..................................... ********.....................................
2101. నీ స్వార్ధం తెలుస్తోంది..
నన్ను సొంతం చేసుకోవాలనుకోవడంలోనే..
2102. ఎగిసిపడుతున్న మనసు..
ఆకుల గలగలలోనూ విషాదమే వినబడుతుంటే..
2103. మరలిపోతున్న కలలు..
నా కంటినిద్రను నువ్వు కాజేసావని..
2104. మరణాన్ని వేడుకుంటున్నా పిలుపునిమ్మని..
మరుజన్మకైనా మనసు కలవాలని..
2105. ఎర్రనిపెదవులకెన్ని తీపులో..
నీ తలపును నవ్వుకున్న ప్రతిసారీ..
2106. ఎంత ధైర్యమో మనసుకి..
సిగ్గువిడిచి అంతగా నవ్వడానికి.
2107. కష్టాలు అడుగంటాలి..
కన్నీరు కరువైపోయి..
2108. మూణ్ణాళ్ళ దాకే పెళ్ళిముచ్చట..
మూడేళ్ళకే మంగళం పాడేస్తూ...
2109. చెలివని మన్నిస్తున్నా..
తారకనంటూ జాబిల్లి పక్కన చేర్చావని..
2110. స్వసాంత్వనాన్ని ఆస్వాదిస్తున్నా..
నీ ఊహల నిత్యజలకాలలో తేలియాడుతూనే..
2111. మబ్బుపట్టిన ఆకాశమే కనిపిస్తోంది..
మేఘావేశాన్ని చీకటిచేసి చూపాలనేమో..
2112. అంతమవని నిరీక్షణలో నేను..
నీవొచ్చే క్షణానికై వేచిచూస్తూ..
2113. కునుకొచ్చింది కన్నులకు..
నీ నిరీక్షణలో క్షణాలకు అలుపొచ్చి..
2114. నీ అల్లరి సమ్మతమే..
పిల్లగాలై నన్నల్లుకొనే మధురాలలో..
2115. చరణదాసేగా ఆమె..
వరలక్ష్మిగా శ్రావణమాసానికి మాత్రమే పరిమితమవుతూ..
2116. రాయక తప్పలేదు రక్తచరిత్రను..
వైవిధ్యరచయిత్రిగా ఘనత సాధించాలంటే..
2117. ఎన్ని కుబుసాలు విడవాలో..
అంతఃసౌందర్యంతో నలుగురిని మెప్పించాలంటే..
2118. సంస్కారం ఒక్కటి సరిపోతుందేమో..
మనిషిని మనిషిగా గౌరవించేందుకు..
2119. అటకెక్కుతున్న బంధాలు..
అడుగంటిన ఆత్మీయతల్లో..
2120. ఆడంబరజీవితానికి అంతిమసమయం..
వేదనాభారం త్యజించే కోరిక సమీపించడమే..
2121. నిత్యజ్ఞాపక ప్రవాహాలే..
మనసుకు కుదురునేర్పక ఉరకలు పెట్టిస్తూ..
2122. సద్దులేని సంగీతంలోని నువ్వులా..
మౌనవించిన మనసుతో నేనులా..
2123. మౌనం మంచిదే..
వాస్తవాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నంలో..
2124. దిగంతాలకు అనంతంగా వ్యాపించగలిగేదే నిజమైన ప్రేమ..
కెరటాలఘోషలో ఆసాంతం సమాధికావల్సిన నిశ్శబ్దమే ద్వేషం..
2125. ఆనందం వ్యాపించింది..
నీ గీతంలో నన్ను ధ్వనించినందుకు
2126. మనసైనా ఆ దారమే..
అహరహమూ ఆధారపడాలని కోరుకుంటూ
2127. తెలుగును కాపాడుకుందాం..
భాషానుభూతిని ఏకమై కలసి పంచుకుందాం...
2128. అక్షరప్రేమ అపారమవుతోంది..
అలుపెరుగని జీవనపోరాటంలో హృదయం స్పందిస్తుంటే..
2129. కషాయమైతేనేమి కాఫీ..
ఈనాటి మాలికకు ప్రేరణ ఇచ్చిందిగా..
2130. ఎంత వెలుతురో నీలో..
కిరణమై నన్ను దరిచేరుతూ..
2131. తొలకరినేగా నీ వేసవికి..
వెన్నెల్లో అమృతాలు కురిపిస్తూ..
2132. నిర్వేదమై మిగిలున్నా..
నన్నెప్పటికీ చదవలేని నీ నిస్సహాయతలో..
2133. విచిత్రమే నేడు..
మగవాడికి రక్షణ కరువైన రాఖీపర్వదినం..
