Thursday, 19 November 2015

ద్విపదాలు : 3201 నుండి 3250

..................................... ********.....................................
3201. నిశ్చలమైంది సంగీతం..
నా జీవితం శూన్యాన్ని ఆవహించిందనే
3202. తెల్లారగట్టే విచ్చేసా..
రాజీ పడదాం రమ్మని కబురెట్టావని..
3203. కన్నుల కైమోడ్పులు..
నీ రూపాన్ని తనలో బంధించి.
3204. లలితగీతాన్నే మొదలెట్టా..
నువ్వు జతవగానే యుగళగీతముగా మార్చేసా.
3205. పరవళ్ళు తొక్కుతున్న సంతోషం..
నన్ను చిగురింతకు గురిచేసినందుకు..
3206. దేశదిమ్మరివని నమ్మలేదులే..
అప్పుడప్పుడూ వసంతగాలివై నన్నింతగా పట్టించుకుంటున్నావనే
3207. ఏకాంతాన్ని మచ్చిక చేసుకున్నా..
వియోగాన్ని ఓడించి గెలవాలనే..
3208. మౌనాన్ని మచ్చిక చేసుకున్నా..
మాటలతో నిన్ను గెలువలేక
3209. వెదురును వేణువు చేసిన ఖాళీ..
నా మదిలో శూన్యం నింపిందెందుకనో.
3210. నవనీతం నిండుకుంది మనసులో..
ఏ కోరనవ్వుకు కరిగిపోయిందో
3211. కలవరపడుతున్న కళ్ళు..
రెప్పలాపలేని ధూళి మదిలో రేగిందని..
3212. కలవరపడుతున్న కళ్ళు..
కలలో కుంకుమ కరిగిన అశుభానికి
3213. కలవరపడుతున్న కళ్ళు..
కనుపాపలను నీ చూపులు గుచ్చుతుంటే..
3214. కలవరపడుతున్న కళ్ళు..
కలలన్నీ నన్నువీడి కాటుకుపిట్టలై ఎగిరిపోతుంటే..
3215. కలవరపడుతున్న కళ్ళు..
కన్నీళ్ళతో సావాసం ఇంకెంత కాలమోనని..
3215. నా పరిమళాన్ని కాజేసిన పువ్వు..
సంపెంగినంటూ అందరి మన్ననలూ అందుకుంటూ..
3216. కలవరపడుతున్న గోదావరి..
తనను మించిన నవ్వులు నావయ్యాయని..
3217. రాలిపోయిన కలలెన్నో..
నీ జ్ఞాపకాలను చేసి పొదుపుకున్నానని..
3218. నేడు ప్రశ్నార్ధకమై ఎదురు నిలబడింది..
నిన్న తేలికగా తీసుకున్న జీవితమేగా..
3219. మనసులో మెరుపు..
కన్నులకాటుకలో చల్లగా వెలిగి దీపమవుతూ..
3220. వేకువ కిలకిలలు..
వేదనను ఆమడదూరం నెట్టేసి దరిచేరుతూ..
3221.కన్నీటిలో కరిగిందిగా మౌనం..
కళ్ళకు స్వచ్ఛతనద్ది మెరిపిస్తూ..
3222. శూన్యమూ శబ్దిస్తోంది..
నువ్వు ఆస్వాదించే గీతం తానైనందుకే
3223. నీ మేఘసందేశం ఆలకించినప్పుడే అనుకున్నా..
మనసు కురిసే అవకాశమిన్నాళ్ళకు వచ్చిందని..
3224. కొంగొత్తభావాలు మదిలో..
నీ ఊసులను రాసుకొని మురిసేకొద్దీ
3225.  అరుణవర్ణమైన కాగితం..
కలం చిందించిన ఎర్రని ఆక్రోశానికి..
3226. పరిమళిస్తున్న భావకవనం..
మదిని మీటేకొద్దీ ఆనందం గుభాళిస్తూ..
3227. వర్తమానాన్ని విశిదీకరిస్తున్నా..
ఖచ్ఛితంగా చీకటి వెనుక వెలుగుంటుందనే..
3228. నవ్వించ్చొద్దంటే వినవుగా..
ఆపై పరిమళాన్ని పంచుతున్నానంటూ నిందలు..
3229. కొన్ని ప్రణయాలు విషాదమవుతాయి..
విరహంగా మిగిలి వేదనవుతూ..
3230. మౌనాన్ని రాల్చానందుకే కన్నులతో..
ఆనందం కురిపించినా పట్టించుకోవనే..
3231. పగటికలల్ని పాతిపెట్టా..
రాతిరి నిద్దుర లేకుండా చేస్తున్నాయని..
3232. విధిని వెక్కిరించలేకున్నా..
రాతల్లోనైన మనసుని సజీవం చేస్తోందని..
3233. వసంతానికి వెతుకులాట..
అందరాని కొమ్మల్లో కోయిలను అన్వేషించినట్లు..
3234. తన మౌనాన్ని మరిపించాలనుకున్నా..
నా మాటలలో మల్లెలనద్ది...
3235. 
అతిధివైతేనేమిలే..
ఆమె ప్రణయకావ్యంలో ఒకపేజీనే ఆక్రమించావుగా
3236. 
వెన్నెల కురిసిన వేకువ..
సరికొత్త వేడుకను పరిచయిస్తూ.
3237. 
అరిషడ్వికారాలకు బంధీ..
తనకు తానే మలినమైపోతూ జీవుడు..
3238. 
మదిలో ఆనందం మృగ్యమే..
స్మృతులు వర్తమానాన్ని కప్పినంతకాలం..! 
3239. కన్నులకెన్ని వైరాగ్యాలో..
ప్రకృతిని వికృతిగా మార్చే కొందరు మనుషులను తిలకిస్తూ.
3240. 
అపురూపమే ఆమె..
నీ చూపుల సౌందర్యాలు అలదుకొని..
3241. 
చైతన్యమే..
అనురాగపు తీపిమరకలు గుభాళిస్తుంటే.
3242. 
ఆనందం ఆవాహయమి..
నీ పెదవులపై నిత్యహారతిలా వెలుగుతూ..

3243. వలపించినందుకే వేదనయ్యింది..
మౌనంగానైనా బదులివ్వని నీ నిర్లక్ష్యంతో.. 

3244. అర్ధవంతమైనదే వివాహం..
దంపతులిద్దరూ ఆగర్భ శత్రువుల్లా మారకుంటే..

3245. అద్భుతమైనదే వివాహం..
ఆహ్లాదమైన సాహచర్యం జీవితానికి వరమైనప్పుడు.. 

3246. కాలం కదిలిపోతుంది..
ఆశలకు మెరుగుపెట్టక నేను కూర్చుండిపోతుంటే..

 3247. పులకింతలకేం కొదవలేదుగా ఎదలో..
వియోగం వెక్కిరించాలని చూసినా.. 

 3248. చెలిని చకోరం చేసావుగా..
 బాహువుల్లో చలి కాసుకుంటూ..

3249. ఏకాంతపు సంతోషాలే ఎదలో..
కలలోని నువ్వు వాస్తవమైనందుకు

3250. నేనేగా సంకీర్తన..
నీ నీరవం రవళించే సంధ్యవేళ.. 


..................................... ********.....................................

ద్విపదాలు : 3151 నుండి 3200 వరకు

..................................... ********.....................................
3151. అనుభవం అనుభూతయ్యింది..
మదిలో భావాలను మాలికలుగా అల్లుకొని..
3152. వేసవిలోనే వేకువ..
కువకువలను సైతం యాంత్రికంగా ఆలకిస్తూ..
3153. మాటలైన భావాలెన్నో..
పెదవిని దాటి ముత్యాలై ప్రవహిస్తూ..
3154. ఉలికిపడుతున్న మౌనాలెన్నో..
అనువదించని మాటలు సడిలేని స్వప్నాలవుతుంటే..
3155. స్వేదమూ చందనమై పరిమళించింది..
చిలికింది అనురాగపు మౌనాలనే..
3156. చూపులు బాసికాలయ్యాయి..
పేరుబలాలూ పెనవేసాక..
3157. రాతిరిని గమనించానప్పుడే..
బ్రహ్మాండంతా బూజుపట్టినట్లు కృష్ణవర్ణంలో అగుపిస్తుంటే..
3158. రేపటిని నిన్నే కలగన్నావెందుకో..
వెలుగునీ నీడల్లో పాటిపెడుతూ..
3159. ఆ చిరునవ్వుల పరిమళమో మహేంద్రజాలమే..
రహస్య నివేదన కోరింది ఆరాధనే..
3160. ఒక్క మంచితనం మిగిలుంటే చాలేమో..
మొత్తం బరువునంతా మోయగలదు భూమి..
3161. నా పరిమళం అక్షయమే..
అడవిమల్లెలా నిన్ను ముసిరేందుకు..
3162. ఆనందాన్ని రాల్చేసా..
భాష్పాల భాష్యం నిన్ను చేరుతుందనే..
3163. కాలుతున్న కడుపుకే తెలుసు..
వడ్ల కోసం..వంట కోసం..ఆకలిని ఆపుకోవడం..
3164. ఇరులు మెరుస్తున్నవి నిన్నే..
చెమరింపును చూపులో పోగేస్తూ..
3165. నీరవంలోనూ శబ్దిస్తూనే ఉంటా..
నా సాంగత్యం గుర్తుచేయాలని..
3166. నేటి సంతోషం ఆవిరయ్యింది..
నిన్నటి వియోగం గుర్తుకొచ్చి..
3167. మౌనాన్ని తిరగ రాస్తావెందుకో నువ్వు..
మనసుకి వైరాగ్యం తప్పించాలని నేనెదురుచూస్తుంటే..
3168. పట్టుదలేగా స్ఫూర్తి..
కట్టెలమ్మిన చోటే పూలను తివాచిగా పరచి చూపిస్తూ..
3169. వెన్నెలను నా నవ్వుల్లో దాచేసా..
చూపుతో గిచ్చితేనే నన్ను చూస్తావని..
3170. తెల్లమొహమేసినప్పుడే అనుకున్నాను..
నా భావమొక్కటీ నిన్ను మీటనేలేదని..
3171. కన్నీరంతా కన్నుల్లోనే ఇంకిపోయింది..
లోతెరుగని నీ మనసులోకి దూకే సాహసం చేయలేక..
3172. ఒంటరి ఊహ ఎగిరిపోయినట్లుంది..
ప్రకృతి ఎదలో శబ్దాలనాలకిస్తుంటే..!
3173. మిధ్యాబింబాల జీవితాలంతేగా..
నిద్దురపొద్దులూ పద్దులనే లెక్కలు కట్టుకుంటూ..
3174.చెంపలు చప్పుడైనప్పుడే తెలుసుకున్నా..
నీ ప్రేమ రవళిస్తోందని..
3175. మౌనాన్ని ముక్కలు చేసేసా..
మనమాలపించే ఆనందాలకి అడ్డొస్తోందని..
3176. మంచిపన్లు చేయడం నేర్చానందుకే..
నేనెప్పుడూ సజీవమై ఉండాలనే
3177. హృదయాన్ని తవ్వుతున్నావెందుకో..
కన్నుల్లో కన్నీటి లోతులు కనుగొనలేనందుకా.
3178. హేమంతానికి తొందరెందుకో..
మంచువెన్నెల్లో తడిచే యోగం ముందుండగా
3179. అనురాగం అందమై మెరిసింది..
ఆనందంగా నీతో ఆలపించబట్టే
3180. మౌనాన్ని తెమ్మెర చేసేసా..
మోహావేశపు వెల్లవనై నిన్నల్లుకుందామనే
3181. తీపి గోదారినై తేలిపోతున్నా..
మదిలో ప్రవహించమని కోరావనే..
3182. రాతిరయ్యిందిగా మరి..
కలలేమో కన్నుకొట్టి రమ్మని పిలిస్తున్నవని..
3183. ఎన్ని రాత్రుల జాగారమో..
కార్తీకాన్ని శివరాత్రిగా మార్చేస్తూ.
3184. నీ పిలుపుల పారిజాతాలు..
వేకువ పారవశ్యంలో ముంచెత్తుతూ..!
3185. అణువణువూ ప్రవహించమని వేడుకుంటున్నా..
విశ్వమంతా మహసముద్రమై విస్తరించేట్టు..
3186. జీవితం ప్రవహిస్తుందిలే..
మనఃసమూహం అనుభూతై ఆహ్వానాలు పలికితే.
3187. నీ ఊసులు తలచుకుంటూనే మిగిలున్నా..
నువ్వెన్ని కోతలు కోసినా నిజమనుకుంటూ..
3188. కలతలైన కధలెన్నో..
శూన్య మందిరమై మిగిలున్న హృదయంలో..
3189. కిన్నెరసానిగా విడిపోయా..
నీ గుండెకవాటంలో దారి ఇరుకైందనే..
3190. నునుచెమటలకే చెంగల్వలు..
నీ తలపులు ఆవిర్లకు పూతొచ్చినట్లు.
3191. ఒక్కోచినుకూ ఒక్కోశబ్దమై వినబడుతున్నప్పుడే అనుకున్నా..
నీ చెక్కిళ్ళలో మృదంగమేదో దాచావని...
3192. ఆ తలపులు మరందాలే..
తుమ్మెదలా పదేపదే తిరుగాడుతూ..
3193. పెదవులు మరచిన నవ్వులేనవి..
మౌనంలో కన్నులు బయటపెడుతూ.
3194. సద్దు చేయని ముద్దులడిగా...
కనీసం కన్నులైనా మాట్లాడుకుంటాయనే..
3195. మానవత్వం ఒక్కటీ చాలుగా..
చెదిరిన మనసును హత్తుకొని చెమరింపు దూరం చేసేందుకు
3196. .జీవితమంతే..
మిణుగురు వెలుగులో దీపావళి చేసుకోమంటూ
3197. నిశ్చలమైంది నాలో సంగీతం..
జీవితం శూన్యాన్ని కౌగిలించిందనే
3198. నా మనసుకి మూగనోము నేర్పించా..
మౌనాన్ని తాను మాత్రమే చదవగలదని
3199. గుండె కవాటం తెరిచుంచా..
ఒక్క గదిలోంచీ మరో గదిలోకి నువ్వొచ్చి చేరతావనే
3200. పావురాలు గాయపడితేనేమి..
శాంతి కొరకే రెక్కలు కొట్టుకుంటున్నాయిగా.
..................................... ********.....................................


