో గుప్పెడుగా మారింది..
4404. వేరే లోకంతో పనేముందనుకున్నా..
నా లోకమే నువ్వయ్యాక..
4405. మౌనవ్రతాన్ని తటస్థం చేసేసా..
నీ మనసుని గుర్తించినందుకే
4406. జీవితానికి హామీ నువ్వేనంటున్నా..
సహానుభూతిగా నా చేయందుకున్నావనే..
4407. మధురమే ప్రణయం..
ఊపిరాడకుండా చేస్తున్ననీ చూపులసాక్షి..
4408. కాలమాగిపోతే బాగుండనుంది..
మనసునున్న మకరందాలు అరవిందాన్ని అలదుకుంటుంటే..
4409. నీ చూపులకే చంచలిస్తోంది మది..
పెదవిప్పకనే ఊసులాడే చొరవ చేస్తున్నాయని..
4410. నిముషాలనే నిలేయనూ..
నవ్యానుభూతిని నీకివ్వకుండా అడ్డుపడి నిలబడతానంటే..
4411. మధువై కురుస్తున్న వెన్నెలొకటి..
కలిసిన మనసుల్ని తడిపిపోవాలని..
4412. చిగురించిన పెదవినడుగు..
నీ జ్ఞాపకాల గలగలను అనువదించి మరీ చెప్తుంది..
4413. దరఖాస్తులా అనిపించింది ప్రేమలేఖ..
నీ ప్రేమకు ఆమోదమెలా తెలిపాలోనని విచారంలోకి తోసేస్తూ..
4414. నిశ్శబ్దపు చప్పుడది..
అస్తిత్వానికి అటూఇటూ మనసు పరుగెడుతుంటే..
4415. వసంతాన్నెందుకు వెక్కిరిస్తావో..
నాలా నవ్వులు నీకివ్వక వేధించిందనా..
4416. మధురమైన భావాలు చాలంటున్నా..
కాగితపుముక్కల్లో ప్రేమను వెతుకలేకనే..
4417. ఒంటరితనం వెలిసిపోయిందిగా..
నన్ను నీకిచ్చి తాను అంతర్ధానమైపోతూ..
4418. మనసు మల్లై విరబూస్తోంది..
మధురోహలో నన్ను గుర్తించమంటూ..
4419. విరహాన్ని రేప్పెడతావెందుకలా..
తలపుల జడివానలో తడవలేక నేనుంటే..
4420. సురగంగా ప్రవాహమై ఉప్పొంగడమెందుకో..
ఒద్దికగా రసడోలలూగి మురిసిపోక..
4421. మనసు ప్రాంగణంలో నీ పరుగులు..
అంతర్నిహిత సంగీతాన్ని నాలో కనుగొన్నట్లు..
4422. కన్నీరు తెలుస్తోంది..
తిరిగిరాని లోకానికెళ్ళిన మనసుకై కన్నులు తామే చెమ్మగిల్లుతుంటే
4423. మనసు మూగబోతోంది..
ఒక్క మౌనంతో శిలగా మారిపోయానెందుకానని..
4424. వ్యర్ధం కానీయకు కన్నీరు..
ఆర్ద్రమైన మనసుకు అట్టేపెట్టు..
4425. విలువైనదే కన్నీరెప్పుడూ..
సాంత్వనపరచినా...ఓదార్చినా..
4426. నక్షత్రాన్ని అలంకరించావు ముక్కెరగా..
దూరమున్నప్పుడు నింగికేసి చూడొచ్చనేగా..
4427. కన్నీటికి తప్పలేదు..
ఎవరు వీడినా మన తోడు చివరిదాకా తానేనంటూ..
4428. చెలియలకట్ట లేదుగా కన్నీటికి..
రెప్పలుదాటి హృదయంలోకి ప్రవహిస్తున్నవందుకే..
4429. కధ సుఖాంతమై కంచికి పోతుందనుకున్నా..
హేమంతంలో కాశ్మీరానికి తీసుకుపోతుందని తెలీక..
4430. హృదయం రోదించడం తెలుస్తోంది..
నిశ్శబ్దక్షణాలలో ఏదో అలికిడవుతుంటే..
4431. కన్నీటికి రుచి తెలియదనుకున్నా..
వేదనొకటి ఉప్పగా వర్షించేవరకూ..
4432. పన్నీరై జారిందా కన్నీరు..
హృదిలో పులకరింతను అభివ్యక్తీకరించాలనే..
4433. సమాధైపోయిన సత్యమొకటి..
హృదయంలోనే ఇంకిపోయిన కన్నీటికి గుర్తుగా..
4434. వేదనదిగా ప్రవహిస్తున్న కన్నీరు..
ఆనకట్టలే ఆపలేని విషాదంలో..
4435. నీ చెలికెప్పుడూ చిలిపిదనమే..