2134. అదృష్టమదే ఆ అధరాలకు..
అంతరాత్మఘోషను అణచుకొనే సమయాన..
2135. మౌనశ్రోతగా నిలుచున్నా..
కీచురాళ్ళ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావని తిలకించి..
2136. లక్ష్ముల ఆగమనం..
ఒక మధురకావ్యానికి ప్రేరణా సంకేతం
2137. చందురుని చేపట్టిన అరచేతిలో..
అకాల సూర్యునివై ఉదయించావెందుకో..
2138. మనసున ఆనంద దోలికలు..
మనసైన ప్రియతముని ఏలికలో..
2139. వెన్నెల కళనద్దుకున్నా..
చెలిమికి చిరునామాగా నిన్ను చేరేందుకే..
2140. ఆలింగనమొక్కటీ చాలనుకున్నా..
నీ అలౌకికస్పర్శను మనసారా అనుభవించేందుకు
2141. విరహం మాత్రమే తెలిసిన మనసు..
వీడిపోవాలని అనుకున్నది ఎన్నడూ లేదులే
2142. నా మనసుకి సరసమే..
కనుచూపుల అద్దంలోనే నిలుపుకున్నందుకు..
2143. విరహిణులను కాల్చిన మచ్చలేగా అవన్నీ..
ఎన్నో గాయపడిన హృదయాలకు ఆనవాళ్ళు
2144. మనసున్న రాజువే..
ఆయుధాలు పట్టకనే అంతఃశత్రువులను జయిస్తూ..
2145. వేసవివానల పులకరింతలు..
ప్రేమరాగం పల్లవించినందుకే..
2146. సంకుచితాన్ని విడిచేస్తే సరి..
ప్రేమే దీపమై దారిచూపుతుంది..
2147. జాబిల్లిని వేడుకున్నా..
నక్షత్రమాలతోనైనా ఆకాశాన వెలుగులు నింపమని..
2148. నీ మనసు నాదయ్యిందిగా..
నన్ను నీలో చేర్చుకోమంటూ..
2149. ప్రబంధం తయారవుతోంది..
మన అనుబంధం రాయాలని కూర్చుంటే..
2150. ఎన్నికోట్ల పరవశాలో..
నిన్ను తలచినంతనే నన్ను కౌగిలిస్తూ..
..................................... ********.....................................
2101. నీ స్వార్ధం తెలుస్తోంది..
నన్ను సొంతం చేసుకోవాలనుకోవడంలోనే..
2102. ఎగిసిపడుతున్న మనసు..
ఆకుల గలగలలోనూ విషాదమే వినబడుతుంటే..
2103. మరలిపోతున్న కలలు..
నా కంటినిద్రను నువ్వు కాజేసావని..
2104. మరణాన్ని వేడుకుంటున్నా పిలుపునిమ్మని..
మరుజన్మకైనా మనసు కలవాలని..
2105. ఎర్రనిపెదవులకెన్ని తీపులో..
నీ తలపును నవ్వుకున్న ప్రతిసారీ..
2106. ఎంత ధైర్యమో మనసుకి..
సిగ్గువిడిచి అంతగా నవ్వడానికి.
2107. కష్టాలు అడుగంటాలి..
కన్నీరు కరువైపోయి..
2108. మూణ్ణాళ్ళ దాకే పెళ్ళిముచ్చట..
మూడేళ్ళకే మంగళం పాడేస్తూ...
2109. చెలివని మన్నిస్తున్నా..
తారకనంటూ జాబిల్లి పక్కన చేర్చావని..
2110. స్వసాంత్వనాన్ని ఆస్వాదిస్తున్నా..
నీ ఊహల నిత్యజలకాలలో తేలియాడుతూనే..
2111. మబ్బుపట్టిన ఆకాశమే కనిపిస్తోంది..
మేఘావేశాన్ని చీకటిచేసి చూపాలనేమో..
2112. అంతమవని నిరీక్షణలో నేను..
నీవొచ్చే క్షణానికై వేచిచూస్తూ..
2113. కునుకొచ్చింది కన్నులకు..
నీ నిరీక్షణలో క్షణాలకు అలుపొచ్చి..
2114. నీ అల్లరి సమ్మతమే..
పిల్లగాలై నన్నల్లుకొనే మధురాలలో..
2115. చరణదాసేగా ఆమె..
వరలక్ష్మిగా శ్రావణమాసానికి మాత్రమే పరిమితమవుతూ..
2116. రాయక తప్పలేదు రక్తచరిత్రను..
వైవిధ్యరచయిత్రిగా ఘనత సాధించాలంటే..
2117. ఎన్ని కుబుసాలు విడవాలో..
అంతఃసౌందర్యంతో నలుగురిని మెప్పించాలంటే..
2118. సంస్కారం ఒక్కటి సరిపోతుందేమో..
మనిషిని మనిషిగా గౌరవించేందుకు..
2119. అటకెక్కుతున్న బంధాలు..
అడుగంటిన ఆత్మీయతల్లో..
2120. ఆడంబరజీవితానికి అంతిమసమయం..
వేదనాభారం త్యజించే కోరిక సమీపించడమే..
2121. నిత్యజ్ఞాపక ప్రవాహాలే..
మనసుకు కుదురునేర్పక ఉరకలు పెట్టిస్తూ..
2122. సద్దులేని సంగీతంలోని నువ్వులా..
మౌనవించిన మనసుతో నేనులా..
2123. మౌనం మంచిదే..
వాస్తవాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నంలో..
2124. దిగంతాలకు అనంతంగా వ్యాపించగలిగేదే నిజమైన ప్రేమ..
కెరటాలఘోషలో ఆసాంతం సమాధికావల్సిన నిశ్శబ్దమే ద్వేషం..
2125. ఆనందం వ్యాపించింది..
నీ గీతంలో నన్ను ధ్వనించినందుకు
2126. మనసైనా ఆ దారమే..
అహరహమూ ఆధారపడాలని కోరుకుంటూ
2127. తెలుగును కాపాడుకుందాం..
భాషానుభూతిని ఏకమై కలసి పంచుకుందాం...
2128. అక్షరప్రేమ అపారమవుతోంది..
అలుపెరుగని జీవనపోరాటంలో హృదయం స్పందిస్తుంటే..
2129. కషాయమైతేనేమి కాఫీ..
ఈనాటి మాలికకు ప్రేరణ ఇచ్చిందిగా..
2130. ఎంత వెలుతురో నీలో..
కిరణమై నన్ను దరిచేరుతూ..
2131. తొలకరినేగా నీ వేసవికి..
వెన్నెల్లో అమృతాలు కురిపిస్తూ..
2132. నిర్వేదమై మిగిలున్నా..
నన్నెప్పటికీ చదవలేని నీ నిస్సహాయతలో..
2133. విచిత్రమే నేడు..
మగవాడికి రక్షణ కరువైన రాఖీపర్వదినం..
2134. అదృష్టమదే ఆ అధరాలకు..
అంతరాత్మఘోషను అణచుకొనే సమయాన..
2135. మౌనశ్రోతగా నిలుచున్నా..
కీచురాళ్ళ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావని తిలకించి..
2136. లక్ష్ముల ఆగమనం..
ఒక మధురకావ్యానికి ప్రేరణా సంకేతం
2137. చందురుని చేపట్టిన అరచేతిలో..
అకాల సూర్యునివై ఉదయించావెందుకో..
2138. మనసున ఆనంద దోలికలు..
మనసైన ప్రియతముని ఏలికలో..
2139. వెన్నెల కళనద్దుకున్నా..
చెలిమికి చిరునామాగా నిన్ను చేరేందుకే..
2140. ఆలింగనమొక్కటీ చాలనుకున్నా..
నీ అలౌకికస్పర్శను మనసారా అనుభవించేందుకు
2141. విరహం మాత్రమే తెలిసిన మనసు..
వీడిపోవాలని అనుకున్నది ఎన్నడూ లేదులే
2142. నా మనసుకి సరసమే..
కనుచూపుల అద్దంలోనే నిలుపుకున్నందుకు..
2143. విరహిణులను కాల్చిన మచ్చలేగా అవన్నీ..
ఎన్నో గాయపడిన హృదయాలకు ఆనవాళ్ళు
2144. మనసున్న రాజువే..
ఆయుధాలు పట్టకనే అంతఃశత్రువులను జయిస్తూ..
2145. వేసవివానల పులకరింతలు..
ప్రేమరాగం పల్లవించినందుకే..
2146. సంకుచితాన్ని విడిచేస్తే సరి..
ప్రేమే దీపమై దారిచూపుతుంది..
2147. జాబిల్లిని వేడుకున్నా..
నక్షత్రమాలతోనైనా ఆకాశాన వెలుగులు నింపమని..
2148. నీ మనసు నాదయ్యిందిగా..
నన్ను నీలో చేర్చుకోమంటూ..
2149. ప్రబంధం తయారవుతోంది..
మన అనుబంధం రాయాలని కూర్చుంటే..
2150. ఎన్నికోట్ల పరవశాలో..
నిన్ను తలచినంతనే నన్ను కౌగిలిస్తూ..
..................................... ********.....................................
No comments:
Post a Comment