ద్విపదాలు : 3051 నుండి 3100 వరకు

..................................... ********.....................................
3051.  మిణుగురువైనా చాలనుకున్నా..
వెలుగు కిరణాలు నీ మదిలోకి దారి చూపుతాయనే
3052. పువ్వులన్నింటిలో చేరిపోయా..
ఏ పువ్వును శ్వాసిస్తావో నువ్వని
3053. చూపుల కావ్యాలు..
చదివేకొద్దీ నను రాయమని ప్రేరేపిస్తూ..
3054. మిన్నంటుతున్న నవ్వులు..
నువ్వెంత పైకి ఎగురగలవో చూద్దామని.
3055. బరువెక్కుతున్న ఆత్మీయ సవ్వడి..
హోరెత్తిస్తున్న పాశ్చాత్యఒరవడిలో అణిగిపోతూ
3056. ఆమె మువ్వలు పెట్టుకోవడమే మానేసింది..
అత్తింట తడబడే అడుగులను తప్పుపడుతుంటే..
3057. మౌనం మువ్వై మోగింది..
మనసును నిద్దుర లేపేందుకే..
3058. అనుభూతినందించిన పెదవులు..
అరనవ్వుల సవ్వడిని మౌనంగానే ఆస్వాదిస్తూ..
3059. నిత్యవసంత సవ్వడులే ఆ మదిలో..
ప్రేమించడం మాత్రమే తెలిసిన హృదయంలో..
3060. నవపల్లవాల కూజితాలు..
పుష్ప సుగంధాలకు మలయానిల సవ్వడి జోడి కుదిరిందనే
3061. గుండె గీరుకున్న సవ్వడి..
మనసుని మాటలతో రక్కావనే
3062. మెట్టెలసవ్వడి మోగింది..
నీ గుండెల్లో అనురాగానికి ఆలాపనై..
3063.  నిమీలితమైన నా కన్నులు..
నీ హృదయపుసవ్వడికి పరవశమై.
3064. దీపావళినై వచ్చానందుకే..
కొమ్మకొమ్మకూ వరుస దివ్వెలు పేర్చుదామని..
3065. శిశిరంలో శిధిలమైన ఆకులేరుకుంటూ నిలబడతావెందుకో..
కార్తీకం కన్నుకొట్టి రమ్మని పిలుస్తోంటే
3066. రంగురంగుల కాగితాల చీర..
మార్చేవారే లేక రెపరెపలాడుతూ.
3067. విశ్వమంతా పరివ్యాప్తమైనదది..
వ్విశ్వకర్మనే సవాలు చేసే నవనాగరికమిది..
3068. ప్రాణం చేజారిపోలేదనుకుంటున్నా..
ప్రతిశ్వాసను నీలో లయం చేసాననే..
3069. విహంగమై ఎగిరానిన్నాళ్ళూ..
మౌనమై నీ గూటికి చేరేవరకూ...
3070. నాటురాగాన్ని నేర్చిన చూపులేమో..
చీకటిలోనూ ఉద్వేగంతో ప్రకాశిస్తూ.
3071. అమాసవెన్నెలలు..
ఆకాశం అలదుకున్న కాంతుల దివ్వెలు..
3072. ఆకాశం చేద్దామనుకున్నా అలుకలు..
మధురస్పర్శతోనే కరిగించేస్తావని తెలీక
3073. నాకైతే అప్పుడప్పుడూ తప్పదు..
నీ నిజాయితీని తట్టుకోలేక
3074. మనసుకొమ్మ జారింది..
పూలగుసగుసలు నీ పెదవుల్లో వినబడినందుకే..
3075. సుదీర్ఘమవుతోంది కాలం..
ఇన్నాళ్ళ నిరీక్షణకు పరీక్షలు పెడుతూ..
3076. ఆనందభాష్పాలనుకొని పొరబడ్డానింతసేపూ..
నిన్నర్ధం చేసుకోవడం రాకనే కాబోలు.
3077. వసంతాన్ని వెతికి వెతికీ అలసిపోయా..
నీ చెక్కిళ్ళను చేరిందని గమనించక.
3078. పదహారువన్నెల్లూ వ్యర్ధమేగా..
సీతాకోకను కాదని నన్ను హరివిల్లుగా నువ్వు చిత్రిస్తుంటే.
3079. పగటి తలపులొద్దన్నానందుకే..
వెలుతురుకన్నా శబ్దాలు ఇబ్బంది పెడతాయనే
3080. ఉద్వేగాన్ని కురిపించేసా..
అణువణువూ ఆనందం ప్రవహించేలా చేద్దామని..
3081. .మానవత్వం ముసుగు తీసిందేమో..
మధురమైన పిలుపొకటి వినబడిందిగా
3082. నిశ్శబ్ద శూలాలెన్నో..
సూటిగా మదిలోనే పదునుగా గుచ్చుకుపోతూ.
3083. .వెన్నెల పంచుతావని కాబోలు..
నీలో చేరిన చీకటి నాకు ఆమడదూరమై నిలబడింది..
3084. అల్లసానినే మించిపోతున్నావు..
అల్లిబిల్లి అల్లికలతో మనసుకు గిలిగింతలిస్తూ.
3085. అలసిన మనసు అలజడి అంతేనేమో..
పోరాటం సిద్ధించాక ఆయాసాన్ని విస్మరించడం..
3086. నేను అనురాగ కమలంగానే బాగున్నా..
నువ్వు చేరువైతే అనుభూతి దూరమవుతుందని..!
3087. మెరుపై తాకింది చాలనుకున్నా..
నీలో విరహాగ్ని పరిమళిస్తోందనే
3088. మనసు చెమరించిందిలే..
మేఘం పాడిన పల్లవిలో జలకమాడినందుకు.
3089. సౌందర్యమూర్తిగా అగుపించావులే..
వెల్లువైన వెలుతురులో ప్రేమను వెదజల్లుతూ.
3090. నాగరికతెప్పుడూ వ్యర్ధమే..
పల్లెవాసుల ప్రేమల ముందు వెలిసిపోతూ..
3091. అధర పరిహాసాలు..
అరిమరికలెరుగని అమాయకత్వానికి పెదవి నెలవంకలు..
3092. కలలో మేల్కొంది కోరిక..
నువ్వు నచ్చావని మనసిచ్చాక
3093. చూపుల కావ్యాలు..
చదివేకొద్దీ నను రాయమని ప్రేరేపిస్తూ.
3094. దిక్కులు మరుస్తున్న వారు..
గాఢాంధకారంలోనే నిరీక్షించి అలసిపోతూ
3095. నీవో కృష్ణలోహితం..
పగటి పొలిమేర దాటని ఆమె అర్ధంకాని ఆకాశం..
3096. చంచలమయ్యిందిలే మౌనం..
నీ భావాల్లో అక్షరమై సంచరించి
3097. వెన్నెలై పొంగింది ప్రేమ..
నిన్నిలా పులకింతల్లో ముంచాలనే..
3098. .ప్రాణాన్ని జ్వాలగా మార్చేసా..
రహస్యంగా గుండెలో వెలిగేందుకే..!
3099. కృష్ణపక్షానికెందుకో తొందర..
వావిరిపువ్వుల వానలు కురిసే వేళయ్యిందనా..
3100. మేనై పులకరిస్తున్నా..
నిన్ను కప్పుకొని ఇద్దరం ఒకటయ్యాక..

..................................... ********.....................................

ద్విపదాలు : 3101 నుండి 3150 వరకు

..................................... ********.....................................
3101. నువ్వో అంతమవని రహస్యానివి..
పిపాసనంతా మౌనంలోనే ఆస్వాదిస్తూ.
3102. చిటపటపువ్వుల్లా రెప్పలు..
నీ కన్నుల్లో మతాబులు తిలకిస్తూ..
3103. పూటకి వాడిపోతేనేమి పువ్వులు..
ఆధారమైన దారం తోడుండగా..!!
3104. a స్వీయగానం మొదలెడితే సరిపోతుందేమో..
బృందగానానికి జనాలకి తీరికెక్కడిదీ
3105. కలస్వనాలై ఎగిసిన నా నవ్వులు..
నీ హృదయంలో ప్రతిధ్వనించే వేళ
3106. సఫలంకాని స్వప్నాన్ని విడిచిపెట్టాలందుకే..
జీవితమింకా ముందుందనే ముందడుగేస్తూ.
3107. మనశ్శాంతి కరువైన లోకమిది..
వర్షపు చప్పుళ్ళకీ ఉలిక్కిపడుతూ.
3108. పదాలకెంత పొందికో..
ప్రాయశ్చిత్తానికీ చిరునవ్వు సాయంతో ప్రణమిల్లుతూ
3109. ఆనందభాష్పాలెన్నో చదివా నీ నయనాల్లో..
నాతో నువ్వున్నప్పుడు సంతోషాలే కురిసాయని..
3110. వెక్కిరింతలెందుకో నా జ్ఞాపకాలంటే..
నీడల్లోనూ నిద్దర్లోనూ వెంటొస్తాయని.
3111. ..జ్ఞాపకాలకే అలజడెందుకో..
జలగలై పీడించలేదుగానని
3112. తలపును సజీవం చేసానందుకే..
నీలో భావాలు అడుగంటకూడదని..
3113. పరిమళించే కొన్ని కలలు..
పరాకుగానైనా తమను ఆస్వాదించమంటూ
3114. మృత్యుంజయుడు వాడే..
ప్రేమపాశాన్ని కానుక చేసిన చిదంబరుడు..
3115. ఎదురుచూపులు మానేసా..
గతం రాల్చిన కన్నీటిచుక్కలు చేదయ్యాక..
3116. చూపులను చదువుతున్నా..
మాటలైతే మనసు మాయ చేయొచ్చని..
3117. వేకువరేఖలకై ఎదురుచూపులందుకే..
నీ మనసులోకి మార్గం చూపెడతాయని..
3118. అరచేతిలో అక్షరజాలం..
కాలు కదపకుండానే చేసిందిగా ఇంద్రజాలం..
3119. ఊసులు ఘొల్లుమన్నాయి..
ఊహలలో ఇమడలేక..
3120. తీపిగాయాలేమని చెప్పుకోనూ..
ప్రతీకోణంలోనూ పదునైన బాణాలనే ఎక్కుపెడుతుంటే..
3121. మెరిసిపోతోంది నీ మనసు..
దీపావళి దివ్వెలనే తలదాన్నేలా...
3122. ప్రియసఖినే నేను..
ప్రియమార నీ మాటలను గ్రోలేవేళ..
3123.
.తెల్లబడిపోయిన నా కనుపాపలు..
నీ మౌనాన్ని చదివీచదివీ.
3124. ఎందరసురులో..
కలికాలంలో మేకతోలు కప్పుకు తిరుగుతూ..
3125. నేల రాలిన నక్షత్రాలను హత్తుకున్నా..
చిద్రుపలైన నా కోరికలు తీరునేమోనని..
3126. తెగుళ్ళను తెగనరికేసా..
దిగుళ్ళను సాగనంపి సంతసాన్ని సాధించాలనే..
3127. కమలాలై విచ్చుకుంటున్న కలలు..
అమ్మానాన్నల ఆశీర్వాద బలముతోనే..
3128. నీ గుర్తింపుకు నోచుకోని నేను..
కాకుల గుంపులో కలగలిసిన కోయిలలా..
3129. పారిజాతాలపూజైతే ఫరవాలేదనుకున్నా..
నీ ఆరాధన సఫలం చేసేద్దామని..
3130. నా భావం ఉరకలేస్తోంది..
నీ మానసాన్ని తలచుకొని..
3131. సైకతమై మిగిలిపోయా ఒడ్డునే..
శిలగా మలచినా రాలిపోతూ..
3132. సున్నితంగా మారెనెందుకో నా మనసు..
నీ చూపుకు చెక్కిళ్ళను చేరవేస్తూ..
3133. కాకుల గుంపులో కలగలిసిన కోయిలనయ్యా..
నీ చెవిటిదనం ముండు పాడిపాడి..
3134. దీపావళినని చెప్పి పొరపాటు చేసా..
ఈ నెల్లాళ్ళూ వెలగమంటావని తెలియక..
3135. అభిషేకానికి సిద్ధమయ్యావెందుకో..
కార్తీకం నాకు ప్రియమని కనిపెట్టినందుకా..
3136. నా కన్నులకెంత బెదురో..
మౌనమంతా ముఖంలోనే వెక్కిరిస్తుంటే..
3137. కావ్యకన్నెనని పొగిడినప్పుడే అనుకున్నా..
భావాలన్నీ భజనల్లో చేర్చేసావని..
3138. కన్నీళ్ళతో కళ్ళాపి జల్లావనుకున్నా..
చిరునవ్వులను రంగవల్లులు చేస్తానని..
3139. క్షణాలనెందుకు కవ్విస్తావో..
ఖర్చుకు వెనుకాడక దరి చేరమంటూ..
3140. 
వెలుగులదెవ్వెనై విచ్చేసానందుకే..
ప్రమిదల ఖర్చు నీకు మిగులుద్దామని.
3141. 
మాలికలు మెరిసేదందుకేననుకున్నా..
దూరమైన మనసులనూ దగ్గర చేస్తాయనే
3142. ఆత్మీయస్పర్శను కాదనలేకున్నా..
మాలికల్లో సజీవమై మదిని తడిమాయని..
3143. అలరించే భావాలెన్నో..
అల్లంతదూరంలోనూ అనునయిస్తూ..
3144. గుండెసవ్వడి నెమ్మదించింది..
గోరంత ప్రేమ నాదని వెక్కిరించావని..
3145. కార్తీకమని కనిపెట్టుకోమంటున్నా..
మనసెక్కువ నానితే మోక్షానికి దగ్గరవ్వొచ్చని...
3146. పిసినారి ప్రేమికుడివని ఒప్పుకున్నా..
మాటలతోనే బలాన్ని పంచేస్తుంటే..
3148. 
 జ్ఞాపకాల సుడులలో చిక్కుకున్నా..
మనసు తూనీగై నిన్నసరిస్తుంటే..
3149. అవేదనంతా అమృతమేగా..
నువ్వూ నేనూ రెండక్షరాల ప్రేమయ్యాక..
3150. నవ్వులతో కవ్విస్తావెందుకో..
చూపులకే నే చిత్తరువునై నిలుచుంటే..
..................................... ********.....................................

ద్విపదాలు : 3051 నుండి 3100 వరకు

..................................... ********.....................................
3051.  మిణుగురువైనా చాలనుకున్నా..
వెలుగు కిరణాలు నీ మదిలోకి దారి చూపుతాయనే
3052. పువ్వులన్నింటిలో చేరిపోయా..
ఏ పువ్వును శ్వాసిస్తావో నువ్వని
3053. చూపుల కావ్యాలు..
చదివేకొద్దీ నను రాయమని ప్రేరేపిస్తూ..
3054. మిన్నంటుతున్న నవ్వులు..
నువ్వెంత పైకి ఎగురగలవో చూద్దామని.
3055. బరువెక్కుతున్న ఆత్మీయ సవ్వడి..
హోరెత్తిస్తున్న పాశ్చాత్యఒరవడిలో అణిగిపోతూ
3056. ఆమె మువ్వలు పెట్టుకోవడమే మానేసింది..
అత్తింట తడబడే అడుగులను తప్పుపడుతుంటే..
3057. మౌనం మువ్వై మోగింది..
మనసును నిద్దుర లేపేందుకే..
3058. అనుభూతినందించిన పెదవులు..
అరనవ్వుల సవ్వడిని మౌనంగానే ఆస్వాదిస్తూ..
3059. నిత్యవసంత సవ్వడులే ఆ మదిలో..
ప్రేమించడం మాత్రమే తెలిసిన హృదయంలో..
3060. నవపల్లవాల కూజితాలు..
పుష్ప సుగంధాలకు మలయానిల సవ్వడి జోడి కుదిరిందనే
3061. గుండె గీరుకున్న సవ్వడి..
మనసుని మాటలతో రక్కావనే
3062. మెట్టెలసవ్వడి మోగింది..
నీ గుండెల్లో అనురాగానికి ఆలాపనై..
3063.  నిమీలితమైన నా కన్నులు..
నీ హృదయపుసవ్వడికి పరవశమై.
3064. దీపావళినై వచ్చానందుకే..
కొమ్మకొమ్మకూ వరుస దివ్వెలు పేర్చుదామని..
3065. శిశిరంలో శిధిలమైన ఆకులేరుకుంటూ నిలబడతావెందుకో..
కార్తీకం కన్నుకొట్టి రమ్మని పిలుస్తోంటే
3066. రంగురంగుల కాగితాల చీర..
మార్చేవారే లేక రెపరెపలాడుతూ.
3067. విశ్వమంతా పరివ్యాప్తమైనదది..
వ్విశ్వకర్మనే సవాలు చేసే నవనాగరికమిది..
3068. ప్రాణం చేజారిపోలేదనుకుంటున్నా..
ప్రతిశ్వాసను నీలో లయం చేసాననే..
3069. విహంగమై ఎగిరానిన్నాళ్ళూ..
మౌనమై నీ గూటికి చేరేవరకూ...
3070. నాటురాగాన్ని నేర్చిన చూపులేమో..
చీకటిలోనూ ఉద్వేగంతో ప్రకాశిస్తూ.
3071. అమాసవెన్నెలలు..
ఆకాశం అలదుకున్న కాంతుల దివ్వెలు..
3072. ఆకాశం చేద్దామనుకున్నా అలుకలు..
మధురస్పర్శతోనే కరిగించేస్తావని తెలీక
3073. నాకైతే అప్పుడప్పుడూ తప్పదు..
నీ నిజాయితీని తట్టుకోలేక
3074. మనసుకొమ్మ జారింది..
పూలగుసగుసలు నీ పెదవుల్లో వినబడినందుకే..
3075. సుదీర్ఘమవుతోంది కాలం..
ఇన్నాళ్ళ నిరీక్షణకు పరీక్షలు పెడుతూ..
3076. ఆనందభాష్పాలనుకొని పొరబడ్డానింతసేపూ..
నిన్నర్ధం చేసుకోవడం రాకనే కాబోలు.
3077. వసంతాన్ని వెతికి వెతికీ అలసిపోయా..
నీ చెక్కిళ్ళను చేరిందని గమనించక.
3078. పదహారువన్నెల్లూ వ్యర్ధమేగా..
సీతాకోకను కాదని నన్ను హరివిల్లుగా నువ్వు చిత్రిస్తుంటే.
3079. పగటి తలపులొద్దన్నానందుకే..
వెలుతురుకన్నా శబ్దాలు ఇబ్బంది పెడతాయనే
3080. ఉద్వేగాన్ని కురిపించేసా..
అణువణువూ ఆనందం ప్రవహించేలా చేద్దామని..
3081. .మానవత్వం ముసుగు తీసిందేమో..
మధురమైన పిలుపొకటి వినబడిందిగా
3082. నిశ్శబ్ద శూలాలెన్నో..
సూటిగా మదిలోనే పదునుగా గుచ్చుకుపోతూ.
3083. .వెన్నెల పంచుతావని కాబోలు..
నీలో చేరిన చీకటి నాకు ఆమడదూరమై నిలబడింది..
3084. అల్లసానినే మించిపోతున్నావు..
అల్లిబిల్లి అల్లికలతో మనసుకు గిలిగింతలిస్తూ.
3085. అలసిన మనసు అలజడి అంతేనేమో..
పోరాటం సిద్ధించాక ఆయాసాన్ని విస్మరించడం..
3086. నేను అనురాగ కమలంగానే బాగున్నా..
నువ్వు చేరువైతే అనుభూతి దూరమవుతుందని..!
3087. మెరుపై తాకింది చాలనుకున్నా..
నీలో విరహాగ్ని పరిమళిస్తోందనే
3088. మనసు చెమరించిందిలే..
మేఘం పాడిన పల్లవిలో జలకమాడినందుకు.
3089. సౌందర్యమూర్తిగా అగుపించావులే..
వెల్లువైన వెలుతురులో ప్రేమను వెదజల్లుతూ.
3090. నాగరికతెప్పుడూ వ్యర్ధమే..
పల్లెవాసుల ప్రేమల ముందు వెలిసిపోతూ..
3091. అధర పరిహాసాలు..
అరిమరికలెరుగని అమాయకత్వానికి పెదవి నెలవంకలు..
3092. కలలో మేల్కొంది కోరిక..
నువ్వు నచ్చావని మనసిచ్చాక
3093. చూపుల కావ్యాలు..
చదివేకొద్దీ నను రాయమని ప్రేరేపిస్తూ.
3094. దిక్కులు మరుస్తున్న వారు..
గాఢాంధకారంలోనే నిరీక్షించి అలసిపోతూ
3095. నీవో కృష్ణలోహితం..
పగటి పొలిమేర దాటని ఆమె అర్ధంకాని ఆకాశం..
3096. చంచలమయ్యిందిలే మౌనం..
నీ భావాల్లో అక్షరమై సంచరించి
3097. వెన్నెలై పొంగింది ప్రేమ..
నిన్నిలా పులకింతల్లో ముంచాలనే..
3098. .ప్రాణాన్ని జ్వాలగా మార్చేసా..
రహస్యంగా గుండెలో వెలిగేందుకే..!
3099. కృష్ణపక్షానికెందుకో తొందర..
వావిరిపువ్వుల వానలు కురిసే వేళయ్యిందనా..
3100. మేనై పులకరిస్తున్నా..
నిన్ను కప్పుకొని ఇద్దరం ఒకటయ్యాక..
..................................... ********.....................................

ద్విపదాలు : 3001 నుండి 3050 వరకు

..................................... ********.....................................
3001. పరిమళిస్తున్నా జీవిత పుటలు..
జ్ఞాపకాల అత్తర్లకు జోడవుతూ.
3002. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని.
3003. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3004. కవితనై పొంగిపోయా..
కమలంలో తేనెలు సిరాగా మార్చి నన్ను రాసావని
3005. కెరటంలా పొంగింది కేరింత..
వలపుకు పచ్చదనాలు పూసేస్తూ
3006. ఆలకిస్తున్నా నీ ఆలాపన..
మదికి సల్లాపాలు పంచుతుంటే
3007. సముద్రమంతా తీపయ్యింది..
నీ మనసుమధురాలు తనలో కలుపుకున్నాక
3008. అనురాగమే ఆలంబన..
శృతి తప్పిన గానాన్ని సరిచేయాలంటే..
3009. అనురాగం అనుబంధమయ్యింది..
అభిమానం ఊయలూపాక.
3010. విల్లయ్యింది పెదవి..
వానవిల్లుగా నీ మదిలో మెరవాలనే
3011. అభావమై మౌనవించిన నా మోవి..
నీరెండ రహస్యాన్ని ముసుగేసుకున్న ఆకాశంలా
3012. ఎంతదృష్టమో హరివిల్లు..
నాతో పోల్చగలిగే అందం తనదైనందుకు.
3013. దారి తప్పిన మనసు..
నీ చిరునవ్వుల ఎదురుచూపులోనే
3014. ఎన్ని శిశిరాల నిశ్శబ్దమో..
మనసును స్తబ్దుగా మార్చేస్తూ..
3015. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని
3016. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3017. చినుకై రాలిన విషాదం..
ఆదరణ కరువైన కన్నుల్లో
3018. నిశ్శబ్దక్షణంలో అడవిపూల పరిమళం..
ప్రేమలేఖను మోసుకొచ్చిన సమీరమేమో
3019. మూగసైగలే మోజయ్యాయి..
మౌనంపై మనసయ్యిందనే
3020. ఝల్లుమన్న ఊహలు..
నీ పెదవులకు కానుకైనందుకే మురిసిపోతూ.
3021. మందాకినిలో చందమామలా నేను..
నీ తలపుల తాకిడికి చెమరించిన గులాబీ రేకులా
3022. వసంతంలో అల్లరికోయిలలా నువ్వు..
వెన్నెలమైదానంలో ఒంటరికలువలా నేను
3023. మబ్బుల్లో దాగిన వానచినుకులా నువ్వు..
నీకై నిరీక్షిస్తూ నేలపై నేను
3024. కొమ్మచాటు అందాలకు కులుకెందుకో..
అందుకోమని ఆనందానికి కబురెట్టాక..
3025. మూగబోయిన నాలో కవితా సృజన..
నీవొచ్చి మేల్కొల్పే మహత్తరక్షణాలకై ఎదురుచూస్తూ.
3026. నీ ఎదుర్కోలు..
నాలో వేకువకి సన్నాయి ఆహ్వానాలు
3027. నీరవానికర్ధం తెలిసొచ్చింది..
నా మౌనానికి భాష్యం నువ్వయ్యాక..
3028. కాటుకలకే అందమొచ్చింది..
నీ చూపుతోనే కన్నులను అభినందించాక.
3029. పదునెక్కిన చూపులు..
నీగుండె మెత్తదనాన్ని అంచనా వేసినందుకేమో
3030. కవిత్వాన్ని హత్తుకుంటున్నా..
నిలకడలేని క్షణాలతో భారంగా సాగలేక..
3031. అరవిరి సొబగుల సవ్వడైతేనేమి..
మూగమనసుకు స్పందనలు నేర్పిందిగా..
3032. మహామౌనమేగా మనసుకి..
గుప్పెడంత గుండెసవ్వడి నీరవంలో ఒరిగాక.
3033. కాటుకరెప్పల సవ్వళ్ళు..
నీవల్లనే కన్నుల్లో కార్తీకం నవ్విందని..
3034. మనసంతా దీపావళి..
నీ ఒక్క పలకరింపు నా ఎదలో మరుదివ్వెలయినందుకే
3035. కోటికాంతులన్నీ నా కన్నుల్లోనే..
ఆనందాన్వేషణ సఫలమై నిలిచినందుకు
3036. పట్టపగలే దీపావళెందుకో నీ కన్నుల్లో..
చూపులకందని వెలుగు నాలో కనిపిస్తోందనా
3037. మేఘాంచలాల్లో దీపావళి సంబరాలు..
అరుణకాంతులు ఆకాశాన పురిటివెలుగులవుతుంటే.
3038. కన్నుల కులుకులు..
మనసంతా నువ్వని మౌనంగా నువ్వంటుంటే..T
3039. . చిగురుమెత్తనై కురిసింది ప్రేమ..
వలపుగంధంలో వెన్నెల మిళితమయ్యిందనేమో.
3040. కన్నుల్లో కాకరపువ్వొత్తులే..
నువ్వలా గంధర్వగానంతో నన్ను పొగుడుతుంటే.
3041. వినిపించని రాగాల మధురిమలు..
రెండు మౌనాలు ఒక్కటయినందుకేమో.
3042. అన్వేషిస్తున్నా ప్రేమఋతువుని..
ఆరారు కాలాలు గడిచినా రాలేదేమని
3043. పంచప్రాణాలనూ ఉరకలెత్తిస్తావు..
సప్తపదులకు తడబడే అడుగులకు తాళమేసినట్లు
3044. దీపాల వరుసలో చేరిపోయా..
నీకు దీపావళి నేనవ్వాలనే
3045. చూపుల్లో చేరిపోతానైతే..
నీ ఆశాజ్యోతినై నిత్యకొలువు చేయొచ్చని
3046. అల్లరిగాలినై అల్లుకున్నందుకేమో..
అడుగులేస్తున్న నీలో ఆనందం ఉరకలేస్తూ.
3047. రెల్లుపువ్వునై నవ్వుకుంటున్నా..
పిల్లగాలితో పోల్చి మనసు తేలికచేసినందుకు..
3048. ప్రేమాన్వేషణలో విసిగిపోయా..
అనంతమై ప్రవహిస్తున్న అశ్రువులను ఆపలేకనే..
3049. ప్రవహిస్తున్న పరిమళాలెన్నో నాలో..
నీ తలపులు గంధాలవుతుంటే.
3050. నీ పిలుపునాలకిస్తూ నేను..
అనుస్వరమై బదులివ్వాలని ఎదురుచూస్తూ..
..................................... ********.....................................

ద్విపదాలు : 2951 నుండి 3000 వరకు

..................................... ********.....................................
2951. సాహితీ సమ్మేళనమేగా..
మదిలో కవిత్వం ఆకాశమై విస్తరిస్తుంటే..
2952. తొలి పరిచయం నువ్వే..
తేనెపదాలతో మనసును కొల్లగొడుతూ..
2953. ఎన్ని భావాలు బహిర్గతమైతేనేమి..
మెచ్చే మనసులు కరువైనప్పుడు..
2954. నీ తలపులను దాచుకున్న వైనం..
నా మనసులోని మహా మౌనం..
2955. చందమామని వెనకేసుకొస్తున్నావెందుకో..
విరహహిణులను వేధించడంలోని మెళకువలు నీకు ఉచితంగా నేర్పినందుకా..
2956. ఆ జీవితం ధన్యమే చచ్చినా..
ఒక్క నలుగురి స్మృతులలో బ్రతికున్నా.
2957. దారితప్పిన శ్వాస..
నీలో నన్ను వెతుక్కుక్కోవాలనే తొందరలో..
2958. ఏకాంతం చేదవుతోంది..
కరువైన పలకరింపులు భావోద్వేగాన్ని వెక్కిరిస్తుంటే..
2960. ఉలికందని శిల్పంగా మిగిలిపోయా..
నీ కలానికి దూరమైనందుకే..
2961. నా కనులకు కలతే..
నీవు అలుసు చేస్తే
2962. మౌనం మరలిపోయింది..
విషాదం వేడుకవ్వగానే
2963. వాస్తవం వెక్కిరించినందుకేమో..
నీకు నువ్వే మల్లెల దారేసుకుంటూ..
2964. చినుకుల ముత్యాలేగా జ్ఞాపకాలు..
నిన్ను తలచినంతనే జారిపోతూ..
2965. దేవుడిఆటెంత క్లిష్టమైనదో..
నిరంతరం సంబంధాల్ని గెలిపించాలనే ఆరాటంలో..
2968. కట్టె కాలాకే కన్నీరొలికేది..
ప్రేమను గుర్తించగలిగే క్షణమదేనని..
2969. మందహాసాన్ని వీచానందుకే..
సంధ్యా సమయానికి దిగులు దూరమవుతుందని..
2970. సాంబ్రాణీ వేసుకోవడం మానేసా..
కళ్ళగంతలు కట్టినా కనిపెట్టేస్తున్నావనే..
2971. పరిమళాల పిచ్చి పట్టిందెందుకో..
మల్లెలగంపలో మత్తుగా పడ్డందుకా..
2972. నా నుంచీ తీసేసా నన్ను..
ఏకాకిని చేసి అందరూ నవ్వుతున్నారనే..
2973. ప్రేమకవితనే పల్లవి చేసేసా..
వలపుగీతం వసంతమై విచ్చేసిందనే..
2974. ఒంటరితనం పరుగు తీస్తోంది..
ఓటమిని తప్పించుకు పారిపోవాలనే..
2975. చెలిమి చేవ్రాలు చేసింది..
నాకు నీవున్నావనే సంకేతంగా..
2976. గేలి చేసా ఏకాంతాన్ని..
చందమామలా నువ్వు చేరువయ్యావని..
2977. మారాకు వేసింది ఆనందం..
శిశిరాన్ని నువ్వొచ్చి తరిమేసాక
2978. ఏకాంతాన్ని ఏకరువుపెడుతున్నా..
వెన్నెల్లో విరహాన్ని భరించలేని తపనల్లో..
2979. నిన్నలా లేను..
నీ గుండెసవ్వడికి దూరమైన నేను..
2980. ఉలిపచ్చినవ్వులు నీవేననుకుంటా..
నాలోని ఆనందాన్ని ప్రత్యేకంగా అభినందించినట్లు
2981. మనసు మాట వినదని ఋజువైంది..
పిల్లిలా కళ్ళుమూసుకొని నీవెంట పడుతుంటే..
2982. దయలేని స్మృతులు..
జీవితాన్ని దయానీయంగా మార్చి వినోదిస్తూ..
2983. పూటకి వాడిపోతేనేమిలే పువ్వులు..
ఆధారమైన దారం తోడుండగా..
2984. నయనాలు నీరయ్యాయి..
నీడల్లో నీ రూపం అలుక్కుపోయినందుకే..
2985. ఆకలి ఎరుపు..
కైపెక్కిన ఆకళ్ళను క్రోధంతో వెక్కిరిస్తూ..
2986. ఆల్చిప్పలవుతూ నా కళ్ళు..
నువ్వొస్తే బంధించాలనే ఆత్రంలో..
2987. పన్నీటిని తాగలేకపోయా..
సువాసనకే గానీ దాహం తీర్చలేవని..
2988. కలత బారిన కన్నులే నావి..
నీ కలలకు దూరమైన నిదురలా..
2989. ఏదోనాడు  తప్పక వస్తావనే వేచున్నా..
అడుగు కదపలేని అసహాయతలో నేను..
2990. ఎర్రసిరా పోసిన కలమనుకుంటా..
మాటల్ని మంకెనలుగా మార్చేస్తూ..
2991. నీ ఊసుల సరిగమలు..
ప్రతిరాత్రినీ కచేరీగా మారుస్తూ..
2992. అక్షరమైతే నా నేస్తామే..
తన ఊసులను పంచగలుగుతున్నందుకు..
2993. నిన్ను కోల్పోయాకే..
నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టా..
2994. నిన్ను కోల్పోయాకే..
మౌనాన్ని చేరదీసి శిశిరానికీ లోకువయ్యా.
2995. నిన్ను కోల్పోయాకే..
జాతకాల జాడల్లో అదృష్టాన్ని వెతుక్కుంటున్నా..
2996. అక్షరాలకు ఓదార్పు తేలికయ్యింది..
మనసు విశ్రాంతిగా కూర్చుందనే..
2997. మౌనానికని మాటేస్తున్నా..
మాటలతో నీకు మొహం మొత్తిందనే..
2998. తడబడని అడుగులు..
గమ్యమెరిగినట్ట్లు నీ వైపు దూసుకొస్తుంటే..
2999. పూసంత నవ్వినప్పుడే పువ్వునైపోయా..
మాలికగా మారి నిన్నలరించాలని..
3000. జీవితం వ్యర్ధమే..
ఋతువులను గుర్తించడం మనసు మరచిపోయాక..
..................................... ********.....................................

ద్విపదాలు : 2901 నుండి 2950 వరకు

..................................... ********.....................................
2901.  విషాదసంగీతాలే..
ముసుగు తీసిన చిరునవ్వులన్నీ..
2902. అపార్ధాలను రాల్చే కళ్ళు..
ముసుగు దాటి చూడకుండానే..
2903. ముచ్చటైన మేలిముసుగులే..
సమాజంలో సాటివారిగా గుర్తింపు మృగ్యమని..
2904. అలుకల నటన తేలికయ్యింది..
ముసుగులో నాటకం రక్తికడుతుంటే..
2905. చెల్లివంటూ ముసుగు..
చెలైతే బాగుండేదని మనసు రోదిస్తుంటే..
2906. ముసుగులు కొనుగోలు చేసుకు తీరాలేమో..
అవసరానికి తగినట్టు మనం మారాలంటే..
2907. అక్షరసంపద ఖర్చైపోతోంది..
నీ చిరునవ్వులు మాత్రం ఖరీదైనవి..
2908. ఆ మనసు మురిక్కాలవే..
విశ్లేషణకందని అవసరాల స్వార్ధంలో..
2909. భావాల బృందావమిప్పుడు గుర్తొచ్చిందేమో..
మౌనంలో నే నిద్దురపోయాక..
2910. నీ ఊసులన్నీ పోగేసా..
నీరవంలో నన్ను నేనోదార్చుకోవాలనే..
2911. లిపి నేర్వకుండా చేసావు..
మువ్వలతోనే ముచ్చట్లు మొదలెట్టి..
2912. ఉక్కిరిబిక్కిరవుతున్న దేహం..
సరిపడని ముసుగు వేసుకోవలసి వచ్చినందుకు..
2913. కనకాంబరంగా మారిపోయా..
సున్నితంగానే మనసును మాయ చేయాలని..
2914. గర్వపడుతున్న నా వలపులు..
ఒక్క నీ మాటతోనే
2915. మౌనాన్ని వీడలేకున్నా..
జ్ఞాపకాల్లో నిన్ను చేరువ చేస్తుందనే
2916. ప్రేమేగా దారం..
మల్లెలను మరువానికి ముడేసి పరిమళాలు పెంచే రాగం..
2917. నీ ప్రియమైన పలకరింపు..
మదిలో వెలుగురేఖల చిలకరింపు..
2918. నిన్నే అట్లతద్ది చేసుకున్నా..
మగపిల్లల ఆటలింక ఆడకూడదనుకుంటూ..
2919. చిగురాకు తొడిగిన చిన్ననాటి స్నేహం..
మారాకేసి మదిలో పెంచింది  దాహం..
2920. గుండె చెరువవుతోంది..
బరువెక్కిన భావాన్ని కాగితంపై రాయాలంటే..
2921. జోడు దొరికింది చానాళ్ళకు..
మాలికలను వండి వడ్డించేందుకు..
2922. అస్తిత్వాన్ని మరచిన ఆశలు..
అసంతృప్తిలో నిరంతరం వేగుతూ..
2923. కదం తొక్కిన ఊసులు..
నీ ప్రేమకు నీరాజనాలంటూ..
2924. వేషాన్ని మార్చుకోవాల్సొస్తుందేమో..
ఏ రూపంలో ఆమెకు నచ్చుతావోనని..
2925. మణిహారం చేసేస్తా చేతులను..
ఎప్పటికీ పెనవేతలు కొనసాగాలని..
2926. ప్రతిబింబంగా మారాలందుకే..
పగులగొట్టే ఆలోచనకు మదిలో చోటివ్వక..
2927. చాయాదేవిని చెరబట్టిన రాత్రి..
మబ్బుల్లో కలగలిసిన కోకిలగుంపులా..
2928. నన్నెవరూ చూడకూడదనే..
నీ భాగ్యానికి నలుగురూ నసుగుతారని..
2929. వివర్ణమైన విరహాలు..
వివరించకనే విహారనికొచ్చిన నీ తలపులతో..
2930. ప్రేమలోతు తెలుస్తోంది..
నీ చెక్కిలి చిరుగుంటల్లో పడ్డందుకే..
2931. తిరిగొచ్చేసా నీదరికే.
విరహమెందో ఈమధ్య ఒంటికి పడనందుకే..
2932. మొత్తుకుంటున్న మోహం..
ముద్దబంతిని కన్నులతోనే నువ్వు దోచేస్తుంటే..
2934. తలపులతోనే గాలమేస్తావు..
నాలోని వలపుకు వన్నె పెరిగేలా..
2935. తగ్గనంటున్న తాపం..
నువ్వింతగా ప్రేమించినందుకే
2936. గిచ్చుళ్ళపరం చేస్తావెందుకో మదిని..
అభిమానంతో నిన్నింత అభిషేకించినా..
2937. మెచ్చావనే గిచ్చుతున్నా..
వన్నెకెక్కిన ఒయారాలు ఓమారు చూడాలని..
2938. కొదవేముంది భావాలకు..
వెన్నెల ఒడిలో వికసించే నీకు..
2939. సుముహూర్తం కుదిరినందుకే..
ముద్దలూ ముద్దులూ ఏకమై వెన్నెలయ్యిందని..
2940. కన్నీరే మిగిలింది మదికి..
వలపువానలో ఒద్దన్నా తడిచినందుకు..
2941. మెరుపుల్లో తారకవే..
చీకట్లో వెలుగునిస్తూ..
2942. గిన్నీసు గుర్తు పెట్టుకుంటుందంటారా..
మాలికలు మరచిన నన్ను..
2943. మూతబడనంటున్న కళ్ళు..
నిద్దుర ముంచుతున్నా..నిశ్శబ్దం కరువైందనేమో..
2944. వివశాల గమకాలే..
తనువు లాస్యాలు పెదవిని కాస్తుంటే..
2945. బృందావనం బెంగపడుతోంది..
రాతిరైనా రాధమ్మ జాడ తెలియకపోతే..
2946. ముగ్ధమవుతోంది మోము..
రాగాలు మోవిని ప్రియమారా అలంకరిస్తుంటే
2947. మౌనమూ మనసవుతోంది..
నువ్వు పరిచయించినందుకేమో..
2948. నెయ్యిలానే కరిగింది చెలిమి..
చాటుగా కయ్యం కలగలిసినందుకే..
2949. పొందికయ్యింది అల్లిక..
జతలో జావళీలు జోడు కలిసినందుకే
2950. నిలువరించలేని ఆశలు..
అలలను ఆదర్శంగా తీసుకొని నింగికెగుస్తూ..
..................................... ********.....................................

ద్విపదాలు : 2851 నుండి 2900 వరకు

..................................... ********.....................................

2851. విషాదాన్ని నటిస్తున్న హృదయం..
నవ్వితే నువ్వు దూరమైపోతావనే..
2852. ఎండిపోయిన నిజం..
కన్నుల్లో నీరింకి బయటకు పోలేక..
2853. గడియారమ్ముల్లులా నీవు..
నిముషాలనీ గంటలనీ సమన్వయం చేస్తూ..
2854. పెనవేస్తున్న నీ భావాలు..
మనసును పూదోట చేసేస్తూ..
2855. కులుకులు నేర్చిన కళ్ళు..
నిన్ను చదివిన ఆనందంలో..
2856. వెన్నెలకి తెలిసిపోయింది..
నిట్టూర్పుల సెగలో విరహం కాలిపోతుంటే..
2857. తడియారని బుగ్గలపై పెదవుల మండిపాటు..
నువ్విచ్చే కానుకలను నడుమనే కాజేస్తున్నాయని..
2858. మబ్బేసిందని గమనించనట్లున్నావు..
చీకట్లో నన్ను మరుపుతీగని మాయచేస్తూ..
2859. నవ్వులనావలోనే నేనొచ్చా..
విరహమై నాకోసం నువ్వెదురు చూస్తుంటావని..
2860. మరలిపోతున్న కలలు..
రాతిరంతా నేను కన్నులు మూయకుంటే..
2861. మౌనవించిన కోరికలు..
కదిలిన కన్నులు హృదయాన్ని బయటేస్తాయని..
2862. చిగురించానని గమనించలేదా..
నీ మనసు పచ్చిగా మారినా..
2863. పూజలు పుట్టింట్లోనే వదిలేసాను..
నట్టింట్లో నిన్ను ఏడిపించరాదనే..
2864. కట్టుబట్టలతో వచ్చేసాను..
ఆకట్టుకున్న నువ్వు అవమాన పడరాదనే
2865. గోలరాణిగా మారిపోయా..
నీ గుండేచప్పుళ్ళకు లయగా ఒదిగిపోవాలనే..
2866. అమాయకమవుతున్న పెదవులు..
సమానమైన ప్రేమను నుదుటికి పంచలేక..
2867. పులకింతల కానుకలు..
నీ తలపులు మల్లెలై పెనవేసాయని..
2868.
జారిపోతూనే ఉన్ననెందుకో..
ప్రేమలేపనం అనుకొని ఆముదాన్ని పూసుకొచ్చిందుకేమో
2869. వీడని బంధమై ముడిపడిన లతలు..
తీవెలోని బలమంతా వలపుగా కట్టేస్తూ..
2870. అహరహం పెరుగుతోంది నాలో విరహం..
వాడిన నవ్వుల పువ్వులే సాక్ష్యం.
2871. మునిపంట పూస్తున్నాయి..
వివశాల జలదరింపులు..
2872. పులకాంకురాలకే తెలుసేమో..
 వలపు పండించే ఎర్రదనాల నొక్కుళ్ళు.
2873. ఆనందహేలెందుకో తనువంతా..
ముద్దులు పంచుకున్నది పగడాల మోవైతే..
2874. నువ్వో మరువాలవాన..
నేనో పరువాలజాణనై ముసురుకున్న వేళ..
2875. నేను మీ ఊరెళ్ళిపోదామనుకున్నా..
నువ్వలా పొలిమేరలో విడిచేస్తే..
2876. మనసు నందనవనమైంది..
పారిజాతాలతో సంకెళ్ళు వేసిన సునిసత్వానికి..
2877. కురిసినప్పుడే అనుకున్నా..
సంపెంగి భావాలేవో గుట్టుగా తాకాయని..
2878. మోసినప్పుడే అనుకున్నా..
అంతరంగం తేలికయ్యిందని..
2879. జీవనరహస్యాన్ని తెలుసుకున్నా..
పూర్తిగా నష్టపోని ప్రయాణపు పొలిమేరల్లో..
2880. మోమాటపెడతావెందుకో బుగ్గల్ని..
అక్కర్లేని సిగ్గుల్ని అంటించి కవ్విస్తూ..
2881. మరుదివ్వెలా మారింది మనసు..
మల్లెకొమ్మవంటి మేనుకు అల్లుకోగానే..
2882. పోరాటం సెగలు రేపినందుకే..
ఆరాటం హుద్దులు చేరిపేస్తూ..
2883. విరులనే ఆవిరులు చేస్తావు..
ప్రేమసందేశాన్ని నేర్పుగా నాకందిస్తూ..
2884. స్వప్నాలకు సల్లాపాలు..
నీ చిరునవ్వులే స్వరాలై స్పర్శిస్తుంటే..
2885. మధురగీతం పెదవినంటింది..
అలవోకగా హృదయరాగాన్ని నువ్వు పంచినందుకే
2886. విచిత్రమే నేటి జీవనం..
వైవిధ్యం కోసం పోటీలు..అస్తిత్వం కోసం అసంతృప్తులు..
2887. పల్లె పట్టుకొమ్మ అరిగిపోయింది..
పట్నానికి యువత వలసపోతుంటే...
2888. ఆత్మవిమర్శతో ఆపేసా..
ఆనందానికి ఆవేశం అడ్డు రాకూడదని..
2889. ప్రేమ పరిఢవిల్లింది..
సరికొత్త పంధాల్లో జీవనమార్గాలు వెతుక్కుంటుంటే..
2890. అధికమవుతున్న కేరింతలు..
వ్యాపించిన ఆందానికి పుష్పించిన మాలికలు..
2891. ప్రియమైన స్నేహం..
పదాల పొందులో వికసించిన పుష్పం..
2892. రసానందమంతా నాదే..
నీ చెలిమి చిలుకపలుకు సొంతమైనవని..
2893.  చెలిమి చేమంతయ్యింది..
పచ్చగా మనసులో నువ్వు చేరగానే..
2894. హేమంతానికి వేడి పుడుతోంది..
వికసితకుసుమమైన  నన్ను వరించిందుకే..
2895. గ్రీష్మం తప్పుకుంది..
చైత్రం రధమెక్కి ఊహలోకి రమ్మంటుంటే..
2896. ఆమడదూరంపేసా ఋతువులన్నింటినీ..
మనసైన నువ్వు ముద్దబంతిలా చేరావని..
2897. సరసిజవే..
విరిజాజుల ఊయలలో మోహాన్ని పెంచుతూ..
2898. మించిపోతోంది సమయం..
మునిమాపులకు రమ్మని పున్నాగులు సందడిస్తుంటే..
2899. రేరాణిగా మాయచేసా..
మలి సంధ్యకే వెన్నెలగంధాలు పూయించి..
2900. గిలిగింతల గీతలతో నన్ను మైమరపిస్తావు..
తనువు కాగితంగా మారి చేరువైనందుకేమో..

..................................... ********.....................................

ద్విపదాలు : 2801 నుండి 2850 వరకు

..................................... ********.....................................
2801. నీ సంబరం తెలుస్తోంది ఎర్రగా..
ఆమె పెదవుల్లో పూచిన పువ్వులా..
2802. హృద్గుహ నిండా పొగలే..
దేహయాగం శాంతించేదాకా తప్పదేమో..
2803. సరికొత్త సేద్యం మొదలెట్టా..
భావాల పువ్వులు పూయించాలని..
2804. నిరాడంబరమైపోయా..
వెన్నెలదారిని కనుగొని నడుస్తున్నందుకేమో..
2805. అంతరంగాన్ని చింతాక్రాంతం చేసుకుంటావెందుకో..
వాగ్దాన విత్తనం మొలకెత్తనివ్వక..
2806. ముగియకున్నాయి అంతరాలు..
మకిలిపట్టిన అంతరంగాల్లో..
2807. నిశ్శబ్దాన్ని నాలోనే దాచుకున్నా..
విరహం మువ్వై మోగరాదని..
2808. రహస్యమైపోయిన కలనే నేను..
కలతను సమాధి చేయలేక..
2809. అనురాగాల కోయిలమ్మనే..
నీ తలపు వసంతమై నన్నావహించాక..
2810. తొలిపొద్దు వెన్నెల ముసుగేసుకున్నట్లు ఆకాశం..
నీ ప్రేమలో విలీనమైన నేనులా..
2811. తొలిముద్దు తేనయ్యింది..
చెలి ఊహించని గమ్మత్తైన మైమరపులా..
2812. నా కలాన్ని పెదవికి తాకించినందుకేమో..
ఊహించని పదును నాలుక సొంతమయ్యింది..
2813. నేనే ఆకాశమైపోయా..
మబ్బు పట్టిన కన్నులకు హరివిల్లువయ్యావని..
2814. కన్నీటిని సాగనంపేసా..
అడక్కుండానే చేతిరుమాలు బుగ్గలకు అరువిచ్చావని..
2815. ముసుగేసుకున్న ముఠాలెన్నో..
ధనం కోసమే ప్రాణాలనూ హరిస్తూ
2816. నేనే నువ్వైపోయా..
నా ప్రతిరూపాన్ని నువ్వు వలచావనే
2817. మనసు వయసును మరచిందిగా...
వెన్నెల్లో కాస్త కరిగిపోయిందని..
2818. ముసుగు తొలగిన వర్తమానాలను..
జ్ఞాపకాలను గొంతుకు ముడివేస్తూ
2819. అందం గుబాళిస్తోంది..
మేలిముసుగును దాటి మనసులు దోచేస్తూ
2820. మానవతా పరిమళం విరజిమ్ముతోంది..
ముసుగు వేయని దేహమనుకుంటా
2821. వెన్నెలైన దిగులుకే తెలుసు..
నిశ్శబ్దంలో మునిమాపుల నవరాగాలు..
2822. మనమెప్పుడో నువ్వయ్యా...
నీలో నే కరిగి ఒక్కటయినప్పుడే..
2823. మోసపోవడం అలవాటయ్యింది..
మార్చే ముసుగు రంగులకూ ముచ్చటపడినందుకు...
2824. మకిలి పడుతున్న అనుభవాల దర్పణం..
ముసుగేసిన అంతరంగాలు అర్ధమయ్యే కొద్దీ..
2825. కన్నుల్లో కొలువుండమన్నా..
కన్నీటికి చోటివ్వరాదనే..
2826. జీవితాన్ని ప్రతీకోణంలో చూడాలనుకున్నా..
చేదుకల్పనలే బాగుంటాయని మరచి..
2827. చొరవెక్కువే నీ చూపులకు..
చిత్తరువనుకొని అనిమేషంగా చూసేస్తూ..
2828. దాహం తీర్చలేదందుకే..
నన్ను నాకు కాకుండా చేసేస్తావని..
2829. నీ తలపుల పదునెక్కువే అనుకుంట..
నిన్న హృదయం కోమాలోకి వెళ్ళొచ్చింది..
2830. పాదరసంలా కరిగించేస్తావు..
వెన్నెల మంచుబిందువుల్ని రాల్చినట్లు నన్నేమార్చి..
2831. ఏనాడు కలలో కన్నావో..
గుర్తుపట్టలేనంతగా నన్ను చిత్రిస్తూ..
2832. మళ్ళీ శిశిరమే కానుకిచ్చావు..
నేనాశించేది వసంతాన్నని తెలిసినా
2833.
పలకరిస్తున్న కొన్ని జ్ఞాపకాలు..
మౌనాన్ని మానేసి మేలుకోమంటూ
2834. రాతిరికెంత సంబరమో..
మరందాలమోవిని గ్రోలేందుకు..
2835. తొలి వలపుకెన్ని తొందరలో..
అనుభూతులు ఎదకు పంచేందుకు..
2836. కమ్మనికలలు నీ వరమనుకున్నా..
రేయింబవలూ నువ్వే వస్తుంటే..
2837. నేనో మెరుపు..
నువ్వో ఆకాశమైతే..
2838. ఊహలమేనా ఊగుతోంది..
నీ తలపు మాధుర్యం ఎక్కువయ్యే..
2839. పున్నమిని పూసుకొచ్చావెందుకో..
పరవశాన్ని అంటగట్టేందుకు..
2840. చిగురించిన ఎండుమొక్కని తదేకంగా చూస్తున్నా..
మళ్ళీ వసంతమొచ్చిందంటే నమ్మకం కుదరలేదనే.
2841. కంటికి దూరమైన నిద్ర..
కనుకొలుకుల్లోనే జాలిగా సంచరిస్తూ..
2842. జీవన వైవిధ్యమదే మరి..
అర్ధంకాని చివరి మజిలీలో..
2843. కరుగుతోంది రేయి..
పంచుకున్న భావాలు వెన్నముద్దలై ఒదుగుతుంటే..
2844. ఎదురీదక తప్పదు జీవితంలో..
తీరాన్ని గెలిచి చూడాలంటే..
2845. మౌనవ్రతాలు చేయడం మానుకున్నాను..
నిన్ను గాయపరచి నొప్పించలేకనే
2846. ఆ చందమామ చిక్కినా అందమేననుకున్నా..
 నన్ను నెలవంకతో నువ్వు పోల్చినప్పుడల్లా..
2847. అల్లరవుతున్న నా వలపులు..
అమాయకమైన నీ మాటల్లో..
2848. జ్ఞాపకాలు వీడి పోవద్దనుకున్నా..
జీవితాన్ని హృదయంతో దర్శించలేననే..
2849. పెదవులనవసరంగా నవ్వాయి..
గులాబీలను వదిలి నీవు ముళ్ళను తాకుతావని తెలియక..
2850. కనుకొలుకుల్లో నిలిచిన నీరు..
ఎడారిలో దారితప్పిన యేరులా..
..................................... ********.....................................

ద్విపదాలు : 2751 నుండి 2800 వరకు

..................................... ********.....................................


2751. నీ చూపొక్కటీ చెప్పేసిందిలే..
నా క్షేమాన్ని కాంక్షిస్తున్నావని..
2752. నిన్నటికి నువ్వో అతిథివే..
నేటికి నాకు ఆధారమైపోతూ..
2753. నాలో నేను..
అనురాగంలో మమేకమైపోతూ..
2754. ఆనందభాష్పానివే..
సంతోషానికి పుట్టి సమ్యోగంలోనే ఆవిరైపోతూ..
2755. మౌనాన్ని సాగనంపమంటున్నా..
రసమయ సరసాక్షరాలతో సావాసం చేయిద్దామని..
2756. నీ కన్నుల్లోనే దాగాలనుంది నాకు..
భాష్పమై రాల్చినా ముత్యమై మెరుస్తాననే..
2757. విసిరేసా విరహాన్ని..
శూన్యాన్ని పరిచయించి మౌనాన్ని మోహిస్తోందని
2758. లక్ష్యం మరచిన ఆశ..
నిలకడలేని నిర్ణయంలో కొట్టుమిట్టాడుతూ..
2759. ధవళ మందహాసం..
వెన్నెల నీ పెదవులను అలంకరించినందుకే..
2760. మనోదర్పణం మెరిసేదప్పుడే..
నిజమైన నేస్తాన్ని మనసు గుర్తించినప్పుడు..
2761. నీ గుండెచప్పుళ్ళే..
నా పెదవులపై నర్తించే స్వరాలవెల్లువలు
2762. ఎదురుచూపుల తొందరలు..
నీ రాకకై నన్ను గిలిగింతలుపెడ్తూ
2763. చూపులన్నీ చిత్రాలయ్యాయి...
నీ కనుల్లోని కిరణాలు సోకినందుకే..
2764. సంపెంగ సువాసనతోనే తెలిసింది..
నీ పరిమళాన్ని వియోగంతో మిళితం చేసి వెళ్ళావని...
2765. శిల్పముగా మారిపోవాలనుకున్నా..
అక్షరమవసరం లేకనే గుర్తించేవారు కొందరుంటారని..
2766. కవిత్వమంటేనే కోయిల కూజితం..
వసంతానికై వేచి చూసే అరమోడ్పుల ఆమని ఆరాటం..
2767. మూర్తీభవించిన వాస్తవమే నీవు..
మౌనరాగపు సమ్యోగంలోని శూన్యంలా..
2768. ఎన్ని వర్తమానాలు ఉరకలెత్తాలో..
రేపటి దీపావళి వెలగాలంటే..
2769. పువ్వువని గుర్తించానది చాలదా...
అక్కర్లేని అసంతృప్తిని మోయడమెందుకు..
2770. పెదవులు పలుకలేని బాసలే కొన్ని..
నా చూపులతోనే కబురంపా నిన్నందుకోమని..
2771. మనసు ఆదేశించినందుకేమో..
మౌనం కరిగి కన్నీరై ప్రవహిస్తూ..
2772. మందారాలు గుర్తుకొచ్చాయి..
సిగ్గుపడ్డ బుగ్గలు సొట్టలు పడ్డప్పుడల్లా..
2773. మరుమల్లె నవ్వుకే మైమరచిపోతున్నా..
నిన్ను జ్ఞప్తికి తెచ్చిందనే
2774. మనసుకదేగా మైమరపు..
అనుభూతిని ఊహాల్లో నింపుకొని ఆనందించడం..
2775. చినుకై కురిసింది వెన్నెల..
నిశీధిని నిలువెల్లా తడపాలనే..
2776. నిజం ఇజంలో మగ్గుతోంది..
అబద్దం ప్రవచనం చేసొస్తుంటే..
2777. పున్నమి వెన్నెలైనా వేడెక్కాల్సిందే..
నీ మాటల ఇంద్రజాలానికి..
2778. తీరమెరుగని పయనమే..
నిండుగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతూ..
2779. విషాదమైన నా వియోగమే..
వసంతంలోనూ గ్రీష్మాన్నే స్మరిస్తూ..
2780. వెన్నెలతునకనై నీదరి చేరానందుకే..
మదిలోని నిశీధిని తరిమేయాలనే..
2781. నీ హృదయం ఆల్చిప్పై ఆదుకుంది..
నీటిబొట్టును ముత్యంగా మార్చి మెరిపిస్తూ..
2782. చంద్రోదయాన్ని మరచినట్లున్నావు..
నా కన్నుల్లోకి తొంగి చూడలేదని..
2783. రాయినైన నన్ను జవరాలిగా చేసావుగా..
నీ ఊపిరితో నాలో ప్రాణంపోసి..
2784. ఓడిద్దామని వచ్చానంటావే..
మాలికలతో మురిపిద్దామని నిద్దుర మానుకున్నందుకేనా...
2785. ఒక్కక్షణమే..
కూడుకున్న వాటిని తీసివేతలుగా మార్చగలదు..
2786. సందేహమవసరమే లేదు..
వీడలేని చిక్కుముళ్ళై సమస్య చుట్టుముడుతుంటే..
2787. తరలిపోయే ఆనందాలెన్నో..
మధురక్షణాలను వేళ్ళపై లెక్కిస్తూ కూర్చుంటుంటే
2788. వక్రభాష్యాలెన్నో..
అర్ధాలకే నానార్ధాలను వెతికేస్తూ..
2789. కలభాషిణిగా మార్చేసావు..
నీ ప్రతికధలో నాయికగా మార్చేస్తూ..
2790. శృతి చేసిన రసధునివయ్యావుగా..
నే రాసిన ప్రతిపాటలో నువ్వే పల్లవిగా మారి..
2791. వెన్నెలకే గుబులు పుట్టిస్తావు..
అమాసలన్నీ పున్నములుగా మార్చేస్తూ..
2792. కావ్యాలంకారమైపోయా..
నీ ప్రతిస్పందనలో నే నిండిపోయినందుకేమో..
2793. నిన్నల్లో ఆగిన కల..
రేపటిని ఊహించనివ్వని వర్తమానంలో..
2794. పూటకో వేషం తప్పదేమో..
ఆనందాన్ని అనుక్షణం తూచాలనుకుంటే..
2795. మౌనపంజరంలో ఎన్నాళ్ళుంటావో..
శిశిరమెళ్ళి శరత్తును నీకు విడిచిపెట్టినా
2796. మణిమాలికతోనే ఆపేసావెందుకో..
నవలగా నన్ను రాస్తావని ఎదురుచూస్తుంటే.
2797. సందడి చేస్తున్న కలలు..
రాతిరైతే నీలో నర్తించాలని..
2798. ప్రేమ గుడ్డిదంటూ నా వెంటపడ్డావుగా..
ఇప్పుడు మూగగా మారానని వేదనెందుకు..
2799. నా బుగ్గలకి సొట్టలెందుకో..
నవ్వింది నీ పెదవులైతే..
2800. సాయంత్రపు సూర్యుడిలా సంకటమెందుకు..
తిరిగి రేపు ఉదయిస్తావుగా..
..................................... ********.....................................

ద్విపదాలు : 2701 నుండి 2750 వరకు

..................................... ********.....................................
2701. మకరందమైన సంతోషాలు..
మదిలో సుధలు నీవల్లనేనని తెలిసాక..
2702. పారవశ్యమే మనసుకు..
సారసపు విద్యలన్నీ నాకే పంచావని..
2703. మోహించలేకున్నా మౌనాన్ని..
నీరవంలోనూ నా నవ్వులు నెలవంకలవుతుంటే..
2704. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి..
అల్పమైన సిద్ధాంతాలకు నీరొదిలేస్తూ..
2705. నల్లపూసగా మారిన ముత్యానివేమో నీవు..
కన్నీటిలో తప్ప కంటికి ఆనకుండా..
2706. కమనీయమవుతున్న కలలు..
రాత్రికోసం పగలంతా నే వేచివుండేలా..
2707. ఇంద్రధనసు గురించి చెప్పినప్పుడే అనుకున్నా..
సరికొత్త వర్ణాలు పులుముకొనేందుకు ఆశిస్తున్నావని..
2708. తిరిగొచ్చిన వసంతాలు..
హేమంతంలో వెచ్చనైన నీ పలకరింపులు..
2709. ఊహలన్నీ దొంగిలించినవే..
ఊసులు మాత్రం రేయింబవళ్ళను మరిపిస్తూ..
2710. వేసవి వెనుదిరిగింది..
చిరుజల్లువై నన్ను ప్రేమగా ముంచెత్తాక..
2711. వెన్నెల రోజంతా కాసినట్లుంది..
ఆనందరాగం కలిసి ఆలపిస్తుంటే...
2712. భావధారలో తడిచిపోతున్నా..
నువ్వు రాసేదంతా కవిత్వమని భావించినందుకే..
2713. సశేషంగా మిగిలే జీవితాలు కొన్ని..
చచ్చినట్లు బ్రతుకుతున్నా పూర్తిగా చనిపోలేదంటూ..
2714. తడియారని హృదయాలు..
సమ్మోహన జలపాతాల నిరంతర ప్రవాహాలలో..
2715. గమ్యమెరుగని పయనం..
అపస్వరమైన జీవితాన్ని శృతిచేసుకోవడం తెలియక..
2716. మండిస్తుంది గతం అప్పుడప్పుడూ..
కుదుటపడ్డ భావోద్వేగాలను పరీక్షించేందుకేమో..
2717. అభిమానాన్ని కాపాడుకోవడం తప్పదుగా..
అవమానం జరగకుండా ఆపాలంటే..
2718. కలం కదిలి కవితయ్యింది..
కాలాలూ గాయాలూ మరపించేలా..
2719. ఊహల ప్రపంచం పిలిచినట్లుంది..
ప్రాణమయ్యి నువ్వలా రమ్మంటుంటే..
2720. మరపురాని నీ జ్ఞాపకాలు..
వెన్నెల్లో దోబూచులాడే క్రీనీడలు..
2721. లోకువయ్యా నీడకి సైతం నేడు..
నిన్నటిదాకా నావెంట నిన్ను తిప్పుకున్నందుకు...
2722. అనుసరిస్తున్న అమాసవనుకోలేదు..
నీడల్లోనే నువ్వు మాయమయ్యే వరకూ..
2723. నీలినీడల వెతుకులాటెందుకు..
తోడునై నీ వెంట లేనా..
2724. తడబడుతున్న అడుగులు..
నీడలమెట్లను అధిరోహించడం సాహసమని మరచినందుకు..
2725. నీలికన్నులు నల్లబడ్డాయి..
కృష్ణపక్షపు నీడలు నువ్వు కానుకిచ్చాక..
2726. మంచుబిందువులే నీ ఊహలు..
నిశీధినీడలపై పన్నీరు చిలకరిస్తూ..
2727. వెలిసిపోయిన నీడనే..
అమాయకంగా నిన్ననుసరించి..
2728. నీ నీడకూ అనుమానమేనేమో..
నిద్దట్లోనూ నన్నులికిపాటుకు గురిచేస్తూ..
2729. నీడకూ నిద్దరొచ్చింది...
వెలుగు కిరణమై నువ్వు వాటేసాక..
2730. రాతిరి ఒంటరిదయ్యింది..
మన ఊసులు కరువైన వెన్నెలదారుల్లో..
2731. సందేహాలే నీ మనసుకెప్పుడూ..
నిశ్శబ్దగతులలో అడుగులేసి తడబడుతూ..
2732. కురుస్తోందందుకే వెన్నెల మనపై..
మదిలో విరిసిన పువ్వులబంతిలా..
2733. ఆనందోత్సాహాలు నా మనసుకి..
నన్ను పాటగట్టి పాడావని
2734. తంగేడుపువ్వుల తుళ్ళింతలు..
బతకమ్మ ఆటపాటల్లో చోటు దొరికిందని.
2735. రాయలేని భావమేదో మిగిలున్నట్లుంది..
నీ మౌనాన్ని అనువదిస్తుంటే..
2736. నీ జ్ఞాపకాల వెల్లువ చాలేమో..
నన్ను నిలువెల్లా సంతోషంలో ముంచేందుకు..
2737. ఎదురుచూపుకు వెలుతురులేనేమో..
సిరివెన్నెల పంచే నీ కన్నులు..
2738. నీవింకా కలల్లోనే..
కేరింత కోసం నన్నెదురు చూడమంటూ..
2739. నా ప్రాణం నిలబెట్టావు..
నీ మరణానికి నే కారణం కాదని వివరించి..
2740. కలల కనుగప్పావెందుకో..
కల్పనను జోడించి కావ్యం చేస్తాననేమో..
2741. భావాక్షరాలుగా మిగిలిన కలలు..
వాస్తవంగా మారలేని నిస్సహాయతలో..
2742. ప్రశ్నావళివే..
జవాబులేని సందేహాన్ని నాకు విడిచిపెట్టేస్తూ..
2743. జ్వరమంటున్నారందరూ..
నా నిశ్వాసలు వెచ్చగా బయటపడుతుంటే..
2744. దిగులంతా మటుమాయమే..
నీ మాటలు చందనాలై పరిమళిస్తుంటే..
2745. నిద్దురలేచిన భావుకత్వమేదో..
నిన్న లేని అందంలా నాలో.
2746. సింధూరపువ్వని భావించినందుకేమో..
రెక్కలు రాలి మిగిలింది సాయంత్రానికి..
2747. వలపు సుమగంధం..
అలసిన మనసుకి అనురాగం అలదేస్తూ..
2748. నిన్ను నీకు కొత్తగా పరిచయించాలనుకున్నా..
చెలినై నీ గుండెలోనే దాగుండి..
2749. అందం అరుణిమవుతోంది..
నీవలా భావుకత్వంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..
2750. రాద్ధాంతం తగ్గింది..
సిద్ధాంతం పట్టుబడ్డాక..
..................................... ********.....................................

ద్విపదాలు : 2651 నుండి 2700 వరకు

..................................... ********.....................................
2651. వాస్తవాన్ని అతికినట్లుంది..
విరిగిన కలల్ని పోగేసి కలుపుతుంటే..
2652. చేవ్రాలు చేసేసా ఆనాడే..
నన్నచ్చెరువుగా నువ్వు మార్చేసినప్పుడే..
2653. ఎడారిలో ఒదిలేసావెందుకో..
రాళ్ళల్లో..ఇసుకల్లో మనపేర్లే ఉన్నాయంటూ...
2654. హంసనని గుర్తించావు..
ఇట్టే హింసపెట్టక జీవితాన్ని ఆస్వాదించు..
2655. భవిష్యత్తును రాసిపెట్టుకున్నా..
ఈనాడు దిద్దుకున్న అక్షరాలను అనుసరించాలనే..
2656. అల్లుకుపోయిన పేర్లలో నాదొకటి..
ఇసుకలో మసకగా కలిసిపోతూ..
2657. అలలా ఎగిసిన పేరంట..
కెరటాన్ని చేరగానే మాయమవుతూ..
2658. మౌనంగా దూరం జరిగానందుకే..
నా తనూగంధాన్ని కాజేస్తావనే..
2659. చెమరింతలపర్వం రాసేసా...
నీ బాహువల్లరిలో పులకింతలు పోగేసి..
2660. మానసవీణ మొదటిసారి మోగింది..
నీ కనుసైగకు స్పందించినందుకే
2661. అపురూప హృదయసవ్వడే నీది..

గతజన్మను తిరిగి మేల్కొల్పినట్లు..
2662. వెన్నెల్లో తిరుగుతావెందుకో..
చుక్కల మాటున దాగున్న నన్ను వెలికి తీసేందుకు..
2663. పైపై నవ్వులొద్దంటున్న మనసు..
చాచిన దోసిలింకా నిండలేదంటూ..
2664. సశేషమవుతున్న విశేషాలు..
నీ నిర్లిప్తతలో మనసు కుచించుకొని
2665. ఆరని మనసుతడి..
గోరువెచ్చని జ్ఞాపకాలు కొన్ని అనుసరిస్తుంటే
2666. నమ్మలేకున్నా...
కాటుకంత నిజాన్ని నిజాయితీగా నువ్వొప్పుకున్నా..
2667. మాట మౌనమవుతోంది..
మంత్రమై రాలే కన్నీటిబొట్టును ఆపలేదనే..
2668. అనామికగానే మిగిలిందామె..
తనను మనసునుండీ వేరుచేసి ఒంటరయ్యాక..
2669. శిశిరశరత్తును ఊహించినట్లున్నావ్..
హేమంతంలో వసంతాన్ని గురించి మాట్లాడుతూ..
2670. నేలకు జారింది నా మది..
ఆశకు రెక్కలు తొడిగినా నన్నందుకోలేవనే..
2671. నిద్దుర కరువవుతోంది..
కలలను కనలేని నా కనులను వెక్కిరిస్తూ ప్రతిరాత్రీ..
2672. మొలకెత్తిన ఆశలు కొన్ని..
నీ ఊసులను హత్తుకుంటూ..
2673. నీలికోకను కట్టుకున్నా నీకోసమే..
ఆకాశమని తలచి నన్నల్లుకుంటావనే..
2674. పడమటిసంధ్యారాగాలు..
ఎండావానలు కురవకుండానే ఆమె పెదవుల్లో విరిసిన వానవిల్లు..
2675. నిర్మలానందమవుతోంది మనసంతా..
నీ మౌనంలో ధ్యానంగా నన్నావహించావనే..
2676. పగలు రాక మానదుగా..
పొలిమేర దాటాడు సూరీడని..
2677. చిటికెల పందిరిలోనే కూర్చున్నా...
తలపులొస్తే తలుపు తీసుంచాలనే..
2678. శిధిలమవుతున్న జ్ఞాపకాలు కొన్ని..
తడుముకొనే తీరికలేక వలసపోతూ..
2679. గతాన్ని గోతిలో పూడ్చేయాలి...
ఒక్కసారి రాలిన పచ్చదనం తిరిగి చిగురించడం అనివార్యమని...
2680. నిప్పుని ముట్టుకోవడం మానేసానందుకే..
అరచేతిని కాల్చి మండిస్తుందని..
2681. ఏడడుగులేసి ఆరునెలలయ్యిందిగా పాపం..
ఒకరిదారి మరొకరయ్యారేమో తెలివిగా..
2682. సింధూరమందుకే దిద్దుతున్నావేమో..
నొసలు దాటి మనసును చూడొద్దని..
2683. అక్షరాలు అలుక్కుపోతున్న భావన..
రాయాలనుకున్నది కలానికి అందక..
2684. అల్లిబిల్లి పదాల అల్లరులు..
తమనే ముందు రాయమంటూ ఉరకలెత్తే ఉత్సుకతల అలుకల్లో...
2685. మనసిప్పుడే వయసుకొచ్చినట్లుంది..
సమన్వయం కుదరని యుద్దానికి తెరతీస్తూ..
2686. చెలిమిని దిద్దుకున్నా అక్షరంతో..
లేపనం అక్కర్లేకనే గాయాన్ని మాయం చేసే నేర్పుందని..
2687. ముభావమే భావమయ్యింది..
ముత్యాల పల్లవికి చరణంగా చేకూరావని..
2688. నిశ్శబ్దంగా పోటెత్తింది మౌనం నాలో..
నీ రుధిరాన్ని చూసి నేర్చుకున్నట్లుంది..
2689. పెనుచీకటొకటి చెదిరింది..
వెన్నెలవై చేయందించావనే..
2690. అర్ధంకాని మనస్తత్వాలు ఎన్నో..
అసంపూర్ణభావాలతో అమాయకత్వాన్ని నటిస్తూ..
2691. పరిక్ష పెడుతున్న సమయం...
నిన్ను చేరేలోపు కదిలిపోతూ...
2692. నీ మాటే మంత్రమై పనిజేస్తోంది..
ఏ మంగళవాద్యాన్ని మిళితం చేసినందుకో...
2693. నేనే నువ్వయినట్లుంది..
నీ మాటలు మాత్రమే ఆలకిస్తూంటే నా మనసు..
2694. రహస్యమవుతున్న జీవనం..
వాగ్దానానికీ వాస్తవానికీ మధ్య ఇమడలేక
2695. చల్లదనం సరిపోయింది..
మట్టికుండవైనా తీయదనాన్ని ఆసాంతం పరిరక్షిస్తూ..
2696. మది ముక్తినొందింది..
వెతలకు వీడ్కోలిచ్చాక..
2697. సంధ్యారాగం శాశ్వతం అవుతానంది..
రాతిరిరంగును కెంజాయకి అద్దలేనంటూ..
2698. పచ్చదనం పూస్తున్నా క్షణాలకి..
మళ్ళీ మొలకెత్తే ఆలోచనలందిస్తూ..
2699.  అమరస్వరాలవుతున్న సరిగమలు..
నీ పెదవులమీంచీ నాలోనికి ప్రవహిస్తూ
2700. అధరాల మెరుపులు..
నీ వలపు పిలుపులకు వంతపాడుతూ..

..................................... ********.....................................

ద్విపదాలు : 2601 నుండి 2650 వరకు

..................................... ********.....................................

2601. అనుకోని వసంతమే నీవు..
ఎదురుచూడని కూహూల జడివానలా..
2602. జావళీలుగా మార్చేసుకున్నా జ్ఞాపకాలను..
విరహంలో వేసారక పాడుకోవాలనే..
2603. కనుగీటుతావనే చూస్తున్నా..
నీ చూపును అనుసరించి వచ్చేద్దామని..
2604. చూపుల చేవ్రాలును పోల్చుకున్నా..
నీ ఆనందాన్ని అంచనావేస్తూ..
2605. అలలా ఎగిసిపడుతున్న ప్రేమ..
ఆరుకాలాలూ నీతోనే జీవితమంటూ..
2606. గుండెచప్పుడు గుట్టువిప్పింది..
నీ తలపులకు మాత్రమే కొట్టుకుంటున్నానని..
2607. బోడిలింగంలా ఎదురవుతావెందుకో..
శివాలయానికి  బయలుదేరాలని నే ముస్తాబవుతుంటే..
2608. భావకుడివనుకున్నా..
నా పక్కన కలలో మరో కధానాయికుడ్ని కూర్చోపెడితే..
2609. అరుణరాగాల కువకువలు..
చెక్కిలిగుంటల మెత్తదనంలో చోటు దొరికిందని..
2610. గోరంతగుండె కావలనంటే ఇచ్చాను..
గోటికి రంగేసి నచ్చలేదంటూ పదిసార్లు తుడిచేస్తావని తెలియక..
2611. పరిష్కారం లేని పరిహారాలు..
అంతకుమించి వెలకట్టలేని నిరుపేదదేహాలు..
2612. హృదయానికెందుకో గలగలలు..
చిగురించిన ప్రేమ నువ్వింకా ఆమోదించనిదే..
2613. వసంతాన్ని శిశిరమని భ్రమిస్తావే..
హేమంతంలో నిలబడి చూసినందుకా..
2614. కూజితాలు చేయొద్దన్నానందుకే..
నలుగురూ నిట్టూర్చి నోళ్ళు నొక్కుకుంటారనే..
2615. ఇంద్రధనస్సును బాగా ఔపాసన పట్టినట్టున్నారు..
నచ్చిన రంగులు మెచ్చినట్లు పూసుకుంటూ..
2616. ఏమార్చడం చాతనైన మనసనుకుంటా..
ఏ మాత్రం మార్చలేవు..
2617. పట్టు దొరికింది పల్లకీలోనే..
పరవశాలకి తెరలు అడ్డుపెడుతూ..
2618. మాలికల మార్గంలోకి రధం తిప్పానందుకే..
సంజీవనై తిరిగి ప్రాణం పోస్తుందనే..
2619. నిరీక్షణల్లోనే కరిగిపోతున్న క్షణాలు..
లెక్కకందని అనంతమైన శూన్యాలు..
2620. ఇరుకవుతున్న భావాలు..
మధనపడుతున్న మానవసంబంధాలలో..
2621. నేనో సంతకం చేయని ప్రేమలేఖనేగా..
నువ్వు పోస్టు చేయని ఉత్తరాలలో..
2622. మౌనమే మేలు..
కంఠంలో కొలువైన దుఃఖాన్ని దిగమింగేందుకు..
2623.  మౌనమే మేలు..
మనసు పరిభాషను అందంగా అనువదిస్తుంటే
2624. మౌనమే మేలు..
శారదరాత్రుల తీయనికలలను నెమరేసే ఏకాంతవేళ
2625. విరగ్గొట్టినప్పుడే తెలిసింది..
పదునైన నీ మాటల  మెత్తదనం..
2626. శూన్యాకాశంలోనే విహరిస్తావెందుకో..
మౌనానికి నానార్ధాలు వెతకడం కుదరదనేమో..
2627. నీ చూపులకెంత చొరవో..
గుచ్చుకుంటూనే గిలిగింతలు పెట్టేస్తూ..
2628. కృష్ణపక్షాన్ని తలవొద్దన్నానా..
శారదరాత్రుల కోలాహలానికి సంతోషంగా వెళ్దామని..
2629. చెమట విలువ తెలిసినవాడేమో..
నుదిటిరాతను అలవోకగా కడిగేసుకుంటూ..
2630. అన్నీ మధురభావాలే..
నీ మనసును చేరేసరికి మౌనవించేస్తూ..
2631. రేయి గడిచిపోతుంది..
మధురసంతకాల లెక్కలు తేలకుండానే ఏమిటో..
2632. రాతిరీ ఒంటరిగానే..
నీ వియోగాన్ని పాటగట్టి పాడలేక
2633. ఉరకలెత్తే ఉల్లాసమే నీ తలపు..
నిరంతరానందాన్ని మనసుకు కానుక చేస్తూ..
2634. దారి తప్పిన కలలు కొన్ని..
రాతిరిని విడిచి వేకువను వాటేస్తూ..
2635. నీ ఆలోచనల ఆనంద సవ్వడి..
నా హృదయానికి మధురమైన అలలజడి..
2636. విరబూసిన మనోవనం..
వెదురుపొదల్లోని వంశీనాదం నీలో కనుగొంటుంటే..
2637. తరంగమవుతున్న మనసు..
తేలియాడిన భావమేదో నువ్వు మేల్కొల్పుతుంటే..
2638. నాగరాజులా బుసకొడతావే..
విడిచేసే కుబుసమై అల్లుకున్నానని మరచిపోతూ..
2639. గుక్కతిప్పుకోని గుండెచప్పుడు..
నువ్వలా ఎదచేర్చి ఊసులను ఆలకిస్తుంటే.
2640. ప్రణయరాగాన్ని మిళితం చేసా పిలుపులో..
శూన్యం నుంచీ జీవితంలోకి రప్పించాలనే..
2641. చితిమంటేసావెందుకో చెలిమికి..
ఆవేదనా గ్రీష్మంలో ఆసరా కాలేదనా..
2642. వ్యర్ధవాదనలు..
వినేకొద్దీ మనసును అధోగతి పాల్జేస్తూ..
2643. రాలిన ప్రతిచుక్కనూ వేడుకుంటున్నా..
నే మనసుపడ్డ ఆశయాన్ని మాత్రం ఎగిరేలా చూడమని..
2644. పారవశ్యంతో మూతబడుతున్న కన్నులు..
నీ చేతిలో వీణగా నన్ను నేను మలచుకుంటూ..
2645. అశాంతిని పంపేసా..
ప్రశాంతంగా నిన్నూహించాక..
2646. నిన్నటి కల గుర్తుకొస్తోంది..
నేడు నీతో ఊసులాడుతుంటే..
2647. కరుగుతున్న కాటుకలు..
నీ నిరీక్షణలో నల్లని కన్నీటిబొట్ట్లుగా...
2648. ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకున్నా..
గెలుపోటముల నిర్ణయం దైవానికొదిలి..
2649. మమతలు దారిమళ్ళాయి..
మౌనాన్ని వీడని మనసులకు చేరువకాలేక..
2650. మౌనపురద్దీలో చిక్కిన మనసు..
నీరవంలో నీడనుచూసి ఉలిక్కిపడుతూ..
..................................... ********.....................................

ద్విపదాలు : 2551 నుండి 2600 వరకు

..................................... ********.....................................

2551. నెలరాజుదే ఆనందం...
దిగులుపడ్డ తారను వాటేసి ఓదార్చొచ్చని..
2552. మేఘాలు దాక్కోవడమేమిటో..
నీ నవ్వుకు రెక్కలొచ్చి ఆకాశమేగితే..
2553. నీ దిగులు వెన్నెలవడం తెలుస్తోంది..
తన తలపుకే పులకాంకురాలు మొలకెత్తుతుంటే.
2554. ఉపశమించని దిగులు..
మంచిముత్యాలనే చల్లగా ఎదపై అలంకరించినా..
2555. ఒత్తులు పెట్టడం మరిచావు అక్షరాలకి..
నీ ప్రేమను అపార్ధం చేసుకున్నానందుకే..
2556. దిగులెప్పుడూ నావైపే మొగ్గుతోంది..
సంతోషాన్ని నీపెదవులపై చేర్చేస్తూ..
2557. నువ్వు కలం పట్టిన మొదటిరోజే అనుకున్నా..
కాళిదాసునో శ్రీనాధుడ్నో అనుకరించే ఆలోచన చేయవని..
2558. దిగులుకీ శిశిరానికీ తేడా ఏముందిలే..
హృదయం పగిలినా ఎండినా బీటలేగా..
2559. అంటించినా ఆనందమేగా నీకు..
జ్ఞాపకం బూడిదై పరిమళించిందని..
2560. నీ భాషలోని సౌందర్యాన్ని వెతుకుతున్నా..
తెలిసిందే అయినా కొత్తకోణంలో ఆవిష్కరిస్తావనే..
2561. మనసపురూపమని తెలీనందుకేమో..
ఆరాధన వ్యర్ధమవుతుంది కొందరి జీవితాలలో..
2562. ఎన్ని అక్షరాలు వెతుకుతావో..
సౌందర్యపిపాసలో భాషలన్నీ నేర్చేస్తూ..
2563. అక్షరశిల్పాలెన్ని చెక్కావో..
ఉలి చేతపట్టకనే అద్భుత శిల్పివనిపించుకుంటూ..
2564. వెన్నెలెంత కరిగిపోయిందో..
మన చెలిమిలోని మాధుర్యానికి వెచ్చబడి..
2565. చల్లబడే విరహం కాదేమో చంద్రికది..
ఎంత పన్నీటిగంధాలు లేపనాలుగా పూసుకున్నా..
2566. కైదండలకై ఎదురుచూస్తున్న చంద్రిక..
కరాలఅల్లికలో సాంత్వన పొందాలని..
2567. మనసుతో మొక్కాల్సిందే మామను..
అనుభూతిని మహత్తరం చేసినందుకు..
2568. రెప్పల్లో దాచేసా రహస్యాలు కొన్ని..
కన్నుల చీకట్లలో సమాధి కావాలనే..
2569. నా నవ్వులసవ్వడెంత మెత్తనో..
నిశ్శబ్దానికీ సున్నితమైన భావమిస్తూ..
2570. నవ్వులు ఆకాశానికేగాయి..
నక్షత్రమాలగా మారి నిన్నలరించాలనే ఆకాంక్షలో..
2571. నవ్వులనపురూపం చేసేసా..
నీ అనురాగానికి మాత్రమే కానుకివ్వాలని..
2572. భాద్రపదమని మరచినట్లున్నావు..
పుష్యాన్ని ముగ్గుల్లో పూయించాలనే తొందరలో..
2573. క్షణాలను లెక్కిస్తున్నా..
నీ విరహంలో నత్తనడకలు మొదలెట్టాయని..
2574. రెప్పలను యవనిక చేసానందుకే..
మధురానుభూతులను కన్నుల్లోనైనా దాచుంచాలనే..
2575. ఏడుస్తున్నాను..
తిట్టావని కాదులే..ఆవిడ ముందు చిన్నబుచ్చావని..
2576. ధ్వంసమవుతున్న వాంఛలు..
అగాధమైన సాగరగర్భంలోకి మనసు చేరినందుకే..
2577. వెలుగుతున్న మోముపై మరకలను వెతుకడమే పని..
రహస్యంగా నీ శక్తిని ఆర్పేయాలనే ఆలోచనలో..
2578. మృత్యుసవాలునే ఎదిరించేస్తా..
ప్రతిజన్మలో కౌగిలిని శాశ్వతం చేస్తానంటే..
2579. పగటి పొలిమేర దాటిన నాగరికత..
రాతిరి రంగులను రుద్దుకొనే ఆరాటంలో
2580.  అరమోడ్పులవుతూ నీ కళ్ళు..
సగంసగంగా నన్ను చూపిస్తూ..
2581. బీజాక్షరాలుగా మార్చేసుకున్నా..
నీ పెదాలు ఇష్టంగా పలికే ఆ పదాలు..
2582. నా అక్షరమెరుపులేననుకుంటా..
నీ కన్నుల్లో వెలుగుతున్న ఆనందాలు..
2583. అంతర్నిహితమైన ఆలోచనలెన్నో నాలో...
అక్షరాల్లో అలవోకగా చేరిపోతూ
2584. మనసు నిండుతోందిలే..
అరనవ్వులే నీ మనసు విప్పుతుంటే..
2585. ఆనందరసార్ణవం చేసా కన్నులను..
నిన్ను కలువగా కొలువుంచుకోవాలనే..
2586. మౌనవించానందుకే..
జ్ఞాపకాల వెన్నెలను ఏకాంతంలోనే ఆస్వాదించాలని.
2587. సందేహాలపుట్టే దేహం చివరికి..
సౌందర్యాలెన్ని పంచినా జీవితానికి..
2588. అక్షరలాస్యాన్ని ఆస్వాదిస్తున్నా..
నువ్వలా చెక్కిలిని పత్రంగా చేస్తుంటే..
2589. అణువణువూ నీ జ్ఞాపకాలు..
నిత్యాభిసారికగానే నన్నుండమని శపిస్తూ..
2590. ముత్యాలపాటల్లో కోయిలమ్మనే నేను..
ఒక్క నీ పలకరింపుకే..
2591. వలపువాన కురవడం గమనించలేదు..
తలపుల్లో నిలువెల్లా కూరుకుపోయినందుకేమో..
2592. వెన్నుముక విరిగిన రైతులు..
ఉరికొయ్యన నిటారుగా వ్రేళ్ళాడుతూ..
2593. అదో ఆనందపర్వం..
కన్నీటిని తెప్పించి మరీ తుడవడం..
2594. వెతకడం మానుకున్నా నిన్ను పలుచోట్ల..
కన్నుల్లో శాశ్వతంగా కొలువయ్యావని తెలిసాక..
2595. తగిలీతగలని పూలబాణాల్లా నీ చూపులు..
ఏడుమల్లెల నా తనువును అల్లాడించేస్తూ..
2596. జక్కువపిట్టనై వేసారిపోతున్నా..
రాతిరైతే విరహానికి తోడు కళ్ళుకనపడక..
2597. తమకమైన జాబిల్లినే నేను..
నీ గమకానికి స్పందించేవేళ..
2598.  అమలినమైన ఆత్మ..
అవకాశావాదాన్ని తనకు పులమొద్దని వేడుకుంటూ..
2599. అక్షరదాహమెన్నటికి తీరేనో..
రసవాహినిలో రేయింబవళ్ళు మనసు తేలియాడుతున్నా..
2600. అసూయను తరిమేస్తే సరిపోతుందేమో..
మనసులో ప్రేమకిరణాలొచ్చి వెలిగేందుకు..
..................................... ********.....................................

ద్విపదాలు : 2501 నుండి 2550 వరకు

..................................... ********.....................................
2501. మమేకమేగా మనమిద్దరం..
ఒక్కరిలో ఒకరమై వీడని లోకమయ్యాక
2502. బాదంకాయలు తిన్నానని తిట్టబోకు..
నా పెదవులెప్పట్నుంచో ఎర్రనే..
2503. తొందరపడవద్దన్నా భావాలను..
నీలో తపన ఎంతుందో చూద్దామని..
2504. సరికొత్త దారుల్లో ప్రవహిస్తున్నట్లుంది రక్తం..
నా వియోగాన్ని కవిత్వంలో కలిపినందుకే..
2505. చెలియలకట్టవుదామనుకుంది చెక్కిలి..
కన్నీటిని కనుపాపల్లో నువ్వలా బంధించకపోయుంటే..
2506. ఆత్రేయుడివని ఒప్పుకుంటున్నాలే..
పున్నమినాడే సురుచిర ప్రణయభావాల్ని రేకెత్తించినందుకు..
2507. కృష్ణుడివో కాదోనని సందేహిస్తున్నా..
నువ్వలా దూరంగా నిలబడితే..
2508. నిజానుభవం కరిగిపోతోంది..
నన్ను చేరేలోపే నాని ఉన్నందుకు..
2509. అలజడిని తొలగించేసా..
అలలుగా మారి నీ హృదిలో మెత్తగా సాగిపోవాలనే..
2510. సందేశం సిద్ధించింది..
నివేదించిన ప్రేమను సమ్యోగంగా మార్చి..
2511. కొన్ని రాగాలు శాశ్వతాలే..
పాడకపోయినా హృదయాన్నే అనుసరిస్తూ..
2512. వధించాలనుకున్నా ప్రేమను..
శిశిరమైన విరహం నన్నిడిచిపెట్టేలా లేదని.
2513. ఆనందనాట్యమాడుతోంది మది..
నీ మనసులో మాట రాబట్టిందని..
2514. మరోరూపంతోనూ కనిపిస్తున్నావెందుకో..
నెత్తిమీద గంగమ్మ తొంగి చూస్తుననందుకేమో..
2515. నిన్న కురిస్తేనేమి వెన్నెల..
నేటికీ మనసును రాజేస్తోందిగా..
2516. చరణాల్నే మార్చేసా..
నీ అపశృతిని శృతిలోకి రప్పించాలనే..
2517. పాత్ర నిడివి పెంచేద్దామని యోచిస్తున్నా..
నీ విశ్వరూపానికి నీరాజనాలు సరిపోవని..
2518. గమనం మార్చుకున్నా..
నిరీక్షణా అసహనంలో గమ్యాన్ని మరచినందుకే..
2519. జన్మజన్మలకూ సరిపోని బంధమే మనది..
నిజంలో జీవించి నాటకానికి తెరేసినందుకు..
2520. వలపుజల్లు వరదవుతానంది..
అడ్డుకట్టేసే చీకట్లో మెరుపొకటి మెరిసిందనే..
2521. ఆశ్చర్యం నావంతవుతోంది నేడు..
నీ పిలుపుకే పున్నమవుతుంటే..
2522. నీరెండలెంత నవ్వుకుంటున్నాయో..
నిన్నూ నీ నీడనూ కలిపినందుకేనేమో..
2523. గుప్పిళ్ళు తెరిచేసానందుకే..
నిన్ను నాలో దాచుకున్న రహస్యాన్ని నలుగురికీ పంచాలనే
2524. గతం తీయలేనిదేగా వర్తమానం భవిష్యత్తైనా..
తీయంగా నా మనసును తీర్చినందుకు..
2525. భాద్రపదం మురిసిపోతోంది..
కనీసం నిన్నైనా తేనెజల్లుల్లో తడిపిందని..
2526. పల్లవాలన్నీ కులుకుతున్నాయి..
పువ్వులతో చెలిని పోల్చగా ముకుళించుకున్నాయని..
2527. ఉత్ప్రేరకాలెందుకు నాకిక..
ఉపమానాలే నువ్వయ్యాక..
2528. తడబడుతున్న అక్షరాలు..
ప్రణయ భావాలతో నువ్వు ఉరకలెత్తిస్తుంటే..
2529. నీలోకే వచ్చి చేరుకున్నా..
మనమిద్దరం ఒక్కటని నమ్మినందుకే..
2530. అంబరమేగా ఆనందం..
నీవంత తీయగా శుభోదయాన్ని చిలకరిస్తే..
2531. ఆమడదూరమయ్యింది దిగులు..
మనవైన బంగారుక్షణాలను మాత్రమే ఆహ్వానిస్తున్నానని
2532. వన్నెలద్దడం నేర్చుకుంటున్నా జీవితానికి..
సరికొత్త ఉపమానాలను ప్రయోగిస్తూనే..
2533. దిగులు బయటపెట్టని కలువ..
కోనేట్లో నీరున్నా దాహమేస్తుందంటే లోకం నవ్వుతుందని గ్రహించుకొని
2534. గుప్పెడు దిగులే..
గుండెలో చేరి గునపంలా గుచ్చేస్తూ..
2535. అతడు స్పష్టమే..
ఆమె ప్రేమలో గుడ్డితనానికి ఆసరా ఇచ్చినట్లు నటిస్తూ..
2536. శాశ్వతమయ్యింది దిగులు..
వసంతంలా నువ్వొచ్చి శిశిరానికి నన్నిడిచిపెట్టాక
2537. గుండె కవాటం తెరిచుంచావుందుకో..
మరెవరికైనా రావాలనిపిస్తే రావొచ్చంటూ..
2538. బాలకార్మికుల దిగులెంత దయనీయమో..
ఆదుకొనే మనసుకై ఎదురుచూపుల్లో..
2539. పండువెన్నెలయ్యింది సంతోషం..
దిగులు మేఘాలను అలవోకగా తరిమావనే..
2540. ప్రేమను వెదజల్లావుగా..
దిగులుపడ్డ విరహాన్ని చిరునవ్వుతో జయించేసి..
2541. ఆనందపారవస్యమే కన్నుల్లో..
అభినయాన్ని నువ్వలా రెప్పేయక తిలకిస్తుంటే..
2542. వగలుగా వాన..
రైతన్న దిగులుతో సంబంధం లేదన్నట్లు..
2543. దిగులొచ్చి పోతేనేముందిలే..
పెదవులకు పువ్వుల మెత్తదనాన్ని పరిచయించిందిగా..
2544. గమ్యమెరుగని దిగులు..
మనసుపొరల మర్మరధ్వనుల్లో అస్తవ్యస్తమై తిరుగాడుతూ..
2545. అలవాటయ్యింది దిగులానాడే..
ప్రకృతిని కాంతతో పోల్చి చెప్పినప్పుడే..
2546. దిగులే మిగిలింది..
నాకేమీ కాలేక నన్ను వీడావని..
2547. పరిమళిస్తోంది దిగులు..
మనసులోపలి మల్లెపొరల్లో నిన్ను దాచాననేమో..
2548. దిగులూ పండుగవుతోంది పాపం..
నువ్వు తలపుకొస్తే చాలనుకుంటూ..
2549. కమ్మగానే కమ్ముకుంది దిగులు..
తీయని గుబులును పరిచయించావని..
2550. మనసుకెంత పులకింతో..
వయసు దిగులును తర్జుమా చేసుకుంటూ..
..................................... ********.....................................

ద్విపదాలు : 2451 నుండి 2500 వరకు

..................................... ********.....................................
2451. నిరంతర ఘర్షణ..
అంతమవని వేదనలా..వ్యాధిగ్రస్థమైన శోకంలా..
2452. మయూరాన్ని చూసి నేర్చిందేమో మనసు..
నీలాన్ని చూడగానే మబ్బేసిందని భ్రమిస్తూ..
2453. అందని ఆకాశంలా వాస్తవం..
మనమధ్య దూరాన్ని వెక్కిరిస్తూ..
2454. నిలువరించేసా ఆత్రాన్ని..
నను వరించే నీవు చెంతనున్నావనే..
2455. వానవిల్లు విరుస్తోంది..
మయూరపు రెక్కలకు పోటీగా రంగులీనుతూ...
2456. మౌనరాగం ఓడిపోయింది..
ప్రేమగా నీవు పలకరించిన పిలుపుకి..
2457. ముఖపుస్తక మహాత్మ్యమేలే..
మోడైన మనసుకూ కొత్త చిగురులేసేస్తూ..
2458. మాట వినని మనసు..
వ్యర్ధాన్ని సైతం కళాఖండంగా మార్చే నేర్పు తనకుందంటూ..
2459. పొగడపూలు సిద్ధమయ్యాయి..
నీ వలపుజల్లుకు తామూ వస్తామంటూ..
2460. మౌనానికి లొంగని నువ్వు..
మాటకీ కొత్తర్ధాలు పుట్టిస్తూ..
2461. కుంకుమవన్నెలే చెక్కిళ్ళకు..
అలుకను ఆలింగనం చేసిన చొరవకు..
2462. విచ్చుకున్న చూపు నేడు..
కంట్లో కలత మాయమయ్యిందనే..
2463. ప్రేమలేఖలెన్ని రాసానో నేను..
నిన్ను గెలుచుకోవాలనే తాపత్రయంలో..
2464. ఆసరా కోల్పోతున్న అమ్మానాన్నలు..
చేయూతనిచ్చే చేతులు చేయిచ్చేస్తుంటే..
2465. సన్నజాజులు గమ్మత్తుగా నవ్వుకున్నాయి..
మాధవీలతవై నువు పెనవేస్తుంటే..
2466. రెక్కలొచ్చిన కొన్నిగువ్వలు ..
రేపటిని వెతుక్కొనే దిశగా పయనిస్తూ..
2467.బరువైన వాస్తవాలు కొన్ని..
పశ్చాత్తాపానికి ఆమడదూరంగా నేడు..
2468. నీ రెప్పలచప్పుడులో రాగం వింటున్నా..
నా మనసువీణ వాద్యసహకారం అందించిందనే..
2469. చిలిపినవ్వు చంచలమవుతోంది అప్పుడప్పుడూ..
ఈదురుగాలికి ఆకులు రెపరెపలాడినట్లు..
2470. హృదయం లయలు పోతోంది..
నా నవ్వుకు హారతులిచ్చావని..
2471. నీ మనసు మందారమనేగా..
చెలిమంటూ నే చేరదీసింది..
2472. కల్యాణిని ఆదరిస్తున్నా..
నువ్వు కన్నెత్తి చూడలేదని అలకవుతోందనే..
2473. శ్రీరాగాన్ని ఏనాడో పాడేసా..
శృంగారంపై నువ్వు మనసుపడ్డప్పుడే..
2474. కన్ను కవిత రాస్తోంది..
బాపూబొమ్మకు ధీటుగా నువ్వున్నందుకే..
2475. తోడిరాగాన్ని తోడడుగుతున్నా..
మెప్పించేందుకు నిన్ను ధైర్యాన్ని పంచుతుందనే..
2476. పంచదారబొమ్మనై నే కరిగిపోనా..
తీయగా నన్ను మలుస్తుంటే..
2477. మనసుముంగిట్లో నిలబడిపోయా..
గుమ్మానికి తోరణమంటూ వలపును వర్ణించావనే..
2478. కొన్ని దారులు దుర్గంధభరితమే..
మనసు ముక్కెంత మూసుకున్నా..
2479. వసంతహేల వినబడుతోంది..
మన మౌనపు రహస్యాన్ని అనువదించుకొంటుంటే..
2480. ఎంత గర్వమో నీ మనసుకి..
నీ చుట్టూరా తిప్పుకొని అల్లుకుపోతుంటే..
2481. మనసున విత్తే కలుపుమొక్కలు కొన్ని..
నీరు లేకుండానే వృక్షాలై ఎదిగిపోతూ..
2482. మౌనరాగాలనీ కాజేస్తావు..
నీ మాటలకు మంత్రముగ్ధనై నేనుంటే..
2483. మూగవీణనే నిన్నటివరకూ..
నీవొచ్చి శృతిచేసి రాగాలు దోచేంతవరకూ..
2484. చుక్కలు కోసుకొస్తానంటావెందుకో..
చుక్కనై నేనే నీ పక్కనుండగా..
2485. రెండునాల్కల మనిషనుకుంట..
పరస్పర విరుద్ధభావాలను తానే ప్రకటిస్తూ..
2486. చెలి సిగ్గులకర్ధం అడుగుతావే..
నీ చూపుకు అదుపులేనప్పుడు..
2487. యుగళగీతాన్ని మరచిపోయా..
నీ విషాదంలో నేను కూరుకుపోయి..
2488. ఎప్పటికప్పుడు బ్రద్దలవ్వాలనే అనుకుంటా..
విస్పోటించి గాయంచేయలేక మానుకున్నా..
2489. భాద్రపదానికి బానే న్యాయం చేస్తున్నావుగా..
కన్నుల్లో నన్ను వర్షంగా కురిపించి..
2490. నీ ఊహలవేడితో రగులుతున్నందుకేమో..
నా నిట్టూర్పుల గాడ్పులకే మసకవుతున్న ఇంట్లోని అద్దం..
2491. సగం బలం సంతోషమే ఇస్తోంది..
నీ వియోగంలోని నా నీరసానికి..
2492. తాత్కాలికంగా మానిందేమో మనసు గాయం..
అంతర్నిహితంగా అంతమయే సమస్యే లేనందుకు..
2493. మహామౌనంలో కూరుకుపోతున్నా..
నీ తలపుల తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ..
2494. గుండె చెరువైపోతోంది..
అనుభూతిరాహిత్యానికి ప్రతినిధినిగా నేను మిగిలానని..
2495. గొంతులోని గారం గమకమయ్యింది..
నీవంతా ప్రేమగా పిలిచినందుకే..
2496. నీవిక్కడే ఉన్నావనిపిస్తోంది..
నీ తనూగంధం మనసును తాకిందని..
2497. ప్రేమపూజారిగా మిగిలా నేను..
దేవతవని నిన్ను కొలిచినందుకు..
2498. మనసైన మణివయ్యావు..
స్వాతిముత్యమంటి నిన్ను ఆణిముత్యంగా మార్చుకున్నాక..
2499. నిరీక్షించడం మానేసాననుకే..
నిత్యం నాతోనే తిరుగాడుతావని తెలుసుకున్నందుకే..
2500. చిరునవ్వుతో చెలిమిచేస్తున్నా..
కన్నీటితో మనసుకు జలుబు చేస్తోందనే..
..................................... ********.....................................

ద్విపదాలు : 2401 నుండి 2450 వరకు

..................................... ********.....................................

2401. మనసుకు రంగేస్తున్నావెందుకో..
గుండె ప్రతిగదిలో నేనే ఉన్నానంటూనే..
2402. పువ్వులు పరచి ఉంచేసా..
నాకై నువ్వు నడిచేదారిలో ముళ్ళు అడ్డు రాకూడదని..
2403. ఊపిరి బరువైపోతోంది..
నీ భావంలో చోటు దొరకలేదనేమో..
2404. మనసును మాయచేసావు..
అంతరంగ దాహానికి నీళ్ళిమ్మంటే దీపమెట్టి..
2405. ఏడురంగులతో సరిపెట్టావెందుకో..
నా మనసురంగు మాత్రం విడిచిపెట్టేసి..
2406. నానార్ధాలతో మాట్లాడుతావెందుకో..
సమానార్ధాన్ని స్ఫురించనివ్వక నన్ను తడబెడుతూ...
2407. వెచ్చని నీ అనునయాలకేమో..
పచ్చని భావాలూ ఎర్రనైపోతూ..
2408. సరళీస్వరాలను సాగనంపానందుకే..
మన ప్రేమ సంకీర్తనావళిని మొదలెట్టేందుకే..
2409. చిత్తం చిందులేస్తోంది..
నా అలుకను నువ్వర్ధం చేసుకున్నావనే..
2410. నా చూపుకే కన్నుకుట్టిందెందుకో..
నీ చూపుతో కాల్చేస్తూ..
2411. పరభాషా సొంతమయ్యింది..
యాసతోతప్ప ఆనందానికి ఆటంకం లేదని..
2412. చిన్నారి నడకలతోనే మొదలెట్టమంటున్నా..
అలుపొచ్చేందుకు సమయమింకా రాలేదనే..
2413. కొన్నిరాగాలు రాత్రికి దాచేస్తున్నా.
ప్రేమవర్ణంలో మిళితం చేయాలనే..
2414. నీ భావాలకెన్ని భాష్యాలో..
చదివేకొద్దీ కొత్త అనుభూతినిస్తూ..
2415. అనువదిస్తున్నా అపశృతిని..
నువ్వు పాడేలా అరమరిక చేద్దామని..
2416. అలుకల పల్లకి దిగిపోయా..
బాధ్రపదమొచ్చి పండుగకు పిలిచిందనే..
2417. ఎంతందమో ఆమె అలుక..
మురిపానికి కొత్తర్ధాన్ని పరిచయిస్తూ..
2418. వెన్నెల్లో వరదలా నీవు..
నా ఏకాంతక్షణాలన్నింటినీ కాజేస్తూ..
2419. చూస్తూనే ఉండాలనుందెందుకో..
నువ్వెంత కాదని చూపులతో కసిరినా..
2420. కృష్ణావతారమే ప్రాణమట..
నలుగురిలో రామావతారం రక్తి కట్టిస్తున్నా..
2421. కిటుకులు తెలిసిన వన్నెలాడి..
నిన్ను గెలుచుకునేందుకేగా అలుకను అస్త్రం చేసింది కిలాడి..
2422. నురుగునై నీవెంటున్నానందుకే..
ఊహలసంద్రాన్ని చిలికేందుకు నీకు సహకరించాలనే..
2423. అలిగినందుకెంతో అలసిపోతున్నా..
మూణ్ణాళ్ళ నీ మురిపాలను భరించలేక...
2424. నీ ఊహల్లోకి చేరుకోవాలని ఉంది..
బాల్యం నుండే చెలిమి రుచిచూపేవాడివని..
2425. అమ్మభాషకు పట్టంకట్టేద్దాం..
మనలోనూ తెలుగు ప్రవహిస్తోందని చాటిచెప్దాం..
2426. తలుపు తీసి తలపుల్లోకి పిలిచావెందుకో..
చిగురుటాకులా ఒణుకుతావనే భయం నీకున్నప్పుడు..
2427. ఆఘమేఘమవుతోంది మది..
కలలోంచీ రెప్పల్లోకి జారి నీకు శుభోదయం చెప్పాలని..
2428. అలికినట్లవుతున్న  అక్షరాలు
కన్నులు ఆనందాన్ని వెచ్చగా ప్రకటిస్తున్నందుకే..
2429. మనసు మౌనగీతాలే మెచ్చుతోంది..
సన్నగా పులకరింపులేం నేర్చినందుకో..
2430. కట్నం పోసి నిన్ను కొనుక్కునందుకేమో..
నోములు నోచి మరీ కాపాడుకుంటూ..
2431. నా నవ్వులన్నీ నీకిచ్చేస్తా..
చూపుతోనే నన్ను మైమరపిస్తానంటే..
2432. అక్షరమవ్వని భావాలెన్నో..
గుండెలోనే గుట్టుగా అహరహమూ ఆస్వాదిస్తూ..
2433. నీ మౌనరాగం నేనేగా..
పెదవిప్పకున్నా కన్నులతో పాడేస్తూ..
2434. వధిస్తున్న నీ మౌనం..
నా గాంధారాన్ని వెక్కిరిస్తున్నట్లు..
2435. సమన్వయం కుదరని సమాధానాలు..
ప్రశ్నలు చిక్కుముళ్ళై బిగుసుకుపోతుంటే..
2436. ఉక్కిరిబిక్కిరవుతోంది మది..
నీ నిశ్వాసలోంచీ నన్ను తరిమేసాక..
2437. విరబూసా పరిమళమై..
పువ్వుతో పోల్చావనే..
2438. నిన్ను వశం చేసుకున్నాననుకుంది..
వివశమైందని గుర్తించని వెర్రిమనసు..
2439. చందనాలు పూసినట్లుంది..
నీ చూపులు చల్లగా మేనలదుకుంటే..
2440. ఏకాంత భావాలేమిటో..
నిన్ను సైతం చేరనివ్వని ఊహల్లో..
2441. ఊరేగుతూ మౌనాలు..
నీ సందిగ్ధాన్ని భగ్నం చేసాయని..
2442. ఒంటరి నక్షత్రమై మిగిలిపోయా...
వెలుగు పంచలేని ఆకాశంలో..
2443. కలలకు రంగులొచ్చాయి..
రాతిరి నువ్వొచ్చి సీతాకోకలా తిరుగాడినందుకే..
2444. పంకజనయనను అయ్యానందుకేగా..
కనుకొలుకుల్లో కన్నీటితో నిత్యం దర్శనమిస్తున్నందుకు..
2445. రేపటికి పువ్వునవుతాననుకున్నా..
మొగ్గగానే నన్ను చిదిమేస్తావని తెలియక..
2446. కదనకుతూహలానివనుకున్నా..
తోడిరాగాన్ని వేంటేసుకొచ్చావని తెలియక..
2447. అక్షరముత్యాలు దాచుకున్నా..
ఏనాటికైనా నా భావానికి పనికొస్తాయని..
2448. నిముషాలను లెక్కిస్తున్నా..
నిన్ను చేరే రాదారిని కొలవలేక..
2449.  మరణం ఒక విషాదం..
నిన్ను చేరలేని గమ్యంలో..
2450. కదలనంటోంది కాలం..
నిన్ను దూరం చేసి అలసినందుకేమో...
..................................... ********.....................................

ద్విపదాలు : 2351 నుండి 2400 వరకు

..................................... ********.....................................
2351. నింగికెగిసింది..
ఓటమిని అంగీకరించలేని ఆత్మొకటి..
2352. పట్టుచిక్కిన ఆనందానివే..
కోయిలపల్లవులను నా నోట పలికించేవేళ..
2353. నయ్యం..సీతాకోకనూ నేననలేదు..
వేరే కోకవసరం లేదంటూ..
2354. కుదుటపడిందిలే మనసు..
మనసెరిగి మసలుకొనే నువ్వు నాదైనందుకు..
2355. చిదిమేసిన కలలు కొన్ని..
నీ అభిమానంతో చిగురులేస్తూ..
2356. జీవితమంతా పాఠమే..
చదివే మనసు ఆకళింపు చేసుకోగలిగితే..
2357. మబ్బులడ్డొస్తున్నాయెందుకో..
నాకు సమాధానమివ్వలేని చుక్కల్ని దాచేస్తూ..
2358. ఒడిసిపట్టా నీ జ్ఞాపకాన్ని..
మధురంగా మనసులో మిగుల్చుకోవాలని..
2359. గమ్యమెప్పుడూ గెలుపేగా..
అడుగులు తడబడక ముందుకే సాగుతుంటే..
2360. బోధివృక్షాన్ని గుర్తుపట్టనట్లున్నావ్..
ద్రాక్షపందిరి కింద కూర్చుంటే అంతేమరి..
2361. బొత్తిగా మాట వినని మనసు..
పేర్లన్నీ తారుమారు చేసి పలికేస్తూ..
2362. సర్దుకున్నాలే..
తిరగేసిన పేరుతో పిలిచినా నన్నేనని..
2363. వసంతం చిగురేసేదెన్నడులే..
శిశిరాన్ని తలచుకొని రాత్రులన్నీ పొద్దుపుచ్చుతుంటే..
2364. ముత్యపుచిప్పలే మిగిలేది..
ముత్యాలు విదేశాలకి పయనమై ఎగిరిపోతుంటే..
2365. ఏకాంతపు నవ్యానుభూతులన్నీ నాలోనే..
నీ తలపులనంతమై నన్నావహిస్తుంటే..
2366. అలసిన మానసిక స్పందనలు కొన్ని..
నిన్ను మేల్కొల్పాలని తాము నిద్దురపోతూ..
2367. చిగురిస్తుందిలే ఒంటరితనం..
తుంటరినై నేనొచ్చి నీలో చేరాక..
2368. విషాదాన్ని మింగేసిన శిశిరాన్నే..
వసంతాన్ని మాత్రమే వెదజల్లుతూ..
2369. మనుషులెందుకు నేర్చుతారో వికారాలు..
మనసుకు తెలియని అరమరికలు..
2370. నీ కలలో కరిగే కాలం..
నా రాతిరికి నీవే పరవశం.
2371. విత్తులెక్కువే మనసుకొమ్మకి..
కోటి కోర్కెలనూ నిముషంలో మొలకలెత్తిస్తూ..
2372. చక్కదనం చిక్కిపోయింది..
విరహవేదనకి వశమైనందుకేమో..
2373. అసమాన్యమే నీ కవిత..
ఆలోచననే అల్లికగా మెప్పిస్తూ..
2374. అంతులేని గమ్యమేమో నాది..
నిన్నెతకలేక అలసిన క్షణాలసాక్షి
2375. పుట్టెదు దుఖఃమవుతోంది..
పట్టలేని సంతోషం గుప్పెట్లో ఇమడలేనందుకేమో...
2374. తానో చైతన్యం..
శిలనైన నాలో..
2375. భూభ్రమణమని చలించలేదు..
నా నడకలకి విస్తుబోయానని తలపోస్తూ..
2376. అరవిరిసిన పువ్వైనందుకేమో మోము..
ఇంద్రుడివై తాగేస్తున్నావు మధువునంతా..
2377. వెలిసిపోయింది ప్రేమ..
నీ నోట్లో నానినాని నన్నందుకోలేక...
2378. నిశ్శబ్ద యుద్ధమెందుకో..
అలరించే అనురాగం వలయమై నిన్నల్లగా..
2379. అలదుకోలేని గంధానివే..
ఎంత పూసుకున్నా సుగంధాన్ని పంచక..
2380. పూర్వజన్మ వాసనలు పోనందుకేమో..
ఎప్పుడూ చిరుగులనే ఆరాతీస్తున్నావు..
2381. గిలిగింతల కిలికించితానివే..
కవ్వింతలతో నా మనసు గెలిచేస్తూ..
2382. అందెలతో సవ్వడి చేస్తున్నా..
నీరవంలో నిట్టూర్పులు వినబడినందుకే..
2383. దయలేని ఆనందానివే..
నన్నుడికించి ఇందరిలో అల్లరి పెట్టేస్తూ..
2384. మనసు గాలి పీల్చుకుంది..
పూలతెమ్మెర నీలా వీచిందనే..
2385. నా మనసుకెందుకో అలుకలు నేర్పావు..
నీకు ముచ్చటగా కులుకులు నేర్పితే..
2386. నా నువ్వూ నీ నేనూ..
ఏకమైన మన జీవనరాగంలో శృతిలయలుగా..
2387. దయార్ద్రమైనదే కాలం..
ఒడిదుడుకులను ఓర్చుకొని నిరాడంబరంగా కదిలిపోతూ..
2388. నా అణువణువూ ప్రవహిస్తున్న ఆనందం..
నువ్వు ప్రవచించిన విషాదాన్ని వీడినందుకే..
2389. కొట్టుకుపోతూనే ఉన్న కొన్ని అనుభూతులు..
ఆ హృదయంలో స్థానం దొరకలేదంటూ..
2390. విరిసిన పువ్వుల లాస్యాలే..
అరవొంపుల పెదవుల్లో నెలవంకలుగా..
2391. కులుకును నియంత్రించేసా..
నియంతలా నా అధరాల్ని శాసించావనే..
2392. ఉత్సాహం ఉట్టికెక్కింది..
సల్లాపాన్ని నువ్వెళ్ళి అనంతంలో వెతుక్కుంటుంటే..
2393. కలవంక నయగారాలే..
నీ తలపును ఆవహించే నవ్వులు..
2394. నలుగురిలో నన్ను ఏకాకిని చేసావెందుకో..
ప్రసరిస్తున్న చూపును దాటి ఏకాంతాన్నెతుక్కుంటూ..
2395. అపరాజితను చేసేసావు..
నవ్వులను నీ మధురోహలుగా మార్చుకొని..
2396. వెన్నెల పుప్పొడేదో రాలినట్లుంది..
శ్వాసలో గంధం పొడారినందుకేమో..
2397. అస్తవ్యస్తమైన మానసం..
నీ అన్వేషణ నన్ను చేరనందుకేమో..
2398. పరిహసించానని బంధించావుగా..
అమూల్య రత్నమైన నన్నెవరికీ ఇవ్వనంటూ...
2399. చిత్తరువునై నిలబడిపోయా..
నా చిరునవ్వుకి చిరునామా వెతికే నిన్నేమనాలో తెలియక..
2400. మెరిసి మురిపించాలని ప్రయత్నిస్తున్నా..
బంగారమని పిలుస్తూ నన్నాకట్టుకున్నావుగా..
..................................... ********.....................................