కన్నీటితోనే అనుభూతుల మాలికైపోతూ
4436. మసిగా రాలిన కన్నీరు..
ఎండిపోయిన వృక్షాలకు సాక్షిగా..
4437. అలుకల కన్నీళ్ళేగా నీవన్నీ..
అమ్మస్పర్శ నీకే సొంతమవ్వాలని..
4438. నటనెరుగని కన్నీరేగా విలువైంది..
'వేదన'దులైన కళ్ళెన్ని స్రవిస్తున్నా..
4439. ఒక్క నిప్పురవ్వే..
మనసుని కాల్చేసి కన్నీటిని ఎండగట్టేస్తూ..
4440. కన్నులు పొదగలేని కలలేమోనవి..
కన్నీరై వెచ్చగా జారిపోతూ..
4441. మరో అభినవ మేఘసందేశం మొదలెట్టా..
గ్రీష్మించిన హృదయానికి కన్నీటిని చూపేందుకే..
4442. వారు కన్నీటినే తాగి బ్రతికినందుకేమో..
పన్నీటివాగులై ప్రవహిస్తున్న పిల్లల పసిడికలలు..
4443. అపవిత్రమవుతోందట గంగ సైతం..
మలినమైన మునుషులంతా మునకలేసేసి..
4444. మౌనమొలికిపోతుందేమో..
జలపాతమైన కన్నీటిని చూసిన మరుక్షణం
4445. రంగులు మారుతున్న చెక్కిళ్ళు..
కన్నీటిని పరావర్తనం చెందిస్తూ..
4446. కన్నీటిలో కలువలేమిటో..
తిరిగిరావనుకున్న నువ్వెదురై నా ముందుంటే..
4447. మౌనాన్ని ముడేసుకున్న రెప్పలవి..
అంతర్వాహినిగా కన్నీరు ప్రవహిస్తున్నందుకే..
4448. అనుభూతుల మధువులే..
నీ చిరునవ్వులు అమృతమై చేరుతుంటే..
4449. జలపుష్పాలైన నయనాలు..
నువ్వొచ్చి నాలో సంతోషాన్ని రెట్టింపుచేసావని..
4450. తెల్లగా తాగుతున్నావనే బాధపడుతున్నా.
నేనందించిన హరివిల్లులో ఏడురంగులుంటుంటే..
4451. ఒంపుకుంటూ పన్నీరు..
నీ ఒడిలో సంతోషాలే కావాలంటుంటే..
4452. శాస్త్రాలతో తిప్పికొడతావే..
సంతోషానికి పచ్చదనంతో సంతకం చేయమంటుంటే..
4453. గారాల పన్నీరేనది..
అలుకలతో అందాన్ని రెట్టింపుగా మురిపిస్తూ..
4454. ఊహలను చకోరాలుగా పంపాను..
ఏకాంతంలో జంటగా నీకనిపించాలనేగా..
4455. రెప్పలు మూసుకు చూడవెందుకో..
కల్లోకి రాలేదని కంగారుపడుతూ..
4456.
మౌనానికి ప్రతినిధి నేనయ్యా..
నిశ్శబ్దపుటంచున భావాలు నిలిచిపోతుంటే
4457. నీ భావాలు..
అమాస మనసుపై వెన్నెల మరకలు..
4458. కొబ్బరినీళ్ళ తరువాత కన్నీరే స్వచ్ఛమైనది..
ఆర్ద్రతనేది ఆ మనసులో నిజమైతే..
4459. బృందావనం దాటి నిన్నెవరు బైటకి రమ్మన్నారో..
నిన్ను మరపించినా రాధనే మరచిపోతూ నేడు..
4460. కన్నులెప్పుడూ కలిసే చూపుతాయి..
నీ మనసద్దంలో నేనున్నానంటూ..
4461. అలలై కదులుతున్న జీవమే అది..
జీవనదై కొత్తందాలతో మెరిసే వైనమది..
4462. ముత్యాలుగా మార్చేసా పుప్పొళ్ళన్నీ..
నీవు దోసిలిపట్టుకు నిలబడ్డావనే.
4463. అనేకమవుతున్నావుగా నాలో..
హెచ్చువేసుకుంటూ మదిలో
4464. మిణుగురుగా మారినా నాకిష్టమే..
ఆకాస్త వెలుగునూ అద్దుకొనేందుకు..
4465. కలిపేసుకున్నావుగా నీలో నన్ను..
శేషమనేది విశేషించినా దొరకనట్లు..
4466. మైనమై నేనూ కరుగుతున్నా..
నీ శ్వాసలకు పరవశిస్తూనే..
4467. శూన్యమెక్కడ మిగిలిందని..
మనసంతా నేనై నిండిన హృదయాకాశంలో..
4468. నన్ను శ్వాసించడమాపవుగా..
నీ ఊపిరిని కోరుకున్నానని తెలిసాక..
4469. వెతికివెతికీ అలసిపోయా..
ధూపంలాంటి మంచుల్లోంచీ బైటకొస్తావని తెలియక..
4470. కుంగిన సూరీడు నెలరేడుగా మారిపోయాడు..
ఎప్పటికి చేయందివ్వని అలలపై మండిపడుతూ..
4471. నిశ్శబ్ద సుగంధమొకటి ఆవరించింది..
తొలిపొద్దు తెమ్మెరలోని అనుభూతిలా..
4472. మౌనం మాట్లాడినట్లుంది..
నీ చూపుకొసల కావ్యాలను ఆలకిస్తుంటే..
4473. నిర్ణయం తీసుకోక తప్పలేదు..
నువ్వు రామకోటికే అంకితమైపోతుంటే..
4474. అమరవీరుల త్యాగనిరతే..
మనమనుభవిస్తున్న లోకశాంతి..
4475. అనుసరిస్తూనే ఉంటాయలా..
అక్షయమైన అమ్మప్రేమలా కమ్మనైన జ్ఞాపకాలు..
4476. నవ్వును మూటకట్టేస్తావనుకోలా..
మనసులో స్వేచ్ఛగా ఎగరొచ్చని నేనొస్తే..
4477. అమృతమేగా నా నవ్వులు..
అనుభూతులై నిన్ను బ్రతికిస్తుంటే..
4478. నీ మనసులోకి ఈదలేక చస్తున్నా..
కొలతలకందని లోతుల్లో మణులను దాచుకుంటుంటే..
4479. అమృతఘడియలన్నీ అట్టేపెట్టాను..
నీ మనసు నాకై నిరీక్షించని సమయమే లేదని..
4480. వెన్నెలైపోయిన నా ఆనందాలు..
అమాసనేది ఒకటుందనే మరచిపోతూ..
4481. మనసు ఏకాంతాన్ని కోరింది..
కనుపాపలే అద్దమై మెరుస్తుంటే..
4482. మంకెనలుగా మారుస్తావెందుకో నవ్వుల్ని..
పెదవులసిగ్గును బుగ్గల సొట్టలకంటించి..
4483. మబ్బు పట్టిన మేఘమైపోతా..
నువ్వలా ఆకాశంలోకి ఎక్కిస్తుంటే..
4484. నెమలివై ఆడే దాకా నేనుంటాను..
సల్లాప సుగంధాలను వెదజల్లేందుకు ఎదురుచూస్తూ..
4485. నిశ్శబ్దమైనప్పుడే అనుకున్నా..
శూన్యాలయంలోకి చేరిందికాక నన్నూ రమ్మంటావని..
4486. విరహం అనంతమైంది..
ఏకాకితనంలో నీ ఊహలు బరువెక్కుతున్నకొద్దీ
4487. అమ్మ మూల్యమైనదే..
అందరికీ ప్రేమనే పెన్నిధి దొరకనట్లు..
4488. అదృశ్యమైపోయా నీలోనే..
నీ మనసు ఇరుకైనా నాకిష్టమేనని..
4489. విరహమిప్పుడు తెలుస్తోంది..
లోకం నిద్రిస్తుంటే మెలకువలో నేనున్నందుకు..
4490. అడవి ఎర్రబడిందట..
అమరవీరులకీ ఉద్యమకారులకీ జరిగే అనివార్యపోరాటంలో..
4491. స్వేదానికి పరిమళమెక్కువే..
చిందించే చైతన్యం విజయమై ప్రవహిస్తుంటే..
4492. ఇమిడింది రెండక్షరాలలోనైతేనేమి..
విశ్వమంతా వ్యాపించిన ఆప్యాయతేగా అమ్మంటే..
4493. నిరీక్షణకే మొలకెత్తాను..
క్షణక్షణానికీ మది కన్నీరందించి బ్రతికించినందుకే..
4494. మౌనసందేశం వినబడుతోంది..
నిలకడలేని నిర్ణయాలు మాటలను మింగేస్తుంటే..
4495. వరసకలిపింది ఏకాంతం..
నీతో సావాసానికి త్వరపడమని ఆదేశించి..
4496. వగలెక్కువే ఏకాంతానికి..
జ్ఞపకాల్లో సెగలెందుకని..
4497. ఊపిరాపేస్తావెందుకలా..
ఉప్పెనై ఉరకలేసి ముంచేసేంతలా..
4498. మైకమైపోయానందుకే నీలో..
నిన్నో ప్రేమనుకున్నందుకే..
4499. అడుగు కదపనే అక్కర్లేదు..
ఊహలో నన్నూరూరా తిప్పుతుంటే..
4500. పెదవుల మధువునెందుకు కురిపించావో..
పిలవకుండానే నాకెదురైన చిన్మయిగా..
4501. ఊహలవలేసింది నువ్వేగా..
హృదితంత్రులనూరించి ఉరకలేస్తావెందుకలా..
![]() | This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment